Homeజాతీయ వార్తలునిమ్మగడ్డ కేసులో ప్రభుత్వ వాదనలకు 'సుప్రీం' అభ్యతరం..!

నిమ్మగడ్డ కేసులో ప్రభుత్వ వాదనలకు ‘సుప్రీం’ అభ్యతరం..!


నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తప్పలేదు. నిమ్మగడ్డ పునర్నియామకం చెల్లదనే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ధర్మాసనానికి తన వాదనలు వినిపించింది. ఈ వాదనను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తోసిపుచ్చారు. నిమ్మగడ్డ కేసులో హైకోర్టు అదేశాలనే అమలు చేయాలని, ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాలతో అధికారులు పనిచేయలేకపోతున్నారని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు.

ఆ విధంగా జగన్ పై పవన్ గెలిచాడట..!

మధ్యంతరంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ని నియమించేలా గవర్నర్‌కు సూచించాలని ప్రభుత్వ న్యాయవాది ధర్మసనాన్ని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించలేదు. 2 లేక 3 వారాల్లో కేసు విచారణ పూర్తి చేయాలని భావిస్తున్నామని స్పష్టం చేసింది ఎన్నికల నిర్వహించే విషయంలో 1994 చట్టం ప్రకారం నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు అర్హత లేదని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది వాదించారు. దీంతో ఎన్నికల నిర్వహణపై మాట్లాడదలచుకోలేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

నిమ్మగడ్డను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమిచకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎన్నిమార్గాలు వెతికినా అవి ఫలితాన్ని ఇవ్వడం లేదు. ఇటీవల నిమ్మగడ్డ రమేష్ కుమార్ బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ ను హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో కలిసిన వీడియోలు రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపాయి. నిమ్మగడ్డ టీడీపీ అనుకూల వ్యక్తిగా ముద్ర వేసేందుకు వైసీపీకి ఒక అవకాశం లభించింది. ఆ మేరకు వైసీపీ అనుకూల మీడియా వీడియో వ్యవహారాన్ని విస్తృతంగా ప్రచారం చేసింది.

జగన్ కు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి!

సీఎం జగన్ ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా తన నిర్ణయాన్ని మార్చుకోని స్వభావం ఉన్న వ్యక్తి అనే విషయం తెలిసిందే. నిమ్మగడ్డ ఎస్ఇసిగా ఉండకుడదనే ఉద్దేశ్యంతో ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తెచ్చారు, ఆర్డినెన్స్ ను హైకోర్టు కొట్టేయడం, నిమ్మగడ్డనే ఎన్నికల కమిషనర్ గా కొనసాగించాలని చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు నిమ్మగడ్డ కేసులో హైకోర్టు తీర్పు అమలు చేయాలని చెబుతున్న నేపథ్యంలో నిమ్మగడ్డ వ్యవహారంలో ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకుంటుందనే విషయం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular