Home Blog Page 8409

జగన్ క్యాబినెట్లో పెద్దగా మార్పులేమీ ఉండవా?


ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఇటీవలే ఏడాది పాలనను పూర్తి చేసుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ క్యాబినెట్ లో భర్తీ కోసం చాలామంది పోటీపడ్డారు. పార్టీని నమ్ముకొని సేవలందిస్తున్న కొంతమందికి మంత్రి పదవులు లభించగా మరికొందరికీ నిరాశ ఎదురైంది. వీరికి మరోసారి క్యాబినెట్ విస్తరించిపుడు అవకాశం ఇస్తానని సీఎం జగన్ హామీ ఇవ్వడంతో ఆరోజు కోసం వేయికళ్లతో నాయకులు ఎదురుచూస్తున్నారు. సీఎం దృష్టి తమపై పడేలా ఆయన చుట్టురా తిరుగుతూ పనులు చేస్తున్న సంగతి తెల్సిందే..

ఏపీ కేబినెట్ విస్తరణకు తేదీ ఖరారు..

జగన్ రెండోసారి క్యాబినెట్ విస్తరణకు చేపట్టకముందే రెండు మంత్రి పదవులు ఖాళీ అయ్యాయి. మండలి రద్దు నిర్ణయంతో శాసన మండలి నుంచి మంత్రి పదవుల్లో ఉన్న ఇద్దరు నేతలు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ ఇద్దరిని కూడా జగన్మోహన్ రెడ్డి రాజ్యసభకు పంపారు. దీంతో ఖాళీగా ఉన్న రెండు మంత్రులపై నేతలు ఆశలు పెంచుకున్నారు. ఈ రెండు ఖాళీలతోపాటు క్యాబినెట్ లో మార్పులు చేర్పులు ఉంటాయని ప్రచారం జోరుగా సాగింది. దీంతో ఆశావహుల లిస్టు భారీగా పెరిగిపోయింది. గతంలో పేరు ఖరారై చివరి నిమిషంలో అవకాశం కోల్పోయిన నేతలు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు.

సీఎం జగన్ తొలుత క్యాబినెట్లో మార్పులు చేయాలని భావించినట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో తాజా పరిస్థితుల రీత్య తన నిర్ణయాన్ని మార్చుకున్నారనే టాక్ విన్పిస్తోంది. ఓవైపు కరోనా మహమ్మరి.. మరోవైపు ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి. ఇంకా స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగలేదు. మెనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయాల్సి ఉంది. తొలి ఏడాదితోనే కొంతమందిని ఇంటికి పంపితే కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందని జగన్ భావిస్తున్నారు. దీంతో పదవుల తేనె తుట్టును కదపకుండా ఖాళీ అయిన రెండు బెర్త్ ను మాత్రమే భర్తీ చేసేందుకు మొగ్గుచూపుతున్నారట.

త్వరలోనే ఏపీలో ఉప ఎన్నికలు..!

ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గవర్నర్ అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది. ఈనెల 22, 24తేదిల్లో గవర్నర్ అపాయింట్మ్ంట్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఈ తేదిల్లో ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్ గా ఇద్దరు మంత్రులతో ప్రమాణం స్వీకారం చేయించేందుకు సీఎం రెడీ అవుతున్నారట. బీసీల నేతల రాజీనామాలతో ఏర్పడిన ఖాళీలను ఆ సామాజికవర్గానికి చెందిన నేతలనే భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. దీంతో ఆ ఇద్దరు నేతలు ఎవరా? అనే చర్చ మొదలైంది. క్యాబినెట్ విస్తరణపై భారీ ఆశలు పెట్టుకున్న నేతలు మాత్రం జగన్ చల్లని చూపుకోసం ఎదురుచూస్తున్నారు.

ఏపీ, తెలంగాణ కి అప్పుల తిప్పలు!

AP telangana

కరోనా కారణమో..? లేక సంక్షేమ పథకాల సంక్షోభమో..? తెలియదు గానీ, రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకున్నాయి. ధనిక రాష్ట్రమని చెప్పుకునే తెలంగాణ కూడా ఇపుడు పీకల్లోతు అప్పుల్లో కూరుకునిపోయింది. గత 2018-19 తో పోలిస్తే గతేడాది తెలంగాణపై అప్పుల భారం 38 శాతం పెరగ్గా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై 42 శాతం పెరిగింది.

