Home Blog Page 8460

కేటీఆర్ ను టార్గెట్ చేసిన కాంగ్రెస్


ఐటీ మంత్రి కేటీఆర్ కు వ్యతిరేకంగా హరిత ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసి రెండ్రోజులు గడుస్తున్నా టీఆర్ఎస్ నేతలు మాత్రం నోరుమెదపడం లేదు. దీంతో కాంగ్రెస్ నేతలు కేటీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు. హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా జనవాడలో కేటీఆర్ ఫాంహౌజ్ ను అక్రమంగా నిర్మించుకున్నార‌ని రేవంత్ రెడ్డి గతంలోనే ఫిర్యాదు చేశారు. 111 జీవోను ఉల్లంఘించి 25ఎకరాల్లో కేటీఆర్ విలాసవంతమైన భవనం నిర్మించుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తూ గ్రీన్ ట్రీబ్యునల్ ను ఆశ్రయించారు. దీనికి స్పందించిన ట్రీబ్యునల్ రెండ్రోజుల క్రితం కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. ఫౌంహౌజ్ ఇష్యూలో సక్రమంగా విచారణ జరుగాలంటే తక్షణమే కేటీఆర్ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.

కేటీఆర్ సతీమణి పేరిట 301, 302 సర్వే నెంబర్లలో భూమి ఉందని ఇందుకు సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయని రేవంత్ రెడ్డి వెల్లడించారు. వట్టినాగులపల్లి నుంచి గండిపేటకు నీరు వచ్చే కాల్వను కేటీఆర్ ఫాంహౌస్‌ దారి కోసం పూడ్చివేశారని ఆరోపించారు. ఈ విషయంపై తాము గ్రీన్‌ట్రిబ్యునల్‌కు వెళ్లగా ఎనిమిది మంది అధికారులతో గ్రీన్ ట్రిబ్యునల్ కమిటీ వేసిందని వారు గుర్తు చేశారు.

ఈ ప్రాంతంలోనే అర్చనా వెంచర్స్‌కు భూమి ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందులో కేటీఆర్‌కు వాటా ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో గతంలోనే కేటీఆర్ పేర్కొన్నారని తెలిపారు. తమ వద్ద తగిన ఆధారాలున్నాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కేటీఆర్ ఆ భూములను లీజులు తీసుకున్నట్లు చెబుతుండగా అందుకు సంబంధించి ఎన్నికల ఆఫిడవిట్ లో ఎందుకు పేర్కొనలేదని ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ అవినీతిపై పోరాడితే రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టారని తెలిపారు.

111 జీవోకు విరుద్ధంగా ఉన్నాయనని వేల ఇళ్లను కూల్చారని.. టీఆర్ఎస్ నేతల ఇళ్లను మాత్రం కూల్చలేదన్నారు. తక్షణమే ప్రభుత్వం 111 జీవోను సవరించాలని డిమాండ్ చేశారు. మెయినాబాద్, శంకర్ పల్లి ప్రజలకో న్యాయం.. కేటీఆర్ కో న్యాయమా? అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ ను తక్షణమే క్యాబినెట్ నుంచి తప్పించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.

భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..!


రెండున్నర నెలల విరామం అనంతరం దేవాదాయ ధర్మాదాయ శాఖ రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లో ప్రవేశానికి భక్తులకు అవకాశం కల్పించింది. ఈ మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అర్జునరావు శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. ఇందుకు ప్రత్యేకంగా నిబంధనలు స్పష్టం చేశారు. 12 పేజీలలో ఈ వివరాలు పేర్కొంటూ ఉత్తర్వులు విడుదల చేశారు. అన్ని దేవాలయాల్లో 8, 9 తేదీల్లో ఆలయ సిబ్బంది, స్థానికులతో ట్రయిల్ రన్ నిర్వహించనున్నారు.

10వ తేదీ నుంచి సాధారణ భక్తులను అనుమతించనున్నారు. ఇప్పుడు కరోనా కారణంగా భక్తులను సామాజిక దూరం పాటించడంతోపాటు మాస్క్ లు ధరించడం, మరికొన్ని ఇతర చర్యలు తీసుకోవాల్సి ఉంది, లేని పక్షంలో దేవాలయాల్లోకి అనుమతించారు. కరోనా సమయంలో కూడా ఆలయాలు అన్ని తెరిచే ఉంటాయి, యధావిధిగా నిత్య పూజలు కైంకర్యాలు జరిగాయి. ప్రభుత్వ నిర్ణయంతో ఎంతో కాలంగా దేవాలయాలకు వెళ్లాలని వేచి చూస్తున్న భక్తుల కోరిక తీరనుంది.

మరోవైపు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ దేవాలయాల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్న అనంతరం 10వ తేదీ నుంచి భక్తులను అనుమతిస్తున్నట్లు చెప్పారు. 10 నుంచి దర్శనాలకు అవకాశం ఇచ్చామని స్థానికంగా ఇబ్బందులు ఉంటే ఒకటి రెండు రోజులు ఏర్పాట్లు పూర్తి చేసి అధికారులు అవకాశం కల్పిస్తారని చెప్పారు.

‘విరాటపర్వం’.. మంచికై పోరాడే చెడ్డ వాడి కథ !


