Home Blog Page 8480

తెలంగాణకు ఐసిఎంఆర్ గైడ్ లైన్స్ ప్రత్యేకమా!

TRS


కరోనాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం భారత వైద్య మండలి (ఐసిఎంఆర్) నిబంధనలనే అమలు పరుస్తున్నామని ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ తరచూ చెబుతుంటారు. అయితే తెలంగాణకు ప్రత్యేకంగా ఐసిఎంఆర్ నిబంధనలను రూపొందించిందా అంటూ ప్రశ్నలు తెలెత్తుతున్నాయి.

తెలంగాణలో జరుపుతున్న కరోనా టెస్ట్ ల నుండి, కరోనా సంబంధిత మరణాల వరకు కేసీఆర్ ప్రభుత్వం అన్ని అంశాలను చాలా గోప్యంగా ఉంచడమే అందుకు ప్రధాన కారణం. దాదాపు అన్ని రాష్ట్రాలూ ప్రతి రోజు బులెటిన్లలో టెస్టుల సంఖ్య, జిల్లాల్లో కేసులు, మరణాలను ప్రకటిస్తున్నాయి.

కొన్ని రాష్ట్రాలైతే కరోనా బాధితులకు వైరస్ ఎట్లా సోకిందో కూడా చెబుతున్నాయి. తెలంగాణలో మాత్రం కేవలం కేసులు, మరణాలు, డిశ్చార్జి వివరాలను మాత్రమే వెల్లడిస్తున్నారు. ఏయే జిల్లా లో ఎన్ని కేసులన్న విషయాన్నీ స్పష్టం గా చెప్పట్లేదు.

మరణాల సంఖ్యను మారుస్తున్నారే తప్ప, వాళ్లు ఎప్పుడు చనిపోయిందీ చెప్పట్లేదు. కొన్ని మరణాలను అసలు బయటకు వెల్లడించట్లేదు. దీంతో ప్రభుత్వ తీరుపై ప్రజల్లో ఎన్నెన్నో అనుమానాలు వస్తున్నాయి.

ఎప్పటి నుంచో కేన్సర్, కిడ్నీ, గుండె జబ్బుల వంటి వాటితో బాధపడుతూ కరోనాతో చనిపోయిన వాళ్లను కరోనా లెక్కలోకి తీసుకోవద్దని ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ఇచ్చిందంటూ ఇటీవల ఈటల రాజేందర్ ప్రకటించారు. అయితే
అలాంటి గైడ్ లైన్స్ ఏవీ ఇవ్వలేదని హైదరాబాద్ లోని ఐసీఎంఆర్ అనుబంధ సంస్థ నేషనల్ ఇనిస్టిట్యూ ట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ ఐఎన్ ) స్పష్టం చేస్తున్నది..

ఆదివారం నాటి కి 53 మంది చనిపోయారని ఆరోగ్య శాఖ చెబుతున్నా.. 90కి పైగా శవాలకు తామే దహన సంస్కారాలు చేశామని, అందులో కరోనా కేసులతో పాటు అనుమానిత కేసులు ఉన్నాయని జీహెచ్ ఎంసీ అధికారులు చెబుతున్నారు.

దేశమంతటా ఇప్పటిదాకా 29 లక్షలు టెస్టులు చేయగా, తెలంగాణ లో మాత్రం 29 వేలు కూడా దాటలేదు. కరోనా లక్షణాలుం టే తప్ప టెస్టులు చేయబోమన్న ప్రభుత్వం ప్రైమరీ కాంటాక్ట్లకూ టెస్టులను బంద్ పెట్టింది. అయితే, ప్రజల నుంచి ఒత్తిడి పెరగడం, ప్రతిపక్షాల విమర్శలు, టెస్టులను పెంచాలన్న కేంద్రం సూచనలతో ఇప్పుడు ప్రైమరీ కాంటాక్ట్లకూ టెస్టులు చేస్తోంది. కానీ రోజూ ఎన్ని టెస్టులు చేస్తున్నారన్న విషయాన్ని మాత్రం చెప్పట్లేదు.

ప్రైవేట్ ల్యాబుల్లో టెస్టులకు ప్రభుత్వం ఇప్పటి వరకు అనుమతివ్వలేదు. కానీ, కొన్ని ల్యాబుల్లో దొంగచాటుగా వేల సంఖ్యలో టెస్టులు చేశారు. ఈవిషయం తెలిసినా ప్రభుత్వం పట్టిండ్చుకోవడం లేదు. అక్కడ తేలిన కరోనా పాజిటివ్ కేసులు ప్రభుత్వ లెక్కలలో కలపడం లేదు.

ఎల్.జి పాలిమర్స్ సీజ్..!


ఎల్.జి పాలిమర్స్ విషయంలో హైకోర్టు సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఎల్.జి దుర్ఘటనపై కొన్ని పిటీషన్లు దాఖలు అవగా, హైకోర్టు సుమోటోగా కేసు విచారణ చేపట్టిన విషయం విదితమే. ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు విడుదల చేసింది. పరిశ్రమ ప్రాంగణాన్ని సీజ్ చేయాలని ఈ ఉత్తర్వులలో హైకోర్టు ఆదేశించింది. సంస్థ డైరెక్టర్లు సహా ఎవరు పరిశ్రమ ఆవరణలోకి వెల్లడానికి అనుమతిలేదని స్పష్టం చేసింది. విచారణ కమిటీలు మాత్రమే పరిశ్రమ ప్రాంగణంలోకి వెళ్లవచ్చని, వారి వివరాలు గేటు వద్ద ఉండే రిజిస్టర్ లో నమోదు చేయాలని సూచించింది. కోర్టు అనుమతి లేకుండా పరిశ్రమ డైరెక్టర్లు ఎవరూ దేశం విడిచి వెళ్లకూడదని, వారి పాస్ ఫోర్ట్ లు విడుదల చేయవద్దని పోలీసులను ఆదేశించింది. సంస్థ స్థిర, చర ఆస్తులను తరలించడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. లాక్ డౌన్ అనంతరం పరిశ్రమ పునఃప్రారంభించడానికి అనుమతులు తీసుకున్నారా అనే విషయం, తీసుకోకపోతే ప్రభుత్వం చేపట్టిన చర్యలపై నివేదిక ఇవ్వాలని కోరింది. లాక్ డౌన్ సమయంలో ట్యాకుల నిర్వహణ ఎందుకు చేపట్టలేదు, ప్రమాదం సమయంలో అలారం ఎందుకు మోగలేదు అనే విషయాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 26వ తేదీలోగా పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వలని అదేశించింది. 13 వేల టన్నుల స్టైరీన్ ను దక్షిణ కొరియా తరలించడానికి బాధ్యులెవరని కోర్టు ప్రశ్నించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, సంస్థ యాజమాన్యానికి మరికొన్ని ప్రశ్నలను ఉత్తర్వులలో హైకోర్టు సంధించింది. ఈ కేసు తదుపరి విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేసింది.

.

చిరంజీవి సినిమాలో లేడి అమితాబ్?