తెలంగాణరాష్ట్రం ఈ యేడాది ఇప్పటివరకు తీసుకున్న దానిని బట్టి మొత్తం ఆర్థిక సంవత్సరంలో స్థూల రుణం రూ.48 వేల కోట్లకు, నికర రుణం రూ.40,500 కోట్లకు చేరే అవకాశం ఉంది.

అలాగే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2018-19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2019-20 ఆర్థిక సంవత్సరంలో బహిరంగ మార్కెట్ నుంచి సేకరించిన స్థూల రుణం 42.10 శాతం, నికర రుణం 42.47 శాతం పెరిగింది.

ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నెలకు సగటున రూ.3,333 కోట్ల చొప్పున రూ.10 వేల కోట్ల స్థూల రుణం తీసుకోగా, ఇందులో నికర రుణం వాటా రూ.8,250 కోట్లుగా ఉంది.

జగన్ క్యాబినెట్లో పెద్దగా మార్పులేమీ ఉండవా?

బయోగ్రఫీ : ‘రష్మిక మందన్నా’ ప్రేమ సీక్రెట్స్ తో సహా !

Rasmika Mandanna Latest
వెండితెర పై అప్పుడే పూసిన అల్లరి పిల్లలా ఎప్పుడూ ఉత్సాహంగా కనిపిస్తుంది ‘రష్మిక మందన్నా‘. టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతున్న ఈ లవ్లీ బ్యూటీది సినీ లోకంలో పూల బాట ఏమీ కాదు, అలా అని కన్నీళ్లు చాటున ఎదిగిన గతమూ ఆమెకు లేదు. అసలు రష్మిక ఎప్పుడూ సినిమాల్లోకి రావాలని కలలు కనలేదు.. ఆరాటం అంతకన్నా పడలేదు. ఇప్పటికీ ‘నీలాంటి అమ్మాయి సినిమాల్లోనా’ అని రష్మీకను వాళ్ళ అమ్మ ఆటపట్టిస్తుంటుందట. నిజానికి ‘నేనేంటి? సినిమాల్లో ఏంటి?’ అని రష్మికకే అప్పుడప్పుడు అనినిపిస్తోందట. ఎందుకంటే చిన్నప్పటి నుండి వాళ్ల ఇంట్లో సినిమా వాసనలు కానీ, ఆ వాతావరణం గాని ఏదీ లేదు. పైగా రష్మికకు మరీ అంత సినిమా పిచ్చి కూడా ఏమి లేదు. కానీ ఇప్పుడు సినిమాల్లో ఓ తారలా వెలిగిపోతుంది. ఇది ఎలా జరిగిందని ఈ బ్యూటీని కాస్త కదిలిస్తే… ఏమో అంతా ఓ మెరుపు కలలా, కలలో జరిగిన స్వప్నంలా అంతా జరిగిపోయిందని కళ్ళు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చెబుతుంది.

మరో భారీ ఆఫర్ కొట్టేసిన రష్మిక!

రష్మికది కర్ణాటక కూర్గ్‌ దగ్గర్లోని విరజ్‌పెట్‌. వాళ్ళ నాన్నగారు బిజినెస్ మెన్. కాఫీ తోటల వ్యాపారంలో ఆయన దిట్ట. ఆ రకంగా గోల్డెన్ స్పూన్ లోనే అందమైన రష్మిక పాదాలు సుకుమారపు అడుగులు వేశాయి. చదువు విషయానికి వస్తే.. పది వరకూ కూర్గ్‌ లో.. అలాగే మైసూర్‌లో ఇంటర్‌, బెంగళూరులో డిగ్రీ చేసింది. అన్నట్టు అమ్మడు సైకాలజీతో పాటు జర్నలిజంలో కూడా డిగ్రీ చేసింది. ఇంటర్‌, డిగ్రీలలో రష్మిక టాపర్‌ కూడా. అందుకేనేమో చిన్నప్పుడు ఓసారి ‘డాక్టర్‌’ అవ్వాలని మారం చేసిందట. కానీ గుండె, మూత్ర పిండాల డ్రాయింగ్ పూర్తి చేసే సరికీ ఇదంతా తన వల్ల కాదని ఈ లేత బ్యూటీ ఫిక్సయిపోయింది. అయితే రష్మిక డిగ్రీలో ఉన్నప్పుడే ‘కిరిక్‌ పార్టీ’ అనే కన్నడ సినిమాలో అవకాశం వచ్చింది.

