Home Blog Page 8461

హీరో అవతారం ఎత్తిన క్రికెటర్ హర్భజన్ సింగ్


హర్భజన్ సింగ్. ఈ పేరు తెలియని క్రికెట్ ఫ్యాన్స్ ఉండరు. భారత జట్టు టాప్ స్పిన్నర్గా రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో వందల వికెట్లు పడగొట్టాడు. గింగిరాలు తిరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను వణికించాడు. ఎన్నో మ్యాచ్‌ల్లో ఒంటిచేత్తో భారత్‌కు విజయాలు అందించాడు. అయితే, కుర్రాళ్లతో పోటీ పడలేక జాతీయ జట్టుకు దూరమైన ఈ వెటరన్ ఆఫ్ స్పిన్నర్ ఐపీఎల్‌లో ఆడుతూ అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. 39 ఏళ్ల వయసులోనూ టీమిండియాలో రీఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. బాలీవుడ్ నటి గీతా బస్రాను పెళ్లి చేసుకొని ఇప్పటికే తండ్రి కూడా అయ్యాడు.

క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించకముందే భజ్జీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. నటుడిగా కొత్త అవతారం ఎత్తాడు. అతను హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ఫ్రెండ్ షిప్’. తమిళ బిగ్బాస్ ఫేమ్ లోస్లియా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో యాక్షన్ కింగ్‌ అర్జున్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. హిందీ, తమిళ్ సహా పలు భాషల్లో ఆగస్టులో విడుదల చేయనున్న ఈ చిత్రానికి జీన్‌ పాల్ రాజ్, శామ్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. మూవీ మోషన్ పోస్టర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. బ్యాగ్రౌండ్‌లో లైబ్రరీ హాల్‌ను చూపిస్తూ భజ్జీ, అర్జున్, లోస్లియా లుక్‌ రివీల్ చేశారు. ముగ్గురూ కాస్త సీరియస్‌గా కనిపిస్తున్నారు. మరి,క్రికెట్‌ ఫీల్డ్‌లో అదరగొట్టిన హర్భజన్‌ వెండితెరపై ఎలాంటి మ్యాజిక్‌ చేస్తాడో చూడాలి.

ఈ బూతు పురాణానికి కారణం ఎన్టీఆరే !


ప్రతి మహిళనూ నోరారా ‘అమ్మా’ అని సంబోధిస్తూ మహిళలను గౌరవించే జూనియర్ ఎన్టీఆర్ మీరాచోప్రా విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నాడని సగటు ప్రేక్షకుడికి కూడా సందేహం కలుగుతున్న మాట వాస్తవం.
ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ‘బంగారం’ సినిమాతో పాటు చాలా సినిమాలు చేసినా రాని పాపులారిటీ ఈ ఫేడ్ అవుట్ బ్యూటీకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై పోరాటంతో జాతీయ స్థాయిలో వచ్చేసింది. వివాదం పై మంత్రి కేటీఆర్ సైతం స్పందించడం, సైబర్‌ సెల్ పోలీసులు సైతం ద‌ర్యాప్తు చేస్తూ విచారణ జరుపుతూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై ఇప్పటికే ఐటీ చట్టంలోని సెక్షన్ల కింద కేసులు నమోదు చేసాక కూడా, ఎన్టీఆర్ మౌనాన్ని విడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

అయినా, మీరా చోప్రా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య వాగ్వాదాల బూతు పురాణం పై ఢిల్లీ స్థాయిలో చర్చ జరుగుతున్నా, రాష్ట్ర ప్రభుత్వాల స్పందన తెలిపే వరకూ వచ్చాక కూడా అసలు ఎన్టీఆర్ స్పందించకపోవడం ఏమిటి ? నిజానికి వివాదం మొదలైన మొటిరోజే.. మీరా చోప్రా, ఫ్యాన్స్ పై ముందుగా ఎన్టీఆర్ కే పిర్యాదు చేసింది. అప్పుడే తారక్ స్పందించి ఈ వివాదాన్ని ముగించి ఉంటే, ఇంత రచ్చ జరిగి ఉండేదా ? నిజమే, ఏ స్టార్ హీరో లక్షల మంది అభిమానులను నియంత్రణలో పెట్టలేరు. కానీ, ఒక మహిళ పై మానసిక దాడి తప్పు అని చెప్పడానికి ఏమైంది ? చెప్పలేదు అంటే మీరాచోప్రా పై ఎన్టీఆర్ కూడా అదే బావనతో ఉన్నాడా ?

నిజానకి జరిగింది ఏమిటంటే, మహేష్ ఫ్యాన్స్ తారక్ పై చేసిన ట్రోలింగ్‌ ని మీరాచోప్రా లైక్ చేసింది. దాంతోనే ఎన్టీఆర్ అభిమానులు తీవ్రంగా ప్రవర్తించి అసభ్య పదజాలం వాడారు. కాబట్టి, ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ కే సపోర్ట్ చేస్తున్నాడా ? పోలీసులు, కేసులు వరకూ వెళ్ళాక కూడా ఎన్టీఆర్ ఇంకా మౌనమే వహిస్తే అలాగే అనుకోవాల్సి ఉంటుందిగా. సాధారణంగా ఇటువంటి వాటికి ఎన్టీఆర్ స్పందించరని, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఈ విషయం ఇప్పుడు సాధారణమైనది కాదు, ఎన్టీఆర్ సైతం ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చినా ఆగని స్థాయికి వెళ్ళిపోయింది. ‘మీటూ’ అనే ట్యాగ్ లేదు గాని, ఆ రేంజ్ లోనే సాగుతుంది ఈ వివాదం. ఒక్కటి మాత్రం నిజం ఎన్టీఆర్ మౌనమే దీనికి కారణం. మరి ఎన్టీఆర్ దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.

అవి పక్కన పెడితే ‘దిల్ రాజు’కే మంచిది !

Dil Raju


ప్రస్తుత తెలుగు సినిమాకి  ఈ తరం సినిమా నిర్మాణానికి  విలువైన గౌరవం తెచ్చిన వ్యక్తి నిస్సందేహంగా దిల్ రాజే.  దిల్ రాజు అఫీస్ అంటేనే  ఓ మినీ సినీ పరిశ్రమ. సరైన కథలను ఎంచుకోవడంలో  కొత్త టాలెంట్ ను  పట్టుకోవడంలో దిల్ రాజు  ప్రతిభ అపారమైనది. ఏకంగా మోదీనే ప్రత్యేకంగా ఆహ్వానం పంపించేంత స్థాయిలో   పేరు ప్రఖ్యాతలు సంపాధించుకున్న  దిల్ రాజుకి  ఈ మధ్య  ఏమైంది ? ఒకప్పుడు దిల్ రాజు,  వేరే సినిమాని కొన్నాడు అంటే,  ఇక ఆ సినిమా సూపర్ హిటే. అందుకు తగ్గట్లుగానే గతంలో  ‘తెలుగు సినిమా బాక్సాఫీస్’ డిజాస్టర్లతో కొట్టు మిట్టాడుతున్న టైంలో కూడా.. దిల్ రాజు  ఓ సూపర్ డూపర్  హిట్ తో ఇండస్ట్రీకే ఊరటనిచ్చేవాడు.  కానీ ప్రస్తుతం అందుకు పూర్తి విరుద్ధంగా సాగుతుంది.  ఈ మధ్య  దిల్ రాజు జడ్జిమెంట్ గాడి తప్పింది. గత ఏడాది చేసిన ‘లవర్, శ్రీనివాసకళ్యాణం’ లాంటి సినిమాలే అనుకుంటే.. ఆ మధ్య ఎవ్వరికీ చెప్పొద్దు, అని ఓ విషయం లేని సినిమాని దిల్ రాజు సమర్పించాడు.

