Home Blog Page 8453

అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై స్పందించిన జనసేన..


ఏపీలో టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్టు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈఎస్ఐలో 150కోట్ల అవినీతి జరిగినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ ఇటీవలే బయటిపట్టింది. ఈ కుంభకోణంలో అచ్చెనాయుడు అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో శుక్రవారం ఏసీబీ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో అచ్చెనాయుడిని అరెస్టుచేసి ఆయన ఇంట్లో సోదాలు చేశారు. అనంతరం కోర్టులో హాజరు పరచేందుకు విజయవాడకు పోలీసులు తరలిస్తున్నారు. అచ్చెనాయుడిని అక్రమంగా అరెస్టు చేశారంటూ టీడీపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలకు దిగుతున్నారు. తాజాగా అచ్చెనాయుడి అరెస్టుపై జనసేన పార్టీ స్పందించింది.

ఈమేరకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘అన్ని అక్రమాలపై దర్యాప్తు చేయాలి’ అంటూ ట్వీటర్లో ఆయన ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్టు అవినీతికి పాల్పడినందుకా? లేదా రాజకీయ కక్ష సాధింపు కోసమా అనే విషయంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. అవినీతి ఏ రూపంలో ఉన్నా దానికి బాధ్యులు ఎంతటి వారైనా జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. అయితే అసెంబ్లీ సమావేశాలకు నాలుగైదు రోజుల ముందు శ్రీ అచ్చెన్నాయుడు గారిని అరెస్టు చేయడం సందేహాలకు తావిస్తోందన్నారు.

అవినీతి ఏ రూపంలో ఉన్నా దానికి బాధ్యులు ఎంతటి వారైనా జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. అయితే అసెంబ్లీ సమావేశాలకు నాలుగైదు రోజుల ముందు అచ్చెన్నాయుడిని అరెస్టు చేయడం పలు సందేహాలకు తావిస్తోందని తెలిపారు. ఒక శాసనసభ్యుడిని అరెస్ట్‌ చేసే ముందు రాజ్యాంగ నియమ నిబంధనలను పాటించవలసిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. అచ్చెన్నాయుడు గారి అరెస్టులో అవి లోపించినట్లు కనిపిస్తున్నాయన్నారు. ఈ.ఎస్‌.ఐ.లో జరిగిన అవకతవకలతోపాటు ఇప్పటి వరకు జరిగిన అన్ని అక్రమాలపై దర్యాప్తు జరిపించాలని జనసేన డిమాండ్‌ చేస్తోందని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే టీడీపీ నేతలు సీఎం జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. బీసీ నేతను కావాలనే కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఎదురుదాడికి దిగుతున్నారు. అచ్చెనాయుడిని అరెస్టు చేయడానికి ముందు ఏసీబీ అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని కుటుంబ సభ్యులు అంటున్నారు. కనీసం మందులు వేసుకోనివ్వకుండా అచ్చెనాయుడిని అరెస్టు చేసి తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.

మరో క్రేజీ కాంబినేషన్.. కొరటాలతో బన్నీ?


సామాజిక స్పృహ ఉన్న దర్శకుడు కొరటాల శివ. రచయితగా పలు చిత్రాలకు పని చేసిన కొరటాల.. డైరెక్టర్ గా తన కంటూ ప్రత్యేక పంథా ఏర్పరుచుకున్నారు. ‘మిర్చి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్‌తో దర్శకుడిగా పరిచమయ్యారు. ఆ తర్వాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్‌ అనే నేను చిత్రాలతో టాప్ డైరెక్టర్ గా మారిపోయారు. పది బ్లాక్ బస్టర్ హిట్స్‌ ఇవ్వాలన్న టార్గెట్‌తో దర్శకుడిగా మారిన కొరటాల.. ఐదో హిట్ కోసం చిరంజీవితో ‘ఆచార్య’ తీస్తున్నాడు. సాధారణంగా ఒక మూవీ పూర్తయిన తర్వాతే మరోదాన్ని ప్రకటించడం శివ అలవాటు. ‘ఆచార్య’ సెట్స్‌పై ఉండగానే తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. తన ఆరో చిత్రాన్ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు దర్శకత్వం వహించబోతున్నట్టు సమాచారం.

ఈ మధ్య ‘అల వైకుంఠపురములో’తో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న బన్నీ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ‘పుష్ప’ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఆపై, వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ‘ఐకాన్‌’కు కమిట్మెంట్ ఇచ్చాడు. ఇది పూర్తయిన తర్వాత కొరటాల శివతో కలిసి పని చేస్తాడని ఇండస్ట్రీ టాక్. క్లాస్, మాస్‌ కలగలిసిన కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్‌ కు ప్రాధాన్యత ఇచ్చే బన్నీ ప్రతీ సినిమాలో లుక్ పరంగా కూడా చాలా జాగ్రత్త తీసుకుంటాడు. వీటితో పాటు తన కథలో సమాజానికి ఉపయోపడే సందేశం కూడా ఇచ్చే శివతో బన్నీ కలిస్తే అది క్రేజీ కాంబినేషన్ కానుంది.

అందుకే అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేశాం..

