Home Blog Page 8410

రంగంలోకి కేటీఆర్.. కరోనా విమర్శలకు చెక్


తెలంగాణ కరోనా పంజా విసురుతుండటంతో టీఆర్ఎస్ సర్కార్ పై విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. కరోనాపై ముందుండి పోరాడాల్సిన సీఎం కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫౌంహౌజ్ నుంచి పాలన సాగిస్తున్నారని విపక్షాలు మండిపడుతోన్నాయి. సీఎం కేసీఆర్ కరోనాను అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. విపక్షాలతోపాటు ప్రజల నుంచి కూడా ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత వస్తున్న తరుణంలో మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. ప్రతిపక్షాల విమర్శలకు ధీటైన సమాధానం చెబుతూ ఆ పార్టీలను డిఫెన్స్ లోకి నెట్టారు.

కరోనాపై పోరాటం.. హైదరాబాదీల స్వచ్చంధ లాక్ డౌన్

దేశం, ప్రపంచమంతటా కరోనా లాంటి విపత్కర పరిస్థితులున్నాయని ఆయన గుర్తుచేశారు. ఇలాంటి సమయంలోనూ కొందరు నాయకులు, వారి అనుచరులు వెర్రీ రాజకీయాలకు పాల్పడుతుండటం సిగ్గుచేటన్నారు. టీఆర్ఎస్ నేతలు ప్రతిపక్షాలకు ధీటుగా జవాబిచ్చే స్థితిలోనే ఉన్నారని.. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఒకరినొకరు విమర్శించుకుంటూ పోతే సమయం వృథా అవుతుందన్నారు. ఇది ఏ ఒక్కరికి వచ్చిన సమస్య కాదని ప్రపంచమంతటా ఈ సమస్య ఉందని విమర్శలు చేసే నేతలు గుర్తించుకోవాలన్నారు.

ప్రపంచంలోనే ఇండియా కరోనా కేసుల్లో మూడోస్థానంలో ఉందని తెలిపారు. కరోనా కేసులు అన్ని రాష్ట్రాల్లోనూ పెరిగిపోతున్నాయని తెలిపారు. దేశంలో కరోనా కేసులను అరికట్టడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారా? అంటూ ప్రతిపక్షాలను ఢిపెన్స్ లో పడేశారు. ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అర్ధరాత్రి ఓ రోగి ఫోన్ చేస్తే వెంటనే స్పందించి గాంధీలో చికిత్స చేయించారని గుర్తుచేశారు. రాజేందర్ టైంతో పోటీపడుతూ పని చేస్తున్నారని అభినందించారు. ప్రభుత్వ పనితీరు వల్లే తెలంగాణలో రికవరీ రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా నమోదవుతుందని తెలిపారు.

తెలంగాణ యంత్రాంగం, వైద్య సిబ్బంది నిరంతరం కరోనాపై పోరాడుతున్నారని తెలిపారు. టెస్టుల సంఖ్య తక్కువగా చేసినప్పటికీ కరోనా రికవరీ తెలంగాణలో ముందంజలో ఉందన్నారు. గాంధీ ఆసుపత్రిలో వైద్యులు నిర్లక్షం చేస్తున్నారని ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. గాంధీలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చాలామంది కోలుకొని ఇంటికి వెళ్లారని చెప్పారు. 60ఏళ్లు పైబడి, చిన్నారులపై కరోనా ప్రభావం అధికంగా ఉంటుందని.. అలాంటిది గాంధీలో ఏకంగా 90మందికి పైగా వృద్ధులు, 28రోజుల వయస్సున్న శిశువును కరోనా నుంచి కోలుకున్నారని తెలిపారు.

కరోనా లక్షణాల లిస్టు రోజురోజుకు పెరిగిపోతుందా?

తెలంగాణలో రికవరీ రేటు 98శాతం ఉందని, మరణాలరేటు కేవలం రెండు శాతంగా ఉందన్నారు. జాతీయ సగటుతో పొలిస్తే తెలంగాణలో మరణాల రేటు తక్కువగా ఉందని తెలిపారు. విపక్షాలు రికవరీ రేటు విస్మరించి కేవలం మరణాలను మాత్రమే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో రికవరీ రేటుపై మీడియా, ప్రతిపక్షాలు దృష్టిపెడితే అసలు వాస్తవాలు తెలుస్తాయన్నారు. ప్రభుత్వానికి మంచిపేరు రావొద్దనే దురుద్దేశ్యంతోనే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయంటూ కరోనా విమర్శలకు కేటీఆర్ తనదైన శైలిలో చెక్ పెట్టారు.

ఆన్ లైన్ క్లాసులకు సిద్ధమవుతున్న తెలంగాణ!


ప్రతీయేటా జూన్ నెల ఆరంభంలోనే విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేది. అయితే దేశంలో కరోనా ప్రభావం విద్యాసంస్థలన్నీ మూతపడిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం జూలై నెల గడుస్తున్నప్పటికీ విద్యాసంస్థలను తెరిచేందుకు ఆయా ప్రభుత్వం జంకుతున్నాయి. విద్యా సంవత్సరం ఇంకా ఆలస్యమైతే ఇబ్బందులు ఎదుర్కొక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కరోనా టైంలోనూ కేరళ ప్రభుత్వం ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తూ ముందుకెళుతోంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా కేరళ దారిలోనే నడిచేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.

కరోనా లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూనే కేరళ ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించింది. అంతేకాకుండా యథావిధి విద్యా సంవత్సరాన్ని ప్రారంభించి అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. జూన్‌ 1నుంచే ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ఛానళ్ల ద్వారా టీవీల్లో పాఠాలు చెబుతున్నారు. వీటినే యూ ట్యూబ్లో అప్‌లోడ్‌ చేస్తూ ఆన్ లైన్ తరగతులను నిర్వహిస్తున్నారు.

కరోనాపై పోరాటం.. హైదరాబాదీల స్వచ్చంధ లాక్ డౌన్

ఇక స్మార్ట్‌ఫోన్‌ లేనివారు, టీవీల్లేని వారి కోసం ప్రత్యేకంగా అంగన్‌వాడీల్లో టీవీలు పెట్టించారు. విద్యార్థుల ఇంట్లో టీవీ, స్మార్ట్ ఫోన్ లేనట్లయితే వారిని అంగవాడీలకు తీసుకొచ్చే బాధ్యతను ప్రభుత్వం స్థానిక గ్రామ సర్పంచ్ కు అప్పగించింది. స్థానిక సంస్థలను వినియోగించుకుంటూ ప్రభుత్వం విజయవంతంగా ఆన్ లైన్ క్లాసులను నిర్వహిస్తోంది. కేరళ బాటలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా త్వరలో ఆన్ లైన్ క్లాసులు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన డీడీ యాదగిరి, టీశాట్‌, లోకల్‌ కేబుల్‌ ద్వారా ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహించేందుకు విద్యాశాఖ రెడీ అవుతోంది. ఇంట్లో టీవీలు, స్మార్ట్ ఫోన్ లేనివాళ్లు స్కూల్లో పాఠాలు వినేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా స్కూళ్లకు ఉచితంగా టీవీలను పంపిణీ చేశారట. అదేవిధంగా ఈనెల 20నుంచి పాఠ్యపుస్తకాల పంపిణీ చేయనున్నారట. రోజుకు రెండు నుంచి మూడు గంటలు టీవీల్లో పాఠాలు చెప్పేలా ప్రణాళికలు సిద్ధం చేసింది.

కరోనా లక్షణాల లిస్టు రోజురోజుకు పెరిగిపోతుందా?

ఈమేరకు ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఆన్ లైన్ తరగతులపై క్లారిటీ ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈమేరకు ప్రభుత్వం ఆన్ లైన్ క్లాసుల నిర్వహణపై తీసుకుంటున్న చర్యలకు హైకోర్టుకు విన్నవించనుంది. కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించేందుకు ప్రభుత్వం షెడ్యూల్‌ ప్రకటించనుంది. అన్ని పనులు సజావుగా జరిగితే మరో వారం, పది రోజుల్లో ఆన్ లైన్ క్లాసులు తెలంగాణలో ప్రారంభమవడం ఖాయంగా కన్పిస్తోంది.