అలాగే పూర్తిగా తేలిపోయిన ‘ఆవిరి’ సినిమా  కూడా దిల్ రాజే ప్రేక్షకులకు అందించాడు.  ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ దెబ్బకే  దిల్ రాజు  నేమ్ డామేజ్ అయిందనుకుంటే.. ‘ఆవిరి’ దెబ్బతో  దిల్ రాజు విజయ పరంపరకే పూర్తిగా పంచర్లు పడింది. కాగా తాజాగా అలాంటి విషయం లేని సినిమానే అబ్లికేషన్ తో మరొకటి రిలీజ్ చేస్తున్నాడట. అల్లు అరవింద్, అశ్వనీదత్ లాంటి అగ్ర నిర్మాతలు సైతం  అసూయ పడేలా సక్సెస్ లు సాధించిన దిల్ రాజు,  చివరికీ ‘ఆవిరి’ లాంటి చిత్రాలతో ఇలా తేలిపోతే,  ఇక దిల్ రాజు నిర్మించుకున్న  ఆ ప్రత్యేక స్థానం స్థానభ్రంశం అవ్వడం ఖాయం. అందుకే ఇకనైనా దిల్ రాజు ఆవిరైపోయే లాంటి సినిమాలు పక్కన పెడితే  ఆయనకే మంచిది.

హిట్లు కోసం హీరోల పాట్లు !


సినీ పరిశ్రమలో టాలెంట్ కంటే.. సక్సెస్ కే స్టార్ డమ్ ఎక్కువ. అక్కడ హిట్ ఉంటే కమెడియన్ కూడా హీరో అయిపోతాడు, అదే హిట్ లేకపోతే హీరో కూడా కమెడియన్ గా మారిపోతాడు. ఏమైనా హిట్ ఉంటేనే వాల్యూ. అందుకే ప్రతి ఒక్క హీరో హిట్ ఊహల్లోనే ఉగిపోతుంటాడు. కానీ చాలా కాలం నుంచి హిట్ కోసం ఫైట్ చేస్తూ, హిట్ కొట్టలేక బాక్సాఫీస్ వద్ద పడిగాపులు కాస్తోన్న హీరోలు మన టాలీవుడ్ లో కనిపిస్తారు. నాగార్జున, రవితేజ దగ్గరనుంచీ గోపీచంద్, నితిన్, అఖిల్ మీదుగా నారా రోహిత్, రాజ్ కిరణ్, అల్లరి నరేష్ దాకా.. ఇలా చెప్పుకుంటూ పోతే నలుగురు ఐదుగురు హీరోలు తప్ప అందరూ ఈ లిస్ట్ లోని సభ్యులే. ఒక్కప్పుడు తోటి హీరోలు అసూయ పడేలా వరుసగా హిట్స్ మీద హిట్స్ కొట్టిన అల్లరోడు.. ప్రస్తుతం హిట్ లేక ప్లాప్ ల వలయంలో మునిగితేలుతున్నాడు. అలాగే అప్పట్లో ‘ప్లాప్ హీరో’కి పర్యాయ పదంగా మారిపోయిన గోపీచంద్.. ఎట్టకేలకూ మళ్లీ మినిమమ్ గ్యారింటీ హీరోగా చలామణి అవుతున్న టైంలో భారీ డిజాస్టర్లతో మళ్లీ డీలా పడ్డాడు.

ఇక హీరో మంచు విష్ణుకి అయితే ఈ మధ్య ప్లాప్ లు తప్ప హిట్లు అస్సలు రాను అంటున్నాయి. మూడు సినిమాలు చేసినా అక్కినేని అఖిల్ ఖాతాలో ఇంకా ఏవరేజ్ హిట్ కూడా లేకపాయే. రవితేజ గురించి చెప్పుకుంటే మధ్యలో ‘రాజా ది గ్రేట్’ తప్ప ఆ సినిమాకి ముందు చేసిన బెంగాల్ టైగర్, కిక్ 2, ఆ సినిమా తరువాత చేసిన ‘టచ్ చేసి చూడు’, ‘నేల టిక్కెట్టు’, ‘అమర్ అక్బర్ ఆంటోని’ ‘డిస్కో రాజా’ ఇలా అన్ని బెస్ట్ ప్లాప్ లే. నాగార్జున చేసిన చివరి నాలుగు సినిమాలు అత్యున్నతమైన డిజాస్టర్లు. బాలయ్య బాబు కూడా ‘కథానాయకుడు, మహానాయకుడు’లతో పూర్తిగా మునిగిపోయాడు. ఇలా ప్రస్తుతం టాలీవుడ్ లో ఎన్టీఆర్, మహేష్, ఎఫ్ 2తో వెంకటేష్, భీష్మతో నితిన్ లాంటి కొంతమంది హీరోలు తప్ప మిగిలిన వాళ్ళంతా హిట్లు కోసం పాట్లు పడుతున్న వారే.

జగన్ డేరింగ్ కు బిత్తరపోయిన మోడీ, కేసీఆర్


దేశాన్ని పాలిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేతులెత్తేసింది.. కరోనా-లాక్ డౌన్ తో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టలేకపోయింది. ఆదాయం లేక దేశ ఖజానా ఖాళీ అయ్యింది. దీంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన ప్రకటన చేసింది. కొత్త పథకాలు ఇకపై ఉండవని.. భవిష్యత్తులోనూ రూపొందించే ప్రసక్తి లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో పొదుపు చర్యల్లో భాగంగా ఖర్చును తగ్గించుకునే క్రమంలో ఈ ఏడాది ఎలాంటి కొత్త పథకాలు అమలు చేయమని కేంద్ర ఆర్థిక శాఖ కుండబద్దలు కొట్టింది.

కొత్త పథకాలకు రాంరాం పలికిన కేంద్రం ఉన్న వాటిని కూడా రాష్ట్రాలకే అప్పగించి వాటిపై భారం మోపడంపై అన్ని రాష్ట్రాల సీఎంలు మండిపడుతున్నారు. ఈ ఫిబ్రవరిలో మోడీ సర్కార్ బడ్జెట్ లో ప్రకటించిన కేంద్రం పథకాలన్నీ మార్చి 31వ తేదీ వరకే ఆపేస్తున్నామని.. బడ్జెట్ లో ఈ ఏడాది ప్రకటించిన ఏ కొత్త పథకాలు ఇక నుంచి కొనసాగించమని కేంద్రం చేసిన ప్రకటన అందరినీ అవాక్కయ్యేలా చేసింది.

కేంద్రం చేతులెత్తేసినా ఏపీ సీఎం జగన్ మాత్రం మొండి ధైర్యంతో ఏపీ ప్రజలకు సేవలందించేందుకు ముందుకెళ్తుతున్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో పోలిస్తే సీఎం జగన్ ను మెచ్చుకోకుండా ఎవరూ ఉండలేరు. ఒకవైపు కరోనా విపత్తు ఉన్నా దేశంలోనే అత్యధిక టెస్టులు చేస్తూ ఏపీని శిఖరాగ్రాన జగన్ నిలిపారు. మరోవైపు లోటు బడ్జెట్ వెక్కిరిస్తున్నా.. ఏపీ ప్రజలకు తాను ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాల విషయంలో ఎలాంటి లోటు రాకుండా ముందుకు వెళుతున్నారు.కరోనా విపత్తుతో సంబంధం లేకుండా ఇంతటి కష్టకాలంలోనూ జగన్ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఏపీ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ వారి మనసులు దోచుకుంటున్నారు.

ఇంతటి కరువులో పక్కరాష్ట్రంలో తెలంగాణలో ఉద్యోగులకు సగం జీతాలిస్తున్నారు దేశంలోనే ధనిక రాష్ట్రం సీఎం కేసీఆర్. కానీ ఏపీ సీఎం జగన్ మాత్రం ఫుల్ జీతాలు ఇస్తూ నిన్నటికి నిన్న వాహనమిత్ర పథకం కింద ఏకంగా డ్రైవర్లకు రూ.10వేలు చొప్పున వారి ఖాతాల్లో జమ చేసి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు.