‘నీది నాది ఒకే కథ’ అనే చిన్న సైజు కథలో కొత్త సంఘర్షణను జోడించి మంచి విజయాన్ని అందుకున్నాడు డైరెక్టర్ ‘వేణు ఉడుగుల’. అయితే ప్రస్తుతం ఈ డైరెక్టర్ తన రెండో సినిమాగా రానా, సాయిప‌ల్ల‌వి లను హీరోహరోయిన్లుగా పెట్టి ‘విరాటపర్వం’ అనే పొలిటికల్‌ పీరియాడిక్ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

కాగా పేరుకు పొలిటికల్‌ థ్రిల్లర్ అయినా కథలో మాత్రం కొత్త కోణాలు చాలా ఉన్నాయని.. ముఖ్యంగా రానా పాత్రలో కొంత నెగిటివ్ యాంగిల్ ఉంటుందని.. అది సినిమాలో కొత్తగా అనిపిస్తోందని.. మొత్తంగా మంచి కోసం పోరాడే ఓ చెడ్డ వాడి కథనే.. థ్రిల్లింగ్ అంశాలతో ఓ కొత్త కోణంలో డైరెక్టర్ వేణు ఉడుగుల చెప్పబోతున్నట్లు తెలుస్తోంది.

కాగా తెలంగాణ ప్రాంతంలోని 1980 – 90 నాటి సామాజిక పరిస్థితుల ఆధారం చేసుకుని ఈ పీరియాడిక్ సోషల్ డ్రామాను వేణు ఉడుగుల రాసుకున్నాడట. అంటే అప్పటి దళారుల వ్యవస్థను సినిమాలో మెయిన్ విలన్ గా చూపిస్తున్నారేమో. ఇక ఈ సినిమాను హిందీ, తమిళ భాష‌ల్లోనూ రిలీజ్ చేయనున్నారు. నక్సలైట్ ఉద్యమం నేపథ్యంలో సాగే ఈ కథలో రానా నక్సలైట్ గా నటిస్తున్నాడట.

ఈ చిత్రంలో ప్రియ‌మ‌ణి ఒక కీల‌క పాత్ర‌లో నటిస్తోంది. డి. సురేష్‌బాబు, సుధాక‌ర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ ఫేమ‌స్ న‌టి నందితా దాస్‌, ఈశ్వ‌రీరావు, జ‌రీనా వ‌హాబ్ ప్ర‌ధాన పాత్ర‌లు చేస్తున్నారు.

పుణ్యక్షేత్రం అతిథి గృహంలో అసాంఘిక కార్యకలాపాలు!


నిన్నటి వరకూ పెద్ద తిరుపతి దేవస్థానం భూముల అమ్మకం వివాదంలో వార్తల్లోకి ఎక్కగా, నేడు చిన్న తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన ద్వారకా తిరుమల దేవస్థానం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారి వార్తల్లోకి ఎక్కింది. ఇందులోనూ స్థానిక అధికార పార్టీ నాయకులు ఉండటం విశేషం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కొండపై అసాంఘిక కార్యకలాపాలు జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరోనా నిభందనల కారణంగా శ్రీవారి కొండపైకి అధికారులకు తప్ప భక్తులకు, ఇతరులు ఎవరికి ప్రవేశం లేదు. అయితే కొందరు సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నేరచరిత్ర కలిగిన వ్యక్తులకు కొండపైన అతిధి గృహాన్ని కేటాయించిన విషయం చర్చనీయాంశంగా మారింది.

ఈ నెల 2వ తేదీన ద్వారకా తిరుమల మండలానికి చెందిన అధికార పార్టీ నాయకులు కొందరు పవిత్రమైన శ్రీవారి కొండపైన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. రాత్రి 10.30 గంటల సమయంలో కొండపైకి వైసీపీ నాయకులతోపాటు, ఒక ప్రముఖ పత్రిక విలేకరి, మరో ప్రవేటు ఉద్యోగి, ఇరువురు మహిళలు ఉన్నారు. ఆ రాత్రి వారు అతిథి గృహంలో మద్యం సేవించడం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలయ కార్యనిర్వాణాధికారి రావిపాటి ప్రభాకర రావు ఈ విషయాన్ని అంగీకరించారు. 2వ తేదీ రాత్రి కొండపైకి వాహనం వెళ్లిన మాట వాస్తవమేనని చెప్పారు. ఒక వ్యక్తి వెళ్లినట్లు సమాచారం ఉందన్నారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి బాద్యులైన సిబ్బంది పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

చంద్రబాబు మౌనం.. దేనికి సంకేతం?


తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు మౌనం దాల్చారు. నేతలు కొట్లాడుకుంటున్నా.. మాటల దాడులు చేసుకుంటున్నా తనకేమీ పట్టన్నట్టుగా సైలెంట్ గా ఉండడం చర్చనీయాంశమైంది. అనవసరంగా నేతల గొడవల్లో వేలు పెట్టడం ఇష్టం లేదా? లేక సదురు మహిళా నేతను చంద్రబాబు గాలికి వదిలేశాడా? పార్టీలో అంత రచ్చ జరుగుతున్నా బాబు మౌనం వెనుక కారణమేంటన్న ప్రశ్న ఇప్పుడు అందరినీ షాక్ కు గురిచేస్తోంది.

టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ గొడవలను పట్టించుకోవడం లేదు. కర్నూలు జిల్లాలో ఇద్దరు ముఖ్య పార్టీ నాయకులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నా అవేమీ పట్టనట్టుగా మౌనం దాల్చడంపై సదురు నేతలు గుర్రుగా ఉన్నారు.

