Home Blog Page 8419

ఆ విషయంలో కేసీఆర్ కంటే జగనే బెటర్..!


తెలంగాణా పీసీసీ చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జగన్ ని పొగడ్తలతో ముంచేస్తున్నారు. కరోనా కట్టడిలో ఆయన భేష్ అంటూ కితాబిస్తున్నారు. కరోనా వైరస్ ని అదుపు చేయడంలో సీఎం కేసీఆర్ పనితీరు అద్వాన్నంగా ఉందన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి జగన్ ని చూసి కేసీఆర్ నేర్చుకోవాలని సలహా ఇచ్చారు. తెలంగాణా లో కరోనా వైరస్ వ్యాప్తి విపరీతంగా ఉంది. ప్రతి వంద కరోనా టెస్టులకు 25 నుండి 30 కేసులు నమోదు అవుతున్నాయి. నిన్న మొత్తంగా 6200 కరోనా టెస్టులు నిర్వహించగా 1879 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అంటే ప్రతి 10 మందిలో ముగ్గురికి కరోనా సోకిందన్న మాట. ఈ నేపథ్యంలో రానున్న కొద్దిరోజులలో హైదరాబాద్ మరో ముంబైలా తయారవడం ఖాయంగా కనిపిస్తుంది.

జివికె రెడ్డి వ్యాపారాలపై సిబిఐ దాడుల వెనక అసలు ఉద్దేశం ?

ఈ నేపథ్యంలో కరోనా నిర్వహణలో సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలం చెందాడని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజ మెత్తాడు. కరోనా టెస్టుల విషయంలో అలసత్వం ప్రదర్శిస్తున్న కేసీఆర్, రోగులకు మెరుగైన వైద్యం అందించడం లేదు అన్నారు. ప్రక్క రాష్ట్రంలో జగన్ రోజుకు వేలల్లో కరోనా టెస్ట్ ల నిర్వహించడం తో పాటు కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చారు అని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలలో సరైన సౌకర్యాలు లేక అనేక మంది రోగులు మరణిస్తున్నారు అన్నారు. ఇక ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించిన వారి ఇల్లు గుల్ల అవుతుంది. రోజుకు రూ. 70 వేల నుండి లక్ష రూపాయల వరకు ప్రయివేటు ఆసుపత్రులు రోగుల నుండి వసూలు చేస్తున్నాయి, అని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

ఏపీలో వారి దాహం తీరనిది.!

తెలంగాణా రాష్ట్రంలో లాక్ డౌన్ సమయంలో కరోనా అదుపులో ఉండగా, సడలింపుల అనంతరం తీవ్ర రూపం దాల్చింది. ముఖ్యంగా హైదరాబాద్ లో కరోనా వైరస్ నియంత్రణ ప్రభుత్వానికి అంతుబట్టని విషయంగా మారింది. కరోనా టెస్ట్ లు నిర్వహించే కొలది, కేసులు బయటపడుతున్నాయి. కరోనా విషయంలో కేసీఆర్ వైఖరిని ఆ రాష్ట్ర గవర్నర్ తమిళసై సైతం తప్పుబట్టారు. కరోనా నిర్వహణలో అలసత్వం పనికిరాదని, ప్రభుత్వం చిత్త శుద్దితో పనిచేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ కి గవర్నర్ కి మధ్య విభేదాలు తెలెత్తినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా కేసీఆర్ కనిపించక పోవడం, ఆయనకు కరోనా సోకిందని ప్రచారం జరగడం ఆందోళన రేపుతోంది. దీన్ని ఆసరాగా తీసుకొని కాంగ్రెస్, బీజేపీ నాయకులు కేసీఆర్ పై ఫైర్ అవుతున్నారు.

జివికె రెడ్డి వ్యాపారాలపై సిబిఐ దాడుల వెనక అసలు ఉద్దేశం ?

ఇటీవల జివికె రెడ్డి, ఆయన కుమారుడు సంజయ్ రెడ్డి, కూతురు పింకీ రెడ్డి ల వ్యాపారాలపై సిబిఐ దాడులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకం ,రద్దీ అయిన ముంబై విమానాశ్రయం కాంట్రాక్టు దక్కించుకోవటమే కాకుండా దాన్ని నడుపుతున్న జివికే రెడ్డి కుటుంబం పై సిబిఐ దాడులు చేయటం దాదాపు 700 కోట్ల రూపాయలకు పైగా నిధులు దుర్వినియోగం చేసినట్లు అభియోగాలు మోపటం జరిగింది. ఇందులో 200 ఎకరాల్లో బోగస్ కంపెనీల పేరుతో పనులు చేసినట్లు చూపటం, దాదాపు 400 కోట్ల రూపాయలు తన స్వంత కంపెనీలకు మళ్లించటం, విమానాశ్రయం లోని షాపులు తక్కువ మొత్తానికే తమ బంధువులకు కేటాయించటం లాంటి నిర్దిష్ట ఆరోపణలు సిబిఐ చేసింది. ఆ ప్రాధమిక దర్యాప్తు నివేదిక ఆధారంగా ఇడి కూడా కేసు నమోదు చేసింది. ఇంతవరకూ పేపర్లలో వార్తలు వచ్చినా దీనివెనక ఇంకేమైనా మనకు తెలియని కధలు ఉన్నాయా అనేది ఆసక్తి రేపుతుంది.

ఈ ముంబై విమానాశ్రయ కాంట్రాక్టు యుపిఏ హయాం లో ఈ కంపెనీ దక్కించుకుంది. అప్పట్లో యుపిఏ హయాం లో ప్రతి కాంట్రాక్టు వెనక పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయని ఆరోపణలున్నాయి. ఇప్పటికే 2జి కుంభకోణం, బొగ్గు కుంభకోణం లాంటివి బయటకు రావటంతో యుపిఏ ప్రభుత్వం అప్రతిష్ట పాలయ్యింది. అలాగే ముంబై విమానాశ్రయం కాంట్రాక్టు వెనక కాంగ్రెస్ నాయకులు  ఎవరున్నారనేది చర్చ నీయాంశమయ్యింది. మోడీ ప్రభుత్వానికి ఈ వ్యవహారం లో ఉప్పంద బట్టే ఈ దాడులు జరిగి వుంటాయని అనుకుంటున్నారు. అంటే ప్రముఖ కాంగ్రెస్ నాయకులకు ముడుపులు ముట్టివుంటాయి కాబట్టి వాళ్ళ భాగోతం బయటపెట్టటానికే ఈ దాడులు జరిగి ఉంటాయనేది జనం నానుడి. ఇటీవలే అహ్మద్ పటేల్ ని వేరే కుంభకోణం లో విచారించటం జరిగింది. ఈ సారి ఎవరివంతో వేచి చూడాలి.

వై ఎస్సార్ టైములో ఆంధ్రలో ఎంతోమంది ఆ సామాజికవర్గానికి చెందిన కాంట్రాక్టర్లు ఒక్కసారి పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళలో చాలామంది సరైన నాణ్యతలు పాటించకుండా డబ్బులు వెనకేసుకున్నారని తెలుస్తూంది. ఈ దాడుల తర్వాత వాళ్ళ గుండెల్లో కూడా రైళ్ళు పరిగెత్తు తున్నాయని అనుకుంటున్నారు. నిన్ననే పశ్చిమ బెంగాల్ కి చెందిన శ్రీ గణేష్ జ్యుయలరి తాలూకు అతిపెద్ద కుంభకోణం బయటకు వచ్చింది. లాక్ డౌన్ వచ్చిన తర్వాత కొంతకాలం ఆపిన సిబిఐ దాడులు తిరిగి పెద్ద ఎత్తున ప్రారంభం కావటంతో చాలామంది అక్రమసంపాదనాపరులు, కుంభకోణాలు చేసిన వాళ్ళలో ఓ రకమైన భయం అలుముకుంది. ఈ దాడుల్లో ఇంకెన్ని బొమికలు బయటపడతాయో చూడాలి.

ఇవి పాలసీ కష్టాలు!

Health Insurance

హెల్త్‌‌ ఇన్సూరెన్స్‌‌ పాలసీ ఉంది కాబట్టి కరోనా ట్రీట్‌‌ మెంట్‌‌ ఖర్చులన్ని ఇన్సూరెన్స్‌‌ కంపెనీలే భరిస్తాయనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.. హాస్పిటల్స్‌‌ వేస్తున్న బిల్లులకు, ఇన్సూరెన్స్‌‌ కంపెనీలు సెటిల్‌‌ చేస్తున్న క్లయిమ్స్‌‌ కు మధ్య పొంతనే ఉండడం లేదు. మిగిలిన అమౌంట్‌‌ ను పేషెంట్లు కట్టేంత వరకు హాస్పిటల్‌‌ యాజమాన్యం ఒప్పుకోవడం లేదు. హాస్పిటల్‌‌ బిల్స్‌‌ కంటే  ఇన్సూరెన్స్‌ కంపెనీలు చెల్లిస్తున్న అమౌంట్‌‌ తక్కువగా ఉంటోంది. పేషెంట్ల ట్రీట్‌‌ మెంట్‌‌ కోసం వాడే పీపీఈ కిట్లు, మాస్కులు, శానిటైజేషన్‌‌ వంటి వాటిపై విధించే బిల్లులను పే చేయడానికి ఇన్సూరెన్స్‌‌ కంపెనీలు నిరాకరిస్తున్నాయి.

కరోనా పేషెంట్ల ట్రీట్‌‌ మెంట్‌‌ లో వాడే పీపీఈ కిట్ల ఖర్చులపై హాస్పిటల్స్‌‌ కు, ఇన్సూరెన్స్‌‌ కంపెనీలకు మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. ‘ఒక పేషెంట్‌‌ కు రోజుకి రెండు పీపీఈ కిట్ల బిల్లును వేస్తాం. కొన్ని హాస్పిటల్స్‌‌ లలో ఇంత కంటే ఎక్కువ బిల్లులు వేస్తున్నారు. నర్సులు, రెసిడెంట్‌‌ మెడికల్‌‌ ఆఫీసర్లు, వార్డ్‌‌ బాయ్స్‌‌ అందరూ కూడా పీపీఈలను వాడాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్‌‌ కంపెనీలు ఈ ఖర్చులను భరించడం లేదు. ఈ కంపెనీలు ప్రాక్టికల్‌‌ గా ఆలోచించాలి. ఈ ఎక్విప్‌‌మెంట్‌‌ లేకుండా పేషెంట్లకు ట్రీట్‌‌ చేయలేం’ అని ముంబైకి చెందిన ఓ హాస్పిటల్‌‌ చెయిన్‌‌ చైర్మన్‌‌ అన్నారు. పీపీఈలు, మాస్కులు, గ్లౌవ్స్‌‌ల ఖర్చులను ఇన్సూరెన్స్‌‌ కంపెనీలు నిరాకరిస్తున్నాయని ప్రుడెంట్‌‌ ఇన్సూరెన్స్‌‌ బ్రోకర్స్‌‌  ఎంప్లాయి బెనిఫిట్స్‌‌ హెడ్‌‌ సురిందర్‌‌‌‌ భగత్‌‌ అన్నారు. సాధారణంగా హాస్పిటల్స్‌‌ రోజుకి 2–4 పీపీఈ కిట్ల బిల్స్‌‌ను వేస్తున్నాయని చెప్పారు. ఈ ఖర్చులను కొన్ని ఇన్సూరెన్స్‌‌ కంపెనీలు కొద్ది మొత్తంలో చెల్లిస్తుండగా, మరికొన్ని పూర్తిగా చెల్లించడం లేదని అన్నారు.

కరోనా డయగ్నోస్టిక్ టెస్ట్‌‌ లకు మాత్రమే ఇన్సూరెన్స్‌‌ కంపెనీలు డబ్బులు చెల్లిస్తున్నాయి. పాలసీ హోల్డర్‌‌‌‌ కు కరోనా పాజిటివ్‌‌ వస్తే హాస్పిటల్‌‌ బిల్లు ప్రకారం ఇన్సూరెన్స్‌‌ కంపెనీలు క్లయిమ్స్‌‌ సెటిల్‌‌ చేయాలి. కానీ కరోనా టెస్ట్‌‌ తర్వాత కన్ఫర్మేషన్‌‌ కోసం డయాలసిస్‌‌ లేదా సర్జికల్‌‌ ప్రొసిజర్‌‌‌‌ వంటివి చేయాల్సి వస్తే వాటికి డబ్బులు చెల్లించడానికి ఈ కంపెనీలు నిరాకరిస్తున్నాయి. ఇవి కరోనాకు సంబంధించినవి కాదని చెబుతున్నాయి. జూన్‌‌ 26 నాటికి ప్రుడెంట్‌‌ ఇన్సూరెన్స్‌‌ బ్రోకర్స్‌‌ సేకరించిన డేటా ప్రకారం సగటున కరోనా పేషెంట్ల క్లయిమ్‌‌ సైజ్‌‌ రూ. 1.79 లక్షలుగా ఉంది. కానీ చివరికి సెటిల్‌‌ మెంట్‌‌ మాత్రం రూ. 1.35 లక్షలకే జరుగుతోంది. కేవలం అర్బన్‌‌ ఏరియాలనే తీసుకుంటే ఈ క్లయిమ్‌‌ సైజ్‌‌ రూ. 2-–2.5 లక్షల వరకు ఉంటోంది. ఇంటెన్సివ్‌‌ కేర్‌‌‌‌ యూనిట్‌‌(ఐసీయూ) లు వాడడం, పేషెంట్‌‌కు ఇతర రోగాలుండడం వంటి పరిస్థితులలో ఈ క్లయిమ్‌‌ సైజ్‌‌ రూ. 6–-8 లక్షలుగా ఉంటోంది. కరోనా డయగ్నోస్టిక్‌‌ టెస్ట్‌‌కు సుమారు రూ. 2,250 లు బిల్లవుతోంది.

హాస్పిటల్‌‌ లో జాయిన్‌‌ అయినప్పుడు వేసే రిజిస్ట్రేషన్‌‌ లేదా అడ్మిషన్‌‌ ఛార్జీలను ఇన్సూరెన్స్‌‌ కంపెనీలు చెల్లించవు. లాండ్రీ ఛార్జీలు, టాయిలేటరీస్‌‌ (సబ్బులు, షాంపూ వంటివి), హియరింగ్‌‌, వాకింగ్‌‌ మెషిన్‌‌లకు అయ్యే ఖర్చులను చెల్లించవు.  సబ్‌‌ లిమిట్స్‌‌, కో–పే, నాన్‌‌ మెడికల్స్‌‌ వంటి క్లాజ్​ల వలన చెల్లించాల్సిన క్లయిమ్స్‌లలో ఈ కంపెనీలు డిడక్షన్‌‌ను పొందుతున్నాయి. దీంతో ఇవి సెటిల్‌‌ చేస్తున్న అమౌంట్‌‌ హాస్పిటల్‌‌ బిల్స్‌‌ కంటే తక్కువగా ఉంటున్నాయి. ఉదాహరణకు హాస్పిటల్‌‌ ఛార్జీలు ఎక్కువగా ఉన్నా, కంటి చికిత్స(కాటరాక్ట్‌‌ ) కు గరిష్టంగా రూ. 25 వేలునే ఇన్సూరెన్స్‌‌ కంపెనీలు చెల్లిస్తున్నాయి. బిల్స్‌‌ను సెటిల్‌‌ చేసేటప్పుడు పాలసీలోని కో–పే క్లాజ్‌‌ వలన పేషెంట్లు బిల్‌‌ అమౌంట్‌‌లో 10–30 శాతం వరకు కట్టాల్సి వస్తోంది.

మందుబాబులు ఈసారి ఆ ఛాన్స్ ఇవ్వరట..!

Liquor

తెలంగాణలో మళ్లీ లాక్‌ డౌన్‌ విధిస్తారన్న ప్రచారం గతంలో రెండు నెలల పాటు లాక్ డౌన్ విధించడంతో మద్యం దొరకని అనుభవాలు ఇవన్నీ మందుబాబులు ముందు జాగ్రత్త పడేటట్లు చేసాయి. దీంతో రికార్డు స్దాయిలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఐదు రోజుల్లోనే వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందంటే. మద్యం సేల్స్‌‌ ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

హైదరాబాద్‌ లో మళ్లీ లాక్‌ డౌన్ పుకార్లతో మద్యం అమ్మకాలు అమాంతం పెరిగాయి. దీంతో డిపోల నుంచి పెద్ద ఎత్తన మద్యం కొనుగోలు చేస్తున్నారు వైన్స్ షాపుల యజమానులు. లాక్ డౌన్ పై సీఎం ప్రకటన తర్వాత 2 రోజుల్లో 350 కోట్ల అమ్మకాలు జరగడమే ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం రోజుకు సరాసరిగా 100 కోట్ల అమ్మకాలు జరుగుతుండగా వారం రోజుల్లో 700 కోట్ల రూపాయల సేల్స్ జరిగినట్టు ఎక్సైజ్ శాఖ తెలిపింది.

