
తెలంగాణ కరోనా మహమ్మరి పంజా విసురుతోంది. లాక్డౌన్ 3.0 సమయానికి తెలంగాణలో కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పడుతున్నాయని సీఎం కేసీఆర్ మీడియా ముఖంగా ప్రకటించారు. త్వరనే రాష్ట్రంలో కరోనా ఫ్రీగా మారుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అయితే లాక్డౌన్ సడలింపుల తర్వాత పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. కరోనా ఫ్రీ రాష్ట్రంగా అవతరిస్తుందనుకుంటే కరోనా కేసుల్లో తొలిస్థానాల్లో ఉన్న రాష్ట్రాలతో తెలంగాణ పోటీపడుతోంది. గడిచిన వారంరోజులుగా రోజుకు 1,500లకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జగన్ కు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి!
రాష్ట్రంలోని గ్రీన్ జోన్లలో సైతం కరోనా కేసులు భారీగా నమోదవుతుండటంతో ప్రజలంతా బయటికి రావాలంటేనే జంకుతున్నారు. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో కేసుల సంఖ్య ప్రతీరోజు వేలల్లో నమోదవుతుండటంతో నగరవాసులంతా ఆందోళన చెందుతున్నారు. దీంతో ప్రభుత్వం కరోనా విషయంలో చేతులెత్తేసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని పలు మార్కెట్లను వ్యాపార సంఘాల ఆధ్వర్యంలో స్వచ్చంధంగా బంద్ పాటిస్తున్నారు. నగరంలో కరోనా విజృంభిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. వీరిబాటలోని పలు వ్యాపార సంఘాలు స్వచ్ఛంధంగా లాక్డౌన్ పాటిస్తున్నారు.
మరోవైపు ప్రభుత్వ కార్యాయాల్లోనూ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వ సిబ్బంది కరోనా బారిన పడుతుండటంతో ప్రజలెవరూ కార్యాయాలకు రావొద్దని కోరుతున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ కార్యాలయంలోకి ప్రజలను అనుమతించడం లేదని ఏవైనా ఫిర్యాదులుంటే ఆన్ లైన్లో ఫిర్యాదు చేయాలని స్పష్టం చేశారు. ఇటీవల సీఎం అధికార కార్యాలయం ప్రగతిభవన్లో 30కిపైగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కలకలం మొదలైంది. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై వారందరినీ హోంక్వారంటైన్ కి తరలించింది. అయితే ఈ సమయంలో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో లేరని ఎర్రవెల్లిలోని తన ఫౌంహౌజ్ లో ఉన్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
అదేవిధంగా తెలంగాణ హైకోర్టు ఉన్న ప్రాంతంలో కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదవుతుండటంతో లాయర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హైకోర్టులో విధులు నిర్వహించే 25మంది సిబ్బందికి పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. దీంతో రేపటి నుంచి హైకోర్టు మూసివేసేందుకు న్యాయమూర్తులు నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు పరిసరాలను పూర్తిగా శానిటైజ్ చేయాలని సంబంధిత సిబ్బందికి ఆదేశాలిచ్చారు. ఈమేరకు హైకోర్టులోని ఫైళ్లను జ్యూడీషియల్ అకాడమీకి తరలించే ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమయంలో కేవలం ప్రధాన కేసులను మాత్రమే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని హైకోర్టు నిర్ణయించింది.
ఆ విధంగా జగన్ పై పవన్ గెలిచాడట..!
ఇదిలా ఉంటే రాష్ట్రంలో కేసులు సంఖ్య పెరుగుతున్నవేళ సీఎం కేసీఆర్ ఫౌంహౌజ్ లో ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతోన్నాయి. సీఎం కేసీఆర్ ఫౌంహౌజ్ లో ఎందుకున్నారనే చర్చ నడుస్తుంది. సీఎం ఆరోగ్య స్థితిపై ప్రభుత్వం వివరాలను వెల్లడించాలని తీన్నార్ మల్లన్న హైకోర్టులో మాండమస్ పిటిషన్ దాఖలు చేశారు. అదేవిధంగా సీఎం ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని ప్రతిపక్షాలు సైతం డిమాండ్ చేస్తున్నాయి.
ఈనేపథ్యంలోనే గవర్నర్ తమిళిసై స్వయంగా రంగంలోకి దిగి కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. కరోనాపై ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు అందుతున్న వేళ గవర్నర్ వరుసగా సమీక్షలు చేపట్టారు. ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి వారికి తగు సూచనలు చేశారు. కరోనా మహ్మమరి గీతదాటితే వేటు వేసేందుకు సిద్ధంగా ఉండటంతో ప్రజలంతా ఇంటి నుంచి బయటికి రావాలంటే జంకుతున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో కరోనా మహ్మమరి వదిలేలా కన్పించడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నాయి. ఎవరికీ వారు స్వీయ నియంత్రణ పాటిస్తూ వైరస్ బారి నుంచి రక్షించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.