Home Blog Page 8462

ప్రభుత్వాలకు 15రోజులే గడువిచ్చిన సుప్రీం!

Supreme court

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాలలో చిక్కుకున్న వలస కూలీలను వారి సొంత ప్రాంతాలకు తరలించేందుకు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు 15 రోజుల గడువు ఇచ్చింది. వలస కూలీలను తరలించేందుకు ఆ సమయం సరిపోతుందని స్పష్టం చేసింది. ఈ అంశంపై తుది తీర్పును జూన్ 9వ తేదీన ఇస్తామని ప్రకటించింది. వలస కూలీల బాధలకు సంబంధించి దాఖలైన ఓ పిల్ మీద సుమోటోగా విచారణ జరుపుతున్న త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

వలస కూలీలను 15 రోజుల్లో సొంతూరుకు చేర్చాలి. వలస కూలీలకు ఉపాధి ఎలా చూపిస్తారో కూడా అన్ని రాష్ట్రాలు స్పష్టంగా చెప్పాలి. వలస కూలీల ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్లు చేయించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇప్పటి వరకు సుమారు కోటి మందిని గమ్యస్థానాలకు చేర్చినట్టు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. రైళ్లలో 57 లక్షల మందిని, బస్సుల్లో 41 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చినట్టె కోర్టుకు తెలిపారు. ఢిల్లీలో సుమారు 2 లక్షల మంది వలస కూలీలు ఉన్నారని, వారు తమ గమ్యస్థానాలకు వెళ్లడానికి సిద్ధపడడం లేదని అడిషనల్ సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్ చెప్పారు. కేవలం 10,000 మంది మాత్రమే సొంతూళ్లకు వెళ్లడానికి సుముఖంగా ఉన్నారన్నారు. యూపీ ప్రభుత్వం కూడా దాదాపు అలాంటి స్టేట్ మెంట్ ఇచ్చారు.

కొత్త పథకాలకు డబ్బుల్లేవ్..!


దేశంలో లాక్డౌన్ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది. దీంతో ఈ ఏడాది కొత్త పథకాలకు శ్రీకారం చుట్టేది లేదని కేంద్ర ఆర్థిక శాఖ శుక్రవారం స్పష్టం చేసింది. కరోనా మహమ్మరి విజృంభణ, లాక్డౌన్ కారణంగా కేంద్రం పెద్దమొత్తంలో ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది. తిరిగి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఇటీవలే కేంద్రం 20లక్షల ప్యాకేజీ ప్రకటించింది. దీనివల్ల ఖర్చులు పెరిగిపోవడంతో ఈ ఏడాది ఎలాంటి కొత్త పథకాలను ప్రవేశపెట్టకూడదని కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది.

కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన రెండు పథకాలకు ఆర్థిక శాఖ మినహాయింపు ఇచ్చింది. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ, ఆత్మ నిర్భర భారత్ పథకాలకు ఆర్థిక శాఖ సడలింపు ఇచ్చింది. ఈ రెండు పథకాలకు మాత్రమే ఆర్థిక శాఖ నుంచి నిధులు వెచ్చించనున్నట్లు ప్రకటించింది. మరే కొత్త పథకాలను ఏ శాఖ ప్రకటించొద్దని తేల్చి చెప్పింది. కొత్త పథకాలకు ఇప్పట్లో ఆర్థిక శాఖ నుంచి నిధులు లేవని స్పష్టం చేసింది.

కోవిడ్-19 వైరస్ కారణంగా ప్రజా ఆర్థిక వనరులకు డిమాండ్ పెరిగిందని ఆర్థిక శాఖ పేర్కొంది. మారుతున్న పరిస్థితులను అనుగుణంగా అవసరమున్న వాటికే నిధులు వెచ్చించనున్నట్లు ఆ శాఖ ప్రకటించింది. ఇప్పటికే బడ్జెట్లో ఆమోదించిన పథకాలను 2022 మార్చి 31వరకు నిలిపివేస్తున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఏవైనా ప్రత్యేక పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రం కేంద్రం ఖర్చులకు సంబంధించి, తదితర విషయాలను పరిగణలోకి తీసుకొని నిధులను విడుదల చేస్తుందని ఆర్థిక శాఖ ప్రకటించింది.

ఇండియా నుంచి అక్షయ్ కుమార్ ఒక్కడే


స్టంట్ మాస్టర్ నుంచి నటుడిగా మారి బాలీవుడ్‌ సూపర్ స్టార్ గా ఎదిగిన హీరో అక్షయ్ కుమార్. వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ ఈ మధ్య వరుస హిట్లతో దూసుకుపోతున్నడు అక్షయ్. సూపర్ సక్సెస్ రేట్‌తో బాలీవుడ్ ఖాన్ త్రయం.. సల్మాన్, షారూక్, అమిర్ లను వెనక్కునెట్టిన ఈ ఖిలాడీ నంబర్ వన్‌ హీరోగా మారిపోయాడు. తన నటనతోనే కాకుండా మంచి మనసుతో అభిమానుల హృదాయాలు గెలుచుకోవడంలోనూ అతను ముందుంటాడు. నరనరానా దేశ భక్తి నింపుకున్న అక్షయ్‌ సైనికుల సంక్షేమం కోసం భారీగా ఖర్చు చేశాడు. అలాగే, పేదలు, అన్నార్తుల ఆకలి తీర్చడంలోనూ అతని పెద్ద చేయి. కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకునేందుకు… ప్రధాని సహాయ నిధికి రూ.25 కోట్లు భారీ మొత్తం విరాళం ఇచ్చాడు. ‘భారత్‌ వీర్ సంస్థ’ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాడు.

