Home Blog Page 8452

హీరోయిన్ సిక్రెట్ పెళ్లి.. ఫొటోలు నెట్టింట వైరల్!


కరోనా లాంటి విపత్కర పరిస్థితులు సినిమా షూటింగులు వాయిదా పడగా.. థియేటర్లు మూతపడ్డాయి. దీంతో సెలబ్రెటీలంతా ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఇలాంటి సమయాల్లోనూ పెళ్లిళ్లు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే పలువురు సినిమా స్టార్లు లాక్డౌన్లోనే పెళ్లి చేసుకొని ఇంటివారయ్యారు. టాలీవుడ్లో నిర్మాత దిల్ రాజు, హీరో నిఖిల్ పెళ్లి చేసుకొని ఓ ఇంటి వాళ్లయ్యారు. తమ పెళ్లి వేడుక జీవితంలో ఓ తీపి గుర్తుగా మిలిగిపోవాలనుకునే వాళ్లు మాత్రం పెళ్లి వేడుకలను ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నారు.

తాజాగా ఓ కుర్ర హీరోయిన్ సిక్రెట్ గా పెళ్లి చేసుకొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. జూన్ 12న(నేడు) ఉదయం మయూరి పెళ్లి చేసుకొంది. ఎవరికీ తెలియండా మయూరి పెళ్లి చేసుకోవడంతో ఈ వార్త మీడియాలో హల్చల్ చేసింది. పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మయూరి తన బాల్య స్నేహితుడైన అరుణ్ నే సిక్రెట్ గా పెళ్లి చేసుకోవడం కన్నడ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

https://www.instagram.com/p/CBU8Ztdjoso/

https://www.instagram.com/p/CBUazPjAbao/

గతంలో వీరద్దరు ప్రేమించుకుంటున్నారనే వార్తలు మీడియాలో వచ్చాయి. కాగా శుక్రవారం బెంగళూరులోని జేపీ నగర్ శ్రీ తిరుమలగిరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అరుణ్-మయూరి క్యాటారీ పెళ్లి జరిగింది. ప్రస్తుతం వారి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన పెళ్లి గురించి మయూరి క్యాటరీ ఇన్స్టాగ్రామ్ లో స్పందించింది. ‘అవును.. నేను అరుణ్ను జూన్ 12వ తేదీన వివాహం చేసుకొన్నాను. పదేళ్ల మా స్నేహానికి ఈ రోజు అర్ధవంతమైన ముగింపు లభించింది.. మా పెళ్లికి సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే అందిస్తాను’ అని మయూరి తన సందేశాన్ని పోస్టు చేసింది. దీంతో ఆమె అభిమానులు, నెటిజన్లు నవ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

టీడీపీ మాజీ ఎమ్మెల్యే, ఆయన తనయుడు అరెస్ట్..!


రాష్ట్రంలో వివిధ కేసుల్లో తెలుగు దేశం పార్టీ నాయకుల అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇ.ఎస్ ఐ కేసులో నిన్న మాజీ మంత్రి, టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత కె.అచ్చెన్నాయుడు ను శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో అరెస్టు చేసిన సంగతి విదితమే. రవాణా శాఖ నిబంధనలకు విరుద్ధంగా బిఎస్-౩ వాహనాలను తయారీ సంస్థ నుంచి కొనుగోలు చేసి బిఎస్-4 వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేయించిన వ్యవహారంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్‌రెడ్డిని అనంతపురం పోలీసులు శంషాబాద్ లో శనివారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. వీరిని శంషాబాద్ నుంచి అనంతపురం తరలిస్తున్నారు.

కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే బిఎస్-3 వాహనాల విక్రయాలకు గడువు ముగియడంతో అశోక్ లైలాండ్ సంస్థ తాన వద్ద ఉన్న 154 లారీ చాసిస్ లను రద్దు (తుక్కు) రూపంలో విక్రయించేందుకు సిద్ధం అయ్యింది. వాటిని కొనుగోలు చేసిన జేసీ కుటుంబం బిఎస్-4 వాహనాలుగా దొంగ రిజిస్ట్రేషన్ లు చేయించాయి. రాష్ట్రంతో పాటు నాగాలాండ్, తమిళనాడు, కర్ణాటక, తదితర రాష్ట్రాల్లో వీటిని రిజిస్ట్రేషన్ చేయించారు. లారీ చాసిస్ లను ఉపయోగించి బస్సులను తయారు చేశారు. అదేవిధంగా జెసి కుటుంబం వద్ద ఈ వాహనాలను కొనుగోలు చేసిన కొందరు మోసపోయామని గ్రహించి అనంతపురంలో ఆయన ఇంటి వద్ద ఇటీవల ధర్నా నిర్వహించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసిన రవాణా శాఖ పూర్తి వివరాలతో నివేదికను ప్రభుత్వానికి అప్పగించింది. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలను అరెస్టు చేయడంతో తాడిపత్రిలోని జేసీ నివాసానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేరుకుంటున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

రామ్ సినిమాలో రణబీర్ కపూర్ ?