కేంద్రం తన నిధులను పొదుపుగా వాడుకుంటూ బడ్జెట్ లో మార్చిలో ప్రకటించిన కొత్త పథకాలకు కూడా మంగళం పాడి ఆడిన మాట తప్పింది. కానీ కేంద్రం, తెలంగాణ కంటే దుర్భర లోటు బడ్జెట్ లో ఉన్న ఏపీ ఆర్థిక వ్యవస్థకు వెరవకుండా సీఎం జగన్ నవరత్నాలతోపాటు మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తూ.. ఎక్కడా ఎవరికి కోత రాకుండా పేదలకు ఇంతటి విపత్తులోనూ పథకాలను అందిస్తుండడం చూసి దేశమే ఆశ్చర్యపోతోంది. జగన్ పాలనతీరుకు ప్రశంసలు కురిపిస్తోంది. కరోనా విపత్తు సమయంలోనూ సీఎం జగన్ సంక్షేమ క్యాలెండర్ ను రిలీజ్ చేసి తాను హామీనిచ్చిన ఏ పథకాన్ని జాప్యం చేయకుండా అమలుకు కంకణం కట్టుకున్న తీరు చూసి సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

–నరేశ్ ఎన్నం

జగన్ కొత్త నిర్ణయాలైన ఫలితాన్నిస్తాయా?


రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇసుక సరఫరా విషయంలో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. టీడీపీ ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసిన వైసీపీ ప్రభుత్వం గత ఏడాది కొత్త విధానాన్ని వెంటనే అమలలోకి తీసుకురాకపోవడం వల్ల ప్రభుత్వం అబాసుపాలయ్యింది. పనులు దొరకక భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అనంతరం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ విధానంలో ఇసుక సామాన్యులకు అందుబాటులో లేదు. ఈ అంశంపై ప్రతి పక్ష పార్టీలు ప్రభుత్వ తీరును తప్పుబట్టాయి. ఆందోళనలు చేపట్టాయి.

గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సైతం బుకింగ్ కు, సరఫరాకు మధ్య 2 లక్షల టన్నుల వ్యత్యాసం ఉన్నట్లు గుర్తిచామని తెలిపారు. మరోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వ విధానాన్ని తప్పుబడుతున్నారు. నాడు – నేడు కార్యక్రమం పనులకు ఇసుక దొరకడం లేదని, సామాన్యులకు సైతం గుప్పెడు ఇసుక ఇవ్వలేకపోతున్నామని వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వాపోయారు. రేవులో బయలుదేరిన ఇసుక వాహనాలు వినుకొండ రాకుండా మధ్యలో ఎటువెళుతున్నాయనేది తెలియడం లేదన్నారు.

ఈ నేపథ్యంలో ఇసుక విధానాన్ని చక్కదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గ్రామ‌, వార్డు స‌చివాలయాల ద్వారా ‌ఇసుక బుకింగ్ చేసుకునే అవ‌కాశం ప్ర‌జ‌ల‌కు క‌ల్పించాల‌ని, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బల్క్‌ ఆర్డర్లకు అనుమతుల వల్ల ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని భావిస్తున్న ప్రభుత్వం ఈ అంశాన్ని జేసీకి అప్ప‌గించనుంది. పోర్టల్‌ నుంచి బల్క్‌ ఆర్డర్లను తొలగించనున్నారు. నియోజక వర్గానికి ఒకటే రేటు ఉండేలా చూడడం, చిన్న చిన్న నదుల నుంచి పక్కనే ఆనుకుని ఉన్న గ్రామాలకు ఎడ్లబళ్ల ద్వారా సొంత అవసరాలకు ఉచితంగా ఇసుకను తీసుకెళ్లడానికి అనుమతి ఇవ్వడం వంటి చర్యలకు ప్రభుత్వం అనుమతించింది. తాజాగా సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయాలు ఎంత ఫలితాన్ని ఇస్తాయనేది వేచిచూడాల్సిందే.

చిరంజీవి బాటలో మహేష్ ఫ్యామిలీ..


మొన్న చిరంజీవి.. నేడు మహేష్ బాబు ఫ్యామిలీ.. ఇలా వరుసగా ఏపీ సీఎం జగన్ కు జై కొడుతున్నారు. టాలీవుడ్ ను ఆకర్షించడంలో ఏపీ సీఎం జగన్ ప్రయత్నాలు, కృషి ఫలిస్తున్నాయి. వైయస్ జగన్ తో సూపర్ స్టార్ ఫ్యామిలీ చేతులు కలిపింది. సీఎం జగన్ పాలనకు ఒక్కొక్కరుగా సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ఫిదా అయిపోతున్నారు. సీఎం జగన్ తీసుకున్న సంచలన నిర్ణయాలు.. పేదల కోసం కమిట్మెంట్ తో పనిచేస్తున్న తీరు చూసి సినీ ప్రముఖులంతా జగన్ బాట పడుతున్నారు.

ఒకప్పుడు ఇండస్ట్రీ అంటే టిడిపికి పేటెంట్ హక్కుగా ఉండేది. నాడు మహా నటుడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ కావడం చాలా మంది హీరోలను ఆ పార్టీలో ఎమ్మెల్యేలు ఎంపీలు గా చేయడం వలన సినిమా ఫ్లేవర్ టిడిపిలోనే కనిపించేది. టీడీపీని చంద్రబాబు లాక్కున్నాక కూడా సినీ ఇండస్ట్రీకి పెద్దపీట వేశారు. నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యే గా ఉండడంతో సినిమా ఇండస్ట్రీ అంతా చంద్రబాబుతో సన్నిహితంగా ఉండేవారు.చిరంజీవి కుటుంబంతో సహా మిగతా కుటుంబాలన్నీ టీడీపీకి సాహిత్యంగా ఉండేవి.

కానీ ఇప్పుడు ఆ వ్యవస్థను అంతా సీఎం జగన్ పూర్తిగా మార్చేసారు. టీడీపీకి సినిమా ఇండస్ట్రీ ని దూరం చేసే పనిలో పడ్డారు సీఎం జగన్. ఇప్పుడు ఒక సూపర్ స్టార్ ని ఇందుకోసం వాడేస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ సినిమా వాళ్ళు ఏమి అడిగినా ఏపీ ప్రభుత్వంలో జగన్ పని చేయిస్తున్నారు. ఇన్నాళ్లు చంద్రబాబు సినిమా ఇండస్ట్రీని తన పార్టీ కోసం వాడుకున్నా… ఇండస్ట్రీకు పెద్దగా చేసిందేమీ లేదు. కానీ జగన్ అటు ఇండస్ట్రీకి పరిశ్రమ పరంగా.. ఇటు ప్రముఖులకు వ్యక్తిగతంగా కూడా సహాయం చేస్తున్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణలో సినీ ఇండస్ట్రీకి పెద్ద పీట వేస్తుండగా…. ఆంధ్ర సీఎం జగన్ ఇక్కడ సినిమా ఇండస్ట్రీ ప్రముఖులకు పెద్ద పీట వేస్తున్నారు. దీంతో టాలీవుడ్ పెద్దలు కూడా ఇప్పుడు తమ నిర్ణయాలు మార్చుకుంటున్నారు.

ఇన్నాళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి సీఎం జగన్ కు ఇండస్ట్రీలో ఎమ్మెల్యే రోజా మాత్రమే మద్దతుగా ఉన్నారు. ఇండస్ట్రీలోని హీరో నాగార్జున కుటుంబంతో ఎప్పటినుంచో జగన్ కు సాహిత్యం ఉంది. నిర్మాత,.జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాస్ కూడా జగన్ కు జైకొట్టి మద్దతు పలికారు. జగన్ సీఎం అయ్యాక మెగాస్టార్ చిరంజీవిని సైతం సీఎం జగన్ తన వైపు మళ్లేలా చేసుకున్నారు. చిరంజీవి సైరా సినిమా కి ప్రోత్సహించడంతో పాటు తెలుగు సినిమా షూటింగ్ లకు చిరంజీవి కోరగానే ఏపీలో ఉచితంగా అనుమతి ఇస్తూ జగన్ జీవో జారీ చేశారు. దీంతో సినిమా ఇండస్ట్రీ మొత్తం సీఎం జగన్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి సతీసమేతంగా సీఎం జగన్ ఇంటికి వచ్చి ఆతిధ్యం స్వీకరించారు. ప్రతి వేదిక పైన సందర్భం వచ్చినప్పుడల్లా చిరంజీవి సీఎం జగన్ ను ప్రశంసిస్తున్నారు. జగన్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పవన్ కళ్యాణ్ కు భిన్నమైన వైఖరి తీసుకొని చిరంజీవి మాత్రం అద్భుతంగా పనిచేస్తున్నారంటూ జగన్ ను ప్రశంసిస్తున్నారు.. ఇప్పుడు ఆ కోవలోకి మహేష్ బాబు కుటుంబం కూడా చేరిపోయింది.