అక్షయ్‌ సంపాదన కూడా అదే స్థాయిలో ఉంది. ఎంతలా అంటే ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ఆర్జించే ఫోర్బ్స్ టాప్ 100 సెలబ్రిటీల జాబితాలో భారత్‌ నుంచి అతనికి మాత్రమే చోటు దక్కేలా. గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది మే వరకు అక్షయ్ ఏకంగా రూ. 366 కోట్లు సంపాదించి బాలీవుడ్‌లో నంబర్ వన్‌ స్థానం సాధించాడు. వరల్డ్‌ లిస్ట్‌లో అతనికి 52వ స్థానం లభించింది. గతేడాది ఈ లిస్ట్‌లో 33వ స్థానంలో నిలిచిన అతను ఈ సారి 19 ర్యాంక్‌లో కోల్పోయాడు. గతేడాది అక్షయ్‌ రూ. 490 కోట్లు ఆర్జించాడు. అయితే, కరోనా వైరస్‌ కారణంగా షూటింగ్స్‌, సినిమాలు నిలిచిపోవడంతో అతని సంపాదన తగ్గింది. అయినా టాప్ 100లో అతను చోటు దక్కించుకున్నాడు. దీనికి కారణం అమెజాన్‌ ప్రైమ్ ద్వారా అతను ఓటీటీ ఫ్లాట్ఫామ్‌లోకి రావడమే. ఓ డిజిటల్‌ సిరీస్‌ కోసం అక్షయ్‌ 75 కోట్లతో అమెజాన్‌తో డీల్‌ కుదుర్చుకున్నాడు. ఈ జాబితాలో కాస్మెటిక్‌ వరల్డ్‌ క్వీన్‌ కైలీ జెన్నర్ రూ. 4453 కోట్లతో అగ్రస్థానం సాధించింది.

కొడుకుతో కలిసి స్టార్ హీరో మల్టీ స్టారర్..


బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలో ఈ మధ్య మల్టీస్టారర్ మూవీల హవా నడుస్తోంది. కథ నచ్చితే స్టార్డమ్‌ పక్కనపెట్టి స్టార్ హీరోలు స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సౌత్ సీనియర్ హీరో విక్రమ్‌ మరో అడుగు ముందుకు వేయబోతున్నాడు. తన కొడుకుతో కలిసి మల్టీ స్టారర్ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఫలితాలు ఎలా ఉన్నా ప్రతి సినిమాలో, పాత్రలో వైవిధ్యం ఉండేలా ఆరాటపడే నటుడు విక్రమ్. తన గత చిత్రాలు చూస్తే చాలు అతను ఎంత కష్టపడతాడో చెప్పొచ్చు.

తెలుగులోనూ మంచి మార్కెట్ సంపాదించుకున్న విక్రమ్.. ప్రస్తుతం అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో ‘కోబ్రా’, మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘పొన్నియన్ సెల్వన్’ వంటి భారీ చిత్రాల్లో నటిస్తున్నాడు. రజనీ కాంత్‌ ‘పేట’తో ఫేమస్ అయిన కార్తీక్‌ సుబ్బరాజు డైరెక్షన్‌లో మరో సినిమాకు కూడా విక్రమ్‌ ఓకే చెప్పాడు. ఇది విక్రమ్ కి 60వ చిత్రం. దీన్ని మరింత ప్రత్యేకంగా మార్చుకోవాలని భావిస్తున్నాడు. ఈ చిత్రంలో తన కొడుకు ధృవ్‌తో కలిసి స్క్రీన్ షేర్  చేసుకోబోతున్నాడు. ఈ మూవీలో ఓ కీలక పాత్రలో ధృవ్ నటిస్తాడని సమాచారం. ‘అర్జున్‌ రెడ్డి’ రీమేక్‌తో ధృవ్‌ కోలీవుడ్‌లో ఇప్పటికే గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం అతను మరో సినిమా కూడా చేస్తున్నాడు. దాంతో, తండ్రికొడుకులు కలిసి నటించాలని ఎప్పటి నుంచో ఆత్రుతగా ఉన్నారట. మంచి కథ కోసం విక్రమ్‌ వేచిచూస్తుండగా.. కార్తీక్‌ సుబ్బరాజు అతని ముందుకొచ్చాడు. కథ నచ్చడంతో ధృవ్‌తో మల్టీస్టారర్కు విక్రమ్ సరే అనేశాడని టాక్. అయితే, సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.

కేజీఎఫ్ డైరెక్టర్‌తో రెబల్ స్టార్


బాహుబలి మూవీతో మన రెబల్ స్టార్ స్టామినా ప్రపంచానికి తెలిసింది. బాహుబలి సిరీస్ తర్వాత ‘సాహో’ అనిపించే ప్రయత్నం చేసిన ప్రభాస్‌ సినిమా గురించి ఎలాంటి విషయం అయినా నేషనల్‌ వైడ్‌ టాపిక్ అవుతోంది. తనతో పని చేయడానికి ఎంతో మంది దర్శకులు ఎదురుచూస్తున్నా.. రెబల్‌ స్టార్ మాత్రం కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటాడు. బాహుబలి సెట్స్‌ మీద ఉండగానే సాహోకు ఓకే చెప్పిన ప్రభాస్‌.. ఇప్పుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. కరోనా ప్రభావం లేకపోయి ఉంటే ఈ సినిమా ఇప్పటికే చివరి దశకు వచ్చి ఉండేది. ఈ సినిమా తర్వాత ‘మహానటి’ ఫేం నాగ్ అశ్విన్‌తో సినిమా చేయనున్నాడు ప్రభాస్‌. ఈ చిత్రంలో రెబల్‌ స్టార్ దేవుడిగా కనిపిస్తాడని టాలీవుడ్ టాక్‌.