బాలీవుడ్‌ను వదలని విషాదాలు… ఇద్దరు నటులు మృతి


బాలీవుడ్‌కు ఈ ఏడాది ఏదీ కలిసిరావడం లేదు. కరోనా కారణంగా సినిమాలు, షూటింగ్స్‌ ఆగిపోయి ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. అమితాబ్‌ బచ్చన్‌ కుటుంబం సహా పలువురు కరోనా బారిన పడ్డారు. మరోవైపు సినీ ప్రముఖుల వరుస మరణాలు బాలీవుడ్‌ను కుంగదీస్తున్నాయి. రిషీ కపూర్, ఇర్ఫాన్‌ ఖాన్, సరోజ్‌ ఖాన్, వాజిద్‌ ఖాన్, జగదీప్‌ మరణాలు, నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్యతో బాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తాజాగా మరో ఇద్దరు యువ నటులు ఒకే రోజు అకాల మరణం పొందారు. బాలీవుడ్‌ సినీ, టీవీ నటుడు రాజన్‌ సెహగల్‌ (36), ప్రముఖ మోడల్‌, నటి, గాయని అయిన దివ్య చోక్సీ (29) ఆదివారం కన్నుమూశారు. ఇద్దరూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రాజన్‌ చండీగఢ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బుల్లితెర నుంచి బాలీవుడ్‌లో అడుగు పెట్టిన నటుడిగా ఆయనకు మంచి పేరుంది. బుల్లితెరపై క్రైమ్‌ పెట్రోల్, సావధాన్‌ ఇండియా, తుమ్‌ దేనా సాత్‌ మేరా వంటి కార్యక్రమాలతో ద్వారా ప్రేక్షకులకు చేరువైన రాజన్.. ఐశ్వర్యా రాయ్, రణదీప్‌ హుడా నటించిన ‘సరబ్‌జిత్‌’ చిత్రంతో ఓ కీలక పాత్రతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆపై, ‘ఫోర్స్’ , కర్మ’ వంటి చిత్రాలతో పాటు పంజాబీ చిత్రాల్లోనూ నటించాడు.

బాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ కొరియోగ్రాఫర్ మృతి

మరోవైపు నటిగా, గాయనిగా ఫేమ్‌ సాధించిన దివ్య చోక్సి గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతోంది. ఆదివారం ఆమె తుది శ్వాస విడిచినట్టు దివ్య బంధువు సౌమ్యా అమిష్‌ వర్మ వెల్లడించారు. 2011 సంవత్సరంలో మిస్ యూనివర్స్ ఇండియా పోటీలో పాల్గొన్న దివ్య 2016 లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ఫేమ్ సాహిల్ ఆనంద్‌తో కలిసి ‘హై అప్పా దిల్ తోహ్ అవారా’ సినిమాలో నటించింది. ఆపై పలు యాడ్ ఫిల్మ్స్, టెలివిజన్ షోస్‌లో యాక్ట్ చేసింది. ‘పాటియలే డి క్వీన్’ సాంగ్‌తో సింగర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తనను తాను క్యాన్సర్ సర్వైవర్‌గా గర్వంగా చెప్పుకున్న దివ్య మరణానికి కొన్ని గంటల ముందు సోషల్‌ మీడియాలో భావోద్వేగ పోస్ట్‌ పెట్టడం గమనార్హం. ‘చాన్నాళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతూ నెలల తరబడి మరణశయ్యపై ఉన్నాను. బాధ లేని మరో జన్మలో కలుద్దాం. ఇక సెలవంటూ’ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులో తుది వీడ్కోలు చెప్పడం మరింత బాధాకరం.

https://www.facebook.com/rahul.kapoor.73157203/posts/3313446312040568

మరో సీరియల్ నటుడికి కరోనా పాజిటివ్‌


తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో ఈ ప్రాణాంతక వైరస్‌ కోరలు చాస్తోంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న దాడి చేస్తోంది. సాధారణ ప్రజలే కాదు రాజకీయ నాయకుడు, సెలెబ్రిటీలు, ప్రభుత్వ అధికారులు, పోలీసుల, జర్నలిస్టులపై పంజా విసురుతోంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీని కరోనా కలవర పెడుతోంది. ప్రభుత్వం అనుమతించడంతో సినిమా, సీరియల్స్‌ షూటింగ్స్‌ తిరిగి ప్రారంభమయ్యాయి. ఇప్పుడు కరోనా వ్యాప్తికి అవే హాట్‌స్పాట్స్‌గా మారాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నటీనటులకు వైరస్‌ ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే పలువురు టెలివిజన్‌ నటీనటులకు కరోనా సోకగా తాజాగా మరో నటుడికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

ఐశ్వర్యా రాయ్‌, ఆమె కూతురుకూ కరోనా

బుల్లితెర నటుడు, స్వాతి చినుకులు ఫేం భరద్వాజ్ రంగావిజ్జుల కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని అతనే ఇన్‌స్టాగ్రామ్‌ లో వెల్లడించాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు నిమిషాల వీడియో పోస్టు చేసిన భరద్వాజ్ తన ఆరోగ్య విషయాలు తెలిపాడు. కరోనా సోకినప్పటికీ తనలో తనకు లక్షణాలేవి లేవన్నాడు. తన గురించి, వైరస్‌ గురించి ఎవ్వరూ భయపడవద్దని సూచించాడు. సరైన ఆహారం, మందులతో కరోనా నుంచి బయట పడవచ్చన్నాడు. తనతో కలిసి నటించిన వాళ్ళు ఐసోలేషన్‌లో ఉండాలని, టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ‘స్వాతి చినుకులు’, ‘బంధం’ అనే టీవీ సీరియళ్లలో నటిస్తున్న భరద్వాజ్‌ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా, స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్‌ కరోనా నుంచి కోలుకోగా.. తెలుగు సీరియల్స్‌లో నటిస్తున్న నవ్య స్వామి, రవికృష్ణ, సాక్షి శివ కూడా వైరస్‌ బారిన పడ్డారు. ఝాన్సీ, ప్రభాకర్‌ వంటి పలువురు నటులకు కూడా వైరస్‌ సోకిందన్న వార్తలు వచ్చాయి.

https://www.instagram.com/tv/CCds9Nfl1w8/

 

‘ఐఏఎస్‌’ ట్రెయినింగ్‌ తీసుకుంటున్న సాయి ధరమ్‌


నిజమే. సాయిధరమ్‌ ఐఏఎస్‌ ట్రెయినింగ్‌ తీసుకుంటున్నాడు. త్వరలోనే చార్జ్‌ తీసుకోబోతున్నాడు. అదేంటి సాయి ధరమ్‌ హీరో కదా.. నటన వద్దని సివిల్స్ రాశాడా? ర్యాంక్‌ కూడా కొట్టేశాడా? అన్న అనుమానం వద్దు. అతను ఐఏఎస్‌ ట్రెయినింగ్‌ తీసుకుంటున్నది మూవీ కోసమే. మెగా కాంపౌండ్‌ నుంచి చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి తనకంటూ ప్రత్యేకత ఏర్పరచుకున్నాడు సాయి. యాక్టింగ్‌, డ్యాన్‌, బాడీ లాంగ్వేజ్‌తో స్టార్ డమ్‌ తెచ్చుకున్నాడు. ఫస్ట్‌ రిలీజైన ‘పిల్ల నువ్వు లేని జీవితం’తోనే స్టామినా చూపించిన అతను ‘సుబ్రమణ్యం ఫర్ సేల్‌’, ‘సుప్రీమ్‌’, ‘చిత్రలహరి’, ‘ప్రతి రోజు పండగే’ లాంటి హిట్స్‌ ఖాతాలో వేసుకున్నాడు. అలాగని ఫెయిల్యూర్స్‌ లేవని కాదు.. తొలుత నటించిన రేయ్‌తో పాటు తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్‌, ఇంటిలిజెంట్‌, తేజ్‌ ఐ లవ్‌ యు.. వంటి డిజాస్టర్స్‌ కూడా అతని ఖాతాలో ఉన్నాయి. దాంతో, అతను ఈ మధ్య కథల ఎంపికలో జాగ్రత్తగా ఉంటున్నాడు. వైవిధ్యం ఉన్న కథలు, విలక్షణమైన పాత్రలే ఎంచుకుంటున్నాడు. ‘చిత్రలహరి’లో వైఫల్యాల నుంచి సక్సెస్‌ సాధించిన యువకుడి పాత్రలో అద్భుతంగా నటించిన అతను… ప్రతి రోజు పండగేలో విదేశాల నుంచి పల్లెటూరికి వచ్చి మనవడిగా నటించి మెప్పించాడు. రిలీజ్‌కు రెడీగా ఉన్న ‘సోలో బ్రతుకే సో బెటర్’లో ప్రేమ, పెళ్లి వద్దని యువతకు హితబోధ చేసే దగ్గరి నుంచి ప్రేమలో పడే యువకుడి పాత్ర పోషించాడు.

వియ్యంకుడు సాయి తేజ్‌కు థ్యాంక్స్‌ చెప్పిన మంచు మనోజ్!

ఇప్పుడు ఐఏఎస్‌ అధికారిగా నటించబోతున్నాడు. దేవ కట్టా దర్శకత్వంలో సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. పాలిటిక్స్‌ బ్యాక్‌ డ్రాప్‌లో నడిచే మూవీలో సాయి యువ ఐఏఎస్‌ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడట. దాంతో, ప్రస్తుతం ఐఏఎస్‌ ఆఫీసర్ల విధివిధానాలు, వారి బాడీ లాంగ్వేజ్‌ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాడని తెలుస్తోంది. వాటిని నిశితంగా గమనించడంతో పాటు యువ ఐఏఎస్‌ గెటమ్‌లో ఫిట్‌గా కనిపించేందుకు బరువు తగ్గేలా ట్రెయినింగ్‌ తీసుకుంటున్నాడు. నార్త్‌ ఇండియా నేపథ్యంలో కథనం ఉంటుందని వినికిడి. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తారట. కరోనా పరిస్థితులు కుదుటపడ్డాక ఈ మూవీని సెట్స్‌ మీదకు తీసుకెళ్లాలని ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్‌.