గత నాలుగేళ్లుగా బాలీవుడ్ నిర్మాతల చూపు టాలీవుడ్ సినిమాల స్టోరీల పై పడింది. ఈ మధ్య ఇక్కడ హిట్టైన సినిమాలని హిందీలోకి రీమేక్ చేయడానికి బాలీవుడ్ నిర్మాతలు బాగా ఇంట్రస్ట్ చూపుతున్నారు. ఇప్పటికే ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ భారీ హిట్టై వసూళ్ల వర్షం కురిపించడంతో.. తెలుగులో హిట్ అయిన ‘జెర్సీ, ఆర్ఎక్స్100’, ఎవడు సినిమాలను కూడా రీమేక్ చేస్తున్నారు. అలాగే విజయ్ దేవరకొండ క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న రెండవ సారి జంటగా వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రం యొక్క హిందీ రీమేక్ రైట్స్ ను ప్రముఖ బాలీవుడ్ చిత్ర నిర్మాత కరణ్ జోహార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

కాగా మరొక తెలుగు సినిమాని కూడా హిందీలోకి రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా కూడా రీమేక్ అవుతుందట. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. హీరో రామ్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్ హీరోయిన్లుగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను రాబట్టింది. దాంతో ఈ చిత్రం రెట్టింపు లాభాలను సొంతం చేసుకుంది. మొత్తానికి, ఇస్మార్ట్ శంకర్ పూరికి మరియు హీరో రామ్ కి సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది,

మరి రణబీర్ కపూర్ కి కూడా ఈ సినిమా సూపర్ హిట్ ని ఇస్తుందా..? అలాగే రామ్ పాత్రలో రణబీర్ కపూర్ ఎలా నటిస్తాడో ! నవంబర్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందట. ఇక ఈ సినిమాలో నటించే ఇతర నటీనటుల గురించి, సినిమా వివరాల గురించి తెలియాల్సి ఉన్నాయి.

నయనతారకు ప్రేమ పై ఉన్న ఆసక్తి పెళ్లి మీద లేకపాయే !


లేడీ సూపర్ స్టార్ నయనతార వ్యక్తిగత జీవితం.. ముఖ్యంగా ఆమె నిజజీవిత ప్రేమ కథలు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాయి. పైగా సౌత్ సినీ ఇండస్ట్రీలోనే ఏ స్టార్ హీరోయిన్ కు లేనివిధంగా ఈ ముదురు భామకు ఫుల్ క్రేజ్ ఉంది. ప్రస్తుతం విఘ్నేష్ శివన్ తో నయనతార పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతూ ఎప్పటికపుడూ మీడియాకి మంచి కంటెంట్ ను ఇస్తోంది. వీరి ప్రేమాయణం చాలా ఏళ్లుగా నడుస్తూనే ఉన్నా ఇంకా కిక్ మాత్రం తగ్గలేదు. ఇద్దరూ తరచు తమ రిలేషన్ ఎలివేట్ అయ్యేలా హాలీడే ట్రిప్పులకు, పార్టీలకు వెళ్తుంటారు. అయితే వీరి వ్యక్తిగత బంధానికి శుభం కార్డ్ పడే సమయం ఆసన్నమైందనే వార్తలు గత కొన్ని రోజులుగా కోలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.

త్వరలోనే ఈ జోడీ వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారట. పెళ్లికి నయనతార తొందరపడకపోయినా విఘ్నేష్ శివన్ ఇంట్లో మాత్రం తొందరపెడుతున్నారట. అందుకే నయనతార పెళ్లికి రెడీ అవుతోందని, ఆగష్టులో వీరి వివాహం జరిగే అవకాశం ఉందని కోలీవుడ్ ఫిల్మ్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. లాక్ డౌన్ కి ముందు నయనతార జంట విదేశాలకు వెళ్లి సరదాగా గడిపి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడే వీరి ఎంగేజ్మెంట్ కూడా అయిపొయిందని కూడా కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది.

మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే నయన్ లేదా విఘ్నేష్ ఎవరో ఒకరు స్పందించే వరకు ఆగాల్సిందే. ఏమైనా నయనతారకు తన పెళ్లికి వార్తలు బాగా అలవాటు అయిపోయాయి. అసలు కరెక్ట్ ఏజ్ లో పెళ్లి అయి ఉంటే.. ఈ పాటికి నయనతారకు టీనేజ్ ఏజ్ పిల్లలు ఉండేవాళ్ళేమో. కానీ ఏం చేస్తాం.. నయనతారకు ప్రేమ పై ఉన్న ఆసక్తి పెళ్లి మీద లేకపాయే.

మా అమ్మాయిని షూటింగ్‌కు వెళ్లనివ్వను..