నాగ్‌ అశ్విన్‌తో సినిమా సెట్స్‌పైకి వెళ్లకముందే మరో పాన్ ఇండియా డైరెక్టర్ కు ప్రభాస్ ఓకే చెప్పాడన్న వార్త చక్కర్లు కొడుతోంది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు కేజీఎఫ్ తో  దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్. ప్రస్తుతం కేజీఎఫ్ రెండో పార్ట్‌ తో బిజీగా ఉన్న నీల్‌.. ఇప్పటికే ప్రభాస్‌కు కథ చెప్పగా అతను సరే అన్నట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. ప్రశాంత్‌, ప్రభాస్‌ కాంబోకు డీవీవీ దానయ్య ప్రొడ్యూసర్ అని తెలుస్తోంది. దీనికి బలం చేకూరుస్తూ ప్రశాంత్‌ బర్త్‌ డే సందర్భంగా డీడీవీ సంస్థ ‘మీ శైలిలో మీరు ఇండియన్ పరిధులు దాటి ముందుకెళ్లాలని ఆశిస్తున్నాం’ అని శుభాకాంక్షలు తెలిపింది. మరో విశేషం ఏమిటంటే మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణంలో జూనియర్ ఎన్టీఆర్ తో కూడా ప్రశాంత్‌ నీల్‌ ఓ సినిమా చేస్తున్నాడు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రం తర్వాత నీల్‌.. ప్రభాస్‌తో మూవీ చేసే అవకాశం ఉందట.

కేసీఆర్, జగన్ పై ఫైరవుతున్న ఓయూ జేఏసీ


తెలంగాణ నీళ్లను తరలించుకు పోయేందుకు కడుతున్న పోతిరెడ్డి ప్రాజెక్టును ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తక్షణమే నిలిపివేయకుండా హైదరాబాద్లో తిరగనివ్వబోమని ఓయూ నేతలు స్పష్టం చేశారు. శుక్రవారం ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు చైర్మన్ పరమేశంకు వినతిప్రతం సమర్పించారు. ఈ సందర్భంగా ఓయూ జేఏసీ నేతలు కల్వకర్తి ఆంజనేయులు, మాళిగ లింగస్వామిలు కేసీఆర్, జగన్మోహర్ రెడ్డిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి నీటిని ఉత్తర తెలంగాణకు, కృష్ణా నీటిని రాయలసీమకు తరలించుకుపోతే దక్షిణ తెలంగాణ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుంటే కేసీఆర్ ఫౌమ్ హౌజ్ లో పడుకున్నారంటూ ఎద్దేవా చేశారు.

ఎన్నికల్లో సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరులో కుర్చీ వేసుకొని ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పారని అన్నారు. మరీ ఇప్పుడు దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుంటే ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రా లేక ఉత్తర తెలంగాణకే ముఖ్యమంత్రో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులంతా కేసీఆర్ కు తొత్తులుగా వ్యవహరించడం వల్లే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఒక డ్రామా పార్టీగా మారిందంటూ ఓయూ జేఏసీ నేతలు ఫైరయ్యారు.

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నిర్మాణాన్ని టీఆర్ఎస్ నేతలు అడ్డుకోకపోతే వారికి బయట తిరిగనిచ్చేది లేదని స్పష్టం చేశారు. ఎక్కడికక్కడ అడ్డుకొని తీరుతామంటూ హెచ్చరించారు. ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డి ప్రాజెక్టు నిర్మాణం కోసం జారీ చేసిన 203 జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. లేకపోతే జగన్మోహన్ రెడ్డిని హైదరాబాద్లో తిరగనిచ్చేది లేదన్నారు ఇప్పటికైనా కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసి దక్షిణ తెలంగాణను అభివృద్ధి చేయాలని కోరారు.

పదో తరగతి పరీక్షల నిర్వహణలో చిన్న మెలిక!

High court

High court

తెలంగాణలో పదో తరగతి పరీక్షల వ్యవహారం హైకోర్టులో తేలడం లేదు. పరీక్షల నిర్వహణపై శుక్రవారం కూడా కోర్టులో విచారణ జరిగింది. పరీక్షల నేపథ్యంలో ప్రైవేట్ స్కూళ్ల హాస్టళ్లను తాత్కాలికంగా తెరిచేందుకు అనుమతిస్తామని కోర్టుకు తెలంగాణ విద్యాశాఖ తెలిపింది. ఈసారి పరీక్షలు రాయలేని వారికి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో అవకాశం కల్పిస్తామని కీలక వ్యాఖ్యలు చేసింది. ఐతే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసే వారిని రెగ్యులర్ విద్యార్థులుగానే పరిగణిస్తారా..

అని ఏజీని ప్రశ్నించింది కోర్టు. అంతేకాదు కంటైన్మెంట్ జోన్లలో ఉన్న విద్యార్థుల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది? దీనిపై ప్రభుత్వం అభిప్రాయాన్ని తెలుసుకొని రేపు కోర్టుకు తెలుపుతామని ఏజీ చెప్పారు. ఈ నేపథ్యంలో టెన్త్ పరీక్షలపై విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు.

