Home Blog Page 8481

ఎడారిలో మియా మాల్కోవా అందాలు.. చూడాల్సిందే..


సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా చిత్రం ‘క్లైమాక్స్’. అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో సస్పెన్స్ థిల్లర్ గా ‘క్లైమాక్స్’ ను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన టీజర్ విడుదల చేయగా కేవలం రెండ్రోజుల్లో మినియన్ వ్యూస్ క్రాస్ చేసి రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని వర్మ స్వయంగా తన సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆ తర్వాత మియా మాల్కోవాపై షూట్ చేసిన ‘జస్ట్ డూ ఇట్.. ఫ్రీక్ అవుట్’ అనే మ్యూజికల్ వీడియో, క్లైమాక్స్ ట్రైలర్ ను విడుదల చేసి సినిమాలపై అంచనాలను పెంచేశాడు. ఈ మూవీని మే 29న ఉదయం 11గంటలకు వర్మ ఆర్జీవీ వరల్డ్ థియేటర్ యాప్ లో విడుదల చేయనున్నాడు. తాజాగా కొద్దిసేపటి క్రితమే వర్మ తన ట్వీటర్లో ‘జస్ట్ డూ ఇట్.. ప్రీక్ అవుట్’ అనే ఫుల్ వీడియోను రిలీజ్ చేశాడు.

సస్సెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని పూర్తిగా ఎడారిలో చిత్రీకరించారు. మియా మాల్కోవా అందాలు ఈ మూవీకి స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. తాజాగా రిలీజైన సాంగులో మియా మాల్కోవా అందాలు అభిమానులను కనువిందు చేశాయి. ఎడారి ఇసుక తిన్నెల్లో మియా మాల్కోవా అందాలను వర్మ పూర్తిగా చూపించేశారు. చాలా స్టైలీష్ గా, హాలీవుడ్ స్టైల్లో క్లైమాక్స్ మూవీని వర్మ తెరకెక్కించాడు. ‘జస్ట్ డూ ఇట్.. ఫ్రీక్ అవుట్’ అనే సాంగ్ పూర్తిగా ఇంగ్లీషులో ఉంది. ఈ పాటను రవిశంకర్ సంగీతం అందించగా భారతి గుప్త అలపించాడు. వర్మ గతంలోనూ మియా మాల్కోవాతో జీఎస్టీ అనే మూవీని తెరకెక్కించారు. ఇందులో మియా మాల్కోవాను నగ్నంగా చూపించడంతో మహిళ సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. వాటన్నింటిని వర్మ తనదైన శైలిలో తిప్పికొట్టారు.

ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ‘క్లైమాక్స్’ మూవీపై ఎలాంటి విమర్శలు, వ్యతిరేకతలు కన్పించడం లేదు. దీంతో వర్మ కొత్త పద్ధతుల్లో ‘క్లైమాక్స్’ మూవీకి ప్రమోషన్ చేస్తున్నారు. రిలీజైన గంటసేపట్లోనే ఈ వీడియోను సుమారు 30వేల మంది చూశారు. రెండ్రోజుల్లోనే ‘క్లైమాక్స్’ టీజర్ మిలియన్ వ్యూస్ సాధించగా ఈ సాంగ్ ఒక్కరోజులోనే మిలియన్ వ్యూస్ సాధించడం ఖాయంగా కన్పిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్లో దూసుకెళుతోంది.

జగన్ బలం.. బాబు బలహీనత అదే


మే 23.. ఈ చారిత్రక రోజు ఏపీ చరిత్రలో అధికార మార్పిడికి కారణమైంది. నిజానికి ఏపీ చరిత్ర చూస్తే బలమైన మీడియా ఉన్న పార్టీనే గెలిచింది. శాసించింది. 2014 ఎన్నికల్లో గెలుస్తాడనుకున్న వైఎస్ జగన్ ను ఓడించింది బలమైన ఎల్లో మీడియానే. ప్రధానిగా మోడీ అవుతారని.. బీజేపీతో పొత్తు కట్టిన టీడీపీ గెలిస్తేనే విడిపోయిన ఏపీకి లాభం అని నాడు ఎల్లోమీడియా చేసిన ప్రచారాన్ని జనం నమ్మారు.. బీజేపీ-టీడీపీ-జనసేన కూటమిని గెలిపించారు.కానీ 2019 వచ్చేసరికి చంద్రబాబు బలమే బలహీనతైంది. జగన్ కు డిజిటల్ ప్రచారం.. సోషల్ మీడియా బలమైంది. బలమైన మీడియా సపోర్టు లేని జగన్ కు సోషల్ మీడియానే ఆయుధమైంది. అదే గెలుపునకు కారణమైందనడంలో ఎలాంటి సందేహం లేదు.

*సోషల్ మీడియా, డిజిటల్ మీడియానే జగన్ కు బలం
ఏపీలో వైసీపీ ఘనవిజయం వెనుక అనేక అంశాలు పనిచేశాయి. విజయానికి దోహదపడ్డ ప్రధాన కారణాల్లో ఒకటి వైసీపీ డిజిటల్ మీడియా ప్రచారం. వైసీపీ ఇందుకోసం ఒక మెరికలాంటి లేడిని సోషల్ మీడియా ఇన్ చార్జిగా పెట్టుకుంది. ‘దివ్యారెడ్డి’ని ఈ వింగ్ కు నియమించుకొని ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సోషల్ మీడియాలో ఏపీలోని అందరికీ చేరువ చేసేలా పకడ్బందీగా ముందుకెళ్లింది.. అదే వైసీపీ విజయంలో కీలకమైంది.

*వైసీపీ డిజిటల్ మీడియా దన్ను
వైసీపీ డిజిటల్ మీడియా బృందం దివ్యారెడ్డి ఆధ్వర్యంలో జనాలకు కనెక్ట్ అయ్యేలా వ్యూహాలు రూపొందించింది. బలమైన ఎల్లో మీడియా చానెల్స్ ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాయి. ముఖ్యంగా వీరు రూపొందించిన ‘బైబై బాబు, నిన్ను నమ్మం బాబు’ హ్యాష్ ట్యాగ్ లతో విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు నిజస్వరూపాన్ని ప్రజలకు తెలిసేలా టీడీపీ వ్యతిరేక ప్రచారం సక్సెస్ అయ్యింది.

*జగన్ కు కలిసొచ్చినవి ఇవే
ఇక జగన్ ఎందుకు ముఖ్యమంత్రి కావాలన్న కారణాలను కూడా ఇదే సోషల్ మీడియా విభాగాలు రూపొందించాయి. ‘రావాలి జగన్.. కావాలి జగన్’ అంటూ వైసీపీ అనుకూల ప్రచారం నిర్వహించింది. ఈ నినాదం ప్రజల్లోకి దావానంలా వ్యాపించింది. చాలా మందిని కదిలించింది.. ప్రేరేపించింది. మంచి భవిష్యత్తు కోసం ఏపీలో మార్పు రావాలని నినదానికి ప్రజలు స్పందించి జగన్ ను గెలిపించారు.

*అధికారం కట్టబెట్టిన పాదయాత్ర
ఇక జగన్ నిర్వహించిన పాదయాత్ర ప్రజలకు చేరువ చేసింది. ఆయనను ప్రజానాయకుడిగా చేసింది. జగన్ పాదయాత్రతో ప్రతీ మూలకు వెళ్లడం ప్లస్ అయ్యింది. ఎల్లో మీడియాను ఎదుర్కోవడంలో జగన్ నియమించిన డిజిటల్ ప్రచారం బాగా సక్సెస్ అయ్యింది. శక్తివంతమైన ఎల్లో మీడియా ఎంత ప్రచారం చేసినప్పటికీ వైసీపీ డిజిటల్ ప్రచారం మంచి ఫలితాలను ఇచ్చింది. బాబు పాలనపై ఎల్లో మీడియా గోబెల్ ప్రచారాన్ని.. అర్థ అసత్యాలకు విసిగిపోయిన జనాలు మార్పు అవసరమని జగన్ ను గెలిపించారు.

*ప్రజలు తెలివైన వారు..
ఎల్లో మీడియా ఎంత బలంగా ప్రచారం చేసినా.. జగన్ కు మీడియా సపోర్టు తక్కువగా ఉన్న ప్రజలు వాస్తవాలను గుర్తించడంలో తెలివైన వారని నిరూపించారు. సరైన నాయకత్వాన్ని వారు ఎన్నుకున్నారు. టీడీపీని తిరస్కరించారు. వైసీపీ చారిత్రిక విజయంలో డిజిటల్ మీడియా పాత్ర ఎనలేనిదని వైసీపీ వర్గాలు గుర్తు చేసుకుంటున్నాయి.

-నరేశ్ ఎన్నం

రాష్ట్రంలో భానుడి భగభగ!

 

తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి భగభగలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. దింతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 7 గంటలకే ఎండలు మండిపోతున్నాయి. ఎండల వేడిమికి రాష్ట్ర ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరో మూడు రోజుల పాటు రాష్ర్టంలో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పలుచోట్ల సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరిగింది. మరికొన్ని రోజులు భానుడి ప్రతాపం తప్పదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

వివాదాస్పదమైన టిటిడి నిర్ణయం..!


రాష్ట్రంలో ప్రభుత్వం ఓ వైపు విలువైన ఆస్తులను అమ్మకానికి పెట్టింది. తొలి విడతగా రూ. 300 కోట్లు ఆర్జించాలని చూస్తున్నా, మొత్తంగా రూ. 4 వేల కోట్ల విలువైన ఆస్తులు అమ్మాలని ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఇది ఇలా ఉండగా తాజాగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం దాతలు ఇచ్చిన ఆస్తులు వేలానికి సిద్ధమైంది. శ్రీవారికి చెందిన కోట్లాది రూపాయల విలువైన భూములను అమ్మేందుకు టీటీడీ అడుగులు వేస్తోంది. తమిళనాడులో 23 చోట్ల ఉన్న ఆస్తులను విక్రయించనుంది. ఈ ఆస్తులను నిరర్ధక ఆస్తులుగా టిటిడి పేర్కొంది. ఆస్తుల విక్రయానికి టీటీడీ ఎనిమిది కమిటీలను వేసింది. బహిరంగంగానే విక్రయించాలని నిర్ణయించింది. ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసే అధికారాన్ని అధికారులకు కట్టబెట్టింది.

శ్రీవారి ఆస్తులను విక్రయించడానికి టీటీడీ సిద్ధం కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లాక్ డౌన్ కారణంగా మార్చి 23 నుంచి ఇప్పటి వరకూ రూ. 670 కోట్ల ఆదాయాన్ని టిటిడి కోల్పోయింది. జీతాలు చెల్లించలేమని పేర్కొంది. స్వామివారి ఆస్తులను అమ్మాల్సిన అవసరం ఏ మొచ్చిందని మండిపడుతున్నారు. బ్యాంక్ డిపాజిట్ ఉండగా ఆస్తుల వేలం ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని జనసేన కూడా హెచ్చరించింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఈ విషయాన్ని ఖండించారు. టిటిడి ఆస్తులు అమ్మకాన్ని నిలిపివేయాలని సీఎంకు లేఖ రాశారు.

