Home Blog Page 8418

నిమ్మగడ్డ కేసులో ప్రభుత్వ వాదనలకు ‘సుప్రీం’ అభ్యతరం..!


నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తప్పలేదు. నిమ్మగడ్డ పునర్నియామకం చెల్లదనే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ధర్మాసనానికి తన వాదనలు వినిపించింది. ఈ వాదనను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తోసిపుచ్చారు. నిమ్మగడ్డ కేసులో హైకోర్టు అదేశాలనే అమలు చేయాలని, ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాలతో అధికారులు పనిచేయలేకపోతున్నారని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు.

ఆ విధంగా జగన్ పై పవన్ గెలిచాడట..!

మధ్యంతరంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ని నియమించేలా గవర్నర్‌కు సూచించాలని ప్రభుత్వ న్యాయవాది ధర్మసనాన్ని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించలేదు. 2 లేక 3 వారాల్లో కేసు విచారణ పూర్తి చేయాలని భావిస్తున్నామని స్పష్టం చేసింది ఎన్నికల నిర్వహించే విషయంలో 1994 చట్టం ప్రకారం నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు అర్హత లేదని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది వాదించారు. దీంతో ఎన్నికల నిర్వహణపై మాట్లాడదలచుకోలేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

నిమ్మగడ్డను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమిచకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎన్నిమార్గాలు వెతికినా అవి ఫలితాన్ని ఇవ్వడం లేదు. ఇటీవల నిమ్మగడ్డ రమేష్ కుమార్ బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ ను హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో కలిసిన వీడియోలు రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపాయి. నిమ్మగడ్డ టీడీపీ అనుకూల వ్యక్తిగా ముద్ర వేసేందుకు వైసీపీకి ఒక అవకాశం లభించింది. ఆ మేరకు వైసీపీ అనుకూల మీడియా వీడియో వ్యవహారాన్ని విస్తృతంగా ప్రచారం చేసింది.

జగన్ కు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి!

సీఎం జగన్ ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా తన నిర్ణయాన్ని మార్చుకోని స్వభావం ఉన్న వ్యక్తి అనే విషయం తెలిసిందే. నిమ్మగడ్డ ఎస్ఇసిగా ఉండకుడదనే ఉద్దేశ్యంతో ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తెచ్చారు, ఆర్డినెన్స్ ను హైకోర్టు కొట్టేయడం, నిమ్మగడ్డనే ఎన్నికల కమిషనర్ గా కొనసాగించాలని చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు నిమ్మగడ్డ కేసులో హైకోర్టు తీర్పు అమలు చేయాలని చెబుతున్న నేపథ్యంలో నిమ్మగడ్డ వ్యవహారంలో ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకుంటుందనే విషయం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

వైఎస్ మరణంపై విజయమ్మ ఏమి రాసి ఉంటారు?


నేడు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వై యస్ రాజశేఖర్ రెడ్డి,71వ జయంతి. ఈ సంధర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న కడపకు వెళ్లడం జరిగింది. నేడు ఇడుపులపాయలో గల వై యస్ సమాధిని జగన్ కుటుంబంతో పాటు సందర్శించి నివాళులు అర్పించారు. వై ఎస్ సమాధి వద్ద కుటుంబ సభ్యులు కూర్చొని దివంగత నేతను స్మరించుకున్నారు. ఇక ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జులై 8ని రైతు దినోత్సవంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. రైతు బాంధవుడిగా అనేక విప్లవాత్మ నిర్ణయాలు తీసుకొని అమలు చేసిన వై యస్ రాజశేఖర్ రెడ్డి గౌరవార్ధం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

జగన్ కు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి!

కాగా విజయమ్మ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోగ్రఫీ రాసింది. ‘నాలో నాతో వై ఎస్ ఆర్’ పేరుతో రాసిన ఈ పుస్తకంలో ఆమె ఏమి అంశాలు ప్రసావించి ఉంటారు అనే ఆసక్తి ఇప్పుడు అందరిలో మొదలైంది. రాజకీయ నాయకుడిగా వై ఎస్ జీవితం తెరిచిన పుస్తకమే. చనిపోయే వరకు విజయపథంలో సాగిన ఆయన రాజకీయ జీవితంతో పాటు, వ్యక్తిగా, భర్తగా, తండ్రిగా ఆయన నెరవేర్చిన బాధ్యతలు ఆమె ఇందులో పొందుపరచి ఉండవచ్చు. ఇక తండ్రి రాజారెడ్డి తో వై ఎస్ కి ఉన్న అనుబంధం, డాక్టర్ గా రాజశేఖర్ రెడ్డి ప్రజలకు అందించిన సేవలు కూడా ఈ పుస్తకంలో తెలియజేసి ఉండవచ్చు.

ఆ విధంగా జగన్ పై పవన్ గెలిచాడట..!

ఐతే ఆయన జీవితంలో చివరి అంశం, ఆయన మరణం గురించి కూడా విజయమ్మ ప్రస్తావించారా లేదా అనేది అన్నింటికంటే ముఖ్యమైన విషయం. వై ఎస్ మరణం అనేది పెద్ద మిస్టరీగా ఉంది. కుట్రలో భాగంగానే సొంత పార్టీ నేతలు, కార్పొరేట్ దిగ్గజాలతో కలిసి వై ఎస్ చావుకు పథక రచన చేశారని అప్పట్లో వార్తలు రావడం జరిగింది. గత ఎన్నికల ప్రచారంలో కూడా వై ఎస్ జగన్ తన తండ్రిని కొందరు ఉద్దేశ పూర్వకంగా చంపేశారని, అది ప్రమాదం కాదని చెప్పారు. వై యస్ మృతిపై కుటుంబ సభ్యులలో అనుమానాలుండగా, విజయమ్మ ఈ విషయాలను ఆ పుస్తకంలో ప్రస్తావించారా లేదా అనేది చూడాలి. వై ఎస్ ఊపిరి వదిలిన సంఘటనను ఆమె ప్రమాదంగా రాశారా లేక కుట్రకోణంలో రాశారా అనేది ఆసక్తి కరంగా మారింది.

హైకోర్టును తాకిన కరోనా సెగ.. రేపటి నుంచి మూసివేత..!


తెలంగాణ కరోనా మహమ్మరి పంజా విసురుతోంది. లాక్డౌన్ 3.0 సమయానికి తెలంగాణలో కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పడుతున్నాయని సీఎం కేసీఆర్ మీడియా ముఖంగా ప్రకటించారు. త్వరనే రాష్ట్రంలో కరోనా ఫ్రీగా మారుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అయితే లాక్డౌన్ సడలింపుల తర్వాత పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. కరోనా ఫ్రీ రాష్ట్రంగా అవతరిస్తుందనుకుంటే కరోనా కేసుల్లో తొలిస్థానాల్లో ఉన్న రాష్ట్రాలతో తెలంగాణ పోటీపడుతోంది. గడిచిన వారంరోజులుగా రోజుకు 1,500లకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జగన్ కు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి!

రాష్ట్రంలోని గ్రీన్ జోన్లలో సైతం కరోనా కేసులు భారీగా నమోదవుతుండటంతో ప్రజలంతా బయటికి రావాలంటేనే జంకుతున్నారు. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో కేసుల సంఖ్య ప్రతీరోజు వేలల్లో నమోదవుతుండటంతో నగరవాసులంతా ఆందోళన చెందుతున్నారు. దీంతో ప్రభుత్వం కరోనా విషయంలో చేతులెత్తేసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని పలు మార్కెట్లను వ్యాపార సంఘాల ఆధ్వర్యంలో స్వచ్చంధంగా బంద్ పాటిస్తున్నారు. నగరంలో కరోనా విజృంభిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. వీరిబాటలోని పలు వ్యాపార సంఘాలు స్వచ్ఛంధంగా లాక్డౌన్ పాటిస్తున్నారు.

