
కరోనా వైరస్ కారణంగా తెలుగు చిత్ర పరిశ్రమలో అన్ని పనులూ ఆగిపోయినా.. పెళ్లి బాజాలు మాత్రం మోగుతూనే ఉన్నాయి. కొంతమంది తమ బ్యాచిలర్ లైఫ్‌కు పుల్‌స్టాప్ పెట్టారు. లాక్‌డౌన్ సమయంలోనూ రూల్స్ పాటిస్తూ కొంతమంది వివాహం చేసుకోగా.. మరికొందరు నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆ లిస్ట్‌లో యంగ్ డైరెక్టర్ సుజీత్ కూడా చేరాడు. ‘సాహో’ మూవీతో దేశ వ్యాప్తంగా పేరు సంపాదించుకున్న సుజీత్.. తాను ప్రేమించిన ప్రవళిక అనే దంత వైద్యురాలితో నిశ్చితార్థం చేసుకున్నాడు. హైదరాబాద్‌లో ఈ వేడుక అత్యంత నిరాడంబరంగా జరిగింది. లాక్‌డౌన్ నేపథ్యంలో ఇరు కుటుంబాలకు చెందిన కేవలం పది మంది మాత్రమే హాజరయ్యారు. ఎంగెజ్మెంట్‌కు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్‌లో వైరల్‌గా మారాయి. అయితే, పెళ్లి తేదీ గురించి ఇంకా సమాచారం రాలేదు.
షార్ట్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సుజీత్… ‘రన్ రాజా రన్’ సినిమాను డైరెక్ట్ చేశాడు. తన తొలి చిత్రంతోనే సూపర్ హిట్ కొట్టిన ఈ యంగ్‌స్టర్ తన రెండో సినిమాలోనే ప్రభాస్‌ను డైరెక్ట్ చేసే చాన్స్ కొట్టేశాడు. ఇప్పుడు లూసిఫర్ రీమేక్‌లో ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయబోతున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ లో నటిస్తున్న చిరు.. అది పూర్తయిన వెంటనే లూసిఫర్ రీమేక్‌ను పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు.