Homeఆంధ్రప్రదేశ్‌టీడీపీ బలాన్ని దెబ్బకొడుతున్న జగన్.

టీడీపీ బలాన్ని దెబ్బకొడుతున్న జగన్.

BC Welfare Schemes by Jagan
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోప్రతిపక్ష టీడీపీ చేస్తున్న జపం అవినీతి, అరాచక పాలన. అధికారం అడ్డంపెట్టుకొని జగన్ కక్ష సాధింపు చర్యలకు పాలపడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఒక్క ఛాన్స్ అని గద్దెనెక్కిన జగన్ రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. ఇక టీడీపీ ఆరోపణలలో ప్రధాన అంశం బీసీ నేతల అణచివేత. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర వంటి నేతల అరెస్టులను సాకుగా చూపుతూ టీడీపీ నేతలు బీసీల సానుభూతి పొందాలని, అదే సమయంలో బీసీలకు జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగేలా చేయాలనేది వారి ప్రణాళిక కావచ్చు. మరి బీసీ ప్రజానీకంలో ఈ ఆరోపణలు ఎలాంటి అభిప్రాయం పెంపొందిస్తున్నాయి అనేది ఆసక్తికర విషయం.

ఎప్పటి నుండో టీడీపీ కి బీసీ సమాజం అతిపెద్ద ఓటు బ్యాంకుగా ఉంటూ వస్తుంది. తెలుగు రాష్ట్రాలలోకి బీసీ వర్గాలు టీడీపీ విధేయులుగా, ఆ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సామాజిక వర్గాల వారిగా వివిధ పార్టీలకు అండగా ఉంటూ వస్తుండగా…బీసీలకు టీడీపీ చేసిన ప్రయోజనంగా ఉన్నా లేకున్నా టీడీపీ అంటే మాది అన్నట్లు వారు దశాబ్దాలుగా ఆ పార్టీ జెండా మోస్తున్నారు . క్షేత్ర స్థాయిలో ఉండే వర్గ పోరాటల కారణం కొద్దిమంది బీసీలు మాత్రమే టీడీపీకి వ్యతిరేకులుగా ఉన్నారు. 2019 ఎన్నికలలో బీసీలు టీడీపీ మరియు వైసీపీ పార్టీలకు సమానంగా ఓట్లు వేశారు. తేడా స్వల్పం అయినప్పటికీ వైసీపీకే బీసీ వర్గం నుండి కొంచెం ఎక్కువ ఓట్లు రావడం జరిగింది.

ఏపీ కేబినెట్ విస్తరణకు తేదీ ఖరారు..

జగన్ ప్రభుత్వం గద్దెనెక్కిన తరువాత ఆయన దృష్టి పూర్తిగా బీసీ సంక్షేమంపై పడింది. చేనేతలకు ఏకంగా 24వేల రూపాయల ఆర్థిక సహాయం ఆయన చేయడం జరిగింది. మత్యకార భరోసా పథకం క్రింద ఏడాదికి 10000 రూపాయలు నేరుగా వారి ఖాతాలలో వేయడం జరిగింది. ఇక బీసీ మహిళలకు ఏడాది రూ. 18,750 చొప్పున రానున్న నాలుగేళ్లలో రూ.75000 ఆర్థిక సాయం చేయనున్నారు. అలాగే బీసీ మహిళల పెన్షన్ వయసు 45కి తగ్గించనున్నట్లు హామీ ఇవ్వడంతో పాటు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. గద్దెనెక్కిన ఏడాది లోపే జగన్ తను మాటల సీఎం కాదు చేతల సీఎం అని నిరూపించుకున్నారు. 2019 బీసీ వర్గాన్ని సగానికి పైగా తనవైపు తిప్పుకున్న జగన్, వచ్చే ఎన్నికలలో 75 శాతానికి పైగా బీసీ వర్గాన్ని తనకు విధేయులుగా మార్చుకుంటాడు అనిపిస్తుంది.బీసీలకు జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చిన నేపథ్యంలో…బీసీల సంక్షేమమం పట్ల చంద్ర బాబు 2024 ఎన్నికల మేనిఫెస్టో అంతకు మించి ఉండాలి. గత ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కిన బాబు, కొత్తగా చేసే వాగ్దానాలను ప్రజలు నమ్మి ఓట్లు వేస్తారు అనుకోవడం పొరపాటే. ఏడాదికి రూ. 24,000 నేరుగా తన ఖాతాలోకి అవినీతికి తావులేకుండా పొందిన ఒక చేనేత కార్మికుడు బాబుకి ఓటేస్తాడంటారా?

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular