Home Blog Page 8417

కొత్త సచివాలయ నిర్మాణానికి కారణాలు ఇవేనా!

 

Secretariat

హైదరాబాద్‌ లో సచివాలయంను కూల్చేసి, అదే స్థలంలో కొత్త సచివాలయ భవనం కట్టాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. నిజానికి ప్రభుత్వం ఈ నిర్ణయం గత ఏడాది జూన్‌ లోనే తీసుకుంది. జూన్ 27న ఇదే ప్రాంగణంలో కొంచెం అవతలివైపు సీఎం కేసీఆర్ కొత్త సచివాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈలోపు కొందరు సచివాలయ కూల్చివేతకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఇవి దాదాపు ఏడాదిపాటు నడిచాయి. ఈ భవనాలు బాగానే ఉన్నాయని, వాటిన కూల్చాల్సిన అవసరం లేదని పిటిషనర్లు వాదించారు. చివరికి మూడు నాలుగు రోజుల క్రితం హైకోర్టు ఈ అంశంలో తుది తీర్పు ఇచ్చింది. భవనాల కూల్చివేతలో తాము జోక్యం చేసుకోలేమని, సచివాలయం ఎక్కడ ఉండాలి, ఎక్కడ నిర్మించాలి అనేది ప్రభుత్వం ఇష్టమని తీర్పు ఇచ్చింది. దాంతో సోమవారం అర్థరాత్రి నుంచి ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అత్యంత రహస్యంగా కూల్చివేత పనులు ప్రారంమయ్యాయి. కూల్చివేత పనులు జరుగుతున్న ప్రాంతం చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ నేతల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఏడాదిలోపే కొత్త భవనం నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలుస్తోంది.

పాత సచివాలయం కూల్చివేతకు కారణాలు?

పాత సచివాలయం దగ్గర పార్కింగ్ స్థలం సరిగ్గా లేదని, విదేశాల నుంచి వచ్చే అతిథులకు ఆతిథ్యం ఇచ్చే సందర్భాల్లోనూ సౌకర్యాల లేమి కొట్టొచ్చినట్లు కనబడుతోందని అప్పట్లో ప్రభుత్వం చెప్పింది. ప్రభుత్వ అవసరాలు తీర్చే సమావేశ మందిరాలు, వీడియో కాన్ఫరెన్స్ హాళ్లు లేవని.. ఉద్యోగులు, ఇతర సందర్శకుల కోసం కెఫెటేరియా, క్యాంటీన్ల లాంటి సదుపాయాలు కొరవడ్డాయని భావించింది. అధికారులు, సిబ్బంది ఒక భవనం నుంచి మరో దానికి వెళ్ళడం కష్టంగా ఉందని, ఫైళ్ల తరలింపులోనూ ఇబ్బందులు ఉంటున్నాయని ప్రభుత్వం గతంలో వివరించింది. ఈ నిర్మాణాలు నేషనల్ బిల్డింగ్, గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలకు లోబడి లేవని, ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే జనం బయటకు పరిగెత్తి ప్రాణాలు కాపాడుకోలేని దుస్థితిలో అవి ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులు గతంలో చెప్పారు.

ఏ లోటుపాట్లు లేకుండా, అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్త సమీకృత సచివాలయం నిర్మిస్తామని కేసీఆర్ మొదటి నుంచీ చెబుతున్నారు. తెలంగాణకే తలమానికంగా ఉండేలాగా దానిని నిర్మిస్తామన్నారు. దీనికి తోడు 2014లో తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వానికి సంబంధించి ఐకానిక్ భవనాలు ఉండాలని సీఎం కేసీఆర్ భావిస్తూ వచ్చారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసం అయిన క్యాంప్ కార్యాలయాన్ని కూడా ఆయన ఆధునీకరించారు. దానికి ప్రగతి భవన్ అనే పేరుపెట్టారు. కేసీఆర్ తర్వాత అసెంబ్లీ, సచివాలయం కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ నిర్మించాలని ప్రయత్నించారు. దాని నిర్మాణం కోసం జంట నగరాల్లో చాలా ప్రాంతాలను పరిశీలించారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లేదా జింఖానా గ్రౌండ్స్ లో నిర్మిస్తారని, ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిని తరలించి అక్కడ కడతారని, ఎర్రమంజిల్‌ లో సచివాలయం నిర్మిస్తారని రకరకాల వార్తలు వచ్చాయి. చివరకు పాత సచివాలయం ఉన్నచోటే, ఆ భవనాన్ని కూల్చేసి కొత్త భవనం కట్టడానికి ప్రభుత్వం ఇప్పుడు సిద్ధమైంది.

ఓ జర్నలిస్టు ఆవేదన.. కన్నీళ్లు పెట్టకమానరు


ఇది కాలం వేసిన కాటు.. కరోనా తెచ్చిన పోటు.. మనిషి చేసుకున్న పాపం ఇప్పుడు ఎందరో అమయాకులను బలి తీసుకుంటోంది. చైనావోడి కక్కుర్తికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది బలి అయిపోయితున్నారు. ఈ పాపం కరోనాదా.? మనుషులు చేసుకున్నాదా తేల్చడానికి ఇప్పుడు సమయం కాదు. ప్రాణాలు కాపాడుకోవడమే ఇప్పుడు మనముందున్న కర్తవ్యం.

కరోనా.. ఇప్పుడు ఎందరి జీవితాలనో అతలాకుతలం చేస్తోంది. గొప్పగా బతికినోళ్లను రోడ్డున పడేస్తోంది. రోడ్డున ఉన్నోళ్లను కాటికి పంపుతోంది. కాదెవరు ఈ మహమ్మారికి అనర్హం అన్నట్టుగా ఉంది.

విప్లవ చైనా విస్తరణవాద చైనాగా మార్పు

జర్నలిస్ట్.. పేరు గొప్ప ఊరు దిబ్బలాంటి ఉద్యోగాలివీ.. సమాజంలో గొప్ప గౌరవం ఉంటుంది. కానీ చేతిలో రూపాయి ఉండదు. సంపాదించుకునే స్కోప్ ఉండదు. అందుకే కరోనా రాగానే మొదట ఫీల్డ్ లో ఉండే వీరికే ఎఫెక్ట్ పడింది. కంపెనీల కబంధ హస్తల్లో బోటాబోటీ జీతాలతో వెళ్లదీసే జర్నలిస్టుల బతుకులు ఘోరాతి ఘోరం.. ఏదైనా రోగమొస్తే పట్టించుకోవడానికి సంస్థ ముందుకు రాదు.. ప్రభుత్వాలు సహకరించవు. పెద్దగా సంపాదించుకోకపోవడంతో డబ్బులు చేతిలో ఉండవు. దీంతో జర్నలిస్టుల జీవితాలు అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతూనే ఉంటాయి. అందరికీ అన్ని స్కీంలు ఇస్తున్న ప్రభుత్వాలు జర్నలిస్టులకు మాత్రం అవేవీ వర్తింపచేయవు. అదో దురదృష్టం.

ఇప్పుడు అలాంటి జర్నలిస్ట్ ఆవేదన కన్నీళ్లు పెట్టిస్తోంది. సిద్దిపేటకు చెందిన శ్రీనివాస్ అనే జర్నలిస్ట్ కు కరోనా సోకింది. ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. ఓ పత్రికలో రిపోర్టర్. కరోనా ఊపరితిత్తులకు ఎఫెక్ట్ అయ్యిందని వైద్యులు తెలిపారట. కనీసం మాట కూడా మాట్లాడడం రావడం లేదు. చేతిలో డబ్బులు లేవు.. ప్రాణం పోయేలా ఉంది. ఈ విపత్కర సమయంలో ఓ సెల్పీ వీడియో తీశాడు..

సిద్దిపేటకే చెందిన మంత్రి హరీష్ రావును వేడుకున్నాడు. హరీషన్నా కాస్త ఆపోలో ఆస్పత్రిలో ఒక బెడ్ ఇప్పించడన్నా అని వీడియోలో బతిమిలాడుకున్నాడు. డబ్బులు ఏమీ లేవన్నా.. కుటుంబమంతా ఏడుస్తున్నారని.. ఆపోలోలో బెడ్ ఇప్పించి చికిత్స అందించి కాపాడండి అని బోరుమన్నాడు. మాట్లాడడానికి కూడా మాట వస్తలేదంటూ కరోనాతో తీవ్రంగా బాధపడుతున్న జర్నలిస్ట్ శ్రీనివాస్ వీడియోలో కన్నీళ్లు పెట్టుకున్నాడు.

యుపి లో బ్రాహ్మణ కార్డు బయటకు తీసిన కాంగ్రెస్

ఇప్పుడీ వీడియో అందరినీ కదిలిస్తోంది. కన్నీళ్లు పెట్టిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ జర్నలిస్ట్ ఆవేదన మాత్రం జర్నలిస్ట్ సర్కిల్స్ లో చర్చనీయాంశమైంది. తాడు బొంగరం లేని జర్నలిజాన్ని నమ్ముకున్న జర్నలిస్టుల ఆవేదనను కళ్లకు కడుతోంది.

అయితే ఈ జర్నలిస్ట్ దుస్థితి మంత్రి హరీష్ ను కూడా కదిలించింది. మంత్రి హరీష్ రాత్రి యశోద ఆసుపత్రి వర్గాలతో మాట్లాడి బెడ్ ఇప్పించారు. ట్రీట్మెంట్ కొనసాగుతోంది. కోలుకుంటున్నాడని టీయూడబ్ల్యూజే ప్రధానకార్యదర్శి విరాహత్ అలీ తెలిపారు. రాత్రి నుండి యాంటీ వైరల్, బయటిక్ మెడిసిన్స్ ద్వారా ఊపిరితిత్తుల చికిత్స జరుగుతోందని.. రాత్రి తో పోల్చుకుంటే ప్రస్తుతం అతని ఆరోగ్యం మెరుగుపడిందని ఆయన తెలిపారు. మంత్రి హరీష్ రావు చూపిన చొరవపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

https://www.youtube.com/watch?v=7RgDPMvUcus

నిర్మాతగా సక్సెస్ ఫుల్ స్టార్ డైరెక్టర్ !


ఒక సినిమాకి డైరెక్టర్ తరువాత అతి ముఖ్యమైన వ్యక్తి రైటరే. కానీ రైటర్ పాత్రకు సంబంధించి ఎప్పుడూ తగినంత ప్రాధాన్యత లేదన్నదే ప్రధాన విమర్శ. ఒక విధంగా ఈ విమర్శ నిజం కాబోలు.. అందుకే రైటరే తన పాత్ర పరిధిని పెంచుకుంటున్నాడు. నేడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ గా పిలవబడుతున్న వాళ్ళల్లో ఎక్కువగా రైటర్ నుండి డైరెక్టర్ అయినవాళ్లే. అలాంటి వాళ్లల్లో ప్రముఖుడు కూల్ అండ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ. రైటర్ గా ఉన్నప్పుడు తీవ్ర మనోవేదనకు గురైన శివ.. కసితోనే డైరెక్టర్ అయ్యాడు. మెగాస్టార్ చిరంజీవి పిలిచి మరీ సినిమా చేసి పెట్టమని ఆడిగించుకునే స్థాయికి వెళ్ళాడు కొరటాల. ఇప్పుడు కొరటాల శివ మరో అవతారం కూడా ఎత్తబోతున్నాడు. నిర్మాతగా తన అభిరుచికి తగ్గ కథాబలం ఉన్న సినిమాలను ఓటీటీ కోసం చేయటానికి సన్నద్ధం అవుతున్నాడు.

విప్లవ చైనా విస్తరణవాద చైనాగా మార్పు

ఇక ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా ఆచార్య సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. తన శైలిలోనే ఈ సినిమా సాగనుంది. రాష్ట్రంలోని దేవాలయాలతో పాటు అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన ఎండోమెంట్స్ విభాగానికి చెందిన గవర్నమెంట్ ఆఫీసర్ గా మెగాస్టార్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. సమాజంలోని అన్యాయాలను అరికట్టే విధానం పై ఓ కొత్త థాట్ తో కథలు రాసే శివ.. ఆచార్య సినిమా కోసం కూడా అలాంటి కథనే తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సినిమాలో చరణ్ రోల్, ప్లాష్ బ్యాక్ లో వచ్చే ఎమోషనల్ సీక్వెన్స్ ఓ రేంజ్ లో ఉంటాయట.

యుపి లో బ్రాహ్మణ కార్డు బయటకు తీసిన కాంగ్రెస్

కరోనా దెబ్బకు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇప్పట్లో మొదలయ్యే పరిస్థితి కనబడటం లేదు. అయితే ఆగష్టు నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో వరుసగా ఇరవై ఐదు రోజులు పాటు సినిమాలోని కొన్ని కీలకమైన సీన్స్ ను షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ అప్పుడు కూడా కేసులు మరీ ఎక్కువగా ఉంటే మాత్రం షూట్ ప్లాన్ ను విరమించుకుంటారు. చరణ్ నిర్మాణంలో వస్తోన్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

కొత్త జిల్లాల ఏర్పాటుపై వైసీపీలో అసంతృప్తి..!


ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్న నేతలలో శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన ప్రసాదరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్టు పోస్టులను అమ్ముకుంటున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వద్ద ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా విభజన వల్ల చాలా సమస్యలు వస్తాయని ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. జిల్లా పరిధిలో ఉన్న ఎచ్చెర్ల, రాజాం, పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గాలు విజయనగరం, అరకు జిల్లాల పరిధిలోకి వెళ్లితే జిల్లా వాసులకు తీవ్ర నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాను విభజన నుంచి మినహాయించాలని సీఎంను కోరారు. కొత్త జిల్లాల ఏర్పాటు శ్రీకాకుళం జిల్లాకు సమస్యలు తెస్తుందని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు.

విప్లవ చైనా విస్తరణవాద చైనాగా మార్పు

రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో లెక్కకు మించిన సమస్యలు ఎదురురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను పార్లమెంట్ నియోజకవర్గాల ఆధారంగా 25 జిల్లాలను ఏర్పాటు చేయాలని ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల ఆధారంగా జిల్లాలను విభజించడం వల్ల అనేక చోట్ల భౌగోళికంగా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవైపు ప్రకాశం జిల్లాలో ఇదే పరిస్థితి ఉందని అక్కడి నాయకులు అంటున్నారు. గుంటూరు జిల్లా బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ప్రకాశం జిల్లా పరిధిలోని పర్చూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటులో ఇవన్నీ బాపట్ల జిల్లా పరిధిలో ఉండాల్సి వస్తుంది. దీనివల్ల జిల్లా వాసులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

యుపి లో బ్రాహ్మణ కార్డు బయటకు తీసిన కాంగ్రెస్

కొత్త జిల్లాల ఏర్పాటును సీపీఐ స్వాగతించగా, మిగిలిన విపక్షాలు ఈ అంశంపై స్పందించలేదు. గతంలో టీడీపీ ప్రభుత్వం కొత్త జిల్లాలపై ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే పార్లమెంట్ నియోజకవర్గాల ఆధారంగా కాకుండా భౌగోళిక స్వరూపం ఆధారంగా మొత్తం 26 జిల్లాలను టీడీపీ ప్రభుత్వం ప్రతిపాదించినా విభజనపై ముందుకు వెళ్ళలేదు. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటు జరగలేదు. మరోవైపు జిల్లాలకు పేర్లు నిర్ణయించే విషయంలో వైసీపీ ప్రభుత్వానికి ఎన్నో సమస్యలు ఎదురవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. తెలంగాణాలో కొత్త జిల్లాల ఏర్పాటులో సీఎం కేసీఆర్ చాలా సమస్యలు ఎదుర్కొని కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయానికి వైసీపీ నాయకులే వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. ఈ నేపథ్యంలో అసంతృప్తులను సీఎం ఏ విధంగా ఎదుర్కొంటారో వేచి చూడాల్సిందే.

విప్లవ చైనా విస్తరణవాద చైనాగా మార్పు

మేము చదువుకునే రోజుల్లో చైనా అన్నా, చైనా విప్లవమన్నా వల్లమాలిన అభిమానం వుండేది. ‘చైనాపై అరుణతార’ రాసిన ఎడ్గార్ స్నో పుస్తకం అమితాసక్తితో ఒకటికి రెండుమూడుసార్లు చదివాం. చైనా లాంగ్ మార్చ్ కధలు విని ఒళ్ళు పులకించేది. మావో సేటుంగ్ నడిపిన ఎర్రవిప్లవం, రైతాంగ పోరాటం యువకులను ఉర్రూతలూగించాయి. చైనా విప్లవం కలిగించిన స్ఫూర్తి అంతా ఇంతా కాదు. 1962 భారత -చైనా యుద్ధం వరకూ హిందీ-చీనీ భాయ్ భాయ్ డిల్లీ వీధుల్లో మారుమోగింది. 1962 యుద్ధం భారత కమ్యూనిస్టు ఉద్యమంలోనూ మొట్టమొదట సారి విభేదాలు ప్రస్ఫుటంగా ప్రజల ముందు కొచ్చాయి. నాయకుల్లో ఒకవర్గం భారత్ ని సమర్ధిస్తూ చైనాని ఖండిస్తే మరొక వర్గం చైనాని ఖండించటానికి నిరాకరించింది. ఆ వర్గమే తర్వాతదశలో సిపిఎం గా అవతరించింది. అయితే ఆ చీలిక అక్కడితో ఆగకుండా తర్వాతదశలో నక్సలైట్లు గా ఆవిర్భవించింది. మావో సేటుంగ్ నాయకత్వాన నక్సలైట్లను, ఈశాన్య భారత దేశంలో అనేక వేర్పాటువాద సంస్థలను ప్రోత్సహించటం జరిగింది. అయినా మావో సేటుంగ్ పై అభిమానం పూర్తిగా చావలేదు. ఎందుకంటే ఉడుకురక్తం అలాంటిది. వున్న వ్యవస్థలోని లోపాలపై కోపం, చైనా విప్లవంతో ఆ లోపాలు పోయి మంచి ఆదర్శ వ్యవస్థ ఏర్పడుతుందనే నమ్మకం ఆ అభిమానాన్ని చావకుండా ఉంచింది. దానికి తోడు కాలేజీ ల్లో దాన్ని ఆరాధించే సాహిత్యమే అందుబాటులో వుండేది. మా దగ్గర లైబ్రరీ ల్లో సగం పుస్తకాలు చైనా విప్లవాన్ని గురించే వుండేయి. ఆ గుడ్డి ఆరాధన లో మావో అన్నా , చైనా విప్లవమన్నా పడిచచ్చేవాళ్ళం. ఇందులో ఎటువంటి స్వార్ధం లేదు. సమాజం మారాలంటే అదే ఆదర్శమనే భావనలో వుండే వాళ్ళం.