రెండురోజులుగా టీడీపీ సీనియర్ నాయకుడు, ఏపీ సీడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.. ఇద్దరు నాయకులు గతంలో కూడా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ప్రాంతంలో భీకరంగా రాజకీయ యుద్ధంలో పాల్గొన్నప్పటికీ అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పార్టీ మరియు ఎన్నికల ప్రయోజనాల విషయంలో కొంత రాజీపడ్డారు. అధికారంలో ఉండడంతో సదురు నేతలు కొంత సంయమనం పాటించారు.

2019లో టీడీపీ ఓడిపోయిన తర్వాత సుబ్బారెడ్డి, అఖిల ప్రియల మధ్యనున్న విభేదాలు భగ్గుమన్నాయి. అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్ ఇద్దరూ కలిసి తన హత్యకు కుట్రపన్నారని.. రూ.50 లక్షల సుపారీ ఇచ్చారని తాజాగా సుబ్బారెడ్డి ఆరోపించడం కలకలం రేగింది. టీడీపీలో గొడవ పీక్స్ కు చేరింది.

అయితే ఈ ఆరోపణలపై అఖిల ప్రియ స్పందించింది. సుబ్బారెడ్డి తీవ్రమైన నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని.. అతడి వెనుక వైసీపీ హస్తం ఉందని అనుమానిస్తున్నట్టు అఖిల ఆరోపించారు.

తాజాగా సుబ్బారెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. అఖిల రాజకీయాల్లో కొనసాగితే.. ఆళ్లగడ్డలో చాలా మంది ప్రాణాలు కోల్పోతారని సుబ్బారెడ్డి ఆరోపించారు. నియోజకవర్గంలో అఖిలప్రియ తప్ప మరే వ్యక్తికి అయినా మద్దతు ఇస్తానని అన్నారు. టీడీపీ నాయకత్వం అఖిలప్రియ విషయంలో పునరాలోచన చేయాలని ఆయన కోరారు.

ఇంత రచ్చ జరుగుతున్నా.. ఇద్దరు టీడీపీ నేతలు తగవులాడుకుంటున్నా టీడీపీ అధినేతలో స్పందన లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మాజీ మంత్రి, సీనియర్ నేత ఇద్దరిని పిలిచి ఒక తాటిపైకి తీసుకురావడానికి బదులు.. చంద్రబాబు పట్టించుకోకపోవడంతో ఈ రచ్చ మరింత ఉదృతం అవుతోంది. కర్నూలు జిల్లాలో టీడీపీ నాయకులపై చంద్రబాబు నియంత్రణ పూర్తిగా కోల్పోయాడని అర్థమవుతోంది. చూస్తుంటే పార్టీపై పట్టును కూడా చంద్రబాబు కోల్పోతున్నారని నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

-నరేశ్ ఎన్నం

అరె.. తమన్నా కూడా వెబ్ చూపులు చూస్తోందిగా!


కరోనా దెబ్బకు సినిమా అంటే థియేటర్స్ లోనే చూడాలనే రోజులు పోయాయి. పైగా మన స్మార్ట్‌ ఫోన్ల వాడకం ఎంత వేగంగా పెరిగిందో.. నేటి యువతరం అభిరుచి కూడా అంతకన్నా వేగంగా మారుతుంది. ఇప్పుడు అందరూ డిజిటల్ స్ట్రీమింగ్‌ వైపే వెళ్తున్న సంగతి తెలిసిందే. దాంతో ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా డిజిటిల్ వైపు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చి పడింది. ఈ క్రమంలోనే బడా నిర్మాతలు సైతం వెబ్ సిరీస్ లను నిర్మించే పనిలో లో పడ్డారు. ఈ నేపథ్యంలో స్టార్ హీరోయిన్లు కూడా డిజిటిల్ వైపు చూస్తున్నారు. ఒకవైపు వరుస సినిమాలతో బిజీబిజీగా ఉంటూనే.. మరోవైపు వెబ్ సిరీస్ కథలను కూడా నటించేయడానికి సై అంటున్నారు.

కాగా ఇప్పటికే స్టార్ హీరోయిన్ సమంత ‘థ ఫ్యామిలీ మాన్’ అనే వెబ్ సిరీస్ రెండవ సీజన్ లో నటించింది. అలాగే కాజల్ అగర్వాల్ కూడా ఓ వెబ్ సిరీస్ చేయనుంది. ఇప్పుడు వీరి బాటలోనే మిల్కీ బ్యూటీ తమన్నా కూడా అడుగులు వేస్తుందట. తమిళంలోని ఓ వెబ్ సిరీస్ కథ పట్ల బాగా ఇంట్రస్టింగ్ గా ఉందట. ఇది తండ్రి, కూతుళ్ల మధ్య జరిగే సిరీస్ అని, ఎక్కువ నిడివి ఉన్న ఇలాంటి వెబ్ సిరీస్ స్టోరీస్ లో నటిస్తే తమ ప్రతిభను కనబర్చడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందనే ఉద్దేశ్యంతో తమన్నా ఈ వెబ్ సిరీస్ లో నటించబోతుందట. ఈ వెబ్‌ సిరీస్‌ ను దర్శకుడు రామ సుబ్రమణ్యన్ డైరెక్ట్ చేయనుండగా, అనంద్ వికటన్ సంస్థ నిర్మిస్తోంది. మొత్తానికి తమన్నా కూడా వెబ్ చూపులు చూస్తోంది.

బాలయ్య సినిమా పై కరోనా ప్రభావం !


