
శ్రీరాపాక. ప్రముఖ క్యాస్టూమ్ డిజైనర్. తెలుగుతో పాటు అనేక భాషల్లో ఎన్నో చిత్రాలకు పని చేసింది. కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటోంది. కానీ, ఇప్పటిదాకా ఆమె పేరు ఫిల్మ్ సర్కిల్స్‌లో మినహా బయట ఎవ్వరికీ తెలియదు. ప్రేక్షకులకైతే ఆమె ఎవరో అస్సలు తెలియదు. కానీ, రెండు రోజులు షూటింగ్‌లో పాల్గొన్న ఒక్క సినిమాతో ఆమె ఓవర్నైట్ స్టార్ గా మారింది. ఆమే ఆర్జీవీ తీసిన అడల్ట్ మూవీ ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ. ఆమె అసలు పేరు శ్రీ రాపాక. లాక్‌డౌన్ టైమ్‌లో ఆర్జీవీ వరుస చిత్రాలతో డిజిటల్ మీడియాపై దండయాత్ర చేస్తున్నాడు. ఆ క్రమంలోనే స్వీటీ ప్రధాన పాత్రలో నగ్నం తీశాడు. కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ట్రైలర్ రిలీజ్‌తోనే స్వీటీ పేరు మారు మోగగా.. సినిమా విడుదలైన తర్వాత ఆమె స్టార్ గా మారిపోయింది. ఆర్జీవీతో సినిమా చేసింది పైగా, అచ్చ తెలుగు అమ్మాయి కావడంతో ప్రతీ యూట్యూబ్ చానల్ ఆమె ఇంటర్వ్యూ కోసం ఎగబడుతోంది. ఇతర సినిమాలు ఏమీ లేవు కాబట్టి స్వీటీ కూడా ప్రతి చానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ … గతంలో తాను కలిసి పని చేసిన పలువురు హీరోలు, హీరోయిన్లపై కామెంట్లు చేస్తోంది. బాలకృష్ణ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టిన ఆమె రాశీ ఖన్నాతో గొడవ పడ్డానని చెప్పింది.
కరోనా వేళ కూడా ఇలా పీక్కుతింటారా?
ఇప్పుడు మరో అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడింది. పవన్‌పై తనకు క్రష్ ఉందన్న స్వీటీ ఆయన రమ్మంటే డేటింగ్‌కు వెళ్తానని సంచలన కామెంట్లు చేసింది. ఓ చానెళ్లో ఆమె మాట్లాడుతూ ‘ తెలుగు హీరోల్లో నాకు పవన్ కల్యాణ్ అంటే క్రష్. గతంలో ఆయన్ని కలవాలని రెండు మూడు సార్లు ట్రై చేశా కానీ కుదరలేదు. ఆపై ప్రయత్నం చేయలేదు. పవన్‌ని కలిపించమని వేరే వాళ్లను అడగడం నాకు ఇష్టం లేదు. అందుకే ఎవరినీ అడగలేదు. కానీ, మనసులో ఒక్కటే అనుకున్నా. పవన్‌ను ఎప్పటికైనా కలుస్తాను అని. పవన్ అంటే నాకు ఎంత ఇష్టం అంటే.. ఆయనతో డేటింగ్‌కు వెళ్లడానికి కూడా రెడీ. ఆయన పిలిస్తే అస్సలు ఆలోచించను. పవన్‌తో కలిసి ఒక్క సినిమాలోనైనా నటించాలని ఉంది’ అని స్వీటీ చెప్పుకొచ్చింది. ఈ విషయం పవన్ వరకూ వెళ్తే.. ఆయన ఎలా స్పందిస్తాడో చూడాలి.