ప్రణీత గొప్ప మనసుకు సలాం చేస్తున్న నెటిజన్లు


దేశంలో లాక్డౌన్ వల్ల సామన్యులు, మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేదలను ఆదుకునేందుకు పలువురు దాతలు ముందుకొస్తున్నారు. పలువురు సెలబ్రెటీలు తమకు తోచినవిధంగా సాయమందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థిత్లుల్లో హీరోయిన్ ప్రణీత స్వయంగా సాయమందిస్తూ అందరి మన్నలను పొందుతున్నారు. ఎంతోమంది సెలబ్రెటీలు చిన్నసాయంచేసి గొప్పగా పబ్లిసిటీ చేసుకుంటుంగా ప్రణీత మాత్రం వాటికి దూరంగా ఉంటుంది. తనకు తోచినవిధంగా పేదవారికి సాయం చేస్తుంది. సీని కార్మికుల కోసం ప్రారంభించిన సీసీసీ మనకోసం ఛారిటీకి ప్రణీత లక్ష రూపాయల విరాళం అందించింది. అంతేకాకుండా తనవంతు సాయం ఒక్కో కుటుంబానికి 2వేల చొప్పున లక్ష రూపాయాల సాయం చేయనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా ఇటీవల ప్రణీత పేదలకు స్వయంగా వంటచేసి పేదలకు భోజనాన్ని పంచిపెట్టింది.

లాక్డౌన్ 3.0లో భాగంగా కొన్ని సడలింపులతో ప్రజారవాణాకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ఆటోడ్రైవర్లకు ఉపాధి లభించింది. రెండునెలలుగా పనిలేక ఇబ్బందులు పడుతున్న ఆటోడ్రైవర్లను దృష్టిలో ఉంచుకొని ప్రణీత తనవంతు సాయమందించింది. బెంగుళూరులోని 100మంది ఆటోడ్రైవర్లకు శానిటైజర్స్ పంపిణీ చేసింది. అదేవిధంగా ఆటో డ్రైవర్లు, కస్టమర్లను వేరుచేసేలా షీట్స్ ను పంపిణీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రణీత తన ట్వీటర్లో పోస్టు చేసింది. ఆటో డ్రైవర్లకు ప్రణీత చేసిన సాయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

తెలంగాణ లో పేపర్ లెస్ పరిపాలన?

కరోనా కారణంగా లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ పాలనలో పలు కీలక మార్పులు చోటు చేసుకొనున్నాయి. సెక్రటేరియట్ నుంచి గ్రామ స్థాయి ఆఫీసుల వరకు అంతా పేపర్ లెస్ పాలన చేయాలని చూస్తునట్టు తెలుస్తోంది. ఆ దిశగా తెలంగాణ సర్కార్ గతంలోనే ముందడుగు వేసింది. కానీ అది అన్ని శాఖలలో సాధ్యపడలేదు.

కరోనా ప్రభావంతో మనుషులు గుంపులుగా ఉండే పరిస్థితి లేదు. వ్యక్తిగత దూరం పాటించాలి అందుకే పేపర్ లెస్ పాలన అందించేందుకు కృత నిశ్చయంతో సర్కార్ ముందుకు సాగుతునట్టు తెలుస్తోంది. సర్కార్ తన ఆలోచనను అమలు చేయడం కోసం ఓ యాప్ తేనుంది. ఈ యాప్ లోనే అన్ని శాఖలు ఉంటాయి. ప్రతి శాఖకు సంబంధించి ప్రత్యేక ఐడీలు,పాస్ వర్డ్ లు ఇవ్వనున్నారు. ఉద్యోగులకు కూడా ఐడీలు,పాస్ వర్డ్ లు ఇస్తారు. అంతా ఈ యాప్ ద్వారానే పని చేస్తారు. యాప్ పై ఒత్తిడి పెరిగి క్రాష్ అయ్యే అవకాశం ఉంది కావున అలా జరగకుండా భారీ ఎత్తున సర్వర్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి ఫైలుకు సంబంధించి ఓ బార్ కోడ్ ఇస్తారు. ఆ బార్ కోడ్ ద్వారా ఆ ఫైల్ పని ఎంత వరకు పూర్తయ్యిందో కూడా తెలుసుకోవచ్చు. దీంతో ఇక అంతా ఆన్ లైన్ ద్వారానే జరగనుంది. ప్రస్తుతం మీసేవలు,ఈ సేవల ద్వారా పలు సర్టిఫికెట్టు పొందుతున్న విషయం తెలిసిందే. అదే విధంగా ట్రాఫిక్ చలాన్లు,కరెంట్ బిల్లులు కూడా ఆన్ లైన్ లోనే చెల్లింపులు జరుగుతున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాలు, చర్చలు, పథకాల ప్రారంభం అంతా ఆన్ లైన్ ద్వారానే చేయనున్నారు. సర్కార్ ఈ దిశగా అడుగులు వేస్తున్నా ఇది ఆచరణలో విజయవంతం అవుతుందో లేదో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాలి…

జగన్ ‘బాబు’ను ఫాలో అవుతున్నాడా..?

jagan&chandrababu

ప్రస్తుతం రాజకీయ పార్టీలు సోషల్ మీడియాకు ఇచ్చిన ప్రాధాన్యత దేనికి ఇవ్వడం లేదు. మెయిన్ మీడియాను పక్కన పెట్టినా పర్లేదు, సోషల్ మీడియా ముఖ్యమని భావిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాకు వైసీపీ, టీడీపీ, జనసేన, సీపీఐ, సిపిఎం, ఇతర చిన్నాచితక పార్టీలు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసుకున్నాయి.

ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ గత ఎన్నికల్లో ఎక్కువ శాతం సోషల్ మీడియాపైనే ఆధారపడింది. రానురాను సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శలు, ఎదుటి వ్యక్తులను కించపరిచే విధంగా పోస్ట్ లు పెట్టె వారి సంఖ్య పెరిగింది. దీంతో వివాదాలు, కేసులు, అరెస్టులు వరకూ జరిగి పోతున్నాయి.

రాష్ట్రంలో 2019 కి ముందు టీడీపీ అధికారంలో ఆ పార్టీ నేతలను కించ పరిచే విధంగా పోస్టులు పెట్టారని వైసీపీ సోషల్ మీడియా విభాగంలోని రవి కిరణ్ పై, ఇతరులపై శాసన సభ కార్యదర్శి సత్యనారాయణ కేసులు పెట్టి అరెస్ట్ చేయించారు. హైదరాబాద్ లోని వైసీపీ సోషల్ మీడియా విభాగం కార్యాలయానికి వెళ్లిన పోలీసులను సోదాలు చేశారు. కడప జిల్లాలో అదే అంశంలో వైసీపీ సానుభూతి పరులపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారు.

ఇప్పుడు ఇదే విధానాన్ని అధికారంలోకి ఉన్న వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తుంది. రాష్ట్రంలో కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని సీఐడీ విభాగం ముగ్గురు వ్యక్తులకు నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టింది. వీరిలో గుంటూరుకు చెందిన రంగనాయకమ్మ, మరో వ్యక్తి ఉన్నారు. వీరు విశాఖ ఎల్.జి పాలిమర్స్ దుర్ఘటన, అనంతర పరిణామాలపై పోస్టులు పెట్టారు. సోషల్ మీడియా అంశంపై నెల్లూరులో వివాదం ప్రారంభమైంది. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై పోస్టు పెట్టాడని వైసీపీ నాయకులు ఫిర్యాదు చేస్తే తెలుగు యువత నాయకుడు సత్యంరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో టీడీపీ నాయకులు పోలీసులు స్టేషన్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. సోషల్ మీడియా పోస్టుల విషయంలో సామాన్యులపైనే పోలీసులు బ్రహ్మాస్త్రాలు ప్రయోగిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా సోషల్ మీడియాపై కేసుల విషయంలో ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబును ఫాలో అవుతున్నారని అనిపిస్తుంది.

పవన్ కళ్యాణ్ కల చెదిరిన రోజు ఇది


ఈ రోజు పత్రికలు, వెబ్ సైట్స్, సోషల్ మీడియాలో ఏది ఓపెన్ చేసి చూసిన ఏపీ సీఎం జగన్ అఖండ మెజార్టీతో గెలిచిన రోజు అని అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. మే 23 ఏపీ రాజకీయాల్లోనే చారిత్రక దినం అంటూ కొనియాడుతున్నారు. సరిగ్గా ఏడాది కిందట ఇదే రోజున ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. జగన్ ఏకంగా అసెంబ్లీలో 151 స్థానాలు సాధించారు. వైసీపీ విజయదుందుబి మోగించింది. జగన్ కు అపూర్వ విజయాన్ని ప్రజలు కట్టబెట్టారు. ప్రతిపక్ష టీడీపీ కేవలం 23 సీట్లకే పరిమితమై కోలుకోకుండా దెబ్బతింది.

*పవన్ కల చెదిరింది కూడా ఇప్పుడే..
అయితే ఈరోజున అందరూ అధికార వైసీపీ గొప్పతనాన్ని.. జగన్ హీరోయిజాన్ని.. ప్రతిపక్ష టీడీపీ చంద్రబాబు ఓటమిని గుర్తు చేసుకుంటున్నారు. కానీ ఏపీ రాజకీయాలను ‘కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి’లాగా శాసిస్తానని అని గడిచిన ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన జనసేనాని పవన్ కళ్యాణ్ ను మాత్రం గుర్తు చేసుకోవడం లేదు. నిజానికి పవన్ కళ్యాణ్ ఎంతో ఆశతో ఏపీలో ఒంటరిగా పోటీచేశారు. ఆయన కల చెదిరింది కూడా ఈరోజే కావడం జనసేన నాయకుల్లో, అభిమానుల్లో నిరాశకు గురిచేసింది. అందుకే ఈరోజును జనసైనికులు ఎవరూ మరిచిపోని రోజుగా అభివర్ణిస్తున్నారు.

*కర్ణాటక వలే గెలుస్తానని వచ్చిన పవన్
నిజానికి పక్కరాష్ట్రం కర్ణాటకలో కేవలం 40 సీట్లు సాధించిన కుమారస్వామి ఆ రాష్ట్రానికి సీఎం అయ్యాడు. పవన్ కళ్యాణ్ కూడా ఒంటరిగా పోటీచేసి హంగ్ వస్తే ఏపీ సీఎం అవుదామని కలలుగన్నాడు. ఏకంగా భీమవరం, గాజువాకా రెండు నియోజకవర్గాల్లో పోటీచేశారు. ఎలాగైనా ఈసారి అసెంబ్లీలో అడుగుపెడుదామని అనుకున్నారు. కానీ ప్రజలు ఆయనకు అవకాశం ఇవ్వలేదు. రెండు నియోజకవర్గాల్లో ఓడించారు. పవన్ భవిష్యత్ రాజకీయాలను చిదిమేశారు.