అంతగా ఆరాధించే మావో వ్యక్తిగతంగా తప్పులుచేస్తాడని అనుకునేవాళ్ళం కాదు. మావో నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నా  దాన్ని ఓ వివాదాస్పద అంశంగా చూడలేదు. అదేసమయంలో ఒక పురుషుడు ఒక స్త్రీ తోనే వివాహబంధం ఆదర్శమనే రాముడి సంస్కృతికి వారసులం కూడా మనమే. సాధ్యమైనంతవరకు వివాహబంధాన్ని పవిత్రంగా భావించి ఒకరి నొకరు అర్ధం చేసుకుంటూ సహజీవనం కొనసాగించే సంస్కృతి మనది. తప్పని పరిస్థితుల్లో మాత్రమే విడిపోయి వేరే వివాహం చేసుకొనే సంస్కృతి మనది. అయినా మన దేశ విప్లవ నాయకుల కన్నా కమ్యూనిస్టు భావజాల ప్రభావంతో ఇతరదేశ నాయకుల్నే మన ఆదర్శ పురుషులుగా భావించే సంస్కృతిలో పెరిగాం. తప్పులేదు. మానవాళి కి మేలుచేసే ఏ సిద్ధాంతమయినా , ఏ నాయకుడైనా మనకు ఆదర్శమే. అయితే ఈ నాయకులు , ఈ సిద్ధాంతాలు నిజంగా దేశాలకతీతంగా విశ్వ మానవాళి కోసం పనిచేస్తున్నాయా అనేది ఒక్కసారి గుండెమీద చేయివేసుకొని పునఃపరిశీలన చేసుకుందాం.

మనకున్న పరిమిత వ్యాసంలో చైనా వరకే పరిమితమవుదాం. ముందుగా మనం అర్ధం చేసుకోవాల్సింది మనం అభిమానించే నాయకులు కూడా మనుషులే. వాళ్ళేమీ దైవాంశ సంభూతులు కాదు. దైవాన్ని నమ్మని వాళ్లకి వాళ్ళేమీ విమర్శకు, జవాబుదారీతనానికి అతీతులేమీ కాదు. దురదృష్టమేమంటే ఏ సిద్ధాంతమయితే ప్రశ్నించటం నేర్పిందో అదే సిద్ధాంతపు నాయకులు ప్రశ్నించటాన్ని తట్టుకోలేరు. పేరుకు శ్రామిక నియంతృత్వం అయినా, పార్టీ అంతరంగిక ప్రజాస్వామ్య మయినా ఆచరణలో వ్యక్తి స్వామ్యమే శిరోధార్యం.అది మావో సేటుంగ్ అయినా, ఇప్పటి జీజిన్పింగ్ అయినా జరిగింది ఇదే. జీ జిన్పింగ్ జీవితకాలపు అధ్యక్షుడిగా ఎన్నుకున్నా అది తప్పు అని ప్రశ్నించటం నేరమే.    మావో సేటుంగ్ ” గొప్ప ముందడుగు” పేరుతో దుస్సాహసిక నిర్ణయంతో లక్షలాదిమంది చనిపోయినా ప్రశ్నించే నాదుడులేడు. అదే పార్టీ అంతరంగిక ప్రజాస్వామ్యం. అలాగే పార్టీ పోలిట్ బ్యూరో లోని సీనియర్ నాయకులు అదృశ్యమైనా అడిగే నాదుడులేదు. అదే పార్టీ అంతరంగిక ప్రజాస్వామ్యం. సాంస్కృతిక విప్లవం పేరుతో విచ్చిన్నకాండ కొనసాగించినా అదీ పార్టీ నిర్ణయమే. నాయకులకే ప్రశ్నించే    దిక్కులేకపోతే సామాన్యప్రజల పరిస్థితి ఊహించుకోవచ్చు. కరోనా మహమ్మారి పై అసమ్మతి వ్యక్తం చేసిన వాళ్ళు మరలా కనబడరు. ఈ ఆదర్శం కోసమేనా ఎంతోమంది అన్నీ వదులుకొని పార్టీకోసం సర్వస్వం త్యాగం చేసింది? పౌరహక్కుల నాయకుల్లో ఎక్కువమంది వామపక్ష ప్రభావంలో ఉన్నవారే. మరి ఈరోజు కనీసం వాళ్ళు ఎంతోకొంత గొంతుపెగిల్చి ప్రజల హక్కులకోసం మాట్లాడుతున్నారు. రేపు వాళ్ళు కోరుకున్న శ్రామిక నియంతృత్వం వస్తే ముందుగా కత్తిరించే గొంతులు వాల్లవేనని మరిచిపోవద్దు.

ఇక అసలు విషయానికొద్దాం. చైనా భారత్ లోని వేర్పాటువాద శక్తులకు ఊతమిస్తూ వాళ్ళ దేశంలో చేసిందేమిటి? ముందుగా మన సరిహద్దుల్లోని టిబెట్ ని బలవంతంగా ఆక్రమించుకొని టిబెట్ ప్రజల సంస్కృతిని, మతాన్ని, ఆచారాల్ని మంట గలిపిన మాట వాస్తవం కాదా? ఈరోజుకీ అక్కడ ఆత్మ బలిదానాలు ఎందుకు కొనసాగుతున్నాయి? వీఘర్ ముస్లింలను వాళ్ళ సంస్కృతిని, ఆచారాల్ని నాశనం చేయటం కోసం హాన్ జాతీయుల్ని పెద్దఎత్తున తరలించిన మాట వాస్తవం కాదా? హుయి ముస్లిం లను నానా రకాలుగా వేధించటం వాస్తవం కాదా? మరి మీ దేశంలో జాతులకు ‘విముక్తి’ కలిగించకుండా బలవంతంగా అణిచి వేస్తూ భారత్ లోని ఈశాన్య భారత జాతుల గురించి మాట్లాడటం రెండు నాల్కల ధోరణి కాదా? అటువంటి మీరు ఆదర్శనాయకులు ఎలా అవుతారు?

1959 లో చైనా పర్యటనలో  సోవియట్ యూనియన్ ప్రధాని కృశ్చేవ్ మావో సేటుంగ్ తో కేవలం కొన్ని కిలోమీటర్ల కోసం భారత్ తో తగాదా పెట్టుకోవద్దని సలహా ఇస్తే పెడచెవిని పెట్టింది వాస్తవం కాదా? సరే భారత్ మీ దృష్టిలో పెట్టుబడీదారి దేశం కాబట్టి దానితో యుద్ధం తప్పుకాదు. మరి సోవియట్ యూనియన్ తో సరిహద్దు యుద్ధానికి ఎందుకు కాలు దువ్వారు? అది అప్పటికి మీ సోదర కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వమే కదా? సరే అదీ సర్దుకుపోదాం , ఎందుకంటే అప్పటికి మీరు విప్లవవాదులు రష్యా రివిజనిస్టులు కాబట్టి! మరి వియత్నాం అమెరికా తో వీరోచిత పోరాటం చేసిన ఘన చరిత్ర గలిగిన పార్టీ గదా. ఆ పార్టీ ఆధ్వర్యాన వున్న ప్రభుత్వం తో సరిహద్దు యుద్ధం ఎందుకు చేసారో సెలవిస్తారా? మీ తలపైన వున్న చిన్న దేశం మంగోలియా తో కూడా మీకు సరిపడదు కదా. అదీ అప్పట్లో కమ్యూనిస్టు దేశమే కదా. ఈరోజు దక్షిణ చైనా సముద్రం లో ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసినా ఖాతరు చేయకుండా స్వేచ్చా మార్గానికి తూట్లు పొడుస్తుంది మీరు కాదా. మీ సరిహద్దు సముద్రదేశాలతో ఒక్క దేశంతో నైనా మీరు ప్రశాంతంగా వున్నారా? జపాన్, ఇండోనేషియా, దక్షిణ కొరియా, ఫిలిప్పైన్స్ , వియత్నాం  లాంటి అన్ని దేశాలు మీ గిల్లికజ్జాలతో తలపట్టుకుంటున్నాయి కదా.  సరిహద్దు దేశాలు మయన్మార్, భూటాన్ లు కూడా మీ బాధలు భరించలేక పోతున్నాయి కదా. ఇవన్నీ చూసిన తర్వాత కూడా మిమ్మల్ని విప్లవ చైనా అని పిలవాలా? ఖచ్చితంగా కాదు. మీది విస్తరణ వాద చైనానే.