వైద్యుడు సుధాకర్ కి‌ గుడ్ న్యూస్ చెప్పిన హైకోర్టు..!


వైద్యుడు సుధాకర్‌ తల్లి వేసిన హేబియస్‌ కార్పస్‌ హౌస్ మోషన్‌ పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం విచారించింది. సుధాకర్‌ డిశ్చార్జ్‌కి హైకోర్టు అనుమతి ఇచ్చింది. సీబీఐ విచారణకు సహకరించాలని డాక్టర్‌ సుధాకర్‌కు సూచించింది. విచారణలో పిటీషనర్ తరుపు న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. సుధాకర్ ను అరెస్ట్ చేసినట్లు చూపించకుండా గత నెల 16వ తేదీ నుంచి ఈ రోజు వరకూ విశాఖ పోలీసులు వారి ఆధీనంలో ఉంచుకున్నారని, తనకు వైద్యం అవసరం లేదని పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని సుధాకర్ స్వయంగా లేక రాసినా అధికారులు స్పందించకుండా వారి ఆధీనంలో ఉంచుకున్నారని చెప్పారు.

ఈ అంశంపై ధర్మాసనం పోలీసులను, సిబిఐని ప్రశ్నించింది. వారు సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. వాదనలు పూర్తి అయిన అనంతరం హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం సుధాకర్ చికిత్స పొందుతున్న ప్రభుత్వ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్‌కు తెలియజేసి ఎప్పుడైనా డిశ్చార్జ్‌ కావచ్చని పేర్కొంది. హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల సుధాకర్ తల్లి కావేరీబాయి సంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు సుధాకర్‌ కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. నర్సీపంట్నం చేరుకున్న సీబీఐ అధికారులు స్థానిక మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణవేణిని విచారించారు. తొలుత సుధాకర్‌ పనిచేస్తున్న ఆసుపత్రికి వెళ్లి సర్వీసు రికార్డు, హాజరు పట్టికను పరిశీలించారు.ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను సుధాకర్ ప్రవర్తన, తోటి ఉద్యోగులతో ఎలా ఉండేవాడని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

వారికి తిరుమల ఆలయంలోకి ప్రవేశం లేదు..!


తిరుమల శ్రీవారి దర్శనానికి ట్రయల్ రన్ ఈ నెల 8 నుంచి ప్రారంభిస్తున్నట్లు టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం 8, 9 తేదీల్లో టిటిడి ఉద్యోగులతో ట్రయల్ రన్ నిర్వహిస్తామని అన్నారు. భక్తులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్నారు. క్యూలైన్లలో కనీసం ఆరడుగుల భౌతిక దూరం పాటించాలని సూచించారు. నిబంధనలు పాటిస్తూ రోజుకి ఎంత మందికి దర్శనాలు చేయించేందుకు అవకాశం ఉండాన్న అంశంపై చర్చిస్తామన్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి సామాన్య భక్తులకు దర్శనాలకి అనుమతిస్తామని తెలిపారు. రోజుకు 7 వేల మందికి మాత్రమే దర్శనం కల్పిస్తామన్నారు. ఆన్ లైన్ ద్వారా దర్శనానికి రిజిస్టర్ చేసుకోవాలని చెప్పారు. రోజుకి అన్ లైన్ లో మూడువేల మందికి బుక్ చేసుకునేందుకు అనుమతిస్తామని తెలిపారు. 65 ఏళ్ళుపై బడిన వృద్ధులు, పడేళ్లలోపు పిల్లల్ని కొండపైకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు.

అదేవిధంగా దేశ వ్యాప్తంగా కంటైన్మెంట్ జోన్లు, రెడ్ జోన్ల పరిధిలో ఉన్నవారు దయచేసి దర్శనాలపై రావద్దని సూచించారు. అలాంటి ఏరియాల నుంచి ఒకవేళ ఆన్ లైన్లో బుక్ చేసుకున్నా కూడా అలిపిరి గేటు దగ్గర పరిశీలన అనంతరం నిలిపివేస్తామని తెలిపారు. ఉదయం ఆరున్నర నుంచి సాయంత్రం ఏడున్నర వరకూ మాత్రమే దర్శనాలకి అనుమతి ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆన్ లైన్ లో బుక్ చేసుకోలేని భక్తులు అలిపిరి గేటు దగ్గర బుకింగ్ కౌంటర్ దగ్గర ఆఫ్ లైన్ లో రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 11వ తేదీ నుంచి ఉదయం ఆరున్నర నుంచి ఏడున్నర వరకూ గంట పాటు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలకు అనుమతిస్తామని చెప్పారు. భద్రతా కారణాలతో అలిపిరి నడక మార్గం ద్వారా, ఘాట్ రోడ్డు ద్వారా మాత్రమే భక్తులను అనుమతిస్తున్నామని తెలిపారు. శ్రీవారి నడక మార్గంలో భక్తులని అనుమతించమన్నారు. లడ్డు ఆన్ లైన్ లో విక్రయాలు ఈ నెల 8వ తేదీ నుంచి నిలిపివేస్తున్నట్లు చెప్పారు.