మహేష్ బాబు బావ, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఆ కుటుంబం షాక్ ఇచ్చింది. వాస్తవానికి మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ -విజయ నిర్మలలు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని అత్యంత అభిమానిస్తారు. ఎప్పుడూ వైయస్సార్ కి మద్దతుగా నిలిచారు. అయితే 2014 ఎన్నికల్లో మహేష్ బాబు ఫ్యామిలీ గల్లా జయదేవ్ కుటుంబం టిడిపిలో చేరారు. గల్లా జయదేవ్ ప్రస్తుతం గుంటూరు టిడిపి ఎంపీగా ఉన్నారు. అయితే ఎన్నికలకు ముందు వరకు మహేష్ బాబు చిన్నాన్న ఘట్టమనేని ఆదిశేషగిరిరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. ఎన్నికల సమయంలో టికెట్ రాలేదని తిరిగి టిడిపిలోకి చేరిపోయారు. దాంతో మహేష్ బాబు కుటుంబం అంతా టీడీపీకి మద్దతు ఇచ్చింది. కానీ ఇప్పుడు ఏడాది తిరక్కముందే సీఎం జగన్ పనితీరుతో మహేష్ బాబు కుటుంబం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళింది.

గతంలో మహేష్ బాబు భార్య నమ్రత స్వయంగా వచ్చి వైఎస్ భారతి తో భేటీ అయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ సొంత ఊరు బుర్రిపాలెం గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు. మహేష్ బాబు భార్య కోరగానే వైయస్ భారతి అంగీకరించడం.. ఆ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకు వెళ్లడం ఆ గ్రామానికి నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్లకు మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా విషయంలో కూడా మహేష్ బాబు సీఎం జగన్ సహాయాన్ని కోరారు. అది కూడా జగన్ అంగీకరించడం బాగా కలెక్షన్స్ రావడంతో మహేష్ బాబు కుటుంబం కూడా సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మంచితనానికి ఫిదా అయింది.

సూపర్ స్టార్ కృష్ణ తమ్ముడు మహేష్ బాబు చిన్నాన్న ఘట్టమనేని ఆదిశేషగిరిరావు తిరిగి టీడీపీనీ వీడి మళ్లీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి చేరారు.. మళ్లీ పాత పద్ధతులు మాదిరిగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ్ సాయి రెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. దీంతో మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా మద్దతు ఉంది అన్న విషయం స్పష్టమైపోయింది.

నెరవేరిన వైద్యుడు సుధాకర్ కోరిక..!


ప్రభుత్వ మత్తు వైద్యుడు సుధాకర్ ఎట్టకేలకు విశాఖ మానసిక వైద్యశాల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సుధాకర్ తల్లి కావేరిబాయి దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టుకు సుధాకర్ ను పోలీసులు, సిబిఐ అరెస్ట్ చేయలేదని ప్రభుత్వం తెలిపింది. దీంతో అతను డిశ్చార్జ్ అవ్వాలనుకుంటే ఆసుపత్రి నిబంధనల ప్రకారం అవ్వచ్చని సూచిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో సుధాకర్ విశాఖ మానసిక ఆసుపత్రి సూపరింటెండెంట్ కు తాను డిశ్చార్జి అవుతానని దరఖాస్తు చేశారు. దరఖాస్తు పరిశీలించిన సూపరింటెండెంట్ డిశ్చార్జ్ అయ్యేందుకు అనుమతి ఇచ్చారు.

దీంతో మానసిక ఆసుపత్రికి సుధాకర్ కుటుంబ సభ్యులు వచ్చి ఆయనను తీసుకువెళ్లారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులకు ఆసుపత్రి వైద్యులు కొన్ని సూచనలు చేశారు. సుధాకర్ కు మరికొన్ని రోజులపాటు చికిత్స కొనసాగించాల్సిన అవసరం ఉందని వేరే ఆసుపత్రిలోనైనా చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచించారు. అనంతరం కుటుంబ సభ్యులు సుధాకర్ ను అక్కడి నుంచి తీసుకువెళ్లిపోయారు.

కరోనాను ఎదుర్కొనేందుకు మాస్కులు ఇవ్వడం లేదని ప్రభుత్వంపై విమర్శలు చేసిన మత్తు వైద్యుడు సుధాకర్ రావు తొలుత ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అనంతరం గత నెల 16వ తేదీన విశాఖ నగర వీధుల్లో డా.సుధాకర్ ను పబ్లిక్ ప్లేస్ లో న్యూనెన్స్ చేస్తున్నాదంటూ తాటిచెట్లపాలెం పోర్టు ఆస్పత్రి వద్ద తాళ్లతో కట్టేసి పోలీసులు లాఠీలతో దారుణంగా కొట్టిన 4వ టౌన్ పోలీసులు స్టేషన్ కు తరలించి, అనంతరం అక్కడి నుంచి విశాఖ మానసిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తెలుగు మహిళ వి.అనిత హైకోర్టుకు లేఖ రాయడంతో సుమోటోగా కేసు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.

కొత్త ప్రపంచ వ్యవస్థ కావాలి 

కరోనా మహమ్మారి ప్రపంచ గతిని , స్థితిని సమూలంగా కదిలించింది. లక్షలమంది చనిపోవటంతో పాటు భవిష్యత్తు అందకారంగా మారింది. రాజకీయంగా ఎన్నో మార్పులకు గురవుతుంది. ఆర్ధికంగా ప్రపంచదేశాలు కోలుకోవటానికి ఎన్ని ఏళ్ళు పడుతుందో తెలియని పరిస్థితి. ఈ లోపల ప్రజల బతుకులు ఎలా ఉంటాయో ఎవరికీ అర్ధంకాని పరిస్థితి. ఇది పెను సంక్షోభం. ఈ మహమ్మారికి మందెట్లా లేదో ఈ పెను సంక్షోభం నుంచి కూడా అంతతేలికగా బయటపడే మార్గం కూడాలేదు. దీనిపై  కాలమే నిర్ణయించాలి. అయితే కొన్ని విషయాల్లో డీలా పడేదానికన్నా ధైర్యంగా ఎదుర్కోవటమే పరిష్కారం. ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఇటీవల మన ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రపంచ సమస్యలను సమర్ధంగా ఎదుర్కోవటానికి కొత్త ప్రపంచ వ్యవస్థ రావాల్సి వుంది. అది మానవ విలువులపై ఆధారపడి నిర్మించబడాలి అన్నాడు. ఈ వ్యాఖ్యానం లో ఎంతో అర్ధం దాగివుంది. ఇప్పుడున్న ప్రపంచ వ్యవస్థ ‘ ఐక్యరాజ్య సమితి ‘ విఫలమయ్యిందని చెప్పకనే చెప్పాడు. ఇందులో ఆశ్చర్యమేమీలేదు. గత దశాబ్దంలో ఎంతోమంది దేశాధినేతలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. చివరకు శాశ్వత సభ్యదేశాధి నేతలు పుతిన్ దగ్గర్నుంచి డోనాల్డ్ ట్రంప్ వరకు ప్రతిఒక్కరూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇందుకు కారణం ఐరాస తన విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చటంలో పూర్తిగా విఫల మయ్యిందనేది ఎక్కువమంది అంతర్జాతీయ నిపుణుల అభిప్రాయం. మన దేశ అనుభవం రీత్యాకూడా ఈ అభిప్రాయమే సరైనదని అనిపిస్తుంది.