గత అనుభవం దృష్ట్యా లాక్‌ డౌన్ ఉంటుందేమోనని ముందు జాగ్రత్తపడ్డ మద్యం ప్రియులు మద్యాన్ని భారీగా కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నారు. మార్చి 22 న తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ పెట్టింది. అప్పటి నుండి మే 6 వరకు తెలంగాణ లో మద్యం దుకాణాలు బంద్ అయ్యాయి. అకస్మాత్తుగా మద్యం దుకాణాలు బంద్ కావడంతో మందు బాబులు పడ్డ తిప్పలు అంతా ఇంతా కాదు. ఆ సమయంలో ఎంత పెట్టైనా మద్యం కొనడానికి సిద్ధం అయ్యారు. మళ్ళీ ఇప్పుడు లాక్ డౌన్‌ పై నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించటంతో మద్యం ప్రియులు స్టాక్ పెట్టుకుంటున్నారు.

జూన్ 29న 185 కోట్ల 45 లక్షల మద్యం అమ్ముడుపోగా జూన్ 30 న 164 కోట్ల సేల్జ్ జరిగింది. జూన్ నెలలో 2 వేల 389 కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే కేవలం ఈ వారం రోజుల్లోనే 700 కోట్ల విక్రయాలు జరిగాయి. గత ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు దాదాపు 5 వేల కోట్ల రాబడి వచ్చింది. జూన్‌ నెలాఖర్లో అమ్మకాలు గణనీయంగా పెరగ్గా ఈ నెల 1 నుంచి 4 వరకు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే అమ్మకాలున్నాయి. లాక్‌డౌన్‌ తర్వాత మే 6 నుంచి 31 వరకు సాగిన విక్రయాల్లో 18 వందల 64 కోట్ల సేల్‌ జరిగింది. సాధారణ రోజుల్లో బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మద్యం డిపోల నుంచి వైన్‌ షాపు ఓనర్లు రోజుకు 70 నుంచి 75 కోట్ల మద్యం లిఫ్ట్‌ చేస్తుంటారు. కానీ జూన్‌ 26 నుంచి 30వ తేదీ వరకు నాలుగు రోజుల్లో 150 కోట్లకు పైగా విక్రయాలు సాగాయి.

భాగ్యనగరం టు-లెట్!

Tolet

మార్చి 22న దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించడం జరిగింది. అప్పుడు ఆ ఒక్కరోజే దేశం వ్యాప్తంగా బంద్ ఉంటదని అందరూ అనుకున్నారు. రెండు రోజులు గడవకముందే.. 21 రోజుల లాక్ డౌన్ విధించారు. తర్వాత 19రోజుల లాక్ డౌన్ ఆ విధంగా కరోనా వ్యాప్తితో పాటు లాక్ డౌన్ రోజులు పెంచుకుంటూ వెళ్లారు. ప్రజలకు పరిస్థితులు మెల్ల మెల్లగా అర్ధమయ్యాయి. ఈ కరోనా ఇప్పట్లో తగ్గేది కాదని డిసైడ్ అయ్యారు. అంతే.. చిన్న చిన్నగా రాజధాని వదిలి పల్లె బాట పట్టారు. దీంతో హస్టళ్లు, కోచింగ్ సెంటర్లు, స్టడీ సెంటర్లు ఒక్కొక్కటిగా మూతపడసాగాయి. అమీర్ పేట్, గాంధీ నగర్, అశోక్ నగర్​ వంటి రద్దీ ప్రాంతాలలో లాక్​ డౌన్ మొదలైనప్పటి నుంచి అవన్నీ మూతపడే ఉన్నాయి. ఒక్క గాంధీ నగర్ లోనే  స్టడీ సెంటర్లుగా మారిన 300కి పైగా రెసిడెన్షియల్ ఫ్లాట్లు ఖాళీగా మారాయి. కోచింగ్ సెంటర్లను ఆధారంగా చేసుకుని నడిచే 318 హాస్టళ్లు క్లోజ్​ అయ్యాయి. ఎటుచూసినా తెరుచుకోని మెస్​లు, టూ లెట్ బోర్డుతో సింగిల్ బెడ్రూం ఇండ్లు కనిపిస్తున్నాయి.

వేగంగా విజృంభిస్తున్న కరోనాతో హైదరాబాద్​ ఖాళీ అవుతోంది. బస్తీలు, కాలనీలు, కమర్షియల్ ఏరియాలు అనే తేడా లేకుండా టు లెట్, లీజ్ బోర్డులు వేలాడుతున్నాయి. స్టూడెంట్స్, వర్కింగ్ మెన్, విమెన్​ హాస్టళ్లతో సందడిగా ఉండే ప్రాంతాలన్నీ బోసిపోయాయి. రంగు రంగుల లైట్లు, గాజు గోడలతో ఎట్రాక్ట్​చేసే కమర్షియల్ ఏరియాల్లో నెలలు గడుస్తున్నా… లీజులకు ముందుకొస్తలేరు. లాక్​ డౌన్ మొదలు బస్తీల్లో 30శాతానికి పైగా ఇళ్లు ఖాళీ అయ్యాయి. కాలనీల్లో ప్రతి 100 ఇండ్లలో పదుల సంఖ్యలో టు లెట్ బోర్డులు ఊగుతున్నాయి.

కోటికిపైగా జనాభా ఉన్న మహా నగరంలో 28లక్షల కుటుంబాలున్నాయి. అందులో 60శాతానికి పైగా విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం వచ్చినవారే. ఇంటి యజమానుల కంటే అద్దెకుండే వాళ్లే ఎక్కువ. చిరుద్యోగులు, బిజినెస్​ కోసం వచ్చిన వారిలో చాలామంది 3 నెలల నుంచి పనులు, గిరాకీ లేక సొంతూళ్లకు వెళ్లిపోయారు. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులతో ఉన్న ఫళంగా ఇండ్లు ఖాళీ చేసి వెళ్తున్న వారి సంఖ్య ఎక్కువవుతోంది. ఇప్పటిదాకా 6 నుంచి 7 లక్షల మంది వెళ్లిపోయినట్లు అంచనా. మరోవైపు ఐటీ, ఐటీ ఆధారిత రంగాల్లో పని చేసే ఉద్యోగులు 10 లక్షల మందికిపైగా ఉండగా, అన్ని కంపెనీల్లో వర్క్ ఫ్రం హోం అమలవుతోంది. అలా సిటీలో ఇండ్లు, రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా భాగ్యనగరం జనాలు లేక ఇంటి యజమానులు, కమర్సియల్ బిడ్డింగ్స్ టూలెట్ బోర్డులతో నిండిపోయాయి.

ఏపీలో వారి దాహం తీరనిది.!


ఏ రంగానికైనా కొరత ఉంటుందేమో కానీ మద్యానికి.. మందుబాబుల దాహానికి కొరత అనేదే ఉండదు. ఎంత సంపాదించినా అందులో కొంత మద్యానికి ఖర్చు చేసే వారు చాలా మంది ఉంటారు.ఇప్పుడు సమాజంలో మందు తాగని వారంటూ లేరు. ఆడవారు కూడా మద్యానికి బానిస అయిపోయారు. లాక్ డౌన్ లో మందు దొరక్క ఎన్ని ఇబ్బందులు పడ్డామో చూశాం. మద్యం షాపులు తెరిస్తే ఆడవారు కూడా క్యూలు కట్టిన వైనం అందరినీ విస్తుగొలిపింది.

పవన్ ప్రణాళిక మొత్తం చెడేలా ఉందే..!