ఒకప్పటి హిట్ ఫెయిర్ మళ్లీ తెరపై కనువిందు చేయనుంది. చిరు-153 మూవీలో లేడి అమితాబ్ విజయశాంతి నటించనుందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్లలో దాదాపు 20చిత్రాలు వచ్చాయి. వీటిలో దాదాపు అన్ని సినిమాలు అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచాయి. ఆ తర్వాత విజయశాంతి రాజకీయాల్లో బీజీగా మారడంతో సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే ఇటీవలే విజయశాంతి సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చారు. ‘సరిలేరునికెవ్వరు’ మూవీలో భారతి క్యారక్టర్లో నటించి మెప్పింది. విజయశాంతి రాజకీయాల్లో బీజీగా ఉన్నప్పటికీ వంశీ పైడిపల్లి చెప్పిన కథనచ్చడంతో మహేష్ బాబు చిత్రంలో విజయశాంతి నటించింది. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ మూవీ ఘనవిజయం సాధించింది.

ఇక సరిలేరునికెవ్వరు’ మూవీ ప్రీ రీలీజు వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి-విజయశాంతి మధ్య నెలకొన్న పాతగొడవలు దూరమై మళ్లీ పాత స్నేహం చిగురించింది. ప్రీ రీలీజు వేడుకకు వీరిద్దరే హైలెట్ గా నిలిచారు. నాటి నుంచి చిరంజీవి-విజయశాంతి కాంబినేషన్లో ఓ మూవీ వస్తుందని ప్రచారం జరిగింది. చిరంజీవి కూడా బాస్ ఈజ్ బ్యాక్ అంటూ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే. ‘ఖైదీ-150’తో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్టిచ్చి తనలో సత్తా తగ్గలేదని చాటారు. అలాగే చిరంజీవి డ్రిమ్ ప్రాజెక్టు ‘సైరా’ 151వ మూవీగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఉయ్యాల నర్సింహారెడ్డి పాత్రలో చిరంజీవి అద్భుతంగా నటించి మెప్పించారు. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి-152 మూవీ ‘ఆచార్య’గా తెరకెక్కుతోంది. ఇక చిరు-153లో విజయశాంతి నటించనుందని ఫిల్మ్ నగర్లో టాక్ విన్పిస్తుంది.

మలయాళంలో సూపర్ హిట్టు సాధించిన ‘లూసీఫర్’ చిత్రాన్ని తెలుగులో చిరు-153 మూవీగా తెరకెక్కనుంది. ‘సాహో’ దర్శకుడు సుజిత్ ఈ మూవీని తెరకెక్కించనున్నాడు. ఈ మూవీని తెలుగు నెటివీటికి అనుగుణంగా కొన్ని మార్పులు చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో ఓ పవర్ ఫుల్ రోల్లో విజయశాంతి కన్పించనుందని ప్రచారం జరుగుతోంది. మలయాళ ఒరిజినల్ వర్షన్లో మంజువారియల్ పాత్ర ఎంతో కీలకమైనది. ఈ పాత్రలోనే విజయశాంతి నటించనుందని ఫిల్మ్ నగర్లో టాక్ విన్పిస్తుంది. అయితే దీనిపై చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే ఒకప్పటి సూపర్ హిట్ పేర్ మరోసారి తెరపై కన్పిస్తుందని తెలియడంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

ప్రభుత్వంపై కన్నా ఫైర్..!


ప్రజల మనోభావాలకు విరుద్ధంగా దేవాలయాల ఆస్తులను అమ్మితే చూస్తూ ఊరుకోనేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ చెప్పారు. టిటిడి భూములు అమ్మాలని పాలక వర్గం తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాల ఆస్తుల జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి 29న పాలక మండలి తీర్మానం ఆమోదిస్తే ప్రోసిడింగ్స్ ఇచ్చేవరకు దాన్ని గోప్యంగా ఎందుకు ఉంచారని ప్రశ్నించారు. నిరర్ధక ఆస్తుల పేరిట దేవాలయాల ఆస్తులను తెగనమ్మడం కుదరదని, సింహాచలం దేవస్థానం భూములను పలుచోట్ల కబ్జాకు కారణమయ్యాయని ప్రభుత్వం దేవాలయాల ఆస్తులు కాపాడాలని కోరారు. మరోవైపు భూములు అమ్మడం లేదని అనవసరంగా బిజెపి రాద్దాంతం చేస్తుందని దేవాదాయ శాఖ మంత్రి చెబుతున్నారని తెలిపారు. దేవాదాయ భూముల అమ్మకానికి వ్యతిరేకంగా పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తామని, దేవాదాయ భూముల అమ్మకం పై న్యాయపోరాటం కొనసాగిస్తామన్నారు.

జగన్ గత ప్రభుత్వం చేసిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను నిలదీశారని, గత ప్రభుత్వ తప్పులపై విచారణ చేపట్టి బాద్యులైన వారిని జైలుకు పంపుతానని నమ్మించి మోసం చేశాడన్నారు. జగన్ నేను ఉన్నాను, నేను విన్నాను అంటూ అధికారంలోకి వచ్చారని ఇప్పుడు నేను ఉన్నాను అనే మాట పక్కన పెట్టి నేనే అంతా అనే వరకూ వెళ్లారని విమర్శించారు. దేవాలయాల విషయంలో బిజెపి 9 నెలలుగా పోరాటాలు చేస్తుందని చెప్పారు.

భక్తులు తమ ఆస్తులు దేవుడు పేరుతో ఉండాలనే కోరికతో ఇచ్చారని చెప్పారు. కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని పేరు పెట్టినట్టు భూములకు నిరార్దక భూములని పేరు పెట్టారన్నారు. ఒక్క గజం దేవుని భూమి అమ్మినా వీధి పోరాటాలు చేస్తామని అన్నారు. సింహాచలం భూములను సందట్లో సడేమియా అంటూ కబ్జా చేశారని విమర్శించారు. జాయింట్ కలెక్టర్ కు ఎండోమెంట్ అధికారాలు అప్పజెప్పడం దేవుని భూములకు రక్షణ ఉండదనే భావన ఉందని తెలిపారు. యదేశ్చగా దేవాదాయ భూములు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఉన్న దేవాదాయ భూముల అన్యాక్రాంతం పై బిజెపి పోరాటం చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకునేంత వరకు పోరాటం చేస్తాం. ప్రభుత్వ తీరు చూస్తుంటే భవిష్యత్తులో దేవాలయాల భూములకు రక్షణ ఉండదనే అనుమానం కలుగుతుందని చెప్పారు.

పోలీసుల్లో కలకలం రేపుతున్న సుధాకర్ కేసు..!


