Home Blog Page 8412

ఆ ఎన్‌కౌంటర్ ఈ ఎన్‌కౌంటర్ మధ్య తేడా ఇదేనా?

లాకప్ డెత్‌లు, ఎన్‌కౌంటర్లు కొత్తేమీ కాదు. 1970ల చివర్లో, 1980ల్లో కూడా నక్సలైట్లు, గ్యాంగ్‌ స్టర్లతో తలపడినప్పుడు గతంలో చాలా ఎన్‌కౌంటర్లు జరిగాయి.

కానీ, ఇప్పుడు వికాస్ దుబే ఎన్‌కౌంటర్ కానీ హైదరాబాద్‌ లో వెటర్నరీ డాక్టర్ అత్యాచార కేసు నిందితుల ఎన్‌కౌంటర్ కానీ వాటన్నిటికీ పూర్తిగా భిన్నమైనది. దుబే గ్యాంగ్‌ స్టర్ అయినప్పటికీ రాజకీయాలతో బాగా సంబంధాలున్నవాడు.

‘దుబే రాజకీయంగా శక్తిమంతుడే అయినప్పటికీ తనను నడిపించేవారి రాజకీయ మనుగడ ప్రయోజనాల కోసం తాత్కాలికంగా మౌనంగా మారిన గ్యాంగ్‌స్టర్. కానీ, హైదరాబాద్ కేసు నిందితులు అలా కాదు, వారు దుర్బలమైన వర్గాల నుంచి వచ్చారు. నిరుద్యోగ, నిరుపేద నేపథ్యం వారిది. కాబట్టి వారిని అంతం చేసినా సమాజం నుంచి పెద్దగా నిరసన స్వరాలు వినిపించవని అనేకమంది వాదన.

ఇలాంటి ఘటనలో ఆ మనుషులెవరన్నది కాదు పోలీసులెలా ప్రవర్తించారన్నది చూడాలని, న్యాయసూత్రాల అమలుకు రాజ్యాంగ నిబంధనలు ఉన్నా లేనట్లే వ్యవహరిస్తున్నాయి ప్రభుత్వాలు. అగ్రవర్ణాలు అంటరానితనం పాటించడాన్ని మంచి పనిగానే భావిస్తారు. ఏ రాజ్యాంగ సూత్రాలపై ఆధారపడి ఈ దేశాన్ని నిర్మించుకున్నామో దాన్నే విస్మరిస్తామా?’ అని సామాజిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

‘హైదరాబాద్‌లో దిశ అత్యాచార ఘటన నిందితుల విషయానికొస్తే.. ఎవరిని చంపారనే విషయంలో ఎవరికీ సమాధానాలు అవసరం లేదు. వారికి ఈ సమాజంలో గుర్తింపు లేదు. వారు పూర్తిగా అనామకులు. పైకి పంపించేయడానికి తగినవారు. వారిలో ఏ ఒక్కరి పేరైనా మీకు గుర్తుందా? కానీ, పదేళ్ల తరువాత కూడా వికాస్ దుబే పేరు గుర్తుంటుంది. దుబే ఎవరిని చంపాడో మీకు తెలుసు.. అక్కడే తేడా వస్తుంది. ప్రజలు వ్యవస్థపై నమ్మకం కోల్పోవడానికి సంబంధించిన సమస్య కాదిది.. ఇది పూర్తిగా భిన్నమైన సంకేతాన్నిస్తుంది.

”హింసాత్మక స్థితిని ఇది సూచిస్తుంది. ఉత్తరప్రదేశ్‌ లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీసులకు చంపడానికి అన్ని అధికారాలిచ్చేశారు.. అందుకే యోగి ప్రభుత్వాన్ని ఎన్‌కౌంటర్ గవర్నమెంట్ అంటారు. ఉత్తరప్రదేశ్‌ లోని హింసా చక్రం చాలా భయానకమైనది. పోలీసులకు పూర్తిగా కట్లు వదిలేశారు.. చంపమని సూచిస్తే చాలు చంపేస్తారు వారు. ఒక్కోసారి వారు కూడా చనిపోతున్నారు. యూపీ పోలీసులు ప్రాణాలు తీయడంతో పాటు ఒక్కోసారి బలి పశువులూ అవుతుంటారు. న్యాయం జరగడంలో ఆలస్యమవుతున్న కారణంగానే ఇలాంటి తక్షణ న్యాయాలకు ప్రజల మద్దతు ఉంటోందనడం కరెక్టు కాదు. నిందితులు ఎవరైనా సరే, సరైన దర్యాప్తు, విచారణ జరగాని ప్రజలు వాదిస్తున్నారు.

కరోనా కేసుల్లో తప్పుడు లెక్కలు?

Corona cases

దేశంలో నమోదైన కేసుల్లో చనిపోతున్న వారి నిష్పత్తి సుమారు 2.8 శాతంగా ఉంది. కానీ ఈ సంఖ్య వివాదాస్పదం. అసలు ఈ మహమ్మారికి సంబంధించి ఇంకా చాలా సంఖ్యలు కూడా వివాదాస్పదమే.

మొత్తం కేసుల సంఖ్యతో మొత్తం మరణాల సంఖ్యను భాగించటంలో.. నమోదు కాని కేసుల సంఖ్యను కానీ, అనారోగ్యం నుంచి మరణానికి మధ్య ఉన్న జాప్యాన్ని కానీ లెక్కలోకి తీసుకోవటం లేదని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్‌లో మేథమెటీషియన్ ఆడమ్ కుచార్స్కీ పేర్కొన్నారు. మహమ్మారి విస్తరిస్తున్న ఈ దశలో కేస్ ఫాటాలిటీ రేట్ (సీఎఫ్ఆర్) సగటును చూసినపుడు.. ప్రభుత్వాలకు వాస్తవ పరిస్థితి కనిపించదని, దానివల్ల ఉదాశీనంగా వ్యవహరించే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.

‘‘సీఎఫ్ఆర్ అనేది ఒక కనికట్టు లాంటిది. నమోదైన కేసులు, మరణాల సంఖ్యను నమ్మినా కూడా.. మరణాల సంఖ్యను – ఫలితం తేలిన ముగిసిన కేసుల సంఖ్యతో భాగిస్తే ఇంకా ఎక్కువ సంఖ్య వస్తుంది’’ అని డాక్టర్ ముఖర్జీ చెప్పారు. తలసరి మరణాల రేటు కూడా వ్యాధి వ్యాప్తిని అర్థంచేసుకోవటాన్ని పరిమితం చేస్తుంది. ఎందుకంటే.. దేశంలో ఇంకా వైరస్ సోకని ప్రాంతాలు చాలా విస్తారంగా ఉన్నాయి.

దేశంలో కరోనా మరణాల్లో యువత సంఖ్య ప్రపంచ సగటు కన్నా ఎక్కువగా ఉన్నట్లు ఆర్థికవేత్త పార్థా ముఖోపాధ్యాయ చేపట్టిన ఓ కొత్త అధ్యయనం చెప్తోంది. ‘‘ఇక్కడ ఎందుకింత ఎక్కువ మంది యువత చనిపోతున్నారో మనం కనిపెట్టాల్సిన అవసరముంది. డయాబెటిస్ వంటి జీవనశైలి వ్యాదుల వల్లనా లేక మన నగరాల్లోని కాలుష్య వాయువుల వల్ల వచ్చే శ్వాస సమస్యల వల్లనా? ప్రపంచంతో పోలిస్తే మన యువత అనారోగ్యంగా ఉందా?’’ అంటారు ప్రొఫెసర్ ముఖోపాధ్యాయ్.

అయినప్పటికీ.. దేశంలో మరణాల సగటు రేటు చాలా తక్కువగానే ఉంటుందని, మరణాల్లో ఎక్కువ మంది వృద్ధులే ఉంటారని నిపుణులు చెప్తున్నారు. ‘‘దేశంలో కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. కానీ జబ్బుపడిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. అంటే.. మనం ప్రమాదం నుంచి బయటపడి ఉండొచ్చు’’ అని ముఖోపాధ్యాయ్ అభిప్రాయపడ్డారు.