మరోవైపు ప్రభుత్వ కార్యాయాల్లోనూ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వ సిబ్బంది కరోనా బారిన పడుతుండటంతో ప్రజలెవరూ కార్యాయాలకు రావొద్దని కోరుతున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ కార్యాలయంలోకి ప్రజలను అనుమతించడం లేదని ఏవైనా ఫిర్యాదులుంటే ఆన్ లైన్లో ఫిర్యాదు చేయాలని స్పష్టం చేశారు. ఇటీవల సీఎం అధికార కార్యాలయం ప్రగతిభవన్లో 30కిపైగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కలకలం మొదలైంది. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై వారందరినీ హోంక్వారంటైన్ కి తరలించింది. అయితే ఈ సమయంలో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో లేరని ఎర్రవెల్లిలోని తన ఫౌంహౌజ్ లో ఉన్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

అదేవిధంగా తెలంగాణ హైకోర్టు ఉన్న ప్రాంతంలో కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదవుతుండటంతో లాయర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హైకోర్టులో విధులు నిర్వహించే 25మంది సిబ్బందికి పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. దీంతో రేపటి నుంచి హైకోర్టు మూసివేసేందుకు న్యాయమూర్తులు నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు పరిసరాలను పూర్తిగా శానిటైజ్ చేయాలని సంబంధిత సిబ్బందికి ఆదేశాలిచ్చారు. ఈమేరకు హైకోర్టులోని ఫైళ్లను జ్యూడీషియల్ అకాడమీకి తరలించే ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమయంలో కేవలం ప్రధాన కేసులను మాత్రమే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని హైకోర్టు నిర్ణయించింది.

ఆ విధంగా జగన్ పై పవన్ గెలిచాడట..!

ఇదిలా ఉంటే రాష్ట్రంలో కేసులు సంఖ్య పెరుగుతున్నవేళ సీఎం కేసీఆర్ ఫౌంహౌజ్ లో ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతోన్నాయి. సీఎం కేసీఆర్ ఫౌంహౌజ్ లో ఎందుకున్నారనే చర్చ నడుస్తుంది. సీఎం ఆరోగ్య స్థితిపై ప్రభుత్వం వివరాలను వెల్లడించాలని తీన్నార్ మల్లన్న హైకోర్టులో మాండమస్ పిటిషన్ దాఖలు చేశారు. అదేవిధంగా సీఎం ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని ప్రతిపక్షాలు సైతం డిమాండ్ చేస్తున్నాయి.

ఈనేపథ్యంలోనే గవర్నర్ తమిళిసై స్వయంగా రంగంలోకి దిగి కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. కరోనాపై ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు అందుతున్న వేళ గవర్నర్ వరుసగా సమీక్షలు చేపట్టారు. ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి వారికి తగు సూచనలు చేశారు. కరోనా మహ్మమరి గీతదాటితే వేటు వేసేందుకు సిద్ధంగా ఉండటంతో ప్రజలంతా ఇంటి నుంచి బయటికి రావాలంటే జంకుతున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో కరోనా మహ్మమరి వదిలేలా కన్పించడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నాయి. ఎవరికీ వారు స్వీయ నియంత్రణ పాటిస్తూ వైరస్ బారి నుంచి రక్షించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

బన్నీకి కలిగిన ఆ కోరిక తీరుతుందా ?


ఈ మధ్య అల్లు అర్జున్ కి ఒక కోరిక కలిగిందట.. తానూ కూడా పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవాలన్నదే బన్నీ కోరిక. అందుకే మార్కెట్ లేకపోయినా సుకుమార్ కలయికలో రానున్న ‘పుష్ప’ సినిమాని పాన్ ఇండియా మూవీగా తేవడానికి.. ఇది పాన్ ఇండియా మూవీనే అని నమ్మకం కలిగించడానికి పుష్ప టీమ్ చాలానే ప్రయత్నాలు చేస్తోంది. వాటిలో భాగంగా ఎలాగైనా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ను ఓ స్పెషల్‌ సాంగ్‌ కోసం ఒప్పించాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారట. రామ్ చరణ్ సహాయంతో ఇప్పటికే సుకుమార్ ఫోన్ ద్వారా అలియాకి సాంగ్ తాలూకు ప్రాముఖ్యతను వివరించాడట. మరి బన్నీతో స్టెప్స్ వేయడానికి అలియా ఒప్పుకుంటుందా.. ఎంత లేదనుకున్నా అలియాకి ప్రత్యేక సాంగ్ అంటే కచ్చితంగా తక్కువే. మరి ఈ బ్యూటీ ఏమి చేస్తోందో చూడాలి. అన్నట్లు అలియా ఒప్పుకోకపోతే అప్షన్ గా బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలాను తీసుకోవాలని బన్నీ టీమ్ డిసైడ్ అయిపోయింది. మరి బన్నీకి అలియా దొరుకుతుందో లేక ఊర్వశితోనే ఎడ్జెస్ట్ అవ్వాలో త్వరలో తెలియనుంది. ఒకవేళ అలియా ఒప్పకుంటే.. పుష్పకి పాన్ ఇండియా రేంజ్ వచ్చినట్లే.. ఆ రకంగా బన్నీ కోరిక తీరినట్లే.

ఆ విధంగా జగన్ పై పవన్ గెలిచాడట..!

అలాగే పుష్పకి తమిళంలో కూడా మంచి మార్కెట్ తేవడానికి విజయ్ సేతుపతిని తీసుకున్నారు. అయితే ఈ సినిమా నుండి విజయ్ సేతుపతి తప్పుకునట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ విజయ్ సేతుపతి సినిమా నుండి తప్పుకోలేదు. పైగా ఓ కీలక రోల్ లో ఒకప్పటి తమిళ్ రొమాంటిక్ హీరో మాధవన్ ను కూడా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు సుకుమార్ బ్యాచ్. ఇక ఈ చిత్రంలో బన్నీకి జోడీగా ఓ గిరిజన యువతి పాత్రలో వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న కథానాయికగా తీసుకున్నారు. అదే విధంగా కన్నడ పరిశ్రమ నుండి అక్కడ స్టార్ డమ్ ఉన్న రమ్యను కూడా ఓ పాత్ర కోసం తీసుకోబోతున్నారు. మొత్తానికి అన్ని ఇండస్ట్రీస్ నుండి స్టార్ లను తీసుకుని పుష్పకి పాన్ ఇండియా అనే రేంజ్ తీసుకువస్తున్నారు. మరి పుష్పతో బన్నీ పాన్ ఇండియా స్టార్ అనిపించుకుంటాడా.. చూడాలి.

అది శృంగారం అనిపించుకోదంటున్న కేరళ హైకోర్టు


ప్రజల హక్కులను కాపాడటంలో న్యాయస్థానాలు ఎల్లప్పుడు ముందుంటాయి. వంద దోషులు తప్పించుకున్న సరే.. ఒక నిర్దోషికి శిక్ష పడకూడదనే ప్రాథమిక సూత్రంతో న్యాయస్థానాలు పని చేస్తుంటాయి. దీంతో బాధితులకు ఒక్కోసారి చాలా ఆలస్యంగా జరుగుతుందనే విమర్శల పాలవుతూ ఉంటాయి. అయితే చివరి న్యాయమే గెలుస్తుందని న్యాయస్థానాలు ఎన్నోసార్లు నిరూపించాయి. తాజాగా కేరళ హైకోర్టు శృంగారానికి కొత్త నిర్వచనం చెప్పి బాధితులకు తగిన న్యాయం చేయడంపై అన్నివర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

కోవిడ్-19పై పోరాటానికి ‘రోబో’ చేయూత

2009లో అత్యాచార కేసుకు సంబంధించి కేరళ హైకోర్టు తాజాగా తీర్పును వెలువరించింది. మైనర్ బాలికను లోబర్చుకున్నడని నిందితుడికి శిక్ష ఖరారు చేస్తూ కింది కోర్టు అప్పట్లో తీర్పునిచ్చింది. 8వ త‌ర‌గ‌తి చదువుతున్న ఓ విద్యార్థిని అప్ప‌ట్లో టీవీ చూసేందుకు నిందితుడి ఇంటికి వెళ్లేది. దీనిని ఆసరా చేసుకొని నిందితుడు బాలికకు మాయ మాట‌లు చెప్పి లోబ‌ర్చుకోవడంతో బాలిక గ‌ర్భందాల్చింది. దీనిపై కోర్టు ఆ వ్యక్తిని అత్యాచార దోషిగా నిర్ధారించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు.