ఒక సాధారణ కేసులో పోలీసుల అత్యుత్సాహం సీబీఐ విచారణ వరకూ తీసుకువెళ్లింది. ఈ కేసు ప్రభావం ఇంతలా ఉంటుందని పోలీసులు ఊహించలేదు. డాక్టర్‌ సుధాకర్‌ కేసు పోలీసు వర్గాల్లో కలకలం బయలుదేరింది. ఎన్-95 మాస్క్ లు ఇవ్వడంలేదంటూ ప్రభుత్వంపై ఆరోపణలు చేసి సస్పెండైన డాక్టర్‌ సుధాకర్‌ను పోలీసులు ఈనెల 16న పోర్టు ఆస్పత్రి సమీపంలో చేతులు వెనక్కి విరిచి కట్టి, అర్ధనగ్నంగా ఉంచి, లాఠీలతో కొట్టి అరెస్టు చేయడం వివాదాస్పదమైంది. ఈ వ్యవహారంలో బాధితుడి వాంగ్మూలానికి, ప్రభుత్వం ఇచ్చిన నివేదిక వ్యత్యాసం ఉండటంతో సుధాకర్ అరెస్టు విషయాన్ని విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని హైకోర్టు సిబిఐని ఆదేశించింది. దీంతో పోలీసుల్లో కలవరపాటు మొదలయ్యింది. ఈ కేసు విషయంలో హైకోర్టు చాలా సీరియస్ గా వ్యవహరిస్తుండటంతో ఎవరికి మెడకు చుట్టుకుంటుందోనని ఆందోళన చెందుతున్నారు. డాక్టర్ సుధాకర్ ను లాఠీ తో కొట్టిన కానిస్టేబుల్ ఒకరిని విశాఖ కమిషనర్ సస్పెండ్ చేసిన విషయం విదితమే. ఈ అంశంపై విశాఖ పోలీసులపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ వ్యవహారం నగర పోలీసు వర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నది.

సీబీఐ అధికారులు విశాఖ పోలీసులపై కేసు నమోదు చేస్తే ఎవరెవరిని నిందితులుగా చేర్చుతారనే దానిపై చర్చ మొదలైంది. డాక్టర్ సుధాకర్ పోలీసులు కావాలనే తనను రెచ్చగొట్టారని, పోలీసులు తనను బలంగా పట్టుకొని అనంతరం తన వాహనంలో ఉన్న డబ్బులు తీసుకుని, మందు బాటిల్స్ పెట్టారని వాగ్మూలంలో తెలిపాడు. చేతులు వెనక్కి మెలితిప్పి కట్టేసి రెండు గంటలు రోడ్డుపై ఉంచారని చెప్పారు. దీంతో సంఘటనకు సంబంధించి సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అయిన వీడియోలను పరిశీలిస్తున్నారు. వీటిల్లో తమ తప్పిదాలు ఏమైనా ఉన్నాయా అనే దానిపై దృష్టి పెట్టారు. అదేవిధంగా హైకోర్టుకు పిటిషనర్‌ ఎలాంటి వీడియోలు సమర్పించారో కూడా ఆరా తీస్తున్నారు. ఇదిలావుండగా సీబీఐకి కేసు అప్పగించిన నేపథ్యంలో పోలీస్‌ ఉన్నతాధికారులు ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించడం ప్రారంభించారు. కొంతమంది సిబ్బందిని పిటిషనర్‌ అనిత ఇంటికి పంపించి, వాటికి సంబంధించిన వివరాలు ఆరా తీస్తున్నారు.

ఈ వ్యవహారంలో చర్యలు ఎవరిపైన ఉంటాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సంఘటనా స్థలంలో వున్న సిబ్బందిపైనా, లేదా స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓపైనా లేదంటే సీన్‌కు వెళ్లకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బంది, అధికారులు అంద్దరిపైనా అనేది హైకోర్టు తేల్చాల్సి ఉంది. సమాచారం అందిన వెంటనే అధికారులు ఎవరూ లేకుండా అక్కడకు వెళ్లడమే తాము చేసిన తప్పని సిబ్బంది ఇప్పుడు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. శాఖాపరమైన విచారణ అయితే సులువుగా బయట పడేందుకు వీలుంటుందని, సీబీఐ కేసులో ఇరుక్కుంటే దానిని క్లియర్‌ చేసుకునేందుకు ఇబ్బందులు తప్పవని ఆందోళన చెందుతున్నారు.

సోనియా సమావేశానికి చంద్రబాబు ఎందుకు హాజరు కాలేదు?

chandra babu


టీడీపీ అధినేత చంద్రబాబుకు తత్వం బోధపడింది. అందుకే సార్వత్రిక ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ ను నెత్తిన పెట్టుకొని మోడీని తిట్టిపోసిన ఆయన ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. తన అనుంగ మీడియా అధిపతులు.. ఇతర నేతల మాటలు విని మోడీని దూరం పెట్టినందుకు ఇప్పుడు బాబు కుమిలిపోతున్నాడు. అందుకే కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చినా వెళ్లకుండా చంద్రబాబు దూరంగా జరగడం.. బీజేపీతో చెలిమిని మళ్లీ కంటిన్యూ చేయడానికేనని తెలుస్తోంది.

*సోనియా మీటింగ్ కు బాబు గైర్హాజరు
దేశంలోని 22 జాతీయ, ప్రాంతీయ పార్టీల నాయకులతో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. భారతదేశ ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి మోడీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ దేశంలోని ప్రతిపక్షాలు, అఖిలపక్షం నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు హాజరు అవుతారని అందరూ ఊహించారు. కానీ బాబు హాజరు కాలేదు. బీజేపీతోనే ఉంటానని.. కాంగ్రెస్ దోస్తీ వద్దంటూ సోనియా సమావేశానికి గైర్హాజరవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

*బాబు ఎందుకు దూరంగా జరిగారు?
గడిచిన ఏడాది మే 19న సార్వత్రిక ఎన్నికల చివరి రోజున, చంద్రబాబు ఏకంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి రాహుల్ ను ప్రధానిని చేద్దాం అని ప్రతిపాదించారు. ఫలితాల అనంతర సందర్భంలో అన్ని ప్రతిపక్ష పార్టీల సమావేశం నిర్వహించాలని ఆమెతో చర్చించారు. కానీ అది జరగలేదు. ఎందుకంటే మోడీకి క్లియర్ కట్ మెజార్టీ వచ్చి తిరిగి అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు అవమానకరమైన ఓటమిని ఎదుర్కొన్నాయి. దీంతో బాబు ఆశలు నెరవేరలేవు. ఆయన కూడా దారుణంగా ఏపీలో ఓడిపోవడంతో కాంగ్రెస్ తో దోస్తీ అప్పుడే చెడింది. కాంగ్రెస్ ను నమ్మితే కష్టం అని ఆ పార్టీకి దూరంగా జరిగారు.

*బలమైన మోడీకి ఎదురు నిలవవద్దనే..
మోడీ వ్యతిరేక బృందంలో భాగం కావడం ఇష్టం లేని చంద్రబాబు తాజాగా సోనియా గాంధీ నిర్వహించిన మీటింగ్ కు దూరంగా జరిగారు. ఎన్టీఏ తలుపులు తెరిస్తే అందులో దూకడానికి చంద్రబాబు రెడీ అయ్యారు. కాంగ్రెస్ కోలుకోవడం కష్టమని.. మోడీ స్టామినా ఇప్పట్లో తగ్గేలా లేదని బాబు గ్రహించారు. అందుకే రెండోసారి బీజేపీ గెలవగానే.. చంద్రబాబు ఇప్పటికే తన నలుగురు ఎంపీలను బీజేపీలోకి సాగనంపారన్న ప్రచారం ఉంది. ఇప్పుడు కూడా తొందరగా సర్దుకుంటున్నాడు. కాంగ్రెస్ కాడిని వదిలేశాడు. ఏపీలోనూ ఓడిపోవడంతో ఇక సోనియా.. రాహుల్ ను కలవడానికి లేదా పలకరించే సాహసం కూడా చేయలేదు. ఇలా చంద్రబాబు ప్రస్తుతం కాంగ్రెస్ కు దూరంగా.. బీజేపీకి దగ్గరగా అడుగులు వేస్తున్నారు. అయితే బాబు ఎంత ప్రయత్నిస్తున్నా బీజేపీ మాత్రం బాబును పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు.

