
భారత్ ఏ సమయంలో టిక్ టాక్ ను బ్యాన్ చేసిందోగానీ ఆ సంస్థకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. భారత్-చైనా సరిహద్దుల్లో ఘర్షణలో భారత జవాన్లు 21మంది మృతి చెందారు. సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు సృష్టిస్తున్న చైనాకు బుద్దిచెప్పేందుకు భారత ప్రభుత్వం చైనాకు చెందిన పలు కాంట్రాక్టర్లు రద్దుచేసింది. దీంతోపాటు చైనాకు చెందిన 59యాప్స్ ను నిషేధిస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. ఇందులో భారత్ లో అత్యంత ప్రజాధరణ పొందిన టిక్ టాక్ యాప్ కూడా ఉంది.
కరోనా వేళ కూడా ఇలా పీక్కుతింటారా?
చైనాకు చెందిన టిక్ టాక్ యాప్ కి ఇండియాలోనే అత్యధిక యూజర్లు ఉన్నారు. దాదాపు 20కోట్ల మంది భారతీయులు టిక్ టాక్ యూజర్లుగా ఉన్నారు. టిక్ టాక్ పై గతంలోనే అనేక ఆరోపణలు వచ్చినా కేంద్రం అంతగా పట్టించుకోలేదు. ఒకసారి ఈ యాప్ బ్యాన్ చేసేందుకు ప్రయత్నించగా సుప్రీంకోర్టుకు వెళ్లి మరీ టిక్ టాక్ అనుమతి తెచ్చుకుంది. గాల్వానా ఘర్షణ తర్వాత చైనా-భారత్ సంబంధాలు చాలావరకు క్షీణించాయి. సరిహద్దుల్లో యుద్ధమేఘాలు అలుముకుంటున్నాయి. దీంతో భారత్ చైనాను రక్షణ, ఆర్థిక, దౌత్యపరంగా దెబ్బతీసేందుకు ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే చైనాకు చెందిన 59 యాప్స్ ను నిషేధించింది. ఒక్క టిక్ టాక్ నిషేధంతో ఆ దేశానికి 45వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
టిక్ టాక్, చైనాకు చెందిన కాంట్రాక్టులను రద్దు చేయడం ద్వారా చైనాకు ఇప్పటికే లక్ష కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. దీంతో ఆ దేశం అంతర్జాతీయ నిబంధనలు భారత్ ఉల్లంఘిస్తుందని ఆరోపిస్తుంది. దీనికి భారత్ కూడా గట్టిగానే సమాధానం ఇస్తుంది. చైనాపై అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఇటీవల చైనా తన బలగాలను వెనక్కి తీసుకుంది. దీంతో సరిహద్దుల్లో కొంత ఉద్రిక్తత తగ్గే అవకాశం ఉంది. అయితే జిత్తుల మారిగా పేరున్న డ్రాగన్ నుంచి ఎలాంటి ప్రమాదం రాకుండా భారత సైన్యం అప్రమత్తంగా ఉంది. చైనా కవ్వింపులకు దిగినే తగిన గుణపాఠం చెబుతామంటూ భారత ఆర్మీ స్పష్టం చేసింది.
కేసీఆర్ కు ఏమైందో చెప్పాలని హైకోర్టులో పిటిషన్
కరోనా మహమ్మరి గురించి చైనా ప్రపంచదేశాలను అప్రమత్తం చేయకపోవడంతో అన్నిదేశాలకు విలన్ గా మారింది. కరోనాతో ప్రపంచం అతలాకుతాలం కావడానికి చైనానే కారణమని ప్రపంచ దేశాలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన టిక్ టాక్ యాప్ ను అమెరికా, ఆస్ట్రేలియా నిషేధించాలని భావిస్తున్నాయి. భారత్ టిక్ టాక్ పై నిషేధించడంతో ఆ సంస్థకు 6బిలియన్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది. భారత్ బాటలోనే అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు వెళుతుండటంతో టిక్ టాక్ కంపెనీ భారీగా నష్టపోవాల్సి రావడం ఖాయంగా కన్పిస్తుంది.
మరోవైపు చైనాను వ్యతిరేకిస్తూ హంకాంగ్ లో పెద్దఎత్తున నిరసన వ్యక్తమవుతోన్నాయి. హంకాంగ్ స్వయంపతిపత్తిని కాలరాస్తూ చైనా చేసిన చట్టాన్ని ఆదేశ పౌరులు వ్యతిరేకిస్తున్నారు. ఇందుకు చైనాకు చెందిన టిక్ టాక్లోనే విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో చైనా ప్రభుత్వం హంకాంగ్ లో టిక్ టాక్ ను బ్యాన్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో టిక్‌టాక్ అక్కడ 1.50 లక్షల మంది యూజర్లను కోల్పోనుంది. దీంతో టిక్ టాక్ భారీ ఎత్తున నష్టపోవాల్సి వస్తుందని ఆ సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ గడ్డు పరిస్థితి టిక్ టాక్ సంస్థ ఎలా బయట పడుతుందో వేచి చూడాల్సిందే..!