
ప్రస్తుత తెలుగు సినిమాకి ఈ తరం సినిమా నిర్మాణానికి విలువైన గౌరవం తెచ్చిన వ్యక్తి నిస్సందేహంగా దిల్ రాజే. దిల్ రాజు అఫీస్ అంటేనే ఓ మినీ సినీ పరిశ్రమ. సరైన కథలను ఎంచుకోవడంలో కొత్త టాలెంట్ ను పట్టుకోవడంలో దిల్ రాజు ప్రతిభ అపారమైనది. ఏకంగా మోదీనే ప్రత్యేకంగా ఆహ్వానం పంపించేంత స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాధించుకున్న దిల్ రాజుకి ఈ మధ్య ఏమైంది ? ఒకప్పుడు దిల్ రాజు, వేరే సినిమాని కొన్నాడు అంటే, ఇక ఆ సినిమా సూపర్ హిటే. అందుకు తగ్గట్లుగానే గతంలో ‘తెలుగు సినిమా బాక్సాఫీస్’ డిజాస్టర్లతో కొట్టు మిట్టాడుతున్న టైంలో కూడా.. దిల్ రాజు ఓ సూపర్ డూపర్ హిట్ తో ఇండస్ట్రీకే ఊరటనిచ్చేవాడు. కానీ ప్రస్తుతం అందుకు పూర్తి విరుద్ధంగా సాగుతుంది. ఈ మధ్య దిల్ రాజు జడ్జిమెంట్ గాడి తప్పింది. గత ఏడాది చేసిన ‘లవర్, శ్రీనివాసకళ్యాణం’ లాంటి సినిమాలే అనుకుంటే.. ఆ మధ్య ఎవ్వరికీ చెప్పొద్దు, అని ఓ విషయం లేని సినిమాని దిల్ రాజు సమర్పించాడు.
అలాగే పూర్తిగా తేలిపోయిన ‘ఆవిరి’ సినిమా కూడా దిల్ రాజే ప్రేక్షకులకు అందించాడు. ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ దెబ్బకే దిల్ రాజు నేమ్ డామేజ్ అయిందనుకుంటే.. ‘ఆవిరి’ దెబ్బతో దిల్ రాజు విజయ పరంపరకే పూర్తిగా పంచర్లు పడింది. కాగా తాజాగా అలాంటి విషయం లేని సినిమానే అబ్లికేషన్ తో మరొకటి రిలీజ్ చేస్తున్నాడట. అల్లు అరవింద్, అశ్వనీదత్ లాంటి అగ్ర నిర్మాతలు సైతం అసూయ పడేలా సక్సెస్ లు సాధించిన దిల్ రాజు, చివరికీ ‘ఆవిరి’ లాంటి చిత్రాలతో ఇలా తేలిపోతే, ఇక దిల్ రాజు నిర్మించుకున్న ఆ ప్రత్యేక స్థానం స్థానభ్రంశం అవ్వడం ఖాయం. అందుకే ఇకనైనా దిల్ రాజు ఆవిరైపోయే లాంటి సినిమాలు పక్కన పెడితే ఆయనకే మంచిది.