ఐక్యరాజ్యసమితి పుట్టు పూర్వోత్తరాలు, తదనంతర పరిణామాలు  

రెండవ ప్రపంచ యుద్ధ నేపధ్యంలో ఏర్పడిన ఈ సంస్థ మొదటి ప్రపంచ యుద్ధ నేపధ్యం లో ఏర్పడిన నానా జాతి సమితి నుంచి గుణ పాఠాలు నేర్వలేదు. గెలిచినవాళ్ళు ప్రపంచాన్ని పంచుకోవటానికి అసమతుల్యంగా ఏర్పడిన సంస్థగానే రూపుదిద్దుకుంది.అయితే ఈసారి ప్రాశ్చాత్య కూటమి , కమ్యూనిస్టు కూటమి కలిసి అధికారం పంచుకుంది. ఈరెండు కూటములు కలిసి అయిదు దేశాలతో ( అందులో చైనా  కూడా అప్పటికి ప్రాశ్చాత్య కూటమి లో భాగమే )  వీటో పేరుతో ప్రపంచ రాజకీయాల్ని శాసించటం మొదలుపెట్టాయి. అయితే ఆ తర్వాత దశాబ్దాల్లో పరిస్థితుల్లో మార్పులొచ్చాయి. ఇప్పుడు ప్రత్యర్ధి రెండు కూటములు లేవు. ప్రచ్చన్న యుద్ధం నుంచి, ఏక శక్తి కేంద్రానికి, ఇప్పుడు అనేక శక్తి కేంద్రాలుగా మారటం జరిగింది. అప్పటి అయిదు దేశాలు అన్నీఇప్పుడు అత్యంత ప్రభావిత దేశాలు కావు. ఆ అయిదు శాశ్వత సభ్యదేశాలు ఈ రోజు వీటో అధికారం తో ప్రపంచ రాజకీయాల్ని శాసించటం మిగతా దేశాలకు నచ్చటం లేదు. భద్రతా సమితి లోని అయిదు శాశ్వత సభ్య దేశాల్లో మూడు దేశాలు ప్రాధాన్యాన్ని కోల్పోయాయి. అదేమిటో ఒక్కసారి పరిశీలిద్దాం.

జనాభా పరంగా చూస్తే, అత్యధిక జనాభా కలిగిన  5 దేశాల్లో  కేవలం 2 మాత్రమే ఇందులో వున్నాయి. ఆర్ధికపరంగా చూస్తే, మొదటి 5 దేశాల్లో కేవలం 2 మాత్రమే ఇందులో వున్నాయి ఖండాల పరంగా చూస్తే , కేవలం 10 శాతం జనాభా తో యూరప్ అయిదు శాశ్వత సభ్య దేశాల్లో మూడు స్థానాలు సంపాదించింది. అదే 60 శాతం జనాభా వున్న ఆసియా ఖండానికి ఒకే స్థానముంది. ఆఫ్రికా , దక్షిణ అమెరికాలకి అసలు చోటు లేదు.

మతపరంగా చూస్తే , మొత్తం అయిదు స్థానాల్లో నాలుగు ఒకే మతం మెజారిటీగా వున్న దేశాలే చోటు సంపాదించాయి. రెండో, మూడో అతి పెద్ద మతాలైన ఇస్లాం, హిందూ మతస్తులకు చెందిన దేశాలకు స్థానం లేదు. భాషాపరంగా చూస్తే , అత్యధికంగా మాట్లాడే అయిదు భాషాల్లో నాలుగు స్థానం సంపాదించాయి. మూడో అతిపెద్ద భాషయిన హిందుస్తానీ కి చోటు దక్కలేదు. ఆ విధంగా కూడా భారత్ కి అన్యాయం జరిగింది. నిధుల పరంగా చూస్తే , ఐక్యరాజ్యసమితి కి నిదులిచ్చే మొదటి అయిదు దేశాల్లో మూడింటికే చోటు చిక్కింది. రెండు, నాలుగు స్థానాల్లో వున్న జపాన్, జర్మనీ లకు స్థానం లేదు.డబ్బులు ఒకరివి షోకు ఇంకొకరిది గా వుంది. ఏ  ఏ విధంగా  చూసినా ఈ వీటో అధికారం అసంబద్ధంగా వుంది.

ఇక ఐక్యరాజ్యసమితి పనిచేసే కార్యాలయాలు, కేంద్రాలు చూసినా ఇది కేవలం యూరప్ కేంద్రంగా పనిచేసే సంస్థగా వుంది.అదేమిటో చూడండి.ప్రధాన అంగాలైన జనరల్ అసెంబ్లీ , భద్రతా సమితి, ఇంకా రెండు సంస్థలు న్యూయార్క్ నగరం లోనే వున్నాయి. మరో సంస్థ అంతర్జాతీయ న్యాయ స్థానం యూరప్ లోని హేగ్ నగరం లో వుంది.

అలాగే ఐక్యరాజ్యసమితికి సంబంధించిన మిగతా ప్రధాన కార్యాలయాలు జెనీవా,వియన్నా,నైరోబీలో వున్నాయి. మొదటి రెండు యూరప్ లో, మూడోది ఆఫ్రికాలో వుంది. వీటిల్లో న్యూయార్క్,జెనీవాలలో దాదాపు ఒక్కో దాంట్లో పదివేలమందికి పైగా పనిచేస్తుంటారు. మిగతా వాటిల్లో కూడా గణనీయమైన సంఖ్యలో సిబ్బంది పనిచేస్తున్నారు. ఆ స్థాయిలో వున్న ఒక్క కార్యాలయం కూడా ఆసియా ఖండపు దేశాల్లో లేదు.

ఐక్యరాజ్యసమితి కి వున్న 17 ప్రత్యేక సంస్థలూ (యునెస్కో , ప్రపంచ ఆరోగ్య సంస్థ లాంటి ) తమ ప్రధాన కార్యాలయాలను మూడు తప్ప అన్నింటినీ యూరప్ లోని దేశాల్లోనే నెలకొల్పాయి. మిగతా మూడింటిలో రెండు అమెరికా, ఒకటి కెనడాలో వున్నాయి.ఐక్యరాజ్యసమితి ఉప అంగమైన మానవ హక్కుల సమితి ని 2006 లో స్థాపించారు. అదీ యూరప్ లోనే పెట్టారు.

ఇవన్నీ 1945 లో స్థాపించిన వేవీ కాదు. ఆ తరవాత ఎన్నో సంస్థలు స్థాపించారు. ఇవి వికేంద్రీకరించకుండా యూరప్ లోనే  పెట్టటం లో అంతర్యమేమిటి ?

అన్ని దేశాల్లోకి ఎక్కువగా దాదాపు 22 శాతం నిధుల్ని అమెరికానే ఖర్చుచేస్తుంది. అయినా ఐరాస వ్యవహారంపై పూర్తి అసంతృప్తిగా వుంది. యునెస్కో నుంచి ఎప్పుడో వైదొలగింది.  దానికి నిధులు ఇవ్వటం మానేసింది. మానవ హక్కుల సమితి నుంచి కూడా ఇటీవల వైదొలగింది.  వాస్తవానికి మానవహక్కుల సమితి మనకు వ్యతిరేకంగా కూడా మాట్లాడుతుంది. అది పూర్తిగా పశ్చిమ ఆసియా , ఆఫ్రికా దేశాల సంస్థగా మారిపోయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చైనా 10 లక్షల ముస్లింలను నిర్బంధంలో ఉంచితే దానిపై నోరువిప్పదు. అదే భారత అంతరంగిక విషయాలపై లేనిపోని ఆరోపణలు చేస్తుంది.

ఐరాస లో భాగంకాకుండా ఎన్నో అంతర్జాతీయ సంస్థలు పనిచేస్తున్నాయి. ప్రపంచ వ్యాపార సంస్థ( WTO)  164 దేశాలతో 98 శాతం ప్రపంచ వ్యాపారాన్ని నియంత్రిస్తుంది. ఇది ఐరాసలో భాగం కాదు. అలాగే జి 7 , జి 20, ఒఇ సి డి , బ్రిక్స్ , ఎఫ్ఎటిఎఫ్ లాంటి ఉగ్రవాద వ్యతిరేక, అక్రమ నగదు చలామణి వ్యతిరేక సంస్థ , అలాగే పారిస్ వాతావరణ ఒప్పందం, అంతర్జాతీయ సోలార్ కూటమి లాంటి అనేక సంస్థలు, ఒప్పందాలు ఐరాస బయటనే వున్నాయి. వాటి భవిష్యత్తు ఐరాసతో ముడిపడి లేదు.