‘అర్జున్‌ రెడ్డి’ కాంబినేషన్ లో వెబ్ సిరీస్ !


టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఈ దశాబ్ధంలో అర్జున్‌ రెడ్డి చిత్రం ఓ ట్రెండ్ సెట్ చేసిందనడంలో ఎలాంటి అనుమానం లేదు. తెలుగు సినిమాల్లో బోల్డ్ కంటెంట్ కు నాంది పలికిన పునాది ‘అర్జున్ రెడ్డి’. సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ఈ సినిమాతో విజ‌య్ దేవ‌ర‌కొండ రాత్రికి రాత్రే టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ అయిపోయాడు. ఇక ఈ చిత్రాన్ని తెర‌కెక్కించిన సందీప్ రెడ్డి వంగా కూడా తొలి సినిమాతోనే క్రేజీ డైరెక్ట‌ర్‌ గా మారడం, పైగా బాలీవుడ్ లో ఇదే సినిమాని క‌బీర్‌సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్క‌డ సూపర్ హిట్ కొట్టి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అయిపోయాడు.

జగన్-కేసీఆర్ దోస్తీకి జలగండం..?

ప్రస్తుతం సందీప్ వంగ బాలీవుడ్ లో మరో చిత్రం కోసం సిద్ధమవుతున్నాడు. భారీ ప్రాజెక్ట్‌ కి సంబంధించి స్క్రిప్ట్ ను కూడా పూర్తి చేసుకుని ప్ర‌క‌టించ‌డానికి రెడీ అవుతున్న సమయంలో కరోనా రావడం, సందీప్ ప్లాన్ మొత్తం తారుమారైపోవడం, దాంతో తలపట్టుకున్న సందీప్ వంగ ఇక లాభం లేదనుకొని ఈ లాక్‌ డౌన్ లో ఒక వెబ్ సిరీస్ సిద్ధం చేసుకున్నాడు. ఈ వెబ్ సిరీస్ విజయ్ దేవరకొండ కోసమట. మొత్తానికి ‘అర్జున్ రెడ్డి’ కాంబినేషన్ లో మ‌రో ఓ వెబ్ సిరీస్ రాబోతుంది.

కేసీఆర్ ఆందోళన అందుకేనా?

ఇక ప్రస్తుతం డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ‘ఫైటర్’ సినిమా చేస్తోన్నాడు. ఈ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తుండటం, పైగా మొదటిసారి పాన్ ఇండియా మూవీ చేస్తోన్న విజయ్ దేవరకొండకు ఈ సినిమా ఎలాంటి హిట్ ను ఇస్తోందో చూడాలి.

సినిమాకు కరోనా ఇన్సూరెన్స్‌.. తాప్సీ మూవీనే ఫస్ట్‌!


కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న రంగం సినీ పరీశ్రమ. అన్‌లాక్‌ తర్వాత మిగతా రంగాలు గాడిన పడుతున్నా.. చిత్ర పరిశ్రమ మాత్రం మరింత దిగాలు పడుతోంది. భాషతో సంబంధం లేకుండా సినీ ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉంది. థియేట‌ర్స్ మూత‌ప‌డ్డాయి. సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. ప్రభుత్వం షూటింగ్స్‌కు అనుమతి ఇచ్చినప్పటికీ అనేక నిబంధనలు విధించింది. వాటిని పాటిస్తూ చిత్రీకరణ జరపడం ఫిల్మ్‌ మేకర్స్‌కు తలకు మించిన భారం అవుతోంది. సీరియల్‌ షూటింగ్స్‌ మొదలైనా సినిమాల విషయంలో మేక‌ర్స్, స్టార్స్ ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు. కొందరు పెద్ద హీరోలైతే ఇప్పట్లో షూటింగ్‌ వచ్చేది లేదంటున్నారు. ఇంకొందరు ధైర్యం చేసి షూటింగ్ స్టార్ట్ చేసినా కరోనా భయంతో జూనియర్ ఆర్టిస్టులు షూటింగ్ కు రామని చెబుతున్నారు. ఇప్పటికే పలువురు టీవీ నటులు కరోనా బారిన పడడంతో వారిలో భయం మరింత పెరిగింది. దాంతో, ఈ నెలలో షూటింగ్ చేయాలనుకున్న వారు కూడా వెనుకడుగు వేస్తున్నారు . ఏదైతే అదైంది అని మరికొందరు మొండిగా ముందుకెళ్తున్నారు.

కేసీఆర్ ఆందోళన అందుకేనా?

అయినా సరే యూనిట్‌లో ఎవ‌రికైనా క‌రోనా సోకితే ఎలా అనే ఆలోచ‌న‌ వారి మదిని తొలిచేస్తోంది. హీరో లేదా హీరోయిన్ ఇతర ప్రధాన వ్యక్తులు కరోనా బారిన పడితే ఎలా? షూటింగ్‌ ఆగిపోతే ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారు? ఒకవేళ షూటింగ్‌ పూర్తయ్యాక రిలీజ్‌కు అవకాశం లేకపోతే ఎలా? అని ప్రశ్నలు వేసుకుంటున్నారు. అలాంటి వారందరికీ బాలీవుడ్ నిర్మాత ఒకరు దారి చూపించారు. ఈ భయాలకు పుల్‌స్టాప్‌ పెట్టిన ప్రశాంతంగా షూటింగ్‌ చేసుకోవాలంటే ఆ సినిమాకు కరోనా బీమా చేయించడమే ఉత్తమమని నిర్ణయానికి వచ్చేశారు. అంతేకాదు తాప్సీ హీరోయిన్‌గా తాను నిర్మిస్తున్న ‘లూప్ ల‌పేటా’ మూవీకి క‌రోనా ఇన్సూరెన్స్ చేయించారు. ‘మా యూనిట్ సభ్యుల్లో ఎవరికి అయినా కరోనా ఎటాక్ అయితే షూటింగ్ నిలిపేయాల్సి వస్తే అప్పుడు మాకు వచ్చే నష్టంను భీమా సంస్థ చెల్లించాల్సి ఉంటుందని చిత్ర నిర్మాతల్లో ఒకరైన అతుల్‌ చెబుతున్నారు. ఇలా కోవిడ్‌ ఇన్సూరెన్స్ చేయించి షూటింగ్ స్టార్ట్ చేయ‌బోయే ఇండియా తొలి సినిమా ఇదే కానుంది. కరోనా సోకితే యూనిట్ సభ్యులందరూ హోం క్వారంటైన్‌లో ఉండాలి. చిత్రీక‌ర‌ణ ఆగితే ఆ న‌ష్టాన్ని బీమాతో క‌వ‌ర్ చేసుకోవ‌చ్చు. దాంతో, బాలీవుడ్‌లో ఇతర నిర్మాతలతో పాటు ఇతర భాషల మూవీ మేకర్స్‌ కూడా తమ సినిమాలకు కోవిడ్‌ ఇన్సూరెన్స్‌ చేయించుకోనే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే వారికి శ్రీరామరక్ష అవుతుంది.

తెలుగులో నంబర్ వన్‌ సాంగ్‌ ‘బుట్ట బొమ్మే’


టాలీవుడ్‌ స్టయిలిష్‌ స్టార్ అల్లు అర్జున్.. ‘అల వైంకుఠపురములో’ రిలీజై చాలా రోజులైంది. థియేటర్ల నుంచి ఓటీటీలోకి కూడా వచ్చేసింది. హీరో హీరోయిన్లు, దర్శకుడు ఇతర సినిమాలతో బిజీగా ఉన్నారు. అయినా ఈ మూవీ రోజూ వార్తల్లో నానుతోంది. దానికి కారణంగా మూవీలో సంగీతం. మ్యూజికల్‌గా బ్లాక్‌ బస్టర్ హిట్‌ అయిన ఈ మూవీలో ప్రతీసాంగ్‌ శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా ‘బుట్ట బొమ్మ’ సాంగ్‌ అయితే చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా అందరినీ ఒక ఊపు ఊపేస్తోంది. రామజోగయ్య శాస్త్రి అందించిన అద్భుత సాహిత్యానికి మ్యూజిక్‌ డైరెక్టర్ థ‌మ‌న్ అదిరిపోయే బాణీలు అందించాడు. కొరియోగ్రాఫర్ జానీ క్లాసిక్‌ నృత్యరీతులు సమకూర్చాడు. బన్నీ, పూజా హెగ్డే కూడా పాటలో లీనమైపోయి నర్తించిన ఈ సాంగ్‌ యూత్‌నే కాదు అన్ని వయసుల వారినీ కట్టి పడేసింది. విజువల్స్ పరంగా ‘బుట్టబొమ్మ’ వీడియో సాంగ్ వరల్డ్ వైడ్ క్రేజ్‌‌ని అందుకోవడమే కాకుండా తెలుగులో కనివినీ ఎరుగని రికార్డ్‌ను క్రియేట్ చేసింది.

