Home Blog Page 8411

‘నిశ్శబ్దం’ విడుదల పై ఇంకెన్నాళ్ళు నిశ్శబ్దం ?

Nishabdham Release Date

Nishabdham Release Date

స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో సస్పెన్స్ థ్రిల్లర్ గా రానున్న ‘నిశ్శబ్దం’ సినిమా నిజానికి గత ఏడాదే రిలీజ్ కావాలి. కానీ, జనవరి లాస్ట్ వీక్ కి పోస్ట్ ఫోన్ అయింది. ఆ తరువాత నిర్మాత కోన వెంకట్ కు, ఓ ఛానల్ కు మధ్య సాగిన ఆర్ధిక లావాదేవీల గందరగోళంలో.. పాపం ‘నిశ్శబ్దం’ నిశ్శబ్దంగానే విడుదలకు నోచుకోకుండా, ఏదో అడ్రెస్ లేని వారి సినిమాలగా ల్యాబ్ లోనే మిగిలిపోయింది. సరే, పోనీ ఇప్పుడైనా ఒటిటిలోనైనా రిలీజ్ అవుతుందా అంటే.. మేకర్స్ మాత్రం థియేటర్స్ లోనే తమ సినిమా అంటూ కాలక్షేపం చేస్తున్నారు.

మరి ‘నిశ్శబ్దం’కు థియేటర్ల మోత ఎప్పుడూ తగులుతుందో అనుష్క అభిమానులకు ఎప్పుడు ఈ సినిమాని చూసే అవకాశం దక్కుతుందో చూడాలి. ఇక యంగ్ డైరెక్టర్ హేమంత్ మధుకర్ డైరెక్షన్ లో వస్తోన్న ఈ సినిమాలో మంచి ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ తో పాటు అనుష్క, మాధవన్ ల మధ్య నడిచే సస్పెన్స్ ట్రాక్ కూడా ఓ రేంజ్ లో ఉంటుందట. మొత్తం క్యారెక్టర్స్ యొక్క యాక్టివిటీస్ అండ్ హారర్ ఎఫెక్ట్స్ ను సినిమాలో బాగా ఎస్టాబ్లిష్మెంట్స్ చేయడం, పైగా అనుష్క ఆర్ట్ లవర్ గా కనిపించడంతో ఈ సినిమా పై ఆసక్తిని పెంచింది.

అన్నట్టు ఓ మర్డర్ చుట్టూ తిరిగే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో మర్డర్ చేసింది ఎవరనే కోణంలో సినిమా సాగుతూ మంచి ఎమోషనల్ కంటెంట్ తో కనెక్ట్ అయ్యే విధంగా ఈ సినిమా ఉంటుందట. పైగా అనుష్క పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయని… ముఖ్యంగా సినిమాలో అనుష్కది నెగిటివ్ క్యారెక్టర్ అని, అయితే చివర్లో పాజిటివ్ గా మారుతుందని తెలుస్తోంది. మరి ‘భాగమతి’గా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్న అనుష్క.. ‘నిశ్శబ్దం’తో కూడా నిశ్శబ్దంగా హిట్ కొడుతుందేమో చూడాలి.

‘రాజధాని’ విషయంలో 17 తరువాత ఏం జరుగుతోంది..?

All in Hand for AP Cabinet Meeting

All in Hand for AP Cabinet Meeting
రాష్ట్ర కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ నగరాన్ని ఎంపిక చేసిన వైసిపి ప్రభుత్వానికి ఇప్పుడు ఆ దిశగా అవకాశం వచ్చినట్లు భావిస్తున్నారు. ఇన్నాళ్లు చట్టపరమైన సమస్యలతో రాజధాని తరలింపు సాధ్యం కాకపోవడంతో ప్రభుత్వం ఇరుకున పడింది. తరలింపునకు రెండు ముహుర్తాలను నిర్ణయించి వాయిదా వేసింది. త్వరలో ఆ పరిస్థితి నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నెల 17 అనంతరం పాలనా వికేంద్రీకరణ బిల్లు, సిఆర్డీఎ రద్దు బిల్లు సాంకేతికంగా మండలిలో ఆమోదించినట్లేననేది ఈ వాదన వెనక ఉన్న అసలు విషయం. జూన్ నెలలో జరిగిన శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ, సిఆర్డీఎ రద్దు బిల్లును మండలికి 17వ తేదీన రెండవ సారి పంపించింది. టిడిపి ఈ వ్యవహారంపై అభ్యంతరం చెప్పడంతోపాటు మండలిలో చర్చ జరగకుండా మండలిని నిరవధిక వాయిదా పడే విధంగా చేశారు. ఈ సందర్భంగా మంత్రులు, టిడిపి ఎమ్మెల్సీల మధ్య తోపులాట జరిగింది.

ఏపీ కేబినెట్ విస్తరణకు తేదీ ఖరారు..ఏపీ కేబినెట్ విస్తరణకు తేదీ ఖరారు..

ప్రభుత్వం ఏ బిల్లును అయినా రెండవ సారి మండలికి పంపినప్పడు అది చర్చ జరిగినా, జరగకపోయినా, తిరస్కరించినా, సవరణకు ప్రతిపాధించినా 30 రోజుల అనంతరం ఆమోదించినట్లుగా భావించే అవకాశం ఉండటం ప్రభుత్వానికి కలిసి వచ్చింది. మొదటి సారి బిల్లు పంపితే దానిపై ఆమోదం తెలపకుండా, ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే 14 రోజుల అనంతరం ఆమోదించినట్లుగా భావించేందుకు అవకాశం ఉంది. ఇటీవల ద్రవ్య వినిమయ బిల్లును అదే విధంగా ఆమోదం పొందినట్లు భావించడంతో కొంత ఆలస్యంగా ఈ నెల జీతాలను ప్రభుత్వం చెల్లించగలిగింది. ఇదే తరహాలో రెండవ సారి మండలికి వెళ్లిన బిల్లుపై మండలిలో ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే 30 రోజుల అనంతరం ఆమోదం పోందినట్లుగా భావించే వెసులుబాటు ఉండటంతో ఈ రెండు బిల్లులు ఈ నెల 17 తరువాత ఆమోదం పొందే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

ఈ రెండు బిల్లులకు ఆమోదం లభిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని తరలింపునకు ఉన్న ఏకైక అవరోదం తొలగిపోయినట్లే. రాజధాని తరలింపు అక్కడి రైతులు హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ పై విచారాణ జరిగిన సందర్భంగా పాలనా వికేంద్రీకరణ, సిఆర్డీఎ రద్దు బిల్లులు ఆమోదం పొందేవరకూ రాజధానిని తరలించేది లేదని ప్రభుత్వం హైకోర్టు ధర్మాసనానికి స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వం బిల్లులు ఆమోదించే వరకూ రాజధానికి తరలించే అవకాశం లేదు. ఇప్పడు బిల్లులు ఆమోదం పొందితే ప్రభుత్వానికి చట్టపరంగా ఎటువంటి సమస్య ఉండదు.

రాజధాని తరలింపును ఎట్టిపరిస్థితుల్లోను అడ్డుకుని తీరుతామని స్పష్టం చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఆ దిశగా ముందుకు వెళుతుంది. చట్ట పరంగా అవకాశం లేకపోతే న్యాయపరంగానైనా అడ్డుకోవాలని భావిస్తోంది. దీంతో టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఇప్పటికే పాలనా వికేంద్రీకరణ, సిఆర్డీఎ రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని ఛైర్మెన్ ఆదేశాలను మండలి కార్యదర్శి పాటించడం లేదని హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు విచారణ ప్రారంభించగా ఇరువర్గాలు వారి వాధనలు వినిపించాయి. అయితే హై కోర్టులో విచారణ పూర్తి కాలేదు. ఈ కేసు విచారణలో జాప్యం జరిగే అవకాశం ఉందని భావించిన టిడిపి ఎమ్మెల్సీ సుప్రీం కోర్టులను మరో పిటీషన్ దాఖలు చేశారు.

టీడీపీ బలాన్ని దెబ్బకొడుతున్న జగన్.

మరోవైపు రాజధాని తరలింపు అధికారికంగా జరగకపోయినా అవసరమైన ఏర్పాట్లు చాపకింద నీరులా జరిగిపోతున్నాయి. ఈ రోజు కాపకోతే రేపు అయినా రాజధాని తరలింపు తప్పదని తెలిసిన అధికారులు అందుకు అవసరమైన ఏర్పట్లు చేసుకుపోతున్నారు. సిఎంఓకు చెందిన కొంత పర్నీచర్ విశాఖ గేహౌండ్స్ కార్యాలయానికి గతంలోనే తరలించారు. కొద్ది రోజుల కిందట విశాఖ సముద్ర తీరంలో సచివాలయం, సిఎంఓ కార్యాలయాల నిర్మాణానికి అనువైన భూములను సిఎంఓ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ అర్కియాలజీ నిపుణులతో కలిసి పరిశీలించారు. వాస్తవానికి విజయదశమి రాజధాని తరలింపునకు ముహూర్తంగా విశాఖ స్వామీజీ నిర్ణయించారని కొద్ది రోజుల కిందట వార్తలు వచ్చాయి. గతంలో రెండు మూహూర్తాలు కరోనా వల్ల వాయిదా పడటంతో ఈ సారి దసరా పర్వదినమైన విజయదశమిని నిర్ణయించారు. ప్రస్తతం పాలనా వికేంద్రీకరణ, సిఆర్డీఎ రద్దు బిల్లు ఆమోదం పొందినా రాజధాని విశాఖలో ఈ ముహుర్తానికే తరలించే అవకాశం ఉంది.

కరోనా కట్టడిలో జగన్ మరో విప్లవాత్మక నిర్ణయం.

Mobile Corona Testing

Mobile Corona Testing
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా నిర్వహణలో గొప్ప చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పదకొండు లక్షలకు పైగా కరోనా టెస్టులు నిర్వహించి దేశంలోనే రెండవ స్థానంలో నిలిచారు. ఇక వెయ్యికి పైగా అంబులెన్సులు అత్యాధునిక సౌకర్యాలతో ప్రజలకు అందుబాటులోకి తెచ్చి జాతీయ స్థాయిలో ఫేమస్ అయ్యారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే కొరోనాను కట్టడి చేయడంలో జగన్ ప్రభుత్వం చాలా ముందుంది.ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భారీగా నిధులు కేటాయిస్తూ జగన్ ప్రజారోగ్యం పట్ల తన చిత్తశుద్ధి చాటుకుంటున్నారు. లాక్ డౌన్ సడలింపుల కారణంగా ఎంత తీవ్ర కృషి చేసినా వైరస్ అదుపులోకి రావడం లేదు.

టీడీపీ బలాన్ని దెబ్బకొడుతున్న జగన్.

కాగా ఈ మహమ్మారిని అరికట్టడంలో భాగంగా జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన 20 మొబైల్ కరోనా టెస్టింగ్ యూనిట్లను ప్రారంభించనున్నారు. కరోనా కేసులు నమోదైన ప్రాంతాలలో ఈ కరోనా టెస్టింగ్ వాహనాలు చేరుకొని టెస్టులు నిర్వహించనున్నాయి. అత్యాధునిక టెస్టింగ్ పరికరాలతో కూడిన ఈ వాహనాలు ప్రజల వద్దకే పోయి..కరోనా ప్రభావిత ప్రాంతాలలో టెస్టులు నిర్వహిస్తాయీ. కరోనా సోకిన వ్యక్తిని గుర్తించే సరికే, జరగాల్సిన నష్టం జరిగిపోతున్న క్రమమంలో జగన్ ఈ మొబైల్ కరోనా టెస్టింగ్ యూనిట్స్ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఒకే సారి పది మందికి కరోనా టెస్టులు నిర్వహించగలిగిన సామర్ధ్యం ఈ వాహనాలలో పొందుపరిచారు. అలాగే శాంపిల్ సేకరించిన 3-4 గంటల వ్యవధిలో ఫలితాలు తెలిసేలా సాంకేతికత ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొబైల్ కరోనా టెస్టింగ్ యూనిట్స్ ద్వారా చాలా వరకు కరోనాను కట్టడి చేయగలం అని అధికారులు నమ్ముతున్నారు. వీటి సంఖ్య 20 నుండి 50కి పెంచనున్నట్లు సమాచారం అందుతుంది. రెడ్ మరియు కంటైన్మెంట్స్ జోన్స్ లో ఈ మొబైల్ కరోనా టెస్టింగ్ యూనిట్స్ విరివిగా పరీక్షలు నిర్వహించనున్నాయి.

జగన్ పై తగ్గిన పవన్ విమర్శలు జోరు…కారణం?

ఇక గడచిన 24గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో 1933 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందినవారు 1914కాగా, ఇతర రాష్ట్రాలవారు 18, ఒకరు విదేశాల నుండి వచ్చారు. ఇప్పటి వరకు ఏపీలో రికార్డు స్థాయిలో 11,53,849 కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 నాలుగు గంటల్లో 20మంది మృత్యువాతపడ్డారు. దీనితో ఆంధ్రప్రదేశ్ లో కరోనా వలన మరించిన వారి సంఖ్య 328మందికి చేరింది.

అమితాబ్ కుటుంబానికి అలానే కరోనా వచ్చింది !

Amitabh got corona

Amitabh got corona
కరోనా మహమ్మారి దెబ్బకు బాలీవుడ్ మరింతగా భయ పడాల్సిన పరిస్థుతులు వచ్చేసాయి. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ తో పాటు అభిషేక్ బచ్చన్ కి నిన్న రాత్రి కరోనా పాజిటివ్ రావడంతో ఒక్కసారిగా భారతీయ సినీ పరిశ్రమలు ఉలిక్కిపడ్డాయి. అయితే ఈ రోజు మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ తో పాటు ఆమె కూతురు ఆరాధ్య బచ్చన్ కు కూడా కరోనా పాజిటివ్ అని రావడంతో ఐశ్వర్య రాయ్ అభిమానులతో పాటు యావత్తు భారతీయ సినీ లోకం షాక్ గురైంది.

అసలు ‘బిగ్ బీ అమితాబ్ బచ్చన్’ కుటుంబంలో కరోనా కలకలం సృష్టించడానికి కారణం ఓ యాడ్ ఫిల్మ్ తాలూకు ప్యాచ్ వర్క్ అని తెలుస్తోంది. ఆ మధ్య అమితాబ్ ఓ యాడ్ ఫిల్మ్ చేశారు. దాని బ్యాలెన్స్ వర్క్ ఉండటంతో ఇటివలె అమితాబ్ ఆయన ఇంటిలోనే షూట్ లో పాల్గోన్నారు. దాంతో ఆ షూట్ లోనే ఆయనకు కరోనా సోకి ఉంటుందని ఆయన ద్వారా మిగిలిన కుటుంబ సభ్యులకు కరోనా సోకి ఉంటుందని తెలుస్తోంది.

ప్రస్తుతం అమితాబ్, అభిషేక్ నానావతీ హాస్పిటల్ లో కరోనా ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఈ రోజు ఐశ్వర్య రాయ్ మరియు ఆమె కూతురు ఆరాధ్య కూడా నానావతి ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం అందుతుంది. ఏమైనా అమితాబ్ కుటుంబం పై ఇలా కరోనా దండెత్తడం అందర్నీ దిగ్బ్రాంతికి గురిచేస్తోంది.

Also Read: ఐశ్వర్యా రాయ్‌, ఆమె కూతురుకూ కరోనా

హాలీవుడ్‌ ఆఫర్ రిజెక్ట్‌ చేసిన హాట్‌ బ్యూటీ

Disha Patani Hollywood Offer

Disha Patani Hollywood Offer

దిశా పటానీ బాలీవుడ్‌ఈ అమ్మాయి ఇప్పుడో సెన్సేషన్. చిట్టి పొట్టి బట్టలతో అందాలను ఆరబోయడంలో ఆమె స్టయిలే వేరు. తన మాజీ ప్రియుడు టైగర్ష్రాఫ్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఆమె తన జిమ్‌, వర్కౌట్‌ వీడియోలు, ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ యువత హార్ట్‌ బీట్‌ పెంచుతుంది. పలు ఈవెంట్స్‌లో హాట్‌ లుక్స్‌తో అదరగొడుతుంది. దాంతో, జాతీయ మీడియా ఆమెకు ‘నేషనల్‌ క్రష్’ అనే బిరుదిచ్చింది. ఉత్తరాఖండ్‌లో పుట్టిన ఈ అమ్మడు తెరంగేట్రం చేసింది టాలీవుడ్‌తోనే. మోడలింగ్‌ నుంచి  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్‌తేజ్‌ హీరోగా నటించిన ‘లోఫర్’ మూవీలో హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమా అనుకున్నంత సక్సెస్‌ కాకపోవడంతో బాలీవుడ్‌పై దృష్టి సారించింది. మోడల్‌గా అప్పటికే మంచి పేరు తెచ్చుకోవడంతో నీరజ్‌ పాండే దర్శకత్వంలో దివంగత సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ చిత్రం ‘ఎంఎస్‌ ధోనీ’లో నటించే చాన్స్‌ వచ్చింది. అక్కడి నుంచి ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. తర్వాత ‘కుంగ్ ఫు యోగా’, ‘భాగి 2’, ‘భారత్‌’, ‘మలాంగ్‌’, ‘భాగి 3’ ఇలా వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ఇప్పుడు అషిమా హిబ్బర్ డైరెక్షన్‌లో ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ‘కెటీనా’ అనే నాయికా ప్రధాన చిత్రంలో నటిస్తోంది. దాంతో పాటు ప్రభుదేవా డైరెక్షన్‌లో సల్మాన్‌ ఖాన్ మూవీ ‘రాధే’ కూడా చేస్తోంది.

లేట్ వయసులో పర్ఫెక్ట్ ఫిజిక్.. నెటిజన్లు స్టన్ !