నెక్స్ట్ మాజీ మంత్రి పితాని జైలుకెళ్లడం ఖాయమట..


ఏపీ సీఎం జగన్ టీడీపీ నేతలను వేటాడేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా తనను ముప్పుతిప్పలు పెట్టిన వారి లూప్ హోల్స్ ను అధికారంలో ఉండి తవ్వి తీస్తున్నారు. ఇటీవలే వైఎస్ జగన్ సర్కార్ టీడీపీ ముఖ్య నాయకులను ఒకేరోజు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడు, జేసీ ట్రావెల్స్ మోసంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో మీడియా ఫోకస్ అంతా టీడీపీపై పడింది. టీడీపీ నేతలు, శ్రేణులంతా షాక్ కు గురై ఆందోళనలో ఉన్నారు.

జేసీ ఫ్యామిలీని పరామర్శించడానికి వెళుతున్న నారా లోకేష్.. అచ్చెన్నాయుడు ఫ్యామిలీ వద్దకు, అచ్చెన్న వద్దకు వెళ్లే సాహసం చేయడం లేదు. ఎందుకంటే ఈఎస్ఐ స్కాంతోపాటు ఫైబర్ గ్రిడ్, సహా చంద్రబాబు పాలనలో నారాలోకేష్ కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు అచ్చెన్నను కలిస్తే పాత విషయాలు తవ్వుకున్నట్టు ఉంటుందని అచ్చెన్న ముఖం చూడడానికి కూడా లోకేష్ బాబు సాహసించడం లేదని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అచ్చెన్నను లోకేష్ పూర్తిగా విస్మరించడానికి కారణం అదేనా అన్న చర్చ మొదలైంది.

ఆనంతో… రఘురామ్, ఏం జరుగుతుంది జగన్ ?

ఇక అచ్చెన్నాయుడు, జేసీ ఫ్యామిలీ తర్వాత వైసీపీ ప్రభుత్వం నెక్ట్స్ టార్గెట్ ఎవరనే చర్చ ఇప్పుడు టీడీపీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల టీడీపీ మాజీ మంత్రి పీఏపై కేసులు బుక్ కావడంతో నెక్ట్స్ ఆయనేనని అంటున్నారు.

అచ్చెన్నాయుడు తర్వాత అదే కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు పితాని సత్యనారాయణ. ఇప్పుడు ఆయన టార్గెట్ గా రాజకీయ ప్రచారం సాగుతుండడంతో పితాని ఆందోళన చెందుతున్నారు. పితాని సత్యనారాయణ మాజీ పీఎస్ మురళీ మోహన్ ను గత శుక్రవారం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సచివాలయంలో విధుల్లో ఉన్న మురళీ మోహన్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రి పితాని కుమారుడు, మాజీ పీఎస్ మురళీ మోహన్ ప్రమేయం ఉన్నట్టు గుర్తించిన ఏసీబీ తాజాగా మురళీ మోహన్ ను అదుపులోకి తీసుకుంది.

ఇక అంతకుముందే మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు సురేష్ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇదే కేసుకు సంబంధించి పితాని వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)గా పనిచేసిన మురళి మోహన్ కూడా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు తన తీర్పును రిజర్వు చేసింది. ఇంతలోనే మాజీ పీఎస్ ను ఏసీబీ అదుపులోకి తీసుకోవడం గమనార్హం.

పితాని సత్యనారాయణ కుమారుడిని ఏసీబీ అరెస్ట్ చేయబోతోందంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగడంతో పితాని స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ ఆరోపణలు ఖండించారు. గత ప్రభుత్వ హయాంలో అచ్చెన్నాయుడు తర్వాత కార్మికశాఖ మంత్రిగా పితాని పనిచేశారు. ఈఎస్ఐ స్కాంలో తరువాత కీలక పాత్ర పోషించింది ఈయనేనని ఏసీబీ తేల్చినట్టు సమాచారం. అధికార పార్టీ నేతలు ఈ మేరకు ప్రచారం చేస్తున్నారని అంటున్నారు.

వైసీపీ టార్గెట్: టీడీపీలో నెక్స్ట్ ఎవరు

ఈఎస్‌ఐ మెడికల్‌ స్కాంకి సంబంధించి మురళీమోహన్‌ పాత్రపై ఏసీబీ దగ్గర పక్కా ఆధారాలు ఏసీబీ వద్ద ఉన్నాయని తెలిసింది. ఈ ఆధారాల్లో పితాని సురేష్‌ వ్యవహారం కూడా బయటపడిందంటూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ, అటు మీడియా వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది.మరోపక్క మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కూడా ఈ కేసులో అడ్డంగా ఇరుక్కుపోయారనీ, పితాని సురేష్‌ తర్వాతి అరెస్ట్‌ పితాని సత్యనారాయణదేనంటూ అధికార పార్టీ పరోక్షంగా సంకేతాలు పంపుతోంది. ఇది చిన్న స్కాం కాదు.. చాలా చాలా పెద్దది అంటోంది అధికార పక్షం. అందుకు తగ్గట్టుగానే అరెస్టుల పర్వం నడుస్తోంది.

ఎవరి వాదనలు ఎలా ఈఎస్ఐ కొనుగోళ్లలతో తనకు ఎలాంటి సంబంధం లేదని గతంలో బుకాయించిన అచ్చెన్నాయుడు ఇప్పటికే అరెస్టయ్యారు.. ఇప్పుడు తనకు సంబంధం లేదంటూ ఇప్పటికే పితాని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. ఇప్పుడు అధికారవర్గాల సమాచారం ప్రకారం పితాని సత్యనారాయణ కూడా అరెస్టయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయంటున్నారు. ముందస్తు బెయిల్‌ కోసం ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించిన పితాని సురేష్‌, కోర్టు నుంచి ఉపశమనం దొరికే చాన్స్ కనిపించడం లేదు.. కానీ ఏసీబీ మాత్రం.. ఈ కేసుని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లే కన్పిస్తోంది. నెక్ట్స్ అరెస్ట్ అయ్యేది పితాని అని కన్ఫం అవుతోంది. రేపోమాపో పితాని కూడా జైలు కెళ్లడం ఖాయమంటున్నారు.

కాంగ్రెస్ ను వీడుతున్న యువతరం.. ఎందుకు?

Congress Leaders
కంటెంట్ ఉన్నోడికి కటౌట్ అక్కర్లేదు డ్యూడ్ అంటారు. ఆ సినిమా డైలాగ్ రాజకీయాల్లో బాగా పేలుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కంటే ఆ పార్టీని నడిపించిన వారి వల్లే ఆ పార్టీ ఇన్నాళ్లు దేశంలో బలీయమైన శక్తిగా కొనసాగింది. నెహ్రూ, ఇందిరా, రాజీవ్ లాంటి బలమైన నేతలే ఆ పార్టీకి ఆయువు పట్టుగా ఉన్నారు. కానీ ఇప్పుడా శక్తే లేకుండాపోయింది వృద్ధ జంబూకాలతో యువరక్తానికి అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ తన గోతిని తానే తవ్వుకుంటోంది. కాంగ్రెస్ పార్టీలో ధ్రువతారలుగా వెలిగారు వై.యెస్.రాజశేఖర్ రెడ్డి, మాధవరావు సింధియా, రాజేష్ పైలట్ లు. ఈ ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీలో సొంతంగా ఎదిగిన మూడు రాష్ట్రాల నాయకులు. ముగ్గురు కూడా ప్రజాదరణ కలిగిన నాయకులు. ముగ్గురిది సుదీర్ఘ ప్రజా రాజకీయ ప్రయాణం. కానీ ఇప్పుడా ముగ్గురు నేతల కుటుంబాలు కాంగ్రెస్ కు దూరమైపోయాయి. తమ ప్రతిభతో ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చిన ఈ మూడు ఫ్యామిలీల కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ చేజేతులారా వదులుకుంది. ఇప్పుడు అనుభవిస్తోంది.

కాంగ్రెస్ ను ఖతం చేసేందుకు మోడీషా ప్లాన్?

బీజేపీలో అద్వానీ, మురళీ మనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా, ఉమా భారతి, మేనకాగాంధీ, సుష్మ స్వరాజ్ లాంటి 75 ఏళ్లు దాటిన వారిని మోడీ తన కేబినెట్ లోకి తీసుకోకుండా యువతకు పెద్ద పీటవేశాడు. కానీ అదే పని కాంగ్రెస్ చేయలేకపోయింది.ఇప్పుడు 100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ వృద్ధ జంబూకాలతో యువతరానికి చోటే లేకుండా చేస్తోంది.. అందుకే ఇప్పుడు ఒక్కో రాష్ట్రాన్ని వదులుకుంటోంది.

