
ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతుల మద్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. దీనికి తోడు ఇద్దరు మద్యానికి బానిసలుగా మారారు. భర్త వేధింపులు తట్టుకోలేక భార్య భర్తను కిరాతకంగా హతమార్చడం, అతని పురుషాగాన్ని కోసేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని టి.నరసాపురం మండలం మక్కినవారి గూడెంకు చెందిన కఠారి అప్పారావు, తెలంగాణ లోని దమ్మపేటకు చెందిన లక్ష్మి 15 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమార్తె కలిగింది. ఇద్దరికీ చదువు లేకపోవడంతో కూలి పనులు చేసుకుంటూ జీవితాన్ని గడపసాగారు.
కొంతకాలంగా భార్య,భర్తలు ఇద్దరు మద్యానికి బానిసలయ్యారు. ఫలితంగా ఇద్దరి మధ్య నిత్యం కుటుంబ కలహాలు చోటుచేసుకునేవి. మద్యం సేవించిన అనంతరం ఈ నెల 3వ తేదీన వాగ్వివాదం తెలెత్తింది. దీంతో లక్ష్మి మద్యం మత్తులో ఉన్న భర్తను ఇంట్లో ఉన్న నవ్వారు మంచానికి కట్టేసింది. అతని మెడకు తాడు బిగించి ఊపిరాడకుండా చేసింది. దీంతో అతను మృతి చెందాడు. అనంతరం భర్త మర్మాంగాన్ని కత్తితో కోసేసింది. నిందితురాలు పోలీసులకు లొంగిపోయింది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. టి. నరసాపురం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.