ఇలా తక్కువ టైమ్‌లోనే బాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారిన దిశాను వెతుక్కుంటూ ఏకంగా హాలీవుడ్ ఆఫర్ వచ్చింది. దీనికి ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ, దిశా మాత్రం ఈ ఆఫర్ను ఈజీగా రెజెక్ట్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనికి ఆమె ఇచ్చిన సమాధానం మరింత ఆసక్తికరంగా ఉంది. ఎన్ని సినిమాలు చేశామన్నది ముఖ్యం కాదు.. ఎంత మంది పెద్ద హీరోలతో నటించామన్నదే తనకు ముఖ్యం అని అంటోందామె. ప్రస్తుతం బాలీవుడ్‌లో పెద్ద హీరోలతో నటిస్తూ బిజీగా ఉన్నానని, ఈ టైమ్‌ను హాలీవుడ్‌ సినిమాలకు కేటాయించలేనని స్పష్టం చేసింది. ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలని అంటోంది. తానేంటో బాలీవుడ్‌ నిరూపించుకోవాల్సింది చాలా ఉందని చెప్పింది. అలా కాకుండా ఇక్కడ చేతి నిండా ఉన్న పనిని వదిలేసి ఎక్కడికో వెళ్లి ఏదో సాదిద్ధాం అనుకునే రకం తాను కాదని చెప్పింది. అందుకే హాలీవుడ్‌ ఆఫర్ను తిరస్కరించానని అంటోందామె.

‘రాధేశ్యామ్‌’ రికార్డులు షురూ

తెలుగు బ్యూటీ ఎంత చూపించినా.. సరిపోవట్లేదట !

Eesha Rebba Hot Red Saree Pics

Eesha Rebba Hot Red Saree Pics

తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా సినీ కెరీర్ ఎలా సాగినా.. అమ్మడు ఫోటో షూట్ మాత్రం ఫుల్ గ్లామర్ డోస్ తో బాగానే సాగుతుంది. కరోనా భయంతో కుర్రాళ్లు కూడా దిగులుగా కూర్చుంటే.. ఈషా మాత్రం ఎరుపు రంగు చీరలో, నల్లని జాకెట్ తో సొగసరి చూపులతో, ముఖ్యంగా కైపెక్కించే ఫోజులిచ్చి నెటిజన్లకు కాస్త తన అందచందాలతో ఉపశమనం కలిగించే ప్రయత్నం చేసింది. ఈ ఉదయం ఆమె వదిలిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవతున్నాయి.

ఇక ఈషా సినిమాల పరిస్థితికి వస్తే.. అవకాశాల కోసం హద్దులు దాటడానికి కూడా తానూ సై అని బాహాటంగానే ఇంటర్వ్యూలు ఇచ్చి మరీ తన గ్లామర్ విప్లవం గురించి ఎలుగెత్తి చాటుకుంది. అయినప్పటికీ మన దర్శకులకు ముంబై భామల పై ఉన్న ఆసక్తి తెలుగింటి అందాల భామల పై లేకపాయే. దాంతో ఈ తెలుగు హస్కీ బ్యూటీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కలేదు. అసలుకే స్టార్ డమ్ కూడా లేదాయె. అందుకే చివరికీ ఈ మధ్య హాట్ స్టిల్స్ మీద పడింది. అవసరం ఉన్నా లేకపోయినా ఈషా తనలోని హాట్ నెస్ ను ఒడిసి పట్టి హాట్ స్టిల్స్ గా మార్చి సోషల్ మీడియాలో వరుసగా వదులుతుంది.

ముంబై మోడల్‌తో రొమాన్స్, సంజయ్‌ దత్‌తో ఫైటింగ్..

అయితే పాపం ఈ లైట్ బ్లాక్ బ్యూటీ ఎంత మేకప్ వేసుకుని ఒళ్ళు విరుచుకున్నా.. ముంబాయ్ గ్లామర్ బ్యూటీల హాట్ హాట్ లుక్స్ ముందు పూర్తిగా తేలిపోతున్నాయని కుర్రాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. మరి కుర్రాళ్ళును ఆట్టుకోవడానికి గ్లామర్ డోస్ రోజురోజుకు పెంచుకుంటూ పోతున్న ఈషా, ఈ సారి ముంబాయ్ భామలను బీట్ చేయాలంటే మాత్రం బికినీ రేంజ్ కి వెళ్లాల్సిందే. వెళ్తుంది కూడా. ఇక ప్రస్తుతం కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా కూడా ఈ బ్లాక్ హస్కీ భామ నటిస్తోంది.

 

 

ముంబై మోడల్‌తో రొమాన్స్, సంజయ్‌ దత్‌తో ఫైటింగ్..

Balakrishna to Romance Mumbai Models

Balakrishna to Romance Mumbai Models
మాస్‌ సినిమాలకు పెట్టింది పేరు నందమూరి బాలకృష్ణ. ఆయన సినిమా వస్తుందంటే ఫుల్‌ యాక్షన్‌ గ్యారంటీ. మాస్‌ డైలాగ్స్‌లో బాలయ్యను మించినోళ్లు లేరు. పవర్ఫుల్‌ డైలాగ్సే కాదు భావోద్వేగాలు పండించడంలోనూ ఆయన దిట్ట. దర్శకుడు బోయపాటి శ్రీను కూడా ఇంతే. మాస్‌ సినిమాల డైరెక్టర్గా ఆయన మంచి పేరు తెచ్చుకున్నాడు. హీరోయిజాన్ని ఎలివేట్‌ చేయడంతో శ్రీను ఒక మెట్టుపైనే ఉంటారు. అంతేకాదు మాస్‌ కథల్లో ఎమోషన్‌ను జతచేసి సీన్స్‌ను పండించడంలో శ్రీనుది అందవేసిన చేయి. అందుకే బాలయ్య, బోయపాటి కలిస్తే హిట్టు గ్యారంటీ. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్‌’ ఎంతటి సక్సెస్‌ సాధించాయో తెలిసిందే.

బాలయ్య హీరోయిన్‌గా అమలా పాల్‌?

అయితే కొంతకాలంగా ఈ ఇద్దరూ బ్యాడ్‌ ప్యాచ్‌లో ఉన్నారు. అటు బాలయ్య సినిమాలు, ఇటు బోయపాటి సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర బోల్తాకొట్టాయ. దాంతో, విజయమే లక్ష్యంగా ఈ ఇద్దరూ ఇప్పుడు బరిలోకి దిగుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో బీబీ3 అనే వర్కింట్‌ టైటిల్‌తో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ‘ఫస్ట్‌ రోర్’అంటూ రిలీజ్‌ చేసిన టీజర్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకోవడంతో పాటు మూవీపై అంచనాలను భారీగా పెంచేసింది. తన సెంటిమెంట్ ప్రకారం ఫైటింగ్‌తో ఈ మూవీ షూటింగ్‌ స్టార్ట్‌ చేశాడు బోయపాటి. కానీ, ఐదో రోజుల తర్వాత కరోనా కారణంగా చిత్రీకరణ ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ షూటింగ్‌ స్టార్ట్‌ చేసేందుకు యూనిట్‌ కసరత్తులు చేస్తోంది.

పాపం.. బోయపాటికి ఆప్షన్ లేకపాయే !

ఈ మూవీలో బాలయ్య రెండు షేడ్స్‌ ఉన్న పాత్రలు పోషిస్తున్నాడు. ఇద్దరు హీరోయిన్లకు చాన్స్‌ ఉందట. కానీ, వాళ్లను ఇంకా ఖరారు చేయలేదు. ఈ మధ్య చాలా పేర్లు వినిపించాయి. సింహా కాంబినేషన్‌ను రిపీట్‌ చేసేలా నయనతారను సంప్రదిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఆపై శ్రీయ పేరు వినిపించింది. తర్వాత అమలా పాల్‌ను ఖరారు చేసినట్టు టాలీవుడ్‌లో చర్చ జరిగింది. అయితే, వాళ్లెవరినీ కాకుండా కొత్త హీరోయిన్‌ను ఎంచుకోవాలని నిర్ణయానికి వచ్చినట్టు తాజా సమాచారం. ముంబైకి చెందిన ఓ మోడల్‌ను ఫైనల్‌ చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మ‌రోవైపు ఈ మూవీలో విల‌న్ పాత్ర కోసం బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ దత్‌ పేరు వినిపిస్తోంది. చిత్ర యూనిట్‌ ఇప్పటికే సంజ‌య్ ని సంప్రదించగా.. ఆయన కూడా సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. హీరోయిన్‌, విలన్‌పై చిత్ర బృందం త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నాడు.

మరో రీమేక్‌లో విశ్వక్‌ సేన్!

Vishwak Sen in Remake of Kappela

Vishwak Sen in Remake of Kappela

సినీ పరిశ్రమలో ఈ మధ్య రీమేక్‌ల హవా నడుస్తోంది. కథ, కథనం బాగున్న హిట్‌ చిత్రాలు ఒక భాష నుంచి మరెన్నో భాషల్లో రీమేక్‌ అవుతున్నాయి. ముఖ్యంగా మాలయాళ సినిమాలపై టాలీవుడ్‌ ఇండస్ట్రీ కన్నేసింది. అక్కడ హిట్‌ అయిన పలు చిత్రాల రీమేక్ రైట్స్‌ కోసం తెలుగు నిర్మాతలు ఎగబడుతున్నారు. ‘లూసిఫర్’ రీమేక్‌కు మెగాస్టార్ చిరంజీవి ఓకే చెప్పగా.. ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’, ‘అయ్యప్పనుమ్‌ కొషియమ్‌’ లాంటి చిత్రాలు కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ జాబితాలో ‘కప్పేలా’ అనే మూవీ కూడా చేరింది. ఇది చిన్న మూవీ. లాక్‌డౌన్‌ నేపథ్యంలో థియేటర్లో ఎక్కువ రోజులు ఆడలేకపోయింది. కానీ, ఈ మధ్యే నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. మలయాళ ప్రేక్షకులతో పాటు తెలుగు ఆడియన్స్‌ను కూడా తెగ ఆకట్టుకుంటోంది. దాంతో సితార ఎంటర్టైన్మెంట్‌ సంస్థ తెలుగు రీమేక్‌ రైట్స్‌ సొంతం చేసుకుంది.