బాలిక అంగీకారంతోనే తమ మధ్య లైంగిక సంబంధం కొనసాగిందని నిందితుడు హైకోర్టులో వాదనలు విన్పించాడు. త‌న కోసం బాలిక అనేక మార్లు వ‌చ్చి వెళ్లేద‌ని వాదించాడు. నిందితుడి వాదనను హైకోర్టుల పరిణలోకి తీసుకోలేదు. ఈ సందర్భంగా హైకోర్టు శృంగారానికి సంచలన నిర్వచనం చెప్పింది. ఓ మహిళ పురుషుడికి లొంగిపోయినంత మాత్రాన శృంగారానికి అంగీకరించినట్టు కాదని స్ప‌ష్టం చేసింది. శారీరక సంబంధానికి స్త్రీ ‘ఆహ్వానం’ పలికితేనే ఆమె హక్కులకు భంగం కలుగలేదని భావించాలని వ్యాఖ్యానించింది.

జగన్ కు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి!

మైనర్ సమ్మతిని పరస్పర అంగీకారంతో శృంగారంగా భావించలేమని చెబుతూ కిందికోర్టు తీర్పును హైకోర్టు సమర్ధించింది. ఈ తీర్పు స్త్రీల హ‌క్కుల‌ను కాపాడేలా ఉండటంతో అన్నివర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యాయస్థానాలపై నమ్మకం, గౌరవం పెంచేలా కేరళ హైకోర్టు తీర్పు ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సీఎం మిస్సింగ్.. అందుకే తెలంగాణలో కొత్త పాలన

కరోనా విజృంభించి జనం అల్లాడుతుంటే సీఎం కేసీఆర్ పట్టించుకోకుండా ఎక్కడికో వెళ్లిపోయారు దింతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఫేస్‌ బుక్ లైవ్ లో డిమాండ్ చేశారు. గత 13 రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియడం లేదని గుర్తు చేశారు. చివరికి కరోనా కట్టడిపై సమీక్ష కోసం గవర్నర్ తమిళిసై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శిని పిలిస్తే వెళ్లడం లేదని అన్నారు.  తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా గాడి తప్పిందని ఆయ‌న‌ విమర్శించారు. ప్రజల అవసరాలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కరోనా విజృంభించి జనం అల్లాడుతుంటే సీఎం కేసీఆర్ పట్టించుకోకుండా ఎక్కడికో వెళ్లిపోయారని మండిపడ్డారు. ‘‘కరోనాతో రోజురోజుకూ భయానక పరిస్థితి ఏర్పడుతోంది. కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా సరే, రాష్ట్ర ప్రభుత్వం వినిపించుకోవడం లేదని బీజేపీ నాయకులే అంటున్నారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు, రోగులకు చికిత్స సరిగ్గా చేయడం లేదు. సీఎం గత పది రోజులుగా కనిపించడం లేదు. కాబట్టి, కేంద్రం కలగజేసుకుని, పెద్దలతో మాట్లాడి రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన పెట్టించండి.’’ అని పొన్నాల విజ్ఞ‌ప్తి చేశారు.

తెలంగాణలో ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని పొన్నాల డిమాండ్ చేశారు. పాలనలో కేసీఆర్ పూర్తిగా విఫలం అయ్యారని.. కరోనా కట్టడిలో ప్రభుత్వం చేతులెత్తేసిందని వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అనివార్యంలా ఉందని పొన్నాల అభిప్రాయపడ్డారు. కేంద్రం ఈ విషయంలో ఆలోచించాలని కోరారు.

పవర్ స్టార్ పిలిస్తే డేటింగ్‌కు వెళ్తా: నగ్నం బ్యూటీ


శ్రీరాపాక. ప్రముఖ క్యాస్టూమ్‌ డిజైనర్. తెలుగుతో పాటు అనేక భాషల్లో ఎన్నో చిత్రాలకు పని చేసింది. కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటోంది. కానీ, ఇప్పటిదాకా ఆమె పేరు ఫిల్మ్‌ సర్కిల్స్‌లో మినహా బయట ఎవ్వరికీ తెలియదు. ప్రేక్షకులకైతే ఆమె ఎవరో అస్సలు తెలియదు. కానీ, రెండు రోజులు షూటింగ్‌లో పాల్గొన్న ఒక్క సినిమాతో ఆమె ఓవర్నైట్‌ స్టార్ గా మారింది. ఆమే ఆర్జీవీ తీసిన అడల్ట్‌ మూవీ ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ. ఆమె అసలు పేరు శ్రీ రాపాక. లాక్‌డౌన్‌ టైమ్‌లో ఆర్జీవీ వరుస చిత్రాలతో డిజిటల్‌ మీడియాపై దండయాత్ర చేస్తున్నాడు. ఆ క్రమంలోనే స్వీటీ ప్రధాన పాత్రలో నగ్నం తీశాడు. కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. ట్రైలర్ రిలీజ్‌తోనే స్వీటీ పేరు మారు మోగగా.. సినిమా విడుదలైన తర్వాత ఆమె స్టార్ గా  మారిపోయింది. ఆర్జీవీతో సినిమా చేసింది పైగా, అచ్చ తెలుగు అమ్మాయి కావడంతో ప్రతీ యూట్యూబ్‌ చానల్‌ ఆమె ఇంటర్వ్యూ కోసం ఎగబడుతోంది. ఇతర సినిమాలు ఏమీ లేవు కాబట్టి స్వీటీ కూడా ప్రతి చానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ … గతంలో తాను కలిసి పని చేసిన పలువురు హీరోలు, హీరోయిన్లపై కామెంట్లు చేస్తోంది. బాలకృష్ణ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టిన ఆమె రాశీ ఖన్నాతో గొడవ పడ్డానని చెప్పింది.

కరోనా వేళ కూడా ఇలా పీక్కుతింటారా?

ఇప్పుడు మరో అడుగు ముందుకేసి పవన్‌ కళ్యాణ్‌ గురించి మాట్లాడింది. పవన్‌పై తనకు క్రష్‌ ఉందన్న స్వీటీ ఆయన రమ్మంటే డేటింగ్‌కు వెళ్తానని సంచలన కామెంట్లు చేసింది. ఓ చానెళ్లో ఆమె మాట్లాడుతూ ‘ తెలుగు హీరోల్లో నాకు పవన్ కల్యాణ్ అంటే క్రష్. గతంలో ఆయన్ని కలవాలని రెండు మూడు సార్లు ట్రై చేశా కానీ కుదరలేదు. ఆపై ప్రయత్నం చేయలేదు. పవన్‌ని కలిపించమని వేరే వాళ్లను అడగడం నాకు ఇష్టం లేదు. అందుకే ఎవరినీ అడగలేదు. కానీ, మనసులో ఒక్కటే అనుకున్నా. పవన్‌ను ఎప్పటికైనా కలుస్తాను అని. పవన్‌ అంటే నాకు ఎంత ఇష్టం అంటే.. ఆయనతో డేటింగ్‌కు వెళ్లడానికి కూడా రెడీ. ఆయన పిలిస్తే అస్సలు ఆలోచించను. పవన్‌తో కలిసి ఒక్క సినిమాలోనైనా నటించాలని ఉంది’ అని స్వీటీ చెప్పుకొచ్చింది. ఈ విషయం పవన్‌ వరకూ వెళ్తే.. ఆయన ఎలా స్పందిస్తాడో చూడాలి.

జగన్ కు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి!