అయితే అమ్మాయి ఎంత అందంగా ఉంటే మాత్రం.. సినిమా ఛాన్స్ లు ఈజీగా రావు కదా.. అలా అని రష్మిక ముంబై భామల్లా ఎన్నో ఆటుపోట్లుకు నలిగిపోలేదు. డిగ్రీలో ఉన్నప్పుడు మోడల్‌గా ట్రై చేసింది రష్మిక.. అదీ ఆమె క్లోజ్ ఫ్రెండ్ సలహాతో. అలా ‘ఫ్రెష్‌ ఫేస్‌ ఆఫ్‌ ఇండియా 2014’ టైటిల్‌ ను గెలుచుకుని తన అందచందాలను నేటి సమాజానికి ఘనమైన ఘాటు ఫోటోషూట్ లతో చాటి చెప్పింది. అలా నన్ను సినిమాల్లోకి లాక్కొచ్చింది ఆ టైటిల్, అప్పుడు నేను అందంగా దిగిన ఫొటోలే అంటూ తన గతాన్ని సింపుల్ గా చెప్పేస్తోంది ఈ హస్కీ పాప.

చైతూ సరసన రష్మిక?

మొత్తానికి ‘కిరిక్‌ పార్టీ’ సూపర్ హిట్ తో ‘ఛలో’ అంటూ తెలుగులోకి వచ్చి వాలింది. ఛలో కూడా హిట్ అవ్వడం, వెంటనే ‘గీత గోవిందం’ పడటం దాంతో ఈ బ్యూటీ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అలా మహేష్ తో ఆడిపాడి ప్రస్తుతం బన్నీతో రొమాన్స్ కి రెడీ అవుతోంది. మధ్యలో అప్పుడప్పుడు త్రివిక్రమ్ ను కూడా కాకపడుతుందట. ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ ఇవ్వమని.. ఒకవేళ గురూజీకి పాప అడిగిన విధానం నచ్చితే గనుక, ఎన్టీఆర్ సినిమాలో కూడా రష్మిక అందాల విందు ఉండే అవకాశం ఉంది. ఇకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ అంటే ఈ బ్యూటీనే అనే పరిస్థితి వచ్చేస్తోందేమో.

అన్నటు ఈ పాపకి కొన్ని ఇష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా రష్మికకు స్విమ్మింగ్‌ అంటే చాలా ఇష్టమట. అలాగే త్రోబాల్‌ లో కాలేజీ ఛాంపియన్‌ కూడా. ఇక భరతనాట్యం, ఫోక్‌ డ్యాన్స్‌ అంటే పిచ్చి అట. స్కూల్లో, కాలేజీలో డాన్స్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇరగదీసేదట. ఇప్పుడు సినిమాల్లో కూడా అలాగే రెచ్చి పోతుంది అనుకోండి. ఇక రష్మిక బెస్ట్‌ ఫ్రెండ్స్‌ పేర్లు.. అన్మోల్‌, ప్రేరణ, ఆపేక్ష,. వీరంతా చిన్నప్పటి నుండే స్నేహితులు. అయితే ఈ బ్యూటీలో పెద్ద అమాయకత్వం కూడా ఉందండోయ్. చిన్నప్పుడు వాళ్ళ నాన్న జేబులో నుండి పది, ఇరవై రూపాయల నోట్లు తీసేసి అందరికీ పంచిపెట్టేదట. ఎందుకంటే దానం చేస్తే పుణ్యం వస్తుందని ఎవరో చెప్పారట. ఇంకా నయం వాళ్ళు దానం అని చెప్పారు, లేకపోతే ఇంకేమీ పంచడానికి సిద్దపడేదో పాపం.

ఇక చివరగా రష్మిక ప్రేమ కహానీల గురించి ముచ్చటించుకుంటే.. పదిహేను ఏళ్లకే కుర్రాళ్లు రష్మిక చుట్టూ ప్రదక్షిణలు చేసేవారట. ఆ వయసులోనే ఆమెను ఒక కుర్రాడు ఇంప్రెస్ చేశాడట. కానీ అన్ని టీనేజీ లవ్ స్టోరీలు లాగానే అది కూడా అర్ధవంతం లేకుండానే అర్ధాంతరంగానే ముగిసిపోయింది. ఆ తరువాత పాపకి కొన్ని చిలిపి ప్రేమలు ఉన్నా.. ‘కిరిక్‌ పార్టీ’ హీరో రక్షిత్‌ శెట్టితో మాత్రం ఘాటు ప్రేమనే సాగించింది. అయితే ఈ విషయాన్నీ ముందు వాళ్ళ అమ్మతోనే చెప్పిందట. పాపం కూతురు విరహ ప్రేమను చూసిన ఆ మహాతల్లి… ‘నీ ఇష్టం.. నీకేది అనిపిస్తే అది చెయమ్మా’ అంటూ కూతురు ఇష్టానికి విలువ ఇచ్చిందట. కానీ ఏం చేస్తాం.. రక్షిత్‌ శెట్టి సినిమాల్లోనే హీరో అయ్యాడు.. పాప జీవితంలో పాపం జీరోగా మిగిలిపోయాడు. ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రేమ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉంటుంది.