కరోనా వైరస్‌ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. భారత్‌లో తీవ్ర దూరం దాల్చిన ఈ మహమ్మారి ఇప్పటికే రెండున్నరల లక్షల మందికి సోకింది. కరోనాను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ విధించడంతో చాలా మంది ఉపాధి కోల్పోయారు. ఎన్నో రంగాలు దెబ్బతిన్నాయి. అందులో ప్రధాన రంగం సినిమా ఇండస్ట్రీ. షూటింగ్స్‌, సినిమా విడుదల ఆగిపోవడంతో నటీనటులు, సాంకేతిక నిపుణులుతో పాటు ఇండస్ట్రీలో దినసరి వేతనంతో పని చేసే కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యే నిబంధనలు సడలించగా… తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో షూటింగ్స్‌ అనుమతి లభించింది. దాంతో షూటింగ్స్‌ కోసం చాలా మంది ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కానీ, వైరస్‌ వ్యాప్తి తగ్గకపోగా.. మరింత విజృంభిస్తున్న నేపథ్యంలో కొందరిలో భయం ఇంకా పెరిగింది.

బాలీవుడ్‌లో పలువురు కరోనా బారిన పడి మృతి చెందడంతో ఇండస్ట్రీలో గుబులు రేగింది. కొంతమంది సీనియర్ నటులు షూటింగ్స్ కి వెళ్లడానికి భయపడుతున్నారు. ముఖ్యంగా 60ఏళ్ళు పై బడిన నటులు ఇళ్లకే పరిమితం కావాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ సీనియర్ నటుడు శక్తి కపూర్ తాను ఇప్పట్లో షూటింగ్స్ కి హాజరు కాని స్పష్టం చేశారు. అలాగే తన కూతురు శ్రద్దా కపూర్ ను కూడా ఇంటి నుంచి బయటకు పంపించనని చెప్పారు. బాలీవుడ్‌లో పలు చిత్రాలు చేసిన శ్రద్ధా… ప్రభాస్ సరసన ‘సాహో’లో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ప్రస్తుత ఉన్న పరిస్థితుల్లో తాను షూటింగ్స్ లో పాల్గొనాలనుకోవడం లేదని, శ్రద్ధాను కూడా పంపించబోనని శక్తి చెప్పారు. కరోనా వైరస్‌ ప్రభావం తగ్గలేదు కాబట్టి మున్ముందు పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయన్నారు. ఇప్పుడు మనిషి ప్రాణాలకంటే ఏదీ ముఖ్యం కాదన్నారు. వైరస్‌ ప్రభావం తగ్గకముందే షూటింగ్స్ ప్రారంభించడం భావ్యం కాదని, ఇంకొంత కాలం వేచిచూడడం మంచిదన్నారు.

‘గజదొంగ’కు దూరం జరుగుతోన్న హీరోలు !

‘దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ సినిమాల డైరెక్టర్ వంశీకృష్ణ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వర్రావు’ అనే బయోపిక్ ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం మొదలైంది. పైగా హీరో పాత్రకు సంబంధం లేని కొన్ని సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. అంతలో హీరో రానా సినిమా నుండి తప్పుకున్నాడు. ఆ తరువాత యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఈ సినిమాను తీయాలని నిర్ణయించుకున్నప్పటికీ.. సినిమా కూడా మొదలైనప్పటికీ సినిమా నుండి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా మధ్యలోనే తప్పుకున్నాడు.

అప్పటి నుండి ఇప్పటిదాకా హీరో దొరకట్లేదు అట. ఏ హీరో దగ్గరకు పోయినా దొంగ పాత్ర అనగానే భయపడిపోతున్నారట. సినిమాలో హీరో పాత్ర పక్కా నెగిటివ్ పాత్ర అని మన హీరోలు భావించే సినిమా నుండి తప్పుకుని ఉండొచ్చు. అయితే సినిమాలో దొంగతనం చేసే సన్నివేశాలు చాల బాగుంటాయని.. అలాగే టైగర్ నాగేశ్వరరావు పాత్ర తాలూకు సన్నివేశాల్లోనే మంచి ఫన్ ఉంటుందని గజదొంగగా కామెడీ బాగా చేస్తాడట. మరి చివరకి ఈ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారో చూడాలి.

కాగా ఇండియన్ రాబిన్ హుడ్ గా పేరుగాంచిన స్టువర్ట్‌ పురానికి చెందిన ఈ టైగర్ నాగేశ్వరరావు 1980 – 90 దశకాల్లో స్టూవర్టుపురం గజదొంగగా నేషనల్ లెవల్లో పేరు తెచ్చుకున్నాడు. అలాంటి టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ అంటే అప్పటి విషయాలు బాగానే ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. ఈ బయోపిక్ లో బోల్డ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి ప్రముఖ మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు.

ఒకే పీఎస్ లో 2 రోజుల్లోనే 22 కరోనా కేసులు

బెన్హ

కరోనావైరస్ హైదరాబాద్ లో విలయతాండవం చేస్తోంది. డాక్టర్లను, నర్సులను, పోలీస్ శాఖను వణుకుపుట్టిస్తోంది… రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పోలీస్ అధికారులు…  బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో నిన్న ఏడుగురు పోలీసులకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ కాగా.. ఇవాళ ఆ సంఖ్య  15 మందికి చేరింది.. ఇప్పటి వరకు బంజారాహిల్స్ పీఎస్ పరిధిలోనే 15 మంది పోలీసు అధికారులకు కరోనా సోకడంతో ఖాకీలు వణికిపోతున్నారు.. గత మూడు రోజుల నుంచి జరుపుతున్న పరీక్షల్లో వరుసగా కరోనా కేసులు బయట పడుతున్నాయి. కనిపించని శత్రువు కరోనాతో ముందుండి పోరాటం చేస్తున్న పోలీసులను కరోనా వెంటాడడం ఆందోళన కలిగించే విషయం.. దీంతో అప్రమత్తమైన అధికారులు తగు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.