మరి ఇంతగా చైనా నిజ స్వరూపం బయటపడిన తర్వాత కూడా భారతదేశం లోని కమ్యూనిస్టులు చైనా విస్తరణ వాదాన్ని ఖండించటానికి ఎందుకు వెనకాడుతున్నారు? మీరు సిద్ధాంతానికి కట్టుబడ్డారా లేక చైనా దేశానికి , చైనా కమ్యూనిస్టు పార్టీకి విదేయులా అనేది తేల్చుకోవాల్సి వుంది. చైనా విస్తరణ వాదాన్ని వ్యతిరేకించిన వాళ్ళందరినీ ఆర్ఎస్ఎస్ , బిజెపి అనుకూలురుగా చెప్పలేరుకదా? ఈరోజు చైనా విస్తరణ వాదాన్ని వ్యతిరేకించని పార్టీ లేదంటే అతిశయోక్తి కాదేమో, ఒక్క మీరు తప్ప. ప్రపంచంలో అన్ని దేశాలు భారత -చైనా వివాదం లో భారత్ వైపు నిలబడితే మీకు మీ వైఖరి పై పునరాలోచన రావటం లేదా? 1950 దశకం లోనే ఎంతోమంది మేధావులు చైనా విషయం లో నెహ్రు కి హెచ్చరికలు చేస్తూనే వచ్చారు. అయినా నెహ్రూ పెడచెవిని పెట్టాడు. చివరకు ఆ మనోవేధనతోనే నెహ్రూ చనిపోయాడని చెప్పుకుంటారు. చివరిగా ఒక్కమాట చైనా గానీ , చైనా కమ్యూనిస్టు పార్టీగాని విశాల దృక్పధంతో వాళ్ళ జాతీయవాద వైఖరిని విడనాడి ఆలోచించిన సంఘటన ఒక్కటి చెప్పగలరా? చైనా ని గురించి ఆలోచించే మీరు వియత్నాం ని గురించి కూడా ఆలోచించండి. ఈరోజు చైనా 21వ శతాబ్దపు నయా వలసవాద నాయకురాలిగా ఎదిగిందనేది ఏమాత్రం సిద్ధాంత అవగాహన వున్నవాళ్ళకు కూడా అర్ధమవుతుంది. నయా వలసవాద దోపిడీ అమెరికా చేసినా , చైనా చేసినా ఒక్కటే. అమెరికా చేస్తే తప్పు చైనా చేస్తే ఒప్పు కాదు మిత్రమా. మీ పార్టీల్లో ఎంతోమంది నిజాయితీగా మీ సిద్ధాంతం కోసం జీవితాల్ని అంకితం చేసారు. మరి ఆ సిద్ధాంతం వంచనకు గురికాబడితే ఇప్పటికీ అటువంటి పార్టీకి అటువంటి నాయకులకు వంతపాడటం మీ ఆశయాలకు తూట్లు పోడిచినట్లవ్వదా ? ఒక్కసారి ఆలోచించండి. చైనా విస్తరణ వాదాన్ని ఇప్పటికైనా ఖండించి మీ చిత్తశుద్ది ని నిరూపించుకుంటారని ఆశిస్తూ ……

యుపి లో బ్రాహ్మణ కార్డు బయటకు తీసిన కాంగ్రెస్

కాంగ్రెస్ కి కనీస నైతిక నియమాలు పాటించాలనేది ఎప్పుడూ గుర్తుకురాదు. స్వాతంత్రం వచ్చిన కొత్త లో ఏమన్నా పాటించిందేమోగానీ తదనంతర చరిత్ర అంతా అధికారమే పరమావధిగా కొనసాగింది. నిన్నటికి నిన్న భారత-చైనా గొడవల్లో దేశం తలమునకలైవుంటే రాహుల్ గాంధీ మాత్రం మోడీని ఎలా ఇరకాటంలో పెట్టాలనేదానిమీదే అస్త్రాలు ఎక్కుపెట్టాడు. అయితే మోడీ తక్కువేమీ తినలేదు. గాంధీ కుటుంబం పెట్టిన మూడు ట్రస్టులపై విచారణ చేపట్టాడు. ఈ ట్రస్టు ల్లో నిధులు ఎలా ఖర్చయ్యాయనేది తేల్చే పనిలో మోడీ-అమిత్ షా ద్వయం నిమగ్నమయ్యింది. ఇంతకు ముందే జివికె రెడ్డి కుటుంబంపై కూడా సిబిఐ , ఇడి దర్యాప్తు చేపట్టారు. జివికె కుమారుడు సంజయ్ రెడ్డి కి కాంగ్రెస్ కోశాధికారి తిక్కవరపు సుబ్బరామి రెడ్డి కూతుర్ని ఇచ్చారు. సుబ్బరామి రెడ్డి కాంగ్రెస్ కి నిధులు సమకూర్చటం లో దిట్ట అని వేరే చెప్పనవసరం లేదు. జివికె కుటుంబం ముంబై విమానాశ్రయం లో మళ్లించిన వందల కోట్ల రూపాయల నిధుల్లో కాంగ్రెస్ నాయకులకు ఎన్ని ముడుపులు అందాయనేది తేల్చటానికే ఈ దర్యాప్తు  చేపట్టరనేది ఆనోటా ఈనోటా వినబడుతున్న మాట. ఒకవైపు రాబర్ట్ వాద్రాపై కేసులు, అహ్మద్ పటేల్ పై కేసులు రెండోవైపు ఈ కొత్త కేసులు వెరసి గాంధీ కుటుంబం చుట్టూ మోడీ-అమిత్ షా ద్వయం ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తుంది. మోడీకి ఇంకా నాలుగు సంవత్సరాలు టైముంది. ఈ లోపల ఈకేసులన్నీ  ఓ కొలిక్కి వస్తాయి. ఇది గ్రహించే సోనియా, రాహుల్ , ప్రియాంక గాంధీలకు భయం పట్టుకుంది. అందుకే సమయం, సందర్భం లేకుండా నిగ్రహం కోల్పోయి మాట్లాడుతున్నారు. మోడీ నిర్వహించిన అఖిలపక్ష వీడియో మీటింగ్ లో సోనియా గాంధీ తప్ప అందరూ దేశ భద్రతకు సంబంధించి మోడీకి బాసటగా నిలిచారు. సోనియా గాంధీ ఒంటరిదయ్యింది. రోజు రోజుకీ గాంధీ పరివారము బలహీనపడుతుంది.

అందుకే ఏదోవిధంగా మోడీ ప్రభుత్వాన్ని దెబ్బతీయాలనే ఎత్తుగడ తీసుకున్నారు. ఇటీవల ఉత్తర ప్రదేశ్ లో మాఫియా డాన్ వికాస్ దూబే 8 మంది పోలీసుల్ని పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. అతన్ని పట్టుకోవటానికి ఉత్తర ప్రదేశ్ పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. ఇవ్వాళో, రేపో అతన్ని పట్టుకోవటమో, ఎన్ కౌంటర్ చేయటం ఖాయం. యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సంఘ విద్రోహక శక్తులు, రౌడీ షీటర్లను ఎన్ కౌంటర్ చేయటం అందరికీ తెలిసిందే. అయితే అందుకు ప్రతిగా ప్రత్యర్ధులు కులాల గుర్తింపు కార్డులు ముందుకు తీసుకొచ్చారు. కొంతమంది పనిగట్టుకొని ఈ ఎన్ కౌంటర్లలో చనిపోయే వారందరూ నిమ్న వర్గాలు , ముస్లింలు వున్నారని అగ్రకులాల వారు లేరని ప్రచారం చేస్తున్నారు. ఇదే అదనుగా కాంగ్రెస్ అగ్రవర్ణాలలో బ్రాహ్మణులు ఈ ప్రభుత్వం లో అన్యాయానికి గురవుతున్నారని ప్రచారానికి తెరలేపారు. ఏదోవిధంగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట చేయాలని అటు ఇటు ప్రత్యర్ధులు ప్రచారం చేయటం గమనార్హం.

ఉత్తర ప్రదేశ్ లో బ్రాహ్మణులు జనాభాలో 10 శాతానికి పైగానే వుంటారు. మన దక్షిణాదిలో లాగా కాకుండా వారు వ్యవసాయ వృత్తిలో గణనీయంగా వున్నారు. రాజకీయంగా మొదట్నుంచీ కాంగ్రెస్ మద్దతు ఓటు బ్యాంకుగా వుండేవారు. 2014 లో వీరందరూ బిజెపి వైపు మొగ్గు చూపారు. అప్పట్నుంచీ ఎలాగైనా తిరిగి పోయిన బ్రాహ్మణ ఓటు బ్యాంకు ని పొందాలని ప్రయత్నం చేస్తూనే వున్నారు. ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ బ్రాహ్మణ నాయకుడి గా గుర్తింపు పొందిన మాజీ కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద మాట్లాడుతూ యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం లో బ్రాహ్మణులకు అన్యాయం జరుగుతుందని విమర్శించాడు. వాస్తవానికి యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం లో 9మంది బ్రాహ్మణులు మంత్రులుగా వున్నారు. ఇటీవల ఒక జర్నలిస్టు చనిపోయిన కేసుని ఆసరాగా తీసుకొని జితిన్ ప్రసాద బ్రాహ్మణులను రెచ్చగొట్టటానికి ప్రయత్నం చేయటం చూస్తుంటే కాంగ్రెస్ ఎంత నిస్పృహలో వుందో అర్ధమవుతుంది. ఇప్పుడు 8 మంది పోలీసులను కాల్చిచంపిన వికాస్ దుబే బ్రాహ్మణుడు కావటంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. వికాస్ దుబే పై ఇప్పటికే 60కి పైగా క్రిమినల్ కేసులు వున్నాయి. తను సినిమా ఫక్కీ లో పోలీసుల్లో తన మనుషుల్ని పెట్టుకొని వాళ్ళ ద్వారా ముందస్తు సమాచారాన్ని తెప్పించుకొని డిఎస్పి తో సహా 8 మంది పోలీసులను మట్టు పెట్టటం దేశవ్యాప్తంగా సంచలనాన్ని రేపింది. చివరకు దీన్ని కూడా కులానికి జరిగిన అన్యాయంగా చిత్రించటం కాంగ్రెస్ దిగజారుడుతనానికి నిదర్శనం. నేరస్థుల్లో కులాల్ని వెతికే సంస్కృతి అత్యంత ప్రమాదకరం. గాంధీ కుటుంబం చుట్టూ ఉచ్చు బిగిసే కొద్దీ ఇంకెన్ని ప్రయోగాలు చేస్తారో చూడాలి .

 

ఈ జర్నలిస్ట్ ని కూడా అరెస్ట్ చేస్తారేమో..?

