పోర్న్ స్టార్ నుంచి బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ గా ఎదిగిన వ్యక్తి సన్నీ లియోన్. బాలీవుడ్ మాత్రమే కాకుండా పలు ప్రాంతీయ భాషల్లో కూడా నటించిన సన్నీకి చాలా మంది అభిమానులు ఉన్నారు. అందం, నటనతోనే కాకుండా తన వ్యక్తిత్వంతోనూ చాలా మంది హృదయాలను గెలుచుకుందామె. ఓ అనాథ బాలికను దత్తత తీసుకున్న సన్నీ.. మరెందరో అనాథ చిన్నారులకు సేవ చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ అమెరికాకు వెళ్లిన సన్నీ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. వైరస్ ప్రభావం దారుణంగా ఉన్న యూఎస్‌ఏకు కుటుంబ సమేతంగా వెళ్లిన సన్నీ.. రిస్క్ చేసిందని, ప్రమాదం కొనితెచ్చుకుందని అంతా భావించారు.
అయితే, ఇలాంటి టైమ్‌లో అమెరికాకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో సన్నీ స్వయంగా వెల్లడించింది. ఆమె భర్త డేనియల్ తల్లి అమెరికాలోనే నివాసం ఉంటోంది.ఆమెకు వయసు మీద పడింది. పైగా, కరోనా టైమ్‌లో వృద్ధులు మరి జాగ్రత్తగా ఉండాలని వైద్యులు, ఆరోగ్య సంస్థలు చెబుతున్నాయి. దాంతో, ఈ క్లిష్ట సమయంలో తన అత్తను ఒంటరిగా వదిలివేయడం మంచిది కాదని.. భర్త, పిల్లలతో కలిసి ఆమెరికా వెళ్లినట్టు లియోన్ చెప్పింది. ఒక కోడలిగా తన అత్తను చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని తెలిపింది. ముఖ్యంగా ఈ టైమ్‌లోనే ఆమెకు తన సహాయం ఎక్కువ అని, అందుకే యూఎస్ వచ్చానని చెప్పింది. పరిస్థితులు చక్కబడి అంతర్జాతీయ విమానాల రాకపోకలకు ప్రభుత్వాల నుంచి అనుమతి లభించిన తర్వాత తిరిగి ముంబైకి వస్తానని తెలిపింది. ప్రమాదం అని తెలిసినా.. తన అత్తకు సాయం చేసేందుకు సన్నీ చేసిన పనికి నిజంగా శభాష్ అనాల్సిందే కదా.!
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Sunny leone reveals why she and family flew to the us amid lockdown
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com