పొత్తుపై పవన్ క్లారిటీ!

Pawan kalyan

జనసేన బీజేపీ పొత్తుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. తమ పార్టీ బీజేపీ తోనే కలిసి పని చేయాలని నిర్ణయించుకుందని… రాష్ట్ర స్థాయిలోనూ, పార్లమెంట్ నియోజకవర్గాల స్థాయిలోనూ ఇరు పార్టీల మధ్య సమన్వయం కోసం కమిటీలను కూడా ఏర్పాటు చేసుకున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. ఏదైనా రాజకీయ కూటమితో కలిసి పనిచేయాలని ఆహ్వానం వస్తే… అందులో బీజేపీ కూడా ఉంటేనే వారితో కలిసి పని చేయాలని పవన్ కళ్యాణ్ జనసేన నేతలకు సూచించారు. బీజేపీ లేని కూటమితో భాగస్వాములు కావద్దని మరోసారి తేల్చిచెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం, పోరాటం కోసం ఇతర రాజకీయ పక్షాలతో కలిసి ముందుకు వెళ్లవలసిన పరిస్థితులు ఏర్పడినప్పుడు జనసేన పార్టీకి మిత్రపక్షమైన బీజేపీతో కలిసి ముందుకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ జనసేన నేతలకు సూచించారు. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో బీజేపీయేతర పార్టీ నుంచి ఆహ్వానాలు వస్తున్నాయని కొందరు పార్టీ నేతలు తన దృష్టికి తీసుకొస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.

రాష్ట్రానికి భారీ వర్ష సూచన!

Rains

తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు భారత వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. నైరుతి రుతుప‌వ‌నాలు, అల్ప‌పీడ‌నం ప్ర‌భావంతో రాగ‌ల‌ 24 గంట‌ల్లో తెలంగాణ‌, గోవా రాష్ట్రాల‌తోపాటు కొంక‌ణ్‌ లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని మ‌ధ్య మ‌హారాష్ట్ర‌, మ‌ర‌ఠ్వాడా, కోస్తాంధ్రా, యానాం, ఉత్త‌ర క‌ర్ణాట‌క‌, విద‌ర్భ‌, అసోం, మేఘాల‌యాల్లో కూడా వ‌చ్చే 24 గంట‌ల వ్య‌వ‌ధిలో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది.

నైరుతి రుతుప‌వ‌నాల ప్ర‌భావంవ‌ల్ల మ‌ధ్య అరేబియా స‌ముద్రంలో కొన్ని ప్రాంతాలు, మ‌హారాష్ట్ర‌లో ముంబై స‌హా ప‌లు ప్రాంతాలతోపాటు ఒడిశా, ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రాల్లో, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, ద‌క్షిణ గుజ‌రాత్‌, ద‌క్షిణ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, జార్ఖండ్‌, బీహార్ రాష్ట్రాల్లోని మ‌రికొన్ని ప్రాంతాల్లో రాగ‌ల 48 గంట‌ల్లో వ‌ర్షాలు కురుస్తాయ‌ని ఐఎండి తెలిపింది. నైరుతి రుత‌ప‌వ‌నాలు మ‌హారాష్ట్రలోకి ప్ర‌వేశించడంతో గురువారం ఆ రాష్ట్రంలో ఆరెంజ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. జూన్ 15క‌ల్లా మ‌హారాష్ట్ర అంత‌టా రుతుప‌వ‌నాలు విస్త‌రించ‌నున్నాయి.

‘తలైవి’ షూట్ ప్లాన్.. చీర లాగే సీనే !


తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ‘తలైవి’ అనే టైటిల్ తో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత గారి జీవితం ఆధారంగా బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కాగా చిత్రబృందం చెన్నైలోని ఓ స్టూడియోలో తరువాత షెడ్యూల్ ను ప్లాన్ చేస్తోంది. ఈ షెడ్యూల్ లో ప్రకాష్ రాజ్ మరియు కంగనా మీద అసెంబ్లీ సన్నివేశాలను షూట్ చేయనున్నారు. జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలలో అసెంబ్లీలో ఆమె చీర పట్టుకుని లాగడం కూడా ఒకటి. ఆ సన్నివేశాన్నే త్వరలో షూట్ చేయనున్నారు.