Acham naidu

 

Acham naidu

మాజీ మంత్రి టీడీఎల్పీ ఉపనేత ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్ పై ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవి కుమార్ స్పందించారు. శుక్రవారం ఉదయం 7.30కి అచ్చెన్నాయుడుని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారితో పాటు సీకే రమేష్, జి.విజయకుమార్, డాక్టర్ జనార్దన్, ఈ. రమేష్‌బాబు, ఎంకేబీ చక్రవర్తిలను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత కూడా అచ్చెన్నాయుడు అరెస్ట్ పై స్పందించారు. మందుల కొనుగోళ్లలో ఆయన అక్రమాలకు పాల్పడిన నేపథ్యంలోనే ఆయనను అరెస్టు చేశారని తెలిపారు. వైద్య పరికరాల కొనుగోళ్లలోనూ అవినీతి జరిగిందని ఆమె చెప్పారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. సీఎం జగన్ ను అరెస్ట్ చేసినప్పుడు సంబరాలు చేసుకున్నవారు ఇప్పుడెలా మాట్లాడతారని ప్రశ్నించారు.

చంద్రబాబు చెప్పినట్లుగా అచ్చెన్నాయుడిని లాక్కుని వెళ్లలేదని మామూలుగానే తీసుకెళ్లారని తెలిపారు. అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవద్దా? అది కేంద్ర ప్రభుత్వ డబ్భైనా రాష్ట్ర ప్రభుత్వం డబ్భైనా చర్యలు తీసుకోవాలి కదా? అని హోంమంత్రి సుచరిత చెప్పుకొచ్చారు. కాగా అచ్చెన్నాయుడిని ఇవాళ ఉదయం శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సాయంత్రం 4గంటలకు విజయవాడలో ఏసీబీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చనున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.

బర్త్‌డే స్పెషల్: గోపీచంద్ ‘సీటీమార్’పై కీలక అప్‌డేట్


చాలా రోజుల నుంచి ఓ హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరో గోపీచంద్ తన తాజా చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో ఆయన ఇప్పుడు ‘సీటీమార్’ అనే సినిమా చేస్తున్నాడు. తమన్నా హీరోయిన్. దిగంగన సూర్యవంశి మరో నాయిక. భూమిక‌ చావ్లా, రెహ‌మాన్‌, ప్రదీప్ రావత్, దేవ్ గిల్, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, అజయ్, జయప్రకాశ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కబడ్డీ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీని శ్రీనివాసా సిల్వర్ స్ర్కీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. లాక్‌డౌన్కు ముందే మూడు షెడ్యూల్స్ పూర్తి చేయగా.. దాదాపు 60 శాతం చిత్రీకరణ పూర్తయింది.

శుక్రవారం గోపీచంద్‌ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్‌ హీరో ఫస్ట్‌ లుక్‌కు సంబంధించి రెండు చిత్రాలను రిలీజ్ చేసింది. ఓ మైదానంలో వెనకాల క్రీడాకారిణులు ఉంగా.. ట్రాక్ సూట్, క్యాప్‌, మెడలో విజిల్‌తో గంభీరంగా నిలుచున్నాడు. ఇదే డ్రస్‌లో మరో క్లోజప్‌ ఫొటోను రిలీజ్ చేశారు. ఈ మూవీలో ఆంధ్రప్రదేశ్ కబడ్డీ కోచ్‌గా గోపీ, తెలంగాణ టీమ్ కోచ్‌గా తమన్నా నటిస్తున్నారు. ఆమె పాత్ర పేరు జ్వాలా రెడ్డి అని యూనిట్ ప్రకటించింది. హీరో పాత్ర పేరు తెలియాల్సి ఉంది. కాగా, టీవీ జర్నలిస్ట్ పాత్రలో దిగాంగన నటిస్తోంది.

షూటింగ్‌ తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో సీటీమార్లో మిగిలిన భాగం చిత్రీకరణ ఆగస్టు ఫస్ట్‌ వీక్‌లో మొదలు పెట్టాలని చిత్ర యూనిట్‌ ప్లాన్ చేసింది. సాధ్యమైనంత త్వరగా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసి సినిమాను రిలీజ్‌ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

చంద్రబాబు, లోకేష్ బుక్కైనట్టేనా?


టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ ల మెడకు ఉచ్చు బిగించేందుకు రంగం సిద్ధమైందా? మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసి ఈ మేరకు వైసీపీ ప్రభుత్వం హెచ్చరికలు పంపిందా? ఇక త్వరలోనే చంద్రబాబును, లోకేష్ ను మూసేసే ప్లాన్ చేసిందా అంటే ఔననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు.. తాజాగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తే అలానే అనిపిస్తోందని విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి షాక్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం తాజాగా చంద్రబాబు, లోకేష్ ను టార్గెట్ చేసినట్టు ప్రచారం సాగుతోంది.

తనను చాలా ఇబ్బందులు పెట్టిన చంద్రబాబు ఎలాగైనా సరే జైలుకు పంపాలని సీఎం జగన్ కంకణం కట్టుకున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం గద్దెనెక్కగానే అమరావతి రాజధాని కుంభకోణంపై పడ్డారు. ఆ తర్వాత చంద్రబాబు పాలనలో అవినీతిని నిగ్గుతేల్చాలని కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మంత్రివర్గ ఉపసంఘం విచారణలో తాజాగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూశాయని తెలిసింది. మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాలోకేష్ కు అత్యంత సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ కేంద్రంగా ఈ అవినీతి సాగినట్టు సబ్ కమిటీ తేల్చింది.ఈ వేమూరి హరికృష్ణ గతంలో ఈవీఎంల ట్యాంపరింగ్, చోరీ కేసులో ప్రధాన నిందితుడు. ఇతడికి చెందిన బ్లాక్ లిస్ట్ లో ఉన్న టెరాసాఫ్ట్ కు గత చంద్రబాబు ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఫైబర్ గ్రిడ్ పనులను కట్టబెట్టినట్టు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ విచారణలో తేలినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుతోపాటు లోకేష్ పాత్ర కూడా సీబీఐ దర్యాప్తులో వెలుగుచూసే అవకాశం ఉందని తెలుస్తోంది.