ఐరాస వైఫల్యాలు 

ఐరాస పటిష్టమైన ప్రపంచ సంస్థ కాదని మొదట్నుంచి విమర్శలున్నాయి. యోగ్యతలపై కాకుండా కొన్ని దేశాల కనుసన్నలలో పనిచేస్తుందనే ఆరోపణలు రోజు రోజుకీ ఎక్కువవుతున్నాయి. ఉదాహరణకు మన కాశ్మీర్ సమస్యనే తీసుకుందాం. భారత్ తమ భూభాగంపై కొంతమంది ఆదివాసులు, పఠాన్లు దాడిచేసి ఆక్రమించుకున్నారని దానికి పొరుగుదేశం పాకిస్తాన్ మద్దత్తు వుందని ఐరాస కి  కంప్లయింట్ చేస్తే ఆ భూభాగాన్ని మనకు తిరిగి ఇప్పించాల్సింది పోయి దురాక్రమణ దారున్ని, మనని కలిపి వివాదస్తులు గా మార్చి భారత్ కి అన్యాయం చేయటం తెలిసిందే. దానికి కారణం అప్పుడు ఐరాస బ్రిటీష్, అమెరికా కనుసన్నలలో పనిచేయటమే. అదే ఈ రోజు చైనాలోని జిన్జియాంగ్ ముస్లింల నిర్బంధం వ్యవహారం లో మిన్నకుండటం, దక్షిణ చైనాలో చైనా మిలిటరీ స్థావరాలు నిర్మించినా దానికి వ్యతిరేకంగా సమితి  ఆమోదించిన తీర్మానాన్నే అమలుచేయలేకపోవటం  చైనా ప్రభావం లో ఉండటమే.

అలాగే  ఉగ్రవాద మూకల్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ని కట్టడి చేయలేకపోవటం, సిరియా, యెమెన్ సంక్షోభంలో ప్రేక్షకపాత్ర వహించటం, ఇరాక్ పై అమెరికా దాడి చేసి సద్దాం హుసేన్ ప్రభుత్వాన్ని కూల్చటానికి చూపించిన కారణాలు అబద్ధమని తేలినా అమెరికా పై పల్లెత్తుమాట అనకపోవటం లాంటి అనేక సమస్యల్లో ఐరాస విఫలమైన సంగతి అందరికీ తెలిసిందే. అందుకే పలుదేశాధి నేతలు కొత్త ప్రపంచ వ్యవస్థ రావాలని కోరుకుంటున్నారు. విశేషమేమంటే అమెరికా కూడా ఐరాస పై గుర్రుగా వుంది. అదివరకటిలాగా తనమాట చెల్లకపోవటంతో అమెరికా కూడా ఈ వరసలో కొత్త ప్రపంచ వ్యవస్థ రావాలని కోరుకుంటుంది.

భారత్ ప్రయోజనాలకి వ్యతిరేకంగా చైనా  

1949 లో ప్రజా చైనా ఏర్పడినప్పటినుంచీ భారత్ చైనా అనుకూల వైఖరి తీసుకుంది. ఐరాస లో తైవాన్ స్థానంలో ప్రజా చైనా కు శాశ్వత సభ్యత్వం కావాలని కోరింది. అయినా చైనా ఎప్పుడూ మనకు వ్యతిరేకంగా పాకిస్తాన్ కి మద్దతిస్తూనే వచ్చింది. 1971 లో ఐరాస లో చేరిన దగ్గర్నుంచి కూడా ఇదేతంతు కొనసాగుతుంది. ఐరాస లో సంస్థాగత మార్పులకు ససేమిరా ఒప్పుకోవటంలేదు. రెండో అతి పెద్ద జనాభా కలిగి, అయిదో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా వున్న భారత్ కి భద్రతా సమితి లో శాశ్వత సభ్యత్వం రాకుండా మోకాలడ్డుతుంది. మనకి చెందిన పాక్ ఆక్రమిత భూభాగంలో ఆర్ధిక నడవా నిర్మిస్తుంది. మన భూభాగాన్ని అన్యాయంగా ఆక్రమించటమే కాకుండా ఎటువంటి అధికారం లేని పాకిస్తాన్ ద్వారా మరికొంత భూభాగాన్ని చేజిక్కించుకుంది. పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదులకు అంతర్జాతీయ సంస్థల్లో రక్షణ కల్పిస్తుంది.

ఈరోజు మనకొక అవకాశం వచ్చింది. చైనాకి వ్యతిరేకంగా ప్రాశ్చాత్య దేశాలు ముఖ్యంగా అమెరికా ముందుండి కొట్లాడుతుంది. ఇటీవలి పరిణామాల్లో ముఖ్యంగా కరోనా మహమ్మారి వ్యవహారంలో చైనా పాత్రపై ప్రపంచం మొత్తం గుర్రుగా వుంది. అదే సమయంలో చైనాకి ఐరాసలో వీటో అధికారం ఉండటంతో సంస్థాగత మార్పులకి ఎటువంటి అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో భారత్ ప్రయోజనాలు నెరవేరాలంటే మనమూ మిగతా దేశాలతో కలిసి కొత్త ప్రపంచ వ్యవస్థ నిర్మాణానికి కృషి చేయాలి. అందుకు ప్రస్తుత అమెరికా సానుకూల ధోరణిని ఉపయోగించుకో గలగాలి.  అయితే  అందులో చైనాతో సహా అన్నిదేశాలకు సమ న్యాయం జరినప్పుడే అది ఫలప్రదమవుతుంది. అది ఒక్క రోజులో జరిగేపనికాదు, ఇప్పట్నుంచీ జాగ్రత్తగా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ ముందుకు సాగాల్సివుంటుంది. ప్రపంచ చరిత్ర లో ఒకనాటి గౌరవాన్ని తిరిగి పునరుద్ధరించుకోవటమే ఆశయంగా భారత్ పనిచేస్తుందని ఆశిద్దాం.

కూతురు విద్యాతో లక్ష్మి మంచు క్యూట్ డాన్స్


లక్ష్మి మంచు తన కుమార్తె విద్యా నిర్వాణ తో కలిసి దిగిన ఫొటోస్ మరియు వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.
ఇటీవల, ఆమె తన కుమార్తెతో కలిసి చేసిన మరో డ్యాన్స్ వీడియోను ట్రెండింగ్  మ్యూజిక్ లో పోస్ట్ చేసింది.డ్యాన్స్ వీడియోను చూసిన అభిమానులు తల్లి కూతురు పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 

భర్త మర్మాంగాన్ని కోసి హత్య చేసిన భార్య..!


ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతుల మద్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. దీనికి తోడు ఇద్దరు మద్యానికి బానిసలుగా మారారు. భర్త వేధింపులు తట్టుకోలేక భార్య భర్తను కిరాతకంగా హతమార్చడం, అతని పురుషాగాన్ని కోసేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని టి.నరసాపురం మండలం మక్కినవారి గూడెంకు చెందిన కఠారి అప్పారావు, తెలంగాణ లోని దమ్మపేటకు చెందిన లక్ష్మి 15 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమార్తె కలిగింది. ఇద్దరికీ చదువు లేకపోవడంతో కూలి పనులు చేసుకుంటూ జీవితాన్ని గడపసాగారు.

కొంతకాలంగా భార్య,భర్తలు ఇద్దరు మద్యానికి బానిసలయ్యారు. ఫలితంగా ఇద్దరి మధ్య నిత్యం కుటుంబ కలహాలు చోటుచేసుకునేవి. మద్యం సేవించిన అనంతరం ఈ నెల 3వ తేదీన వాగ్వివాదం తెలెత్తింది. దీంతో లక్ష్మి మద్యం మత్తులో ఉన్న భర్తను ఇంట్లో ఉన్న నవ్వారు మంచానికి కట్టేసింది. అతని మెడకు తాడు బిగించి ఊపిరాడకుండా చేసింది. దీంతో అతను మృతి చెందాడు. అనంతరం భర్త మర్మాంగాన్ని కత్తితో కోసేసింది. నిందితురాలు పోలీసులకు లొంగిపోయింది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. టి. నరసాపురం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

బార్బర్ కూతురికి దక్కిన అరుదైన గౌరవం


ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచే ఐక్య రాజ్య సమితిలో 13ఏళ్ల బాలికకు ఓ అరుదైన అవకాశం దక్కింది. తమిళనాడుకు చెందిన నేత్రా మోహన్ దాస్(13) ఐక్యరాజ్య సమితి గుడ్ విల్ అంబాసిడర్ గా ఎంపికవడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. పేదరికాన్ని నిర్మూలించే ప్రతిష్టాత్మక కార్యక్రమానికి మెహన్ దాస్ ను గుడ్ విల్ అంబాసిడర్ గా నియమిస్తున్నట్లు ఐరాస అనుబంధ సంస్థ UNADAP వెల్లడించింది. దీంతో ఆమెకు ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగించే అరుదైన అవకాశం లభించనుంది. దేశ విదేశాల నాయకులు, విద్యావేత్తలు, రాజకీయ నేతలు, సాధారణ ప్రజలు పేదలకు సాయం చేసేలా మోహన్ దాస్ ప్రసంగం ఉండనుంది.