అయితే ఏపీలో ఇప్పుడు మద్యమే ఆ సర్కార్ ను నడిపిస్తోంది. ఎందుకంటే తెలంగాణ కంటే డబుల్ రేట్లను ఏపీలో పెంచేశారు. మద్యపాన నిషేధంలో భాగంగా భారీగా రేట్లు పెంచేశారు. తాగేవారు ఎంత పెట్టైనా కొంటారు కాబట్టి జగన్ సర్కార్ గల్లాపెట్టే నిండుగా ఉంటుందట.. మద్యమే జగన్ సర్కార్ ను నడిపిస్తోందన్న టాక్ కూడా ఉంది. ఏపీలో భారీగా పెరిగిన మద్యం ధరలు.. పైగా రాత్రి 8 గంటల వరకే మద్యం షాపులు కట్టేయడంతో మందుబాబులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పైగా పేరున్న ప్రముఖ బ్రాండ్లు ఏపీలోని సర్కారు మద్యం షాపుల్లో దొరకడం లేదు. దీంతో కొందరు మద్యం ప్రియులు కొత్త దందా మొదలుపెట్టారు.

తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు సరిహద్దున గల వైన్స్ నుంచి భారీగా ఏపీ వాసులు మద్యం కొనుగోలు చేసి గుట్టు చప్పుడు కాకుండా ఏపీకి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రూ.25 నుంచి రూ.100 వరకూ తెలంగాణకు- ఏపీకి ధరల మధ్య తేడాలు ఉండడంతో ఇక్కడి నుంచి తరలిస్తూ లాభాల పంట పండిస్తున్నారట.. సరిహద్దు గ్రామాలకు పెద్ద ఎత్తున తెలంగాణ మద్యం సరఫరా అవుతోందట.. తెలంగాణ నుంచి ఏపీకి వస్తున్న నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్డీపీఎల్) కేసుల సంఖ్య పెరిగిపోయింది. ఇప్పటికే గుంటూరు జిల్లాలోనే ఏకంగా అక్రమమద్యం కేసులు 61 నమోదయ్యాయి. 80మందిని అరెస్ట్ చేశారు.

రాజమండ్రి సెంట్రల్ జైలుకి కొల్లు రవీంద్ర..

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎక్సైజ్ అధికారులు ఇటీవల దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఓ ప్రముఖ దినపత్రిక రిపోర్టర్ శంకర్ నాయక్ ఇంట్లో భారీగా మద్యం బయటపడింది. అతడి ఇంటిపై ఎక్సైజ్ అధికారులు చేసిన దాడిలో ఏకంగా 368 బాటిళ్ల కర్ణాటక మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీలో దొరికే మద్యం కంటే చీప్ గా కర్ణాటక మద్యం దొరుకుతుంది. దీంతో సరిహద్దుల్లోంచి కర్ణాటక వెళ్లిన రిపోర్టర్ తనను ఎవరూ పోలీసులు ఆపరన్న ధైర్యంతో కర్ణాటక మద్యాన్ని భారీగా తెచ్చి కళ్యాణదుర్గంలో నిల్వచేసి అమ్ముతున్నట్టు గుర్తించారు.

ఏపీలో మద్యం ధరలు పెరగడం పేద, మధ్యతరగతి వారికి భారంగా మారింది. ఎంత ధరకైనా కొనడానికి వెనుకాడకపోవడంతో రోజు వారిగా పనిచేసిన కూలీలు సంపాదనను మద్యానికే తగలేస్తున్నారు.

ఏపీతో పోలిస్తే చీప్ గా దొరికే తెలంగాణ, కర్ణాటక మద్యంను ఇప్పుడు విచ్చలవిడిగా కొనుగోలు చేసి ఏపీలోని ధరలకే అమ్ముకుంటున్నారు. తద్వారా వ్యాపారులు, బెల్ట్ షాపుల వారు లాభాలు గడిస్తున్నారు. గుంటూరు జిల్లాలోని పల్నాడు వాసులు ఎక్కువగా మద్యాన్ని తెలంగాణ నుంచి పల్నాడుకు తరలిస్తున్నారు. అటు ఖమ్మం నుంచి మహబూబ్ నగర్ వరకూ తెలంగాణ సరిహద్దు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున అక్రమ మార్గాల్లో ఏపికి మద్యం తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. తద్వారా ఏపీ ఖాజానకు గండిపడుతుండగా.. తెలంగాణ, కర్ణాటక ఎక్సైజ్ శాఖ పంట పండుతోంది.

ఎన్టీఆర్ కూడా వైసీపీ శిబిరంలో చేరిపోయారా?


ఏపీలోని సత్తెనపల్లిలో వెలిసిన ఓ ఫ్లెక్సీ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామరావు ఫొటో వైసీపీ ఫ్లెక్సీలో ప్రత్యక్షమైంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సీఎం జగన్మోరెడ్డి ఫొటోలతోపాటు స్వర్గీయ ఎన్టీఆర్ ఫొటోలు పక్కనే ఉండటం ఆసక్తిని రేపుతోంది. ఈ ఫ్లెక్సీ చూపురులను ఆకట్టుకుంటోంది. అయితే ఈ ఫ్లెక్సీ వెనుక ఏదైనా రాజకీయం ఎత్తుగడ ఉందా అనే చర్చ నడుస్తోంది.

రాజమండ్రి సెంట్రల్ జైలుకి కొల్లు రవీంద్ర..

సినిమాల్లో అగ్రనటుడిగా ఉన్న ఎన్టీఆర్ నాటి కుల్లు రాజకీయాలకు వ్యతిరేకిస్తూ టీడీపీని స్థాపించారు. తొమ్మిది నెలల్లోనే బ్రహ్మండమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చి తెలుగువాడి సత్తాచాటారు. అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజారంజాక పాలన సాగించారు. అయితే ఆయనను ఆ పార్టీలోని కొందరు నేతలే మోసంచేసి పార్టీని హైజాక్ చేసినా కుంగిపోకుండా జనంలోకి వెళ్లి తేల్చుకున్నారు. ప్రస్తుతం ఏపీలోనూ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారు. బలంలేకపోయినా జగన్ సర్కార్ ను పడగొడుతామంటూ పదేపదే బీరాలు పలుకుతున్నారు. అయితే ఏదైనా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.

సీఎంగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉంటున్నారు. పార్టీలోని జనాల కంటే ప్రజలే ఎక్కువ అనే సందేశాన్ని ఇస్తున్నారు. ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకెళుతున్నారు. దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి వారసుడిగా ప్రజా సంక్షేమానికి పెద్దపీఠ వేస్తున్నారు. ఇటీవల సీఎం జగన్ ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. తనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రజల్లో ఉంటూనే తిప్పికొడుతున్నారు.

జివికె రెడ్డి వ్యాపారాలపై సిబిఐ దాడుల వెనక అసలు ఉద్దేశం ?

తెలుగు నేలపై దూకుడు రాజకీయాలకు ఆజ్యంపోసిన ఎన్టీఆర్ ను వైసీపీ నేతలు ఓన్ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ తో సీఎం జగన్మోహన్ రెడ్డిని పోలుస్తున్నారు. తెలుగు ప్రజల్లో గుండెల్లో చెరగని ముద్రవేసిన ఎన్టీఆర్, వైఎస్ఆర్ ను ఆపార్టీ నేతలు జగన్మోహన్ రెడ్డితో పోలుస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.

ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమాలు చూసి ఆ పార్టీలో చేరుతున్న సంగతి తెల్సిందే. అయితే ఒక్కసారిగా ఈ ఫ్లెక్సీలు చూసిన టీడీపీ నేతలు ఎన్టీఆర్ కూడా వైసీపీ శిబిరంలో చేరారా? అంటూ అవాక్కవుతున్నారు. కాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం జగన్ కు మద్దతు పలుకుతుండటం గమనార్హం.

అలర్ట్.. టిక్ టాక్ పేరుతో లింకులు.. ఓపెన్ చేస్తే అంతే..!


ఇంటర్నెట్ ఆవిర్భావంతో సాంకేతిక రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతుంది. దీంతోపాటు క్రైమ్ చేసే విధానం కూడా మారుతోంది. స్మార్ట్ ఫోన్ల ధరలు అందరికీ అందుబాటులోకి వచ్చాక ప్రతీఒక్కరు ఇంటర్నెట్ వాడటం ప్రారంభించారు. అరచేతిలో ప్రపంచం ఇమిడిపోవడంతో స్మార్ట్ ఫోన్లతోనే ప్రతీఒక్కరు ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. ఈ బలహీనతే కొందరిపాలిట శాపంగా మారుతోంది. అప్రమత్తంగా లేకపోవడంతో ఆర్థికంగా, వ్యక్తిగతంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

మరో వివాదం: మసీదులా కొత్త సచివాలయం?