కరోనా కంటే కఠిన సమస్య


ప్రపంచం మొత్తం కరోనా సమస్యతో విలవిలలాడిపోతూ ఉంటే సైబర్ నేరగాళ్లు మాత్రం ఇదే అవకాశంగా భావిస్తున్నారు ఫోన్ చేసి మేము బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాము మీ కార్డు నెంబర్ చెప్పండి అని అడిగేవారు ఇప్పుడు కొంచెం పంథా మార్చుకుని వారి మార్గం సుగమం చేసుకున్నారు ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయగానే మీరు చైనీస్ యాప్ వాడటం వల్ల మీ కార్డు వివరాలు బహిర్గతం కాబడ్డాయి అందుకే వెంటనే మీ కార్డు బ్లాక్ చేయాలి దీనిని బ్లాక్ చేసేందుకు మీ కార్డు వివరాలు తెలియజేయండి అని భయబ్రాంతులకు గురిచేస్తూ మాట్లాడుతున్నారు.

చైనీస్ యాప్ వలన ఇప్పటివరకు ఎలాంటి నష్టం లేకపోయినా సైబర్ నేరగాళ్లు మాత్రం ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఒక అవకాశంగా మార్చుకుంటున్నారు. దీనిపై సైబర్ పోలీసింగ్ అవగాహన పెంచుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు, దీనికి పరిష్కార మార్గం ఒకటే మీరు మాస్క్ వేసుకోండి నోరు మూసుకోండి కార్డు వివరాలు ఎవరికీ తెలియజేయకండి బి సేఫ్ అని ప్రచార కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.

ముద్రగడ.. కాపులు.. ఓ కుట్రకోణం!

ఈ సమస్య రోజురోజుకూ పెరుగుతోందని అందరూ అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ పోలీసులు తెలియజేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల ఫోన్ కు సంబంధించిన వివరాలు సైబరాబాద్ సెల్ కంప్లైంట్ 9490617444 నెంబర్ కి తెలియజేయాలని సమస్యను వ్యాప్తి చెందకుండా చూస్తామని అన్నారు.

భారతదేశం డిజిటల్ కరెన్సీ వైపుకు మారుతున్న తరుణంలో ఇలాంటి సమస్యలు ఎదుర్కో సహజమే అయినా ఈ సమస్య త్వరగా పరిష్కార మార్గాన్ని కనుక్కోవటం ద్వారా పూర్తి డిజిటల్ కరెన్సీ విధానాన్ని అమలు చేయవచ్చు.

2024 మ్యానిఫెస్టో కోసం బాబు కసరత్తు..?


జగన్ ని అధికారం పీఠం ఎక్కించిన ప్రధాన అంశాలలో నవరత్నాలు ఒకటి. జగన్ తన మేనిఫెస్టో లో పొందుపరచిన 9 అంశాలను ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారు. ప్రజా సంకల్ప యాత్రలో స్థానిక సమస్యలను మరియు వాటికి పరిష్కార మార్గాల గురించి చెప్పిన జగన్, ప్రతి మీటింగ్ లో నవరత్నాలలోని ప్రతి ఒక పథకాన్ని క్షుణంగా వివరించారు. అన్ని సామాజిక, మరియు బడుగు బలహీన వర్గాలకు మేలు కలిగేలా రూపొందించిన నవరత్నలోని అంశాలు ప్రజల్ని బాగా ఆకర్షించాయి. మద్యపాన నిషేధం, పీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, పేదలందరికీ ఇళ్లు, వైయస్సార్ ఆసరా, జలయజ్ఞం, రైతు భరోసా, అమ్మవడి వంటి విప్లవాత్మక పథకాలతో రూపొందించిన నవరత్నాల అమలు ఇప్పటికే పూర్తి చేశారు జగన్.

ఆనంతో… రఘురామ్, ఏం జరుగుతుంది జగన్ ?