Teenmar mallanna

Teenmar mallanna

సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ పై తప్పుడు వార్త రాశారని ఓ జర్నలిస్ట్‌‌‌‌ ను జూబ్లీహిల్స్‌‌‌‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇదే తరహాలో సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఆయనిప్పుడు ఏం చేస్తున్నారనే వివరాలను ప్రభుత్వమే వెల్లడించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ తీన్మార్ మల్లన్న బుధవారం హైకోర్టులో మాండమస్ పిటిషన్ దాఖలు చేశారు. సీఎం క్యాంప్ కార్యాలయమైన ప్రగతి భవన్‌లో 30 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చిందనీ… అప్పటి నుంచీ సీఎం కేసీఆర్ ఫామ్‌ హౌస్‌ కి వెళ్లారని మల్లన్న తన పిటిషన్‌ లో గుర్తుచేశారు. దింతో సీఎం కి వ్యతిరేకంగా హైకోర్టు కి వెళ్లినా మల్లన్నను కూడా కేసీఆర్ సర్కార్ అరెస్ట్ చేస్తదేమో.. అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. సీఎం అందుబాటులో లేకుండాపోయేసరికి వివిధ శాఖల అధికారులు సక్రమంగా పనిచేయడంలేదని, దీంతో ప్రజల్లో కరోనా భయాలు మరింతగా పెరిగిపోతున్నాయని, అన్నింటికీ సమాధానంగా కేసీఆర్ పరిస్థితిపై ప్రభుత్వం వెంటనే స్పందించేలా ఆదేశాలివ్వాలని హైకోర్టును పిటిషనర్ కోరారు.

ఇటీవల ఆదాబ్ హైదరాబాద్ పత్రిక ఈ-పేపర్‌‌‌‌‌‌‌‌ లో “సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ కు కరోనా” ,”హరితహారం కార్యక్రమంలో సోకిందా” వార్త పబ్లిష్‌‌‌‌ అయింది. దాని పేపర్‌‌‌‌‌‌‌‌ క్లిప్‌‌‌‌ సోషల్‌‌‌‌ మీడియాలో వైరల్‌‌‌‌ అయ్యింది. దీనిపై హైదరాబాద్‌‌‌‌ రహమత్ నగర్‌‌‌‌‌‌‌‌ కి చెందిన టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ కార్యకర్త మహ్మద్ ఇలియాస్ ఆదివారం జూబ్లీహిల్స్‌‌‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆదాబ్ హైదరాబాద్ జర్నలిస్ట్‌‌‌‌ వెంకటేశ్వరరావు, యాజమాన్యంపై ఐపీసీ 505(1)(బి), 505(2) రెడ్ విత్34 సెక్షన్లతో డిజాస్టర్ మేనేజ్‌‌‌‌మెంట్ యాక్ట్ సెక్షన్‌‌‌‌ 54 కింద కేసు నమోదు చేశారు. వెంకటేశ్వరరావు స్వస్థలం ఖమ్మం జిల్లాకు వెళ్లి ఆయన్ను అరెస్ట్‌‌‌‌ చేశారు.

విశాఖలో అధికారుల హడావుడి.. కారణం అదేనా?

Vizag

ఈ మధ్య విశాఖపట్నంలో అధికారుల హడావుడి మొదలైనట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఓ ఉన్నతాధికారి విశాఖ పర్యటించి వచ్చారని, సీఎం కార్యాలయం కోసం సరైన ప్రదేశాన్ని ఎంపిక చేసే పని మీదే ఆయనకు అక్కడ వచ్చారని కొందరు అభిప్రాయ పడుతున్నారు.

కోర్టులు, చట్టాలకు చిక్కకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాజధాని తరలింపును రహస్యంగా కొనసాగిస్తోన్నట్లు తెలుస్తోంది. అమరావతిని రాజధానిగా ఉంచుతూనే, క్రియాశీల రాజధాని తరలింపు ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తోందనే టాక్ నడుస్తోంది. అవసరమైతే ఒక్కరోజులోనే సీఎం కార్యాలయాన్ని విశాఖకు తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేసినట్లు విశ్వసనీయ సమాచారం

కాపులుప్పాడ ప్రాంతంలోని గ్రేహౌండ్స్‌ కు చెందిన భవనంలోనే సీఎం క్యాంపు కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంబేద్కర్ స్మృతివనం మార్పుతో రాజధాని విషయంలో ప్రభుత్వం తన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పిందని, ఒకపక్క రాజధాని మార్పు వద్దని రైతుల ఆందోళన, న్యాయవివాదాలు, శాసన సంబంధ సమస్యలు ఉన్నా, తాను అనుకున్న విధంగా రాజధాని తరలింపును ప్రభుత్వం కొనసాగిస్తోందని కొందరు టీడీపీ నేతలు మధనపడుతున్నట్లు తెలుస్తోంది.

మూడు విభిన్న పాత్రల్లో ప్రభాస్ !


నేషనల్ స్టార్ గా వచ్చిన గుర్తింపును నిలబెట్టుకోవడం అంత సామాన్యమైన విషయం కాదు. ముఖ్యంగా సినిమాల ప్లానింగ్ లో పర్ఫెక్ట్ జడ్జ్ మెంట్ ఉండాలి. ఒకే కథను అన్ని భాషల ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించగలగాలి. అయితే ప్రభాస్ ప్రస్తుతం అలా ఆలోచిస్తున్నాడా ? సాహో విషయంలో జరిగిన నష్టాన్ని తరువాత సినిమాలతో పూడ్చుకోవాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో కొత్తగా ఒప్పుకున్న సినిమానే నాగ్ అశ్వన్ ది. ఈ సినిమా కథ విషయంలో ఒక ఇంట్రస్టింగ్ థింక్ ఒకటి తెలిసింది. సినిమా నేపథ్యం మొత్తం ఓ దీవిలో జరుగుతుందట. అలాగే నేటి సమాజం తాలూకు సీన్స్ కూడా ఓ రేంజ్ లో ఉంటాయట. ఓ పురాణ కథ ఆధారంగా రాసుకున్న కథలో ప్రభాస్ మూడు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడని తెలుస్తోంది. అంటే.. అన్ని భాషల వారికి నచ్చే అంశాల ఆధారంగా సినిమా నడుస్తోందట. నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి సంబంధించిన మొత్తం స్క్రిప్ట్ ను ఇప్పటికే పూర్తి చేశాడు.

1962 దొంగ దెబ్బ మళ్ళీ తగలనుందా?

ప్రస్తుతం రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నాడు. ఇక అశ్విన్ ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ ను కూడా ఆల్ మోస్ట్ ఫినిష్ చేశాడు. అయితే మొదట ఈ సినిమా షూటింగ్ ను ఈ ఏడాది చివరిలో సెట్స్ పైకి తీసుకువెళ్లాలని చూసినా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. ఒక విధంగా కరోనాకి వ్యాక్సన్ వచ్చే దాకా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. భారీ సీన్స్ తీసే క్రమంలో వందల మంది జూనియర్ ఆర్టిస్ట్ లు కావాలి. సో.. కరోనా కాలంలో అది సాధ్యం కాదు. అందుకే వచ్చే ఏడాది సమ్మర్ తరువాత షూట్ ప్లాన్ చేస్తున్నారు.

ఇదా అంబేద్కర్ కి ఇచ్చే గౌరవం?

అన్నట్టు ఈ సినిమాని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని మేకర్స్.. మొత్తం సాంకేతిక బృందాన్ని కూడా హాలీవుడ్ లోని ప్రముఖులనే తీసుకుంటుంది. సినిమా అన్ని ప్రధాన భాషల్లో విడుదల అవుతుంది కాబట్టి అవుట్ ఫుట్ విషయంలో పూర్తి విశ్వసనీయత కనబర్చాలని మేకర్స్ తాపత్రయ పడుతున్నారు. సినిమాలోని కీలక పాత్రల్లో కొంతమంది బాలీవుడ్ స్టార్స్ ను కూడా తీసుకోనున్నారు. ఏమైనా ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించిన నాగ్ అశ్విన్ పై ప్రభాస్ బాగానే ఆశలు పెట్టుకున్నాడు. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ఈ సినిమాని భారీగా నిర్మించనున్నారు.

ఇదా అంబేద్కర్ కి ఇచ్చే గౌరవం?

Ambedkar

 

Ambedkar

ఆధునిక భారతదేశ పితామహుడు, ఆర్కిటెక్షర్‌ ఆఫ్‌ ఇండియా,నవభారత రాజ్యాంగ నిర్మాత , డా॥ బాబా సాహేబ్‌ అంబేడ్కర్‌ ఇంటి ( రాజగృహం) పై గుర్తు తెలియని దుండగులు మంగళవారం సాయంత్రం దాడి చేశారు. ఇలా దాడి చేయడం ముమ్మాటికీ మనువాద ముస్కరుల ఉన్మాదానికి పరాకాష్ట అని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఈ దుశ్చర్యలో భాగంగా ఇంట్లో ఉన్న మొక్కల కుండీలను ధ్వంసం చేశారు. ఇంటి వద్ద ఉన్న సిసి టివి లను కూడా ధ్వంసం చేశారు. అద్దాలను కూడా పగుల గొట్టారు. రాజ్‌ గ్రుహ్ డా. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ నివాసం. ఈ ఇంటిని బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకాల కోసం నిర్మించారు. ప్రపంచం నలుమూలల నుండి అంబేద్కర్ అనుచరులు రోజూ ఇక్కడకు వస్తారు. ఇది అంత ముఖ్యమైన ప్రదేశం. అంబేద్కర్ అనుచరులకు ఇది అత్యంత గౌరవనీయ భవనం . ఈ ఘటనకు  ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పాలపడి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.  ఈ ఘటన గురించి  అంబేద్కర్  కుటుంబ సభ్యులు పోలీసులకు  ఫిర్యాదు చేశారు.  దీంతో రంగంలో దిగిన పోలీసులు దుండగుల కోసం వేట మొదలు పెట్టారు.