జగన్-కేసీఆర్ దోస్తీకి జలగండం..?

యూట్యూబ్‌లో ‘బుట్టబొమ్మ’ వీడియో సాంగ్‌కు రికార్డ్ వ్యూస్ వస్తుండటం విశేషం. తాజాగా 200 మిలియన్ వ్యూస్ దాటిన ‘బుట్టబొమ్మ’ వీడియో సాంగ్.. ఇప్పుడు ఏకంగా 260 మిలియన్ వ్యూస్‌తో తెలుగులో అత్యధిక వ్యూస్ సాధించిన వీడియో సాంగ్‌గా రికార్డ్‌ను క్రియేట్ చేసుకుంది. అలాగే..1.9 మిలియన్ లైక్స్ వచ్చాయి. మరికొద్ది రోజుల్లో 2 మిలియన్ లైక్స్ మార్క్‌ చేరేలా ఉంది. ఈ పాటను ఇంతగా ఆదరిస్తున్న ఆడియన్స్‌కు నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ కృతజ్ఞతలు తెలిపింది. తెలుగులో అత్యధిక వ్యూస్‌ సాధించిన సాంగ్‌గా రికార్డు సృష్టించిన విషయాన్ని తెలుసుకొని హీరోయిన్‌ పూజా హెగ్డే, సంగీత దర్శకుడు ఎస్.థమన్ కూడా ట్విట్టర్‌లో స్పందించారు. ‘రికార్డులు మోగిపోతున్నాయ్. ఇంతటి స్థాయిలో ఘనవిజయాన్ని అందించిన ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు. మీరంటే నాకు ఎంతో ఇష్టం. ‘బుట్టబొమ్మ’ పాట షూట్ చేయడానికి అల్లు అర్జున్, నేను మా మనసు, ఆత్మ, చెమట.. కొన్నిసార్లు కన్నీళ్లు (నేను మాత్రమే) ధారపోశాం. ఇప్పుడు ఈ పాటను ఇంత గొప్ప ఆదరణ చూసి మనసు ఉప్పొంగిపోతోంది’ అని ట్వీట్‌ చేసిన పూజా హెగ్డే బుట్టబొమ్మ రికార్డును తెలిపే పోస్టర్ను, పాట లింక్‌ను షేర్ చేసింది.

 

ఈ వీడియో చూస్తే మాస్కు తప్పక ధరిస్తారు..!


కరోనా.. కరోనా.. కరోనా.. ఇప్పుడు ఎక్కడ చూసిన ఒకటే పేరు. ప్రపంచమంతా కరోనా మహ్మమరి గుప్పిట్లోకి వెళ్లింది. రోజురోజుకు వైరస్ విజృంభిస్తుండటంతో ప్రజలంతా భయాందోళనకు గురవుతోన్నారు. ప్రపంచానికి పెద్దన్నగా చెప్పుకునే అమెరికా సైతం కరోనా ధాటికి విలవిలలాడిపోతుంది. కరోనా కేసుల్లో అమెరికానే తొలిస్థానంలో ఉండటం గమనార్హం. దీంతో చాలాదేశాలు లాక్డౌన్ విధించుకొని కొంతమేర కరోనా కట్టడి చేస్తున్నాయి. అయితే కరోనా వ్యాక్సిన్ వచ్చేవరకు ప్రజలంతా అప్రతమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

జగన్-కేసీఆర్ దోస్తీకి జలగండం..?

కరోనా వైరస్ వేగంగా వ్యాప్తిచెందడానికి మానవాళి నిర్లక్ష్యమేననే వాదనలు విన్పిస్తున్నాయి. ఎవరికీ వారు స్వీయనియంత్రణ పాటిస్తే కరోనా సాధ్యమైనంత వరకు నిలువరించగలిగే అవకాశం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రతీఒక్కరు కరోనా వ్యాప్తికి చైనా దేశమే కారణమని గుర్తుచేసుకుంటున్నారు. చైనా నిర్లక్ష్యం కారణంగా ఈ మహహ్మరి అన్నిదేశాలకు పాకిందంటున్నారు. కరోనా వైరస్ గురించి ముందుగా ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయకోవడం వల్లనే కరోనా మరణాలు పెరిగిపోయాయని పలువురు ఆరోపణలు గుప్పిస్తున్నారు.

అయితే కరోనా మహమ్మరి విజృంభణ.. మరణాల గురించి ప్రపంచానికి తెల్సింది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాపై హెచ్చరిస్తూ పలు సూచనలు చేసింది. కరోనా మహమ్మరి పట్ల నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. అన్నిదేశాల కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రతీఒక్కరు కరోనా నిబంధనలు పాటించి మహమ్మరిని తరిమికొట్టాలని సూచించింది. అయితే కరోనా నిబంధనలను అందరూ పాటిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్ లెక్కలు చూస్తుంటే చాలామంది కరోనా నిబంధనలు పాటించడం లేదని వాదనలు విన్పిస్తున్నాయి.

కేసీఆర్ ఆందోళన అందుకేనా?

ఇలాంటి పరిస్థితుల్లో కరోనాపై అవగాహన కల్పించేలా ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో ప్రతీఒక్కరిని ఇన్స్పిరేషన్ చేసేలా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో మాస్కు ధరించడం ఎంత అవసరమో ఇందులో చూపించారు. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవారు మాస్కులు ధరించడానికి నిర్లక్ష్యం చేస్తుంటే.. చేతులు కూడా లేని శారీరక వికలాంగులు అవలీలాగా మాస్కులు ధరించడాన్ని చూపించి ఆకట్టుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి వీడియో అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

టిక్ టాక్ సరికొత్త వ్యూహం.. ఫలించేనా?


కొద్దిరోజులుగా టిక్ టాక్ సంస్థకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గడచిన నెలరోజులుగా భారత్-చైనా సంబంధాలు చాలావరకు దెబ్బతిన్నాయి. గాల్వానాలోయ జరిగిన ఘర్షణలో 21మంది భారత జవాన్లు మృతిచెందడాన్ని కేంద్రం సీరియస్ తీసుకుంది. దీంతో చైనాకు తగిన గుణపాఠం చెప్పేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళుతుంది. ఇందులో భాగంగా చైనా కంపెనీల కాంట్రాక్టర్లు రద్దుచేయడంతో చైనాకు చెందని 59యాప్స్ ను నిషేధించింది. భారత్ లో అత్యంత ప్రజాధరణ పొందిన టిక్ టాక్ కూడా నిషేధానికి గురైంది. దీంతో ఆ సంస్థకు భారీ మొత్తంలో నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

సచివాలయం కూల్చివేతకు.. కేటీఆర్ కు లింకేంటీ?

టిక్ టాక్ ను భారత్ నిషేధించడంతో కోట్లలో యూజర్లను కోల్పోయింది. దీంతో భారీస్థాయిలో నష్టాలను చావిచూస్తోంది. భారత్ దారిలోనే అమెరికా, యూరప్ దేశాలు టిక్ టాక్ ను బ్యాన్ చేసేందుకు యత్నిస్తుండటంలో ఆ సంస్థ నిర్వహాకులు ఆలోచనలో పడ్డారు. మరోవైపు చైనా దేశం హంకాంగ్ ప్రతిపత్తిని కాలరాసేలా బిల్లు తీసుకొచ్చింది. చైనాను వ్యతిరేకిస్తూ హంకాంగ్ ప్రజలు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. హంకాంగ్ ప్రజలు టిక్ టాక్ యాప్ లో తమ నిరసన వ్యక్తం చేస్తుండటంతో చైనా ఆ దేశంలో టిక్ టాక్ ను బ్యాన్ చేసింది. దీంతో లక్షన్నర మంది యూజర్లను టిక్ టాక్ కోల్పోవాల్సి వచ్చింది.