-నరేశ్ ఎన్నం

దిల్ రాజు రిక్వెస్ట్ కు పవన్ గ్రీన్ సిగ్నల్..!

pawan


పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ కోసం ఆయన అభిమానులు రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. పవన్ కల్యాణ్ నుంచి చివరగా వచ్చిన మూవీ ‘అజ్ఞాతవాసి’. దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈమూవీ ప్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ 50కోట్లపైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీ తర్వాత పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లడంతో సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే ఇటీవలి కాలంలో పవన్ వరుస సినిమాలకు కమిట్ అవుతూ రీ ఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ తెలుగు రీమేక్లో పవన్ నటిస్తున్నాడు. ‘వకీల్ సాబ్’గా తెరకెక్కుతున్న ఈ మూవీని దిల్ రాజు, శ్రీదేవి భర్త బోనికపూర్ నిర్మిస్తున్నారు.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ ఇప్పటికే 70శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. దేశంలో లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగులు వాయిదా పడటంతో ‘వకీల్ సాబ్’ చిత్రం అర్ధాంతరంగా నిలిచింది. ఇటీవలే టాలీవుడ్ పెద్దలు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి షూటింగులకు పర్నిషన్ ఇవ్వాలని కోరగా సానుకూలంగా స్పందించారు. ఈమేరకు సినిమా పోస్టు ప్రొడక్షన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదేవిధంగా ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు షూటింగులను నిర్వహించుకోవాలని సూచించారు. ఈనేపథ్యంలోనే టాలీవుడ్లో మెల్లమెల్లగా షూటింగులు ప్రారంభమవుతోన్నాయి. దీంతో నిర్మాత దిల్ రాజు పవన్ కల్యాణ్ కు ఓ రిక్వెస్ట్ పెట్టుకోగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దిల్ రాజు సినిమా కోసం పవన్ గతంలో కేటాయించిన కాల్షీట్లు పూర్తవడంతో మరోసారి డేట్స్ కేటాయించాలని కోరారట. ఈమేరకు పవన్ జూన్ లో కాల్షీట్లు కేటాయించినట్లు తెలుస్తోంది.

దీంతో ‘వకీల్ సాబ్’ జూన్ లో పట్టాలెక్కనుందని సమాచారం. ప్రస్తుతానికి షూటింగులన్నీ స్థానికంగా చేసే అవకాశం ఉంది. ‘వకీల్ సాబ్’లో చిత్రం ఇంకో 30శాతం పూర్తి చేసుకుంటే సినిమా పూర్తవుతుంది. ఇందులో కొన్ని కోర్టు సీన్లు తీయాల్సి ఉండటంతో ‘వకీల్ సాబ్’ కేసులను వాదించేందుకు సిద్ధపడుతున్నాడు. ఈ మూవీ పూర్తయ్యాకే క్రిష్ దర్శకత్వంలో పవన్ నటించనున్నాడు. ఈమేరకు జూలైలో పవన్-క్రిష్ కాంబినేషన్లో మూవీ తెరకెక్కనుందని సమాచారం. ఆ తర్వాత పవన్-హరీష్ శంకర్ మూవీ ఉండనుందట.

విమాన ప్రయాణాలకు మూడు రాష్ట్రాల అభ్యంతరం!


సోమవారం నుండి దేశంలో విమానాల రాకపోకలకు కేంద్ర పౌరవిమాన శాఖ మంత్రిత్వ శాఖ అంతా సిద్ధం చేస్తున్నా దేశంలోని మూడు పెద్ద రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం తమ రాష్ట్రాలలో విమానాలు తిరగడానికి అభ్యంతరం తెలిపాయి. దానితో విమాన ప్రయాణాలు పాక్షికంగానే జరిగే అవకాశం ఉంటుంది.

కరోనా లాక్‌డౌన్‌ విధించిన రెండు నెలల తర్వాత దేశంలో విమానాల రాకపోకలు జరగబోతున్నాయి. దేశంలో పారిశ్రామికంగా పెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్ర, చెన్నైలు కరోనా వైరస్ ఇంకా కట్టడి కాకపోవడంతో ఇప్పట్లో విమానాలు నడపడానికి విళ్లేదని కేంద్ర ప్రభుత్వానికి తేల్చి చెబుతున్నాయి. కరోనా వైరస్ తో పాటు అంఫాన్ తుఫాన్ కారణంగా భారీ విధ్వంసంకు గురైన పశ్చిమ బెంగాల్ సహితం విమానాలకు అభ్యంతరం తెలిపింది.

ఈ మూడు దేశంలోని అతిపెద్ద రాష్ట్రాలు కావడంతోపాటు, అత్యంత ప్రాముఖ్యత కలిగినవేకాకుండా, అక్కడి విమానాశ్రయాలు దేశంలోనే అత్యంత రద్దీగా ఉండేవే కావడం విశేషం. ఇవి మూడు విమాన ప్రయాణాలకు కూడలిగా కూడా పేరొందాయి.

ముఖ్యమంత్రి రేసు.. కోమటిరెడ్డికి అంత సత్తా ఉందా?

Does Komatireddy deserve a crucial position ?
Does Komatireddy deserve a crucial position ?


తెలంగాణ ముఖ్యమంత్రి పోస్టుకు దగ్గరి దారేది? మొదట పీసీసీ చీఫ్ పదవి. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం పీసీసీ చీఫ్ గా పాదయాత్ర చేసి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు అదే బాటలో మన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి కలలుగంటున్నారు. పీసీసీ చీఫ్ పదవిని ఇస్తే తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తానంటూ కాంగ్రెస్ అధిషానానికి ఆఫర్ ఇస్తున్నాడు.

*పీసీసీ చీఫ్ రేసులో తీవ్ర పోటీ
పీసీసీ చీఫ్ రేసు తెలంగాణ కాంగ్రెస్ లో సెగలు పుట్టిస్తోంది. ఈ పోస్టు కోసం దాదాపు 10 మంది వరకు పోటీపడుతున్నారు. రేవంత్ రెడ్డికి చాన్స్ దక్కకుండా కాంగ్రెస్ సీనియర్లు లాబీయింగ్ చేస్తున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు తానేనని భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి చాటింపు వేయించుకుంటున్నారు. ఇక దళితులకు ఇవ్వాలని వీహెచ్, భట్టి విక్రమార్కలు డిమాండ్ చేస్తున్నారు. బీసీలకు ఇవ్వాలని శ్రీధర్ బాబు లాంటి వారు ముందుకొస్తున్నారు. ఇంతమందిలో కోమటిరెడ్డి మాత్రం అధిష్టానానికి తాజాగా భలే ఆఫర్ ఇచ్చారు.

*50మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాగేస్తా..
ఓ ఇంగ్లీష్ చానెల్ తో తాజాగా కోమటిరెడ్డి మాట్లాడుతూ హాట్ కామెంట్ చేశారు. తాను పీసీసీ అధ్యక్షుడిని అయితే టీఆర్ఎస్ కు చెందిన 50 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశం ఉందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతానికి అన్నిరకాలుగా పాటుపడుతానని ఆయన అన్నారు. పాదయాత్రలు, బస్ యాత్రలు చేపట్టి.. నిత్యం ప్రజలతోనే ఉండి కాంగ్రెస్ ను తెలంగాణలో అధికారంలోకి తేవడమే తన లక్ష్యమన్నారు.