కరోనా మహమ్మారి దెబ్బకు దేశ వ్యాప్తంగా సినీ లోకం స్తంభించిపోయి.. మళ్ళీ షూటింగ్ లు మొదలుపెట్టడానికి నానా కష్టాలు పడాల్సి వస్తోంది. అయితే ప్రస్తుతం కరోనా ప్రభావం ఉన్నప్పటికీ చిత్ర నిర్మాతలు షూటింగులను తిరిగి ప్రారంభించడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ చాలా మంది చిత్ర నిర్మాతలు ఈ సంవత్సరం చివరి వరకు అవుట్ డోర్ షెడ్యూల్స్ ను మరియు విదేశీ షెడ్యూల్‌ లను రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి. కాగా బాలయ్య – బోయపాటి సినిమాలో ఓ ముఖ్యమైన సీక్వెన్స్ ను వారణాసి మరియు హిమాలయాలలో విస్తృతంగా షూట్ చేయాలి.

కాగా ఆ సీక్వెన్స్ లు కథకు చాలా కీలకమైనవి అట. అందుకే ఎట్టి పరిస్థితుల్లో అక్కడే షూట్ చేయాలి. స్టూడియోల్లో సెట్ వేయడం సాధ్యం కాదు. కానీ అక్కడ షూటింగ్ చేయడం అసాధ్యం. మరి ఇప్పుడు బాలయ్య బృందం ఏమి చేస్తోందో చూడాలి. మొత్తానికి కరోనా ఎఫెక్ట్ బాలయ్య సినిమా పై బాగానే పడింది. ఇక ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నామని బోయపాటి రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆ హీరోయిన్ ఎలా ఉండబోతుందో చూడాలి.

ఇక ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించారు. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని బాలయ్య ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి బాలయ్యకు హిట్ వస్తోందా అనేదే ఇక్కడ ప్రశ్న.

సీఎం పేషీ సిబ్బందికి కరోనా..!

What is the reason behind the Employees Union Petition?
What is the reason behind the Employees Union Petition?


ఏపీ సచివాలయంలో కరోనా ఉధృతి పెరుగుతూనే ఉంది. వివిధ శాఖల్లో పని చేసే డిటిపి ఆపరేటర్లకు, అటెండర్లకు, పోలీసు సిబ్బందికి కరోనా నిర్థారణ అయ్యింది. ఇప్పటి వరకూ సీఎంఓ బ్లాక్ లో సాధారణ పరిపాలనా శాఖ (జిఎడి)కి పరిమితమైన కరోనా తాజాగా సీఎం పేషికి చేరింది. సీఎం పేషీలో పనిచేసే అధికారికి చెందిన డ్రైవర్ సహా ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అవడంతో సీఎంఓ అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటి వరకూ ఏపీ సచివాలయంలో 10 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

తాజాగా పొరుగు సేవల ద్వారా కమాండ్ కంట్రోల్‌లో పనిచేసే ఒక ఉద్యోగికి, ప్రణాళిక విభాగం‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తికి, పరిశ్రమల శాఖలో పనిచేసే మరో ఉద్యోగికి, సీఎం బ్లాక్‌లో ఆర్‌టీజీఎ‌స్‌లో పనిచేసే సర్వీస్ ప్రొవైడర్‌కు, సీఎం పేషీలో పనిచేసే అధికారి డ్రైవర్‌కు, విద్యాశాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు కరోనా నిర్దారణ అయ్యిందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 161 కేసులు నమోదు అయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన వారిలో 131 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 41 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది.

జగన్ ను కలిసేందుకు రాలేనన్న బాలయ్య


సినీ, రాజకీయ రంగాలలో ఉప్పు, నిప్పుల్లా ఉన్న రెండు వర్గాలు ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు విజయవంతం అయ్యేలా కనిపించడం లేదు. ఇటీవల తెలంగాణలో సినీ పెద్దలు ముఖ్యమంత్రి తో అయిన భేటీకి బాలకృష్ణ ను పిలవలేదు. ఆ అంశం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో చిరంజీవి తలపెట్టిన భేటీకి బాలయ్య వస్తాడా అన్న సందిగ్దత నెలకొంది.

ఈ నెల 9వ తేదీన సీఎం జగన్ ను కలిసేందుకు అనుమతి లభించడంతో ఈ విషయంపై నిర్మాత సి.కళ్యాణ్ సినీ ప్రముఖులకు సమాచారం ఇచ్చి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో బాలయ్యకు సమాచారం ఇచ్చి ఆహ్వానించారు. తన పుట్టినరోజు కాబట్టి రాలేనంటూ బాలయ్య సున్నితంగా తిరస్కరించారు. ప్రతిపక్షంలో ఉన్న బాలయ్యకు ఏ కార్యక్రమాలు లేకపోయినా జగన్ ను కలిసేందుకు వచ్చే అవకాశం లేదని కొందరు వాదిస్తున్నారు. సినీ ప్రముఖులు మాత్రం ముందుగానే సమాచారం ఇచ్చి వారి తప్పు లేదనిపించుకున్నారు.