*రెండు చోట్ల ఓటమితో రూటు మార్చుకున్న పవన్
ప్రజలు తనను ఆదరిస్తారని.. ప్రజారాజ్యం ను మించి సీట్లు సాధించి చక్రం తిప్పుతానని పవన్ కళ్యాణ్ భావించారు. కానీ అన్నయ్య పార్టీ కంటే మరీ తీసికట్టుగా చావుతప్పి ఒకటే సీటు గెలిచారు. అదీ పవన్ కాదు.. రాజోలులో జనసేన అభ్యర్థి గెలిచారు. పవన్ రెండు చోట్ల ఓడిపోయారు. అందుకే ఇక సినిమాల్లోకి వెళ్లనని 2019 ఎన్నికల్లో ప్రకటించిన పవన్ మళ్లీ తన రూటు మార్చుకోవడం విశేషం.

*సినిమాలు వద్దని.. నేడు ముద్దని..
రాజకీయంగా ఏపీలో 2019 ఎన్నికలు జనసేన భవిష్యత్తును నిర్ణయించాయి. పవన్ లోనూ మార్పును తెచ్చాయి. ఏపీ రాజకీయ యవనికపై రాణించడం అంత ఈజీకాదని జనసేనాని పవన్ కు కూడా అర్థమైంది. అందుకే ఇక సినిమాలు వదిలేశానన్న పవన్ కళ్యాణ్ మనసు మార్చుకొని సినిమాలు చేస్తున్నారు. రాజకీయాన్ని సగం సగం చేస్తున్నారు. తత్వం బోధపడడంతో రాజకీయంతోపాటు సినిమాలు ముఖ్యమని మారిపోయారు. ఇలా పవన్ లోనూ మార్పు తెచ్చిన రోజుగా మే 23 నిలిచిపోయింది. రాజకీయాలే పరమావధి అనుకున్న పవన్ లోనూ ఈ మార్పుకు ఈ చారిత్రక రోజు కారణమైంది.

-నరేశ్ ఎన్నం

తెలంగాణ పోలీసులపై కరోనా పంజా!

 

కరోనా కట్టడికి ముందుండి పోరాడుతున్న పోలీసులపై కరోనా తన పంజా విసురుతోంది. ఇటీవల కరోనా సోకి పోలీసు కానిస్టేబుల్ దయాకర్‌ రెడ్డి మృతి చెందారు. అలాగే బాలాపూర్‌ లో ఏఎస్ఐ గా పని చేస్తున్న సుధీర్ కృష్ణ కు కరోనా వైరస్ సోకింది. తాజాగా రాజధానిలో మరో నలుగురు పోలీసులు కరోనా పాజిటివ్‌ లుగా తేలారు. ప్రస్తుతం వీరు గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ లోని కాచీగూడ పోలీస్‌స్టేషన్‌ లో పనిచేస్తున్న ఓ ఎస్‌ఐ, వివిధ స్టేషన్లకు చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లు కరోనా పాజిటివ్‌ లుగా నిర్ధారణ అయ్యింది. దీంతో ఎస్‌ఐ కుంటుంబ సభ్యులను క్వారంటైన్‌ కు తరలించారు. అయితే దీన్ని పోలీసు అధికారులు ధృవీకరించాల్సి ఉన్నది. ఎస్‌ఐకి కరోనా పాజిటివ్‌ రావడంతో కాచీగూడ పోలీస్‌ స్టేషన్‌ లో పనిచేస్తున్నవారందరికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

అలాగే కుల్సుంపురా పోలీస్‌ స్టేషన్‌ కు చెందిన దయాకర్‌ రెడ్డి అనే కానిస్టేబుల్‌ కరోనా సోకి మరణించిన విషయం తెలిసిందే.. దీంతో ఈ స్టేషన్‌ లో పనిచేస్తున్నవారికి కరోనా పరీక్షలు నిర్వహించగా, వారికి నెగెటివ్‌ వచ్చింది. హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ ఈ రోజు మధ్యాహ్నం కుల్సుంపుర స్టేషన్‌ ను సందర్శించారు. కరోనాతో మరణించిన దయాకర్‌ రెడ్డికి ఆయన నివాళులర్పించారు.

నాగబాబు ట్వీట్లపై పవన్ కామెంట్!

గాంధీని హత్య చేసిన గాడ్సే, కరెన్సీ నోట్లపై స్వతంత్ర సంయోధుల ఫోటోలపై ఆసక్తికర వ్యాఖ్యల చేస్తూ.. ఇటీవల వరుస ట్వీట్లతో వివాదాలకు తెరతీస్తున్న నాగబాబు అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. నాగబాబు చేసే వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, జనసేన పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు జనసేన పార్టీ ప్రకటన జారీ చేసింది. ‘జనసేన పార్టీలో లక్షలాదిగా ఉన్న నాయకులు, జనసైనికులు, అభిమానులు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తం చేసే అభిప్రాయాలు వారి వ్యక్తిగతం. పార్టీకి ఏమాత్రం సంబంధం లేదు. గతంలో కూడా ఈ విషయం చెప్పాం. మరోసారి కూడా చెబుతున్నాం. నాగబాబు సోషల్ మీడియాలో చేసే వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవి. వాటికి, పార్టీకి ఏ మాత్రం సంబంధం లేదు.