*కోమటిరెడ్డివి పగటి కలలేనా?
టీపీసీసీ చీఫ్ కావాలన్నది కోమటిరెడ్డి కల. దాన్ని నెరవేర్చుకోవడానికి ఏకంగా అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 50 మందిని లాగేసే సత్తా ఉందని కోమటిరెడ్డి అంటున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దెబ్బకు ఇప్పటికే కాంగ్రెస్ కుదేలైంది. అసెంబ్లీలో పట్టుమని పదిమంది ఎమ్మెల్యేలు కూడా లేని దుస్థితికి దిగజారింది. జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, దామోదర్ రెడ్డి, స్వయంగా కోమటిరెడ్డి సైతం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. పెద్దలు జానారెడ్డి గారే చరిత్రలోనే తొలిసారి మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయి తన వరుస రికార్డు విజయాలకు బ్రేక్ వేసుకున్నారు. చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా ఎంపీ ఎన్నికల్లో ఓ మూడు సీట్లు గెలిచారు. ఉద్దండులైన నేతలే గులాబీ కారుకు నిలవలేకపోయారు. దాదాపు సీనియర్లు అంతా కారెక్కేశారు. అలాంటి దుస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కోమటిరెడ్డి గట్టెక్కిస్తాననడమే పెద్ద వింత అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నలుగురు ఎమ్మెల్యేలు కూడా లేని కాంగ్రెస్ పార్టీలోకి 50 మంది గులాబీ ఎమ్మెల్యేలు వస్తారంటున్న కోమటిరెడ్డి మాటలు విని అందరూ నవ్వుకుంటున్నారు.

*కాంగ్రెస్ గుణపాఠం నేర్వదా?
తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణ సమాజంలో కాంగ్రెస్ పట్ల కాస్త సానుభూతి ఉంది. ఓటమితో గుణపాఠాలు నేర్చుకుంటే కాంగ్రెస్ కు భవిష్యత్ ఉంటుంది. ఇంత ఓడినా ఆత్మపరిశీలన చేసుకోకుండా పీసీసీ పీఠం కోసం ఇన్ని రాజకీయాలు.. కుమ్ములాటలు చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ మొదట వాటన్నింటికి స్వస్తి పలికి.. నడిపించే నాయకుడిని ఎన్నుకొని తెలంగాణలో స్థిరత్వం సాధిస్తే తప్ప ఆ పార్టీ బతికిబట్టకట్టే చాన్సులు లేవు. అలాంటిది కోమటిరెడ్డి ఏకంగా 50 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాగేస్తాననడంపై అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఆశకైనా హద్దుండాలంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ముందు కాంగ్రెస్ దుకాణం సర్దుకుంటే మంచిదని.. ఆ తర్వాత టీఆర్ఎస్ నుంచి లాగడం చూసుకోవచ్చని సెటైర్లు వేస్తున్నారు.

-నరేశ్ ఎన్నం

‘బాబు’కు అనుమతి ఇవ్వకపోవడానికి కారణమిదేనా?

chandra babu


టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కు రావడానికి మార్గం కనిపించడం లేదు. మార్చి 22వ తేదీకి ముందు ఆయన హైదరాబాద్ వెళ్లారు. అనంతరం లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ఏపీకి రావడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కేంద్రానికి, రాష్ట్రానికి లేఖలు రాసినా ఆయన గోడు పట్టించుకున్నవారు లేరు. ఈ నెల 7వ తేదీ విశాఖలో ఎల్.జి పాలిమర్స్ దుర్ఘటన నేపథ్యంలో రాష్ట్రానికి రావడానికి చంద్రబాబు ప్రయత్నం చేశారు. ఇందుకోసం కేంద్ర హోం మంత్రి, ప్రధాన మంత్రికి విడివిడిగా లేఖలు రాశారు. ఈ వ్యవహారం రాష్ట్రాల పరిధిలో ఉందని భావించిన కేంద్రం బాబు లేఖపై స్పందించలేదు. అదే రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు అనుమతి లభించడంతో ఆయన గుంటూరు నుంచి విశాఖ వెళ్లి భాదితులను పరామర్శించారు.

మూడవ విడత లాక్ డౌన్ సమయంలో రాష్ట్రానికి రావడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఏపీ డీజీపీ కి బాబు లేఖ రాశారు. ఆ లేఖపై ఇప్పటి వరకూ ఎటువంటి స్పందన రాలేదు. ప్రస్తుతం నాల్గవ విడత లాక్ డౌన్ అమలులో ఉన్నందున రాష్ట్రంలో రాకపోకలకు అనుమతి ఇచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారిని మాత్రం అనుమతి పత్రాలు ఉంటేనే అనుమతిస్తున్నారు. దీంతో చంద్రబాబు సోమవారం విశాఖ వెళ్లి ఎల్.జి భాదితులను పరామర్శించిన అనంతరం అమరావతి చేరుకోవాలని టూర్ ప్లాన్ చేశారు. ఇందుకోసం మరోమారు అనుమతి కోరుతూ ఏపీ, తెలంగాణా డీజీపీలకు లేఖ రాశారు. తెలంగాణా డీజీపీ నుంచి అనుమతి పత్రం మజూరైనా, ఏపీ డిజీపీ నుంచి అనుమతి పత్రం ఇప్పటి వరకూ రాలేదు.

వైసీపీ మంత్రులు ప్రతిపక్ష నేత పక్క రాష్ట్రంలో ఇంట్లో కూర్చుని విమర్శలు చేసున్నారని చెబుతున్నారు. ఆ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి ఈ అంశంపై రోజుకో ట్వీట్ చేస్తున్నారు. చంద్రబాబు రాష్ట్రానికి వచ్చే సమయంలో అనుమతి ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని టీడీపీ నాయకులు వాదిస్తున్నారు. చంద్రబాబు రాష్ట్రానికి వస్తున్నాడంటేనే వైసీపీకి భయం పట్టుకుందనటున్నారు. అందుకే అనుమతి ఇవ్వడం లేదని ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు అనుమతి ఇవ్వకపోతే నాల్గవ విడత లాక్ డౌన్ ముగిసే (మే నెలాఖరు) వరకూ చంద్రబాబు వచ్చే అవకాశం ఉండదు. మరోవైపు ఈ ఏడాది ఫిబ్రవరి 27న చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రర్యటన సందర్భంగా హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకున్న బాబు కాన్వాయ్ ను వైసీపీ నేతలు అడ్డుకున్నారు. విశాఖను రాజధానిని చేయకుండా అడ్డుపడుతున్నారని వైసీపీ నాయకులు ఆందోళన చేశారు. సాయంత్రం వరకూ సాగిన ఈ ఎపిసోడ్ లో చివరకు చంద్రబాబు ను పోలీసులు అరెస్టు చేసి, అనంతరం హైదరాబాద్ పంపారు. సోమవారం బాబు విశాఖ వస్తే ఎం జరుగుతుందో అని పార్టీ నాయకులు ఆందోళనలో ఉన్నారు.