లాక్‌డౌన్ నేపథ్యంలో సినీ ప‌రిశ్ర‌మ ఎదుర్కొంటున్న ఇబ్బందుల‌ని ఆంద్రప్రదేశ్ సీఎం జ‌గ‌న్‌కు సినీప్రముఖులు వివరించనున్నారు. లాక్‌డౌన్ స‌డ‌లింపుల నేప‌థ్యంలో అన్ని జాగ్ర‌త్త‌ల‌ని పాటిస్తూ షూటింగ్ నిర్వ‌హిస్తామ‌నే విష‌యాన్ని కొద్ది రోజుల క్రితం తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళారు ఇండ‌స్ట్రీ పెద్ద‌లు. ఇప్పుడు జ‌గ‌న్‌తోను పలు కీల‌క విష‌యాల‌పై చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్న‌ట్టు తెలుస్తుంది. సినీ పరిశ్రమను ఆదుకునేందుకు సహకారం అందించాలని కోరనున్నారు.

పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన నాని హీరోయిన్


హీరోయిన్‌గా తన తొలి సినిమాతోనే ‘నచ్చావులే’ అనిపించుకుంది తెలుగమ్మాయి మాధవీలత. ఆపై నాని హీరోగా ‘స్నేహితుడా’ చిత్రంతో కూడా ఆకట్టుకుంది. దాంతో, ఆమె కెరీర్ ఊపందుకుంటుంది అనుకుంటే రివర్సయింది. అవకాశాలు లేకపోవడంతో ఆమె తెరమరుగైంది. అయితే, ఆ మధ్య ‘మీ టూ’ ఉద్యమంలో పాల్గొనడంతో పాటు, తెలుగు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌ గురించి మాట్లాడి వార్తల్లోకి వచ్చింది. ఆపై, సోషల్ మీడియా వేదికగా ఇండస్ట్రీ విషయాల గురించి తరచూ స్పందిస్తోంది. అంతేకాదు బీజేపీ కండువా కప్పుకొని రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టింది.

ఎప్పుడూ సినీ, రాజకీయ వివాదాల గురించి మాట్లాడే మాధవీలత రెండు రోజుల కిందట ఫేస్‌బుక్‌లో పెట్టిన ఓ పోస్ట్‌ చర్చనీయాంశమైంది. ‘ఎన్నో నెలల తర్వాత నేను చాలా సంతోషంగా ఉన్నా… కొత్త జీవితం ప్రారంభమైంది. అద్భుతాలు జరిగాయి. అద్భుతాలు జరుగుతాయని నేనెప్పుడూ నమ్ముతా. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా.. ఏం జరిగిందో త్వరలో చెబుతా’ అని పోస్ట్ చేసింది. దీంతో, మాధవీలత పెళ్లి చేసేసుకుందని అభిమానులు ఓ అంచనాకు వచ్చేశారు. అంతే కాదు ఆమెకు శుభాకాంక్షలు చెప్పడం కూడా ప్రారంభించారు. దీంతో, పెళ్లి అంశంపై మాధవి క్లారిటీ ఇచ్చింది. తన పెళ్లి వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పింది. అందరూ తనకు విషెస్ చెపుతుంటే తనకు నవ్వొస్తోందని వ్యాఖ్యానించింది. అయితే, ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని… అన్నీ కుదిరితే వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటానని తెలిపింది.

ఫస్ట్ షెడ్యూల్ లో ‘బన్నీ-రష్మిక’ సాంగ్..!


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న సినిమా ‘పుష్ప’. కాగా ఆగ‌స్ట్ నుండి ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ముందుగా సాధ్యమైనంత తక్కువమంది స‌భ్యుల‌తో స్టార్ట్ చేస్తారట. పైగా స‌భ్యులంద‌రికీ కరోనా టెస్ట్ చేసి, వారికీ కరోనా సోకే అవకాశం లేకుండా టీమ్ అందర్నీ షూట్ జరుగుతున్న అంత కాలం జన సాంద్రతకు దూరమైన ప్రాంతంలోనే ఉంచాలని టీమ్ భావిస్తోందట. ముఖ్యంగా పుష్ప చిత్ర బృందం వారు ఇత‌రుల‌ను క‌ల‌వ‌డం గాని.. ఇత‌రులు వారున్న ప్ర‌దేశానికి రావడం గాని లేకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటార‌ట.

ఇక ఫస్ట్ షెడ్యూల్ లో బన్నీ – రష్మిక పై సాంగ్ షూట్ చేయనున్నారు. అన్నట్టు ఈ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ కోసం బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలాను ఫైనల్ చేసిందట చిత్రబృందం. అలాగే తమిళ హీరో విజయ్‌ సేతుపతి కూడా ఈ సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌ గా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్నీకి జోడీగా వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న కథానాయికగా నటించనుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.

ఎప్పుడూ బిజీగా ఉండే దేవీ శ్రీ, ఈసారి కూల్‌ గా తీరిగ్గా కూర్చుని మ‌రీ పుష్ప సినిమాకి ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నాడ‌ట‌‌. ఇప్పటికే నాలుగు ట్యూన్స్ కంపోజ్ చేశాడట. ఇక మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుండగా , సుకుమార్ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు.

‘సప్తగిరి’ ఎడిటోరియల్ బోర్డుపై చర్యలు ఎందుకంటే..!


టీటీడీ నిర్వహిస్తున్న సప్తగిరి మాసపత్రికలో ప్రచురించిన వ్యాసం వివాదానికి కేంద్ర బింధువుగా మారింది. ఈ మాసపత్రికకు ఒక చిన్నపిల్లాడు ఒక కథను పంపించాడు. కథలో కుశుడు సీతారాముల కొడుకు కాదని వాల్మీకి దర్బతో చేసిన బొమ్మ అంటూ బాలవాక్కు శీర్షికతో సప్తగిరి తాజా సంచికలో ప్రచురితమయ్యింది. స్కూల్ పిల్లాడు రాసిన వివాదాస్పదమైన కథను ప్రచురించిన సప్తగిరి ఎడిటోరియల్ బోర్డుపై టీటీడీ చర్యలకు ఉపక్రమించింది.