టీడీపీ సర్కార్ హయాంలో ముఖ్యంగా నారా లోకేష్ ఐటీశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో చేపట్టిన అతిపెద్ద పథకం ఫైబర్ గ్రిడ్ తోపాటు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక పథకాల్లో వందల కోట్ల అవినీతి జరిగినట్టు తాజాగా కేబినెట్ సబ్ కమిటీ నిర్ధారించినట్టు సమాచారం.

మొత్తంగా 2015-19 మధ్య సంక్రాంతి కానుక, రంజాన్‌ తోఫా పథకం పేరిట సరుకుల సేకరణకు రూ.1,766.28 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో రూ.158.38 కోట్ల మేర అవినీతి జరిగినట్లు మంత్రివర్గ ఉపసంఘం గుర్తించినట్టు సమాచారం.

ఈ రెండు స్కాంలలో ప్రధానంగా ఫైబర్ గ్రిడ్ లో నాటి మంత్రి లోకేష్ తోపాటు.. చంద్రన్న కానుకల్లో అవినీతిలో నాటి సీఎం చంద్రబాబు అవినీతి ఉందని కేబినెట్ సబ్ కమిటీ నివేదికలో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్ లు బుక్కైనట్టేనని వైసీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

గాంధీలో సమ్మె విరమించిన జూడాలు..


గాంధీ ఆస్పత్రిలో వైద్యులపై కరోనా పేషంట్ బంధువులు దాడి చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం రాత్రి జూడాలు మెరుపు సమ్మెకు దిగిన సంగతి తెల్సిందే. గత రెండ్రోజులుగా గాంధీ ఆస్పత్రిలోని జూనియర్ డాక్టర్, సీనియర్ వైద్యులు, వైద్య సిబ్బంది విధులను బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. బుధవారం ఆస్పతి ఎదుట వైద్యులంతా బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వైద్య సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే సమ్మెను మరింత ఉధృతం చేయనున్నట్లు ప్రకటించారు.

కోవిడ్-19 వైద్యసేవలందిస్తున్న గాంధీ ఆస్పత్రి వైద్యులు సమ్మెకు దిగడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం గాంధీ ఆస్పత్రి వచ్చి చర్చించాలని జూడాలు డిమాండ్ చేశారు. దీంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈనేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అక్కడికి చేరుకొని వారికి చర్చలు ఆహ్వానించారు. తాము సీఎంతో చర్చిస్తామని జూడాలు భీష్మించారు. అనంతరం ఈటల రాజేందర్ జూడాలు చర్చించారు. ఈమేరకు తమ డిమాండ్లను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇవ్వడంతో జూడాలు శాంతించారు.

కోవిడ్-19 లక్షణాలు లేని రోగులకు ఆయా జిల్లాల్లోని ఆస్పత్రుల్లోనే చికిత్స అందించాలని జూడాల సంఘం డిమాండ్ చేసింది. కరోనా పాజిటివ్ కేసులన్నీ గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేయడంతో వైద్యులపై అధిక భారం పడుతుందన్నారు. వైద్యులు ఒత్తిడి లోనుకుండా మరో ఆస్పత్రి అన్ని జిల్లాల్లో కోవిడ్ సేవలను అందించాలని కోరారు. వైద్యులపై ఒత్తిడి లేకుండా అదనంగా 30శాతం సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. వైద్యులు, నర్సులు, శానిటేషన్ వర్కర్లను నియమించాలని వెంటనే నియమించి అదనపు సిబ్బందిని రిజర్వ్‌లో ఉంచాలని వారు డిమాండ్ చేశారు. హెల్త్ వర్కర్లకు సరిపడా పీపీఈ కిట్లు అందేలా చూడాలన్నారు. తాము సూచించిన పీపీఈ కిట్లనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని సూచించారు.

జూనియర్ డాక్టర్ల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. జూడాల డిమాండ్లపై ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. వచ్చే 15రోజుల్లో తమ డిమాండ్ల ప్రభుత్వం పరిష్కరించాలని జూడాలు డిమాండ్ చేశారు. ఈ 15 రోజుల్లోగా సమస్యలు పరిష్కరించకపోతే మరోసారి విధులను బహిష్కరించి సమ్మెకు దిగుతామని జూనియర్ డాక్టర్ సంఘం హెచ్చరించారు. మంత్రి ఈటల రాజేందర్ జూనియర్ డాక్టర్లతో రెండుసార్లు చర్చించిన అనంతరం జూడాలు సమ్మెను విరమిస్తున్న ప్రకటించారు. తక్షణమే తాము విధుల్లో చేరుతున్నట్లు ప్రకటించారు. దీంతో కోవిడ్-19రోగులు, వారి బంధులు కొంత ఊపిరి పీల్చుకున్నారు.

జర్నలిస్టులను భయపెడుతున్న కరోనా!