కాంగ్రెస్ కు రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా ఉన్న వేళ 2018 డిసెంబర్ లో 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాలను గెలిపించాడు. మధ్యప్రదేశ్ లో సింధియాను, రాజస్థాన్ లో సచిన్ పైలెట్ ను సీఎం చేద్దామని అనుకున్నారు. సీనియర్లు అయిన అశోక్ గెహ్లాట్, కమల్ నాథ్ లను పక్కనపెట్టారు. కానీ సోనియా రంగ ప్రవేశం చేసి సీనియర్లకే పెద్దపీట వేసి జూనియర్లు సింధియా, పైలెట్ లను పక్కనపెట్టింది. వ్యతిరేకించిన రాహుల్ గాంధీని నోరుమూయించింది. ఫలితం ఇప్పుడు మధ్యప్రదేశ్ లో తనకు సీఎం పదవి ఇవ్వని కాంగ్రెస్ నుంచి సింధియా వైదొలిగారు. బీజేపీలో చేరారు. ఆ రాష్ట్రం బీజేపీ వశమైంది. ఇప్పుడు రాజస్థాన్ లోనూ అదే కథ. సచిన్ పైలెట్ తాజాగా 30మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేశారు. సీఎం అవ్వాల్సిన సచిన్ పైలెట్ ను పక్కనపెట్టి రాహుల్ వద్దంటున్నా అక్కడ అశోక్ గెహ్లాట్ ను సీఎం చేసింది సోనియా.. ఫలితం ఇప్పుడు సచిన్ పైలట్ తిరుగుబాటుతో రాజస్థాన్ లో కాంగ్రెస్ సర్కార్ కూలుతోంది. ఇలా ప్రజల్లో పోరాడుతున్న.. ఫేం ఉన్న యువనేతలకు రాజకీయ అధికారం ఇవ్వకుండా వృద్ధ జంబూకాలను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ అథోగతి పాలవుతోంది. రాహుల్ చెప్పినా.. సోనియా ఇతర సీనియర్ల ధాటికి కాంగ్రెస్ నామరూపాల్లేకుండా పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

యుపి లో బ్రాహ్మణ కార్డు బయటకు తీసిన కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీలో వెలుగు వెలిగిన ఆ ముగ్గురి వారసులు జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్, వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ లోనే తమ రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. జ్యోతిరాదిత్య సిందియా, సచిన్ పైలట్ మళ్ళీ కేంద్ర మంత్రులయ్యారు. కాకపోతే జ్యోతిరాదిత్య , సచిన్ పైలట్ సుమారు 20 ఏళ్ళు కాంగ్రెస్ లో ఉండి ఎన్నో అధికార పదవులు అనుభవించి కొన్ని కారణాల వల్ల పార్టీ అధిస్థానం మాటకు భిన్నంగా తమ వ్యతిరేక పార్టీ అయిన బీజేపీ తో చేతులు కలిపారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తను ఎంపిగా ఎన్నికైన రెండేళ్లలోనే 2011 కేంద్రంలో, రాష్ట్రంలో వివిధ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని మోసం చేయలేదు. ఏపీలో ప్రభుత్వాన్ని కూల్చలేదు. బయటకొచ్చి సొంతంగా ఎదిగాలనుకున్నారు. పూర్తిగా ప్రజా బలంతో, ప్రజాస్వామ్యయుతంగా ఎంత అణిచివేసినా తిరుగులేని ప్రజాదరణతో 2019లో అధికారం చేపట్టాడు. పై ఇద్దరి వారసులకి తనకు ఉన్న తేడాను చూపించాడు జగన్.

ఇవాళా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కనీసం కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యంత బలమైన రాష్ట్రం. కానీ నేడు ఇప్పుడు అదే రాష్ట్రంలో నామరూపాల్లేకుండా పోవడం స్వయంకృతాపరాధం..ప్రజాదరణ ఉండి రాష్ట్ర స్థాయిలో నాయకత్వ లక్షణాలు ఉన్న శరద్ పవార్, మమతా బెనర్జీ.. సిందియా, పైలట్, వై.యెస్.జగన్ లాంటి యువ నాయకులను కోల్పోతున్న కాంగ్రెస్ తన ప్రాభవాన్ని పోగొట్టుకుని దేశంలో రోజురోజుకూ మరింత బలహీనమైపోతోంది. సీనియర్లనే పట్టుకొని యువనేతలను వదిలేస్తున్న కాంగ్రెస్ పార్టీ అందుకు తగ్గ ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

‘విభజన’తో టీడీపీకీ జగన్ స్కెచ్..!

Jagan sketch to TDP
ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి ఇటీవల ఏడాది పూర్తయింది. ఈ సంవత్సరకాలంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల్లోకి దూసుకెళుతున్నారు. మరోవైపు రాజకీయంగా ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. సీఎం ప్రమాణ స్వీకారం చేసిన తొలి నుంచే జగన్మోహన్ రెడ్డి టీడీపీని టార్గెట్ చేసినట్లు కన్పిస్తుంది. చంద్రబాబు హయాంలో జరిగిన స్కాములను బయటికి తీసి టీడీపీ నేతలకు వరుసబెట్టి జైల్లోకి పంపుతున్నారు. దీంతో టీడీపీ నేతలు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు పాల్పడుతుందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. వైసీపీ కూడా టీడీపీపై ఎదురుదాడి దిగుతుండటంలో ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.

ఆనంతో… రఘురామ్, ఏం జరుగుతుంది జగన్ ?

ఏపీలో వైసీపీని బలపరస్తూనే ప్రతిపక్ష టీడీపీని దెబ్బకొట్టేందుకు సీఎం జగన్ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు సీఎం జగన్ కు జై కొడుతున్నారు. చంద్రబాబు హయాంలో మంత్రులు పదవులు అనుభవించిన వారుసైతం ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే టీడీపీకి హ్యండిచ్చి వైసీపీ పక్షంలో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఇదిలా ఉండగానే ఏపీలో జిల్లాల విభజన అంశాన్ని జగన్ వ్యూహాత్మకంగా పైకి తీసుకొచ్చి టీడీపీని దెబ్బకొట్టేందుకు ప్లాన్ చేస్తున్నారనే టాక్ విన్పిస్తుంది.

జిల్లాల విభజనతో టీడీపీ అనుకూలంగా ఉన్న జిల్లాల్లో మార్పులు జరిగే అవకాశం ఉందని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో రాజకీయ వేడి రాజుకున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాను విభజించవద్దని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరుతున్నారు. నెల్లూరును విభజిస్తే కొన్ని ప్రాంతాలు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో కలుస్తాయని దీంతో జిల్లా రూపురేఖలు మారిపోతాయని ఆందోళన చెందుతున్నారు. వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు సైతం శ్రీకాకుళం జిల్లాను విభజించొద్దని డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ, వైసీపీ నేతలు తమ జిల్లాలను విభజించొద్దని కోరుతుండటం గమనార్హం.

జగన్ పట్టుదల.. టెక్ దిగ్గజం ఏపీకి..

అయితే విభజనతో టీడీపీకి గట్టి షాక్ తగిలే అవకాశం ఉండటంతో జగన్మోహన్ రెడ్డి ఆదిశగా ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా, జిల్లాలను విభజించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జగన్ నిర్ణయంతో టీడీపీ తీవ్ర నష్టం కలుగనుందని ఈమేరకు చంద్రబాబు నాయుడికి దృష్టికి నేతలు తీసుకెళ్లారు. జిల్లాల విభజనతో టిడిపి ఓటు బ్యాంకు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని, బలమైన నియోజకవర్గాల్లో పట్టు కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం సీఎం జగన్ జిల్లాల విభజనపై కసరత్తు మాత్రమే చేస్తున్నారని ఇంకా నిర్ణయం తీసుకోలేదని చంద్రబాబు టీడీపీ నేతలు చెబుతున్నారు. అంతలా జిల్లాల విభజనపై ప్రభుత్వం ముందుకెళితే పెద్ద ఎత్తున పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. సంస్కృతి, వారసత్వ సంపద ఎన్నోఏళ్లుగా ఉన్న వేషభాషలపై ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చి జిల్లాల విభజన బ్రేక్ వేసేలా టీడీపీ ప్లాన్ చేస్తోంది.

జిల్లాల విభజనకే ప్రభుత్వం మొగ్గుచూపితే రానున్న రోజుల్లో టీడీపీ మరింత గడ్డుపరిస్థితి ఎదురయ్యేలా అవకాశాలు కన్పిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన టీడీపీ జగన్ వ్యూహానికి ప్రతివ్యూహాన్ని రచిస్తుంది. దీంతో విభజన అంశం ఏ పార్టీకి షాకిస్తుందోననే చర్చ ఆసక్తిని రేపుతోంది.

జగన్ పట్టుదల.. టెక్ దిగ్గజం ఏపీకి..