పార్టీ నిర్ణయాలు, అభిప్రాయాలు అధికార పత్రం, పార్టీ అధికారిక సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేస్తాం. వాటినే పరిగణనలోకి తీసుకోవాలి.’ అని పవన్ కళ్యాణ్ సంతకంతో జనసేన పార్టీ ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ప్రజాసేవ గురించి ఆలోచించాలని, మరే ఇతర అంశాల జోలికి వెళ్లవద్దని పవన్ కళ్యాణ్ కోరారు. క్రమశిక్షణను అతిక్రమించకుండా ప్రజాసేవలో ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు.

టాలీవుడ్లో మరో విషాదం..


టాలీవుడ్లో ఒకేరోజు రెండు విషాద సంఘటనలు చోటుచేసుకున్నాయి. పాతతరం నటి వాణిశ్రీ కుమారుడు అభినయ్ మరణ సంఘటన మరువకముందే మరో విషాదం నెలకొంది. కొద్దిరోజులు అనారోగ్యంతో బాధపడుతున్న ప్రసిద్ధ మిమిక్రీ కళాకారుడు హరికిషన్(58) మృతిచెందారు. ఆయన దేశవిదేశాల్లో పదివేలకు పైగా మిమిక్రి ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన మృతిపట్ల పలువురు దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. హరికిషన్ మృతితో టాలీవుడ్లో విషాద చాయలు నెలకొన్నాయి.

హరికిషన్ మే 30, 1963లో ఏలూరులో జన్మించారు. ఎనిమిదేళ్ల వయస్సు నుంచే తన పాఠశాలలోని ఉపాధ్యాయులు, తోటి స్నేహితుల గొంతును అనుకరిస్తూ నవ్వులు పూయించేవాడు. తన 12వ యేటా తొలి ప్రదర్శన ఇచ్చాడు. తాను మిమిక్రి ఆర్టిస్టు కావడానికి తన బంధువు చూడామణితోపాటు మిమిక్రీ కళాకారుడు నేరేళ్ల వేణుమాధవ్ స్ఫూర్తి అని చెబుతూండేవారు. కొన్నిరోజులు ఉపాధ్యాయుడిగా పనిచేసిన హరికిషన్ ఆ తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఫుల్ టైమ్ మిమిక్రి ఆర్టిస్టుగా రాణించారు. సినీ, రాజకీయ నాయకులు గొంతులను అనుసరిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక గంటలో 100కుపైగా వాయిస్ లను అనుసరించి ‘శతకంఠ ధ్వన్యనుకరుణ ధురీణ’ బిరుదును పొందారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం చేశారు.

నాగబాబు వ్యాఖ్యలపై స్పందించిన పవన్ కల్యాణ్

గత కొద్దిరోజులుగా నాగబాబు సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్లు వివాదాస్పదమవుతున్నాయి. నాగబాబు వ్యాఖ్యలను జనసేన పార్టీకి అంటగడుతూ ప్రత్యర్థులు మాటలయుద్ధానికి దిగుతుండటంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఈమేరకు ఆయన ట్విట్టర్లో ప్రకటన విడుదల చేశారు. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలతో పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. మీడియా వేదికగా నాగబాబు వ్యక్తం చేస్తున్న అభిప్రాయలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమని అన్నారు. వాటితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. పార్టీ నిర్ణయమేదైనా అధికారికంగానే ప్రకటిస్తామన్నారు. కరోనా కష్టకాలంలో ప్రజాసేవ తప్ప మరే ఇతర అంశాల జోలికి వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు. క్రమశిక్షణ అతిక్రమించకుండా ప్రజాసేవలో ముందుకు సాగాలని నాగబాబుకు ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు.

ఇటీవల నాగబాబు వరుసగా వివాదాస్పద అంశాల జోలికి వెళుతూ ట్వీట్లు పెడుతుండటంతో సోషల్ మీడియాలో రచ్చ కొనసాగుతోంది. గాడ్సే పుట్టిన రోజు సందర్భంగా నాగబాబు పెట్టిన పోస్టు తీవ్ర దుమారం రేపింది. గాంధీని చంపిన నాథురాం గాడ్సే నిజమైన దేశభక్తుడంటూ చేసిన ట్వీట్ పై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యారు. నాగబాబు వ్యాఖ్యలపై రాజకీయ నాయకులు, అభిమానుల్లో చర్చనీయాశంగా మారాయి. దీంతో నాగబాబు కేవలం నేను కేవలం గాడ్సే దేశ భక్తిని గురించి మాత్రమే మాట్లాడనని.. ఆయన చేసిన నేరం గురించి కాదంటూ వివరణ ఇచ్చినప్పటికీ వివాదం సద్దుమణగలేదు. నాగబాబు వ్యాఖ్యలపై పలువురు ఫిర్యాదు చేయడంతో ఆయనపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.

తాజాగా నాగబాబు మరోసారి ట్వీట్ చేశారు. ‘ఇండియన్ కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్ర బోస్, అంబేద్కర్, భగత్ సింగ్, చంద్ర శేఖర్ ఆజాద్, లాల్ బహదూర్, పీవీ నరసింహారావు, అబ్దుల్ కలాం, సావర్కార్, వాజపేయ్ లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉంది.. ఎందుకంటే స్వతంత్ర భారత ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావులని జనం మర్చిపోకూడదని ఒక ఆశ.. గాంధీ గారు బ్రతికి ఉంటే ఆయన కూడా తనతో పాటు దేశానికి సేవ చేసిన దేశభక్తులని గౌరవించమని తప్పకుండా చెప్పేవారు.. దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన మహానుభావుల పేర్లు తప్ప మొహాలు గుర్తురావడం లేదు.. భావితరాలకు కరెన్సీ నోట్ల పై వారి ముఖ పరిచయం చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది’ అంటూ నాగబాబు చేసిన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే నాగబాబు వ్యాఖ్యలకు జనసేన పార్టీకి ‘సంబంధం లేదని పవన్ చెప్పడంతో జనసేన కార్యకర్తలు, అభిమానులు ఎలా రియాక్టవుతారో వేచి చూడాల్సిందే..!