సరిహద్దుల్లో చైనా-భారత్ ఘర్షణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 59 చైనా యాప్స్ ను నిషేధించిన సంగతి తెల్సిందే. పౌరుల వ్యక్తిగత సమాచారం భద్రత దృష్ట్యా కేంద్రం చైనా యాప్స్ నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భారత్ లో అత్యంత ప్రజాధరణ పొందిన టిక్ టాక్ యాప్ కూడా ఉంది. దీనిని కొందరు సైబర్ నేరగాళ్లు ఆసరా చేసుకొని ఫోన్లను హ్యాక్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

రాజమండ్రి సెంట్రల్ జైలుకి కొల్లు రవీంద్ర..

‘టిక్‌టాక్‌ బ్యాక్ ఎగైన్’ పేరిట మేసేజ్ లను వాట్సాప్ లో పలువురు షేర్ చేస్తున్నారు. ఈ లింకులను ఓపెన్ చేస్తే మీరు తిరిగి వీడియోలు చూడవచ్చనే సందేశం ఉంటుంది. దీనిని ఓపెన్ చూస్తే మొబైల్లోని విలువైన సమాచారం చోరికి గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి మేసేజ్ ల పట్ల అప్రమతంగా ఉండాలని.. వీటిని ఇతరులకు షేర్ చేయద్దని సూచిస్తున్నారు. యాప్స్ డౌన్ చేసుకోవాలనుకుంటే గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుంచి చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వాట్సప్ లో లేదా సోషల్ మీడియాలో వచ్చే లింకులను మాత్రం ఓపెన్ చేయద్దని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.

ఇక నుండి రాజధాని ఎర్రవల్లి?

Cm kcr

కరోనా దెబ్బతో రాజధానిగా హైదరాబాద్ మహానగరం అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే.. దింతో సీఎం కేసీఆర్… తను ఉన్న చోటి నుంచే పాలన సాగిస్తున్నారు. ఎర్ర‌వ‌ల్లి ఫామ్‌ హౌస్‌ లో ప్రత్యేక సెటప్ ఏర్పాటు చేశారు. పూర్తిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడేలా ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో ఏ అధికారితోనైనా మాట్లాడేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. అంతేకాదు… ఫామ్‌హౌస్‌లో చుట్టూ ప్రకృతి పచ్చదనం మధ్య… టెక్నాలజీతో సరికొత్త పాలనకు తెరతీశారు. ఫామ్‌ హౌస్ లోపల భారీ టీవీ ఏర్పాటు చేశారు. దానికి ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టి… ఒకేసారి ఎక్కువ మంది అధికారులతో మాట్లాడేలా చేశారు. వారం నుంచి ఈ ఏర్పాట్లు సాగాయి. సోమవారం అవి పూర్తయ్యాయి.

సోమవారం ట్రయల్ నిర్వహించిన కేసీఆర్… సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. కొంత మంది కలెక్టర్లతో ఆయన మాట్లాడారు. నెలాఖరువరకూ… ఎర్రవల్లి నుంచి పరిపాలన సాగిస్తానని ఆయన చెప్పినట్లు తెలిసింది. ఇక ఏదైనా ఫామ్‌హౌస్ నుంచే.కేసీఆర్ ఫామ్‌హౌస్‌కి వెళ్లడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ తప్పుపడుతోంది. రాష్ట్రంలో కరోనా ఇంత తీవ్రంగా ఉంటే… సీఎం ఎర్రవల్లికి వెళ్లడమేంటని విమర్శిస్తున్నారు. సీఎం కేసీఆర్ మాత్రం… ఎక్కడ ఉంటే ఏముంది… పాలన నడుస్తోందా లేదా అన్నదే ముఖ్యం అనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపై వారంలో ఐదురోజులు ఫామ్‌హౌస్‌లో, రెండు రోజులు… ప్రగతి భవన్‌ నుంచి పాలన సాగిస్తారని తెలిసింది.

గత కొన్ని రోజులుగా ఫామ్‌ హౌస్‌ లో ఉంటున్న కేసీఆర్‌ కి.. అధికారులు రోజూ ఉదయాన్నే తెలంగాణలో ఏం జరుగుతోందో సింపుల్‌ గా పాయింట్ల రూపంలో చెబుతున్నారు. అలాగే… ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా… కొన్ని విషయాలు చెబుతున్నారు. తద్వారా రోజూ ఏం జరుగుతుందో కేసీఆర్‌ కి తెలుస్తోంది. ప్రస్తుతానికి మంత్రులు, పార్టీ నేతలెవరూ ఫామ్‌ హౌస్‌ కి రావొదదని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది.

‘అదిరిందమ్మ రోజా’ అంటున్న నగరివాసులు


నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా ఏ పనినైనా సరికొత్తగా చేస్తుంటారు. అటూ సినిమాల్లో బీజీగా ఉంటూనే రాజకీయంగానూ రోజా సత్తా చాటుతుంటారు. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూనే టెలివిజన్ పై ‘జబర్దస్’ షోలతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఎమ్మెల్యేగా నిత్యం ప్రజల్లో ఉంటూ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటోంది. సినిమాల్లో, రాజకీయంగానూ రెండు రంగాల్లో రాణించే మహిళల్లో రోజా పేరే ముందంజలో ఉంటుంది.

మరో వివాదం: మసీదులా కొత్త సచివాలయం?

చిత్రసీమలో ఒకప్పుడు రోజా అగ్రహీరోయిన్ గా కొనసాగింది. తన అందం, అభినయంతో అందరినీ అలరించి లక్షల్లో అభిమానులను సంపాదించుకుంది. సినిమా పాపులారిటీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. గతంలో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయిన వెనుకంజ వేయకుండా వైసీపీ తరుపున రెండుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. మహిళలు రాజకీయాల్లో వెనుకంజ వేయకుండా ప్రజా సమస్యలతో పోరాడితే గెలుపు సాధ్యమనే సందేశాన్ని రోజా ఇచ్చారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక రోజాకు మంత్రి పదవి దక్కుతుందని అందరూ భావించారు. అయితే సామాజిక సమీకరణాల్లో భాగంగా ఆమెకు పదవీ దక్కలేదని తెలుస్తోంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఆమెకు క్యాబినెట్ ర్యాంక్ కలిగిన ఏఐఐసీ పదవీకి కట్టబెట్టారు. త్వరలో జరుగబోయే క్యాబినెట్ విస్తరణలో ఆమెకు అవకాశం దక్కుతుందని మరోసారి ప్రచారం జరుగుతోంది. ఏది ఎలా ఉన్నా ఆమె మాత్రం నిత్యం ప్రజల్లో అభివృద్ధి పనులతో దూసుకెళుతున్నారు.

రాజమండ్రి సెంట్రల్ జైలుకి కొల్లు రవీంద్ర..

ఎమ్మెల్యే రోజా తాజాగా న‌గ‌రి పుత్తూరు పున్నమి సర్కిల్‌లో వైఎస్సార్ విగ్ర‌హం వ‌ద్ద 108, 104 అంబులెన్సు వాహ‌నాల‌ను ప్రారంభించారు. స్వయంగా అంబులెన్స్ వాహనాన్ని నడిపి వార్తల్లో నిలిచారు. ఆమె అంబులెన్స్ వాహనం నడపడం పార్టీ కార్యకర్తలో సరికొత్త జోష్ నింపింది. టీడీపీ హయాంలో అంబులెన్స్ వ్యవస్థను భ్రస్టుపట్టించారని ఆమె గుర్తు చేశారు. జగన్ సీఎం అయ్యాక మళ్లీ 104, 108 వ్యవస్థకు ప్రాణంపోశారని తెలిపారు. గతంలోని అంబులెన్స్ లోని సౌకర్యాల కంటే కొత్తగా వచ్చిన అంబులెన్స్ వాహనాల్లో చాలా సదుపాయాలు ఉండటంపై సంతోషం వ్యక్తం చేశారు. ఆమె తీరును చూసిన స్థానికులంతా ‘అదిరిందమ్మ రోజా’ అంటూ కితాబిస్తున్నారు.

కూల్చివేస్తున్న సచివాలయం.. ఘన చరిత్ర ఎందరికి తెలుసు?