ప్రస్తుతం కరోనా వ్యాపింప చేసిన చైనాపై అమెరికా గుర్రుగా ఉంది. చైనాతో వాణిజ్యయుద్ధం చేస్తోంది. ఆ క్రమంలోనే అమెరికన్ కంపెనీలను చైనా నుంచి వెనక్కి రావాలని ట్రంప్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే చైనా సేఫ్ కాదని ఈ ప్రపంచ దిగ్గజ సంస్థ భారత్ బాట పడుతోంది. కరోనా వైరస్‌ తర్వాత వచ్చే ఐదేళ్లలో భారతదేశ దేశీయ ఎలక్ట్రానిక్‌ మార్కెట్‌ విలువ 400 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని ప్రధాని నరేంద్రమోడీ అంచనావేశారు. . ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కంపెనీలకు మోడీ సూచించారు. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ దిగ్గజ కంపెనీని ఏపీ సర్కార్ చేజిక్కించుకుంది. ప్రైవేట్ పరిశ్రమలు, పెట్టుబడులు జగన్ ఉండగా రావడం లేదన్న టీడీపీ విమర్శలకు చెక్ పడింది. ప్రపంచ టెక్ దిగ్గజమే ఏపీకి వస్తుండడం విశేషంగా మారింది.

ఇప్పుడు ఆ కాపునేతలు ఏం సమాధానం చెబుతారు..?

ఏపీ సీఎం జగన్ తన ఏడాది పాలనలో పరిశ్రమలు , పెట్టుబడులపై పెద్దగా దృష్టి పెట్టలేదని టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు. కానీ ఇప్పుడు వారికి బుద్దివచ్చేలా జగన్ పట్టుబట్టి సాధించాడు. ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ సరఫరాదారుని ఏపీకి రప్పిస్తున్నారు. అయితే ఇటీవలే రాష్ట్రంలోని కియా ఫ్యాక్టరీ విస్తరించనున్నట్టు ప్రకటించింది . ఇక ఇప్పుడు మరో పారిశ్రామిక దిగ్గజం కూడా ఇదే బాటలో పయనిస్తోంది .ఆంధ్రప్రదేశ్ కు ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి .

ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ తయారీ కంపెనీ అమెరికాకు చెందిన యాపిల్ సంస్థ. సుప్రసిద్ధ టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తయారుచేసే ఐఫోన్లకి ప్రపంచవ్యాప్తంగా ఎంత గిరాకీ ఉందో తెలిసిందే. ఇక యాపిల్ ఐఫోన్లను భారత్ లోనే ఉత్పత్తి ప్రారంభించనున్నారు. ఈ ఏడాది నుంచి ఐఫోన్లను భారీ ఎత్తున భారత్ లో ఉత్పత్తి చేయనున్నట్టు యాపిల్ ఫోన్ల తయరీ సంస్థ ‘ఫాక్స్ కాన్’ తెలిపింది. ఈ మేరకు ఫాక్స్ కాన్ టెక్నాలజీ గ్రూప్ చైర్మన్ టెరీ గోవు ప్రకటించారు. తమ కంపెనీ భారత్ లో విస్తరణ ఆలోచనలో ఉండటంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత్ రావాల్సిందిగా తనను ఆహ్వానించినట్టు గోవు తెలిపారు. యాపిల్ ఐఫోన్లలో కొన్ని పాత మోడళ్లని కొన్నేళ్లుగా బెంగుళూరులోనే తయారు చేస్తున్నారు. ఇకపై కంపెనీ లేటెస్ట్ మోడళ్లని కూడా భారత్ లోనే ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తారు. భారత్ లో లేటెస్ట్ ఐఫోన్ల ట్రయల్ ప్రొడక్షన్ కి ఫాక్స్ కాన్ సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

కరోనా కట్టడిలో జగన్ మరో విప్లవాత్మక నిర్ణయం

తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించినట్టు తెలిపింది. . ఫాక్స్ కాన్ ను మొబైల్ ఫోన్ల రంగంలో మంచి పేరుంది . ఈ సంస్థకు ఇప్పటికే శ్రీ సిటీలో ఓ యూనిట్ ఉంది . ఇప్పుడు ఈ యూనిట్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతామని ఫాక్స్‌కాన్‌ ఇంటర్నేషనల్‌ హోల్డింగ్‌ ఇండియా ఎండీ , కంట్రీ హెడ్‌ జోష్‌ ఫౌల్గర్‌ ప్రకటించారు .

ఇదే సమయంలో జోష్‌ ఫౌల్గర్‌ ఏపీ సర్కారు పనితీరును మెచ్చుకున్నారు . శ్రీ సిటీలోని ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించడానికి వేగంగా అనుమతులు మంజూరు చేసిందన్నారు . రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడిలోనూ చురుగ్గా పని చేసిందని కితాబిచ్చారు . కరోనా సమయంలో పారిశ్రామిక రంగం త్వరగా కోలుకునే విధంగా ఏపీ సర్కారు.. సీఎం మంచి చర్యలు తీసుకుందని జోష్ ఫౌల్గర్ మెచ్చుకున్నారు.

ఇలా టీడీపీ నేతలు ఏపీ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయి.. పెట్టుబడులు రావడం లేదని విమర్శిస్తున్న వేళ.. ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ యాపిల్ సరఫరాదారు ఏపీలో పెట్టుబడులకు అంగీకరించడం జగన్ సాధించిన గొప్ప విజయంగా చెప్పవచ్చు.

ఆనంతో… రఘురామ్, ఏం జరుగుతుంది జగన్ ?

Raghurama Raju selfie wit Anam Ramanarayana
పాలకుడికి ప్రజా సంక్షేమం ఎంత ముఖ్యమో, పాలక వర్గాన్ని అదుపులో పెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. మనం అధికారంలో ఉండడానికి కారణమైన ఎమ్మెల్యేల మధ్య సమన్వయం సాధించడంతో పాటు, వ్యతిరేకతను ఆదిలోనే అణచివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా సొంత పార్టీకి చెందిన వ్యతిరేకులను భయపెట్టో, బుజ్జగించో అదుపులో పెట్టుకోవాలి. వారి ధిక్కార స్వరం రాష్ట్రం మొత్తం వినేలా చేసుకోకూడదు. వ్యతిరేక ఎమ్మెల్యేలు, లేదా ఎంపీలను దారికి తెచ్చుకోవడంలో అధినేత విఫలం చెందితే అది మరి కొంత మందికి అలుసుగా మారుతుంది. ఒకరితో మొదలైన ఈ వ్యతిరేకత, ఉద్యమంగా మారే ప్రమాదం ఉంటుంది. పాలనపై దృష్టితో పాటు సొంత పార్టీ నేతల అభిప్రాయాలు, జరుగుతున్న పరిణామాలు, కుట్రలు ఎప్పటికప్పుడు అధినేత గమనిస్తూ ఉండాలి.

తెలంగాణలో బీజేపీ వ్యూహం ఫలిస్తుందా?

ఈ విషయంలో జగన్ ఇంకా రాటుదేలినట్లు లేడు. ఆయన కేవలం పాలనపై దృష్టి సారించి, సొంత పార్టీ నేతల అవసరాలు, అభిప్రాయాల సేకరణ మరచినట్లున్నారు. దీనితో సొంత పార్టీ నేతలలో ఒకరొకరుగా ఆయనపై వ్యతరేక జెండా ఎగరవేస్తున్నారు. ఇప్పటికే ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. ఆయన వైసీపీ ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేయడంతో పాటు, ఆ పార్టీ అస్థిత్వాన్నే ప్రశ్నించారు. జగన్ కి విధేయుడిని అని చెవుతూనే పార్టీ ప్రతిష్ట దెబ్బతినేలా వ్యవహరించారు. చివరకు అతని పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయవలసినదిగా లోక్ సభ స్పీకర్ కి వైసీపీ పార్టీ పిర్యాదు చేయడం జరిగింది. ఇది స్పీకర్ పరిశీనలో ఉండగా, వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు ఆయనపై కేసులు పెట్టడం జరిగింది. అరెస్టులు తప్పించుకొనే క్రమంలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు హై కోర్ట్ లో స్క్వాష్ పిటీషన్ వేశారు. నేడు ఇది విచారణకు రానుంది.

ఇప్పుడు ఆ కాపునేతలు ఏం సమాధానం చెబుతారు..?

ఇదిలా ఉండగా రఘురామ కృష్ణం రాజు, వైసీపీ వేంకటగిరి ఎమ్మెల్యే ఆనం నారాయణరెడ్డితో కలిసి పెద్ద చర్చకు తెరలేపారు. వైసీపీ ప్రభుతంపై వ్యతిరేక జెండా ఎగరవేసి అమీతుమీ తేల్చుకుంటున్న రఘురామ కృష్ణం రాజు, ఆనం నారాయణ రెడ్డిని కలవడం సంచలనంగా మారింది. దీనికి తోడు గతంలో ఆనం కూడా వైసీపీ ప్రభుత్వంపై వ్యతరేక వ్యాఖలు చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేను అయ్యుండి కూడా నియోజకవర్గానికి ఏమి చేయలేకపోతున్నాని, అసలు వెంకటగిరి నియోజక వర్గం ఒకటి ఉందన్న విషయం, వైసీపీ ప్రభుత్వం మరచిపోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ ఇద్దరు అసంతృప్తి నేతలు కలవడం వెనుక కారణం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే రఘురామ కృష్ణం రాజు బీజేపీలో చేరో ఆలోచనలో ఉండగా, ఆనం కూడా ఆదిశగా అడుగులు వేస్తున్నారా అనిపిస్తుంది. ప్రస్తుతానికి వీరిద్దరి సెల్ఫీ ఫోటో మీడియాలో హల్ చేస్తుండగా, ఆనం మైకు ముందుకు వస్తే కానీ అసలు విషయం బయటికి రాదు.