తొమ్మిదో తరగతి చదివే పునీత్ అనే పిల్లాడు రాసినట్లుగా చెప్పిన కథను కొద్దీ నెలల కిందట మరో మహిళ పేరుతో సప్తగిరి కార్యాలయానికి అందగా ప్రచురించకుండా నిలిపివేశారు. తాజాగా పునీత్ పంపిన కథను ఎడిటోరియల్ బోర్డు తిరస్కరించినా పబ్లిష్ కావడం విశేషం. ఈ వ్యవహారంపై బీజేపీ అనుబంధ సంస్థలు ఆందోళనలు చేశారు. హిందువుల మనోభావాల్ని దెబ్బ తీశారన్న ఆరోపణలు ఆరోపించారు. దీంతో టిటిడి క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.

సప్తగిరి లాంటి మాసపత్రికలో ఇలాంటివి రావటం ఏమిటంటూ రచ్చ పాఠకులు, హిందుత్వ సంస్థలు తమనిరసన లేఖల రూపంలో తెలియజేశారు. ఈ పిల్లాడి కథ వ్యవహారం ఏపీ ప్రభుత్వం మీద నిందలువేసే వరకూ వెళ్లటంతో టీటీడీ రంగంలోకి దిగింది. ఈ విషయంపై విచారణ జరిపి చివరకు ఇందుకు బాధ్యులుగా సప్తగిరి మాసపత్రిక చీఫ్ ఎడిటర్ రాధారమణితో పాటు సబ్ ఎడిటర్ ఉత్తర ఫల్ఘుణిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిన్నటి వరకూ భూముల వేలం వ్యవహారం వివాదమవగా తాజాగా సప్తగిరి మాస పత్రిక ప్రచురించిన కథ వివాదంగా మారింది.

బాలీవుడ్‌లో మరొకరిని బలిగొన్న కరోనా


ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ భారత దేశంలో రోజు రోజుకూ తీవ్ర రూపం దాలుస్తోంది. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడంతో ఈ మధ్య రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే వందలాది మంది మృత్యువాత పడ్డారు. ఈ మహమ్మారి ధాటికి సామాన్య ప్రజలతో పాటు సినీ ప్రముఖులు కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఈ ప్రాణాంతక వైరస్ ఇండస్ట్రీకి చెందిన పలువురిపై పంజా విసిరింది.

ఇప్పటికే చాలా మందికి వైరస్‌ సోకగా.. పలువురు ప్రముఖులు కరోనా బారిన పడి ప్రాణాలు విడుస్తున్నారు. ఆ జాబితాలో తాజాగా మరొకరు చేరారు. ప్రముఖ నిర్మాత అనిల్ సూరి కరోనా సోకి మరణించారు. ఈ విషయాన్ని ఆయన సోదరుడు రాజీవ్ సూరి ధ్రువీకరించారు. అనిల్ ఈ నెల 2వ తేదీ నుంచి హై ఫీవర్తో బాధపడుతున్నారన్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో లీవావతి, హిందుజా ఆసుపత్రులకు తీసుకెళ్లామన్నారు. కానీ, అక్కడ అనిల్‌ను అడ్మిట్ చేసుకోలేదని తెలిపారు. దాంతో, బుధవారం ఓ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్చించగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ గురువారం సాయత్రం మృతి చెందారని రాజీవ్ వెల్లడించారు. శుక్రవారం ఉదయం కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో అనిల్ అంత్యక్రియలు నిర్వహించారు. అనిల్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనిల్ సూరి.. రాజ్‌ కుమార్, రేఖ కలిసి నటించిన ‘కర్మయోగి’, ‘రాజ్‌ తిలక్‌’ వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. కొద్ది రోజుల కిందటే ప్రముఖ సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్‌ కూడా కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే.

పాపం తమన్నా.. ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగిందే…


పాపం తమన్నా భాటియా. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమెను తెగ ట్రోల్ చేస్తున్నారు. కారణం.. ఆమె చేసిన ఓ ఫొటో, ట్వీట్. అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్‌ మృతికి శ్వేత జాతి పోలీసు కారణమైన నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై తమన్నా స్పందించింది. తన ముఖానికి నలుపురంగు చేతి ముద్ర ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది. దీనికి ‘నీ మౌనం నిన్ను ఎప్పటికీ కాపాడదు. మనిషి అయినా జంతువైనా ప్రతి ఒక్కరి జీవితం ముఖ్యమే కదా? ఈ లోకంలో ఏ సృష్టిని అయినా అణిచివేయడం సృష్టి ధర్మానికే విరుద్ధం. ఇప్పుడు మనిషి మనిషిగా ఉండడం మళ్లీ నేర్చుకోవాలి. ప్రేమ, జాలి, కరుణ వ్యక్త పరచాలి’ అని ఆమె ట్వీట్ చేసింది.

