
టీటీడీ నిర్వహిస్తున్న సప్తగిరి మాసపత్రికలో ప్రచురించిన వ్యాసం వివాదానికి కేంద్ర బింధువుగా మారింది. ఈ మాసపత్రికకు ఒక చిన్నపిల్లాడు ఒక కథను పంపించాడు. కథలో కుశుడు సీతారాముల కొడుకు కాదని వాల్మీకి దర్బతో చేసిన బొమ్మ అంటూ బాలవాక్కు శీర్షికతో సప్తగిరి తాజా సంచికలో ప్రచురితమయ్యింది. స్కూల్ పిల్లాడు రాసిన వివాదాస్పదమైన కథను ప్రచురించిన సప్తగిరి ఎడిటోరియల్ బోర్డుపై టీటీడీ చర్యలకు ఉపక్రమించింది.
తొమ్మిదో తరగతి చదివే పునీత్ అనే పిల్లాడు రాసినట్లుగా చెప్పిన కథను కొద్దీ నెలల కిందట మరో మహిళ పేరుతో సప్తగిరి కార్యాలయానికి అందగా ప్రచురించకుండా నిలిపివేశారు. తాజాగా పునీత్ పంపిన కథను ఎడిటోరియల్ బోర్డు తిరస్కరించినా పబ్లిష్ కావడం విశేషం. ఈ వ్యవహారంపై బీజేపీ అనుబంధ సంస్థలు ఆందోళనలు చేశారు. హిందువుల మనోభావాల్ని దెబ్బ తీశారన్న ఆరోపణలు ఆరోపించారు. దీంతో టిటిడి క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.
సప్తగిరి లాంటి మాసపత్రికలో ఇలాంటివి రావటం ఏమిటంటూ రచ్చ పాఠకులు, హిందుత్వ సంస్థలు తమనిరసన లేఖల రూపంలో తెలియజేశారు. ఈ పిల్లాడి కథ వ్యవహారం ఏపీ ప్రభుత్వం మీద నిందలువేసే వరకూ వెళ్లటంతో టీటీడీ రంగంలోకి దిగింది. ఈ విషయంపై విచారణ జరిపి చివరకు ఇందుకు బాధ్యులుగా సప్తగిరి మాసపత్రిక చీఫ్ ఎడిటర్ రాధారమణితో పాటు సబ్ ఎడిటర్ ఉత్తర ఫల్ఘుణిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిన్నటి వరకూ భూముల వేలం వ్యవహారం వివాదమవగా తాజాగా సప్తగిరి మాస పత్రిక ప్రచురించిన కథ వివాదంగా మారింది.