Journalists

కరోనా కట్టడి పోరులో ముందుండే పోలీసులు, డాక్టర్లు, నర్సులకు సోకి వారిని భయపెట్టిన కోవిద్ ఇప్పుడు జర్నలిస్టులను భయపెడుతోంది. కొత్తగా 11 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ అని తేలింది. దింతో ఆ 11 మంది జర్నలిస్టులకు ఒక్కొక్కరికి 20 వేల రూపాయల చొప్పున, మొత్తం రెండులక్షల ఇరవై వేల రూపాయల  ఆర్థిక సహాయం ను తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ ప్రకటించారు.  ఆయా పాత్రికేయుల బ్యాంకు ఖాతాల్లో ఈ సొమ్ము జమ చేశారు.

కరోనా పాజిటివ్  వచ్చిన  ముప్పై మంది జర్నలిస్టులకు 20 వేల రూపాయల చొప్పున ఆరు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశామని తెలిపారు. అదే విధంగా హోంక్వారైంటైన్ లో ఉన్న  13 మంది జర్నలిస్టులకు 10 వేల రూపాయల చొప్పున ఒక లక్ష 30 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 7 లక్షల 30 వేల రూపాయలను అకాడమీ నిధుల నుండి అందించామని తెలిపారు.  బయటికి వెళ్లే సందర్భంలో జర్నలిస్టులు ప్రతి ఒక్కరు మాస్కు, సానిటైజర్ ను వాడాలని తెలిపారు. ఈ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. కరోనా వైరస్ పై అవగాహన కలిగించడంలో జర్నలిస్టులది కీలక పాత్ర అని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి జర్నలిస్టులకు అన్ని విధాలు అండగా ఉంటుందని తెలిపారు.

ఇంటర్ ఫలితాలు విడుదల.. కృష్ణా జిల్లా టాప్

ఇంటర్మీడియట్ ప్రధమ, ద్వితీయ పరీక్షా ఫలితాలను విడుదల చేసిన మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. విజయవాడలో ఓ హోటల్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ ప్రభావం రీత్యా ఇవాళ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేయడం చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. దేశంలొనే ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. పరీక్షలు నిర్వహించాం కాని అనేక సవాళ్ళను ఎదుర్కొన్నామని చెప్పారు. వాల్యూయేషన్ మొదలు పెట్టిన నాలుగురోజులుకే లాక్ డౌన్ ను కేంద్రం ప్రకటించిందన్నారు. ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యూయేషన్ కు సెంటర్లను పెంచామని, 25 వేల మందిని స్పాట్ వాల్యూయేషన్ కు ఉపయోగించినట్లు చెప్పారు.

ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను 5,07,230 విద్యార్ధినీ, విద్యార్ధులు రాశారని చెప్పారు. వీరిలో 3,00,560 ఉత్తీర్ణత సాధించారన్నారు. ఉత్తీర్ణత శాతం 59 గా ఉందని చెప్పారు. మొదటి ఏడాది పరిక్షలను 2,57,169 మంది బాలికలు రాశారని, వీరిలో 1,64,365 మంది బాలికలు ఉత్తీర్ణత సాధిచారని చెప్పారు. 54 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. మొదటి ఏడాది పరిక్షలు 2,49,611బాలురు రాశారని, వీరిలో 1,36,195 మంది బాలురు ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. 55 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.

రెండవ సంవత్సరం పరీక్షలు 4,35,655 మంది విద్యార్దినీ, విద్యార్దులు రాశారని చెప్పారు. వీరిలో 2,76,389 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. 63 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. రెండవ సంవత్సరం పరీక్షలు 2,22,798 మంది బాలికలు రాశారని, వీరిలో 1,49,010 మంది ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. బాలికల్లో ఉత్తీర్ణత 67 శాతం ఉందన్నారు. రెండ సంవత్సరం పరీక్షలు 2,12,857 బాలురు రాయగా, వీరిలో 1,27,379 మంది ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. బాలుర ఉత్తీర్ణత 60 శాతంగా ఉందన్నారు.

ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ కలిపి పరీక్షలు 10, 65,155 మంది రాశారన్నారు. ఇంటర్ లో గ్రేడ్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయడంతో మొదటి సంవత్సరం ఫలితాల్లో సబ్జెక్ట్ లవారీగా మార్కులు మంత్రి ప్రకటించారు. రెండవ సంవత్సరం పలితాల్లో సబ్జెక్ట్ లవారీగా గ్రేడ్ పాయింట్లలో పలితాలు ప్రకటించారు. ఇంటర్ పరీక్షల ఫలితాలకు సంబంధించి ఫిర్యాదులుంటే 18002749868 నెంబరులో పిర్యాదు చేయవచ్చని మంత్రి తెలిపారు.

ఇంటర్‌ఫస్ట్ ఇయర్ టాప్ 3 జిల్లాలు

1. కృష్ణా ( 75శాతం)
2. వెస్ట్ గోదావరి, గుంటూరు (65 శాతం)
3. విశాఖ ( 63 శాతం)

ఇంటర్ సెకండియర్ టాప్ 3 జిల్లాలు

1. కృష్ణా ( 75 శాతం )
2. వెస్డ్ గోదావరి ( 71 శాతం )
3. నెల్లూరు, విశాఖపట్నం ( 68 శాతం )

నారా లోకేష్ అరెస్ట్ తప్పదా..?