అయితే, దీనిపై కొందరు తమన్నాను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో తమన్నా ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్‌లో నటించింది. నల్లగా ఉన్న యువతులు జీవితాంతం అదే రంగులో ఉండకుండా తెల్లగా అవ్వాలంటే ఈ బ్యూటీ క్రీమ్ వాడాలని ప్రచారం చేసింది. అప్పటి వీడియోను, ఆమె ఫొటోలను పోస్ట్ చేసిన నెటిజన్లు..నల్లగా ఉంటే అందంగా ఉన్నట్టు కాదన్న నువ్వు నల్లజాతిపై అహంకారం వద్దని చెబుతున్నావా? అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖం తెలుపు రంగులో ఉంటేనే బాగుంటుందంటూ ప్రచారం చేసిన తమన్నా ఇప్పుడు మరోలా వ్యాఖ్యానించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ సమస్యపై ముందుగా సరైన అవగాహన తెచ్చుకొని ఆ తర్వాత మాట్లాడితే మంచిదని సూచిస్తున్నారు. ఫెయిర్ అండ్‌ లవ్లీ యాడ్‌లో… నలుపు నుంచి తెలుపు రంగుకు మారే తమన్నా ఫొటోలను షేర్ చేసి.. ‘ఈ ఫొటోనే చాలా విషయాలు చెబుతుంది’ అని ఓ నెటిజన్‌ ట్వీట్ చేశాడు. మరి, ఈ ట్రోలింగ్‌పై తమన్నా ఎలా స్పందిస్తుందే చూడాలి.

ఫేస్ బుక్ లో డిజిటల్ రికార్డ్ ఆ స్టార్ దే !


డిజిటల్ యుగంలో సోష‌ల్ మీడియా ఎకౌంట్ లో ఫాలోవ‌ర్స్ ఎంత ఎక్కవ మంది ఉంటే, అంత‌గా పాపులారిటీ ఉందని అంచనా వేసే రోజులు ఇవి. అందుకే ఎంత గొప్ప స్టార్స్ అయినా ఫేస్ బుక్ దగ్గర నుండి ఇన్ స్టా, ట్విట్ట‌ర్ లాంటి మాధ్య‌మాల్లో ఫాలోయింగ్ కోసం బాగానే తాపత్రయపడతారు. సీనియర్ హీరోలు చిరంజీవి, మోహన్ బాబు, నాగ్, వెంకీ.. చివరికీ రాజశేఖర్ కూడా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్స్ తో అభిమానులను ఉత్తేజపరుస్తున్నారంటే.. సోషల్ మీడియా ప్రభావం అర్ధం చేసుకోవచ్చు.

అయితే తాజాగా డిజిట‌ల్లో రెబల్ స్టార్ ప్రభాస్ ఓ అరుదైన‌ ఘనత సాధించాడు. ప్రభాస్ ఫేస్ బుక్ పేజికి కోటి 4 ల‌క్ష‌ల మంది పాలోవ‌ర్స్ వచ్చి చేరారు. 14 మిలియన్ల పాలోవర్స్ చేర‌డం అనేది సంచ‌ల‌న‌మే. పైగా ఇప్పటి వరకూ ఏ హీరోకి అంతమంది పాలోవర్స్ లేరు. సౌత్ ఇండియాలో ఎక్కువమంది పాలోవర్స్ ఉన్న హీరోగా ఫేస్ బుక్ లో రికార్డు న‌మోదు చేసిన క్రెడిట్ ప్రభాస్ దే. ఆ త‌ర్వాతి స్థానంలో మ‌న హీరోల్లో అల్లు అర్జున్ 13.1 మిలియన్ల తో రెండో స్థానంలో నిలిచాడు.

ఆ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్, మ‌హేష్ వీళ్లంతా. మహేష్ 7.97 మిలియన్ల ఫాలోవ‌ర్స్ ని క‌లిగి ఉండగా, రామ్ చరణ్ 7.1 మిలియన్లు.. నాని 5.2 మిలియన్లు ఫేస్ బుక్ ఫాలోవ‌ర్స్ ని క‌లిగి ఉండటం విశేషం. బాహుబ‌లి క్రేజుతో స‌ర్రున దూసుకొచ్చిన ప్ర‌భాస్ ఇప్ప‌టికి ఫేస్ బుక్ లో నంబ‌ర్ వ‌న్ స్థానం అందుకోవడం ప్రభాస్ స్థాయిని పెంచేదే. ఇక మ‌హేష్ కి న‌మ్ర‌త ఫాలో అప్ ఉంటుంది. డిజిట‌ల్ టీమ్ ని ప్ర‌త్యేకించి హ్యాండిల్ చేస్తూ ఫాలోవ‌ర్స్ ని పెంచే బాధ్య‌త ఆవిడ చూసుకుంటున్నారు. అలాగే చ‌ర‌ణ్ .. ప్ర‌భాస్ ఇటీవ‌లే డిజిట‌ల్ టీమ్ ల‌ను ఏర్పాటు చేసుకుని ఫాలోవ‌ర్స్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

కలియుగం ‘క్లైమాక్స్‌’కు చేరిందా..


‘శివ’ నుంచి ప్రతి దశలోనూ వైవిధ్యాన్ని చాటుకుంటూ ముందుకెళ్తున్నాడు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తెలుగు నుంచి బాలీవుడ్‌కు వెళ్లి.. అక్కడా ఇండస్ట్రీని షేక్‌ చేసిన ఆర్జీవీ ఈ మధ్య వివాదాస్పద సినిమాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. అయినా ఎక్కడా తగ్గకుండా తనదైన స్టయిల్లో దూసుకెళ్తున్నాడు. అమెరికా పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో జీఎస్‌టీ (గాడ్ సెక్స్‌ ట్రూత్‌) అనే షార్ట్‌ ఫిలింతో రెండేళ్ల కింద పెను సంచలనం సృష్టించాడు. ఇప్పుడు మియాతో పూర్తి స్థాయి సినిమా తీశాడు. కరోనా కారణంగా అందరూ ఇళ్లలో లాక్‌డౌన్‌ అవగా.. ఆర్జీవీ మాత్రం ఈ మూవీతో పాటు కరోనా వైరస్‌ సినిమా కూడా తేసేశాడు.