అవును.. నిజంగానే ఇది సీఎం జగన్ కు టఫ్ పరీక్ష.. ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా పరిస్థితి ఉంది. రాజధాని కూడా లేని ఏపీని ఇప్పుడిప్పుడే నిర్మిస్తున్న సీఎం జగన్ కు కేంద్రంలోని బీజేపీ అండ ఉంది. కేంద్రం అండతోనే జగన్ పోలవరం సహా పలు అభివృద్ధి పథకాలకు నిధులు తెచ్చుకుంటున్నారు. పార్లమెంట్ లో పలు బిల్లులకు మద్దతు ఇస్తున్నారు. ప్రస్తుతం సఖ్యతతో సాగుతున్న ఈ బంధంలో అనుకోని ట్విస్ట్.. ఇప్పుడు బీజేపీతో జగన్ ఏం చేస్తారన్నది ఉత్కంఠగా మారింది.

కోవిడ్-19పై పోరాటానికి ‘రోబో’ చేయూత

కేంద్ర కేబినెట్ విస్తరణకు ప్రధాని మోడీ నిర్ణయించారు. కానీ బీహార్ ఎన్నికలు.. భవిష్యత్ అవసరాల దృష్ట్యా కేంద్ర కేబినెట్ లోకి బలమైన మిత్రపక్షాలైన జేడీయూ, వైసీపీని తీసుకోవాలని ఢిల్లీ బీజేపీ పెద్దలు నిర్ణయించారట.. ఇప్పుడు అదే సీఎం జగన్ ముందరి కాళ్లకు బంధం వేస్తోంది.

ప్రస్తుతం బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు వేళైంది. ఈ క్రమంలోనే మిత్రపక్షం జేడీయూని మచ్చిక చేసుకునే పనిలో బీజేపీ పడింది. ఇదివరకు కేంద్ర మంత్రిపదవుల్లో తమకు వాటా సరిగా ఇవ్వలేదని జేడీయూ అధినేత నితీష్ అలిగి అప్పట్లో మోడీ కేబినెట్ నుంచి వైదొలిగారు. కానీ ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఇద్దరి అవసరం కావడంతో మరోసారి తప్పనిసరి పరిస్థితుల్లో బీహార్ ఎన్నికల కోసం జట్టు కడుతున్నారు. ప్రధాని కూడా జేడీయూని కేబినెట్ లోకి తీసుకొని బీహార్ లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారు.కాగా కేంద్రంలో జేడీయూతోపాటు వైసీపీకి కూడా చోటు కల్పించాలనే ఉద్దేశం బీజేపీ పెద్దలకు ఉందని సమాచారం అందుతోంది.

ఆ విధంగా జగన్ పై పవన్ గెలిచాడట..!

వైసీపీకి 23మంది ఎంపీలు, 6 రాజ్యసభ ఎంపీలున్నారు. వైసీపీకి రెండు కేంద్ర మంత్రి పదవులు.. ఒక సహాయ మంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ నిర్ణయించిదట.. ఇప్పుడు ఇదే ఆఫర్ సీఎం జగన్ కు చెబితే మల్లాగుల్లాలు పడుతున్నట్టు సమాచారం.

బీజేపీ ఆఫర్ ను జగన్ తీసుకోవడానికి తటపటాయిస్తున్నట్టు తెలిసింది. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే దళితులు, మైనార్టీలు వైసీపీకి దూరం అవుతారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రంలో అధికారం పంచుకోకూడదని అనుకుంటున్నట్టు పార్టీ వర్గాల వారు అంటున్నారు. ఈ ఆఫర్ ఇచ్చినా జగన్ సున్నితంగా తిరస్కరించే అవకాశాలే ఎక్కువంటున్నారు. పైగా ఎన్నికల వేళ కేంద్రంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేపార్టీతోనే కలుస్తానని జగన్ హామీ ఇచ్చారు. బీజేపీ ఇవ్వనని చెప్పింది. దీంతో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఏపీ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఈ ప్రతిపాదనపై తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు తెలిసింది. మరి సీఎం జగన్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో చేరుతారా? లేదా అన్నది త్వరలోనే తేలనుంది.

కోవిడ్-19పై పోరాటానికి ‘రోబో’ చేయూత


కరోనా(కోవిడ్-19) పేరు చెబితే ప్రపంచ దేశాలు ఉలిక్కి పడుతున్నాయి. చైనాలోని వూహాన్లో సోకిన కరోనా మహమ్మరి ప్రపంచ దేశాలకు పాకింది. ఈ వైరస్ దాటికి అగ్రదేశాలు సైతం చేతులేత్తేశాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా రోజుకు లక్షల్లో కేసులు నమోదవుతోన్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కోటికిపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లక్షల్లో మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో కరోనా పేరు చెబితేనే ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

కేసీఆర్ కు ఏమైందో చెప్పాలని హైకోర్టులో పిటిషన్

ఈ మహమ్మరిపై పోరాడుతున్న కరోనా వారియర్స్ సైతం మృత్యువాత పడుతున్నారు. కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, జర్నలిస్టులు ఈ మహమ్మరి బారినపడుతున్నారు. కొంతమంది చికిత్స పొంది కరోనా నుంచి కోలుకుంటుండగా మరికొందరు మృత్యువాతపడుతున్నారు. కరోనాను ధైర్యంగా ఎదుర్కొంటూ వైద్యసేవలు అందిస్తున్న వైద్య సిబ్బందిని కాపాడుకునేందుకు ప్రభుత్వాలు అన్నిరకాల చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా వారికి పీపీఈ కిట్స్, మాస్కులు, శానిటైజర్లు అందిస్తున్నారు.

కరోనా వేళ కూడా ఇలా పీక్కుతింటారా?

వైద్య సిబ్బంది వీటన్నింటిని వినియోగిస్తున్నప్పటికీ కొందరు కరోనా బారిన పడుతున్నారు. దీంతో కరోనా పేషంట్లకు వైద్య సేవలందించేందుకు టెక్నాలజీని వాడుతున్నారు. దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న మహారాష్ట్రలో కోవిడ్-19 రోగులకు రోబోలను వాడుతున్నారు. ఆస్పత్రుల్లో చికిత్స రోగులకు ఆహారం, మంచినీళ్లు, మందులు లాంటివి అందించేందుకు ఓ రోబోటిక్ ట్రాలీని ఉపయోగిస్తున్నారు. దీని వల్ల రోగుల వద్ద వైద్య సిబ్బంది వెళ్లకుండానే వారికి కావాల్సిన వస్తువులను అందిస్తున్నారు. ఈ ట్రాలీ పేరు గొల్లార్. ముంబయిలోని వర్లీలోని పోడార్ ఆస్పత్రిలో రోబో ట్రాలీని వాడుతున్నారు. ఈ రోబో పేషంట్లకు సేవలందిస్తున్న వీడియోను మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్లర్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

కరోనా మహ్మమరి పోరాటంలో ఈ రోబోలు మానవులకు ఎంతగానో దోహదపడుతాయని వైద్యులు చెబుతున్నారు. మహారాష్ట్ర కంటే ముందుగానే చండీగఢ్ లో ఇలాంటి రోబోటిక్ ట్రాలీని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి సంస్ధ ఆవిష్కరించింది. వీరి సహకారంతో తాము రోబో ట్రాలీని వాడుతున్నామని, రూ.25వేలతో దీనిని తయారు చేసుకోవచ్చని అక్కడి వైద్యులు చెబుతున్నారు. కరోనాపై పోరాటంలో రోబోల పాత్ర కీలకంగా మారడంతో మరిన్ని రాష్ట్రాలు గోల్లార్ సేవలను వినియోగించుకునేందుకు ముందుకు వస్తున్నారు.

ఆ విధంగా జగన్ పై పవన్ గెలిచాడట..!