అలిపిరి గేటు వద్ద రిజిస్ట్రేషన్ కౌంటర్ లో ధర్మల్ స్క్రీనింగ్ జరుగుతుందన్నారు. వాహనాలకు పూర్తి స్థాయిలో శానిటైజ్ చేసిన అనంతరమే కొండపైకి పంపుతామని తెలిపారు. భక్తులకు రాండంగా శాంపిల్స్ తీసుకుని కరోనా పరీక్షలు చేసేందుకు అలిపిరిలోనూ, కొండపైన ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కల్యాణ కట్టలో భక్తులకు తలనీలాలు తీసే అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. హుండీని భక్తులు తాకకుండా భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హుండీని తాకకూడదని భక్తులని అదేశించలేమన్నారు. ఇది మనోభావాలకు సంబంధించిన అంశమని తెలిపారు. ఉచిత అన్నదాన సత్రంలోకి అతి తక్కువ మందికి అనుమతించనున్నట్లు చెప్పారు. కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్క భక్తుడు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనపై కేటిఆర్ సమీక్ష

Khammam

Khammam

ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పై, పట్టణ ప్రాంతాల్లో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణానికి అవసరమైన చర్యల పై, ఇతర పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనపై హైదరాబాద్‌ లో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి  కేటీఆర్‌ సమీక్షించారు. ఖమ్మం నగరాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి కేటీఆర్‌.. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, కలెక్టర్‌, కమిషనర్లకు సూచించారు. తీసుకోవాలన్నారు. నిరంతరం అభివృద్ధి చెందుతున్న ఖమ్మం పట్టణంలో పేదలకు వసతి సౌకర్యాలను కల్పించాలని సూచించారు.

పలు పట్టణాలతో పాటు ఖమ్మం నగరంలో కూడా మౌలిక వసతుల కల్పనకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రజావసరాలకు అనుగుణంగా ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. పురపాలకశాఖ నుంచి అవసరమైన నిధులను అందజేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి కేటీఆర్‌ వివరించారు. మౌలిక వసతుల నిర్మాణ కార్యక్రమాల్లో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. నిర్మాణ పనుల్లో అలసత్వం వహించే కాంట్రాక్టర్ల నుంచి ఆ పనులను తొలగించి ఇతరులకు బాధ్యతలు అప్పజెప్పాలని అధికారులను ఆదేశించారు. ప్రజా రవాణాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలని అన్నారు. తాగునీటి కొరత లేకుండా మరిన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహించకుండా నిరంతరం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. నగరాలతో పాటు, పట్టణాల్లో పలు గ్రామాలు విలీనమయ్యాయని, వాటిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. నూతన మున్సిపల్‌ చట్టం ప్రకారం వాటి అభివృద్ధికి ప్రత్యేక నిధులను కేటాయించి ఆయా ప్రాంతాల్లో డ్రైనేజీలు, రోడ్లు, తాగునీరు, గ్రీనరీకీ అవసరమైన తక్షణ చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. తానే స్వయంగా ఈ నెల మూడో వారంలో ఖమ్మం నగరంలో పర్యటించి జరుగుతున్న అభివృద్ధ్దిని పరిశీలిస్తానన్నారు.

ఏపీలో భూ ప్రకంపన.. తెలంగాణ సేఫ్.. ఎందుకిలా?


దేశవ్యాప్తంగా భూమి కంపించింది. మన భారతదేశ ఫలకం.. చైనా సహా ఉత్తర ఆసియా ఫలకంతో ఢీకొట్టడం వల్లే ఈ భూ ప్రకంపనలు వస్తున్నాయని శాస్త్రవేత్తలు కొన్ని రోజుల క్రితం కనిపెట్టారు. అంతేకాదు.. ఇలా ఢీకొట్టడం వల్లే హిమాలయాలు అంత పెద్దగా ఏర్పాడ్డాయని నిర్ధారించారు.

మరి దేశమంతా భూప్రకంపనలు వచ్చి తెలంగాణలో ఎందుకు రాలేదన్నది ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న. తాజాగా తెలంగాణ పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ లో స్వల్పంగా భూకంపం వచ్చింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో భూమి కంపించింది. . కొన్ని సెకండ్లపాటు ఒంగోలులో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు ప్రజలు తెలిపారు. భూకంపం వచ్చిందేమోనని ప్రజలంతా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

ఒంగోలులోని గద్దలకొండ, మామిడి పాలెం, దేవుడు చెరువు, శర్మ కాలేజీ, అంబేద్కర్ నగర్ పరిసరాల్లో ఈ భూప్రకంపనలు వచ్చాయని స్థానికులు తెలిపారు. ఇవాళ ఉదయం 10.15 గంటలకు స్వల్పంగా భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చాలా మంది ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.

శుక్రవారం ఉదయం ఏపీతోపాటు కర్ణాటక, ఝార్ఖండ్ లో భూ ప్రకంపనలు సంభవించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఉదయం 6.55 గంటల సమయంలో ఝార్ఖండ్ లోని జంషెడ్ పూర్ లో భూమి కంపించింది. భూకంప తీవ్రత రెక్టర్ స్కేలుపై  4.7గా నమోదైందని అధికారులు తెలిపారు. ఇక కర్ణాటకలోని హంపిలో రిక్టర్ స్కేల్ పై 4  తీవ్రతతో భూమి కంపించింది. అయితే ఎలాంటి నష్టం ఈ రాష్ట్రాల్లో లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

అయితే పక్కనున్న ఏపీలో భూమి కంపించింది.. దేశమంతా భూమి ప్రకంపనలు వచ్చాయి. కానీ తెలంగాణలో మాత్రం భూ ప్రకంపనలు పెద్దగా రావని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. దీనికి కారణంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒక దక్కన్ పీఠభూమిగా ఉండడమే. అంటే ఒక పెద్ద శిలాజంగా తెలంగాణ రాష్ట్రం కింద పలకలున్నాయట.. అంటే మరీ అర్థమయ్యేలా చెప్పాలంటే కొన్ని లక్షల ఏళ్ల క్రితం.. లావాలతోనే లేక గుట్టలతోనే తెలంగాణ రాష్ట్రం కింద ప్రాంతంలో బండరాయిలు విస్తరించాయి. అది అలా బలంగా ఉండడంతోనే తెలంగాణ భూకంపాలు, ప్రకంపనలు ఉండవన్నది శాస్త్రవేత్తల మాట. ఈ ప్రాంతం భౌగోళికంగా ప్రపంచంలోనే నిలకడ కలిగి, అధిక ద్రవ్యరాశి గలది. అనేక పెద్ద నదులను కలిగివున్న ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది.