టీడీపీ ప్రభుత్వంలో విద్యాసంస్థలకు బాకీ ఉన్న రీఎంబర్స్‌మెంట్‌ బకాయిలు జగన్ ప్రభుత్వం చెల్లింది. అమ్మవడి పథకం ద్వారా అర్హులైన తల్లిదండ్రుల ఖాతాలో వారి పిల్లల చదువుకోసం రూ. 15వేలు జమ చేయడం జరిగింది. ఇక మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్న జగన్, మద్యం అమ్మకాలు సగానికి పైగా తగ్గించారు. రైతు భరోసా, వైయస్సార్ చేయూత పథకం క్రింద అర్హులైన రైతులు ఇతర వృత్తుల వారు లబ్ది పొందారు. ఆగస్టు నుండి పింఛన్ల పెంపుకు కూడా శ్రీకారం చుట్టారు. రూ. 2250గా ఉన్న పెన్షన్ ని రూ. 2500 చేస్తున్నారు. జలయజ్ఞంలో భాగంగా కేంద్రం సహాయంతో పోలవరం ప్రాజెక్ట్ ని పరుగులు పెట్టిస్తున్నారు. ఎన్నికలకు ముందు చేసిన అన్ని వాగ్దాలను సచివాలయం గోడలపై అంటించి, తన చిత్తశుద్ధి చాటుకున్నారు.

ఇప్పుడు ఆ కాపునేతలు ఏం సమాధానం చెబుతారు..?

ఐతే వచ్చే ఎన్నికలలో జగన్ కి నవరత్నాల అమలే ప్రధాన అజండా కానుంది. ఇచ్చిన హామీలన్ని నెరవేర్చిన జగన్ ధైర్యంగా ప్రజలను ఓటు అడుగగలడు. ఈనేపథ్యంలో చంద్రబాబు ఎన్నికల అజెండా, మ్యానిఫెస్టో ఏమవుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు నవరత్నాలు అనేది పూర్తిగా అవినీతి మయం అని ప్రచారం చేసే సూచనలు కలవు. బాబు విమర్శించినా సదరు పథకాల వలన నేరుగా అర్హుల ఖాతాలలోకి డబ్బులు చేరుతున్న క్రమంలో అవినీతికి తావెక్కడ ఉంటుంది. ప్రతి పథకం ద్వారా ప్రయోజనం పొందిన లబ్ధిదారులు బాబు ఆరోపణలు నమ్ముతారా అంటే కష్టమే. ప్రజలకు మేలు చేస్తున్న జగన్ నవరత్నాలను విమర్శించినా, రద్దు చేస్తాను అని చెప్పే ధైర్యం బాబుకు ఉండకపోవచ్చు. మరి వాటినే అమలు చేస్తాను అంటే…ఈయనకు ప్రత్యేకత ఉండదు . కాబట్టి దీనిపై ఇప్పటి నుండే ప్రత్యేక కసరత్తు బాబు మొదలుపెట్టాడట. నవరత్నాలకు మించిన ప్రజాకర్షక పథకాల అన్వేషణలో ఆయన ఉన్నారట. మరి రాజకీయాలలో 40 ఏళ్ల అనుభవం ఉన్న బాబు ఎంత గొప్ప మ్యానిఫెస్టో తయారు చేస్తారో చూడాలి.

పాపం రాశీఖన్నా… అంతా సెమీ న్యూడ్ వల్లే !

బబ్లీ గర్ల్ ‘రాశీ ఖ‌న్నా’ మొదట మనం సినిమాలో చిన్న సైడ్ క్యారెక్టర్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత అమ్మడుకు పెద్దగా టాలెంట్ లేకపోయినా హిట్లు లేకపోయినా చూస్తుండ‌గానే స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించేసుకుంది. సడెన్ గా ఛాన్స్ లు పోటెత్తడంతో రెమ్యునిరేషన్ ను భారీగా డిమాండ్ చేసింది. అలా ‘వ‌రల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్’ మేకర్స్ భారీగానే ముట్టజెప్పి, ఆమెకు ఎక్స్ పోజింగ్ విషయంలో పరిథి దాటాలనే కండిషన్ పెట్టారు. రెండు సినిమాల డబ్బులు ఒకేసారి వచ్చి పడేసరికి సెమీ న్యూడ్ కి కూడా సై అనేసింది.

నిజానికి కెరీర్ స్టార్టింగ్ నుండి అందాలు ఆర‌బోయ‌డంలో హ‌ద్దులు దాట‌ని రాశీ ఖ‌న్నా, వ‌రల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ కోసం ఏకంగా రొమాంటిక్ సీన్స్ లో విజ‌య్ దేవ‌రకొండ‌కు పోటీ పడి మరీ నటించడం, కొన్ని బెడ్ సీన్స్‌లో అయితే దేవరకొండను సైతం డామినేట్ చేస్తూ రెచ్చిపోవడంతో రాశీ ఖ‌న్నా ఆ మధ్య టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయిపొయింది. అసలు ఆ సినిమా ట్రైలర్‌ లోనే రాశీఖన్నా బాతింగ్ షాట్ సంచలనం రేపింది. ఆ సీన్ లో ఒక ఎమెషన్ ఉందని, అందుకే తగ్గట్టే ఆ సినిమాలో నటించాన‌ని.. ఎంత కవర్ చేసినా, రాశీ కెరీర్ కి ఆ సినిమా బాగా ఎఫెక్ట్ అయింది. పైగా ఆ సినిమా పెద్ద అట్ట‌ర్ ప్లాప్ అయ్యే.

‘రాశి’ని వదల్లేకపోతున్న తేజు

ఇప్పుడు కాస్త స్టార్ డమ్ ఉన్న హీరోలు రాశీకి ఛాన్స్ లు ఇవ్వడానికి ఆలోచిస్తున్నారని టాక్. మొదట చంద్రశేఖర్ యేలేటి సినిమాలో నితిన్ సరసన రాశీనే హీరోయిన్ గా అనుకున్నారు. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పుడు ఆ సినిమా నుండి రాశీని తప్పించినట్లు తెలుస్తోంది. దాంతో త‌న పై బ్యాడ్ ఇంప్రెష‌న్ ప‌డిపోయింద‌ని ఈ ముద్దుగుమ్మ‌ తెగ ఫీల్ అవుతుందట. రాశిఖన్నాకు మంచి సినీ స‌ర్కిల్ ఉన్నా వాళ్ళెవరూ మళ్ళీ అవకాశాలు ఇస్తారని నమ్మకం లేకపాయే. ఒకవేళ ఇచ్చినా అడిగినంత ముట్టజెప్పరయ్యే. పాపం రాశీఖన్నా.

అతిగా శానిటైజర్ వాడితే అనర్థమేనంటా..!


కరోనా కాలంలో మనుషులంతా భౌతిక దూరం పాటించడం.. మాస్కులు ధరించడం..శానిటైజర్లు వాడటం కామన్ అయిపోయింది. చైనాలోని వూహాన్లో సోకిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచంలోని అన్నిదేశాలకు పాకింది. కరోనా దాటికి అగ్రదేశాలు సైతం చేతులేత్తేశాయి. కరోనా మరణాలు రోజురోజుకు పెరిగిపోతుండటంతో ప్రజలంతా కరోనాపై అవగాహన పెంచుకున్నారు. దీనిలో భాగంగానే కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తున్నాయి. కరోనా టైంలో శానిటైజర్లు వాడకం ఎక్కువైంది. ఈ సమయంలోననే శానిటైజర్లు అతిగా వాడితే అనర్థాలు కలుగుతాయని నిపుణులు హెచ్చరిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

కరోనా కట్టడిలో జగన్ మరో విప్లవాత్మక నిర్ణయం

ప్రపంచ ఆరోగ్య సంస్థ, వైద్యుల సూచనల మేరకు ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తున్నారు. ప్రతీఒక్కరు భౌతిక దూరం పాటించడం, ముఖానికి మాస్కులు ధరించడం.. చేతులను శుభ్రంగా ఉంచుకునేందుకు శానిటైజర్లను వాడుతున్నారు. ఏదైనా వస్తువులను తాకిన తర్వాత ప్రతీఒక్కరు శానిటైజర్లతో చేతులు కడుక్కోవడం వంటి పనులు చేస్తున్నారు. కరోనాను నాశనం చేయడానికి చాలామంది అదేపనిగా శానిటైజర్లు వాడుతున్నారు. వీటిని అతిగా వాడితే అనర్థాలు కలుగుతాయని తాజాగా నిపుణులు హెచ్చరిస్తున్నారు.

శానిటైజర్లను అతిగా వాడేవారిలో ఆల్కహాల్ కడుపులోకి చేరి వికారం కలిగిస్తుందని తేలిందట. ఇంకా మన శరీరంలో మంచిచేసే బ్యాక్టిరియా సైతం బయటికి వెళుతుందని, చర్మం కూడా పొడిబారిపోతుందని తాజా అధ్యాయనంలో వెల్లడైంది. దీనికి శానిటైజర్లలోని ఆల్కహాలే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ రసాయనాలతో పనిచేసేవారు శానిటైజర్లు ఉపయోగించకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

రంగంలోకి కేటీఆర్.. కరోనా విమర్శలకు చెక్

కరోనా వైరస్ నాశనానికి శానిటైజర్లన వాడే బదులుగా ఇంట్లో ఉపయోగించే సబ్బు వినియోగిస్తే మంచిదనే నిపుణులు సూచిస్తున్నారు. సబ్బు నీటితో చేతులను శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు. అదేవిధంగా మాస్కులను కూడా అదేపనిలో ధరించడం వల్ల శ్వాస సంబంధమైన ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందట. మాస్కులు బయటికి వెళ్లినపుడు మాత్రమే ఉపయోగించాలని ఇంట్లో ఉన్న సమయంలో వాడొద్దని నిపుణులు సూచిస్తున్నారు. అతి అనేది ఎప్పుడు అనర్థదాయకమే కావున ఈ విషయంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు.