ప్రస్తుతం ఉన్న తెలంగాణ సచివాలయాన్ని కూల్చివేసి సరికొత్త హంగులతో కొత్త సచివాలయాన్ని నిర్మించేందుకు టీఆర్ఎస్ సర్కార్ సంకల్పించింది. ఇందుకోసం సచివాలయ కూల్చివేత పనులకు నేటి నుంచి శ్రీకారం చుట్టింది. మంగళవారం తెల్లవారుజాము నుంచే సచివాలయ కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. సచివాలయం వెళ్లే రహదారులను పోలీసులు మళ్లీస్తున్నారు. అధికారుల పర్యవేక్షణలో సచివాలయ కూల్చివేత పనులు వేగంగా సాగుతోన్నాయి. త్వరలోనే కొత్త సచివాలయ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.

మరో వివాదం: మసీదులా కొత్త సచివాలయం?

ఇదిలా ఉంటే ప్రస్తుతం కూల్చివేస్తున్న తెలంగాణ సచివాలయాన్ని ఘనమైన చరిత్ర ఉంది. నిజాం కాలం చరిత్రకు నేటి వరకు సజీవ సాక్ష్యంగా ఈ కట్టడం నిలిచింది. తెలంగాణ సచివాలయ భవనానికి 132ఏళ్ల ఘన చరిత్ర ఉంది. నిజాం నవాబుల పాలనలో ఈ కట్టడం సైఫాబాద్ ప్యాలెస్ పేరుతో ప్రసిద్ధి గాంచింది. ఎంతోమంది ముఖ్యమంత్రులు ఈ భవనాన్ని పాలన కేంద్రంగా చేసుకొని పరిపాలన సాగించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ముఖ్యమంత్రులు ఇక్కడి నుంచే పాలన సాగించారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటయ్యాక కూడా ఇప్పుడున్న సచివాలయమే పాలనా కేంద్రంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంతో కలిపి మొత్తం 16మంది సీఎంలు ఇక్కడి నుంచి పాలన సాగించారు. 132ఏళ్లలో ఈ భవనంలో మొత్తం 10 బ్లాకుల నిర్మాణం జరిగింది. 25ఎకరాల విస్తీర్ణంలో పది లక్షల చదరపు అడుగుల్లో ఈ సచివాలయం నిర్మించబడింది. ఇందులో అతిపురాతనమైన జి బ్లాక్. 1888 సంవత్సరంలో నాటి 6వ నిజాం ఈ బ్లాక్ నిర్మించారు. 2003లో డి బ్లాక్, 2012లో నార్త్, సౌత్ బ్లాక్స్ ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఈ సచివాలయం ఇక గత చరిత్రగా మిగలబోతుంది.

పవన్ ప్రణాళిక మొత్తం చెడేలా ఉందే..!

ప్రస్తుతం ఉన్న సచివాలయంలో భద్రతా ప్రమాణాలు లేవని కేసీఆర్ సర్కార్ భావించింది. దీంతో అన్ని హంగులతో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం పూనుకుంది. ఇందుకోసం సీఎం కేసీఆర్ కొత్త సచివాలయ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేయించారు. పాత సచివాలయాన్ని కూల్చి కొత్త సచివాలయం నిర్మించాలని భావించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘంగా వాదనలు విన్న హైకోర్టు పాలనపరమైన విషయంలో జోక్యం చేసుకోవద్దని భావించడంతో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో ప్రభుత్వం ప్రస్తుత సచివాలయాన్ని కూల్చివేత పనులను షూరు చేసింది.

తెలంగాణలో ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నందున ఈ కట్టడాన్ని కోవిడ్ ఆస్పత్రిగా మార్చి ప్రజలకు సేవలందించాలని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. అయితే ఈ డిమాండ్లను ప్రభుత్వం మాత్రం పెద్దగా పట్టించుకోకుండా సచివాలయం కూల్చివేతకే మొగ్గుచూపింది. నేటి ఉదయం నుంచే పనులు మొదలు కావడంతో నిజాం కాలంలో నిర్మించిన ఈ సచివాలయం ఘన చరిత్ర కాస్తా గతచరిత్రగా మారనుంది.

కొత్త సచివాలయం నమూనా మసీదులా….! :బిజెపి ఎమ్మెల్యే


సీఎం కేసీఆర్ తాజాగా ఆర్భాటంగా కొత్త సచివాలయం నమూనాను రిలీజ్ చేశారు. ఇప్పటికే హైకోర్టు తీర్పుతో పాత సచివాలయాన్ని కూల్చే పనిలో తెలంగాణ సర్కార్ బిజీగా ఉంది. దాని ప్లేసులో కట్టబోయే కొత్త సచివాలయం నమూనాను తెలంగాణ సీఎంవో ఈరోజు విడుదల చేసింది. అయితే ఇప్పుడు అది కొత్త వివాదానికి దారితీస్తోంది.

చిచ్చుపెట్టిన కరోనా.. కేసీఆర్ తో గవర్నర్ ఫైట్?

అసలే కరోనా టైం. ఇంతటి కరువు కాటకాల్లో కేసీఆర్ వాస్తు బాగోలేదని కొత్త సచివాలయం కట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా ప్రస్తుతం ఉన్న సచివాలయం భవనాలు మరో 50 ఏళ్ల పాటు మన్నికగా ఉంటాయని నిపుణులు చెప్పారు. కానీ వాస్తును బాగానే నమ్ముకున్న కేసీఆర్ ఈ పాత సచివాలయం కూల్చివేతకే మొగ్గు చూపారు. 500 కోట్లతో కొత్త సచివాలయం నిర్మాణానికి పూనుకున్నారు.

కాంగ్రెస్ సహా కొందరు ప్రతిపక్షాలు సచివాలయం కూల్చివేతపై హైకోర్టుకు ఎక్కి అడ్డుకున్నా చివరకు కేసీఆర్ సర్కారుకే కోర్టులో ఊరట లభించింది. తెలంగాణ ఖ్యాతి ఇనుమడించేలా కొత్త సచివాలయం నిర్మించడానికి కేసీఆర్ రెడీ అయ్యారు.

పవన్ ప్రణాళిక మొత్తం చెడేలా ఉందే..!

అయితే తాజాగా విడుదల చేసిన సచివాలయం నమూనా తెలంగాణ సంస్కృతి కంటే ముస్లింల సంస్కృతికి దగ్గరగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటికి బలాన్ని ఇచ్చేలా తాజాగా తెలంగాణలోని ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు. కొత్త సచివాలయం నమూనా మసీదులా .. హజ్ హౌస్ లా ఉందని హాట్ కామెంట్స్ చేశారు. నిజాం రాజు చార్మినార్ నిర్మిస్తే.. కేసీఆర్ సచివాలయాన్ని నిర్మించి పేరు తెచ్చుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. కొత్త సచివాలయ నిర్మాణానికి ప్లాన్ ఎంఐఎం ఇచ్చారా అని ఎద్దేవా చేశారు.

నిజానికి కేసీఆర్ ఆమోదం తెలిపిన కొత్త సచివాలయం నమూనాపై మసీదుపై ఉండే గుండ్రటి గోపురాలు ఉండడంతో అందరికీ అలానే అనిపిస్తోంది. హిందూ, తెలంగాణ సంప్రదాయాలు కనిపించడం లేదంటున్నారు. పోనీ ఇది అత్యాధునిక మోడల్ కూడా కాదు.. దీంతో రాజాసింగ్ వ్యాఖ్యలకు బలాన్నిచ్చేలా ఉన్న కొత్త సచివాలయం నమూనాపై సోషల్ మీడియాలో బీజేపీ నేతలు, హిందుత్వవాదులు, నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.

రాజమండ్రి సెంట్రల్ జైలుకి కొల్లు రవీంద్ర..


మోకా భాస్కర రావు హత్య కేసుతో సంబంధం ఉందంటూ అరెస్టైన మాజీ మంత్రి కొల్లు రవీంద్రను రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. రవీంద్రతో పాటు ఈ హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్న చింతా నాంచారయ్య మరియు మరో నలుగురిని మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు నేడు జైలుకి తరలించారు. ఈ హత్య కేసులో ఓ మైనర్ బాలుడు కూడా ఉన్నారు. జులై 29న వైసీపీ నేత మరియు మంత్రి పేర్ని నాని అనుచరుడైన మోకా భాస్కర రావుని మచిలీపట్నం ఫిష్ మార్కెట్ లో అతి కిరాతకంగా నరికి చంపడం జరిగింది. మొదట ఇది పాత కక్షలు, ఆస్థి వివాదాల కారణంగా జరిగిన హత్యగా భావించగా, విచారణలో రాజకీయ హత్య అని తేలింది. అలాగే కొల్లు రవీంద్రకు ఈ హత్యతో ప్రమేయం ఉందని బయటపడింది.