తెలంగాణ రాష్ట్రం భూకంప రహితమైన రాష్ట్రమని తెలుసు కాబట్టే ప్రపంచప్రఖ్యాత గూగుల్, అమేజాన్ సహా కార్పొరేట్ కంపెనీలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు వస్తాయని.. ఇప్పటికే చాలా సంస్థలు తమ విభాగాలు నెలకొల్పాయని తెలంగాణ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఇలా భూకంప రహిత ప్రాంతంగా తెలంగాణ ఉంది. దక్కన్ పీఠభూమి తెలంగాణను కాపాడుతోందని చెబుతున్నారు..

-నరేశ్ ఎన్నం

బాలయ్య మాటలకు హార్ట్ అయిన చిరంజీవి?


టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరైనా ఒక మంచి పని చేసేందుకు ముందుకొస్తే వెనక్కి లాగేందుకు పదిమంది సిద్ధంగా ఉంటారనేది తెల్సిందే. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు వీరు ముందుకు రారు.. వచ్చిన వాళ్లపై మాత్రం రాళ్లు వేసేందుకు సిద్ధంగా ఉంటారు. ప్రస్తుతం టాలీవుడ్లో ఇదే ఇష్యూ నడుస్తోంది. కేసీఆర్ తో జరిగిన మీటింగ్ కు తనను పిలువలేదని అసహనంతో బాలయ్య నోరుజారారు. భూములు పంచుకునేందుకు తలసానితో మీటింగ్ పెట్టకున్నారా? అనడంతో టాలీవుడ్లో అగ్గి రాజుకుంది. దీనిపై మెగాబ్రదర్ నాగబాబు తన యూట్యూట్లో బాలయ్యపై ఫైరయ్యారు. టీడీపీ హయాంలోనే భూములు పంచుకున్నారని.. నోరు అదుపు పెట్టుకో.. నువ్వు కింగ్ కాదు.. జస్ట్ హీరో అనడంతో బాలయ్య ఫాన్స్ నాగబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడిన సంగతి తెల్సిందే. అయితే నాగబాబును సపోర్టు చేస్తూ ఓ వర్గం.. బాలయ్యను మద్దతుగా ఓ వర్గం సోషల్ మీడియాలో ఒకరి పై ఒకరు కాలు దువ్వుకుంటున్నారు.

అయితే ఈ ఇష్యూపై మెగాస్టార్ చిరంజీవి మౌనంగా ఉన్నారు. అయితే కొందరు సినీ ప్రముఖులు టీవీ డిబెట్స్ లో పాల్గొని ఈ వివాదంలో పెట్రోల్ పోసి మరింత రాజేస్తున్నారు. ఈ వివాదాన్ని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుని వ్యక్తిగతంగా పాపులర్ అయ్యేందుకు ఉపయోగించుకుంటున్నారు. ఒకవైపు చిరంజీవి వర్సెస్ బాలయ్య ఇష్యూ కొనసాగుతుండగానే బాలకృష్ణ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్లో చిరంజీవి, నాగబాబుపై చేసిన కామెంట్స్ మరింత వివాదానికి దారితీశాయి. అమెరికాలో చిరంజీవి ఆధ్వర్యంలో ప్రొగ్రాం జరిగినప్పుడు ఐదు కోట్లు వచ్చాయని.. చివరికి కోటితో మా బిల్డింగ్ కట్టారని.. మిగతా నాలుగు కోట్లు ఏమైయ్యాయి? అంటూ ప్రశ్నించారు. తనపై నాగబాబే మాట్లాడుతున్నారని.. ఇండస్ట్రీ అంతా తనకే సపోర్టు వస్తుందని.. ఇంకా నేనేందుకు మాట్లాడాలంటూ కామెంట్స్ చేశారు. తనకు మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకోవాలంటూ ఘాటుగా స్పందించారు.

భూములు పంచుకుంటున్నారని ఆరోపణపై ఇప్పటికే ఇండస్ట్రీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఇలాంటి నేపథ్యంలో చిరంజీవి డబ్బులు స్వాహా చేశారనే అర్థం వచ్చేలా ఇంటర్వ్యూలో మాట్లాడటం చూస్తుంటే కావాలనే మెగాస్టార్ ను టార్గెట్ చేస్తున్నట్లు కన్పిస్తుందని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. బాలయ్య వ్యాఖ్యలపై చిరంజీవి నోచ్చుకున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ విన్పిస్తుంది. దీంతో ఇకపై తాను ఇండస్ట్రీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడని టాక్ విన్పిస్తోంది. షూటింగులు ప్రారంభించే విషయంలోనూ పక్కనే ఉండాలనుకుంటున్నారా? ప్రభుత్వం సినిమా షూటింగులకు పర్మిషన్ ఇచ్చాక సినిమాలకే పూర్తి సమయాన్ని కేటాయించాలని నిర్ణయించుకున్నారని సమాచారం. అయితే మరికొందరు మాత్రం చిరంజీవి ఇప్పటికే బాలయ్యతో ఫోన్లో మాట్లాడి వివాదానికి పుల్ స్టాప్ పెట్టారని అంటున్నారు. ఇదిలా ఉంటే టాలీవుడ్లో ఇప్పటివరకు అన్ని సమస్యలపై ముందుండి పరిష్కారానికి కృషి చేస్తున్న చిరంజీవి తనపై వస్తున్న నిందలకు హార్ట్ అయి ఒకసారి కాడి వదిలేస్తే? దిక్కు ఎవరనేది ఆసక్తిగా మారింది. చిరంజీవి కాడి వదిలేస్తే బాలయ్య మోస్తారా?.. మోయగలరా? అనేది మిలియన్ల డాలర్ల ప్రశ్న మారింది.