ఓటీటీ బాటలో రవితేజ ‘క్రాక్‌’?


ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా స్వయం కృషితో, తన టాలెంట్‌తో టాలీవుడ్‌లో అగ్ర నటుడిగా ఎదిగిన హీరో రవితేజ. వయసైపోతున్నా యూత్‌లో ఇప్పటికీ అతనికి ఫుల్ ‌ఫాలోయింగ్‌ ఉంది. మాస్‌ క్యారెక్టర్స్‌లో తన మార్కు కామెడీ టైమింగ్‌ను యాడ్‌ చేసే రవితేజ నటనకు ఫిదా అవ్వని వాళ్లు లేరు. కానీ, కొన్నాళ్లుగా అతను బ్యాడ్‌ ప్యాచ్‌లో ఉన్నాడు. వరుస పెట్టి సినిమాలు తీస్తున్నా సరైన హిట్స్‌ రావడం లేదు. పరాజయాలు వస్తున్నాయని మాస్‌ మహారాజా ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. వరుస పెట్టి సినిమాలు తీస్తున్నాడు. గోపీచంద్ మ‌లినేని డైరెక్షన్‌లో రవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘క్రాక్‌’. షూటింగ్‌ కంప్లీట్‌ అయింది. కరోనా ప్రభావం లేకపోయి ఉంటే ఈ పాటికి రిలీజయ్యేది. షెడ్యూల్‌ ప్రకారం ఈ సమ్మర్లో విడుదల చేయాలని ప్లాన్‌ చేశారు. కానీ, థియేటర్లు మూత పడడంతో ఆ అవకాశం లేకుండా పోయింది.

వయసైన రవితేజం.. కొత్త సినిమాల యవ్వారం !

ఇప్పట్లో థియేటర్లు ఓపెనయ్యే పరిస్థితి లేకపోవడం.. ఇప్పటికే పలువురు నిర్మాతలు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో తమ సినిమాలు రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ‘క్రాక్‌’ చిత్ర బృందం కూడా ఆలోచనలో పడింది. ఈ మూవీని ఓటీటీలో రిలీజ్‌ చేస్తే ఎలా ఉంటుందని భావిస్తున్నారట. థియేటర్లో విడుదల చేసే పరిస్థితులు ఏర్పడేందుకు ఎంత సమయం పడుతుందో తెలియడం లేదు. ఫస్ట్‌ ప్రింట్‌ ఎక్కువ కాలం ల్యాబ్‌లో ఉండడం వల్ల నష్టమే తప్ప లాభం ఉండబోదు. అందువల్ల మంచి ఆఫర్ వస్తే ఓటీటీలోనే రిలీజ్‌ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. రవితేజ స్టార్డమ్‌ దృష్ట్యా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌‘క్రాక్‌’కు మంచి రేటే పెట్టాల్సి ఉంటుంది. పైగా, డాన్‌ శీను, బ‌లుపు చిత్రాల త‌ర్వాత ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న హ్యాట్రిక్ మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. రవి సరసన శ్రు తిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీ భవితవ్యం త్వరలోనే తెలిసేపోయే అవకాశం ఉంది.