చైనా తీరుతో టిక్ టాక్ సంస్థకు వరుసగా ఇబ్బందులు ఎదురవుతుండటాన్ని గుర్తించింది. తమ ప్రధాన సంస్థ బీజింగ్ లో ఉండటంతో టిక్ టాక్ పై చైనాయాప్స్ అంటూ ముద్రపడుతుందని సంస్థ యాజమాన్యం ఆలస్యంగా గుర్తించింది. దీంతో తమపై చైనా యాప్ అనే ముద్రను తొలగించుకునే పనిలో పడింది. దీంతో తమ కార్యాలయాన్ని చైనా నుంచి తరలించేందుకు ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం తాము చైనాలో ఉండటం కంటే తమ మనుగడే ముఖ్యమని టిక్ టాక్ యాజమాన్యం భావిస్తోంది.

జగన్ టీంలోకి దూకుడు బ్యాచ్!

భారత్ నిషేధించిన టిక్ టాక్, హెలో యాప్ రెండింటికి బైట్‌డ్యాన్స్ మాతృ సంస్థ. దీని ప్రధాన కార్యాలయంలో బీజింగ్ లో ఉంది. తమ ప్రధాన కార్యాలయాన్ని బీజీంగ్ నుంచి తరలించడంతోపాటు కొత్త కార్యనిర్వాహక బోర్డును ఏర్పాటు చేసే పనిలో పడింది. తమది చైనాయాప్ అయినప్పటికీ చైనాకు పక్షపాతంగా వ్యవహరించ లేదని వివరణ ఇస్తోంది. ఇతర దేశ పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని చైనాకు చేరవేయలేదని టిక్‌టాక్ ఇప్పటికే ప్రకటించింది. ఈ ఆరోపణల నుంచి బయటపడటానికి అన్నిరకాల ప్రయత్నాలు చేస్తోంది.

తాజాగా భారత్ నిషేధించిన 59చైనా యాప్స్ కు కేంద్రం 79 ప్రశ్నలతో కూడిన నోటీసులను పంపించింది. ఈనెల 22లోపు ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని కోరింది. సదరు సంస్థ ఇచ్చే సమాధానాలతో కేంద్రం సంతృప్తి చెందితే తిరిగి యాప్స్ కు అనుమతిచ్చే అవకాశం ఉంది. తప్పడు సమాధానాలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సదరు యాప్స్ ఇచ్చే సమాచారాన్ని కేంద్రం తెప్పించుకున్న సమాచారంతో సరిపోతుందో లేదో చెక్ చేసి యాప్స్ విషయంలో భారత్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో టిక్ టాక్ సంస్థ ఏకంగా చైనా మరకను వదిలించుకునే ప్రయత్నం చేస్తుంది. మరీ టిక్ టాక్ ప్రయత్నం ఏమేరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే..!

వ్యాక్సిన్ లేదుగా.. ఏదో ఒకటి కానివ్వండి?

“ఏ చెట్టు లేకపోతే ఆముదపు చెట్టే మహావృక్షమనే” సామెతకి తగినట్లుగా కరోనా మహమ్మారి కట్టడికి మార్కెట్ లోకి ఏ మందు వస్తే ఆ మందును వాడుతున్నారు. గత ఏడు నెలలుగా ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ మహమ్మారి కట్టడికి ఇంతవరకు ఎటువంటి వ్యాక్సిన్, ఏవిధమైన మందు లేకపోవడంతో ఏదో చిన్న చితక మందులనే వాడుతున్నారు. వైరస్ తీవ్రతను తగ్గించే పలు ఔషధాలు మాత్రం మార్కెట్లోకి వచ్చాయి. తాజాగా ఇటోలిజుమాబ్‌ అనే డ్రగ్ ను ఉపయోగించి శ్వాసకోశ సంబంధ వ్యాధిని తగ్గించొచ్చని డ్రగ్ కంట్రలో జనరల్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ ఇటోలిజుమాబ్‌ అనే డ్రగ్ ను సోరియాసిస్ నయం చేయడానికి ఉపయోగిస్తారు.

డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ వి.జి. సోమాని మాట్లాడుతూ.. ‘ఈ ఇటోలిజుమాబ్‌ డ్రగ్ ను తక్కువ మోతాదులో ఉపయోగించి శ్వాసకోశ ఇబ్బందులను తొలగించవచ్చు. దీనికి బయోకాన్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. భారత్ లో కరోనా రోగులపై క్లినికల్ ట్రయల్స్ సంతృప్తికరంగా ఉన్నట్లు తేలిన తరువాత ఈ ఆమోదం లభించింది. సైటోకైన్ రిలీజ్ సిండ్రోమ్ చికిత్స కోసం ఈ ఔషధాన్ని వాడొచ్చని సీనియర్ డాక్టర్లతో ఏర్పాటైన ఎక్స్ పర్ట్స్ కమిటీ తెలిపింది. బయోకాన్ చేత ఆమోదించబడిన ఇటోలిజుమాబ్‌ డ్రగ్ ఇప్పటికే చాలా సంవత్సరాలుగా సోరియాసిస్ చికిత్స కోసం వాడుతున్నారు. అయితే ఈ ఔషధ వినియోగానికి ముందు ప్రతి రోగి నుంచి లిఖితపూర్వకంగా అనుమతి తీసుకోవాలి’ అని ఆయన అన్నారు.

ఆ టాప్ పత్రికను షేక్ చేస్తున్న కరోనా!

Corona threat to AP


తెలుగులోనే ఆ టాప్ పత్రికను కరోనా షేక్ చేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ లోని దాని ప్రధాన కార్యాలయంలో చాలా మందికి కరోనా బారినపడ్డా పనులు ఆపలేదు ఆ సంస్థ. మొత్తం కార్యాలయం శానిటైజ్ చేయించి ఉద్యోగులు రావాలంటూ హుకూం జారీ చేసింది. అయితే ఇప్పుడు హెడ్ ఆఫీస్ వరకూ కరోనా వచ్చేసింది. ఇప్పుడు తన కోటలోని ప్రధాన కార్యాలయం మొత్తం కరోనా పాకేసిందని తెలిసింది. ఏపీ, తెలంగాణ సహా మొత్తం వ్యవహారాలన్నీ సాగే అందులో ఇప్పుడు కరోనా కల్లోలంగా మారిందని వార్తలు వస్తున్నాయి.

సచివాలయం కూల్చివేతకు.. కేటీఆర్ కు లింకేంటీ?

ఇప్పటికే తెలంగాణలోని హైదరాబాద్ లో కరోనా విస్తృతంగా వ్యాపిస్తోంది. ప్రముఖులు, సామాన్యులు, రాజకీయ నాయకులు, పోలీసులన్న తేడా లేకుండా విస్తరిస్తోంది. దాదాపు ప్రతీరోజు ఒక వీఐపీ, లేదా మరొక సెలెబ్రెటీ కి కరోనా వైరస్ సోకిందనే వార్తలను వింటున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఒక్క కరోనా బెడ్ దొరకడమే గగనంగా మారింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో లక్షల రూపాయలు ఖర్చు చేయడానికి కూడా జనాలు వెనుకాడడం లేదు.