విశాఖ దుర్ఘటన విషయంలో టీడీపీ ప్రజలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతోందని భావిస్తున్న అధికారపక్షం టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను పోలీసులు బాధిత గ్రామాల్లోకి వెళ్లేందుకు అనుమతించలేదు. ప్రతిపక్ష నేత బాబు విషయంలో ఇదే వైఖరి అవలంభించే అవకాశం లేక పోలేదు. విశాఖ దుర్ఘటనపై బాబు రోజు జూమ్ యాప్ లో ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతూనే ఉన్నారు. ఇది అధికార పక్షానికి మింగుడు పడటం లేదు.

‘డార్లింగ్’ లాంటి అల్లుడు కావాలంటున్న స్వీటీ మదర్


డార్లింగ్ ప్రభాస్-అనుష్క జోడీ స్క్రీన్ పై చూడముచ్చటగా ఉంటుంది. వీరిద్దరి హైట్, పర్సనాలిటీకి మేడ్ ఫర్ ఇచ్ అదర్ అన్నట్లుగా ఉంటారు. ప్రభాస్ పక్కన హీరోయిన్ ఛాన్స్ దక్కాలంటే ఆ కటౌట్ కు సరిపడా ఈడు జోడు ఉండాల్సిందే..టాలీవుడ్లో ప్రభాస్ కు సరిపోయే జోడీ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చిది అనుష్క మాత్రమే. అందుకే డార్లింగ్ ప్రభాస్ స్వీటీతో ఏకంగా నాలుగు సినిమాలను చేశాడు. మిర్చి, బిల్లా, బహుబలి, బహుబలి-2 సినిమాల్లో జోడీగా నటించి ప్రేక్షకులను అలరించారు. ‘మిర్చి’లో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సీన్స్ ను అభిమానుల తెగ ఎంజాయ్ చేశారు. అదేవిధంగా ‘బహుబలి’లో అమరేంద్ర బహుబలిగా ప్రభాస్, దేవసేనగా అనుష్క అద్భుతంగా నటించారు. వీరిద్దరి మధ్య వచ్చే రోమాన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అంతలా వీరిద్దరి మధ్య కెమెస్ట్రీ వర్కౌట్ అయింది. దీంతో ప్రభాస్-అనుష్కలు లవ్ చేసుకుంటున్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకుంటారనే ప్రచారం జరిగింది. ఈ గాసిప్స్ ను ప్రభాస్-అనుష్కలు ఖండించారు.

వీరిద్దరి ఫర్ ఫెక్ట్ జోడీ కావడంతో మీడియాలో మాత్రం గాసిప్స్ ఆగలేదు. మంచి మంచి కథనాలతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారని ప్రచారం చేశాయి. అయితే వీటిపై అనుష్క ఒకనొక సమయంలో ఘాటూగానే స్పందించింది. స్క్రీన్ పై దేవసేన-బాహుబలి కెమిస్ట్రీ చూసి మోసపోవద్దు.. రియాలిటీలోనూ అలా ఉంటామని అనుకోవద్దు.. మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని వివరణ ఇచ్చుకుంది అనుష్క. తాజాగా స్వీటీ పెళ్లిపై అనుష్క తల్లి ప్రపుల్లా శెట్టి స్పందించారు. అనుష్కకు నిజజీవితంలోనూ ప్రభాస్ లాంటి మిస్టర్ ఫర్పెక్ట్ లాంటి వరుడు రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. దీనిని బట్టి చూస్తే ప్రభాస్ పై ఆమె అభిప్రాయం క్లియర్ కట్ గా ఉంది. అనుష్క సైడ్ నుంచి అంత ఒకే గానీ ప్రభాస్ నుంచే గ్రీన్ సిగ్నల్ రావడం లేదని తెలుస్తోంది. అయితే గతకొంతకాలంగా ప్రభాస్ పెళ్లిపై ఇప్పుడు అప్పుడు అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి.

తాజాగా బళ్లలదేవుడి పెళ్లి ఒకే కావడంతో అమరేంద్ర బహుబలి, దేవసేనల పెళ్లిపై మీడియాలో మరోసారి చర్చ మొదలైంది. ప్రభాస్, అనుష్క జోడీలో ఎవరూ ముందు పెళ్లి చేసుకుంటారనేది ఆసక్తి నెలకొంది. అభిమానులు మాత్రం వీరిద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అనుష్క సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తున్నప్పటికీ ప్రభాస్ నుంచి ఎలాంటి స్పందన కన్పించడం లేదు. ప్రభాస్ తోటి హీరోలంతా వరుసబెట్టి పెళ్లి పీఠలెక్కుతుంటే డార్లింగ్ మాత్రం మ్యారేజ్ పై ఫోకస్ పెట్టడం లేదు. దీంతో ప్రభాస్ అసలు పెళ్లి చేసుకుంటాడా? అనే అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఏ వయస్సులో జరిగే ముచ్చట ఆ వయస్సులోనే జరిగితేనే బాగుంటుందనే విషయాన్ని ప్రభాస్ గుర్తిస్తే మంచిదని పలువురు సలహాలు ఇస్తున్నారు. అయితేకల్యాణం వచ్చినా.. కక్కొచ్చినా ఆగదంటారు.. మరీ ప్రభాస్-అనుష్కల విషయం అది ఎప్పటి జరుగుతుందో వేచి చూడాల్సిందే..!

కరోనా కట్టడిలో కూలబడుతున్న గుజరాత్ ప్రభుత్వం


దేశంలో మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న గుజరాత్ లో ఈ వైరస్ కట్టడిలో ప్రభుత్వం కూలబడుతున్నట్లు కనిపిస్తున్నది. ఇప్పటికే 13,268 మంది వైరస్ కు గురికాగా, 802 మంది మృతి చెందారు. ముఖ్యంగా ముంబై తర్వాత అహ్మదాబాద్ నగరంలోనే ఈ వైరస్ విజృభించడం ఆందోళన కలిగిస్తున్నది.

కరోనా బాధితుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అహ్మదాబాద్‌లోని సివిల్‌ ఆస్పత్రి చెరసాల కన్నా ఘోరంగా ఉందని పేర్కొంటూ గుజరాత్ హై కోర్ట్ చేసిన వాఖ్యలు కరోనా కట్టడిలో ఆ రాష్ట్ర ప్రభుత్వ పనితీరును వెల్లడి చేస్తుంది. ఇప్పటివరకు ఈ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 377 మంది మరణించగా, ఇది రాష్ట్రంలోని మొత్తం మరణాల్లో 45 శాతంగా ఉంది.

కరోనా సంబంధిత సమస్యలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన జస్టిస్‌ జె.బి. పార్దివాలా, ఇలేష్‌వొరాల ధర్మాసనం ఈ విధంగా వ్యాఖ్యానించింది. అక్కడి ప్రస్తుత పరిస్థితిని మునిగిపోయే టైటానిక్‌ ఓడతో పోలుస్తూ సివిల్‌ ఆస్పత్రి పరిస్థితులు దారుణంగా ఉండటం బాధాకరమని పేర్కొంది.