పోస్టుమార్టంలో ఏనుగు విషాద గాధ!

Kerala incident

Kerala incident

కేరళలో చంపేసిన ఏనుగు విషాద గాధ పోస్టుమార్టంలో బయటపడింది. ఆ ఏనుగు కళేబరానికి పశువైద్యులు జరిపిన పోస్టుమార్టం నివేదిక తాజాగా వెల్లడైంది. ఈ పోస్ట్‌ మార్టం రిపోర్ట్‌ లో దయనీయ విషయాలు వెలుగులోకొచ్చాయి. మరణించిన ఆ ఏనుగు రెండు వారాల ముందు నుంచి ఏమీ తినలేదని, తాగలేదని పోస్ట్‌ మార్టం రిపోర్ట్‌ లో తేలింది. పేలుడు పదార్థాల వల్ల ఏనుగు నోటి భాగం తీవ్రంగా గాయపడిందని, ఆహారం తీసుకోలేక పోయిందని తెలిసింది.

ఏనుగు నీళ్లలో మునగడం వల్ల, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారి ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని పోస్ట్‌ మార్టం రిపోర్ట్‌ లో వెల్లడైంది. గాయపడిన తర్వాత ఏనుగు ఎక్కువ సేపు బతకపోవడానికి ఇదే ప్రధాన కారణమని వైద్యులు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ ఘటనను సీరియస్‌ గా తీసుకున్న కేరళ ప్రభుత్వం నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ ఘటనలో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుంది.

జగన్ వద్దకు టాలీవుడ్.. బాలయ్య వస్తాడా?

టాలీవుడ్ ప్రముఖులు తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటి అయ్యి షూటింగ్ లకు అనుమతులు కోరారు. కానీ ఏపీ సీఎం జగన్ ను టాలీవుడ్ పట్టించుకోలేదన్న విమర్శలు వచ్చాయి. షూటింగ్ లకు అనుమతులు తెలంగాణలోనే చాలా? ఏపీలో వద్దా? అని పలువురు విమర్శించారు. అయితే తెలంగాణ ప్రభుత్వం మీటింగ్ లు, కమిటీల పేరిట కాలయాపన చేస్తుండడంతో షూటింగ్ ల అనుమతిపై జాప్యం జరుగుతోంది.

ఇక అన్ని వైపుల నుంచి వచ్చిన విమర్శలకు జడిసి ఎట్టకేలకు టాలీవుడ్ ఏపీ వైపు కదులుతోంది. ఏపీ సీఎం జగన్ ను టాలీవుడ్ పెద్దలు కలవడానికి మూహూర్తం నిర్ణయించారు. ఈనెల 9న టాలీవుడ్ ప్రముఖులతో సీఎం జగన్ భేటి ఖాయమైంది.

టాలీవుడ్ తో ఏపీ సీఎం జగన్ భేటికి సినీ రంగంలోని ప్రతి రంగం నుంచి ఇద్దరు ప్రముఖులను ఈ భేటికి తీసుకువెళుతున్నారని తెలుస్తోంది. డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిటర్లు, నిర్మాతలు, దర్శకులు, స్టూడియోల వారితోపాటు మా అసోసియేషన్ , ఫిల్మ్ చాంబర్ ల నుంచి కొంతమంది ప్రతినిధులు కూడా ఏపీ సీఎం జగన్ తో భేటికి హాజరవుతున్నారు.

ఇప్పటికే ఏపీ సీఎం జగన్ తో భేటి అయ్యే ప్రముఖల జాబితాను తయారు చేసినట్టు తెలిసింది. కానీ ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటికి తనను ఎవరూ పిలవలేదని నోరుపారేసుకున్న నందమూరి బాలక్రిష్ణను ఏపీ సీఎం జగన్ తో భేటికి పిలిచారో లేదో ఇంకా క్లారిటీ రాలేదు.

ప్రస్తుతానికి టాలీవుడ్ నుంచి దర్శకుల్లో రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల శివ వంటి దర్శకులు, మా అసోసియేషన్ నుంచి నరేశ్, జీవితలతోపాటు అగ్రహీరోలు చిరంజీవి, నాగార్జునలు ఈ సమావేశంలో పాల్గొంటారని తెలిసింది.

అయితే ఏపీ సీఎం జగన్ తో భేటిలో ప్రధానంగా షూటింగ్ లనే అంశమే కాకుండా ప్రధాన ఎజెండా వేరే ఉందని తెలుస్తోంది. ఏపీ సీఎం అపాయింట్ మెంట్ కోరినప్పుడే టాలీవుడ్ పరిశ్రమ విశాఖకు తరలివచ్చే అంశాలపై నివేదికలతో ముందుకు రావాలని జగన్ సూచించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లో చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై ఎజెండానే ప్రధాన అంశంగా జగన్ తో టాలీవుడ్ భేటి జరగబోతోందని తెలుస్తోంది..