తాజాగా ప్రసిద్ధ తెలుగు దినపత్రికలో ప్రముఖ కార్టూనిస్ట్ కు కూడా కరోనా వైరస్ బారిపడ్డాడట.. హైదరాబాద్ లోని ఒక కార్పొరేట్ ఆస్పత్రిలో ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. కోట లాంటి ఆ ఆఫీసులో చాలా మందికి కరోనా పాజిటివ్ గా తేలిందట.. ఆ పత్రిక సండే మ్యాగజైన్ లో మెజార్టీ మందికి కరోనా సోకిందని సమాచారం. వచ్చే వారం సండే మేగజైన్ రావడం కష్టమేనంటున్నారు.ఇక రెండు మూడు రోజులుగా ఈ ప్రముఖ కార్టూనిస్ట్ కార్టూన్ లు లేకుండానే ఆ పత్రిక వస్తోంది. మూడు దశాబ్ధాలకు పైగా ఆ పత్రికలో పనిచేస్తున్న ఆయన కార్టూన్లు లేకుండా పత్రిక రావడం ఇదే ప్రథమం. ఏమైందని ఆరాతీయగా ఆయనకు కరోనా సోకిందని తెలిసింది.

జగన్ టీంలోకి దూకుడు బ్యాచ్!

హైదరాబాద్ లోని తీవ్రత ఆ పత్రిక ప్రధాన కార్యాలయానికి పాకిందట.. దీంతో చాలా మందికి వైరస్ వ్యాపించినట్టు తెలిసింది. సండే మేగజైన్ సహా సినిమా, ఇతర సెక్షన్ల వారికి పాజిటివ్ గా తేలిందట..దీంతో ఆ పత్రికలో కరోనా కల్లోలం నెలకొందని సమాచారం. చాలా మంది క్వారంటైన్ కు పోవడంతో ఉన్నవారితోనే ప్రస్తుతానికి నెట్టుకొస్తున్నారట.. మరికొద్దిరోజులు పోతే పరిస్థితి ఎలా ఉంటుందోనని భయం భయంగా అందులోని జర్నలిస్టులు పనిచేస్తున్న పరిస్థితి నెలకొంది. కరోనా పరిస్థితి చూస్తుంటే మున్ముందు పత్రిక నడవడం కూడా కష్టమేనన్న భయం వ్యాపిస్తోందట..

కాగితంలేని పాలనలో తొలి అడుగు ఎలా ఉండబోతోంది?

E ruling

E ruling

ఎంతో కాలంగా రాష్ట్రంలో కాగితం లేని పాలన అందని ద్రాక్షాగా మారింది. కరోనా విజృంభణ నేపథ్యంలో పేపర్‌ ఫైళ్లు ఉపయోగించే పాత పద్దతికి స్వస్తి చెప్పి కొత్త పద్దతులకు స్వాగతం పలకనున్నారు. ఇందులో భాగంగానే డిజిటల్‌ ఫైలింగ్‌ విధానాన్ని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం నుండితెలంగాణలో ఈ-పాలన అందుబాటులోకి రానున్నది.

పాలన విధానాన్ని అమలులోకి తీసుకువచ్చిన తరువాత రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా… దాన్ని సీఎం కేసీఆర్…డిజిటల్ ఫార్మాట్‌ లో వీడియో కాన్ఫరెన్సుల ద్వారా చూస్తారు. అన్నింటికీ పక్కా ఆధారాలుంటాయి. పూర్తి పారదర్శకమైన పాలన రాబోతోంది. అదే విధంగా ప్రభుత్వ కార్యకలాపాలన్నీ పేపర్‌ తో పనిలేకుండా అంతా ఆన్‌ లైన్ రూపంలో జరుగుతాయి. చర్చలు, సమావేశాలన్నీ ఆన్‌ లైన్‌ లోనే ఏ ఫైలైనా… ఆన్‌ లైన్ పరమే.. ఏ నిర్ణయమైనా… డిజిటల్‌ లోనే. సంప్రదాయ సంతకాల స్థానంలో డిజిటల్ సిగ్నేచర్స్ ఉంటాయి.

దీని వల్ల చాలా లాభాలున్నాయి. ఏ ఫైల్ ఏ అధికారి దగ్గర పెండింగ్ ఉందో తెలుసుకొని, సంబంధిత అధికారిని వెంటనే పని పూర్తి చెయ్యమని సీఎం ఆఫీస్ వర్గాలు కోరే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఏ ఫైల్ ఏ దశలో ఉందో క్షణాల్లో అది సెర్చ్ ఆప్షన్‌లో కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఇంట్లో ఉండి కూడా ఫైళ్లను ఆన్‌ లైన్‌ లో తెరచి చూసి ఓకే చెయ్యొచ్చు. అలాగే పనిలో కచ్చితత్వమూ ఉంటుంది. కాలయాపన తగ్గుతుంది.

నీటి ప్రాజెక్టుల పనుల్లో అభివృద్ధి, ప్రభుత్వ సహాయ చర్యలు, ప్రభుత్వ పథకాల అమలు వంటి అన్ని అంశాల్నీ సీఎం కేసీఆర్ పరిశీలిస్తారు. ఈ క్రమంలోనే ప్రతి సోమవారం ప్రభుత్వం జిల్లా కలెక్టరేట్లలో డీడీఆర్సీ సమావేశాలు నిర్వహించనుంది. అలాగే శాఖల వారీగా ఐడీ, పాస్‌ వర్డ్‌ లను ఇవ్వనున్నారు. ఏ జిల్లాలో ఏ లోటుపాట్లున్నా వెంటనే వాటిని సరిచేస్తారు. అంతా ఆన్‌ లైన్ అయినప్పటికీ కేబినెట్ సమావేశాలు, తీసుకునే నిర్ణయాలపై మాత్రం సీక్రెసీ మెయింటేన్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

తహశీల్దార్, ఎంపిడిఓ ఆర్డీఓ డిపిఓ ఇలా విభాగాలన్నీ ఆన్‌ లైన్‌ లోనే ఫైళ్లను చెక్ చేసి ఆమోదిస్తాయి. తద్వారా కలెక్టరేట్లు, మండల, డివిజన్, ఇతర ఆఫీసుల్లో ఈ-పాలన అమలవుతుంది. ప్రజలు పెట్టుకునే అర్జీలు, ప్రతిపాదనలన్నీ స్కాన్ అవుతాయి. సంబంధిత కలెక్టర్లేట్లకు ఆన్‌ లైన్‌ లో వెళ్తాయి. అంటే ప్రజలు ఇచ్చే అర్జీలు పేపర్ల రూపంలో ఉన్నా ప్రభుత్వం మాత్రం వాటిని ఆన్‌ లైన్ స్కానింగ్ ప్రతుల రూపంలోనే చూడనుంది. అలాగే ఫైళ్లను బార్ కోడింగ్ చేస్తారని తెలిసింది. పోలీస్ కమాండ్ కంట్రోల్ సిస్టం ద్వారా అన్ని జిల్లాలు, ఆఫీసుల్లో డిజిటల్ కాన్ఫరెన్సింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కువ మంది ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్‌ లో పాల్గొనేందుకు వీలుగా సాఫ్ట్‌వేర్లను అప్‌ గ్రేడ్ చేస్తున్నారు.

కరోనాపై పోరాటం.. హైదరాబాదీల స్వచ్చంధ లాక్ డౌన్


తెలంగాణలో కరోనా మహమ్మరి పంజా విసురుతోంది. గడిచిన పదిరోజులుగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెట్టింపయ్యాయి. ఇప్పటికే తెలంగాణలో 32,224మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 19,205మంది కరోనా నుంచి కోలుకోగా 339మంది మృత్యువాతపడ్డారు. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో రోజుకు రెండు వేల కేసులు కొత్తగా నమోదవుతున్నాయి. దీంతోపాటు వైరస్ వేగంగా ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందుతుండటంతో నగరవాసులు భయాందోళన చెందుతున్నారు.

కేసీఆర్ ఆందోళన అందుకేనా?

నగరంలో కేసుల సంఖ్య పెరిపోతుండటంతో హైదరాబాద్లో మరోసారి లాక్డౌన్ విధిస్తారని భారీగా ప్రచారం జరిగింది. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి నగరంలో ఉద్యోగులు చేస్తున్న వారంతా సొంతూళ్లకు వెళ్తుండటంతో నగరమంతా నిర్మానుష్యంగా మారుతోంది. కరోనా కారణంగా ఉపాధి లేకపోవడంతో ఇంటి అద్దెలు చెల్లించలేక చాలామంది ఇంటిదారి పడుతున్నారు. దీంతో నగరంలో ఎక్కడ చూసినా టూలెట్ బోర్డులే దర్శనిమస్తున్నాయి.