అంబేద్కర్  ఇంటిపై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చెయ్యాలని, ఈ దేశాన్ని ఎలా రక్షించాలో మార్గం చూపిన మహాను బావుని ఇంటి మీద దాడి జరిగితే ఇది దేశం మీద దాడిగా భావించి ఆధుర్మార్గులను చట్ట పరంగా శిక్షించాలాని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

బీజేపీలో ‘బండి’ టీమ్.. ఇక దూకుడేనా?


2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలిచి సింగిల్ గా అధికారంలోకి వచ్చింది. దీంతో మోడీ సర్కార్ రెండోసారి ఢిల్లీలో కొలువుదీరింది. ఇక తెలంగాణలో అంతగా బలంగాలేని బీజేపీ కిందటి ఎన్నికల్లో ఏకంగా నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలుపొంది సత్తాచాటింది. కరీంనగర్ నుంచి బండి సంజయ్ కుమార్, సికింద్రాబాద్ నుంచి జి.కిషన్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావు, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ గెలుపొందారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం, తెలంగాణలో పార్టీ బలపడే అవకాశాలు మొండుగా ఉండటంతో ఆ దిశతో బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోంది.

1962 దొంగ దెబ్బ మళ్ళీ తగలనుందా?

కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక తెలంగాణలో పార్టీ అధ్యక్షుడిని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను ఎన్నుకున్నారు. ఆయన పదవీ చేపట్టి దాదాపు వంద రోజులు పూర్తి కావస్తోంది. పార్టీలో తన కంటూ ఓ ప్రత్యేక టీం ఏర్పాటు చేసుకొని రాష్ట్ర రాజకీయాల్లోకి దూసుకెళుతారని భావించారు. అయితే ఇప్పటివరకు ఆయన బీజేపీలో కుదురుకునేందుకు అవకాశం లేకపోయింది. దీంతో ఆయన తనకంటూ ప్రత్యేక టీం ఏర్పాటు చేసుకోలేకపోయారు. తాజాగా తనకంటూ ఓ టీమ్ ఏర్పాటు చేసుకునేలా పార్టీలో మార్పులు చేస్తున్నట్లు సమాచారం.

ఈమేరకు రాష్ట్ర కమిటీల్లో తన మార్క్ చూపించాలని అనుకుంటున్నారట. అందుకనుగుణంగా పార్టీలోని కమిటీలను ప్రక్షాళన చేసేందుకు బండి సంజయ్ రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈపాటికే పార్టీ పెద్దల‌తోపాటు సంఘ్ పరివారంతో చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర కోర్ కమిటితోపాటు పార్టీకి అనుబంధంగా పని చేస్తున్న యువ మోర్చా, ఎస్సీ మోర్చా, ఎస్టీ మోర్చా, కిసాన్ మోర్చా, మ‌హిళా మోర్చా, ఓబీసీ మోర్చా, మైనార్టీ మోర్చాల నియమాకాల్లో కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నారట. పాతనేత‌ల‌తోపాటు పార్టీలోకి కొత్తగా వ‌చ్చినవారికి సముచిత స్థానం ఇవ్వనున్నారట.

నిమ్మగడ్డ కేసులో ప్రభుత్వ వాదనలకు ‘సుప్రీం’ అభ్యతరం..!

ఈ నియమకాల్లో తన మార్క్ ఉండేలా చూసుకొని తనకంటూ ఓ టీమ్ తో ముందుకెళ్లాలని బండి సంజయ్ భావిస్తున్నారని టాక్ విన్పిస్తుంది. వీలైనంత త్వరగా కమిటీ నియమకాలు చేపట్టి తెలంగాణలో బీజేపీని మరింత పటిష్టం చేయాలని బండి సంజయ్ భావిస్తున్నారు. అయితే తెలంగాణలో కరోనా విపత్కర పరిస్థితుల దృష్ట్యా పార్టీ కమిటీల ప్రక్షాళన ఇప్పట్లో చేస్తారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో కమలం పార్టీలో బండి సంజయ్ ప్రత్యేక టీం ఎప్పటిలోగా రెడీ అవుతుందోననే ఆసక్తి నెలకొంది.

సినీ పరిశ్రమలకు అత్యంత చేదు సంవత్సరం !


సినీ పరిశ్రమలకు 2020 అత్యంత చేదు సంవత్సరంగా మిగిలిపోనుందా.. ? సినిమా పుట్టిన దగ్గర నుండి ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ ఎదురుకున్న దాఖలాలు లేవు. మొదటిసారి ఇలాంటి క్లిష్ట పరిస్థితులను ఎలా ఫేస్ చేయాలో.. ఈ కష్ట కాలాన్ని ఎలా నెట్టుకురావాలో అర్ధం కాక సినీ పెద్దలే చేతులెత్తేశారు. సినిమాని నమ్ముకుని బతుకుతున్న బతుకులకు ఇక భరోసా లేనట్లే. సినిమాలు ఎప్పుడూ రిలీజ్ అవుతాయో తెలీదు. కానీ అందరి ఆశ మాత్రం దసరానే. కరోనా మహమ్మారి సమ్మర్ ని మింగేసి.. సమ్మర్ లో రావాల్సిన సినిమాలను అయోమయంలో పడేసింది. అయితే సమ్మర్ సీజన్ పోయినా.. మరో రెండు నెలలు కష్టాలు పడినా.. మళ్లీ మంచి రోజులు వస్తాయని సినీ కార్మికులు ఇన్నాళ్లు ఆశతో బతికారు.

1962 దొంగ దెబ్బ మళ్ళీ తగలనుందా?

వారి ఆశకి ఒక కారణం ఉంది, సమ్మర్ సీజన్ తరువాత ముఖ్యమైన సీజన్ అంటే దసరానే. విజయదశమి సెలవుల్ని టార్గెట్ చేసుకుని సినిమాలను రిలీజ్ చేయడం, కొత్త సినిమాలను మొదలుపెట్టడం సినిమా ఇండస్ట్రీకి ఆనవాయితీగా వస్తోంది. మరి ఈ సారి ఆ ఆనవాయితీ గతి కూడా తప్పబోతుందా అనే భయం కలుగుతుంది. కష్టాల్లో మునిగిపోయిన సినీ జనానికి.. దసరా సీజన్ పై కూడా నమ్మకం పోతుంది. ఫోన్ ఆన్ చేస్తే చాలు… ఈ రోజు ఇన్ని వందల కేసులు.. ఆ హాస్పటల్ లో బెడ్ లు లేవు, ఆ ప్రభుత్వం కరోనాని పట్టించుకోకుండా ప్రజలకే వదిలేసింది లాంటి మెసేజ్ లు రెగ్యులర్ గా చూసాక కూడా ఇక హోప్స్ ఏమి ఉంటాయి.

నిమ్మగడ్డ కేసులో ప్రభుత్వ వాదనలకు ‘సుప్రీం’ అభ్యతరం..!

మరి ఇప్పుడు పరిస్థితి ఏమిటి.. ? ఏ రంగంలోని కార్మికులకైనా ఏదొక ఆల్టర్నేటివ్ ఉంటుంది. ఒక్క సినిమా రంగంలోని వారికే.. సినిమా గురించి తప్ప మరోదాని గురించి తెలీదు. స్టార్ హీరోలు కొంతవరకూ సీసీసీ అని పెట్టి ఆదుకున్నా.. ఇంకా ఆదుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత చాలా ఉంది. పైగా వచ్చే దసరా సీజన్ కూడా కరోనా దెబ్బకు సైడ్ అయిపోతే.. టాలీవుడ్ భారీ సంక్షోభానికి పునాదిగా మారిపోతుంది. మరి దసరా సీజన్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలని కోరుకుందాం. కానీ వాస్తవ పరిస్థితులు సరిచూసుకుంటే అక్టోబర్ నాటికి కరోనా ప్రభావం పూర్తిగా తగ్గేలా లేదు.

పాపం.. బోయపాటికి ఆప్షన్ లేకపాయే !


కరోనా బోయపాటికి కొత్త తలనెప్పి తెచ్చి పెట్టింది. లాక్ డౌన్ కారణంగా బోలెడు ఖాళీ సమయం దొరకడం.. దాంతో ఏమి చేయాలో తెలియక బాలయ్య ప్రస్తుతం చేస్తోన్న సినిమా కథ గురించి ఆలోచనలు చేయడం.. మరి బాలయ్య ఆలోచనలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పాలా.. ఇప్పుడు అదే పెద్ద సమస్య అయిపోయింది బోయపాటికి. అసలుకే బాలయ్యకి నచ్చింది నచ్చలేదు అని చెబితేనే.. బాలయ్యలోని యాక్షన్ చూడాల్సి వస్తోంది. పోనీ, బాలయ్య చెప్పిందల్లా తీసుకుంటూ పోతే.. మరో వినయ రామ అంటూ.. భారీ డిజాస్టర్ తీయాల్సి వస్తోంది. మరి ఏమి చేయాలి ? అందుకే బాలయ్య ఆలోచనల మేరకు బోయపాటి కథలో మార్పులు చేసుకుంటూ.. ఆ విధంగా ముందుకు పోతున్నాడు. కాగా తాజాగా స్క్రిప్ట్ లో చేసిన కొత్త మార్పులను బాలయ్య చెప్పిన ప్రకారమే చేసి బాలయ్యకి వినిపించారట.