శేఖర్ కమ్ముల నెక్స్ట్ మూవీ కన్ఫార్మ్…

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తర్వాతి సినిమా కన్ఫార్మ్ అయ్యింది.ప్రస్తుతం నాగ చైతన్య, సాయి పల్లవి లతో ‘లవ్ స్టోరీ’ మూవీ చేస్తున్న కమ్ముల ఆ మూవీ షూటింగ్ ఇంకో 15 రోజుల షూటింగ్ మిగిలి ఉండగానే.. తన తర్వాతి సినిమాను కూడా లాక్ చేసేశాడు. అది కూడా ‘‘లవ్ స్టోరీ’’ మూవీ నిర్మాతతోనే. ఓ స్టార్ హీరో ఈ మూవీలో నటించనున్నారు.సినిమా సినిమాకు ఎప్పుడూ గ్యాప్ తీసుకునే శేఖర్ కమ్ముల ఈసారి లాక్ డౌన్ బ్రేక్ లో తన తర్వాతి సినిమాకు సంబంధించిన వర్క్ కూడా చేసుకుంటున్నారు.

లవ్ స్టోరీ మూవీ కంటెంట్ మీదున్న నమ్మకం, శేఖర్ పనితనం నచ్చిన ప్రొడ్యూసర్ నారాయణ్ దాస్ నారంగ్ తమ తరవాత సినిమా కూడా శేఖర్ ను చేయమని కోరగానే.. ఆయన వెంటనే దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ కరోనా క్రైసిస్ లో నిర్మాతకు హెల్ప్ అయ్యేలాగా ఇలాంటి డిసిషన్ తీసుకోవటం శేఖర్ కమ్ముల మంచితనం అని చెప్పుకోవాలి.లవ్ స్టోరీ సినిమా రిలీజ్ అవ్వగానే ఈ మూవీ పట్టాలెక్కనుంది.

శేకర్ కమ్ముల స్టైల్లో సాగే ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి బ్యానర్ పై నారాయణ్ దాస్ నారాంగ్ నిర్మించనున్నారు.ఈ మూవీ గురించి మిగతా విషయాలు త్వరలో తెలియజేస్తారు.

ఆ వాహనాలను తీసుకువెళ్లండి..!

లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించి రోడ్లపై తిరిగిన వాహనదారుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలను తిరిగి పొందవచ్చని ఏపీ డిజిపి గౌతమ్ సవాంగ్ తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. వాహనాలను పొందాలనుకునే వారు వాటికి సంబంధించిన సరైన ధ్రువపత్రాలను సంబంధిత పోలీస్ స్టేషన్ లో సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు ఇప్పటికే జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. వాహన యజమానులు సంబంధిత పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని సూచించారు.

మరోవైపు పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై 9.76 లక్షలకుపైగా కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లు 54 వేల నమోదు చేయగా, నిబంధనలు ఉల్లంఘించిన 17 వేల మందిని అరెస్ట్ చేశారు. మొత్తం 58 వేల వాహనాలను సీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వాహనాలకు కలిపి రూ. 43 కోట్లు జరిమానా రూపంలో వసూలు చేశారు. పోలీసు నిబంధనలు ఉల్లంఘించిన వారిలో ఏపీలో అరెస్ట్ ఎక్కువ విజయవాడ నగరంలో, వాహనాలకు జరిమానా విధించడంలో అనంతపురం జిల్లా ముందుంది.

పోయిన చోటే వెతుక్కుంటున్న సీనియర్ హీరోయిన్..!


చంద్రముఖి సినిమా రిలీజై దాదాపు పదేహేనేళ్లు కావస్తోంది. రజనీకాంత్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన చంద్రముఖి సినిమా తెలుగు, తమిళ ప్రేక్షకులు విశేషంగా అలరించింది. ఇందులో గంగ, చంద్రముఖిగా జ్యోతిక రెండు విభిన్న పాత్రల్లో నటించి మెప్పించింది. చంద్రముఖి క్యారెక్టర్లో జ్యోతిక పరకాయప్రవేశం చేసింది. అప్పట్లో ఎక్కడ చూసిన ‘వారయ్.. పాట విన్పించేంది. ప్రతీఒక్కరు ‘ఉమ్మా.. లక..లక..లక’ అంటూ రజనీ, జ్యోతిక మ్యానరిజం చేస్తూ అలరించేవారు. ఆ తర్వాత రిలీజైన పలు సినిమాల్లోనూ చంద్రముఖిని ఇమ్మిటేట్ చేస్తూ కామెడీ, యాక్షన్స్ సీన్స్ చాలా వచ్చాయి. అవి కూడా ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. ప్రస్తుతం ఈ సినిమాకు దర్శకుడు పి.వాసు సీక్వెల్ తీయనున్నాడు. ‘చంద్రముఖి-2’గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నహాలు చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ముందుగా చంద్రముఖిగా సిమ్రాన్ ను తీసుకోవాలని అనుకున్నారట. అయితే కొన్ని వ్యక్తిగత కారణాలతో సిమ్రాన్ ఈ మూవీలో నటించలేదట. అయితే తాజాగా చంద్రముఖి-2లో సిమ్రాన్ నటించనుందనే వార్తలు విన్పిస్తున్నాయి. ఇటీవలే చంద్రముఖి సీక్వెల్ గురించి జ్యోతికను మీడియా ప్రశ్నించగా ఈ మూవీ కోసం తనను ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేసింది. చంద్రముఖి మూవీ సిక్వెల్ వస్తున్న సంగతి కూడా తనకు తెలియదని చెప్పింది. అయితే దర్శకుడు పీ.వాసు మాత్రం చంద్రముఖి సీక్వెల్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. రజనీకాంత్ స్థానంలో డ్యాన్సర్ కమ్ హీరో లారెన్స్ నటిస్తున్నాడు. ఇక చంద్రముఖి(జ్యోతిక) స్థానంలో సిమ్రాన్ నటించనుందని ప్రచారం జరుగుతోంది. ‘చంద్రముఖి’లో రజనీకాంత్, జ్యోతిక అభిమానులను ఆకట్టుకోగా ‘చంద్రముఖి-2’లో లారెన్స్, సిమ్రాన్ అలరించేందుకు సిద్ధమవుతోన్నారు. తొలిసారి చేజారిన చంద్రముఖి పాత్రను సిమ్రాన్ తిరిగి ‘చంద్రముఖి-2’లో దక్కించుకోవడం ఆసక్తిని రేపుతోంది. చంద్రముఖిగా సిమ్రాన్ అభిమానులను ఏమేరకు ఆకట్టుకుందో వేచి చూడాల్సిందే..!

‘రైతుబంధుతోనే రైతులు బతకడం లేదు’

తెలంగాణ రైతులను సీఎం కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. రైతుబంధుతోనే రైతులు బతుకుతున్నట్లు బిల్డప్ ఇస్తున్నారని అన్నారు. నియంతృత వ్యవసాయంపై కేసీఆర్ విచిత్ర ప్రకటనలు చేస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు రైతులను గందరగోళంలో పడేశాయని అన్నారు. ఇప్పటి వరకు ఏ పంట వేయాలనే నియంత్రణ లేదన్నారు. తన భూమిలో ఏ పంట వేయాలో రైతుకు తెలుసని జగ్గారెడ్డి అన్నారు. రైతు పంటకు రైతు బంధుకు లింకు పెట్టడం దురదృష్టం అని అభిప్రాయపడ్డారు.

‘ఏ పంట వేసుకోవలో కూడా రైతుకు స్వేచ్ఛ లేకుండా పోతోంది. రైతులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. రైతుబంధుతోనే రైతులు బతుకుతున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. రైతుబంధు ను తప్పించడానికే షరతులు పెడుతున్నారు. రైతులు బానిసలుగా బతకాలా? కూరగాయల రైతుకు రైతు బంధు వర్తిస్తుందా లేదా స్పష్టత ఇవ్వాలి.’ అని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఇక మీదట ప్రజలు ఏం తినాలో కూడా సీఎం నిర్ణయించేలా ఉన్నారని జగ్గారెడ్డి విమర్శించారు. కేసీఆర్ చెప్పిన యువతినే పెళ్లి చేసుకోవాలి అనేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఏం పంట వేయాలో, ఏం తినాలో నిర్ణయించే అధికారం సీఎంకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ప్రజలు గాలి పీల్చుకోవాలన్న సీఎం అనుమతి తీసుకోవాలా? అని జగ్గారెడ్డి నిలదీశారు.

సంక్షోభంలో ఏడాది సంబరం..!


గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో 151 స్థానాలు, లోక్ సభలో 22 సీట్లు గెలిచిన వైసీపీ చారిత్రాత్మక విజయం నమోదు చేసింది. మే 23తో ఈ విజయానికి ఏడాది నిండటంతో వేడుకలు చేసుకోవాలన్న వైసీపీ శ్రేణులకు కరోనా వైరస్ సంక్షోభం చెక్ పెట్టింది. దీంతో పార్టీ శ్రేణులు తీవ్ర నిరుత్సాహనికి గురయ్యాయి. అయితే వీళ్ళు ఇంతటితో ఆగలేదు. సోషల్ మీడియా వేదికగా వైసీపీ గెలుపు పండుగను జరుపుకుంటున్నారు.

వైసీపీ సోషల్ మీడియాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు నుంచి సాధారణ కార్యకర్తల వరకూ వారి సంతోషాన్ని ఇతరులతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. సరిగ్గా గతేడాది మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మే 23వ తేదీ చారిత్రక విజయానికి ఏడాది అంటూ వైసీపీ ట్విట్టర్ లో పేర్కొంది. రాజన్న బిడ్డ, జనహృదయ నేత అంటూ సీఎం జగన్ ను కొనియాడింది. అంతేకాదు, విశ్వసనీయతకు పట్టం కట్టి ఏడాది అంటూ కొన్ని వీడియో క్లిపింగ్స్ ను కూడా పంచుకుంది.

బహిరంగంగా వేలాది మంది మద్య వేడుకలు చేసుకోవడం అలవాటుగా మరినప్పటికీ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఇప్పట్లో పార్టీ శ్రేణులకు ఈ అవకాశం లభించే పరిస్థితి లేదు. ఇది ఈ ఒక్క పార్టీకే పరిమితం కాదు, గత నెలలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఇదే విధంగా ఇళ్లకే పరిమితం అయ్యింది. కమ్యూనిస్టు పార్టీలు మే డే వేడులను కొద్ది మంది కార్మికులతో నిరాడంబరంగా జరుపుకున్నాయి. మరి కొన్నాళ్ళు ఈ పాట్లు తప్పవు మరి.