‘కప్పేలా’ మూవీని యువ నటుడు విశ్వక్‌సేన్‌ ఈ మూవీకి హీరోగా ఎంచుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్యే నాని నిర్మాతగా వ్యవహరించిన ‘హిట్‌’ మూవీతో విశ్వక్‌ మంచి హిట్‌ ఖాతాలో వేసుకున్నాడు. కప్పేలా కథకు అతను అయితే సూటౌవుతాడని నిర్మాణ సంస్థ భావిస్తోందట. ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఈ మూవీకి డైరెక్టర్ను కూడా ఖరారు చేయాల్సి ఉంది. కాగా, రీమేక్‌లో నటించడం విశ్వక్‌సేన్‌కు కొత్తేం కాదు. గతంలో మలయాళ హిట్‌ మూవీ ‘అంగామలై డైరీస్‌’ను విశ్వక్‌ తెలుగులో ‘ఫలక్‌నుమా దాస్‌’గా రీమేక్‌ చేశాడు. ఈ మూవీకి తానే దర్శకత్వం వహించి మెప్పించాడు. కొంత కాంట్రవర్సీ సృష్టించిన ఈ మూవీ మాస్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఇప్పటికే ఓ మలయాళ మూవీని తెలుగులో చేసి ఉండడంతో విశ్వక్‌ కప్పేలా కూడా అతనే చేస్తాడని టాలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది. విశ్వక్‌ ప్రస్తుతం హిట్‌ సీక్వెల్‌తో పాటు పాగల్‌ అనే మూవీలో నటిస్తున్నాడు. అతను ఓకే అంటే వీటి తర్వాత కప్పేలాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాడు.

ఎట్టకేలకు ఫ్యామిలీని కలిసిన చిరు చిన్నల్లుడు

Chiranjeevi Son in Law

Chiranjeevi Son in Law

కొద్ది రోజులుగా కుటుంబానికి దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ఎట్టకేలకు భార్య, పిల్లలను కలిశాడు. ఈ ఆనందంలో వారితో తీసుకున్న ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్ చేశాడు. ఒకే ఇంట్లో ఉన్నా.. తమకు దూరంగా ఉన్న కళ్యాణ్ఎట్టకేలకు తమతో కలవడంతో ఫ్యామిలీ మొత్తం ఆనందంగా ఉంది. ఇంట్లోనే ఉన్న కళ్యాణ్‌ ఇన్నాళ్లూ కుటుంబానికి ఎందుకు దూరం కావాల్సి వచ్చింది అనుకుంటున్నారా? దంపతుల మధ్య విభేదాలు వచ్చాయని అనుమానం కలుగుతోందా? అలాంటిదేం లేదు. ఇది కరోనా కాలం కాబట్టి కళ్యాణ్ ముందు జాగ్రత్తలు తీసుకున్నాడు. సుదీర్ఘ లాక్‌డౌన్‌ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం షూటింగ్స్‌కు గత నెలలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా ఉధృతి నేపథ్యంలో చాలా మంది సెట్స్‌పైకి వచ్చేందుకు భయపడ్డారు. కానీ, కళ్యాణ్‌ దేవ్‌ మాత్రం తాను నటిస్తోన్న ‘సూపర్ మచ్చి’ కోసం ధైర్యం చేసి షూటింగ్‌లో పాల్గొన్నాడు. దాంతో ఈ చిత్రంలో మిగిలిపోయిన సన్నివేశాలను ఇటీవలే పూర్తి చేశాడు. డబ్బింగ్‌తో పాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కంప్లీట్‌ చేశారు.

కరోనా నేపథ్యంలో షూటింగ్ లో పాల్గొన్నన్ని రోజులు కళ్యాణ్ స్వీయ నిర్బంధం పాటించాడు. షూటింగ్‌ నుంచి వచ్చిన వెంటనే ఇంట్లోనే గ్రౌండ్‌ ఫ్లోర్లోని ఓ గదిలో ఒక్కడే ఉన్నాడు. ముద్దులొలికే చిన్న కూతురు సహా ఎవ్వరినీ కలువలేదు.

ఈ క్రమంలో తమ పెద్ద కుమార్తె బర్త్‌డేను మిస్ అవుతున్నానని ఆ మధ్యన ఓ పోస్ట్ కూడా చేశారు. సినిమా పనులు అన్నీ పూర్తయిన తర్వాత కూడా ముందు జాగ్రత్తగా 14 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆ టైమ్‌ పూర్తయ్యాక కరోనా టెస్ట్‌ను చేయించుకున్నారు. అందులో అతనికి నెగిటివ్‌ అని రావడంతో మెగా ఫ్యామిలీ ఊపిరి పీల్చుకుంది. ఈ విషయాన్ని ఇన్‌స్టాలో వెల్లడించిన కల్యాణ్ దేవ్‌.. చాలా రోజుల తర్వాత భార్య, కూతుళ్లతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశాడు. ‘ షూటింగ్ మొదలైనప్పటి నుంచి సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నా. ఇన్ని రోజులు ఎదురుచూశా. కరోనా టెస్ట్ చేయించుకున్నా. నెగిటివ్ అని తేలింది. నా గురించి ఆలోచించిన అందరికీ థ్యాంక్స్‌. మీ అందరి ప్రేమను పొందుతున్నందుకు అదృష్టంగా భావిస్తున్నా. ఈ గ్రూప్ హగ్‌ కోసం నేను చాలా రోజులుగా ఎదురుచూశా. ఈ హగ్‌ని మిస్ అయ్యా’ పేర్కొన్నాడు. పులి రాజు దర్శకత్వం వహించిన ‘సూపర్ మచ్చి’ సినిమా త్వరలోనే ఓటీటీలో రిలీజ్‌ కానుందని సమాచారం.

https://www.instagram.com/p/CCbQFikhfBG/

సంచుల రాజకీయం.. బీజేపీ కపటం

BJP Hypocrisy
File Image for BJP Hypocrisy

BJP Hypocrisy

ఒకప్పుడు సంచుల రాజకీయాలు కాంగ్రెస్ కు పేటెంట్ హక్కులా ఉండేవి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ కుదేలైన వేళ ఆ పార్టీపైనే బీజేపీ ఈ రాజకీయాన్ని చేస్తోంది. కాంగ్రెస్ ను మించిపోతూ ఆ పార్టీ పునాదులు కదులుస్తోంది. రాష్ట్రాల్లో కూలదోసి రాజకీయాన్ని హస్తగతం చేసుకుంటోంది.

ఓ కర్ణాటక, ఓ మధ్యప్రదేశ్.. ఇప్పుడు రాజస్థాన్. ఇలా వరుసగా బీజేపీ స్కెచ్చులు వేస్తోంది. ఒక్క మహారాష్ట్రలో మాత్రమే శివసేన ముందర బీజేపీ పప్పులు ఉడకలేవు. అక్కడ పార్టీలు పట్టుదలతో ఉండడంతో బీజేపీకి అధికార శృంగభంగం ఎందురైంది. కానీ కర్ణాటక, మధ్యప్రదేశ్ లో మాత్రం కోట్లు కుమ్మరించి ఎమ్మెల్యేలను కొని కాంగ్రెస్ ను కూలదోసి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. బోటా బోటా మెజార్టీతో ఉన్న మధ్యప్రదేశ్ లో ఈ కరోనావ్యాప్తికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ గద్దెనెక్కింది. కాంగ్రెస్ యువనేత జ్యోతిరాధిత్య సింధియాను బీజేపీవైపు తిప్పుకొని ఎమ్మెల్యేలను లాగేసి కొలువుదీరింది.

దేశంలో పార్టీలు, వాటి స్థితిగతులు

ఇప్పుడు బీజేపీ చూపు రాజస్థాన్ పై పడింది. రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.15కోట్లు, మంత్రి పదవి కూడా ఆఫర్ చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత.. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో రాజకీయంగా అలజడి సృష్టించేందుకు బీజేపీ పన్నాగాలు పన్నుతోందని మండిపడ్డారు. కర్ణాటక, మధ్యప్రదేశ్ మాదిరిగా రాజస్థాన్ లోనూ బీజేపీ రాజకీయం మొదలుపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరికీ డబ్బులు.. మరికొందరికీ పదవులు ఇస్తామని మభ్య పెడుతున్నారని ఆరోపించారు.

బీజేపీ చేసే పనులను ప్రజలు గమనిస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెబుతారని సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు.సీబీఐ, ఈడీ పేరుతో బీజేపీ కాంగ్రెస్ నేతలను భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు.

నిమ్మగడ్డ వ్యవహారంతో ఉలిక్కిపడ్డ ఆంధ్రా బీజేపీ..!

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జోషి తాజాగా కాంగ్రెస్ పార్టీకి కుషల్ ఘడ్ ఎమ్మెల్యేతో సంప్రదింపులు జరపాడని ఆ రాష్ట్ర మీడియాలో వార్తలు వచ్చాయి. ఒక వర్గానికి నాయకుడైన ఆయన చేతిలో చాలామంది ఎమ్మెల్యేలున్నారు. ఆయనకు మంత్రి పదవిని 15 కోట్ల ఆఫర్ ను ఇచ్చి బీజేపీ తనవైపు తిప్పుకొని రాజస్థాన్ లోని బోటాబోటీ కాంగ్రెస్ సర్కార్ కూల్చడానికి ప్రయత్నించిందన్నది ప్రధాన ఆరోపణ.