1962 దొంగ దెబ్బ మళ్ళీ తగలనుందా?

అయితే బాలయ్య మాత్రం లేటెస్ట్ వర్షన్ పై ఎలాంటి కామెంట్లు చేయలేదని.. అసలు బాగుందా.. బాగాలేదా.. అనేది కూడా బాలయ్య చెప్పలేదని.. తెలుస్తోంది. పాపం బోయపాటి ‘వినయ విధేయ రామ’ హిట్ అయి ఉంటే.. ఈ పాటికి పదిహేను కోట్ల డైరెక్టర్ గా తానూ చెప్పిందే శాసనం అనేవాడు. కానీ ప్లాప్ దెబ్బకు బోయపాటికి అప్షన్ లేకుండా పోయింది. ఇక ఈ సినిమాకి ‘మోనార్క్’ అనే టైటిల్ అనుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా బాలయ్య ఎప్పటిలాగే డబల్ యాక్షన్ చేస్తున్నాడు. ఇటీవలే విడుదల చేసిన టీజర్ నెటిజన్లను బాలయ్య అభిమానులను బాగానే ఆకట్టుకుంది.

నిమ్మగడ్డ కేసులో ప్రభుత్వ వాదనలకు ‘సుప్రీం’ అభ్యతరం..!

ఇక ఈ చిత్రం తరువాత షెడ్యూల్ హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో చేయడానికి ప్రస్తుతం సెట్స్ వేస్తున్నారు. ఈ షెడ్యూల్ లో కూడా ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో పాటు రెండు సాంగ్స్ షూట్ చేయాలని చూస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన అమలాపాల్ అండ్ ఓ కొత్త హీరోయిన్ హీరోయిన్లుగా నటించనున్నారని తెలుస్తోంది. తరువాత షెడ్యూల్ లో తీయబోయే సాంగ్స్ కూడా అమలాపాల్ – బాలయ్య మీద తీస్తారట. అలాగే ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్ సెకండ్ విల‌న్‌ గా న‌టించ‌బోతున్నాడని.. శ్రీకాంత్ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉండబోతుందని తెలుస్తోంది. మరి బోయపాటి ఈసారి కూడా బాలయ్యకు సూపర్ హిట్ ఇస్తాడా.. అన్నట్టు నిర్మాత మిర్యాల రవీందర్‌ రెడ్డి ద్వారక క్రియేషన్స్‌ పతాకం పై ఖర్చుకు ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.

అర్ధరాత్రి ఆ హోమం కేసీఆర్ ఎందుకు చేయించారు?


ఎంతో చరిత్ర కలిగిన తెలంగాణ సెక్రటేరియట్ కాలగర్భంలో కలిసిపోబోతోంది. వాస్తు సరిగా లేదని కేసీఆర్ ఈ పురాతన, కొత్త భవనాలను కూడా కూల్చివేయిస్తున్నారు. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం అర్థరాత్రే పనులు మొదలుపెట్టారు. సచివాలయం కూల్చివేత ఇప్పటికే ప్రారంభమైంది. కొద్దిరోజుల్లోనే మొత్తం నిర్మాణం శిథిలావస్థకు చేరుకుంటుంది.

1962 దొంగ దెబ్బ మళ్ళీ తగలనుందా?

అయితే ఈ సచివాలయం కూల్చివేతకు ముందు చాలా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. రహస్యంగా సాగాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం సచివాలయం కూల్చివేతను మొదలుపెట్టడాన్ని చాలా రహస్యంగా ఉంచింది. ఇది కొద్దిమంది సీనియర్ అధికారులకు మాత్రమే తెలుసునట.. కూల్చివేతపై నిర్ణయం తీసుకునే స్థలంలో ఆ ఉన్నతాధికారులంతా సైలెంట్ గా ఉండి ఈ పనులు దగ్గరుండి కానిచ్చేశారట..

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డిలు అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి  4 గంటల వరకు సచివాలయంలో ఉండి ఈ మంత్రాంగం నడిపారని తెలిసింది. ఈ క్రమంలోనే కొన్ని కార్యక్రమాలను సైలెంట్ గా నిర్వహించారు.

సచివాలయాన్ని కూల్చివేసే ముందు అందులోని నల్లపోచమ్మ గుడితోపాటు.. మసీదును కూల్చాల్సిన అనివార్యపరిస్థితులు నెలకొన్నాయి. ఇది సెంటిమెంట్ రాజేసే అంశం కావడంతో ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. ఈ క్రమంలోనే రహదారులన్నీ బంద్ చేసి.. రాకపోకలు నిలిపివేసి అర్ధరాత్రి డీజీపీ, సీఎస్ దగ్గరుండి మరీ నల్లపోచమ్మ టెంపుల్లో పెద్ద ఎత్తున హోమం నిర్వహించి ఆలయంలోని మూలవిరాట్టును అక్కడి నుంచి తరలించారట.. ఇక ముస్లిం మత పెద్దలను పిలిపించి మసీదులోని మత గ్రంథాల్ని అప్పగించి కూలగొట్టించారట.. తెల్లవారుజామున 4 గంటల వరకు రాష్ట్ర సీఎస్, రాష్ట్ర డీజీపీ స్వయంగా ఈ సచివాలయం వద్దనే ఉండి మీడియాకు, స్థానికులకు ప్రవేశం లేకుండా ఈ తంతును రాత్రి 12 గంటలకు మొదలుపెట్టి ఉదయం 4 వరకు పూర్తి చేశారట..

నిమ్మగడ్డ కేసులో ప్రభుత్వ వాదనలకు ‘సుప్రీం’ అభ్యతరం..!

మరీ ముఖ్యంగా రహస్యంగా కూల్చివేతలు, ప్రార్థనాలయాలు కూల్చివేతల వెనుక సీఎం కేసీఆర్ ఆదేశాలే కారణమని తెలుస్తోంది. హిందూ, ముస్లింల ఆలయాలు కావడంతో చాలా మంది వీటిని తీయనీయకుండా గొడవ చేస్తారు. అటు బీజేపీ, ఇటు ఎంఐఎం ముస్లింలతో గొడవలకు దారితీసే ప్రమాదం ఉంది. నల్లపోచమ్మ ఆలయం సీఎం గదికి చాలా దగ్గరలో ఉంటుంది. అందుకే అందరూ నిద్రపోయాక రాత్రి హోమం ప్రారంభించి కొద్దిమంది అధికారులు మాత్రమే అక్కడ ఉండి ఈ పనులు పూర్తి చేశారట.

తెల్లవారుజామన ఈ పనులు చేస్తే మీడియా అలెర్ట్ తక్కువగా ఉంటుంది. పైగా ప్రింట్ మీడియా 12 గంటలకే క్లోజ్ అవుతుంది. సో వార్త వచ్చేసరికి మరుసటి రోజు అవుతుంది. ఇలా అందరూ నిద్రపోయిన వేళ రహస్యంగా సచివాలయంలోని నల్లపోచమ్మ ఆలయం, మసీదును పూజలు చేసి కూల్చివేయించారట కేసీఆర్. కొత్త సచివాలయానికి అడ్డు రాకుండా ఈ ప్లాన్ చేశారట..

తెల్లవారేసరికి ప్రతిపక్షాలు, మీడియా నిరసన తెలుపడానికి రెడీ అయ్యేలోగానే ఈ ఆలయం, మసీదు లేకుండా మొత్తం నేలమట్టమైంది ఇలా కేసీఆర్ ఎంతో చాకచక్యంగా సచివాలయం విషయంలో పట్టుదలతో ఉన్న అడ్డంకులన్నీ తొలగిస్తూ పనులు చేస్తున్న వైనం చర్చనీయాంశంగా మారింది.

ఆ జర్నలిస్ట్‌‌‌‌ చేసిన తప్పు ఇదేనా?

సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌పై తప్పు వార్త రాశారని ఓ జర్నలిస్ట్‌‌‌‌ ను జూబ్లీహిల్స్‌‌‌‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆదాబ్ హైదరాబాద్ పత్రిక ఈ-పేపర్‌‌‌‌‌‌‌‌ లో “సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు కరోనా” ,”హరితహారం కార్యక్రమంలో సోకిందా” వార్త రెండు రోజుల క్రితం పబ్లిష్‌‌‌‌ అయింది. దాని పేపర్‌‌‌‌‌‌‌‌ క్లిప్‌‌‌‌ సోషల్‌‌‌‌ మీడియాలో వైరల్‌‌‌‌ అయ్యింది. దీనిపై హైదరాబాద్‌‌‌‌ రహమత్ నగర్‌‌‌‌‌‌‌‌ కి చెందిన టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ కార్యకర్త మహ్మద్ ఇలియాస్ ఆదివారం జూబ్లీహిల్స్‌‌‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆదాబ్ హైదరాబాద్ జర్నలిస్ట్‌‌‌‌ వెంకటేశ్వరరావు, యాజమాన్యంపై ఐపీసీ 505(1)(బి), 505(2) రెడ్ విత్34 సెక్షన్లతో డిజాస్టర్ మేనేజ్‌‌‌‌మెంట్ యాక్ట్ సెక్షన్‌‌‌‌ 54 కింద కేసు నమోదు చేశారు. వెంకటేశ్వరరావు స్వస్థలం ఖమ్మం జిల్లాకు వెళ్లి ఆయన్ను అరెస్ట్‌‌‌‌ చేశారు.