కాగా ఈ బయోపిక్ బడ్జెట్ వంద కోట్లు అని తెలుస్తోంది. ఎలాగూ కంగనా రనౌత్ కి బాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. పైగా అమ్మ బయోపిక్, తమిళంలో కూడా భారీ డిమాండ్ ఉంటుంది. ఇక తెలుగు కన్నడ మలయాళ పరిశ్రమల్లో కూడా ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి. కాబట్టి వంద కోట్లుపెట్టినా ఈజీగా రికవరీ అవుతాయని చిత్రబృందం భావిస్తోంది. ఇక కంగనా రనౌత్ ను అచ్చం అమ్మలా మార్చెందుకు హాలీవుడ్ మూవీ ‘డార్కెస్ట్ హవర్’కి మేకప్ మెన్ గా పనిచేసిన ‘గ్యారీ ఓల్డ్ మెన్, ‘అమ్మ’ బయోపిక్ కూడా చేస్తున్నారు.

జయలలిత లాంటి బలమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలంటే కంగనా రనౌత్ లాంటి బలమైన నటి అయితేనే ఆ పాత్రకు పూర్తి న్యాయం జరుగుతుంది. మరి ఎప్పుడూ వివాదాస్పద విషయాలతో తన ఘాటైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే కంగనా రనౌత్‌ జయలలిత పాత్రను ఎలా మెప్పిస్తోందో చూడాలి. బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు , హిందీ భాషల్లో కూడా విడుదలకానుంది.

ఈ బయోపిక్ లో మిగిలిన కీలకమైన పాత్రలు ఎం.జి.రామచంద్రన్ మరియు కరుణానిధి పాత్రలు. ఎం.జి.రామచంద్రన్ పాత్రలో అరవింద్‌ స్వామి నటించబోతుండగా..అదే విధంగా మరో కీలక పాత్ర మాజీ సీఎం కరుణానిధి పాత్రలో నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు.

డ్రోన్ కేసులో పోలీసులను వదలని రేవంత్ రెడ్డి


కేసీఆర్ తనయుడు, ఐటీ మంత్రి కేటీఆర్ ఫౌంహౌజ్ ఇష్యూ కొద్ది రోజులుగా రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వర్సెస్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నట్లుగా ఫౌంహౌజ్ ఇష్యూ మారింది. కేటీఆర్ తన ఫౌంహౌజ్ కోసం అక్రమంగా చెరువును పూడ్చివేసి రోడ్డు వేసుకున్నారని ఆరోపిస్తూ రేవంత్ రెడ్డి గ్రీన్ ట్రీబ్యూనల్ లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు గ్రీన్ ట్రీబ్యూనల్ కేటీఆర్ కు నోటీసులకు జారీ చేసిన సంగతి తెల్సిందే. అయితే దీనిపై కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు తాత్కాలికంగా స్టే విధించింది.

కేటీఆర్ ఫౌంహౌజ్ ఇష్యూను రేవంత్ రెడ్డి ఇప్పట్లో వదిలేలా కన్పించడం లేదు. ఈ కేసుతో సంబంధం ఉన్న పోలీసులపై కూడా తాజాగా ఆయన కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. డ్రోన్ కేసులో తనను అరెస్టు చేయడానికి ముందుగా పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేయకుండా అరెస్టు చేయడాన్ని ఆయన కోర్టులో సవాల్ చేశారు. మాదాపూర్ ఏసీపీ శ్యాంప్రసాదరావు, నార్సింగి ఇన్స్ పెక్టర్ గంగాధర్ లపై కోర్టు ధిక్కరణ కింద పిటిషన్ దాఖలు చేశారు.

సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం పోలీసులు తనను అరెస్టు చేయడానికి ముందుగా 41ఏ నోటీసులు ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. పోలీసులు తనకు 41ఏ నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం కోర్టు ధిక్కరణకు కిందకు వస్తుందని తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పును పోలీసులు ఉల్లంఘించారని రేవంత్ పేర్కొన్నారు. మూడునెలల క్రితం నార్సింగి పోలీసులు రేవంత్ రెడ్డిని డ్రోన్ కేసులో అరెస్టు చేశారు. అనంతరం రేవంత్ రెడ్డి బెయిల్ పై బయటికి వచ్చి కేటీఆర్ ఫౌంహౌజ్ ఇష్యూపై పోరాటం చేస్తున్నారు. తాజాగా పోలీసులపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసి వారికి రేవంత్ రెడ్డి బిగ్ షాక్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

టీడీపీ నేత చింతమనేని అరెస్ట్..!


పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని కలపర్రు టోలు గేటు వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇక్కడికి టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. సంఘటన సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే ఈ.ఎస్.ఐ కుంభకోణం కేసులో ఏసీబీ అధికారులు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ని అరెస్టు చేసి విజయవాడ తరలిస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ఏలూరు సమీపంలోని కలపర్రు టోల్ ప్లాజా వద్ద అచ్చెన్నాయుణ్ని తరలిస్తున్న వాహనాలను అడ్డుకునేందుకు దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నేతృత్వంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.

ఎమ్మెల్యే చింతమనేని ని అదుపులోకి తీసుకునే క్రమంలో టిడిపి కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఎట్టకేలకు పోలీసులు చింతమనేని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. అనంతరం టీడీపీ నాయకులు, కార్యకర్తలను టోల్ ప్లాజా సమీపం నుంచి వెళ్లగొట్టారు.