అయితే నగరం నుంచి సొంతూళ్లకు వెళ్లేక్రమంలో హైదరాబాదీలు కరోనా క్యారియర్లుగా మారుతున్నారని అభిప్రాయం వ్యకమవుతోంది. వీరంతా సొంతూళ్లకు వెళుతూ వారితోపాటు కరోనా వైరస్ మోసుకెళుతుండటంతో అన్ని జిల్లాల్లోనూ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటివరకు గ్రీన్ జోన్లుగా ఉన్న జిల్లాల్లోనూ లాక్డౌన్ సడలింపుల తర్వాత భారీగా నమోదవుతుండటం ఒకింత ఆందోళన కలిగిస్తుంది.

జగన్-కేసీఆర్ దోస్తీకి జలగండం..?

మరోవైపు నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, మార్కెట్ అడ్డాలు వైరస్ కేంద్రాలు మారిపోతున్నాయి. ఇక్కడి నుంచి కరోనా వ్యాప్తి ఎక్కువగా జరుగుతుండటంతో వ్యాపారులంతా అప్రమత్తయ్యారు. దీంతో కొన్ని ఏరియాల్లో ఇప్పటికే వ్యాపారులు స్వచ్చంధంగా లాక్డౌన్ పాటిస్తున్నారు. కాలనీలు, బస్తీల్లోని వ్యాపారులు చర్చించుకొని కొందరు షాపుల సమయాన్ని తగ్గించుకుంటున్నారు. మరికొందరైతే ఏకంగా నెలరోజులపాటు వ్యాపారులు మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

ఒకప్పుడు లాక్డౌన్ విధిస్తే వ్యాపారాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తంచేసిన వ్యాపారులే నేడు స్వచ్చంధంగా లాక్డౌన్ కు ముందురావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కొన్ని ఏరియాల్లో స్వచ్చంధంగా లాక్డౌన్ పాటిస్తే కరోనా వైరస్ చైన్ తెగిపోయే అవకాశంలేదని అభిప్రాయాన్ని వ్యాపారులు వ్యక్తం చేస్తున్నారు. మూకుమ్మడిగా కరోనాపై పోరాటం చేస్తే కరోనా  రాష్ట్రం నుంచి తరిమికొట్టొచ్చని అంటున్నారు.

ఇప్పటికే చెన్నె, పుణే, బెంగుళూరు లాంటి నగరాల్లో పూర్తిస్థాయిలో లాక్డౌన్ అమలు చేస్తున్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. సీఎం కేసీఆర్ కూడా హైదరాబాద్ నగరంలో సంపూర్ణ లాక్డౌన్ విధించాలని కోరుతున్నారు. హైదరాబాదీలను కరోనా క్యారియర్లుగా కాకుండా వారియర్స్ మార్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీనిపై తెలంగాణ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే..!

‘మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌’తో వస్తున్న చిన్న దేవరకొండ


అమెరికాలో మంచి ఉద్యోగాన్ని వదులుకొని సినిమాల్లోకి వచ్చాడు విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్. అన్నకు అనూహ్య స్టార్డమ్‌ రావడంతో తానూ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ‘దొరసాని’ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యాడు. తెలంగాణాలో దొరల పాలన బ్యాక్‌డ్రాప్‌లో తీసిన ఈ ప్రేమకథలో చాలెంజింగ్‌ రోల్‌ చేసి మెప్పించాడు ఆనంద్‌. రాజశేఖర్ కూతురు శివాత్మిక కూడా ఈ మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. భావోద్వేగాలతో నిండిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర అంతగా ఆడకపోయినా.. విమర్శల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ రిలీజై చాలా ఏడాది అయింది. ఇప్పుడు తన రెండో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు చిన్న దేవరకొండ అదే ఆనంద్‌ దేవరకొండ. భవ్య క్రియేషన్స్‌ బ్యానర్లో ‘మిడిల్ క్లాస్‌ మెలోడీస్‌’ అనే సినిమాలో నటించాడు ఆనంద్. వర్ష బొల్లమ్మ హీరోయిన్. వినోద్‌ అనంతోజు దర్శకత్వం వహించాడు. కేరాఫ్‌ కంచరపాలెం ఫేమ్‌ స్వీకర్ అగస్తి మ్యూజిక్‌ డైరెక్టర్.

సచివాలయం కూల్చివేతకు.. కేటీఆర్ కు లింకేంటీ?

ఈ మూవీ షూటింగ్‌ పూర్తయింది. ఫస్ట్‌ కాపీ సిద్ధంగా ఉందని నిర్మాత వెనిగళ్ల ఆనంద్‌ ప్రసాద్‌ ప్రకటించాడు. కథకు ప్రాధాన్యం ఉండాలన్న సంకల్పంలో భాగంగానే ఈ చిత్రం తీశామని చెప్పాడు. సాధారణ జీవితాల్లో ఉండే సున్నితమైన హాస్యాన్ని మూవీలో చూపించామని డైరెక్టర్ వినోద్‌ తెలిపాడు. ప్రతి ఒక్కరూ తమను తాము గుర్తించుకునేలా పాత్రలు ఉంటాయన్నాడు. మంచి ప్రేమ కథ కూడా ఉంటుందని, ఆనంద్‌ తొలి సినిమాకు పూర్తి భిన్నంగా ఉంటుందని చెప్పాడు. ఇక, ‘దొరసాని’లో తెలంగాణ యాసలో మాట్లాడిన ఆనంద్‌.. ఈ మూవీలో గుంటూరు యాసలో మాట్లాడనున్నాడు. ఈ చిత్రాన్ని కొలకలూరు, గుంటూరు సిటీ, పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించామని నిర్మాత చెప్పాడు. అన్ని పాత్రలు గుంటూరు యాసలోనే మాట్లాడుతాయని తెలిపాడు. వాస్తవానికి ఈ వేసవిలోనే సినిమాను రిలీజ్‌ చేయాలనుకున్నప్పటికీ.. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా వేశామని, త్వరలోనే రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తామని వెల్లడించాడు.

కేసీఆర్ ఆందోళన అందుకేనా?


సచివాలయం కూల్చివేతలో.. కొత్త సెక్రటేరియట్ నిర్మాణంలో ఆది నుంచి సీఎం కేసీఆర్ కు ఆటంకాలు ఏర్పడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయన ఎంత సైలెంట్ గా పనిచేద్దామనుకుంటున్నా ఏదో ఒక వివాదం ఆయనను అప్రతిష్టపాలు చేస్తోంది.

తాజాగా హిందుత్వ దెబ్బ సీఎం కేసీఆర్ పై బాగానే పడిందట.. అందుకే అజ్ఞాతంలో ఉన్న ఆయన సచివాలయం కూల్చివేతలో నల్లపోచమ్మ టెంపులపై పెచ్చులు పడ్డాయని విచారం వ్యక్తం చేశారట.. సచివాలయం ఆవరణలో పెద్ద టెంపుల్ కట్టిస్తానని హామీ కూడా ఇచ్చారు.

సచివాలయం కూల్చివేతకు.. కేటీఆర్ కు లింకేంటీ?

నిజానికి కేసీఆర్ సచివాలయం కూల్చివేతలో భాగంగా గుట్టుచప్పుడు కాకుండా నల్లపోచమ్మ ఆలయం.. పక్కనే ఉన్న మసీదును తెల్లవారుజామున సైలెంట్ గా కూల్చివేయించారు. అయితే ఈ ఆలయం, మసీదు స్థానాల్లో కొత్తవి కట్టిస్తానని హామీ ఇచ్చారు.

మసీదును కట్టిస్తానని కేసీఆర్ హామీ ఇవ్వడంతో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటికే సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే నల్లపోచమ్మ ఆలయం పునర్మిర్నిస్తానని చెప్పినా కూడా బీజేపీ , వీహెచ్.పీ హిందూ సంస్థల నుంచి అలాంటి స్పందన రాలేదు. దీంతోపాటు కేసీఆర్ హిందుత్వ వ్యతిరేకి అని ఆలయం కూలగొట్టగానే సచివాలయ కూల్చివేతకు హైకోర్టులో బ్రేక్ పడిందని బీజేపీ నేతలు ప్రచారం మొదలుపెట్టారు.

ఇప్పటికే హిందువులు బొందువులు అన్నందుకు కేసీఆర్ కు బాగా డ్యామేజ్ జరిగింది. హిందువుల్లోని మెజార్టీ వర్గం ఆగ్రహించింది. ఈ క్రమంలోనే కేసీఆర్ ఇప్పుడు విచారాలు వ్యక్తం చేస్తూ మళ్లీ ఆలయం నిర్మిస్తానంటున్నారు.

జాతీయ స్థాయిలో జగన్ ఇమేజ్ డ్యామేజ్..!

ఇక అన్నింటికంటే ముఖ్యమైనది కొత్త సచివాలయం నమూనా ముస్లిం శైలిలో ఉందంటూ హిందుత్వవాదులు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్, టీఆర్ఎస్, దాని అనుకూల మీడియా తాజాగా కొత్త వాదన మొదలు పెట్టారు. నిజామాబాద్ లోని ప్రముఖ నీల కంఠేశ్వర్ స్వామి ఆలయ నమూనాను పోలి ఉందని హిందుత్వ శైలినే అన్న వాదన తెరపైకి తెచ్చారు. ఇలాంటిది కేవలం ఫ్రాన్స్ లోని వెర్సైల్లెస్ ప్యాలెస్ నమూనాగా మాత్రమే ఉందని ప్రచారం మొదలుపెట్టాయి. ఇది యూరోపియన్ -సారాసెనిక్ శైలి అని వాదిస్తున్నారు.

ఇలా సచివాలయం కూల్చివేత, డిజైన్ తో దెబ్బతిన్న పరువును కవర్ చేయడానికి సీఎం కేసీఆర్ ఆపసోపాలు పడుతున్నాడని గులాబీ పార్టీలో చర్చ జరుగుతుంది.

‘అ!’ దర్శకుడికి మాటిచ్చిన చిరంజీవి


టాలీవుడ్‌లో ఈ మధ్య యువ దర్శకుల హవా కొనసాగుతోంది. షార్ట్‌ ఫిల్మ్స్‌తో సత్తా నిరూపించుకొని వెండితెరపై అవకాశాలు దక్కించుకుంటున్నారు. తమ క్రియేటివీతో చిన్న హీరోలనే కాదు పెద్ద హీరోలను కూడా డైరెక్ట్‌ చేస్తున్నారు. ఈ లిస్ట్‌లో సుజీత్‌, ప్రశాంత్‌ వర్మ ముందుంటారు. ‘రన్‌ రాజా రన్‌’తో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన సుజీత్‌.. తన సెకండ్‌ మూవీనే ప్రభాస్ తో చేశాడు. ‘సాహో’ను పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కించి శభాష్ అనిపించుకున్నాడు. ఇప్పుడు ‘లూసిఫర్’ రీమేక్‌లో లెజెండ్‌ చిరంజీవిని డైరెక్ట్‌ చేసే చాన్స్‌ కొట్టేశాడు. మలయాళంలో సూపర్ హిట్‌ అయిన లూసిఫర్ను  తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసిన సుజీత్‌ ఇప్పుడు చిరు డేట్స్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. మరోవైపు ‘అ!’ చిత్రంతో దర్శకుడిగా తన ప్రతిభను కనబరిచిన ప్రశాంత్ వర్మ తర్వాత సీనియర్ హీరో రాజశేఖర్ తో ‘కల్కి’ చేసి మెప్పించాడు. ఇప్పుడు ‘కరోనా వ్యాక్సిన్‌’ అనే సినిమా తీస్తున్నాడు. డైరెక్టర్ కాకముందు ప్రశాంత్‌ పలు చిత్రాలకు కథలు అందించి రచయితగా మంచి పేరు తెచ్చుకున్నాడు.అంతేకాదు అతను మెగాస్టార్ చిరంజీవి కూడా కథ వినిపించాడు. ఈ విషయాన్ని ప్రశాంతే స్వయంగా వెల్లడించాడు. కథ నచ్చడంతో సినిమా చేద్దామని చిరు తనకు మాట కూడా ఇచ్చాడని తెలిపాడు. ఇది ‘సైరా నరసింహారెడ్డి’కి ముందే జరిగిందన్నాడు. సైరా కంటే ముందు చిరు చాలా వేగంగా ఓ సినిమా చేయాలని భావించారన్నాడు. కానీ, సైరా కథ కొలిక్కి వచ్చాక ఆ ఆలోచనను విరమించుకున్నాడని తెలిపాడు. కానీ, సైరా చిత్రీకరణ ప్రారంభమవడానికి ముందే చిరుకు తాను కథ వినిపించానని ప్రశాంత్‌ వెల్లడించాడు.

త్వరలోనే ఏపీలో ఉప ఎన్నికలు..!

కథ చాలా బాగుందని చిరు ప్రశంసిచడంతో పాటు తప్పకుండా మూవీ చేద్దాం అని తనకు మాట కూడా ఇచ్చారని తెలిపాడు. దాంతో చిరు నుంచి పిలుపు కోసం ఎదురు చూస్తున్నానని అన్నాడు. మెగాస్టార్ నుంచి ఎప్పుడు పిలుపు వచ్చినా.. సినిమా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశాడు. కాగా, ఖైదీ నం.150తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరు… తర్వాత ‘సైరా’లో స్వాతంత్ర్య సమరయోధుడిగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆ వెంటనే స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో ‘ఆచార్య’ చేస్తున్నారు. కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్‌ ఆగిపోయింది. ఇక ‘లూసిఫర్’ రీమేక్‌కు ఓకే చెప్పిన చిరు దాని దర్శకత్వ బాధ్యతలు సుజీత్‌కు అప్పగించారు. ఈ రెండు చిత్రాలు పూర్తయిన తర్వాత ప్రశాంత్‌తో మూవీ చేసే అవకాశం కనిపిస్తోంది.

అమెరికాని మించిన భారత్!

lock down 5.0

lock down 5.0

దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఎంతగా పెరుగుతున్నాయంటే.. ప్రపంచంలోనే కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న అమెరికాలో కంటే భారత్ లోనే ఈ రేటు అధికంగా ఉంది. ఈ పెరుగుదలపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంలో సంక్రమణ రేటు అమెరికా మరియు బ్రెజిల్ కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం.

ఈ రేటు అమెరికాలో 1.8, బ్రెజిల్‌ లో 1.9 శాతం ఉండగా భారత్ లో ఈ రేటు 3.3 శాతం ఉండటం ఆశ్చర్యం కలిగించే అంశం. అయితే ఇప్పటివరకు ప్రపంచంలో అత్యధిక వృద్ధి రేటు దక్షిణాఫ్రికాలో 4.7 శాతంగా ఉంది. అత్యధిక రోజువారీ సగటు రోగులు యుఎస్, బ్రెజిల్ లో 30వేలు దాటగా.. భారతదేశంలో 25వేలు దాటాయి. అదే సమయంలో, రోజువారీ మరణాలలో బ్రెజిల్ ముందంజలో ఉంది. బ్రెజిల్‌ లో సగటున 825 మంది, అమెరికాలో 601, భారతదేశంలో 549 మంది మరణిస్తున్నారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, కరోనా యొక్క పరీక్ష పాజిటివిటీ రేటు సుమారు 9.34 శాతం. 21 వ రోజు రోగుల సంఖ్య రెట్టింపు అవుతోంది. గత 20 రోజుల్లో, రాజధాని .ఢిల్లీలో రోజువారీ కేసుల వేగంలో కాస్త తగ్గుదల ఉందని నిపుణులు అంటున్నారు.