ఈ విషయం తెలిసి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పెడబొబ్బలు పెడుతున్నారు. నిజానికి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పనులు చాలా చేసి బీజేపీకి పాఠాలు నేర్పింది. ఇప్పుడు బీజేపీ అంతకంటే దారుణంగా చేస్తోంది.మారింద అధికారం తప్పితే రాజకీయం కాదన్నది ఇక్కడ అర్థమవుతోంది. ఏ పార్టీ మారినా.. ఎవరూ ఆ సీట్లో కూర్చున్నా సంచులతో రాజకీయాలు మారవని తేలిపోయింది..

-ఎన్నం

జగన్ పై తగ్గిన పవన్ విమర్శలు జోరు…కారణం?

Pawan Kalyan Silence

Pawan Kalyan Silence
జగన్ ఎడ్డెమ్ అంటే తెడ్డం అంటారు పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించిన నాటి నుండి పవన్ తన ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా జగన్ నే భావించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల తరుపున పోరడతాం అని చెప్పిన పవన్, తెలంగాణా ప్రభుత్వం పట్ల ఎప్పుడూ సానుకూల దృక్పథం కలిగి ఉన్నాడు. వీలైతే కేసీఆర్ నిర్ణయాలను స్వాగతిస్తూ పవన్ మీడియా ముఖంగా కృతజ్ఞతలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఐతే జగన్ పట్ల ఆయన వైఖరి అలా ఉండదు. దూకుడు స్వభావం, పరుష వ్యాఖ్యలతో రెచ్చిపోతూ ఉంటారు. జగన్ తీరు మారి…తన పాలనపై నమ్మకం కుదిరే వరకు జగన్ రెడ్డి అని మాత్రమే అని పిలుస్తాను అని చెప్పి పవన్ తన వ్యతిరేకత తెలియజేశారు.

కారణం ఏమిటో తెలియదు కానీ గతకొంత కాలంగా పవన్ జగన్ పై విమర్శల దాడి తగ్గించారు. ఈ మధ్య జగన్ తీసుకున్న నిర్ణయాలపై ఆయన పల్లెత్తి మాటనలేదు. రాజకీయ నాయకుల అరెస్టులపై టీడీపీ నానా యాగీ చేస్తున్నా, పవన్ మాత్రం నోరుమెదపలేదు. గతంలో టీడీపీ చేసే ప్రతి విమర్శకు పవన్ కూడా వంతపాడే వారు కాగా, అది ఇప్పుడు కనిపించడం లేదు. ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంపై టీడీపీ హై కోర్ట్ నుండి స్టే తీసుకువచ్చి నిలిపివేసింది. దీనిపై అటు జగన్ ప్రభుత్వం గురించి కానీ ఇటు టీడీపీ విమర్శలపై కానీ పవన్ తన స్టాండ్ ఏమిటో వ్యక్తపరచలేదు. టీడీపీ రోజుకొక విమర్శతో సోషల్ మీడియా వేదికగా నానా యాగీ చేస్తున్నా, పవన్ ఇదివరలా మాట్లాడక పోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక ఇటీవల అమరావతి ఉద్యమం 200రోజులు పూర్తి చేసుకోగా పవన్ సోషల్ మీడియాలో కేవలం ఒక లెటర్ లో రైతుల అభిప్రాయాలను గౌరవించాలని, వారికి రావలసిన పరిహారం చెల్లించాలని నివేదన పూర్వకంగా వ్యవహరించారు. ఒకప్పుడు ఆయన రాజధానిని ఒక అంగుళం కూడా కదిలించలేరు..నేను ఉన్నాననని శబధం చేసిన తెలిసిందే.

టీడీపీ బలాన్ని దెబ్బకొడుతున్న జగన్.

ఒంటరిగా ఉన్నప్పుడు దూకుడు చూపిన పవన్ అధికార పార్టీ బీజేపీ అండ ఉంచుకొని సైలెంట్ ఎందుకయ్యాడనేది, ఎవరికీ అర్థం కావడం లేదు. విమర్శించకపోగా కొత్త అంబులెన్సుల కొనుగోళ్లు, కరోనా నిర్వహణలో భేష్ అంటూ జగన్ ని పొగడం కూడా చూశాం. అకస్మాత్తుగా పవన్ లో మొదలైన ఈ పరివర్తనకు కారణం ఏమిటో అంతుబట్టడం లేదు. ప్రస్తుతానికి జగన్ ప్రభుత్వంపై విమర్శల దాడి తగ్గించారా లేక ఇదే వైఖరిని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాడా అనేది చూడాలి. ఏపీ ప్రభుత్వంపై పవన్ విమర్శల దాడి తగ్గించిన వేళ…ఆంధ్రా బీజేపీ నాయకులు విమర్శల జోరు పెంచడం విశేషం.

షాకింగ్… అమితాబ్‌, అభిషేక్‌ బచ్చన్‌లకు కరోనా

Corona Positive for Amitabh

Corona Positive for Amitabh
బాలీవుడ్‌లో అలజడి రేగింది. ఇండియన్‌ సూపర్ స్టార్, బిగ్‌ బి అమితాబ్ బచ్చన్ కు కరోనా సోకింది. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు, స్టాఫ్ కరోనా టెస్టులు చేయించుకున్నారు. అమితాబ్ కొడుకు, నటుడు అభిషేక్ బచ్చన్ కూడా పాజిటివ్ అని తేలింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందంటూ అమితాబ్ శనివారం రాత్రి ట్వీట్ చేశారు. ‘నాకు కోవిడ్ పరీక్షలో పాజిటివ్ అని తేలింది. హాస్పిటల్లో చేరాను హాస్పిటల్ సిబ్బంది, నా కుటుంబ సభ్యులు, నా వద్ద పని చేసే వారికి కూడా పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు రావాల్సి ఉంది. గత పది రోజులుగా నన్ను కలిసిన, నాకు దగ్గరగా ఉన్న అందరూ దయచేసి కరోనా టెస్టులు చేయించుకోండి’ అని అమితాబ్ ట్వీట్ చేశారు. ఆయన కుమారుడు అభిషేక్ సైతం తనకు కోవిడ్ పాజిటివ్ అని నిర్ధరణ అయిందని ట్విటర్ ద్వారా తెలిపారు. తనకు, తన తండ్రికి కోవిడ్ లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని అభిషేక్ చెప్పారు. అభిషేక్ ఆరోగ్యం స్థిరంగా ఉందని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి.

పవన్ కొత్త సినిమాల పైన ఎఫెక్ట్ !

77 ఏళ్ల అమితాబ్, 44 ఏళ్ల అభిషేక్ ఇద్దరూ ప్రస్తుతం ముంబయిలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మూత్ర పిండాల నొప్పితో కొన్ని రోజుల కిందట అమితాబ్‌ నానావతిలో చేరారు. అనుమానంతో వైద్యులు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్‌ అని తేలింది. ఈ క్రమంలో అమితాబ్ భార్య జయా బచ్చన్, కొడుకు అభిషేక్‌, కోడలు ఐశ్వర్యా రాయ్ సహా కుటుంబ సభ్యులందరికీ కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. అభిషేక్‌ మినహా మిగతా వారికి కోవిడ్ నెగెటివ్ వచ్చిందని ఆదివారం ఉదయం మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే తెలిపారు.అమితాబ్, అభిషేక్ బచ్చన్‌లకు కోవిడ్ లక్షణాలు స్వల్పంగా ఉన్నాయి. వారి కుటుంబ సభ్యులెవరికీ కరోనావైరస్ సోకలేదని ప్రకటించారు. మరోవైపు అమితాబ్‌ కుటుంబంలో ఇద్దరికి కరోనా రావడంతో బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ (బీఎంసీ) అధికారులు అప్రమత్తమయ్యారు. తమ సిబ్బందిని బిగ్‌బి ఇల్లు జల్సాకి వచ్చారు. ఇంటి పరిసరాలతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలను పూర్తిగా శానిటైజ్‌ చేశారు. ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటిస్తు.. అమితాబ్‌ ఇంటి ముందు నోటీసులు అంటించారు. ఇక, అమితాబ్‌, అభిషేక్‌ త్వరగా కోలుకోవాలని బాలీవుడ్‌ ప్రముఖులు ఆకాంక్షించారు.

ఏపీ కేబినెట్ విస్తరణకు తేదీ ఖరారు..

AP Cabinet Expansion

AP Cabinet Expansion

ఏపీ కేబినెట్ ఖాళీ అయిన ఇద్దరు మంత్రుల స్థానాలను భర్తీ చేసే అంశం ఇప్పుడు చర్చనీయాంగా మారింది. ఇందుకు తేదీలు ఖరాలు చేయడంలో పార్టీ నాయకుల్లో ఒకటే హడావిడి మొదలయ్యింది. ఆశావసులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రమాణ స్వీకార తేదీ అధికారికంగా వెల్లడించకపోయినా ఈ నెల 22 లేక 24వ తేదీల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 22వ తేదీన సాధ్యం కాని పక్షంలో 24వ తేదీన నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం.

కేబినెట్లో మంత్రులుగా పని చేస్తున్న మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరు కొద్ది రోజుల కిందట మంత్రి పదవులకు రాజీనామా సమర్పించారు. వీరి స్థానంలో మరో ఇద్దరు కొత్త వారిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లోకి తీసుకోనున్నారు. రాజ్యసభ ఎన్నికలు పూర్తయిన నాటి నుంచి మంరతి పదవుల కోసం ఆశావహులు తమ ప్రయత్నాలు ప్రారంభించారు. పార్టీలోని ముఖ్యనాయకుల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు.

టీడీపీ బలాన్ని దెబ్బకొడుతున్న జగన్.

రాజీనామా చేసిన మంత్రుల్లో మోపిదేవి వెంకట రమణ (బిసీ) గుంటూరు జిల్లాకు, పిల్లి సుభాష్ చంద్రబోస్ (ఎస్సీ) తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారు. దీంతో ఆ జిల్లాల నుంచి మంత్రి పదవులు ఆశించే వారి మధ్య పోటీ నెలకొంది. ఆ సామాజిక వర్గాలకు చెందిన వారు మంత్రి పదవులకు పోటీ పడుతున్నారు. వీరి సంగతి పక్కన పెడితే ఆయా సామాజికి వర్గాలకు చెందిన ఇతర జిల్లాల సీనియర్ నాయకులు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. కృష్ణా జిల్లాల బీసీ వర్గానికి నుంచి జోగి రమేష్ పేరు వినిపిస్తుండగా తూర్పు గోదావరి జిలాల నుంచి ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్, రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయన వేణుగోపాల్, శ్రీకాకుళం నుంచి పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు, గుంటూరు జిల్లా నుంచి విడుదల రజినిలలో ఇద్దరికి అవకాశం లభించనున్నట్లు పార్టీ వర్గాలలో ప్రచారం జరుగుతుంది.

గుంటూరు, కృష్ణా మరికొందరు కేబినెట్ లో చోటు కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాతిపధికన మంత్రి పదవులు కేటాయిస్తారనేది ఇప్పుడు ఆశక్తికరంగా మారింది. జిల్లాల వారీగా కేటాయిస్తే ఆ జిల్లాకు చెందిన నాయకులకే అవకాశం లభించనుంది. సామాజిక వర్గాల ప్రాతిపధికన కేటాయిస్తే ఇతర జిల్లాల వారికి ఛాన్స్ లభించనుంది. మరోవైపు ఎమ్మెల్సీల నుంచి మంత్రి పదవి కోసం డిమాండ్ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజీనామా చేసిన ఇద్ధరు నాయకులు ఎమ్మెల్సీలు గా మంత్రి పదవులు చేపట్టిన వారు కాపడంతో ఆ అవకాశం ఎమ్మెల్సీలకు ఇవ్వలనే వాదనలు వినిపిస్తున్నారు.

టీడీపీ బలాన్ని దెబ్బకొడుతున్న జగన్.

CM Jagan

BC Welfare Schemes by Jagan
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోప్రతిపక్ష టీడీపీ చేస్తున్న జపం అవినీతి, అరాచక పాలన. అధికారం అడ్డంపెట్టుకొని జగన్ కక్ష సాధింపు చర్యలకు పాలపడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఒక్క ఛాన్స్ అని గద్దెనెక్కిన జగన్ రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. ఇక టీడీపీ ఆరోపణలలో ప్రధాన అంశం బీసీ నేతల అణచివేత. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర వంటి నేతల అరెస్టులను సాకుగా చూపుతూ టీడీపీ నేతలు బీసీల సానుభూతి పొందాలని, అదే సమయంలో బీసీలకు జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగేలా చేయాలనేది వారి ప్రణాళిక కావచ్చు. మరి బీసీ ప్రజానీకంలో ఈ ఆరోపణలు ఎలాంటి అభిప్రాయం పెంపొందిస్తున్నాయి అనేది ఆసక్తికర విషయం.

ఎప్పటి నుండో టీడీపీ కి బీసీ సమాజం అతిపెద్ద ఓటు బ్యాంకుగా ఉంటూ వస్తుంది. తెలుగు రాష్ట్రాలలోకి బీసీ వర్గాలు టీడీపీ విధేయులుగా, ఆ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సామాజిక వర్గాల వారిగా వివిధ పార్టీలకు అండగా ఉంటూ వస్తుండగా…బీసీలకు టీడీపీ చేసిన ప్రయోజనంగా ఉన్నా లేకున్నా టీడీపీ అంటే మాది అన్నట్లు వారు దశాబ్దాలుగా ఆ పార్టీ జెండా మోస్తున్నారు . క్షేత్ర స్థాయిలో ఉండే వర్గ పోరాటల కారణం కొద్దిమంది బీసీలు మాత్రమే టీడీపీకి వ్యతిరేకులుగా ఉన్నారు. 2019 ఎన్నికలలో బీసీలు టీడీపీ మరియు వైసీపీ పార్టీలకు సమానంగా ఓట్లు వేశారు. తేడా స్వల్పం అయినప్పటికీ వైసీపీకే బీసీ వర్గం నుండి కొంచెం ఎక్కువ ఓట్లు రావడం జరిగింది.

ఏపీ కేబినెట్ విస్తరణకు తేదీ ఖరారు..

జగన్ ప్రభుత్వం గద్దెనెక్కిన తరువాత ఆయన దృష్టి పూర్తిగా బీసీ సంక్షేమంపై పడింది. చేనేతలకు ఏకంగా 24వేల రూపాయల ఆర్థిక సహాయం ఆయన చేయడం జరిగింది. మత్యకార భరోసా పథకం క్రింద ఏడాదికి 10000 రూపాయలు నేరుగా వారి ఖాతాలలో వేయడం జరిగింది. ఇక బీసీ మహిళలకు ఏడాది రూ. 18,750 చొప్పున రానున్న నాలుగేళ్లలో రూ.75000 ఆర్థిక సాయం చేయనున్నారు. అలాగే బీసీ మహిళల పెన్షన్ వయసు 45కి తగ్గించనున్నట్లు హామీ ఇవ్వడంతో పాటు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. గద్దెనెక్కిన ఏడాది లోపే జగన్ తను మాటల సీఎం కాదు చేతల సీఎం అని నిరూపించుకున్నారు. 2019 బీసీ వర్గాన్ని సగానికి పైగా తనవైపు తిప్పుకున్న జగన్, వచ్చే ఎన్నికలలో 75 శాతానికి పైగా బీసీ వర్గాన్ని తనకు విధేయులుగా మార్చుకుంటాడు అనిపిస్తుంది.బీసీలకు జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చిన నేపథ్యంలో…బీసీల సంక్షేమమం పట్ల చంద్ర బాబు 2024 ఎన్నికల మేనిఫెస్టో అంతకు మించి ఉండాలి. గత ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కిన బాబు, కొత్తగా చేసే వాగ్దానాలను ప్రజలు నమ్మి ఓట్లు వేస్తారు అనుకోవడం పొరపాటే. ఏడాదికి రూ. 24,000 నేరుగా తన ఖాతాలోకి అవినీతికి తావులేకుండా పొందిన ఒక చేనేత కార్మికుడు బాబుకి ఓటేస్తాడంటారా?

పవన్ కొత్త సినిమాల పైన ఎఫెక్ట్ !

Pawan kalyan Upcoming Movies

Pawan kalyan Upcoming Movies

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తూ వరుస సినిమాలకు సైన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే “పింక్’ తెలుగు రీమేక్ వకీల్ సాబ్, అలాగే క్రిష్ దర్శకత్వంలో మరో పిరియాడిక్ మూవీ చేస్తున్నాడు. కరోనా రాకపోయి ఉంటే ఈ పాటికి హరీష శంకర్ దర్శకత్వంలోనూ ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నానని పవన్ నుండి ఎనౌన్స్ కూడా వచ్చేది. కానీ కరోనా రాకతో వకీల్ సాబ్ సినిమా ఆగిపోవడం, పైగా ఇంకా షూట్ ఉండటం, దీనికి తోడు క్రిష్ సినిమాకి ఎక్కువ డేట్స్ కేటాయించాల్సి రావడంతో మొత్తానికి పవన్ తరువాత చేయాలనుకున్న సినిమాల పై బాగానే ఎఫెక్ట్ పడింది.

ఇప్పటికే పవన్ ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ అన్నీ వచ్చే ఏడాదికి కూడా పూర్తయ్యేలా కనిపించడం లేదు. పవన్ 2022లో కూడా సినిమాలు చేసే ఆలోచనలో ఉండటంతో దర్శకుడు డాలీ పవన్ ను అప్రోచ్ అయ్యాడని, డాలీ దరకత్వంలో సినిమా చేయడానికి పవన్ నుండి సానుకూల స్పందనే వచ్చిందని, అన్నీ కుదిరితే సినిమా ఓకే అయి, 2021 చివర్లో షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నట్టు ఇప్పటికే డాలీ నుండి ఆ మధ్య విన్నబడ్డ మాటలు.

కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ఉండకపోవచ్చు అట. పైగా పవన్ – డాలీ మధ్య సినిమాకి సంబంధించి ఎలాంటి కథా చర్చ కూడా జరగకపోవడంతో ఈ సినిమా క్యాన్సల్ చేయడానికి ఈజీ అయిందట. అలాగే కొంతమంది నిర్మాతలు కూడా పవన్ ను ఆ మధ్య సినిమా చేయమని అప్రోచ్ అయ్యారు. ఇక వాళ్ల సినిమమాల విషయంలో కూడా పవన్ ఇప్పట్లో సానుకూలంగా స్పందించే అవకాశం లేకుండా పోయింది.

కేసీఆర్ ఆగయా.. బ్యాటింగ్ మొదలెట్టాడా?

CMKCR in Pragathi Bhavan

CMKCR in Pragathi Bhavan
రెండు వారాల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు కేసీఆర్ వచ్చాడు.. బ్యాటింగ్ మొదలుపెట్టాడు. మెజార్టీ రైతులను గురిపెట్టాడు. ఇన్నాళ్లు కేసీఆర్ ఎక్కడా? అంటూ తెలంగాణలో జరిగిన యాగీ అంతా ఇంతా కాదు.. కరోనా వైరస్ తీవ్రత వేళ కేసీఆర్ ఎక్కడికెళ్లారు? ఫాంహౌస్ కు ఎందుకు వెళ్లారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తెలంగాణ సమాజంలో హాట్ టాపిక్ గా మారాయి. కొందరైతే ఏకంగా హైకోర్టుకు ఎక్కి కేసీఆర్ కనిపించడం లేదని పిటీషన్లు వేశారు. ప్రగతి భవన్ ఎదుట మరికొందరు ప్లకార్డులు ప్రదర్శించారు. కేసీఆర్ హైదరాబాద్ ఎప్పుడొస్తాడు? ఎప్పుడు కనిపిస్తాడు అన్నది హాట్ టాపిక్ గా మారిన వేళ సార్ వచ్చాడు అన్న కబురు అందింది.

కానీ ఎట్టకేలకు కేసీఆర్ వచ్చేశాడు. నిన్న కేసీఆర్ హైదరాబాద్ ప్రగతి భవన్ కు రావడంతో ఈ ఊహాగానాలకు తెరపడింది.. రెండు వారాల అజ్ఞాతవాసం తర్వాత హైదరాబాద్ జనారణ్యంలోకి కేసీఆర్ వచ్చాడు. రాగానే బ్యాంటింగ్ మొదలుపెట్టాడు.

నియంత్రిత సాగు, రైతుబంధు సహా రైతు సమస్యలనే ఎజెండా పెట్టుకొని నిన్న రాత్రి సమీక్షలో అందరికీ రైతుబంధు సాయం అందించాలని సూచించారు.

నిజానికి కేసీఆర్ ఎప్పుడు సమస్యలు వచ్చినా వాటిని చాకచక్యంగా పరిష్కరిస్తూ ముందుకెళుతుంటారు. సీఎం కేసీఆర్ మౌనం వెనుక పెద్ద ఉత్పాతమే ఉంటుందన్నది ఆయనను దగ్గరి నుంచి చూస్తున్న వారు చెప్పే మాట.. ఒకే సారి అదంతా బయటపడి ప్రత్యర్థులను చిత్తు చేసేలా ఆయన ఎత్తులుంటాయి.

కేసీఆర్ ఎప్పుడూ రాజకీయంగా వెనుకబడినా ఒకే ఒక స్టెప్ తో దాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలోనూ 50రోజులకు పైగా మౌనంగా ఉండి ఒకేసారి వారికి వరాలిచ్చి దేవుడైపోయాడు. దిశా హత్యాచారం విషయంలో ఎన్ కౌంటర్ చేయించి హీరో అయిపోయాడు. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.

తెలంగాణలో కరోనాపై, సచివాలయం కూల్చివేతపై ప్రతిపక్షాలు, నెటిజన్లు, మేధావుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. జాతీయ మీడియాలోనూ కేసీఆర్ ఇంత క్లిష్ట సమయంలో సచివాలయం కోట కట్టడమేంటని ప్రశ్నించారు. వీటన్నింటిని గట్టి జవాబులు ఇచ్చేందుకు కేసీఆర్ పెద్ద ప్లాన్లు చేశారని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణలో మెజార్టీ అయిన రైతులను గుప్పిట పట్టిన కేసీఆర్.. వారికి రాగానే వరాలిచ్చారు. అన్ని విమర్శలకు ఒక్క సమీక్షతో చెక్ పెట్టాడు. తెలంగాణ రైతాంగానికి సాగు, రైతుబంధుపై అభయమిచ్చాడు. ఇలా కేసీఆర్ ఎప్పుడు తనపై విమర్శలు వచ్చినా ఒక్కదెబ్బతో వాటన్నింటిని పటాపంచలు చేస్తూ ముందుకెళ్లడం రివాజుగా పెట్టుకున్నాడు.ఇక కరోనా, సచివాలయం కూల్చివేతలపై ఈ రెండు మూడు రోజుల్లోనే సమాధానిమిస్తాడని తెలిసింది.

-ఎన్నం

దేశంలో పార్టీలు, వాటి స్థితిగతులు

వారాంతపు ముచ్చట్లు :

ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే దేశంలోని రాజకీయపార్టీలు బలంగా వుండాలి. దురదృష్టవశాత్తు దేశంలో అటువంటి పరిస్థితులు కనబడటం లేదు. అసలు దేశవ్యాప్తంగా ప్రభావం చూపే పార్టీలు లేవు. బిజెపి ఒక్కటే జాతీయ పార్టీ గా మిగిలిపోయింది ( ఎన్నికల కమీషన్ అధికారిక వర్గీకరణ ను పక్కన పెట్టి చూస్తే ). అదికూడా దక్షిణాదిలో ఒక్క కర్నాటక తప్పింఛి మిగతా రాష్ట్రాల్లో నామ మాత్రమే. అయితే మిగతా ప్రాంతాల్లో బాగా వేళ్ళూనుకుంది. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా వుంది. ఏదో కొన్ని రాష్ట్రాల్లో తప్పించి పోటీ ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేదు. కనీసం ముందు ముందు తిరిగి పునరుజ్జీవం పొందుతుందనే ఆశలు కూడా అంతరిస్తున్నాయి. ఇక వామపక్షాల్లో ఎంతో కొంత ఉనికిని కాపాడుకున్న సిపిఎం ప్రస్తుతం పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితులే కనబడుతున్నాయి. పశ్చిమ బెంగాల్ లో అప్రతిహతంగా కొనసాగిన దాని దిగ్విజయ యాత్ర కు బ్రేకులు పడటమే కాకుండా పోయిన సాధారణ ఎన్నికల్లో ఒక్క స్థానంలో తప్ప మిగాతాచోట్ల డిపాజిట్లు కోల్పోయి సింగిల్ డిజిట్ ఓట్ల శాతానికి పడిపోవటం ఎంతోమంది రాజకీయపరిశీలకులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక్క కేరళ లోనే దాని ప్రభావం కొనసాగుతుంది. అంటే దీనర్ధం ఏక పార్టీ గుత్తాధిపత్యం సమీప భవిష్యత్తు లో కొనసాగే అవకాశాలే మెండుగా కనబడుతున్నాయి. అసలు ఈ స్థితి ని బ్రేక్ చేయటానికి మిగతా పార్టీలు మేధావులు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా అంటే ఖచ్చితంగా లేదు అనే అనుకోవాలి. ఇది ప్రజాస్వామ్య బలోపేతానికి దోహదపడదు. రాజకీయ పార్టీలు పోటా పోటీగా ఉన్నప్పుడే ప్రజల హక్కులకు రక్షణ వుంటుంది.

ప్రధాన రాజకీయపార్టీల స్థితిగతులు ఎలావున్నాయి? 