వెలుగులోకి వచ్చిన మరో కీచక పోలీసు ఉదంతం..!


గుంటూరు జిల్లా అమరావతిలో కీచక ఎస్.ఐ ఘటన మరువక ముందే ప్రకాశం జిల్లాలో మరో కీచక కానిస్టేబుల్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇటువంటి సంఘటనల కారణంగా పోలీసుల ప్రతిష్ఠ మంట కలిసేలా ఉంది. ఓ మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న కానిస్టేబుల్ ఆ మహిళ నుంచి రూ.36 లక్షలు అప్పు తీసుకుని చెల్లించకుండా వేధింపులకు గురి చేశాడు.

సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే ఒంగోలు నగరంలోని తాలూకా పోలీసు స్టేషన్ లో కానిస్టేబుల్ పనిచేస్తున్న వెంకట రాజేష్ కు దిబ్బల రోడ్డులోని ఒక మాహిళతో పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. దీంతో ఆమె న్యూడ్ వీడియోలు, ఫొటోలు తీశాడు. తన అవసరాలకు ఆ మహిళ వద్ద నుంచి రూ. 36 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు చెల్లించక పోవడంతో ఆమె నిలదీసింది.

ఈ క్రమంలో ఈ నెల 8వ తేదీన అప్పు చెల్లిస్తామని తన స్నేహితుడు నల్లూరి సుధాకర్ ఇంటికి పిలిపించాడు. అప్పు చెల్లించకపోగా అక్కడ స్నేహితులు ఇద్దరూ కలిసి తనపై అత్యాచారం చేశారని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు విచారణ చేపట్టారు.

ఇది ఇలా ఉండగా గుంటూరు జిల్లాలో వడ్డీ వ్యాపారస్తులు రెచ్చిపోతున్నారు. వడ్డీ వ్యాపారుల అరాచకాలు పట్టణ ప్రాంతాలకే కాకుండా గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. జిల్లాలోని కొల్లిపర మండలం చక్రాయపాలెంలో ఈ అరాచక సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఆర్థిక లావాదేవీల విషయంలో వడ్డీ వ్యాపారం చేస్తున్న వీరయ్య, నర్సమ్మలు నడిరోడ్డిపై సామ్రాజ్యం అనే మహిళని హత్య చేశారు. రోడ్డుపై వెళ్తున్న సామ్రాజ్యంపై దంపతులు తొలుత దాడి చేశారు.

అనంతరం సామ్రాజ్యం కళ్లల్లో నర్సమ్మ కారాన్ని చల్లింది. కళ్ల మంటతో కిందపడిన సామ్రాజ్యంను వీరయ్య గడ్డిపారతో పొడిచి హత్య చేశాడు. వీరయ్య దంపుతుల నుంచి సామ్రాజ్యం గతంలో తీసుకున్న అప్పు రూ.20 వేలు చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలో వడ్డీ వ్యాపారులు మృతురాలి పొలం, ఇంటిని బలవంతంగా రాయించుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

హాస్పిటళ్లలో ఇంత దారుణమా.. ?:సుప్రీం

 

ఢిల్లీ ఆస్పత్రుల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నట్లు సుప్రీంకోర్టు పేర్కొన్నది. ప్రభుత్వ హాస్పిటళ్లు సరైన రీతిలో స్పందించడం లేదని సుప్రీంకోర్టు సీరియస్‌ అయ్యింది. రోగులు వ్యాధులతో ఇబ్బందిపడుతున్నారని, వారికి చికిత్స చేసే వారు కరువైనట్లు కోర్టు చెప్పింది.  ఒకవేళ ఇదే రకమైన చికిత్స కొనసాగితే, హాస్పిటళ్లలో బెడ్స్‌ ఖాళీగా ఉండిపోతాయని కోర్టు పేర్కొన్నది. మృతదేహాల పట్ల ఎటువంటి మర్యాద ఇవ్వడం లేదని కోర్టు చెప్పింది. ఢిల్లీలో ఎందుకు వైరస్‌ టెస్టింగ్‌ ను తగ్గించారని కోర్టు ప్రశ్నించింది. ముంబైతో పాటు ఇతర నగరాల్లో టెస్టింగ్‌ పెరిగిందని, కానీ ఢిల్లీలో ఎందుకు టెస్టింగ్‌ తగ్గిందని కోర్టు నిలదీసింది.

మృతదేహాల పట్ల ఢిల్లీ హాస్పిటళ్లు వ్యవహరిస్తున్న తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండించింది. మరణించిన వారి బంధువులకు కూడా ఎటువంటి సమాచారం ఇవ్వడంలేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్ని సందర్భాల్లో కొన్ని కుటుంబాలు కనీసం తమ బంధువుల చివరి చూపును కూడా నోచుకోవడం లేదంటూ కోర్టు పేర్కొన్నది. కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఆదేశాలను హాస్పిటళ్లు బేఖాతరు చేస్తున్నాయని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది.