చికిత్స చేసేందుకు ఏర్పాటు చేసిన ఆస్పత్రి చెరసాల కన్నా ఘోరంగా ఉండవచ్చని తెలిపింది. సివిల్‌ ఆస్పత్రి అదనపు చీఫ్‌ సెక్రటరీ పంకజ్‌ కుమార్‌, కార్యదర్శి మిలిన్‌ తోర్వానే, ఆరోగ్య కుటుంబ సంక్షేమ ప్రధాన కార్యదర్శి జయంతి రవిని హైకోర్టు బాద్యులుగా పేర్కొంది.

ఇక్కడి పరిస్థితుల గురించి, బాధితులు, సిబ్బంది గురించి రాష్ట్ర ఆరోగ్య మంత్రి నితిన్‌ పటేల్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్‌ ముకిమ్‌లకైనా తెలుసా అని ప్రశ్నించింది. వెంటిలేటర్లు లేకపోవడంతోనే బాధితులు మరణిస్తున్నారనే వాదనపై కోర్టు ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసా అని ప్రశ్నించింది.

పైగా, ఈ సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని నిలదీసింది. అహ్మదాబాద్‌ నగరంలోని అన్ని మునిసిపాలిటీల్లో ఉన్న ప్రైవేట్‌, కార్పోరేట్‌ ఆస్పత్రులకు 50 శాతం పడకలను కరోనా రోగులకు కేటాయించడం తప్పనిసరి అనే నోటిఫికేషన్‌ను జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

బహుశా దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఒక హై కోర్ట్ కరోనా కట్టడి విషయంలో ఇంత దారుణమైన వాఖ్యలు చేసిన్నట్లు లేదు.

నిన్న అనుష్క.. నేడు షారూఖ్..


లాక్డౌన్ కారణంగా దేశంలో సినిమా షూటింగులు వాయిదా పడగా, థియేటర్లన్నీ మూతపడ్డాయి. టీవీ షోలు కూడా పాతవాటిని రిపిట్ చేస్తుండటంతో ప్రేక్షకులు ఓటీటీ వైపు చూస్తున్నారు. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో విడుదలవుతోన్న కొత్త మూవీలు, వెబ్ సీరిసులకు ప్రేక్షకులకు అలవాటు పడిపోతున్నారు. ఒకప్పుడు సినిమాలకే పరిమితమైన వివాదాలు ప్రస్తుతం వెబ్ సీరీసులను తాకుతున్నాయి. ఇటీవల బాలీవుడ్ నటి అనుష్క శర్మ నిర్మాతగా మారి తెరకెక్కించిన ‘పాతల్ లోక్’ వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెల్సిందే. ఓ వర్గాన్ని కించపరిచేలా కొన్ని సన్నివేశాలున్నాయని అనుష్క శర్మకు లీగల్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. తాజాగా బాలీవుడ్ బాద్షా షారూఖ్ నిర్మించిన ‘బేతాళ్’ వెబ్ సీరిస్ వివాదాల్లో చిక్కుకుంది.

షారూక్‌ఖాన్ నిర్మాత‌గా రెడ్ చిల్లీస్ సంస్థతో కలిసి ‘బేతాళ్‌’ వెబ్ సీరిస్ నిర్మించాడు. ఇందులో వినీత్ కుమార్, అహనా కుమార్, సుచిత్ర పిళ్లై, జితేంద్ర జోషి ముఖ్య పాత్రల్లో నటించారు. ఈనెల 24న వెబ్ సీరిసు తొలి సీజ‌న్‌ను విడుద‌ల చేయాల‌ని భావించారు. అయితే బేతాళ్ కథకు తాము రాసుకున్న వితాళ్ క‌థ‌కు పోలిక‌లు ఉన్నాయ‌ని స్క్రీన్ రైట‌ర్స్ స‌మీర్‌, మహేశ్ ముంబై కోర్టును ఆశ్ర‌యించారు. ‘మేం మా క‌థ‌ను చాలా నిర్మాణ సంస్థ‌ల‌కు చెప్పాం. కానీ రెడ్ చిల్లీస్ సంస్థ‌కు చెప్ప‌లేదు.. అయితే మా ఐడియా వారికెలా తెలిసిందో అర్థం కావ‌డం లేదు.. రైట‌ర్స్ అసోసియేష‌న్‌లోనూ ఫిర్యాదు చేశా’మని పేర్కొన్నారు. దీంతో ‘బేతాళ్‌’ సిరీస్‌పై ప్ర‌సారంపై కోర్టు నిషేధం విధించింది. ఈ వెబ్ సీరీసుకు పాట్రిక్ గ్రాహం, నిఖిల్ మహాజన్ దర్శకత్వం వహిస్తున్నారు. సెలబ్రెటీలు నిర్మించిన వెబ్ సీరీసులపై వరుసగా వివాదాలు చోటుచేసుకుంటుండం చర్చనీయాంశంగా మారింది.

అపెక్స్ కమిటీ సమావేశం జగన్, కేసీఆర్ ఎగ్గొట్టే అవకాశం!


గత సంవత్సర కాలంగా ఎంతో స్నేహంగా ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య అకస్మాత్తుగా జలవివాదాలతో రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ఉద్వేగాలు రెచ్చగొట్టి, ఇప్పుడు అపెక్స్ కమిటీ సమావేశం అనేసరికి వణికి పోతున్నారు. కేంద్ర జలవనరుల మంత్రి జరిపే ఈ సమావేశంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా పాల్గొనవలసి ఉంటుంది.

ఈ సమావేశం జరిగితే తమ బండారం బైటపడుతుందని, ప్రజల ముందు పరువు పోతుందని వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తున్నది. అందుకనే అపెక్స్ కమిటీ సమావేశం జరగకుండా చేయడం కోసం, తామే ముందుగా కలసి, తమ మధ్య విబేధాలు లేవని చెప్పాలని అనుకొంటున్నట్లు చెబుతున్నారు.

ఇప్పుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రాయలసీమలో ప్రతిపాదిస్తున్న పధకాలు అన్ని ప్రజాకర్షణ కోసమే గాని, నిజాయతి లేదనే విమర్శలు ఇప్పటికే రాయలసీమ నేతల నుండి వస్తున్నాయి. అదే విధంగా దక్షిణ తెలంగాణాలో అమలులో ఉన్న సాగునీటి పధకాలను వదిలి పెట్టి కేసీఆర్ వచ్చినప్పటి నుండి ఉత్తర తెలంగాణ ప్రాజెక్ట్ లపై దృష్టి సారిస్తున్నట్లు తెలంగాణాలో విమర్శలు చెలరేగుతున్నాయి.

పైగా, రాయలసీమ, దక్షిణ తెలంగాణాలలో చెబుతున్న ప్రాజెక్ట్ లు అన్ని నిబంధనలు ఉల్లంఘించి, అక్రమంగా చేపట్టినవి అని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం కృష్ణ బోర్డు ముందు చేసుకున్న ఆరోపణలు స్పష్టం చేస్తున్నాయి. అపెక్స్ కమిటీ ముందుకు వెడితే సాధించేది ఏమీ లేకపోగా, తమ లోటుపాట్లే బయటపడతాయని ఇప్పుడు గ్రహించినట్లున్నది.