నేత్రా మోహన్ దాస్ తండ్రి మోహన్ తమిళనాడుకు చెందిన ఓ బార్బర్, అతను బార్బర్ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. దేశంలో కరోనా పరిస్థితులను చూసి చలించిన మోహన్ తన కుమార్తె చదువు కోసం కూడబెట్టిన రూ.5లక్షలు పేదలకు సాయం చేసేందుకు వినియోగించాడు. కూతురును సివిల్స్ చదివించేందుకు ఉపయోగించాల్సిన డబ్బులను పేదల కడుపులు నింపేందుకు ఉపయోగించడంపై పలువురు ఆయనను ప్రశంసించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల మన్ కీ బాత్ లో నేత్రా గురించి ప్రజలకు తెలియజేసి అభినందించారు.

తాజాగా మోహన్ దాస్ ఐరాస గుడ్ విల్ అంబాసిడర్ ఎంపికవడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఆమెకు ఈ అవకాశం దక్కింది. మోహన్ దాస్‌ త్యాగాన్ని గుర్తించిన డిక్సన్ స్కాలర్‌షిప్ ఆమెకు రూ.లక్ష స్కాలర్‌షిప్ ప్రకటించింది. ఐరాస గుడ్ విల్ అంబాసిడర్ గా మోహన్ దాస్ ఎంపికవడంతో ఆమెకు ఐరాస అసెంబ్లీ జనరల్ లో ప్రసంగించే అరుదైన అవకాశం దక్కనుంది.

పవన్ హీరోయిన్ ట్వీట్ కు స్పందించిన కేటీఆర్


గత రెండు మూడ్రోజులుగా సోషల్ మీడియాలో బాలీవుడ్ హీరోయిన్ మీరా చోప్రా, టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తోంది. ఇటీవల మీరా చోప్రా నెటిజన్లతో ట్వీటర్లో లైవ్ చాట్ చేసింది. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. మీకు తెలుగులో ఏ హీరో అంటే ఇష్టమని ఓ నెటిజన్ అడుగగా తనకు మహేష్ అంటే ఇష్టమని చెప్పింది. అలాగే ఓ నెటిజన్ ఎన్టీఆర్ గురించి అడుగగా తనకు ఎన్టీఆర్ కంటే మహేష్ ఇష్టమని చెప్పింది. తమ అభిమాన హీరో పేరు చెప్పకపోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీరా చోప్రాను విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. తనతోపాటు తల్లిదండ్రులను వ్యక్తిగత దూషించడంతో మీరాచోప్రా మానస్థాపం చెంది సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ తనపై అసభ్యంగా పెట్టిన కామెంట్లను స్క్రీన్ షాట్ తీసి పోలీసులకు ఆన్ లైన్లో కంప్లైంట్ చేసింది. అంతేకాకుండా ‘ఎన్టీఆర్ మీరు ఇలాంటి ఫ్యాన్స్ తో విజయవంతం అయ్యారా?’ అంటూ ఎన్టీఆర్ కు ట్వీట్ చేసింది. మీరు ఈ విషయంలో స్పందిస్తారని అనుకుంటున్నా.. అని మీరాచోప్రా ఎన్టీఆర్ కు ట్వీట్ చేసింది. అయితే ఈ ఇష్యూలో ఎన్టీఆర్ సైలంట్ అయ్యారు. ఆమె ట్వీట్ కు ఎలాంటి రిప్లయ్ ఇవ్వలేదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన కామెంట్లను సీరియస్ గా తీసుకున్న మీరాచోప్రా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కవితకు కూడా ట్వీట్ చేసింది. అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఏపీ శిశు శాఖ మంత్రికి ట్వీట్ చేసింది. ఈ వివాదంపై ఇప్పటికే మహిళా కమిషన్ ఎంట్రీ అవ్వడంతో వివాదం ముదిరిపోయింది.

తాజాగా మీరా చోప్రా ట్వీట్ పై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా చట్ట ప్రకారం నిందితులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ కు ఆదేశించినట్లు కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే మీరా చోప్రా చేసిన ట్వీట్స్ ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు సెక్షన్ 67ఐటీ యాక్ట్, 509 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మీరాచోప్రాపై అసభ్యంగా కామెంట్స్ చేసినవారి ట్విటర్ అకౌంట్స్, షేర్ చేసిన పోలీసులు గుర్తిస్తున్నారు. వీరిపై కేసులు నమోదుచేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొంటున్నారు. అయితే ఈ ఇష్యూపై ఇప్పటివరకు ఎన్టీఆర్ స్పందించకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ ట్వీటర్లో స్పందించి తన అభిమానులకు ఏదైనా సందేశం ఇస్తారా? లేదా అనేది వేచి చూడాల్సిందే..!

గ్యాంగ్‌ వార్‌ జరిగింది అందుకే..!


రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విజయవాడ గ్యాంగ్ వార్ కేసులో పోలీసులు విచారణ పూర్తి చేశారు. గ్యాంగ్‌ లీడర్‌ పండుతో సహా 13 మంది స్ట్రీట్‌ ఫైటర్స్‌ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టిన నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమల రావు సంఘటన వివరాలు వెల్లడించారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితులను గుర్తించామని త్వరలోనే మిగిలిన వారిని కూడా అరెస్ట్ చేస్తామని తెలిపారు. ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌ విషయంలోనే ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగిందని వెల్లడించారు. పండు గ్యాంగ్‌ జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడిన సందీప్‌ చనిపోయాడని, గతంలో పండు, సందీప్‌ మంచి స్నేహితులని చెప్పారు. ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌లోనే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని, యనమలకుదురు స్థల వివాదంలో పండు, సందీప్‌ల మధ్య ఘర్షణ తలెత్తడంతో ఈ గ్యాంగ్ వార్ చోటు చేసుకుందన్నారు. ప్రదీప్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డిల మధ్య అపార్ట్‌మెంట్‌ నిర్మాణంలో వివాదం తలెత్తిందని, శ్రీధర్‌రెడ్డి నుంచి రావాల్సిన వాటా కోసం ప్రదీప్‌రెడ్డి నాగబాబును ఆశ్రయించాడన్నారు. వివాదం పరిష్కారం కోసం గత నెల 29న సందీప్‌, పండును పిలిపించారని తెలిపారు.

నాగబాబు, సందీప్‌లు ఉండగా పండు రావడం ఇరువురికి నచ్చలేదని, దీంతో పండుకు వార్నింగ్‌ ఇవ్వాలని నిర్ణయించుకుని సందీప్‌ ఫోన్‌లో బెదిరించే యత్నం చేశాడన్నారు. సెటిల్‌మెంట్‌కు నువ్వు ఎందుకొచ్చావంటూ నిలదీయడం, 29న అర్థరాత్రి పండు ఇంటికెళ్లి సందీప్‌ బెదిరించడం జరిగిందన్నారు. ఆ తర్వాత 30న ఉదయం పండు అనుచరులు సందీప్‌ షాపుకు వెళ్లి, షాపులో ఉన్న సందీప్ అనుచరుడిని పండు గ్యాంగ్‌ కొట్టిందన్నారు. అనంతరం మాట్లాడుకుందాం అని పిలుచుకుని 31వ తేదీ సాయంత్రం ఇరువర్గాలు కొట్టుకున్నాయని, పోలీసులు వెళ్లేసరికి చాలా మంది గాయపడి ఉన్నారని చెప్పారు. నిందితుల కోసం 6 బృందాలుగా ఏర్పడి గాలించినట్లు, గ్యాంగ్‌ వార్‌లో వాడిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విజయవాడలో ఘర్షణ వాతావరణానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్‌ ఈ సందర్భంగా హెచ్చరించారు.