‘క్లైమాక్స్’.. టీజర్, ట్రైలర్తో ఇప్పటికే కుర్రాళ్ల హార్ట్‌బీట్ పెంచేశాడు. ఈ రోజు రాత్రి 9 గంటకు ఈ మూవీని ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలోని మరో క్లిప్‌ను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రాము… ఈ మూవీ రాత్రి 9 గంటల నుంచి RGVWorld.in / ShreyasET లో అందుబాటులో ఉంటుందని రూ.100 చెల్లించి చూడొచ్చని తెలిపాడు. ప్రపంచ తొలి ఆన్‌లైన్ థియేటర్ను ఎంజాయ్‌ చేయాలని ట్వీట్ చేశాడు. సినిమాను ఎలా చూడాలో వరుస ట్వీట్స్‌లో వివరిస్తున్నాడు. అంతేకాదు.. ‘హారర్ సినిమాలను సాధారణంగా చీకటితో ఉన్న భయంకర ప్రదేశాల్లో తీస్తారు.. కానీ, మియా మాల్కోవాతో తీసిన ఈ సినిమా మాత్రం ఎడారిలో పగటిపూట పూర్తి వెలుతురులో తీసిన మొట్టమొదటి సినిమా’ అని వర్మ పేర్కొన్నాడు.

సినిమాను ప్రమోట్ చేయడంలో ఎప్పుడూ ముందుండే ఆర్జీవీ.. క్లైమాక్స్‌నూ తనదైన శైలిలో ప్రమోట్ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌, మిమ్స్‌ను కూడా అందుకు వాడుకుంటున్నాడు. ఈ క్రమంలో క్లైమాక్స్ ట్రైలర్కు.. పలు సినిమాల్లో బ్రహ్మానందం, అలీతో రియాక్షన్‌ను జోడించి క్రియేట్ చేసిన మిమ్‌ను ఆర్జీవీ తన ట్విట్టర్, ఇన్‌స్టాలో షేర్ చేశాడు. సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలో ‘కలియుగం క్లైమాక్స్‌కు చేరిందా’ అంటూ బ్రహ్మానందం చెప్పే డైలాగ్‌తో మొదలయ్యే మిమ్‌ ఆసక్తికరంగా ఉంది.

https://twitter.com/RGV_WORLD/status/1269137011765477378

 

సన్నీ లియోన్‌ చేసిన పనికి శభాష్ అనాల్సిందే..


పోర్న్ స్టార్ నుంచి బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ గా ఎదిగిన వ్యక్తి సన్నీ లియోన్. బాలీవుడ్‌ మాత్రమే కాకుండా పలు ప్రాంతీయ భాషల్లో కూడా నటించిన సన్నీకి చాలా మంది అభిమానులు ఉన్నారు. అందం, నటనతోనే కాకుండా తన వ్యక్తిత్వంతోనూ చాలా మంది హృదయాలను గెలుచుకుందామె. ఓ అనాథ బాలికను దత్తత తీసుకున్న సన్నీ.. మరెందరో అనాథ చిన్నారులకు సేవ చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ అమెరికాకు వెళ్లిన సన్నీ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. వైరస్ ప్రభావం దారుణంగా ఉన్న యూఎస్‌ఏకు కుటుంబ సమేతంగా వెళ్లిన సన్నీ.. రిస్క్ చేసిందని, ప్రమాదం కొనితెచ్చుకుందని అంతా భావించారు.

అయితే, ఇలాంటి టైమ్‌లో అమెరికాకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో సన్నీ స్వయంగా వెల్లడించింది. ఆమె భర్త డేనియల్ తల్లి అమెరికాలోనే నివాసం ఉంటోంది.ఆమెకు వయసు మీద పడింది. పైగా, కరోనా టైమ్‌లో వృద్ధులు మరి జాగ్రత్తగా ఉండాలని వైద్యులు, ఆరోగ్య సంస్థలు చెబుతున్నాయి. దాంతో, ఈ క్లిష్ట సమయంలో తన అత్తను ఒంటరిగా వదిలివేయడం మంచిది కాదని.. భర్త, పిల్లలతో కలిసి ఆమెరికా వెళ్లినట్టు లియోన్ చెప్పింది. ఒక కోడలిగా తన అత్తను చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని తెలిపింది. ముఖ్యంగా ఈ టైమ్‌లోనే ఆమెకు తన సహాయం ఎక్కువ అని, అందుకే యూఎస్‌ వచ్చానని చెప్పింది. పరిస్థితులు చక్కబడి అంతర్జాతీయ విమానాల రాకపోకలకు ప్రభుత్వాల నుంచి అనుమతి లభించిన తర్వాత తిరిగి ముంబైకి వస్తానని తెలిపింది. ప్రమాదం అని తెలిసినా.. తన అత్తకు సాయం చేసేందుకు సన్నీ చేసిన పనికి నిజంగా శభాష్ అనాల్సిందే కదా.!