ఈ మొత్తం ఉదంతంలో ఆ జర్నలిస్ట్‌‌‌‌ చేసినా తప్పును ఒక్కసారి పరిశీలిద్దాం..ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం కరోనాతో అతకుతలం అవుతుంది. ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు. కరోనా విజృంభణ తొలి రోజుల్లో కరోనా భయాన్ని ప్రజలలో పోగొట్టడానికి సీఎం కేసీఆర్ డాక్టర్ వలె ప్రజలకు సలహాలు సూచనలు చేసేవారు. కరోనా, తెలంగాణ గడ్డపై అడుగుపెట్టనే పెట్టదని సాక్షాత్తు సీఎం సారే చెప్పినప్పుడు ప్రజలు సంతోషించారు. పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటే కరోనా దరిదాపుల్లోకి రాదని రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నప్పుడు కూడా ప్రజలు చాలా ధైర్యంగా బ్రతికారు. గత 10రోజుల నుండి సీఎం సార్ కనిపించకుండా పోయారు. ప్రజాలకు ధైర్యం చెప్పేవారు లేక అల్లడిపోసాగారు. ఇది గమనించిన వెంకటేశ్వరరావు అనే జర్నలిస్ట్ సీఎం సార్ కనిపించడం లేదని ఆయన కరోనా భయంతో బయటకు రాలేకపోతున్నారేమో అని రాశారు. దీనిని కూడా తప్పుగా భావించి ఆయనను అరెస్టు చేయడం ఎంత వరకు సబబు..?

ఈ సూపర్ స్టార్లు రాష్ట్రాన్ని పాలించలేరా ?


తమిళ్ ఇండస్ట్రీలో నాలుగు దశాబ్దాలుగా సూపర్ స్టార్ లుగా వెలిగిపోతున్న ఇద్దరు స్టార్ హీరోలు రాజకీయంగా ఒకటై.. ఒకే ఏజండాతో ముందుకుపోతే.. ఆ ప్రభావం స్టేట్ మీద ఖచ్చితంగా ఉంటుందనేది ఖచ్చితత్వంతో చెపొచ్చు. పైగా గతంలో కలిసి మల్టీ స్టారర్ లు చేసిన వీరిద్దరూ, ఇప్పుడు కలిసి రాజకీయంగా ఎదిగే అవకాశాలు తమిళనాట కనిపిస్తుండటంతో.. కరోనా కాలంలో అక్కడి ప్రభుత్వం వైఫల్యం ఇప్పుడు ఈ ఇద్దరి హీరోలకు కలిసి వస్తుంది. వాళ్లే కమల్ హాసన్, రజిని కాంత్.. తమిళ వెండితెరను ఏలుతున్న ఈ హీరోలు రాష్ట్రాన్ని పాలించలేరా ? ఒకే సమయంలో హీరోగా కెరీర్ ఆరంభించిన ఈ ఇద్దరు కలిసి డజనుకు పైగా సినిమాలలో కనిపించి అలరించారు. అలా హీరోలుగా కలిసి ఎదిగిన వీరు, ఇప్పుడు రాజకీయంగా కూడా కలిసి ఎదగాలని చూస్తే తప్పు ఏమిటి ? అని తమిళ్ సోషల్ మీడియాలో ఇంట్రస్టింగ్ పోస్ట్ లు పుట్టుకొస్తున్నాయి.

నిజానికి గత కొన్ని నెలలుగా ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నా.. వాటి పై ఇన్నాళ్లు తమిళ్ మీడియా ఫోకస్ చేయలేదు. చేసినా హైలైట్ అయ్యేలా చేయలేదు. అయితే కరోనా వచ్చాక.. ప్రభుత్వం పై ప్రజల్లో ఉన్న అసంతృప్తి ఈ మధ్య ఒక్కసారిగా బయటకు వస్తోంది. దాంతో ప్రజలు అభిమానులు స్టార్ల వైపు చూస్తున్నారు. అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కరోనాకి ముందు జరిగిన కొన్ని కార్యక్రమాలలో కమల్, రజిని అనేక
సార్లు కలిశారు. పైగా కమల్ హాసన్ కి చెందిన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ నూతన భవనం ఎదురుగా వీరిద్దరి గురువుగారైన కె బాలచందర్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలోనూ.. కమల్ 60ఏళ్ల సినీ వేడుకలోనూ.. రజిని చేసిన హడావుడి పై అప్పట్లో ప్రత్యేక కథనాలు కూడా వచ్చాయి. కమల్ రజినీ బంధం గురించి అభిమానుల్లో ఉన్న అనుమానాలు కూడా తొలిగిపోయాయి. లాక్ డౌన్ పెట్టకముందు వరకూ రజిని ఇంటికి స్వయంగా కమల్ వెళ్లి రాజకీయ పరిస్థితులు గురించి చర్చలు కూడా జరిపారట.

మొత్తానికి రానున్న ఎన్నికలలో కమల్ రజినీ కలిసి పనిచేస్తే.. 2021లో తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ లో కొత్త ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అన్నిటికిమించి తమిళ ప్రధాన పార్టీలైన అన్నా డీఎంకే, డీఎంకే మునుపటిలా పటిష్టంగా లేవనేది తమిళ సోషల్ మీడియాలో వస్తోన్న వాస్తవ కథనాలు. ఇదే సరైన సమయం, కమల్, రజిని వేరువేరుగా కాకుండా సమిష్టిగా కలిసి ముందుకు వెళ్తే.. లక్ష్యాన్ని అందుకోవడం అంత కష్టమైన పని కాదనేది.. జయలలిత విజయపరంపర చూస్తే అర్ధమవుతుంది. చూడాలి మరి కమల్ రజినీ ఏమి చేస్తారో..!

2021లో జాగ్రత్త సుమీ…!

Corona cases

Corona cases

ఈ సంవత్సర ముగింపు నాటికి క‌రోనా వ్యాక్సిన్‌, ఔష‌ధాల‌పై పురోగ‌తి క‌నిపించ‌కుంటే 2021నాటికి కేసుల సంఖ్య భారీగా పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు ఎంఐటీ శాస్త్రవేత్త‌లు అంచనా వేశారు. అత్య‌ధికంగా భార‌త్‌ లో నిత్యం 2.8ల‌క్ష‌ల పాజిటివ్ కేసులు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌న్నారు. అంతేకాకుండా అమెరికాలో 95,000, ద‌క్షిణాఫ్రికాలో 21,000, ఇరాన్‌లో 17,000 కేసులు న‌మోదు కావచ్చని ప‌రిశోధ‌కుల అంచ‌నా.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాదాపు 475కోట్ల జ‌నాభా క‌లిగిన 84దేశాల‌(భార‌త్‌ తోపాటు, చైనా మిన‌హా) స‌మాచారాన్ని విశ్లేషించిన‌ట్లు ఎంఐటీ ప్రొఫెస‌ర్లు హ‌జీర్ ర‌హ్మాన్‌దాద్‌, జాన్ స్టెర్మాన్ వెల్ల‌డించారు. క‌రోనా వైర‌స్ తీవ్ర‌త‌, నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు, మ‌ర‌ణాల సంఖ్య, వ్య‌క్తిగ‌త శుభ్ర‌త‌, ఆసుప‌త్రుల సామ‌ర్థ్యం, విధాన నిర్ణ‌యాలు, సామాజిక వైఖ‌రుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని ఈ అంచ‌నాల‌కు వ‌చ్చామ‌ని తెలిపారు. ఇదిలాఉంటే, అమెరికాలో ఈ వైర‌స్ ప్ర‌భావం ప్ర‌స్తుతం బ‌య‌ట‌ప‌డుతున్న దానికంటే ప‌దిరెట్లు ఎక్కువ‌గానే ఉండ‌వ‌చ్చ‌ని అమెరికా వ్యాధి నియంత్ర‌ణ‌, నిర్మూల‌న కేంద్రం(సీడీసీ) ఈమ‌ధ్యే వెల్ల‌డించింది.

ఇప్పటికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోటి ప‌దిల‌క్ష‌ల మందికి సోకిన ఈ మ‌హ‌మ్మారి, దాదాపు ఐదున్న‌ర ల‌క్ష‌ల మందిని పొట్ట‌న‌పెట్టుకుంది. అయితే, ఈ పాజిటివ్ కేసుల‌ సంఖ్య ప్ర‌స్తుతం న‌మోదైన దానికంటే దాదాపు 12రెట్లు ఎక్కువ‌గానే ఉండ‌వ‌చ్చ‌ని మ‌సాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(ఎంఐటీ) శాస్త్రవేత్త‌లు విశ్లేషిస్తున్నారు. అంతేకాకుండా మ‌ర‌ణాల సంఖ్య కూడా రెట్టింపు ఉండొచ్చ‌ని అంటున్నారు. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌తోపాటు మాన‌వ జీవితాల్ని ఛిన్నాభిన్నం చేస్తోన్న ఈ మ‌హ‌మ్మారిని స‌మ‌ర్థంగా క‌ట్ట‌డిచేయ‌కుంటే 2021 మార్చి నాటికి 25కోట్ల మంది ఈ వైర‌స్ బారిన‌ప‌డ‌డంతోపాటు 18ల‌క్ష‌ల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్న‌ట్లు ఎంఐటీ శాస్త్రవేత్త‌లు అంచ‌నా వేశారు.