ప్రస్తుతం భారత్‌ లో కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,20,916కు చేరుకుంది. గత 24 గంటల్లో 27,114 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. అయితే అదే స్థాయిలో కోలుకొని ఇంటికి వెళ్తున్నవారి సంఖ్యా పెరగడం శుభ పరిణామం. అమెరికాలో కరోనా వైరస్‌ విజృంభణ అత్యంత ప్రమాదకరంగా ఉంది. దేశంలో మొత్తం కేసుల  సంఖ్య 33 లక్షలకు చేరువైంది. గత మూడు రోజుల నుంచి రోజుకు 60 వేల కొత్త కేసులు బయటపడగా.. నిన్న ఒక్క రోజే 72 వేల కేసులు నమోదయ్యయి.

త్వరలోనే ఏపీలో ఉప ఎన్నికలు..!


ఏపీలో ఎన్నికలు జరిగి ఏడాది మాత్రమే అయింది. ఇంతలోనే ఉప ఎన్నికలు ఏంటీ అనుకుంటున్నారా? అవునండీ.. మీరు వింటున్నది నిజమే.. త్వరలోనే ఏపీలో ఉప ఎన్నికలు జరిగడం ఖాయంగా కన్పిస్తుంది. కిందటి ఎన్నికల్లో ఫ్యాన్ గాలి ఏపీలో జోరుగా వీయడంతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. 151సీట్ల బంపర్ మెజార్టీని సాధించి సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజారంజాక పథకాలు ప్రవేశపెడుతూ సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఇటీవలే ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు.

విమర్శల సుడిగుండం లో యోగీ ప్రభుత్వం

ఏడాది కాలంలో సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చాలావరకు అమలు చేస్తూ ముందుకెళుతున్నారు. పాలన చేపట్టిన తొలిరోజుల్లో కొంత ఇబ్బందులు ఎదురైనప్పటికీ ప్రస్తుతం పాలనలో పట్టుసాధించి ఏపీ ప్రగతిపై దృష్టిసారించారు. ఓవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే ప్రత్యర్థులకు చెక్ పెడుతున్నారు. గత ఎన్నికల్లో చావుదెబ్బతిన్న టీడీపీ ఏడాది కాలంగా ఇంకా కోలుకున్నట్లు కన్పించడం లేదు. టీడీపీ నైరాశ్యంలో ఉండటంతో ఆ పార్టీ చెందిన పలువురు నేతలు వైసీపీలోకి క్యూ కడుతున్నారు.

వైసీపీలోకి టీడీపీకి చెందిన కిందిస్థాయి నాయకులను పెద్దఎత్తున చేరుతున్నారు. అయితే ఇతర పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలను మాత్రం వైసీపీ హోల్డులో పెట్టింది. వీరంతా లోపాయికారిగా వైసీపీకి మద్దుతు ఇస్తున్నారు. చంద్రబాబులా తాను నీచరాజకీయాలు చేయలేనని ఇతర పార్టీల ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వస్తేనే తన పార్టీలోకి చేర్చుకుంటానని ఆయన గతంలోనే స్పష్టం చేశారు. దీంతో టీడీపీ చెందిన పలువురు నేతలు రాజీనామా చేసి వైసీపీ గుర్తుపై పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. దీంతో ఏపీలో త్వరలోనే ఉప ఎన్నికలు ఖాయమనే ప్రచారం జరుగుతోంది.

జాతీయ స్థాయిలో జగన్ ఇమేజ్ డ్యామేజ్..!

సొంతపార్టీలోని వైరిపక్షంగా వ్యవహరిస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామక్రిష్ణం రాజుపై ఆ పార్టీ వేటువేసే ఆలోచనలో ఉంది. ఇప్పటికే లోక్ సభ స్పీకర్ ను కలిసి అనర్హత వేటువేయాలని వైసీపీ నేతలు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటే రేపేమాపో ఉప ఎన్నికలు రావడం ఖాయంగా కన్పిస్తుంది. అదేవిధంగా టీడీపీకి చెందిన రెబల్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాల గిరిలు ఆ పార్టీకి రాజీనామాచేసి వైసీపీ తరుఫున బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారని టాక్ విన్పిస్తుంది.

వీరి విషయంలో జగన్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఒక ఎంపీ, మూడు అసెంబ్లీ స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు ఖాయమని ప్రచారం జోరుగా సాగుతోంది. జగన్ ఏడాది పాలనకు రెఫరెండంగా ఈ ఎన్నికలు మారనుండటంతో ఉప ఎన్నికల పోరు రసవత్తరంగా మారడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

జగన్-కేసీఆర్ దోస్తీకి జలగండం..?


తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య నీటియుద్దం మొదలయ్యే ఛాయలు కనిపిస్తున్నాయి. ఆంద్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న కొన్ని ప్రాజెక్టులు తెలంగాణా ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని తెలంగాణా ప్రభుత్వం ఆరోపిస్తుంది. మొదటినుండి సఖ్యతగా మెలుగుతున్న సీఎం లమధ్య నీటి వినియోగం విషయంలో, విభేదాలు తలెత్తేలా కనిపిస్తున్నాయి. ఆంద్రప్రదేశ్ లో జగన్ సీఎం కావడాన్ని కేసీఆర్ స్వాగతించారు. వైస్సార్ సీపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న టీడీపీ తెలంగాణాలో కాంగ్రెస్ తో పొత్తుకట్టి తనపై పోటీకి దిగడంతో కేసీఆర్ కి బాబు శత్రువు అయ్యాడు. శత్రువు యొక్క శత్రువు మన మిత్రుడు అవుతాడు గనుక జగన్ తో సాన్నిహిత్యం కేసీఆర్ పెంచుకున్నాడు. 2018 అసెంబ్లీ ఎన్నికలలో ఆయన ఘన విజయం సాధించాక, 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో జగన్ ప్రభుత్వం గెలవాలని కేసీఆర్ కోరుకున్నారు. ఆయన అనుకున్నట్లే జగన్ సీఎం అయ్యారు. అప్పటి నుండి ఈ ఇద్దరు సీఎంలు చాలా సన్నిహితంగా ఉంటున్నారు.

విమర్శల సుడిగుండం లో యోగీ ప్రభుత్వం

ఐతే కొద్దిరోజుల క్రితం జగన్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యూలేటర్ పై ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాలని నిర్ణయించారు. శ్రీశైలం ప్రాజెక్ట్ లోని నీటిని వాడుకొనేందుకు వీలుగా జగన్ ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయాన్ని కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టదలచిన ఆ ప్రాజెక్ట్ తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసేదిగా ఉందని, ఆ ప్రాజెక్ట్ ఆపివేసేలా చర్యలు తీసుకోవాలని కృష్ణ రివర్ బోర్డుకు సూచనలు చేయడం జరిగింది. తెలంగాణా విభన చట్టానికి వ్యతిరేకమైన ఈ ప్రాజెక్ట్ విషయంలో కేసీఆర్ న్యాయపోరాటం చేస్తాము అన్నారు. స్నేహితుడుగా ఉన్న జగన్ ని కేసీఆర్ మొదటిసారి ఈ ప్రాజెక్ట్ విషయంలో వ్యతిరేకించడం జరిగింది.

జాతీయ స్థాయిలో జగన్ ఇమేజ్ డ్యామేజ్..!

తాజాగా పోలవరం ప్రాజెక్ట్ విషయంలో జగన్ తీసుకున్న మరో నిర్ణయాన్ని కూడా తెలంగాణా ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ కుడికాలువ నీటి సామర్ధ్యాని 17వేల క్యూసెక్కుల నుండి 50వేల క్యూసెక్కులకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పోలవరం కుడి కాలువ సామర్ధ్యం పెంచితే తెలంగాణా నష్టపోతుందని గోదావరి బోర్డుకు తెలంగాణ అధికారులు లేఖ రాయడం జరిగింది. కృష్ణా గోదావరి నదుల నీటి వాటాలు, వాడుకలు ఈ ఇద్దరు మిత్రుల మధ్య విభేదాలు తేవడం ఖాయంగా కనిపిస్తుంది. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు జగన్ ఇంతవరకు స్పందించనప్పటికీ భవిష్యత్ లో తెలుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం తప్పేలా లేదు.