ఇది ట్రైలర్ మాత్రమే.. ముందుంది అసలు సినిమా: రోజా


టీడీపీ ఎమ్మెల్యే అచ్చెనాయుడిని ఏసీబీ పోలీసులు అరెస్టు చేయడంతో ఏపీలో రాజకీయం హీటెక్కింది. ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెనాయుడు అవకతవకలకు పాల్పడినట్లు తేలడంతో ఏసీబీ అధికారులు శ్రీకాకుళంలోని ఆయన ఇంటికి వెళ్లి అరెస్టు చేశారు. అనంతరం ఇంట్లో సోదాలు చేపట్టి కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకెళ్లారు. దీంతో టీడీపీ నేతలు వైసీపీ నేతలు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ జగన్ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగారు. అన్యాయంగా అచ్చెనాయుడిని అరెస్టు చేశారని టీడీపీ నేతలు ప్రభుత్వం పదేపదే ఆరోపణలు చేస్తుండటంతో వైసీపీ నేతలు సైతం ఎదురుదాడికి దిగుతున్నారు. ఈ ఇష్యూపై నగరి ఎమ్మెల్యే, సినీనటి రోజా తాజాగా స్పందించారు. అచ్చెనాయుడి అరెస్టుపై తనదైన శైలిలో స్పందిస్తూ సంచనల వ్యాఖ్యలు చేశారు.

‘టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ కేవలం ట్రైలర్ మాత్రమే అని.. అసలు సినిమా ముందుందని’ రోజా వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది. ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెనాయుడు తప్పు చేశారని రుజువైనందునే ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారన్నారు. పక్కా ఆధారాలతో అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు కిడ్నాప్ చేశారని చెప్పుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని ఆమె ఎద్దేవా చేశారు. తాము ఎవరిని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి ఈ అవినీతి అంశాన్ని లెక్కలతో సహా నిరూపించారని గుర్తుచేశారు. గతంలోనే చంద్రబాబు తనయుడు లోకేష్ తమ ప్రభుత్వం హయాంలో అవినీతి జరిగితే నిరూపించాలని మీడియాలో సమావేశంలో వ్యాఖ్యానించారని తెలిపారు. అచ్చెన్నాయుడి అవినీతికి పాల్పడినందు వల్లే అరెస్ట్ అయ్యారని తెలిపారు. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే అని.. అసలు సినిమా ముందుందని టీడీపీ నేతలను హెచ్చరించారు. రాజధాని భూముల్లో అక్రమాలు, ఫైబర్ గ్రిడ్, చంద్రన్న కానుకల్లోని అవకతవకలను ప్రభుత్వం బయటికి తెస్తుందన్నారు. అవినీతికి పాల్పడితే బీసీ అయినా, ఓసీ అయినా.. ఎస్సీ అయినా జైలుకు పంపడం ఖాయమని ఆమె స్పష్టం చేశారు.

జీహెచ్ఎంసీ మేయర్ ను వెంటాడుతున్న కరోనా..!


తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం కరోనా పంజా విసురుతోంది. హైదరాబాద్ మహానగరంలో గత పదిరోజులుగా కేసులు సంఖ్య వందల సంఖ్యలో నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తుంది. గురువారం ఒక్కరోజే రాష్ట్రంలో 209 కేసులు కొత్తగా నమోదుకాగా జీహచ్ఎంసీ పరిధిలోనే 175కేసులు నమోదవడం గమనార్హం. నిన్న ఒక్కరోజే కరోనాతో తొమ్మిది మంది మృతిచెందాడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కొద్దిరోజుల క్రితం వరకు మహానగరంలో డబుల్ డిజిట్ కే పరిమితమైన కేసులు ప్రస్తుతం మూడెంకలు చేరడం చూస్తుంటే వైరస్ ఎంత వేగంగా వ్యాపిస్తుందో అర్థమవుతోంది. ఇదిలా ఉంటే జీహెచ్ఎంసీ మేయర్ ను కూడా కరోనా వదలడం లేదు.

మేయర్ బొంతు రాంమ్మోహన్ నగరంలో ఎక్కడి వెళితే అక్కడ కరోనా ఛాయలు కన్పిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి మేయర్ కరోనా బారినుంచి తప్పుకున్నారు. అయితే కరోనా మాత్రం మేయర్ ఫాలో అవుతుండటం చర్చనీయాంశంగా మారింది. కొద్దిరోజులు క్రితం మేయర్ ఓ హోటల్లో టీ తాగాడు. అనంతరం మేయర్ కు టీ అందించిన వ్యక్తికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో మేయర్ కూడా కరోనా టెస్టులు చేయించుకోవాల్సి వచ్చింది. ఈ టెస్టుల్లో మేయర్ కు నెగిటివ్ రిపోర్టు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇదిలా ఉండగా మరోసారి మేయర్ కరోనా కారణంగా వార్తల్లో నిలిచారు. బుధవారం ఆయన పేషిలో ఓ సిబ్బందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో జీహెచ్ఎంసీ కార్యాలయంలోని సిబ్బందికి కరోనా టెస్టులు నిర్వహించారు. ఈక్రమంలో గురువారం మేయర్ కారు డ్రైవర్ కు కరోనా పాజిటివ్ రావడం ఆందోళన రేకెత్తించింది. దీంతో మేయర్ సహా ఆయన కుటుంబ సభ్యులందరినీ అధికారులు హోం క్వారంటైన్ చేశారు. వరుసగా రెండ్రోజులు కరోనా వైరస్ మేయర్ ను వెంటాడింది. ఈనేపథ్యంలోనే మేయర్ బొంతు రాంమోహన్ మరోసారి కరోనా టెస్టులు చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఆ రిపోర్టులు నేటి సాయంత్రం వరకు వచ్చే అవకాశం ఉంది. ఈ రిపోర్టులో ఏం తేలుతుందో వేచి చూడాల్సిందే..!