రాష్ట్రంలో రాజకీయ అలజడి రేపిన ఈ.ఎస్.ఐ స్కామ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు చుట్టుకోనుందనే వాదనలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఈఎస్ఐకి సంబంధించి మందులు, పరికరాలు, టెలీమెడిసిన్ వంటి విషయాల్లో టెండర్లు పిలువ కుండా నామినేషన్ పద్దతిలో పనులు కేటాయించడం వల్ల నాయకులు అధికారులు ఆర్ధికంగా లబ్ధిపొందారనేది ఏసీబీ విచారణలో తేలిందని అధికారులు చెబుతున్నారు. ఈ స్కామ్ లో రూ.150 కోట్ల అవినీతి జరిగిందని ఏసీబీ వెల్లడించింది. ఇందులో 19 మంది ప్రమేయం ఉందని తేల్చారు. నామినేషన్ల విధానంలో పనులు కేటాయించే విషయంలో అచ్చెన్నాయుడితో పాటుగా మరో మాజీ మంత్రి ప్రమేయం ఉన్నట్టు అధికారులు వెల్లడించిన వివరాలను బట్టి తెలుస్తోంది.

నామినేటెడ్ పనులు డి.ఐ. ఎం.ఎఫ్ డైరెక్టర్లు రమేష్ కుమార్ కు చెందిన సంస్థ తోపాటు, ఇతర సంస్థకు కేటాయించి తద్వారా హవాలా ద్వారా నగదు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. నామినేటెడ్ పనులు తాను చెప్పిన సంస్థకు ఇవ్వండి అని మాజీ మంత్రి లోకేష్ చెప్పారని చర్చ జరుగుతోంది. మరోవైపు అచ్చెన్న ఆదేశాల మేరకు తాము డీఐఎంఎస్ డైరెక్టర్ అయిన రమేష్ కుమార్ కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చినట్టు విచారణలో ఈ.ఎస్.ఐ ఉన్నతాధికారులు అంగీకరించినట్లు సమాచారం.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వ్యవహారంలో ఇంత తీవ్రంగా స్పందించడానికి ఇదే కారణమటున్నారు. బాబు అచ్చెన్న వ్యవహారాన్ని కిడ్నాప్ గా అభివర్ణించడం, బీసీలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వెనుక ఈ కేసు విషయంలో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే ప్రభుత్వం ముందుకు వెళ్లకుండా ఉంటుందనే భావిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అచ్చెన్నాయుడుకు, అయన కుటుంబ సభ్యులతో చంద్రబాబు మాట్లాడే ప్రయత్నం చేసినా సాద్యం కాలేదు.

ఈ.ఎస్.ఐ కేసులో కాకపోయినా మాజీ మంత్రి నారా లోకేష్ ను ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులోనైనా లోకేష్ అరెస్ట్ తప్పదనే వాదనలు ఉన్నాయి. ఫైబర్ గ్రిడ్ టెండర్లు, పనుల్లో అప్పట్లో ఐటి శాఖ మంత్రిగా పని చేసిన లోకేష్ కేంద్ర బిందువుగా ఉన్నారు. చైనా నుంచి సెటాప్ బాక్స్ లు కొనుగోలు చేసిన సమయంలో అధిక ధరలు చెల్లించారని అప్పతో అసెంబ్లీలో సైతం వైసీపీ ఈ అంశాన్ని లేవనెత్తింది. ఫైబర్ గ్రిడ్ పనుల్లో అవినీతి చోటు చేసుకుందని నిర్ధారించిన మంత్రి వర్గ ఉపసంఘం తన నివేదికను నిన్నే ముఖ్యమంత్రి జగన్ కు అందజేసింది. ఈ అంశంపై దర్యాప్తు సంస్థల చేత విచారణ జరిపించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

పది మంది సమక్షంలోనే సాహో డైరెక్టర్ నిశ్చితార్థం


కరోనా వైరస్ కారణంగా తెలుగు చిత్ర పరిశ్రమలో అన్ని పనులూ ఆగిపోయినా.. పెళ్లి బాజాలు మాత్రం మోగుతూనే ఉన్నాయి. కొంతమంది తమ బ్యాచిలర్ లైఫ్‌కు పుల్‌స్టాప్ పెట్టారు. లాక్‌డౌన్ సమయంలోనూ రూల్స్‌ పాటిస్తూ కొంతమంది వివాహం చేసుకోగా.. మరికొందరు నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆ లిస్ట్‌లో యంగ్ డైరెక్టర్ సుజీత్ కూడా చేరాడు. ‘సాహో’ మూవీతో దేశ వ్యాప్తంగా పేరు సంపాదించుకున్న సుజీత్.. తాను ప్రేమించిన ప్రవళిక అనే దంత వైద్యురాలితో నిశ్చితార్థం చేసుకున్నాడు. హైదరాబాద్‌లో ఈ వేడుక అత్యంత నిరాడంబరంగా జరిగింది. లాక్‌డౌన్ నేపథ్యంలో ఇరు కుటుంబాలకు చెందిన కేవలం పది మంది మాత్రమే హాజరయ్యారు. ఎంగెజ్మెంట్‌కు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్‌లో వైరల్‌గా మారాయి. అయితే, పెళ్లి తేదీ గురించి ఇంకా సమాచారం రాలేదు.

షార్ట్‌ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సుజీత్‌… ‘రన్‌ రాజా రన్’ సినిమాను డైరెక్ట్ చేశాడు. తన తొలి చిత్రంతోనే సూపర్ హిట్‌ కొట్టిన ఈ యంగ్‌స్టర్ తన రెండో సినిమాలోనే ప్రభాస్‌ను డైరెక్ట్ చేసే చాన్స్ కొట్టేశాడు. ఇప్పుడు లూసిఫర్ రీమేక్‌లో ఏకంగా మెగాస్టార్‌ చిరంజీవిని డైరెక్ట్ చేయబోతున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ లో నటిస్తున్న చిరు.. అది పూర్తయిన వెంటనే లూసిఫర్ రీమేక్‌ను పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు.

ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలో పరిస్థితి దిగజారుతోందా?


దేశంలోకి కరోనా వైరస్ ఎంట్రీ ఇవ్వగానే కేంద్రం లాక్డౌన్ విధించింది. కేవలం పదుల సంఖ్యలో ఉన్నప్పుడు లాక్డౌన్ విధించినా వైరస్ కట్టడి చేయడంలో కేంద్రం విఫలమైంది. రోజురోజుకు వేలల్లో నమోదవుతున్న కేసుల సంఖ్యను పరిశీలిస్తే వైరస్ కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని స్పష్టంగా అర్థమవుతోంది. దీంతో కేంద్రం ‘కరోనాతో సహజీవనం’ అంటూ కొత్త పల్లవి అందుకుంది. దేశం సంగతి కొంచెంసేపు పక్కన పెట్టి తెలుగు రాష్ట్రాల గురించి చూస్తే పరిస్థితి మరోలా ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వైరస్ కేసుల సంఖ్యలో నువ్వా.. నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి.

ఏపీ కంటే తెలంగాణలో రోజురోజుకు పరిస్థితి దిగజారిపోతున్నట్లు కన్పిస్తున్నాయి. అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్డౌన్ విధించారు. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమై ప్రభుత్వానికి అన్నివిధలా సహకారం అందించారు. ప్రభుత్వం తొలుత కఠిన చర్యలతో కరోనా కొంతమేర కట్టడి అయినట్లు కన్పించింది. కొన్నిరోజులుపాటు అన్ని జిల్లాలో సింగిల్ డిజిట్ కేసులే నమోదయ్యాయి. దీంతో పరిస్థితి అదుపులోని ఉందనే భావన అందరిలో నెలకొంది. హైదరాబాద్ మహానగరం మినహా అన్ని జిల్లాలు కరోనా ఫ్రీ గా మారుతున్న సందర్భంలో మరోసారి కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

రాష్ట్రంలో లాక్డౌన్ ఎత్తేయడంతో జీచ్ఎంసీతోపాటు మళ్లీ అన్ని జిల్లాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన పది రోజులుగా కేసుల సంఖ్య భారీగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తుంది. అంతేందుకు గురువారం నాటి పరిస్థితే తీసుకుంటే రాష్ట్రంలో 209 కేసులు కొత్తగా నమోదయ్యాయి. హైదరాబాద్ మహానగరంలోనే అత్యధికంగా 175కేసులు నమోదవడం గమనార్హం. మరోవైపు తెలంగాణతో ఏపీని పొలిస్తే అక్కడ పరిస్థితులు కొంతమెరుగ్గా ఉన్నాయి. ఏపీలో టెస్టుల సంఖ్య ఎక్కువ చేస్తున్న కేసులు తక్కువగానే నమోదవుతున్నాయి. ఏపీలో గురువారం 182కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాలు కూడా తెలంగాణలో ఇటీవల కాలంలో ఎక్కువ నమోదవుతున్నాయి.

ప్రస్తుతానికి ఏపీలో 5,429 కేసులుండగా తెలంగాణలో 4,320 కేసులున్నాయి. అయితే ఏపీలో టెస్టుల సంఖ్య ఎక్కువగా చేస్తున్నప్పటికీ కేసులు ఎక్కువగా నమోదవడం లేదు. అదే తెలంగాణలో టెస్టులు తక్కువగా చేస్తున్నప్పటికీ కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో ఏపీతో పోలిస్తే తెలంగాణ పరిస్థితి దిగజారినట్లు కన్పిస్తుంది. మరణాల్లోనూ తెలంగాణలో ఎక్కువగా నమోదవుతున్నాయి. ఏపీలో 80మంది వైరస్ తో మృతిచెందగా తెలంగాణలో 165మంది మృత్యువాతపడినట్టు గణాంకాలు చెబుతున్నాయి. గురువారం ఏపీలో ఇద్దరు మరణించగా తెలంగాణలో తొమ్మిదిమంది మృతిచెందటం గమనార్హం. తెలంగాణలో లాక్డౌన్ తర్వాత కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరింత అప్రతమతంగా ఉండాల్సిన అవసరం ఉంది. సీఎం కేసీఆర్ దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే..!

అచ్చెన్నాయుడుని కిడ్నాప్ చేశారు: CBN


మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్ పై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన వీడియో కాన్ఫెరెన్స్ మాట్లాడుతూ ప్రభుత్వం అచ్చెన్నాయుడుని అరెస్టు చేయడం కాదని కిడ్నాప్ చేసిందన్నారు. ఆయనకి ఏం జరిగినా ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. శాసనసభ పక్ష ఉపనేతగా ఉన్న వ్యక్తిని అరెస్టు చేసే సమయంలో చట్టంలో పేర్కొన్న అంశాలను పాటించలేదన్నారు. ఇటువంటి చర్యలకు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకొక తప్పదన్నారు.

జగన్ ప్రభుత్వం తప్పుడు విధానాలను ఎత్తిచూపడం, బడుగు, బలహీనవర్గాలకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపై ప్రశ్నిస్తున్నందుకు సీఎం జగన్ అచ్చెన్నాయుడిపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ప్రజల్లో జగన్‌ మోసాలకు, అవినీతికి వ్యతిరేకంగా వస్తున్న అసంతృప్తి పెరిగి ఫ్రస్ట్రేషన్‌గా మారడంతో ఇటువంటి ఉన్మాద చర్యలకు పాల్పడు తున్నారని అన్నారు.