వైసీపీ నేతల జేబులు నింపుతున్న మద్యం విధానం

మోకా భాస్కర్ రావు హత్యకు పథకం మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంటిలోనే జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఫోన్ సంభాషణల ఆధారంగా కీలక ఆధారాలతో రవీంద్రను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో సంచలనం రేపిన ఈ హత్య అధికార విపక్షాల మధ్య అగ్గి రాజేసింది. మోకా భాస్కర్ రావు ఒక రౌడీ షీటర్ అని, గతంలో చింతా నాంచారయ్య అన్నయ్య మర్డర్ తో ఆయనకు సంబంధం ఉంది అన్నారు. ఇది పాత కక్షల కారణంగా జరిగిన హత్య కాగా కొల్లు రవీంద్రను కుట్ర పూరితంగా ఇరికించారని అంటున్నారు. ఇక హత్య చేసిన రోజే నిందితులు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారని, రవీంద్రను ఇరికించడానికి వైసీపీ ప్రభుత్వం పోలీసులతో తప్పుడు సమాచారం ఇప్పిస్తున్నారు అన్నారు.

పవన్ ప్రణాళిక మొత్తం చెడేలా ఉందే..!

మరో వైపు హత్య కేసులో అడ్డంగా దొరికిన కొల్లు రవీంద్రను బీసీ కార్డు తో కాపాడాలని టీడీపీ ప్రయత్నిస్తుందని వైసీపీ ఆరోపిస్తుంది. పూర్తి ఆధారాలతో పట్టుబడిన కొల్లు రవీంద్ర తప్పించుకోలేదని వారు గట్టిగా చెవుతున్నారు. ఇక కేసు విషయంలో బలమైన ఆధారాలు లభించినట్లు తెలుస్తుండగా…కొల్లు రవీంద్రకు శిక్ష పడడం ఖాయం అంటున్నారు. కాగా కొల్లు రవీంద్ర లాయర్లు ఆయనను బెయిల్ పై బయటకు త్వరగా తేవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక టీడీపీ మాజీ మంత్రి అయిన కొల్లు రవీంద్రను సెంట్రల్ జైల్లో బాబు. లోకేష్ కలిసి పరామర్శించనున్నారట.

కరోనా తెచ్చిన బద్ధకం!

Corona cases

కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో వివిధ దేశాల లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో వివిధ దేశాలలో రాజకీయ నాయకులు, సెలెబ్రిటీలు ప్రజలను ఇళ్లలోనే ఉండమని తమ ప్రసంగాలు, ప్రకటనల ద్వారా విజ్ఞప్తి చేశారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందాయి. కొంత మంది ఇంట్లో హాయిగా కుర్చీలో కూర్చుని టీవీలో ఇష్టమైన కార్యక్రమం చూస్తూ ఉండటానికి ఇబ్బంది ఏమిటని కూడా ప్రశ్నించారు.

మనకు చేయడానికి అంతగా ఆసక్తి లేని కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించమని, వ్యాయామం చేయమని , ఆరోగ్యకరమైన ఆహరం తీసుకోమని చెబుతున్న ఆరోగ్య సలహాలు, సూచనలు వింటూనే ఉన్నాం. ఇవన్నీ మనలో బద్ధకాన్ని తట్టి లేపే ఆలోచనలకు ఊతమిస్తాయి. కానీ, వీటిని పాటించడం అంత సులభమేమీ కాదు. లాక్ డౌన్ లో కొన్ని రోజులు గడిచేటప్పటికే ఇవన్నీ చేయడం కష్టమని తేలిపోతుంది.

నిజానికి మానవ శరీరం పని చేయడం వల్ల, పనికి, విశ్రాంతికి మధ్య ఒక సమతుల్యత పాటించడం వల్లనే ఎక్కువ ఉత్తేజితంగా ఉంటుంది. మనం ఎప్పుడూ సులభంగా పూర్తయిపోయే పనుల వైపు మొగ్గు చూపడం సహజం. రిమోట్ కంట్రోల్ చేతిలో ఉన్నప్పుడు లేచి వెళ్లి టీవీ లో చానళ్ళు మార్చాలని అనుకోము. కారు ఉండగా సైకిల్ మీద ఎందుకు సూపర్ మార్కెట్ కి వెళతాం? మీ సహోద్యోగి కన్నా సగం పని చేయగలిగే వెసులుబాటు మీకున్నప్పుడు అంత కన్నా ఏమి కావాలి? ఏ పనిలోనైనా మానసిక, శారీరక శక్తి ఖర్చవుతుంది. ఎక్కడ వీలయితే అక్కడ అధికంగా శ్రమ పడటాన్ని తప్పించుకుంటూ ఉంటాం.

ఏ పనీ చేయకుండా, సీలింగ్ వైపు చూస్తూ, నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తూ గడపాలని మీరెప్పుడైనా కలలు కన్నారా? ఇది వినడానికి అందంగా ఉంటుంది కానీ, అలా ఉండటం వలన ఎటువంటి ఆనందం ఉండదు. వర్జీనియా యూనివర్సిటీ నిర్వహించిన ఒక అధ్యయనంలో కొంత మంది వ్యక్తులను ఫోన్, పుస్తకాలు, టీవీ లేని ఒక గదిలోకి పంపించి వారిపై అధ్యయనం చేశారు..ఆ సమయంలో వారు ఏ పనీ చేయకుండా విశ్రాంతి తీసుకోవాలి. వారికి ఎలక్ట్రిక్ షాక్ తీసుకునేందుకు ఒక పరికరాన్ని అమర్చారు.

వారికి, ఒక వేళ ఎలక్ట్రిక్ షాక్ తగలాలంటే ఏ స్విచ్ నొక్కాలో వివరించారు. ఒక్కసారి ప్రయత్నించాక రెండవ సారి ప్రయత్నించలని మీరనుకుంటే పొరపాటే. అలా ఒంటరిగా ఉన్నప్పుడు 71 శాతం మంది పురుషులు, 25 శాతం మంది మహిళలు కనీసం ఒక్క సారన్నా ఎలక్ట్రిక్ షాక్ పెట్టుకున్నారు. ఒక వ్యక్తి అయితే కనీసం 190 సార్లు తనని తాను షాక్ కి గురి చేసుకున్నారు. చాలా మంది వేరే ఆలోచనలు రాకుండా తమని తాము హింసించుకున్నారు. కొన్ని సార్లు మనం పరిస్థితులను తేలికగా తీసుకుంటాం. కానీ, మనం ఎక్కువ శ్రమించాల్సి వచ్చినప్పుడు ఆ పరిస్థితులకు ఎక్కువ విలువిస్తాం. కరోనా పుణ్యమా అని అనేక మంది శ్రమపడటంలో నిమగ్నమయ్యారు.

బాబ్ హెయిర్ కట్ తో గజరాజు.. సోషల్ మీడియాలో వైరల్


గజరాజు(ఏనుగు).. పేరు తగ్గట్టుగానే ఎంతో ఠీవీగా దర్శనిమిస్తాయి. వినాయకుడి ప్రతిరూపంగా భారతీయులు గజరాజును కొలుస్తుంటారు. ఏనుగును చూడగానే తొలుత అందరికీ గుర్తుకొచ్చేది భారీ రూపం.. పెద్ద తొండం.. పెద్ద చెవులు.. చిన్న కళ్లు మాత్రమే.. అయితే ఇప్పుడు చెప్పబోయే గజరాజు మాత్రం చాలా స్పెషల్. ఈ ఏనుగుకు సింహంలా జులూ ఉండటం అందరినీ ఆకట్టుకుంటోంది. సూపర్ బాబ్ హెయిర్ కట్ తో దర్శనమిస్తున్న గజరాజు ఫొటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

చంద్రబాబుకి పచ్చకామెర్లు.. పవన్ కి కాదు!