ఈ మధ్య జనసేన కార్యకర్తలు అభిమానులు పవన్ పనితీరుపై సంతృప్తిగా ఉన్నారు. ఆయన నిర్ణయాలు, లేవనెత్తుతున్న అంశాలు ఆయన ఇమేజ్ ను, పార్టీ భవిష్యత్ ను కాపాడేవిగా ఉండడమే దీనికి కారణం. ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా పవన్ ప్రస్తావించిన అంశాలను, ప్రతిపాదలను జగన్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఆయన ప్రస్తావించిన సమస్యలను పరిష్కరించడం జరిగింది. ఇది జగన్ పై పవన్ పైచేయి సాధించడమే అని జనసైనికులు సంబరపడుతున్నారు. తాజా పరిణామం వారిలో మరింత ఉత్సాహాన్ని నింపింది.

కేసీఆర్ కు ఏమైందో చెప్పాలని హైకోర్టులో పిటిషన్

జులై 5వ తేదీన వైస్ ఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన లా నేస్తం పథకానికి ఎందుకు నిధులు కేటాయించలేదని పవన్ ప్రశ్నించారు. లాక్ డౌన్ సమయంలో ఉపాధిలేక ఇబ్బందిపడుతున్న జూనియర్ లాయర్స్ కి రావలసిన భృతి బకాయిలు విడుదల చేయాలని పవన్ ఓ లేఖ ద్వారా కోరారు. జూన్ వరకు ప్రతి నెలా జూనియర్ లాయర్లకు రావలసిన రూ. 5000 భృతిని విడుదల చేయాలని కోరడం జరిగింది. పవన్ లేఖ విడుదల చేసిన రెండు రోజులలో అనగా జులై 7న సదరు నిధులను విడుదల చేస్తూ జగన్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనితో వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, లభ్ది చేకూరేలా చేసిన పవన్ పై జూనియర్ లాయర్లకు గౌరవం పెరిగిందని జనసేన కేడర్ భావిస్తుంది.

కరోనా వేళ కూడా ఇలా పీక్కుతింటారా?

అలాగే ప్రతిపక్ష హోదా లేకున్నా వ్యవస్థీకృతం గా ప్రజా సమస్యలు లేవనెత్తుతూ, వాటి పరిష్కరించే విషయంలో పవన్ విజయం సాధిస్తున్నారని జనసైనికులు భావిస్తున్నారు. ఇలాంటి పరిణామాలు పవన్ రాజకీయ భవిష్యత్ కి మేలు చేకూర్చేవి అని వారు అభిప్రాయపడుతున్నారు. తన లెటర్స్ ద్వారా ప్రభుత్వంలో కదిలికలు తీసుకొస్తున్న పవన్… జగన్ పై ఆధిపత్యం సాదిస్తున్నట్లే అనేది జనసేన నేతల వాదన. ఈ విషయంలో పై చేయి ఎవరిది అయినా ప్రయాజనం చేకూరేది ప్రజలకే కాబట్టి ఆనందించదగ్గ విషయమే. అనవసరమైన ఊక దంపుడు ఉపన్యాసాలు వదిలేసి నేతలు ఇలాంటి చర్యలపై దృష్టిపెడితే శుభపరిణామం .

టిక్ టాక్ కు వరుస ఎదురుదెబ్బలు.. ఆ దేశాల్లోనూ బ్యాన్..!


భారత్ ఏ సమయంలో టిక్ టాక్ ను బ్యాన్ చేసిందోగానీ ఆ సంస్థకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. భారత్-చైనా సరిహద్దుల్లో ఘర్షణలో భారత జవాన్లు 21మంది మృతి చెందారు. సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు సృష్టిస్తున్న చైనాకు బుద్దిచెప్పేందుకు భారత ప్రభుత్వం చైనాకు చెందిన పలు కాంట్రాక్టర్లు రద్దుచేసింది. దీంతోపాటు చైనాకు చెందిన 59యాప్స్ ను నిషేధిస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. ఇందులో భారత్ లో అత్యంత ప్రజాధరణ పొందిన టిక్ టాక్ యాప్ కూడా ఉంది.

కరోనా వేళ కూడా ఇలా పీక్కుతింటారా?

చైనాకు చెందిన టిక్ టాక్ యాప్ కి ఇండియాలోనే అత్యధిక యూజర్లు ఉన్నారు. దాదాపు 20కోట్ల మంది భారతీయులు టిక్ టాక్ యూజర్లుగా ఉన్నారు. టిక్ టాక్ పై గతంలోనే అనేక ఆరోపణలు వచ్చినా కేంద్రం అంతగా పట్టించుకోలేదు. ఒకసారి ఈ యాప్ బ్యాన్ చేసేందుకు ప్రయత్నించగా సుప్రీంకోర్టుకు వెళ్లి మరీ టిక్ టాక్ అనుమతి తెచ్చుకుంది. గాల్వానా ఘర్షణ తర్వాత చైనా-భారత్ సంబంధాలు చాలావరకు క్షీణించాయి. సరిహద్దుల్లో యుద్ధమేఘాలు అలుముకుంటున్నాయి. దీంతో భారత్ చైనాను రక్షణ, ఆర్థిక, దౌత్యపరంగా దెబ్బతీసేందుకు ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే చైనాకు చెందిన 59 యాప్స్ ను నిషేధించింది. ఒక్క టిక్ టాక్ నిషేధంతో ఆ దేశానికి 45వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

టిక్ టాక్, చైనాకు చెందిన కాంట్రాక్టులను రద్దు చేయడం ద్వారా చైనాకు ఇప్పటికే లక్ష కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. దీంతో ఆ దేశం అంతర్జాతీయ నిబంధనలు భారత్ ఉల్లంఘిస్తుందని ఆరోపిస్తుంది. దీనికి భారత్ కూడా గట్టిగానే సమాధానం ఇస్తుంది. చైనాపై అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఇటీవల చైనా తన బలగాలను వెనక్కి తీసుకుంది. దీంతో సరిహద్దుల్లో కొంత ఉద్రిక్తత తగ్గే అవకాశం ఉంది. అయితే జిత్తుల మారిగా పేరున్న డ్రాగన్ నుంచి ఎలాంటి ప్రమాదం రాకుండా భారత సైన్యం అప్రమత్తంగా ఉంది. చైనా కవ్వింపులకు దిగినే తగిన గుణపాఠం చెబుతామంటూ భారత ఆర్మీ స్పష్టం చేసింది.

కేసీఆర్ కు ఏమైందో చెప్పాలని హైకోర్టులో పిటిషన్

కరోనా మహమ్మరి గురించి చైనా ప్రపంచదేశాలను అప్రమత్తం చేయకపోవడంతో అన్నిదేశాలకు విలన్ గా మారింది. కరోనాతో ప్రపంచం అతలాకుతాలం కావడానికి చైనానే కారణమని ప్రపంచ దేశాలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన టిక్ టాక్ యాప్ ను అమెరికా, ఆస్ట్రేలియా నిషేధించాలని భావిస్తున్నాయి. భారత్ టిక్ టాక్ పై నిషేధించడంతో ఆ సంస్థకు 6బిలియన్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది. భారత్ బాటలోనే అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు వెళుతుండటంతో టిక్ టాక్ కంపెనీ భారీగా నష్టపోవాల్సి రావడం ఖాయంగా కన్పిస్తుంది.

మరోవైపు చైనాను వ్యతిరేకిస్తూ హంకాంగ్ లో పెద్దఎత్తున నిరసన వ్యక్తమవుతోన్నాయి. హంకాంగ్ స్వయంపతిపత్తిని కాలరాస్తూ చైనా చేసిన చట్టాన్ని ఆదేశ పౌరులు వ్యతిరేకిస్తున్నారు. ఇందుకు చైనాకు చెందిన టిక్ టాక్లోనే విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో చైనా ప్రభుత్వం హంకాంగ్ లో టిక్ టాక్ ను బ్యాన్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో టిక్‌టాక్ అక్కడ 1.50 లక్షల మంది యూజర్లను కోల్పోనుంది. దీంతో టిక్ టాక్ భారీ ఎత్తున నష్టపోవాల్సి వస్తుందని ఆ సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ గడ్డు పరిస్థితి టిక్ టాక్ సంస్థ ఎలా బయట పడుతుందో వేచి చూడాల్సిందే..!