ఈ వ్యవహారంపై సీయం జగన్‌, హోం మంత్రి, డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించడం, బీసీ సబ్‌ప్లాన్‌ నిధులు మళ్లీంపు, నామినేషన్‌ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వంటి అంశాలు ఈ నెల 16 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని అచ్చెన్నాయుడు సిద్ధమవడతో ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడిందన్నారు.

ఈ అంశంపై కుటుంబ సభ్యులు ఫోన్‌లో కాంటాక్ట్‌ చేసినా ఫోన్‌ అందుబాటులో లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఫోన్‌ చేసినా అచ్చెన్నాయుడు ఫోన్‌ అందుబాటులో లేదన్నారు. కనీసం మందులు కూడా వేసుకొనివ్వలేదన్నారు. ఇది జగన్‌ అరాచకం, ఉన్మాదం తప్ప మరేమీ కాదన్నారు.

ఇక నుండి ప్రతి10రోజుల్లోనే లక్ష కేసులు?

Corona virus

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజూకు పెరుగుతున్నది. వైరస్‌ విజృంభిస్తున్న తీరు.. తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. గత 24 గంటల్లో దేశంలో నమోదు అయిన పాజిటివ్‌ కేసుల సంఖ్య పది వేలు దాటింది. ఒక్క రోజే 10956 కేసులు రికార్డు అయ్యాయి. ఒకే రోజులో పదివేల మార్క్‌ను దాటడం దేశంలో ఇదే మొదటిసారి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా వైరస్‌ వల్ల 396 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొన్నది.  దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 297535కు చేరుకున్నది. 141842 మందికి వైరస్‌ యాక్టివ్‌గా ఉన్నది.  147195 మందికి వైరస్‌ నుంచి కోలుకుంటున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొన్నది.  వైరస్‌ వల్ల దేశంలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 8498కి చేరుకున్నది.

మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదు అయ్యాయి. ఆ రాష్ట్రంలో ఒక్క రోజే 3607 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 152 మంది మరణించారు. ఓవరాల్‌గా మహారాష్ట్రలో 97648 కోవిడ్‌19 కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆ రాష్ట్రం పాజిటివ్‌ కేసుల విషయంలో కెనడాను దాటేసింది. మహారాష్ట్రలో 46078 మంది కోలుకున్నారు. ఒక్క ముంబైలోనే 54085 కేసులు ఉన్నాయి. ఆ సిటీలో ఇప్పటి వరకు 1954 మంది మరణించారు.

సీబీఐకి చేరనున్న రంగయ్య కేసు?

Rangaiah case

Rangaiah case

పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం పరిధిలోని రామగిరి మండలం రామయ్యపల్లికి చెందిన దళితుడైన శీలం రంగయ్య లాకప్ డెత్ కేసు సీబీఐకి అప్పగించాలని, త్వరగా న్యాయ విచారణ జరపాలని, తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్‌ కు లేఖ రాశారు. రంగయ్యను గతనెల 24న పోలీసులు వన్యప్రాణుల చట్టం కింద అరెస్టు చేశారని పోలీసు దెబ్బలు తాళలేక, వేధింపుల వల్ల 26వ తేదీన లాకప్‌ లో మరణించినట్టు అనుమానాలున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. 24వ తేదీన రంగయ్యను అరెస్టు చేసినట్టు ఎఫ్ఐఆర్‌ లో పేర్కొన్నారని, 26వ తేదీన రంగయ్య చనిపోయినట్టు చెబుతున్నారని, 24న అరెస్టు చేస్తే 26 వరకు పోలీసు స్టేషన్‌ లోనే ఎందుకు ఉంచారని లేఖలో అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు ఇచ్చిన ఎఫ్ఐఆర్ మీద కూడా పలు అనుమానాలు ఉన్నాయని చెప్పారు.

రంగయ్య తప్పు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేదన్న టీ కాంగ్రెస్ నేతలు.. ఆ పేరుతో వేధించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. రంగయ్య ఆచారాల ప్రకారం అతడిని పూడ్చి పెట్టి సమాధి చేస్తారని, కానీ, పోలీసులు అందుకు భిన్నంగా వారి ఆచారానికి భిన్నంగా మృతదేహాన్ని దహనం చేశారని చెప్పారు. ఇది మరిన్ని అనుమానాలకు తావిస్తోందన్నారు. పోలీసులు రంగయ్య కుటుంబాన్ని బెదిరించి కాంప్రమైజ్ కావాలని ఒత్తిడి చేస్తున్నారని లేఖలో ఆరోపించారు. గతంలో మంథనిలోనే మధుకర్ అనే దళితుడి అనుమానాస్పద మృతి విషయంలో కూడా పోలీసులు ఎలాంటి ఆధారాలు బయటపెట్టలేదని టీ కాంగ్రెస్ నేతలు తమిళి సై సౌందర్ రాజన్‌ కు గుర్తు చేశారు.

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్…!


టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ఆయనను శుక్రవారం ఉదయం 7.30 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి నిమ్మాడకు మూడు వందల మందికిపైగా పోలీసులు చేరుకున్నారు. అచ్చెన్నాయుడు నివాసానికి చేరుకున్న పోలీసులు ఇంటి ప్రహరీ గోడ దూకి ఆవరణలోకి ప్రవేశించి అనంతరం తలుపులు కొట్టడంతో ఇంటి లోపలివారు తలుపులు తీశారు.