-నరేశ్ ఎన్నం

గాంధీలో వైద్యుల కొరత!

Gandhi Hospital

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నాయి. వారం రోజుల నుంచి రోజుకు సగటున 150 నుంచి 200 వరకు కొత్త పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికి వెయ్యి పడక గదులుకి తోడు, అదనంగా 350 పడకలు ఏర్పాటు చేసేందుకు గాంధీ యంత్రాంగం సిద్ధమైంది.

కొత్తగా వచ్చే వారిని ఎక్కడ పెట్టాలనే అంశంపై డాక్టర్లు తర్జనభర్జన పడుతున్నారు. పడకల నిష్పత్తికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించలేదు. ఆ మేరకు వైద్య సిబ్బందిని కూడా నియమించక పోవడంతో విధుల్లో ఉన్న వైద్య సిబ్బందిపై తీవ్ర పనిభారం పడుతోంది. వైద్యులు రాసిన మందులను మంచంపై పడేయడం, ఆహారాన్ని కనీసం చేతికి కూడా ఇవ్వకుండా ఓ చోట వదిలి వెళుతుండడం లాంటి ఘటనలు  రోగులను మానసికంగా కుంగదీస్తున్నాయి. కరోనా సెంటర్‌ ఏర్పాటు చేసిన నాటి నుంచి మే 3వ తేదీ వరకు కరోనా పాజిటివ్‌ లక్షణాలతో 3020 మంది రోగులు చేరగా, వీరిలో విదేశీయులు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 448 ఉన్నారు.

‘మే’లో కొత్త రికార్డు సృష్టించిన మద్యం అమ్మకాలు


దేశంలోకి కోవిడ్-19 ఎంట్రీతో కేంద్రం లాక్డౌన్ విధించిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం లాక్డౌన్ 5.0 జూన్ 30వరకు కొనసాగనుంది. లాక్డౌన్ కారణంగా కేంద్రం, రాష్ట్రాలు పెద్దమొత్తంలో ఆదాయం కోల్పోయాయి. దీంతో లాక్డౌన్ 3.0లోనే కేంద్రం మద్యం అమ్మకాలను కొన్ని షరతులతో ఆయా రాష్ట్రాలకు అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం షాపుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకే మొగ్గుచూపాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు షూరు అయ్యాయి. దీంతో మద్యంప్రియులు షాపులు ఎదుట బారులు తీరి రికార్డు స్థాయిలో మద్యాన్ని కొనుగోలు చేశారు.

తగ్గిన బీర్ల వాటా.. పెరిగిన లిక్కర్ సేల్స్..
తెలంగాణలో మాత్రం మే 6నుంచి మద్యం సేల్స్ ప్రారంభమయ్యాయి. ఈ ఒక్క నెలలోనే రూ.1864.95కోట్ల మద్యం అమ్ముడై కొత్త రికార్డు సృష్టించింది. వేసవిలో బీర్ల అమ్మకాలు ఎక్కువగా అమ్ముడు కావాల్సి ఉండగా దీనికి భిన్నంగా బీర్ల వాటా తగ్గడంపై ఎక్సైజ్ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మేలో లక్షన్నర కేసుల బీర్లు అమ్ముడు కావాల్సి ఉండగా కేవలం 90వేల కేసులు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. బీర్ల వాటా తగ్గడానికి కరోనా మహహ్మరే కారణమని తెలుస్తోంది. మేలో బీర్ల ద్వారా 800కోట్ల ఆదాయంరాగా లిక్కర్ ద్వారా వెయ్యికిపైగా ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది. మేలో ప్రతి పదిరోజులకు మద్యం అమ్మకాలు పెరిగుతూ పోవడం గమనార్హం.

తాజాగా లాక్డౌన్ 5.0లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపులను ఇచ్చింది. ఇప్పటివరకు మద్యం సేల్స్ సాయంత్రం 6గంటల వరకు ఉండేది. తాజాగా మద్యం అమ్మకాలకు ప్రభుత్వం రాత్రి 8 గంటల వరకు అనుమతి ఇచ్చింది. దీంతో జూన్ నెలలో మరింత ఆదాయం సమకూరే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ భావిస్తుంది. తెలంగాణలో మద్యం రేట్లు పెంచినా, కరోనా విజృంభిస్తున్నా మద్యం సేల్స్ తగ్గకపోవడం విశేషం.

ఏనుగును చంపిన ఘటనలో ముగ్గురు అరెస్ట్!

Kerala incident

Kerala incident

కేరళలో గర్భంతో ఉన్న ఏనుగును చంపిన ఘటనలో ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేసినట్లు ఆ రాష్ట్ర సీఎం విజయన్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని సీఎం తెలిపారు. కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఇది మన దేశ సంస్కృతి కాదని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.

పైనాపిల్ సహా పండ్లలో బాంబులు పెట్టి అవి తింటుండడగా పేలి రెండు ఏనుగులు చనిపోయాయి. ఏనుగులను వేటగాళ్లు ఇలా చంపడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. పైనాపిల్ తినడం వల్ల చనిపోయి ఉండక పోవచ్చని.. అడవి పందుల కోసం బెల్లం పూత పూసిన బాంబును తిని మరణించవచ్చని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.