లేటు వయసులో వేశ్య పాత్రతో టబు సంచలనం

Tabu in Prostitute Role
హైదరాబాద్‌లో పుట్టి బాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా ఎదిగింది టబు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె సూపరిచితమే. హిందీతోనే తెరంగేట్రం చేసినా.. వెంకటేశ్‌ సరసన ‘కూలీ నం.1’తో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఒకవైపు హిందీలో దూసుకుపోతూనే.. తెలుగులో కూడా కెరీర్ కొనసాగించింది. నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ సరసన నటించింది. 2008లో ‘పాండు రంగడు’ తర్వాత టాలీవుడ్‌కు దూరమైన ఆమె రీసెంట్‌గా ‘అల వైకుంఠపురములో’తో రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె పేరు తరచూ టాలీవుడ్‌లో వినిపిస్తోంది. హిందీలో ఆమె విలన్‌ పాత్ర పోషించిన ‘అంధాధున్‌’ తెలుగు రీమేక్‌లో ఆమెనే విలన్‌గా నటిస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీన్ని ‘రంగ్‌దే’ పేరుతో నితిన్‌ హీరోగా తెరకెక్కిస్తున్నారు. అయితే, దీనిపై పెదవి విప్పకపోయినప్పటికీ.. ఇప్పుడు ఓ వెబ్‌ సిరీస్‌తో టబు సంచలనానికి తెరలేపింది.

తెలంగాణలో బీజేపీ వ్యూహం ఫలిస్తుందా?

‘ఎ సూటబుల్‌బాయ్‌’ అనే వెబ్‌ సిరీస్‌లో టబు నటించింది. ఇందులో విశేషం ఏముందంటరా? 48 ఏళ్ల టబు ఇందులో సెక్స్‌ వర్కర్ పాత్రను పోషించింది. ‘కామసూత్ర’ డైరెక్టర్ మీరా నాయర్ తెరకెక్కిస్తున్న ఈ సిరీస్‌లో నలభై ఏళ్ల పైబడిన వేశ్యగా ఆమె నటించింది. ఆమెను ప్రేమించే 20 ఏళ్ల కుర్రాడి పాత్రను యువ హీరో, షాహిద్‌ కపూర్తమ్ముడు ఇషాన్‌ ఖత్తర్పోషించాడు. రీసెంట్‌గా రిలీజైన ట్రైలర్ బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. వీరిద్దరి మధ్య చిగురించిన ప్రేమ ఎలాంటి మలుపు తిరిగిందన్నదే కథ. ట్రైలర్లో టబు, ఇషాన్‌ రొమాన్స్‌ హైలైట్‌గా మారింది. 1993లో ‘ఎ సూటబుల్‌ బాయ్‌’ పేరుతో విక్రమ్‌ సేథ్‌ రాసిన నవల ఆధారంగా సిరీస్‌ తీస్తున్నారు. ఇదో పీరియాడికల్‌ ఫిక్షన్‌ స్టోరీ అని సమాచారం. ఇండియాకు స్వాతంత్య్రం అనంతర ఎన్నికల బ్యాక్‌డ్రాప్‌లో నాలుగు కుటుంబల మధ్య జరిగే కథ ఇది. అప్పటి పరిస్థితులు, కుటుంబ విలువలు, మత వివక్ష లాంటి అంశాలను ఈ పుస్తకంలో వివరించారు విక్రమ్‌ సేథ్. దాదాపు 1500 పేజీల ఈ ఇంగ్లిష్‌ నావెల్‌ను ఆరు భాగాలుగా కుదించి వెబ్‌ సిరీస్‌ తీశారు. ఈ సిరీస్‌తో బీబీసీ సంస్థ ఓటీటీ రంగంలోకి అడుగు పెట్టబోతోంది. ఈ నెల 26 నుంచి బీబీసీలో ఈ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమ్‌ కానుంది. హిందీతో పాటు ఇంగ్లిష్‌లో రిలీజ్‌ అవుతుంది.

https://www.instagram.com/p/B5kLsr7AWLA/

 

https://www.youtube.com/watch?v=aPBnlHmsexU

ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్యా

Russia announces corona vaccine
ఎప్పుడెప్పుడు కరోనా వ్యాక్సిన్ వస్తుందా?.. ఈ మహమ్మరి పీడ వదులుతుందా? అని ప్రపంచంలోని మానవళి అంతా వేయికళ్లతో ఎదురుచూస్తుంది. వీరందరికీ రష్యా గుడ్ న్యూస్ చెప్పింది. తమ దేశంలో తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ సక్సస్ అయ్యాయని ప్రకటించింది. త్వరలోనే మార్కెట్లోకి కరోనా వ్యాక్సిన్ తీసుకురావడం జరుగుతుందని ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

చైనాలోని వ్యూహాన్లో సోకిన కరోనా వైరస్ క్రమంగా ప్రపంచ దేశాలకు పాకింది. అగ్రరాజ్యాలు సైతం కరోనా ధాటికి కకావికలం కావడంతో చాలాదేశాలు లాక్డౌన్ ను ఆశ్రయించాయి. దీంతో ఆయా దేశాలకు ప్రజారవాణా స్తంభించిపోయింది. ఈ నిర్ణయం వల్ల కొంతమేర కట్టడి అయినప్పటికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. పనుల్లేక పెద్దఎత్తున నిరుద్యోగం పెరగడంతో ఆకలి కేకలు మొదలయ్యాయి. ఈ తరుణంలో చాలాదేశాలు కరోనాతో సహజీవనానికి పూనుకున్నాయి.

ఇప్పుడు ఆ కాపునేతలు ఏం సమాధానం చెబుతారు..?

కరోనాపై డబ్ల్యూహెచ్ఓ ఎప్పటికప్పుడు ప్రపంచ దేశాలను అలర్ట్ చేస్తోంది. కరోనా వ్యాక్సిన్ ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని ప్రజలే అప్రమత్తంగా ఉండాలని తగు జాగ్రత్తలు సూచించింది. దీంతో ప్రజలు కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ కరోనాపై పోరాటానికి సిద్ధమయ్యారు. మరోవైపు సైంటిస్టులు కరోనా వ్యాక్సిన్ కనుగోనేందుకు రేయింబవళ్లు కృషి చేస్తున్నారు. భారత్ ఇప్పటికే కరోనా డ్రగ్(మెడిసన్), ఇంజక్షన్ తయారుచేసి ముందంజలో నిలిచింది.

గ్లేన్ మార్క్ సంస్థ కరోనాకు మెడిసిన్ తయారుచేయగా హెటీరో సంస్థ కరోనా ఇంజెక్షన్ రూపొందించి మార్కెట్లోకి విడుదల చేసింది. కరోనా మెడిసిన్ స్పల్ప లక్షణాలు ఉన్నవారిపై మాత్రమే పని చేస్తుందని ప్రకటించింది. దీంతో కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూపు తప్పలేదు. ఇప్పటికే పలు భారత ఫార్మా కంపెనీలకు కేంద్రం వ్యాక్సిన్ ట్రయల్స్ కోసం అనుమతి ఇచ్చింది. జంతువులు, మనుషులపై ఒకేసారి ట్రయల్స్ చేపడుతూ వాక్సిన్ తయారీలో వేగాన్ని పెంచింది.

తెలంగాణలో బీజేపీ వ్యూహం ఫలిస్తుందా?

అయితే తాజాగా రష్యా తాము తయారీ చేసిన వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ సక్సస్ అయినట్లు ప్రకటించడం ఆసక్తిని రేపుతోంది. గమలీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడెమాలజీ అండ్‌ మైక్రోబయాలజీ ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్‌ వాలంటీర్లపై పరీక్ష చేయగా విజయవంతం అయినట్లు ఆ దేశానికి చెందిన సెచెనోవ్‌ విశ్వవిద్యాలయం వెల్లడించింది. జూన్‌ 18నుంచి ఈ వ్యాక్సిన్‌‌పై క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించమని తొలి గ్రూప్‌ వాలంటీర్లపై ప్రయోగాలు విజయవంత అయ్యాయని వీరంతా బుధవారం(జులై 15) డిశ్చార్జ్ అవుతారని ప్రకటించింది.

జులై 20న రెండో గ్రూప్‌ వాలంటీర్లు డిశ్చార్జ్ అవుతారని విశ్వవిద్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. ఇక చివరిదశలో భాగంగా వ్యాక్సిన్‌ భద్రతను పరీక్షించగా అది విజయవంతం అయినట్లు ప్రకటించారు. త్వరలోనే వ్యాక్సిన్‌ను రోగులకు అందుబాటులోకి వస్తుందని సెచోనోవ్ యూనివర్సిటీ గుడ్ న్యూస్ చెప్పింది. తొలి నుంచి వాక్సిన్ రేసులో రష్యా పేరు పెద్దగా విన్పించలేదు.