నాలుగో సీజన్‌ ‘బిగ్‌బాస్‌’గా విజయ్‌ దేవరకొండ

Vijay Devarakonda


అసలు కన్నా కొసరే ఎక్కువన్నట్టు బిగ్‌బాస్‌ కంటెట్, కంటెస్టెంట్స్‌ స్టామినా కంటే షో ముందు వచ్చే పుకార్లే ఎక్కువగా ఉంటాయి. ఏ భాషలో అయినా బిగ్‌బాస్‌ కొత్త సీజన్‌ మొదలవుతుందంటే నెలల ముందు నుంచే అనేక ఊహాగానాలు స్టార్ట్‌ అవుతుంది. పబ్లిసిటీ స్టంటో, మరేదో తెలియదు గానీ వాటిపై బిగ్‌బాస్‌ యూనిట్‌ నుంచి ఎలాంటి క్లారిటీ ఉండదు. తెలుగులో మూడు ఎపిసోడ్స్‌ పూర్తి చేసుకున్న బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌కు రెడీ అవుతోంది. ఎన్టీఆర్ హోస్ట్‌గా చేసిన ఫస్ట్‌ సీజన్‌ చాలా ఆసక్తికరంగా సాగినా… నాని హోస్ట్‌గా వ్యవహరించిన సెకండ్‌ సీజన్‌ తేలిపోయింది. షో టైమ్‌లో, తర్వాత అనేక వివాదాలు తలేత్తాయి. లాభం లేదు నేనే వస్తున్నా అని థర్డ్‌ సీజన్‌కు మా టీవీ కో- ఓనర్ నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించాడు. తనదైన శైలిలో ఈ షోను హోస్ట్‌ చేసిన కింగ్‌ సీజన్‌ను ముందుండి నడిపించాడు. కంటెంట్‌ పరంగా షో పేలవంగా ఉన్నప్పటికీ నాగ్‌ క్రేజ్‌, మధ్యలో రమ్యకృష్ణ రూపంలో గెస్ట్‌ హోస్టింగ్‌, చిరంజీవి చేతుల మీదుగా క్లోజింగ్‌ సెర్మనీతో శుభం కార్డు పడింది.

కేసీఆర్ కు ఏమైందో చెప్పాలని హైకోర్టులో పిటిషన్

ఇప్పుడు కరోనా కారణంగా థియేటర్లు మూత పడడం, షూటింగ్స్‌ నిలిచిపోవడం.. తిరిగి ప్రారంభమైన షూటింగ్స్ స్పాట్స్‌లో కరోనా కలకలంతో తెలుగు సినీ, టీవీ పరిశ్రమలకు అడుగడుగునా అడ్డంకులు పడుతున్నాయి. పలువురు బుల్లితెర నటులకు కరోనా సోకడంతో సీరియల్స్‌ షూటింగ్స్‌ కూడా ఆగిపోయేలా ఉన్నాయి. ఇలాంటి టైమ్‌లో బిగ్‌బాస్ కొత్త ఎసిసోడ్‌ గురించి అనేక విశేషాలు బయటకొస్తున్నాయి. వీళ్లే కంటెస్టెంట్స్‌ అంటూ ఇప్పటికే ఓ లిస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇప్పుడు నాలుగో సీజన్‌ హోస్ట్ విషయంలో రోజుకో వార్త వస్తోంది. మళ్లీ తారక్ వస్తాడు.. లేదు నాగ్‌ కంటిన్యూ చేస్తాడు.. కాదు కాదు ఫస్ట్‌ టైమ్‌ లేడీ హోస్ట్‌గా సమంత తెరపైకి వస్తోందంటూ వార్తలు వినిపించాయి. ఈ లిస్ట్‌లో ఇప్పుడు సెన్సేషనల్‌ స్టార్ విజయ్ దేవరకొండ పేరు చేరింది. ఉన్నదున్నట్టు బయటికి మాట్లాడే విజయ్‌ని హోస్ట్‌గా పెడితే యూత్‌, లేడీ ఆడియన్స్‌లో మంచి క్రేజ్‌ వస్తుందని, షో కూడా సూపర్ హిట్టవుతుందని నిర్వాహకులు భావించారట. అదే విషయాన్ని రౌడీ హీరోకి చెప్పి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారట. ఎలాగో ఇప్పట్లో సినిమా షూటింగ్స్‌ జరిగేలా లేవు కాబట్టి.. ఈ ఖాళీ టైమ్‌లో బిగ్‌బాస్‌ షూట్‌లో పాల్గొనాలని అతడిని కోరినట్టు వార్తలు వస్తున్నాయి. కానీ, ఈ విషయంలో విజయ్‌ నుంచి గానీ… బిగ్‌బాస్‌ యూనిట్‌ నుంచి గానీ ఎలాంటి అప్‌డేట్‌ లేదు. కానీ, విజయ్‌ హోస్టింగ్‌కు ఒప్పుకుంటే మాత్రం బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ ఓ రేంజ్‌లో దూసుకెళ్లడం ఖాయమని అతని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

జల్లికట్టు ఆడబోతున్న సూర్య


రియలిస్టిక్‌ స్టోరీస్‌ను తెరకెక్కించడంలో, అలాంటి చిత్రాల్లో నటించడంలో కోలీవుడ్‌ దర్శకులు, హీరోలు ముందుంటారు. ఆ కోవకు చెందిన వాళ్లే డైరెక్టర్ వెట్రిమారన్, సూపర్ స్టార్ సూర్య. గతేడాది ధనుష్‌ హీరోగా వచ్చిన ‘అసురన్‌’తో వెట్రిమారన్‌ భారీ హిట్‌ ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీ ఒక్క తమిళ్‌లోనే కాదు దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అన్ని భాషల వాళ్లు రీమేక్ రైట్స్‌ కోసం పోటీ పడ్డారు. తెలుగులో ఆ అవకాశం సురేశ్‌ బాబు దక్కించుకోగా… తన తమ్ముడు విక్టరీ వెంకటేశ్‌ హీరోగా ‘నారప్ప’ టైటిల్‌తో రీమేక్‌ చేస్తున్నాడు. సహజత్వానికి దగ్గర ఉండే కథలతో సినిమాలు చేసే వెట్రిమారన్‌ ఇప్పుడు సూర్యతో మరో ఇంట్రస్టింగ్‌ మూవీ తీస్తున్నాడు. ‘అసురన్‌’ నిర్మాత కలైపులి థాను నిర్మాతగా జల్లికట్టు బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని ప్లాన్‌ చేశాడు. ‘వాడివాసల్‌’ అనే నవల ఆధారంగా తీస్తున్న ఈ సినిమాలో సూర్య తండ్రి, కొడుకుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. జల్లికట్టు ఆటలో తన తండ్రిని చంపిన ఎద్దును మచ్చిక చేసుకోవడమే నవలలో ప్రధానాంశం. దాని ఆధారంగా సినిమాకు తగ్గ మార్పులతో పక్కా స్క్రి ప్ట్‌ తయారు చేశారు డైరెక్టర్. డైలాగ్స్‌ మాత్రం ఎక్కవ నవలలోనివే ఉంటాయట.

జివికె రెడ్డి వ్యాపారాలపై సిబిఐ దాడుల వెనక అసలు ఉద్దేశం ?

తండ్రి, కొడుకుగా డ్యుయల్‌ రోల్‌ చేయడం సూర్యకు కొత్తేం కాకపోయినా ఈ మూవీకి తగ్గట్టుగా మేకోవర్ అవుతున్నాడు. రెండు పాత్రల్లోనూ ఎద్దులతో కుమ్ములాట ఉంటుంది కాబట్టి.. జల్లికట్టు ఆటగాడిగా తన శరీరాన్ని తీర్చిదిద్దుకునే పనిలో ఉన్నాడు. షెడ్యూల్‌ ప్రకారం గత నెలలోనే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లాలి. కానీ, కరోనా కారణంగా వాయిదా పడింది. అసురన్‌ యూనిట్‌ నుంచి వస్తున్న సినిమా, పైగా స్టార్ హీరో సూర్య కాబట్టి ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా జల్లికట్టు ఆటగాడిగా సూర్య పెర్ఫామెన్స్‌ ఎలా ఉంటుందని అతని ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఉన్నారు.

కేసీఆర్ కు ఏమైందో చెప్పాలని హైకోర్టులో పిటిషన్


రాష్ట్రంలో కరోనా మహ్మమరి విజృంభిస్తున్న వేళ సీఎం కేసీఆర్ ఎక్కడ? అనే చర్చ నడుస్తోంది. వారం రోజులుగా తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజుకు వెయ్యికిపైగా నమోదవుతున్నాయి. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఈ కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో హైదరాబాద్లో సంపూర్ణ లాక్డౌన్ విధిస్తారనే ప్రచారం జరిగినా ప్రభుత్వం చివరినిమిషంలో వాయిదా వేసుకుందని తెలుస్తోంది. కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న ఆన్ లాక్ 2.0నే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది.

ఏపీలో వారి దాహం తీరనిది.!

అయితే లాక్డౌన్ విధిస్తారనే ప్రచారం భాగ్యనగరంలో జోరుగా జరుగడంతో ఇతర ప్రాంతాలకు చెందినవాళ్లంతా సొంతూళ్లకు పయమనయ్యారు. దీంతో నగరంలోని రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. 20నుంచి 30లక్షల మంది వరకు తమ సొంతూళ్లకు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో నగరంలో ఎక్కడ చూసిన టూలెట్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. నగరంలో అన్ని పనులను పర్యవేక్షించే జీహెచ్ఎంసీ కార్యాయలంతోపాటు ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాయాల్లోని సిబ్బందికి కరోనా సోకడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగులు, సిబ్బంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని విధులు నిర్వహించాల్సి వస్తుందని వాపోతున్నారు.

ఇదిలా ఉంటే కొద్దిరోజులుగా సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో 30మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపింది. దీంతో వీరినంతా హోంక్వారంటైన్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి పలువురు ఆరా తీయడం మొదలెట్టారు. సీఎం కేసీఆర్ కు కూడా కరోనా సోకిందా? అందుకే బయటికి రావడం లేదా? అంటూ విపక్ష నేతలు ప్రశ్నలు సంధిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్ కొద్దిరోజులుగా ఎర్రవెల్లిలోని ఫౌంహౌజ్ లో ప్రభుత్వానికి సంబంధించిన సమీక్షలు నిర్వహిస్తున్నారని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.

జివికె రెడ్డి వ్యాపారాలపై సిబిఐ దాడుల వెనక అసలు ఉద్దేశం ?

సీఎం ఆరోగ్య పరిస్థితిపై తాజాగా హైకోర్టులో మాండమాస్ పిటిషన్ దాఖలైంది. సీఎం కేసీఆర్‌ దాదాపు ప‌ది రోజులుగా ప్ర‌జ‌ల‌కు క‌నిపించ‌డం లేద‌ని.. ప్ర‌స్తుతం ఆయన ఎక్కడున్నారు? ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చెప్పాల‌ని కోరుతూ న‌వీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మ‌ల్ల‌న్న హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. పీవీ న‌రసింహారావు శ‌త‌జ‌యంతి రోజున ఆయ‌న చివ‌రిసారిగా ప్ర‌జ‌ల‌కు క‌నిపించార‌ని పేర్కొన్నారు. ఆ స‌భ‌లో కేసీఆర్ మాస్క్ కూడా ధ‌రించ‌క‌పోవ‌డంతో ఆయ‌న‌ ఆరోగ్యంపై ఆందోళ‌న‌ చెందుతున్నట్టు చెప్పారు. ఆ తర్వాత నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో సీఎం మాస్కు లేకుండానే కనిపించారని పేర్కొన్నారు.

దీని తర్వాతే ప్రగతి భవన్లో 30మంది పాజిటివ్ రావడంతో ఆయన ఆరోగ్యంపై గందరగోళం నెలకొందని తెలిపాడు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై తెలంగాణ పౌరుడిగా ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నాడు. రాష్ట్రంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల దృష్ట్యా సీఎం హోదాలో ముఖ్య‌మైన కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల్సి ఉందని తెలిపాడు. రాష్ట్ర ప్ర‌జ‌లు ఆందోళ‌న చెంద‌కుండా సీఎం కేసీఆర్ ఎక్కడ ఉన్నారో? ఆయన ఆరోగ్య ప‌రిస్థితిపై వివ‌రాలు అంద‌జేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని మల్లన్న పిటిష‌న్‌లో కోరాడు. ఇకనైనా ప్రభుత్వం ఇప్పటికైనా సీఎం ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇస్తుందో లేదో వేచిచూడాల్సిందే..!

కరోనా వేళ కూడా ఇలా పీక్కుతింటారా?


మనిషి చనిపోయాక ఆ శవాలను పీక్కుతింటాయి నక్కలు.. రాబందులు. కానీ బతికుండగానే ఈ కరోనా ఆపత్కాలంలో మనుషులను పీక్కుతింటున్నాయి ప్రైవేట్ స్కూళ్లు.. తెలుగు రాష్ట్రాల్లో విద్యా వ్యాపారమైంది. మరీ అంగడి సరుకైంది.. ప్రభుత్వ పాఠశాలలు కునారిల్లిన వేళ ప్రైవేట్ ఆస్పత్రులే జనాలకు దిక్కయ్యాయి. ప్రైవేట్ మోజులో పడి తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

జివికె రెడ్డి వ్యాపారాలపై సిబిఐ దాడుల వెనక అసలు ఉద్దేశం ?

అసలే కరోనా కాలం.. అందరి ఉద్యోగ, ఉపాధి కోల్పోయి బతుకుజీవుడా అంటూ కలోగంజో తాగి బతికేస్తున్నారు. ఇలాంటి సమయంలో కూడా ప్రైవేట్ స్కూళ్ల దోపిడీ ఆగడం లేదు. ఆన్ లైన్ క్లాసుల పేరిట వేలు, లక్షలు కట్టించుకుంటూ ప్రతీ విద్యార్థి ట్యాబ్, ల్యాప్ టాప్, లేదా ఫోన్ కొనుక్కోవాలంటూ తరగతులు స్ట్రాట్ చేశాయి. వారి నుంచి ముక్కుపిండీ మరీ ఫీజులు వసూలు చేస్తూ ఈ కొత్త దందా మొదలుపెట్టారు..

తెలంగాణలో ఈ ప్రైవేట్ స్కూల్స్ దోపిడీని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కరోనా భయంతో సీఎం కేసీఆర్ ఫాంహౌస్ కు వెళ్లారని ప్రచారం సాగుతోంది. ఇక ఎవరూ పట్టించుకోకపోవడంతో ఈ దందా తెలంగాణలో మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది.

ఏపీలో వారి దాహం తీరనిది.!

అయితే ఏపీలో మాత్రం విద్యకోసం పాటుపడుతున్న సీఎం జగన్ ఊరుకోలేదు. ఇప్పటికే సర్కార్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టిన జగన్ ఇప్పుడు తాజాగా ప్రైవేట్ స్కూల్స్ దోపిడీని అరికట్టేశాడు. ప్రైవేటు విద్యాసంస్థలు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని తాజాగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిములపు సురేష్ హెచ్చరించారు. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లు విద్యాసంవత్సరం 2020 ఆగస్టు 3న ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు. 2020-21 విద్యా సంవత్సర షెడ్యూల్‌ను ప్రభుత్వం జారీ చేసే వరకు ఆన్‌లైన్ తరగతులకు వెళ్లవద్దని ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలకు స్పష్టం చేశారు. ఆన్‌లైన్ తరగతులకు విద్యార్థులు హాజరుకావడానికి స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్స్, టాబ్లెట్లు కొనలేమని కొంతమంది తల్లిదండ్రులు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇలా దోపిడీకి కేరాఫ్ అడ్రస్ గా మారిన ప్రైవేట్ స్కూల్స్ పై ఏపీలో ఉక్కుపాదం మోపుతున్నారు. కానీ మహానగరం ఉన్న తెలంగాణలో మాత్రం ఈ అందరి సమస్య ఎవరికీ పట్టకపోవడం శోచనీయమే..