చంద్రబాబుది బుర్రే బుర్ర.. కులం రంగు పులిమేశాడు..

Chandrababu-Naidu-Achem-Naidu


ఒక స్కాం జరిగింది.. ఒకరిపై ఆరోపణలు వచ్చాయి.. ఇలానే వైఎస్ జగన్ పై కూడా ఆరోపణలు వచ్చాయి. జైలుకు వెళ్లాడు. ఆయనది అగ్రకులం కాబట్టి ఎవరూ పట్టించుకోలేదు. అయితే తాజాగా ఈఎస్ఐ స్కాంలో అరెస్ట్ అయిన టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు అరెస్ట్ అయితే మాత్రం పెడబొబ్బలు పెడుతున్నారు. వెంటనే కులం కార్డును తీసుకొచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. అవినీతి, అక్రమాల ఆరోపణలు వచ్చిన నేతల అరెస్ట్ లకు, కులానికి ఏంటి సంబంధం అని వైసీపీ ప్రశ్నిస్తోంది. తక్కువ కులం అయితే నేరాలు, ఘోరాలు, అవినీతి చేసి తప్పించుకోవచ్చా అని అడుగుతోంది.

తాజాగా ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడును ఏసీబీ అరెస్ట్ చేయడం ఏపీ రాజకీయాలను కుదిపేసింది. దీనిపై తాజాగా చంద్రబాబు కొత్త వాదన తెరపైకి తెచ్చారు. బీసీలకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వ మోసాలపై పోరాడుతున్న అచ్చెన్నపై జగన్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు పాల్పడుతోందని.. అచ్చెన్న అరెస్ట్ బీసీలపై దాడి అని బాబు మండిపడ్డారు.

కిందాపడ్డా.. మీదపడ్డా చంద్రబాబు తనదే పైచేయిగా ఉండాలని అనుకుంటాడని రాజకీయాల్లో అంటుంటారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ బాబు అచ్చెన్న అరెస్ట్ కు కులం రంగు పులిమడం వైసీపీని షాక్ కు గురిచేసింది. అందుకే మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు బయటకొచ్చి మరి అచ్చెన్న అరెస్ట్ కులరంగును పులమడం సిగ్గుచేటు అని ఆడిపోసుకున్నారు.

ఒక కుంభకోణంలో అచ్చెన్నాయుడు అరెస్ట్ అయితే అది ఏ విధంగా బీసీలకు సంబంధించినది అన్నది ఇప్పుడు ప్రశ్న. ఏడాదిగా వివరణాత్మక దర్యాప్తు జరిపి టెండర్లలో అవకతవకలు జరిగినట్టు తేలిన తర్వాత ఏసీబీ చర్యలు తీసుకుంది. అయినా స్వయంగా దమ్ముంటే విచారణ జరపండి. అక్రమాలు తేలితే అరెస్ట్ చేయండని అచ్చెన్నాయుడు ఆ మధ్య సవాల్ చేశారు. ఇప్పుడు దాన్నే వైసీపీ ఆధారాలతో చేసి చూపించింది. ఏసీబీ చర్యకు టీడీపీ నేతలు కులం రంగు పులమడమే ఇప్పుడు అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.

చంద్రబాబు కోరిన మరో వింత డిమాండ్ ఏంటంటే..? అచ్చెన్నాయుడు అరెస్ట్ కు బాధ్యతగా ఏపీ హోంమంత్రి రాజీనామా చేయాలని కోరడం ఏంటో ఇప్పటికీ రాజకీయ నాయకులకు అర్థం కావడం లేదు. 40ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు ఈ వింత లాజిక్ డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని ఏపీ హోంమంత్రి కౌంటర్ ఇచ్చారు.

చంద్రబాబుకు కుల రాజకీయాలు కొత్తేమీ కాదని.. డాక్టర్ సుధాకర్ విషయంలో చంద్రబాబు, ఆయన అనుంగ మీడియా ఎలాంటి హంగామా చేసిందో చూశాం. ఇప్పుడు అచ్చెన్న అరెస్ట్ కు బీసీలను వాడుకుంటున్న చంద్రబాబు తెలివికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎంతైనా 40 ఇయర్స్ ఇండస్డ్రీ చంద్రబాబుది బుర్రే బుర్ర అంటున్నారు.