రష్యా సైలెంట్ గా వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తిచేసి ముందంజలో నిలిచింది. ప్రపంచంలో క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకున్న తొలి వ్యాక్సిన్ రష్యా నుంచే కావడం విశేషం. త్వరలోనే కరోనా వ్యాక్సిన్ మార్కెట్లోకి రానుందని ఆశాభావాన్ని రష్యా ప్రకటించడంతో మానవాళి గట్టిగా ఊపిరిపీల్చుకుంది.

ఇప్పుడు ఆ కాపునేతలు ఏం సమాధానం చెబుతారు..?

Misused Kapu Nestham
రాష్ట్ర ప్రభుత్వం కాపు సామాజికవర్గం కోసం రూపొందించిన కాపునేస్తం పథకాన్ని కావాలని పక్కదొవ పట్టిస్తున్న వైనం రాయలసీమ జిల్లాల్లో చోటు చేసుకుంది. సిఎం సొంత సామాజికి వర్గానికి చెందిన వారికి కాపునేస్తం పథకంలో సాయమందించడం వివాదస్పదంగా మారింది. ఈ అంశంపై ఆ పార్టీలోని కాపు నేతలు ఏం సమాధానం చెబుతారో మరి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపులకు ఖర్చు చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేయడంతో వైసీపీలో ఉన్న కాపు నాయకులు కొందరు ప్రెస్ మీట్ లు పెట్టి పవన్ కళ్యాణ్ ను విమర్శలు గుప్పించారు. రాజకీయాలపై పవన్ కు సరైన అవగాహన లేదని ఆరోపించారు. కాపుల పేరుతో రెడ్డి సామాజిక వర్గానికి కాపు కార్పొరేషన్ నిధులను అందజేస్తున్న విషయం బయటపడితే.. ఆ నాయకులు ఎందుకు నోరు విప్పడం లేదో కాపు సామాజిక వర్గానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది.

కరోనా కట్టడిలో జగన్ మరో విప్లవాత్మక నిర్ణయం

కాపునేస్తం పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన పథకంలో ఇతర సామాజిక వర్గాల వారిని లబ్ధిదారులకుగా చేర్చి వారికి సాయం చేయడం కాపు సామాజిక వర్గానికి అన్యాయం చేయడమేనని ఆ సామాజిక వర్గానికి చెందిన సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. కర్నూలు జిల్లాలో బండిఆత్మకూరు మండలంలోని లింగాపురం, జి.సి పాలెం గ్రామాల్లలో మొత్తం 22 మంది లబ్ధిదారులు ఉంటే వారిలో 18 మంది రెడ్డి సామాజిక వర్గానికి కాపుసేస్తం పథకం వర్తింపచేసిన విషయం బయట పడింది. అంటే ఇక్కడ కాపు నేస్తం పథకంలో కాపు సామాజిక వర్గానికంటే రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారే అధిక సంఖ్యలో లబ్ధిపొందారనే విషయం స్పష్టమవుతుంది. ఈ లెక్కన ఆ ప్రాంతంలో మొత్తం ఎంత మందికి లబ్ధిజరిగింది వారిలో కాపు సామాజికవర్గం, ఇతర సామాజికవర్గాల వారు ఎంత మంది అనే విషయంపై అధికారులు ఆరా తీసుతున్నారు.

‘రాజధాని’ విషయంలో 17 తరువాత ఏం జరుగుతోంది..?

కాపు నేస్తం పథకంలో ఇలా అనర్హులను అర్హులుగా, అర్హులను అనర్హులుగా చూపిస్తూ కాపు కార్పొరేషన్ చేసిన నిర్వాహకాలపై కాపు సామాజికవర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాపునేస్తం పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల జాబితాను పరిశీలిస్తే ఇంకెన్ని అక్రమాలు వెలుగు చూస్తాయోననే సందేహం ఇప్పడు అందరి మదిని తొలిచేస్తుంది. ప్రభుత్వ పథకాల్లో వెలుగు చూస్తున్న అక్రమాలకు ఇది నిదర్శనంగా మారిందంటున్నారు. వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి క్షేత్రస్థాయిలో పట్టు సాధించామని చెబుతున్న ప్రభుత్వం ఈ అంశంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణలో బీజేపీ వ్యూహం ఫలిస్తుందా?

Bandi Sanjay Comments on TRS
తెలంగాణలో బీజేపీ దూకుడుగా వెళుతోంది. పార్టీకి కలిసొచ్చే ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటూ తెలంగాణలో బలపడేందుకు శతవిధలా ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ అధిష్టానం నుంచి స్థానిక నేతలకు పూర్తిస్థాయిలో మద్దతు లభిస్తుండటంతో టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ముందుకెళుతోంది. ప్రజా సమస్యలను లేవనెత్తుతూ స్థానికంగా మరింత బలపడేలా స్కెచ్ వేస్తోంది. అధికార టీఆర్ఎస్ పార్టీకి బీజేపీనే ప్రత్యామ్నాయం అన్న సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళుతోంది.

కరోనా కట్టడిలో జగన్ మరో విప్లవాత్మక నిర్ణయం

ఈక్రమంలోనే బీజేపీ-టీఆర్ఎస్ నేతలు కొద్దిరోజులుగా తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. నిన్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై కొందరు టీఆర్ఎస్ చెందిన నేతలు దాడిచేసినట్లు తెలుస్తోంది. దీనిపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ లోని కొన్ని హిందూ వ్యతిరేక శక్తులు ఎంపీ అరవింద్ పై దాడిచేయడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. పట్టపగలు ఒక ప్రజాప్రతినిధి కొందరు దాడిచేయడం తెలంగాణ ముఖ్యమంత్రికి, రాష్ట్ర డీజీపీకి సిగ్గుచేటని ఆయన విమర్శించారు.

కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉందనే విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తించుకోవాలన్నారు. కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్, కుమార్తె కవిత పై గతంలో ఉన్న కేసులన్నీ బయటకు తీస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. తమ పార్టీ నేతనే దాడి చేయడాన్ని తేలికగా వదిలిపెట్టబోమని టీఆర్ఎస్ గుణపాఠం చెబుతామని ఆయన స్పష్టం చేశారు. దీనిపై టీఆర్ఎస్ నేతలు కూడా గట్టిగానే బదులిస్తుండటంతో ఇరుపార్టీల మధ్య రాజకీయ వేడి రాజుకుంటోంది.

‘రాజధాని’ విషయంలో 17 తరువాత ఏం జరుగుతోంది..?

బీజేపీ ఎంపీపై దాడి ఘటనను ఆపార్టీ నేతలు వారికి అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఈ అంశాన్ని వాడుకొని పైచేయి సాధించేందుకు బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ప్రజా సమస్యలను లెవనెత్తుతూనే.. ఎంపీపై దాడి ఘటనను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. ఈ అంశంతో టీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ ఉండటాన్ని ఆ పార్టీ నేతలు అడ్వంటేజీ తీసుకొని టీఆర్ఎస్ పై దూకుడుగా వెళుతున్నారు. వచ్చే ఎన్నికల వరకు స్థానికంగా బలపడేందుకు బీజేపీ చేస్తున్న వ్యూహాలు ఏమేరకు సక్సస్ అవుతాయో వేచిచూడాల్సిందే..!

డిప్యూటీ సిఎంకు ప్రభుత్వ వైద్యంపై నమ్మకం లేదా?

Corona for AP Deputy CM
రాష్ట్రంపై కరోనా వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. కేసుల సంఖ్య వేగంగా పెరగడంతోపాటు మరణాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ప్రభుత్వం మాత్రం కరోనాను ఎదుర్కోవడంతో విజయవంతం అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటుంది. తాజాగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కరోనా పాజిటివ్ గా తేలింది. ఆయన భార్య, కుమార్తెలకు వైరస్ సోకింది. ఆయన కొద్ది రోజులుగా ప్రభుత్వం కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో వైరస్ బారిన పడినట్లు ప్రచారం జరిగింది. స్వాబ్ నమూనా పరీక్షలో కరోనా పాజిటివ్ అని తేలడంతో అధికారులు ఆదివారం ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తొలుత ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతిలోని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోవిడ్ ఆసుపత్రి స్విమ్స్ లో చేశారు. రెండు రోజుల వ్యవధిలోనే కుటుంబ సభ్యులతో కలిసి ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రి నుంచి వెళ్లిపోయి హైదరాబాదులోని ప్రవేటు ఆసుపత్రిలో చేరారు.

కరోనా కట్టడిలో జగన్ మరో విప్లవాత్మక నిర్ణయం

డిప్యూటీ సిఎం వ్యవహరించిన తీరుతో ఇప్పుడు ప్రభుత్వం ఇరుకున పడింది. బాధ్యతా యుతమైన పదవిలో ఉండి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకోకుండా పోరుగు రాష్ట్రంలోని ప్రవేటు ఆసుపత్రికి వెళ్లిపోవడంపై ప్రతిపక్షాలు, ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ వైద్యంపై ఉప ముఖ్యమంత్రికే నమ్మకం లేకపోతే సామాన్యులకు ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి అధికారులు సకల సౌకర్యాలు కల్పిస్తారు.. అయినా హైదరాబాదులోని కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లారంటే ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వదలచుకున్నారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

టిడిపి ప్రభుత్వం హయంలో అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు తన మోకాలుకు శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వస్తే.. గుంటూరు ప్రభుత్వాసుప్రతిలో మోకాలు శస్త్ర చికిత్స చేయించుకుని ప్రభుత్వ ఆసుపత్రులు కార్పొరేట్ ఆసుపత్రుల కంటే తక్కువేమీ కాదని ప్రజలకు సూచించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం జగన్ కేబినెట్ లోని మంత్రులు ప్రభుత్వ ఆసుపత్రుల కంటే ప్రవేటు ఆసుపత్రులకే ప్రాధన్యత ఇచ్చేలా వ్యవహరించడం ప్రజలను విస్మయానికి గురి చేస్తుంది.

