
తెలంగాణలో లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ప్రభుత్వం నేడు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పరీక్ష షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నత విద్యాశాఖ అధికారులు తాజాగా విడుదల చేశారు. గతంలోనే ఎంసెట్, ఐసెట్, ఈసెట్, ఎడ్ సెట్, పీజీఈసెట్, పీఈసెట్, లాసెట్, పీజీఎల్ సెల్ ప్రవేశ పరీక్ష తేదీలను ప్రకటించగా కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. ఈమేరకు విద్యాశాఖ తిరిగి ఈ పరీక్షలకు సంబంధించి కొత్త తేదిలను రీ షెడ్యూల్ చేసింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు పరీక్షల నిర్వహణకు అన్నిరకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. పరీక్షలకు చాలా సమయం ఉన్నందున విద్యార్థులు సన్నద్ధం కావాలని సూచించారు.
ఉమ్మడి ప్రవేశ పరీక్షల కొత్త షెడ్యూల్..
జులై 1న తెలంగాణ పాలీసెట్
జులై 1 నుంచి 3వరకు తెలంగాణ పీజీ సెట్
జులై 4న తెలంగాణ ఈసెట్
జులై 6నుంచి 9వరకు తెలంగాణ ఎంసెట్
జులై 10న తెలంగాణ లాసెట్, లాపీజీ సెట్
జులై 13న తెలంగాణ ఐసెట్
జూలై 15న ఎడ్‌సెట్ పరీక్షలను నిర్వహించనున్నారు.