జనసేన మూల సిద్ధాంతం అదేనన్న పవన్..!


మానవజాతి సౌభాగ్యానికి పర్యావరణమే మూలమని ఈ విషయం గుర్తెరిగి పర్యావరణ పరిరక్షణ కోసం జనసేన కృషి చేస్తోందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. మానవ మనుగడకు ఆధారం పంచభూతాలని, నింగి, నీరు, నిప్పు, నెల గాలితో సమ్మిళితమైన పర్యావరణాన్ని పరిరక్షించుకున్నప్పుడే మానవజాతి శోభిల్లుతుందన్నారు. మన ఆరోగ్యం పర్యావరణంతోనే ముడిపడి వుందని చెప్పారు. చక్కటి పర్యావరణం వున్న చోట ఆసుపత్రుల అవసరమే ఉండదని నిపుణులు చెబుతున్నారని తెలిపారు.

జనసేన మూల సిద్ధాంతాలలో పర్యావరణానికి సముచిత స్థానం కల్పించిన సంగతి మీకు తెలిసిందేనని చెప్పారు. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానాన్ని జనసేన కాంక్షిస్తోందన్నారు. అందులో భాగంగానే “మన నది – మన నుడి” కార్యక్రమాన్ని చేపట్టింనట్లు చెప్పారు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జూన్ 5న జరుపుకుంటున్నామన్నారు. ఈ ఏడాదిలో పర్యావరణాన్ని పరిరక్షించుకోడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయించుకోవలసిన రోజు ఇదేనన్నారు. ప్రస్తుత పరిస్థితులు చక్కబడగానే “మన నది – మన నుడి” కార్యక్రమాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో ముందుకు తీసుకెళతామని తెలిపారు. పర్యావరణానికి హితమైన మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. పర్యావరణాన్ని విషతుల్యం చేసే పరిశ్రమలపై నిరసన గళం వినిపిస్తూనే ఉంటామని చెప్పారు. మనకు ఆరోగ్య ప్రదాయని అయిన పర్యావరణాన్ని ప్రతి ఒక్కరు పరిరక్షించాలని కోరారు. మన అడవులు, కొండలు, నదులను మనమే కాపాడుకోవాలన్నారు. పర్యావరణం మనకు కంటికి కనిపించని విలువైన సంపదని పేర్కొన్నారు. ఈ సంపదను మన భావితరాలకు అందించాలని సూచించారు. వారికి ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించాలని కోరారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ ప్రేమికులందరికీ శుభాభినందనలు తెలిపారు.

మోహరించిన సైన్యాలు.. భారత్-చైనా మధ్య ఉద్రిక్తత


అది 1962.. చైనా-భారత్ మధ్య యుద్ధం జరిగింది. అప్పుడు చైనా కూడా మనలాగే పేద దేశమే. కానీ మన భారత దేశ ప్రభుత్వం ఆ సమయంలో సరిగ్గా స్పందించలేదన్న అపప్రద ఉంది. యుద్ధ విమానాలు, సైన్యం మోహరింపులో నిర్లక్ష్యం కారణంగా నాడు ఆ యుద్ధంలో భారత్ ఓడిపోయిందన్న విమర్శలున్నాయి. దీంతో భారత్ ఈ యుద్ధంలో ఓడి పలు కీలక ప్రాంతాలను చైనా కోల్పోయింది. లడక్ ను ఆనుకొని ఉన్న ‘ఆక్సాయ్ చిన్’ ప్రాంతాన్ని చైనాకు కోల్పోవాల్సి వచ్చింది. నేపాల్ సరిహద్దుల్లో, టిబెట్ వద్ద కూడా భారత్ కీలక భూభాగాలను కోల్పోయింది.

ఇప్పుడు చైనాలో అదే ఆక్సాయ్ చిన్ గుండా పాకిస్తాన్ మీదుగా హిందూ మహాసముద్ర మార్గం గుండా ప్రపంచంలోనే అతిపెద్ద కారిడార్ నిర్మిస్తోంది. దీని ద్వారా చైనా తన వస్తు సామాగ్రిని హిందూ మహాసముద్రంలోకి నేరుగా పంపి అంతర్జాతీయ నౌక రవాణా మార్గాన్ని నిర్మిస్తోంది. ఆగ్నేయాసియా మొత్తం తిరిగి రావాల్సిన పని లేకుండా భారత్ నుంచి లాక్కున్న ఆక్సాయ్ చిన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ గుండా కరాచీ వరకు పెద్ద హైవే కారిడార్ ను చైనా నిర్మిస్తూ అంతర్జాతీయ వ్యాపారాన్ని తక్కువ ఖర్చుతో చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది.

భారత రక్షణకు పెనుముప్పుగా వాటిల్లుతున్న ఈ చైనా నిర్మిస్తున్న కారిడార్ ను భారత్ అడ్డుకుంటోంది. పనులు జరగకుండా అంతర్జాతీయంగా చైనాపై ఒత్తిడి తెస్తోంది.ప్రతిగా చైనా సరిహద్దుల్లో భారత్ భారీగా ప్రాజెక్టులు, నిర్మాణాలు చేపడుతోంది. దీంతో రగిలిపోతున్న చైనా ఏకంగా భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతోంది. 1962 తర్వాత భారత్-చైనాల మధ్య మరోసారి యుద్ధవాతావరణం కనిపిస్తోంది.

శనివారం చైనా-భారత్ దేశాల మధ్య కీలక సమావేశం జరుగుతోంది. ఈ మీటింగ్ లో భారత్ చైనా తన సేనల్ని ఆక్రమించిన భూభాగాన్ని ఖాళీ చేసి వెళ్లాలని డిమాండ్ చేయనుంది. ఇప్పటికే భారత్ తరుఫున లెఫ్ట్ నెంట్ జనరల్ వైకే జోషి లఢక్ చేరుకున్నారు. రెండు దేశాల మధ్య ఏం జరగనుందనేది ఆందోళన రేకెత్తిస్తోంది.

ప్రస్తుతం చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత తారాస్థాయికి చేరుకుంటోంది. కశ్మీర్ పక్కనున్న లఢక్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు భారత్-చైనా సైన్యాలు భారీగా మోహరించాయి. లఢక్ సమీపంలోని పాంగాంగ్, గాల్వాన్ లోయలో భారత్-చైనా ఆర్మీలు బాహాబాహీ తలపడేలా సీన్ ఉంది.పరిస్థితులు చూస్తే చైనా-భారత్ మధ్య యుద్ధ వాతావరణమే కనిపిస్తోందని సైనిక వర్గాలు అంటున్నాయి.

కరోనాతో కుదేలైన ఇరు దేశాలు యుద్ధానికి వెళితే అపారనష్టం ఖాయం. కానీ ఎవరూ కాంప్రమైజ్ కాకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గడిచిన రెండు రోజులుగా భారత సరిహద్దుకు చైనీస్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్లు యుద్ధ సన్నహాలు చేశాయి. భారత్ కూడా కార్గిల్ యుద్ధంలో గెలుపునకు తోడ్పడ్డ బోఫోర్స్ శతఘల్ని చైనా సరిహద్దులో దింపింది. ఇప్పటికే భారత భూభాగంలోని 50 కిలోమీటర్లను చైనా ఆక్రమించినట్టు తాజా రిపోర్టులో వెల్లడి కావడంతో భారత్ కూడా ధీటుగా స్పందిస్తోంది.

తాజాగా చరిత్రలో మొదటిసారి భారత్-చైనా రెండు దేశాల లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారులు శనివారం సమావేశం కాబోతున్నారు. అన్ని విధాలుగా చైనాను డిఫెన్స్ లో వేసేలా భారత్ ఎత్తుగడలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.

–నరేశ్ ఎన్నం