దీంతో పోలీసులు ఇంట్లోకి ప్రవేశించి అచ్చెన్నాయుణ్ని అరెస్టు చేశారు. అక్కడి నుంచి పోలీసు వాహనంలో తీసుకు వెళ్లారు. అచ్చెన్నాయుడు కుమారుడు సురేష్ కు అరెస్టుకు సంబంధించిన నోటీసు ఇచ్చారు. ఈ నోటీసుల్లో వివిధ సెక్షన్ ల వివరాలు వెల్లడించారు. అచ్చెన్నాయుడిని తొలుత విశాఖపట్నం తరలిస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. అనంతరం విజయవాడకు తరలిస్తున్నట్లు సమాచారం.

టీడీపీ హయాంలో అచ్చెన్నాయుడు కార్మికశాఖ మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో ఈఎస్‌ఐ ఆసుపత్రులకు మందులు, ఇతర పరికరాల కొనుగోలులో అవకతవకలు జరిగాయని గతంలోనే అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. విచారణ చేపట్టిన ఏసీబీ గతంలోనే అచ్చెన్నాయుడుకు నోటీసులు ఇచ్చింది. ఈ రోజు అరెస్టు చేసింది. ఇదే విషయంలో ఈ.ఎస్.ఐ ఉన్నతాధికారి ఒకరిని తిరుపతిలో అరేసు చేసినట్లు సమాచారం.

క్రేజీ యాక్షన్ కాంబినేషన్ నుండి కొత్త తరహా కథ !


తమిళ్ స్టార్ హీరో సూర్య తన తర్వాతి సినిమాని యాక్షన్ డైరెక్టర్ హరితో ఫైనల్ చేసుకున్న సంగతి తెలిసిందే. ముందుగా సూర్య డైరెక్టర్ శివతో సినిమా చేయాల్సి ఉంది. కానీ శివకు రజనీకాంత్ ప్రాజెక్ట్ సెట్టవడంతో హరితో సినిమాకు రెడీ అయ్యాడు సూర్య. వీరి కాంబినేషన్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ‘సింగం’ ప్రాంఛైజీలోని యాక్షన్ సినిమాలే. ఈ సారి కూడా వీరిద్దరూ అలాంటి పోలీస్ స్టోరీతోనే సినిమా చేస్తారని అనుకున్నారంతా. కానీ అలా చేయట్లేదట. ఇప్పటికే ‘సింగం’ సిరీస్ నందు మూడు చిత్రాలు చేసి ఉండటంతో ఈ సారి కొత్త తరహా కథను చూజ్ చేసుకున్నారని తమిళ్ మీడియాలో టాక్ నడుస్తోంది.

ఈ సారి పక్కా మాస్ స్క్రిప్ట్ అయిన ‘సింగం’ సినిమాల తరహాలో పోలీస్ కథలా ఉండదట. ఈ విషయం తెలిసిన సూర్య ఫ్యాన్స్ గతంలో చేసిన ‘ఆరు, వేల్’ లాంటి డిఫరెంట్ మూవీ ఏదైనా చేస్తే బాగుంటుందని ఆశ పడుతున్నారు. మరి ఆరవసారి కలిసి పనిచేస్తున్న ఈ క్రేజీ యాక్షన్ కాంబినేషన్ ఎలాంటి సినిమాను అందిస్తారో చూడాలి. ఏమైనా సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్స్ చాల మందే ఉన్నా, ప్రతి సినిమాలో కొత్తగా ట్రై చేస్తూ.. వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులకు డిఫరెంట్ చిత్రాలను అందిస్తున్న హీరోల్లో సూర్య పేరు ముందు వరుసలో ఉంటుంది.

అందుకే హీరో సూర్య ఖాతాలో ‘సింగం’ వంటి యాక్షన్ ఎంటర్ టైనర్ లతో పాటు ‘గజినీ’, ‘సెవెన్త్ సెన్స్’ వంటి ఓ కొత్తరకం సినిమాలు.. అలాగే ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ వంటి డిఫరెంట్ లవ్ స్టోరీలు ఉన్నాయి. అయితే ప్రతి సినిమాను ఓ ఛాలెంజింగ్ గా తీసుకుని చేసే ఈ స్టార్ హీరో ఈ మధ్య బాక్సాఫీస్ వద్ద వరుస డిజాస్టర్ లు ఇస్తున్నాడు. మరి సూర్య – హరి సినిమాతోనైనా.. సూర్య మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.

ఊహించని స్థాయిలో కొత్త కేసులు!

Telangana

Telangana

తెలంగాణలో ఊహించని స్థాయిలో కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 209 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో 175, మేడ్చల్‌ లో 10, రంగారెడ్డిలో 7, కరీంనగర్ మహబూబ్ నగర్ లో 3 చొప్పున, వరంగల్ అర్బన్‌, అసిఫాబాద్, సిద్దిపేటలో 2 చొప్పున, ములుగు, కామారెడ్డి, వరంగల్ రూరల్, సిరిసిల్లలో ఒక్కో కేసు నమోదయ్యాయి. ఇతర ప్రాంతాల నుంచి తెలంగాణకు వచ్చిన వారిలో ఒకరికి పాజిటివ్ వచ్చింది.

రాష్ట్రంలో నిన్న మరో 9 మంది చనిపోయారు. తాజా కేసులతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 4,320 కి చేరింది. వీరిలో 449 మంది విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు, వలస కార్మికులు ఉన్నారు. కరోనా వైరస్‌‌ తో పోరాడుతూ తెలంగాణలో ఇప్పటి వరకు 1993 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 2162 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక తెలంగాణలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 165కి చేరింది.