‘రాజధాని’ విషయంలో 17 తరువాత ఏం జరుగుతోంది..?

ప్రాణాలకు తెగించి ప్రభుత్వాసుపత్రుల్లో కోవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులు సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపణలు ఎదుర్కొన్న జగన్ ప్రభుత్వం ఇప్పడు ప్రభుత్వం కోవిడ్ సెంటర్ లో చికిత్స తీసుకుంటూ ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లడం ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులను అవమానించడంగానే భావించాల్సిన వస్తుందని వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు హైదరాబాదులోని ప్రవేటు ఆసుపత్రులు కోవిడ్ చికిత్సకు రోజుకు రూ.లక్షల్లో బిల్లులు వేస్తున్నా అక్కడ చికిత్స చేయించేకునేందుకు వెనుకాడకుండా ప్రవేటు ఆసుపత్రులకు వెళుతున్నారు. ఈ ఖర్చంతా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందిగా అందుకే అంత ధైర్యంగా వెళ్లి ఉంటారనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఆ క్వాలిటీస్‌ ఉండే వ్యక్తినే పెళ్లి చేసుకుంటా.. రకుల్‌ప్రీత్‌

Rakul Preet's ideal man
మోడలింగ్‌ నుంచి చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్‌లో  అగ్ర హీరోయిన్‌గా ఎదిగిన నటి‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. కెరటం అనే చిన్న సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఆమె ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో హిట్‌ ఖాతాలో వేసుకుంది. అక్కడి నుంచి ఆమె వెనుదిరిగి చూసింది లేదు. వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా మారింది. అంతకుముందు కన్నడ, హిందీలో చేసిన పూర్తిగా తెలుగు సినిమాలపై దృష్టి సారించి సక్సెస్‌ ట్రాక్లో పడింది. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్‌, మహేశ్‌ బాబు, రామ్‌ చరణ్, నాగార్జునఇలా దాదాపు అందరు అగ్రహీరోలతో నటించింది. ఆమె భారీ అంచనాలు పెట్టుకున్న స్పైడర్, మన్మధుడు-2 నిరాశ పరచడంతో తెలుగులో కాస్త వెనుకడింది. ఆ మూవీస్‌ తర్వాత ఆమె పూర్తిగా హిందీ, తమిళ్‌పై దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు చిత్రాలున్నాయి. కమల్‌ హాసన్‌- శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఇండియన్‌-2లోనూ ఆమె నటిస్తోంది. కరోన లాక్‌డౌన్‌ టైమ్‌లో ముంబైకే పరిమితయం అయిన ఆమె.. ఈ మధ్యే తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంది. గ్లామరస్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న రకుల్‌… టాలీవుడ్‌కు కాస్త దూరంగా ఉన్నా అభిమానులతో మాత్రం టచ్‌లోనే ఉంది.

జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా.. యోగా చేస్తుండగా తీసుకున్న హాట్‌ హాట్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ వారిని అలరించింది. వంటల కోసం ప్రత్యేకంగా ఓ యూట్యూబ్‌ చానల్ ను ఓపెన్‌ చేసింది. ఫిట్‌నెస్‌, ఫుడ్‌ గురించి మాత్రమే కాదు తన పర్సనల్‌ లైఫ్‌ గురించి కూడా కొన్ని విషయాలను ఆమె ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటుంది. ఈ క్రమంలో ఏలాంటి అర్హతలు ఉన్న వ్యక్తి మీకు భర్తగా రావాలని అని కోరుకుంటున్నారు అని ఓ అభిమాని సోషల్‌ మీడియాలో ఆమెను ప్రశ్నించాడు. దీనికి ఆమె చాలా స్పష్టంగా సమాధానం చెప్పింది. కాబోయే వాడిలో ఎలాంటి క్వాలిటీస్‌లో ఉండాలో వివరించింది. ‘ నిజం చెప్పాలంటే నాకు ప్రేమ అన్నా, పెళ్లి అన్నా చాలా గౌరవం. నాకు కాబోయే భర్త విషయంలో కొన్ని స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. .ఫస్ట్‌ అతను మంచి హైట్‌ ఉండాలి. ఎంతగా అంటే నేను హైహిల్స్‌ వేసుకున్నా సరే అతడిని తలెత్తే చూసేంత ఎత్తుండాలి. దాంతో మంచి మనసు, ఆలోచనలతో పాటు తెలివైన వాడు అయి ఉండాలి. ఈ క్వాలిటీస్‌ ఉన్న వ్యక్తి ఇప్పటిదాకా నాకు ఎదురు పడలేదు’ అని చెప్పుకొచ్చింది.

ఐశ్వర్యా రాయ్‌, ఆమె కూతురుకూ కరోనా

Aishwarya, Aaradhya test positive for coronavirus

Aishwarya, Aaradhya test positive for coronavirus
బాలీవుడ్‌ సూపర్స్టార్ అమితాబ్‌ బచ్చన్ ఇంట్లో కరోనా కలకలం సృష్టించింది. బిగ్‌బీ కుటుంబంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య నలుగురికి చేరింది. తొలుత తనకు కరోనా సోకిందని అమితాబ్‌ స్వయంగా ట్విట్టర్లో శనివారం వెల్లడించారు. కొన్ని గంటల తర్వాత తనకూ పాజిటివ్‌ అని తేలిందని అభిషేక్‌ బచ్చన్‌ తెలిపాడు. దాంతో అమితాబ్‌ కుటుంబ సభ్యులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. తొలుత మిగతా వాళ్లందరికీ నెగిటివ్‌ వచ్చిందని వార్తలు వచ్చాయి. కానీ, కొద్దిసేపటికే అభిషేక్‌ భార్య ఐశ్వర్యారాయ్‌, కూతురు ఆరాధ్యకు కూడా పాజిటివ్‌ అని తేలిందని తెలిసింది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ తోపే ఈ రోజు మధ్యాహ్నం ట్వీట్‌ చేశారు. మిగతా కుటుంబ సభ్యులు జయా బచ్చన్, శ్వేతా బచ్చన్, ఆమె పిల్లలు అగస్త్య, నవ్యా నవేలిలకు మాత్రం కరోనా సోకలేదని స్పష్టం చేవారు. ‘శ్రీమతి ఐశ్వర్యారాయ్‌ బచ్చన్, ఆమె కూతురు ఆరాధ్యకు కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. శ్రీమతి జయా బచ్చన్‌కు నెగిటివ్‌ రిజల్ట్‌ వచ్చింది. కరోనా బారిన పడ్డ బచ్చన్‌ కుటుంబ సభ్యులు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని టవ్ఈట్‌ చేసిన మంత్రి కొద్ది సేపటి తర్వాత దాన్ని డిలీట్‌ చేశారు.

అమితాబ్ కుటుంబానికి అలానే కరోనా వచ్చింది !

కాగా, ఐశ్వర్య, ఆరాధ్య నుంచి సేకరించిన తొలి శాంపిల్‌ పరీక్షలో శనివారం రాత్రి నెగిటివ్‌ వచ్చింది. కానీ, నిర్ధారణ కోసం మరోసారి పరీక్షలు నిర్వహించగా వారిద్దరికీ వైరస్‌ సోకిందని తేలింది. అయితే, వారిద్దరిలో ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో హోమ్‌ క్వారంటైన్‌లో ఉండమని సలహా ఇచ్చినట్టు బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) వర్గాలు తెలిపాయి. అయితే, వైద్యులను సంప్రదించిన తర్వాతే ఈ విషయంపై నిర్ణయం తీసుకోవడం వారి ఇష్టం అన్నాయి. కాగా, అమితాబ్‌, అభిషేక్‌ ఇద్దరూ ముంబై నానావతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఇద్దరికి స్వల్ప లక్షణాలే ఉన్నాయి. వయసు పైబడిన అమితాబ్‌ ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు బిగ్‌బీ నివాసం జల్సా, జనక్‌ బంగ్లాలను మున్సిపల్‌ అధికారులు శానిటైజ్‌ చేశారు. ఆయన నివాసంలో సుమారు 54 మంది పని చేస్తున్నారు. వారిలో హై రిస్క్‌ ఉన్న 28 మంది శాంపిల్స్‌ను ఈ రోజు కలెక్ట్‌ చేశారు. వాటి ఫలితాలు రావాల్సి ఉంది. అప్పటిదాకా వారందరినీ బిగ్‌బీ ఇంట్లోనే క్వారంటైన్‌ చేశారు.