తమిళ్ స్టార్ హీరో సూర్య తన తర్వాతి సినిమాని యాక్షన్ డైరెక్టర్ హరితో ఫైనల్ చేసుకున్న సంగతి తెలిసిందే. ముందుగా సూర్య డైరెక్టర్ శివతో సినిమా చేయాల్సి ఉంది. కానీ శివకు రజనీకాంత్ ప్రాజెక్ట్ సెట్టవడంతో హరితో సినిమాకు రెడీ అయ్యాడు సూర్య. వీరి కాంబినేషన్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ‘సింగం’ ప్రాంఛైజీలోని యాక్షన్ సినిమాలే. ఈ సారి కూడా వీరిద్దరూ అలాంటి పోలీస్ స్టోరీతోనే సినిమా చేస్తారని అనుకున్నారంతా. కానీ అలా చేయట్లేదట. ఇప్పటికే ‘సింగం’ సిరీస్ నందు మూడు చిత్రాలు చేసి ఉండటంతో ఈ సారి కొత్త తరహా కథను చూజ్ చేసుకున్నారని తమిళ్ మీడియాలో టాక్ నడుస్తోంది.
ఈ సారి పక్కా మాస్ స్క్రిప్ట్ అయిన ‘సింగం’ సినిమాల తరహాలో పోలీస్ కథలా ఉండదట. ఈ విషయం తెలిసిన సూర్య ఫ్యాన్స్ గతంలో చేసిన ‘ఆరు, వేల్’ లాంటి డిఫరెంట్ మూవీ ఏదైనా చేస్తే బాగుంటుందని ఆశ పడుతున్నారు. మరి ఆరవసారి కలిసి పనిచేస్తున్న ఈ క్రేజీ యాక్షన్ కాంబినేషన్ ఎలాంటి సినిమాను అందిస్తారో చూడాలి. ఏమైనా సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్స్ చాల మందే ఉన్నా, ప్రతి సినిమాలో కొత్తగా ట్రై చేస్తూ.. వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులకు డిఫరెంట్ చిత్రాలను అందిస్తున్న హీరోల్లో సూర్య పేరు ముందు వరుసలో ఉంటుంది.
అందుకే హీరో సూర్య ఖాతాలో ‘సింగం’ వంటి యాక్షన్ ఎంటర్ టైనర్ లతో పాటు ‘గజినీ’, ‘సెవెన్త్ సెన్స్’ వంటి ఓ కొత్తరకం సినిమాలు.. అలాగే ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ వంటి డిఫరెంట్ లవ్ స్టోరీలు ఉన్నాయి. అయితే ప్రతి సినిమాను ఓ ఛాలెంజింగ్ గా తీసుకుని చేసే ఈ స్టార్ హీరో ఈ మధ్య బాక్సాఫీస్ వద్ద వరుస డిజాస్టర్ లు ఇస్తున్నాడు. మరి సూర్య – హరి సినిమాతోనైనా.. సూర్య మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Suriya director hari next film latest updates
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com