-ఎన్నం

బాలయ్య హీరోయిన్‌గా అమలా పాల్‌?


అక్కినేని నాగ చైతన్య హీరోగా 2011లో వచ్చిన ‘బెజవాడ’ మూవీతో టాలీవుడ్‌కు పరిచమైన మలయాళ ముద్దుగుమ్మ అమలాపాల్. ఆ వెంటనే మెగా కాంపౌండ్‌లో అడుగుపెట్టిందామె. రామ్ చరణ్ తేజ్‌ హీరోగా ‘నాయక్’లో ఆడిపాడింది. అల్లు అర్జున్‌ సరసన ‘ఇద్దరమ్మాయిలతో’లో లీడ్‌ హీరోయిన్‌గా చేసి మెప్పించింది. అయినా సరే తెలుగులో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. చివరగా 2015లో నాని సరసన ‘జెండాపై కపిరాజు’లో హీరోయిన్‌గా నటించింది. కానీ, ఆ సినిమా ప్లాప్ అవడంతో టాలీవుడ్‌ను ఫెడ్‌ ఔట్‌ అయింది అమలా. అయినా తమిళ్‌, మలయాళంతో పాటు కన్నడ మూవీస్‌తో బిజీగా మారిందామె. డైరెక్టర్ ఎ.ఎల్‌. విజయ్‌తో పెళ్లి, విడాకులు అయినా కూడా నటిగా ఆమె జోరు తగ్గలేదు. ఈ మధ్యే వ్యాపారవేత్త భవీందర్ సింగ్‌ను పెళ్లి చేసుకొని వార్తలోకి వచ్చిందామె.

జివికె రెడ్డి వ్యాపారాలపై సిబిఐ దాడుల వెనక అసలు ఉద్దేశం ?

నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన హిందీ సూపర్ హిట్‌ వెబ్‌ సిరీస్‌ ‘లస్ట్‌ స్టోరీస్‌’ తెలుగు రీమేక్‌లో నటిస్తున్న ఆమె ఐదేళ్ల తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించబోతోంది. ఇప్పుడు టాలీవుడ్‌లో మరో క్రేజీ ఆఫర్ ఆమె సొంతమైందన్న వార్త చక్కర్లు కొడుతోంది. సీనియర్ హీరో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మూడో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘సింహా’, ‘లెజెండ్‌’ తర్వాత మళ్లీ జతకట్టిన వీరిద్దరూ ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బాలయ్య బర్త్‌డే సందర్భంగా రిలీజ్‌ చేసిన టీజర్ కు అద్భుత స్పందన వచ్చింది. ఈ మూవీలో బాలయ్య రెండు షేడ్స్‌ ఉన్న పాత్రల్లో నటిస్తున్నాడని టాక్‌. దాంతో, సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు చాన్స్‌ ఉందట. లీడ్‌ హీరోయిన్‌గా అమలా పాల్‌ సెలెక్ట్‌ అయిందని టాలీవుడ్‌ వర్గాల సమాచారం. మరో కథానాయికగా కొత్త అమ్మాయిని ఇంట్రడ్యూస్‌ చేస్తున్నారట. అయితే, చాన్నాళ్ల తర్వాత అమలా పాల్‌ తెలుగులో స్ట్రెయిట్‌ మూవీ చేస్తున్న విషయం అటు చిత్ర బృందం కానీ… ఇటు అమలా కానీ కన్ఫర్మ్‌ చేయలేదు. మరోవైపు బాలయ్య మూవీకి టైటిల్‌ను ఖరారు చేసేందుకు చిత్ర యూనిట్‌ కరసత్తు చేస్తోంది. తొలుత మోనార్క్, అఘోరా వంటి పేర్లు వినిపించగా.. ఇప్పుడు కథానుసారం సూపర్ మాన్‌ అనే టైటిల్‌ తెరపైకి వచ్చింది. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడ్డ షూటింగ్‌ తొందర్లోనే తిరిగి మొదలవనుంది. అప్పుడే హీరోయిన్లతో పాటు టైటిల్‌ గురించి ప్రకటన రానుంది.

సల్మాన్‌ మూవీలో చాన్స్‌ కొట్టిన నితిన్‌ హీరోయిన్


మేఘా ఆకాశ్. నితిన్‌ సరసన ‘లై’ సినిమాతో తెరంగేట్రం చేసిందీ తమిళ్‌ అమ్మాయి. ఆపై పవర్ కళ్యాణ్, త్రివిక్రమ్‌ ప్రొడ్యూస్‌ చేసిన ‘ఛల్‌ మోహన్‌ రంగ’ తో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యే ప్రయత్నం చేసింది. కానీ ఆ రెండు సినిమాలూ బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టడంతో మేఘా తన మాతృక కోలీవుడ్‌పై దృష్టి సారించింది. ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్‌ నటించిన ‘పేట’తో తమిళ్‌లో అరంగేట్రం చేసింది. ఆపై, ధనుష్‌ హీరోగా వచ్చిన ‘తూటా’తో మెప్పించింది. శింబు సరసన ‘వింత రాజవతాన్‌ వరునెన్‌’, అథర్వ సరసన ‘బూమెరాంగ్’ వంటి చిత్రాలతో తమిళ్‌లో పాగా వేసింది. అక్కడితో ఆగకుండా బాలీవుడ్‌లో అడుగు పెట్టిందీ అమ్మడు. సూరజ్‌ పాంచోలి హీరోగా నటించిన ‘శాటిలైట్‌ శంకర్’తో హిందీ తెరకు పరిచయమైంది.

జివికె రెడ్డి వ్యాపారాలపై సిబిఐ దాడుల వెనక అసలు ఉద్దేశం ?

ప్రస్తుతం తమిళ్‌లో రెండు చిత్రాలు, తెలుగులో ‘మను చరిత్ర’ అనే మూవీలో నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉన్న మేఘాకు ఓ బంపరాఫర్ తగిలింది. బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ మూవీలో యాక్ట్‌ చేసే చాన్స్‌ కొట్టేసింది. సల్మాన్‌ ఖాన్‌ హీరోగా ప్రభుదేవా ‘రాధే’ అనే సినిమా తీస్తున్నాడు. ఇందులో ఓ కీలక పాత్ర కోసం మేఘా ఆకాశ్‌ను ఎంపిక చేసుకున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ మొదలవగా.. మేఘా కూడా సెట్స్‌కు వస్తోంది. అనూహ్యంగా వచ్చిన అదృష్టంతో మేఘా ఇప్పుడు గాల్లో తేలిపోతోంది. సల్మాన్‌తో తెర పంచుకుంటానని ఎప్పుడూ అనుకోలేదని అంటోంది. ప్రభుదేవా ఈ మూవీ కథ‌ చెప్పినప్పుడు చాలా ఆసక్తికరంగా అనిపించిందని, పైగా తన గత చిత్రాలతో పోలిస్తే ‘రాధే’ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని చెప్పింది. ఈ మూవీ తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందన్న నమ్మకంతో ఉందామె. ఇక సల్మాన్‌ ఖాన్‌పై ఆమె ప్రశంసల వర్షం కురిపించింది. అతను మంచి మనసున్న వ్యక్తి అని, సెట్లో ప్రతి ఒక్కరినీ పలుకరించి ఎవరికి ఏం అవసరం ఉన్నా చేసి పెడతాడని చెప్పింది. ఓ రోజు సల్మాన్‌ బీయింగ్‌ హ్యూమన్‌ ఫౌండేషన్‌ గురించి అతనితో మాట్లాడితే మరుసటి రోజే తనకు బీయింగ్‌ హ్యూమన్‌ టీ షర్ట్‌ తీసుకొచ్చి ఇచ్చారని తెలిపింది.