ఏనుగులకు సాధారణంగా తలపై భాగం(కుంభస్థలం)లో జుట్టు ఉంటుంది. అయితే కొన్ని కారణాలతో ఆ జుట్టు రాలిపోతూ ఉంటుంది. కొన్ని ఏనుగుల మాత్రం ఆ జుట్టు అలాగే ఉంటుంది. అలా ఒక ఏనుగు తలపై భారీగా పెరిగిన జుట్టును చాలా స్టయిలీష్ గా హెయిర్ కట్ చేయించారు. బాబ్ హెయిర్ కట్ తో ముందుకు నీటుగా దువ్వారు. దీనికి బాబ్ హెయిర్ కట్ సెంగమలం పేరు పెట్టారు. ఏనుగు బాబ్ హెయిర్ కట్ తో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టారు. గజరాజు తలపై జూలుతో మరింత అందంగా కన్పిస్తున్నాడు.

ఈ ఫొటోలను చూసిన జంతు ప్రేమికులు, ఫారెస్టులు అధికారులు ఖుషీ అవుతున్నారు. బాబ్ హెయిర్ కట్ సెంగమలం ఏనుగు పేరుతో సోషల్ మీడియాలో ఒకరికి ఒకరు షేర్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ గజరాజుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

https://twitter.com/SudhaRamenIFS/status/1279696616706859008

పవన్ ప్రణాళిక మొత్తం చెడేలా ఉందే..!


కరోనా వైరస్ కారణంగా పవన్ కళ్యాణ్ కి పెద్ద చిక్కొచ్చి పడింది. ఆయన ప్రణాళిక మొత్తం తారుమారైంది. రాజకీయాలలో సీరియస్ గా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఆర్థిక అవసరాల కోసం తప్పలేదని ఆయన సంజాయిషీ ఇచ్చుకున్నారు. ప్రత్యర్ధులు దీన్ని ఆసరాగా చేసుకొని కొన్నాళ్లు విమర్శలు చేశారు. ముఖ్యంగా వైసీపీ నేతలు పవన్ సినిమా జోలికి వెళ్లనని చెప్పి మాట తప్పారని అన్నారు. ప్రజా సేవకే జీవితం అంకితమన్న… పవన్ ముఖానికి రంగేసుకుని..పార్ట్ టైమ్ పొలిటీషియన్ అని నిరూపించుకున్నాడని ఎద్దేవా చేశారు. పవన్ నిర్ణయం వలన సొంత పార్టీ నేతలలోనే వ్యతిరేకత చెలరేగింది. పవన్ సినిమాలు ఒప్పుకోవడాన్ని సాకుగా చూపి మాజీ డీజీపీ లక్ష్మీ నారాయణ పార్టీ నుండి బయటికి వెళ్లిపోయారు.

చిచ్చుపెట్టిన కరోనా.. కేసీఆర్ తో గవర్నర్ ఫైట్?

ఎవరెళ్ళిపోయినా పార్టీని నడపగల సత్తా మాకుందని తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు పవన్. సినిమాల ద్వారా భారీ ఎత్తున నిధుల సేకరణకు పూనుకున్న పవన్ కళ్యాణ్, ఇప్పటికే మూడు సినిమాలు ఒప్పుకున్నారు. అధికారికంగా ప్రకటించిన ఈ మూడు చిత్రాలతో పాటు మరో రెండు చిత్రాలు పూర్తి చేయాలన్నది పవన్ ఆలోచన. ఐతే కరోనా వైరస్ వలన ఏర్పడిన పరిస్థితులు పవన్ ప్రణాళికలను తారుమారు చేశాయి. 2024 ఎన్నికలలోపు మరో రెండు చిత్రాలు చేయడం అటుంచితే…ఒప్పుకున్న మూడు చిత్రాలు పూర్తి చేయడమే కష్టమనే మాట వినిపిస్తుంది. వకీల్ సాబ్ మూవీ షూటింగ్ చివరి దశకు వచ్చినప్పటికీ మరో 20రోజుల షూటింగ్ మిగిలివుంది.

చంద్రబాబుకి పచ్చకామెర్లు.. పవన్ కి కాదు!

దర్శకుడు క్రిష్ తో చేస్తున్న భారీ పీరియాడిక్ మూవీ షూటింగ్ పూర్తి కావడానికి కనీసం ఏడాది సమయం కావాలి. ఇక దర్శకుడు హరీష్ శంకర్ మూవీ పూర్తి కావడానికి మరో ఏడాది సమయం పడుతుంది. కరోనా వైరస్ అదుపులోకి వచ్చి సవ్యంగా షూటింగ్ జరిగిన తరుణంలో, 2022 కి పవన్ కమిటైన మూడు చిత్రాలు పూర్తి చేయగలడు. సాధారణ పరిస్థితులు ఏర్పడడానికి మరింత సమయం పట్టే నేపథ్యంలో పవన్ కి ఆ చిత్రాలు పూర్తి చేయడానికి 2023వరకు సమయం పడుతుంది. ఈ విషయమే పవన్ లో గుబులు రేపుతుంది.

పవన్ పార్టీ పెట్టి ఆరేళ్ళు అవుతున్నా సంస్థాగతంగా, క్షేత్ర స్థాయిలో బలపడలేదు. జనసేన బలమైన రాజకీయ పార్టీగా, ఇతర పార్టీలకు ప్రత్యామ్న్యాయంగా ప్రజలు భావించడం లేదు. గత ఎన్నికలలో కనీసం 175 మంది అభ్యర్థులను పోటీకి దింపలేకపోయారు. 2024 ఎన్నికలకు జనసేన సన్నద్ధం కావాలంటే కనీసం రెండేళ్ల ముందు నుండే పవన్ రాజకీయాలలో కీలక పాత్ర పోషించాలి. ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయడానికి ఆయనకు రెండేళ్లకు పైగా సమయం పడితే… ఆయన ఇంకెప్పుడు పార్టీని పటిష్టం చేసి, ఎన్నికలకు సిద్ధం అవుతాడు?

కొత్త సచివాలయం ఫైనల్ డిజైన్ వచ్చేసిందిగా?


తెలంగాణలో సీఎం కేసీఆర్ మాటకు తిరుగులేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఆయన ఏదైనా కావాలని మంకుపట్టుపడితే అది పూర్తయ్యే వరకు ఊరుకోరు.. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ కొత్త సచివాలయాన్ని నిర్మించాలని సంకల్పించారు. ఇందుకోసం కొత్త సచివాలయ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. అయితే ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. కొద్దిరోజులుగా హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ప్రభుత్వం తమ వాదనను హైకోర్టులో బలంగా విన్పించడంతో కొత్త సచివాలయ నిర్మాణానికి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

చిచ్చుపెట్టిన కరోనా.. కేసీఆర్ తో గవర్నర్ ఫైట్?

దీంతో సీఎం కేసీఆర్ కోరుకున్నట్లు కొత్త సచివాలయ నిర్మాణానికి అన్ని అడ్డంకులు తొలిగాయి. దీనిపై విపక్షాలు సుప్రీంలో సవాల్ చేసేందుకు ప్రయత్నిస్తుండగానే ప్రభుత్వం పాత సచివాలయాన్ని కూల్చివేసేందుకు పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకుంది. ఈమేరకు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి సచివాలయాన్ని కూల్చివేసేందుకు పలు కంపెనీలు ముందుకొచ్చారు. దీంతో ఇవాళ్టి నుంచి సచివాలయ కూల్చివేత పనులను చేపడుతున్నారు. సచివాలయానికి వెళ్లే రహదారులను మూసివేసి అధికారుల పర్యవేక్షణలో పనులు చేపడుతున్నారు. మొదటగా జి, సి బ్లాక్ కూల్చివేయనున్నారు.

వైసీపీ నేతల జేబులు నింపుతున్న మద్యం విధానం

పాత సచివాలయ కూల్చివేత పనులు జరుగుతుండగానే కొత్త సచివాలయ డిజైన్ విడుదలైంది. ప్రస్తుతం ఈ కొత్త డిజైన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆధునాతన హంగులతో తీర్చిదిద్దిన సచివాలయ డిజైన్ అదిరిపోయిందనే టాక్ విన్పిస్తోంది. ఈ డిజైన్ కు సీఎం కేసీఆర్ ఆమోదముద్ర వేయాల్సి ఉంది. అయితే పాత సచివాలయం కూల్చకుండా కరోనా ఆస్పత్రికి చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం వీటిని పట్టించుకోకుండా కూల్చివేత పనులు చేసుకుంటూ ముందుకెళుతోంది. త్వరలోనే ఆధునాతన హంగులతో కొత్త సచివాలయాన్ని నిర్మాణాన్మి పూర్తిచేసి సీఎం కేసీఆర్ ప్రారంభించేందుకు సన్నహాలు చేస్తున్నారు.