
నేటితో మెగాస్టార్ చిరంజీవి-శ్రీదేవి నటించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ మూవీ 30ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమాలోని కొన్ని ఆసక్తికర విశేషాలను వివరించారు. ముఖ్యంగా హీరోయిన్ శ్రీదేవిపై చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఈ మూవీలో ఇంద్రజ పాత్ర శ్రీదేవీ కోసమే పుట్టిందా? అనిపిస్తుందని తెలిపారు. శ్రీదేవి లేకపోతే ఈ సినిమా లేదని ఆయన స్పష్టం చేశారు.
కరోనా కేసులు తక్కువగా చూపిస్తున్న జగన్ ప్రభుత్వం: పవన్ కల్యాణ్
అతిలోక సుందరి పాత్రలో దేవకన్యగా శ్రీదేవిని తప్ప మరెవరినీ ఊహించుకోలేమని ఆయన అన్నారు. ఈ మూవీలో తొలిసారిగా శ్రీదేవితో పోటీపడి నటించినట్లు మెగాస్టార్ చెప్పారు. శ్రీదేవి తన అందచందాలు, హొయలతో, చిలక పలుకులు, అమాయకపు చూపులతో పాత్రలో లీనమై అత్యద్భుతంగా చేసిందని కితాబిచ్చారు. ఇప్పటికీ మనం అతిలోక సుందరిగా శ్రీదేవిని తలుచుకుంటున్నామంటే ఆమె ప్రభావం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఆమెతో పనిచేయడం తనకు ఒక అద్భుతమైన అవకాశం.. మంచి అనుభూతినిచ్చిందని తెలిపారు.
సీజ్ చేసిన వాహనాలు తెచ్చిన ఆదాయం ఎంతో తెలుసా?
అదేవిధంగా పాటల చిత్రీకరణలో శ్రీదేవితో చేసేటప్పుడు తాను ఏమాత్రం కొంచెం అజాగ్రత్తగా ఉన్నా తాను కనిపించే పరిస్థితి ఉండేది కాదని తెలిపారు. శ్రీదేవి తన అందాలు, హొయలు, లుక్స్ అభిమానులను అంతలా ఆకట్టుకునేలా ఉంటాయని తెలిపారు. శ్రీదేవితో చేయడానికి తొలిసారి కొంచెం శ్రమ పడాల్సి వచ్చిందన్నారు. శ్రీదేవితో కలిసి పని చేయడం తనకు ఎప్పటికీ స్వీట్ మెమొరీని మిగిల్చిందని మెగాస్టార్ తెలిపారు. వైజయంతీ మూవీస్ బ్యానర్లో నిర్మాత అశ్వినీదత్ భారీతానానికి ఏమాత్రం వెనుకడాకుండా ఖర్చుపెట్టారని తెలిపారు. దర్శకుడు రాఘవేంద్రరావు ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ మూవీని అత్యద్భుతంగా తెరకెక్కించారని కొనియాడుతూ పాతజ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.