అందుకనే అపెక్స్ కమిటీ సమావేశాన్ని ఎగగొట్టేందుకు కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు అధికార వర్గాలు తెలుపుతున్నాయి. నేరుగా జగన్ తో మాట్లాడడం ద్వారా ఆ సమావేశం అవసరం లేకుండా చేయాలని అనుకొంటున్నట్లు చెబుతున్నారు. దానితో త్వరలో మరోసారి జగన్ ప్రగతి భవన్ కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే మూడు సార్లు ఈ ముఖ్యమంత్రులు కలిసినా నిర్దుష్టంగా ఎటువంటి నిర్ణయానికి రాలేక పోవడం గమనార్హం. సాధారణంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం మరో రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేస్తే అపెక్స్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. 2015లో ఆ విధంగా నాటి కేంద్ర జలవరణుల మంత్రి ఉమా భారతి చంద్రబాబు నాయుడు ఫిర్యాదుపై సమావేశం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మరెప్పుడు జరగలేదు.

కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కాకుండా బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేసిన ఫిర్యాదుపై అపెక్స్ కమిటీ సమావేశం ఏర్పాటుకు నిర్ణయించారు. దానితో రాజకీయంగా కూడా తామిద్దరికి ఇబ్బందికరం కాగలదని కేసీఆర్ జగన్ ను వారించే అవకాశం కనిపిస్తున్నది.

కరోనా కేసుల నమోదులో 4వ స్థానంలో భారత్


దేశంలో కరోనా అదుపులోకి వచ్చినదంటూ లాక్ డౌన్ ను క్రమంగా దేశం అంతా ఒక వంక సడలిస్తుండగా, మరోవంక రోజు రోజుకు కేసుల నమోదు సంఖ్య మాత్రం పెరుగుతూ వస్తున్నది. కేసుల నమోదులో మొన్నటి వరకు 10 తర్వాతి స్థానాలలో ఉంటూ వచ్చిన భారత్ ఇప్పుడు నాలుగో స్థానంకు చేరుకొంది.

అమెరికా, బ్రెజిల్‌, రష్యా తరువాత అత్యధికంగా మనదేశంలోనే ఇప్పుడు పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. అమెరికా, బ్రెజిల్‌లో రోజుకు 20 వేల వరకూ, రష్యాలో ఎనిమిది వేల వరకూ కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. మృతుల విషయానికి వస్తే అమెరికాలో 97 వేలు దాటగా, బ్రెజిల్‌లో 20 వేలు, రష్యాలో 3,249గా ఉన్నాయి. మొత్తం కేసుల వారీగా చూస్తే పై మూడు దేశాల్లో వరుసగా 16.32 లక్షలు, 3.14 లక్షలు, 3.26 లక్షలుగా ఉన్నాయి.

1.25 లక్షల కేసులకు చేరడానికి మనదేశానికి 115 రోజులు పట్టగా, బ్రిటన్‌లో 53 రోజులు, అమెరికాలో 69 రోజులు, రష్యాలో 93 రోజులు పట్టింది. మన దేశంలో ఈ నెల ప్రారంభంలో ఒకరోజు కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య 2,400 దాటింది. ఈ నెల 19వ తేదీని మినహాయిస్తే గత వారం రోజులుగా కేసుల సంఖ్య ఐదు వేల నుంచి ఆరు వేల మధ్య కొనసాగుతోంది.

గత 24 గంటల్లో దేశంలో 6,654 మందికి కొత్తగా కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. కొన్ని రోజులుగా 6,000 కంటే అధికంగా కేసులు నమోదవుతున్నాయని, ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవేనని పేర్కొంది. గత 24 గంటల్లో 137 మంది మరణించారు. దీంతో కరోనా మఅతుల సంఖ్య 3,720కి చేరింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,25,101కి చేరింది.

ఇప్పటివరకు 51,783 మంది వివిధ ఆస్పత్రుల నుండి డిశ్చార్జి అయ్యారు. దేశంలో కోలుకున్న వారు 41.39 శాతం. ప్రస్తుతం దేశంలో 69,597 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ప్రధానంగా మనదేశంలో పెట్టుబడి, పరిశ్రమలు ఎక్కువగా కేంద్రీకృతమైన మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. 69,597 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.

మహారాష్ట్రలో గత 24 గంటల్లో 2,940 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 44,582కు చేరగా, 63 మంది మరణించారు. ఆ రాష్ట్ర రాజధాని ముంబయిలో 1,751 కొత్త కేసులు నమోదవగా, 27మంది మృతిచెందారు. తమిళనాడులో 14,753 కేసులు నమోదవగా, 98మంది మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలో గత 24 గంటల్లో 591 కొత్త కేసులు నమోదవగా, 23 మంది మృతి చెందగా, మొత్తం కేసుల సంఖ్య 12,910కి, మృతుల సంఖ్య 231కి పెరిగింది.

కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య పెరగడం కూడా కేసుల సంఖ్య పెరుగుదలకు కారణంగా ఐసిఎంఆర్‌ చెబుతోంది. ఈ నెల 22 నాటికి 27.55 లక్షల పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది.

వలస కూలీలను గాలికి వదిలేసిన ప్రభుత్వాలు:ఉత్తమ్

లాక్ డౌన్ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మికులను గాలికి వదిలేశారని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. వాళ్లను సొంత ఊర్లకు పంపడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారన్నారు. నల్లగొండ నుంచి ఒరిస్సాకు వలస కార్మికుల కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్సులను క్లాక్ టవర్ సెంటర్ నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. వలస కూలీల సంక్షేమానికి ఒక్క కాంగ్రెస్ పార్టీనే కృషి చేసిందని ఉత్తమ్ పేర్కొన్నారు. సోనియాగాంధీ సూచనతో రాష్ట్రంలోని వలస కార్మికులను సొంత ఊర్లకు పంపేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేసిందన్నారు. నల్లగొండ నుంచి ఒరిస్సా కార్మికులను తమ పార్టీ సొంత డబ్బుతో బస్సులో పంపించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వలస కార్మికులను వారి సొంతూళ్లకు పంపేందుకు కృషి చేస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల


తెలంగాణలో లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ప్రభుత్వం నేడు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పరీక్ష షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నత విద్యాశాఖ అధికారులు తాజాగా విడుదల చేశారు. గతంలోనే ఎంసెట్, ఐసెట్, ఈసెట్, ఎడ్ సెట్, పీజీఈసెట్, పీఈసెట్, లాసెట్, పీజీఎల్ సెల్ ప్రవేశ పరీక్ష తేదీలను ప్రకటించగా కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. ఈమేరకు విద్యాశాఖ తిరిగి ఈ పరీక్షలకు సంబంధించి కొత్త తేదిలను రీ షెడ్యూల్ చేసింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు పరీక్షల నిర్వహణకు అన్నిరకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. పరీక్షలకు చాలా సమయం ఉన్నందున విద్యార్థులు సన్నద్ధం కావాలని సూచించారు.

ఉమ్మడి ప్రవేశ పరీక్షల కొత్త షెడ్యూల్..

జులై 1న తెలంగాణ పాలీసెట్‌
జులై 1 నుంచి 3వరకు తెలంగాణ పీజీ సెట్
జులై 4న తెలంగాణ ఈసెట్
జులై 6నుంచి 9వరకు తెలంగాణ ఎంసెట్
జులై 10న తెలంగాణ లాసెట్, లాపీజీ సెట్
జులై 13న తెలంగాణ ఐసెట్
జూలై 15న ఎడ్‌సెట్ పరీక్షలను నిర్వహించనున్నారు.