
డార్లింగ్ ప్రభాస్-అనుష్క జోడీ స్క్రీన్ పై చూడముచ్చటగా ఉంటుంది. వీరిద్దరి హైట్, పర్సనాలిటీకి మేడ్ ఫర్ ఇచ్ అదర్ అన్నట్లుగా ఉంటారు. ప్రభాస్ పక్కన హీరోయిన్ ఛాన్స్ దక్కాలంటే ఆ కటౌట్ కు సరిపడా ఈడు జోడు ఉండాల్సిందే..టాలీవుడ్లో ప్రభాస్ కు సరిపోయే జోడీ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చిది అనుష్క మాత్రమే. అందుకే డార్లింగ్ ప్రభాస్ స్వీటీతో ఏకంగా నాలుగు సినిమాలను చేశాడు. మిర్చి, బిల్లా, బహుబలి, బహుబలి-2 సినిమాల్లో జోడీగా నటించి ప్రేక్షకులను అలరించారు. ‘మిర్చి’లో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సీన్స్ ను అభిమానుల తెగ ఎంజాయ్ చేశారు. అదేవిధంగా ‘బహుబలి’లో అమరేంద్ర బహుబలిగా ప్రభాస్, దేవసేనగా అనుష్క అద్భుతంగా నటించారు. వీరిద్దరి మధ్య వచ్చే రోమాన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అంతలా వీరిద్దరి మధ్య కెమెస్ట్రీ వర్కౌట్ అయింది. దీంతో ప్రభాస్-అనుష్కలు లవ్ చేసుకుంటున్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకుంటారనే ప్రచారం జరిగింది. ఈ గాసిప్స్ ను ప్రభాస్-అనుష్కలు ఖండించారు.
వీరిద్దరి ఫర్ ఫెక్ట్ జోడీ కావడంతో మీడియాలో మాత్రం గాసిప్స్ ఆగలేదు. మంచి మంచి కథనాలతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారని ప్రచారం చేశాయి. అయితే వీటిపై అనుష్క ఒకనొక సమయంలో ఘాటూగానే స్పందించింది. స్క్రీన్ పై దేవసేన-బాహుబలి కెమిస్ట్రీ చూసి మోసపోవద్దు.. రియాలిటీలోనూ అలా ఉంటామని అనుకోవద్దు.. మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని వివరణ ఇచ్చుకుంది అనుష్క. తాజాగా స్వీటీ పెళ్లిపై అనుష్క తల్లి ప్రపుల్లా శెట్టి స్పందించారు. అనుష్కకు నిజజీవితంలోనూ ప్రభాస్ లాంటి మిస్టర్ ఫర్పెక్ట్ లాంటి వరుడు రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. దీనిని బట్టి చూస్తే ప్రభాస్ పై ఆమె అభిప్రాయం క్లియర్ కట్ గా ఉంది. అనుష్క సైడ్ నుంచి అంత ఒకే గానీ ప్రభాస్ నుంచే గ్రీన్ సిగ్నల్ రావడం లేదని తెలుస్తోంది. అయితే గతకొంతకాలంగా ప్రభాస్ పెళ్లిపై ఇప్పుడు అప్పుడు అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి.
తాజాగా బళ్లలదేవుడి పెళ్లి ఒకే కావడంతో అమరేంద్ర బహుబలి, దేవసేనల పెళ్లిపై మీడియాలో మరోసారి చర్చ మొదలైంది. ప్రభాస్, అనుష్క జోడీలో ఎవరూ ముందు పెళ్లి చేసుకుంటారనేది ఆసక్తి నెలకొంది. అభిమానులు మాత్రం వీరిద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అనుష్క సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తున్నప్పటికీ ప్రభాస్ నుంచి ఎలాంటి స్పందన కన్పించడం లేదు. ప్రభాస్ తోటి హీరోలంతా వరుసబెట్టి పెళ్లి పీఠలెక్కుతుంటే డార్లింగ్ మాత్రం మ్యారేజ్ పై ఫోకస్ పెట్టడం లేదు. దీంతో ప్రభాస్ అసలు పెళ్లి చేసుకుంటాడా? అనే అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఏ వయస్సులో జరిగే ముచ్చట ఆ వయస్సులోనే జరిగితేనే బాగుంటుందనే విషయాన్ని ప్రభాస్ గుర్తిస్తే మంచిదని పలువురు సలహాలు ఇస్తున్నారు. అయితేకల్యాణం వచ్చినా.. కక్కొచ్చినా ఆగదంటారు.. మరీ ప్రభాస్-అనుష్కల విషయం అది ఎప్పటి జరుగుతుందో వేచి చూడాల్సిందే..!