భారత జాతీయ కాంగ్రెస్ 

కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధ్వానంగా తయారయ్యింది. 2019 ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయటం ఆ తర్వాత ఇంతవరకు పార్టీకి అధ్యక్షుడే లేడు. సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతుంది. పార్టీలో ఆంతరంగిక    ప్రజాస్వామ్యం లేదు. 1998 లో సోనియా గాంధీ అధ్యక్షురాలయిన తర్వాత సంస్థాగత ఎన్నికలకు చరమగీతం పాడింది. ఆ తర్వాత ఇంతవరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కి ఎన్నికలు జరగలేదు. కేవలం నామినేటెడ్ నియామకాలే. వాటిల్లోనయినా కొత్త రక్తాన్ని ఎక్కించటానికి ప్రయత్నం చేసిందా అంటే అదీలేదు. తనకు తందానా తానా అనే భజనపరులను నియమించుకొని పార్టీని నడిపిస్తుంది. ఆ మధ్యల్లో శశి థరూర్ లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ లో అంతరంగిక ఎన్నికలు కావాలని మాట్లాడినా ఆ తర్వాత అది సణుగుడు కే పరిమతమయ్యింది. సంజయ్ ఝా లాంటి వాళ్ళు అదే విషయం ఓ పత్రికలో ఇంటర్వ్యూ ఇస్తే ఆయన్ను ఏకంగా పార్టీ అధికార ప్రతినిధి గా తొలగించారు. రాహుల్ గాంధీ ఎన్నికల తర్వాత కాడి కింద పడేస్తే లేదు లేదు నువ్వే వుండాలని బతిమిలాడటం చూస్తుంటే ఎటువంటి పార్టీ ఎలా అయిపోయిందని బాధేస్తుంది. దానికి కాంగ్రెస్ పార్టీ అనే పేరు తీసేసి నెహ్రూ కుటుంబ పార్టీ అని పెడితే అప్పుడు ఈ కుటుంబ విదేయులందరూ ఎటువంటి సంకోచం లేకుండా సోనియా గాంధీ కి, రాహుల్ గాంధీ కి, ప్రియాంక గాంధీ కి  వీలుంటే ప్రియాంక గాంధీ సంతానానికి భజన చేస్తూ గడపొచ్చు. కాంగ్రెస్ అభిమానులు ఈ బానిస మనస్తత్వానికి అలవాటుపడటం బాధాకరం. ఇప్పటికైనా కాంగ్రెస్ బతికి బట్టకట్టాలంటే పార్టీలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించి కిందినుంచి క్యాడర్ ని  వుత్తేజపరిచేటట్లు  చేయొచ్చు. ఆ మాట చెప్పినందుకు కరుడుగట్టిన కాంగ్రెస్ వాది సంజయ్ ఝా ని పదవినుంచి తీసేశారు. ఈ ఒక్కసారికి నెహ్రూ కుటుంబం తప్పుకొని వేరే వాళ్లకు అవకాశం ఇవ్వమని సూచించటం పార్టీ వ్యతిరేక కార్యక్రమ మెట్లా అవుతుందో సోనియా గాంధీ చెప్పాలి. అంటే వుంటే మేమే వుండాలి లేకపోతే పార్టీ తుడుచుపెట్టుకు పోయినా పర్వాలేదనే సోనియా గాంధీ మనస్తత్వం కాంగ్రెస్ పార్టీ ని నాశనం చేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ఎదగకపోవటానికి ఒకవిధంగా సోనియా గాంధీ నే ప్రధాన అడ్డంకి. కాబట్టి పార్టీని సంస్థాగతంగా సంస్కరించకుండా బిజెపి ని ఎదుర్కోవటం అసాధ్యం. కాంగ్రెస్ ఈ బలహీనతే బిజెపి కి లబ్ది చేకూరుస్తుంది.

సిపిఎం 

భారత రాజకీయాల్లో వామపక్ష సిద్ధాంతానికి ఎప్పుడూ స్థానం వుంది. అయితే ప్రజలను ఆ దిశగా నడిపించే విధానం , స్థాయి ఇప్పుడున్న వామపక్ష పార్టీలకు కొరవడ్డాయి. సోషలిస్టు పార్టీలు కుటుంబ పార్టీలుగా మారటంతో హిందీ ప్రాంతాల్లో ప్రతిష్ట కోల్పోయాయి. కమ్యూనిస్టులు ప్రజాస్వామ్య పార్టీలుగా మారకపోవటం, దేశీయ భావాలను విస్మరించటం ప్రజలకు దూరంగా జరిగాయి. ఉదాహరణకు భారత-చైనా ఘర్షణలో దేశం తరఫున మాట్లాడక పోవటం ప్రజలు హర్షించరు. అలాగే భారతీయ సమాజం లో కుల ప్రాధాన్యతని గుర్తించటానికి చానాళ్లు నిరాకరించారు. ముఖ్యంగా సిపిఎం ఈ విషయంలో పూర్తి ఫ్యూడల్ ఆలోచనలతో వుందని చెప్పాలి. తర్వాత దశలో అలా గుర్తించక పోవటం తప్పేనని , అణగారిన కులాలకి ప్రాతినిధ్యం , ప్రోత్సాహం ఇవ్వాలని తీర్మానించుకున్నారు. మరి వాళ్ళు చేసిన తీర్మానాలకే పార్టీలో దిక్కులేదు. 1964 లో పార్టీ ఏర్పడిన తర్వాత ఇంతవరకూ ఒక్క దళిత వ్యక్తిని పార్టీ పోలిట్ బ్యూరో  లోకి తీసుకోకపోవటాన్ని ఏ కోణంలో చూడాలి? ఒకవైపు దళితులకు స్థానం లేకపోవటం రెండోవైపు అగ్రకులాలే పార్టీ పోలిట్ బ్యూరో లో ఆధిపత్యం వహించటాన్ని ఫ్యూడల్ ఆలోచనలుగానే చూడాల్సి వుంటుంది. అదీగాక పోలిట్ బ్యూరో  పూర్తిగా వయో వృద్ధులతో నిండిపోయింది. పోలిట్ బ్యూరో సగటు వయస్సు 69 సంవత్సరాలంటేనే దాని పరిస్థితి ఏంటో అర్ధమవుతుంది. కాంగ్రెస్ పార్టీ కుటుంబం చేతిలో బందీ అయితే సిపిఎం యధాతధ వాదుల చేతిలో బందీ అయ్యింది. పశ్చిమ బెంగాల్ లో ఒక్కసారి అధః పాతాళానికి వెళ్ళిన తర్వాత కూడా సంస్థాగత సంస్కరణలకు పూనుకోలేదంటేనే నాయకత్వం సాహసోపేత నిర్ణయాలు , సంస్కరణలు తీసుకునే స్థాయి, ధైర్యం లేదని అర్ధమవుతుంది. మరి ఈ తరుణంలో సిపిఎం తిరిగి పునరుజ్జీవం పొందే అవకాశాలు కనబడటం లేదు. అంకిత భావం తో పనిచేసే క్యాడర్ ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఈ పార్టీకి వుండటం గమనార్హం. నాయకత్వ లోపం ఈ క్యాడర్ సంపదని వాడుకోలేకపోతుంది. పార్టీ నిర్మాణాన్ని ఇప్పటి ఆలోచనలకు అనుగుణంగా మార్చుకుంటేనే తిరిగి ప్రజల విశ్వాసం పొందగలదు. దానితోపాటు పూర్తి ప్రజాస్వామ్య పార్టీగా మార్పుచెందాల్సి వుంది. పార్టీ ఎదుగుదలకు వామపక్ష సిద్ధాంతం అడ్డంకి కాదు, పార్టీ కేంద్ర నాయకత్వ ఆలోచనా ధోరణే అడ్డంకి.

బిజెపి 

ఉన్నవాటిల్లో జాతీయ స్థాయిలో ప్రభావాన్ని చూపించగల పార్టీ ప్రస్తుత పరిస్థితుల్లో బిజెపి ఒక్కటే. ఒక్క దక్షిణాది తప్పిస్తే మిగతా ప్రాంతాల్లో బలంగా వేళ్ళూనుకోవటమే కాకుండా నిర్మాణపరంగా పార్టీని భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లుగా మలుచుకుంటూ వస్తుంది. ఉదాహరణకు దానికున్న 700 జిల్లా కమిటీలకు ఇటీవల అధ్యక్షుల్ని నియమించే పనిలో వున్నారు. అందులో కొన్ని మార్గదర్శకాలు ఇచ్చారు. దానిప్రకారం 50 సంవత్సరాల లోపు వాళ్ళనే నియమించాలని కోరారు. ఇది సాహసోపేత నిర్ణయమే. ఎందుకంటే ఎప్పటినుంచో పాతుకుపోయిన వాళ్ళను తీసి కొత్త వాళ్ళను అదీ యువతను నియమించటం ఆహ్వానించదగ్గ పరిణామం. అంటే వచ్చే పది, పదిహేను సంవత్సరాలకు కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుంటున్నారన్నమాట. వీళ్ళను చూసైనా ప్రతిపక్ష పార్టీలు బుద్ధి తెచ్చుకోవచ్చు కదా. బిజెపి దీనితోపాటు సామాజిక కోణంలో పార్టీలోకి వెనకబడిన కులాల వాళ్ళను, దళితుల్ని పెద్ద ఎత్తున చేర్చుకుంటుంది. ఓ విధంగా అందరికి ప్రాతినిధ్యం వహించే పార్టీగా పరిణతి చెందింది. ఒక్క ముస్లింలు మాత్రమే తక్కువ స్థాయిలో పార్టీ వున్నారు. ‘సబ్ కా విశ్వాస్ ‘ పార్టీగా మారాలంటే వాళ్ళ ప్రాతినిధ్యం కూడా పెంచుకోవాల్సిన అవసరం వుంది. ఏది ఏమైనా మిగతా పార్టీలతో పోలిస్తే చాలా ముందు చూపుతో పార్టీ నిర్మాణాన్ని పటిష్టపరుచుకోగలుగుతుంది. ప్రస్తుతం అందరి దృష్టి కొత్త అధ్యక్షుడు నియమించబోయే పార్లమెంటరీ బోర్డు పై పడింది. వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, అనంతకుమార్ ల స్థానంలో ఎవరిని నియమించబోతున్నరనేది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మొత్తం మీద చూస్తే ఒక్క బిజెపి తప్పిస్తే మిగతా పార్టీల పరిస్థితి అధ్వానంగా వుంది. కాంగ్రెస్ పార్టీకే ఇప్పటికీ బిజెపి కి ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో ఎదిగే అవకాశం వుంది. కానీ గాంధీ కుటుంబ ఆత్మహత్యాసదృశక  విధానాల వలన ఆ అవకాశాన్ని జారవిడుచు కుంటుందనిపిస్తుంది. అదే జరిగితే 2024 ఎన్నికల్లో బిజెపి కి ఎదురు ఉండకపోవచ్చు. ఇది ఈరోజుకి అంచనా. రాజకీయాల్లో ఏరోజు ఏంజరుగుతుందో ఎవరూ చెప్పలేరు.