రజినీకాంత్, రంజిత్‌ మూడోసారి…


ఇండియాలోనే కాకుండా వరల్డ్‌ వైడ్‌ కోట్లాది మంది అభిమానులు ఉన్న హీరో సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయన సినిమా వస్తుందంటే విపరీతమైన క్రేజ్‌ ఉంటుంది. హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా రజినీ సినిమాలకు భారీ ఓపెనింగ్స్‌ వస్తుంటాయి. 69 ఏళ్ల వయసులోనూ తన స్టయిల్‌తో మెస్మరైజ్‌ చేసే రజినీ బొమ్మ ఫస్ట్‌డే, ఫస్ట్‌ షో చూడాలని లక్షలాది మంది అభిమానులు ఉబలాటపడుతుంటారు. 2010లో వచ్చిన రోబో ఫస్ట్‌ పార్ట్‌ తర్వాత ఈ పదేళ్లలో ఆయనకు ఆశించిన సక్సెల్‌ లేదు. రా వన్, కొచ్చాయిడన్, లింగా, కబాలి, కాలా నిరాశ పరిచాయి. రోబో 2.0 కాస్త ఆడినా పెట్టిన డబ్బు తిరిగి రాలేదు. పేట కూడా అంతే. మురుగదాస్‌ దర్శకత్వంలో ఈ ఏడాది దర్బార్తో ముందుకొచ్చాడు. బాక్సాఫీస్‌ దగ్గర మంచి వసూల్లే సాధించినా… రజినీ రేంజ్‌ హిట్టు మాత్రం కాలేదు.

పవన్ కొత్త సినిమాల పైన ఎఫెక్ట్ !

ప్రస్తుతం ‘అన్నాత్తే’ మూవీపై సూపర్ స్టార్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్‌ ఆగిపోయింది. దాంతో, రజినీ నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ ఏంటీ? అని అంతా ఆలోచిస్తున్నారు. పలువురు దర్శకుల పేర్లు వినిపించినా.. కాలా, కబాలి తీసిన పా. రంజిత్‌కే రజినీ మరోసారి ఓకే చెప్పారని తెలుస్తోంది. మంచి కథలే అయినా ఈ రెండు చిత్రాలూ బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టాడు.

పేదలు, దళితులు, అణగారిన వర్గాలకు జరుగుతున్న అన్యాయాలపై తీసిన ఈ రెండు కమిర్షియల్‌ సినిమాలు ఆడకపోయినా.. పా. రంజిత్‌ ఐడియాలని, అతని ప్రతిభకు రజినీ మంత్రముగ్ధుడయ్యాట. తన ఫేవరెట్‌ దర్శకుల్లో రంజిత్‌ ఒకడని చెప్పే సూపర్ స్టార్ అతనికి మాటిచ్చినట్టే మూడో సినిమాకు రెడీ అవుతున్నాడని కోలీవుడ్‌ టాక్‌. అయితే, గత రెండు చిత్రాలకు భిన్నంగా ఈ సారి పూర్తిగా పొలిటికల్‌ డ్రామాను తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నారట. పక్కా కథ, కథనంతో మంచి ఎంటర్టైనర్ తీయాలని ఇద్దరూ భావిస్తున్నట్టు సమాచారం. మరి, వీరిద్దరి మూడో ప్రయత్నం అయినా సక్సెస్‌ అవుతుందో లేదో చూడాలి.

‘పుష్ప’ నుంచి విజయ్‌ సేతుపతి ఔట్‌.. కారణమిదే


విజయ్‌ సేతుపతి. తమిళనాడులో మంచి స్టార్డమ్‌ ఉన్న హీరో. వైవిధ్యభరిత పాత్రలతో సౌత్‌లో మంచి పేరు తెచ్చుకున్నాడు. కథ నచ్చితే ఇమేజ్‌‌ను పక్కనబెట్టేసి ఎలాంటి పాత్రనైనా చేస్తాడు. సపోర్ట్‌ క్యారెక్టర్సే కాకుండా విలన్‌గానూ మెప్పిస్తున్నాడు. చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఆయన… సాయిధరమ్‌ తేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న ‘ఉప్పెన’లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న పాన్‌ ఇండియా మూవీ ‘పుష్ప’లో కూడా సేతుపతి విలన్‌గా ఎంపికయ్యాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోందీ చిత్రం.

‘పుష్ప’ మొదట మహబూబ్ నగర్ లోనే..!

పాన్‌ ఇండియా మూవీ కాబట్టి విజయ్‌ ఉంటే తమిళ్‌లో మంచి ప్రమోషన్‌ లభిస్తుందని చిత్ర బృందం భావించింది. తీరా షూటింగ్‌ ప్రారంభమవడానికి ముందే విజయ్‌ ఈ మూవీ నుంచి తప్పుకున్నాడు. దీని గురించి రకరకాల కారణాలు వినిపించాయి. అయితే, ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడిన విజయ్ తాను ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నట్టు స్వయంగా వెల్లడించాడు. కాల్షీట్లు సర్దుబాబు చేయలేకపోవడం వల్లే వైదొలగాల్సి వచ్చిందని స్పష్టం చేశాడు. ఇదే విషయాన్ని డైరెక్టర్ సుకుమార్ను పర్సనల్‌గా కలిసి వివరించానని తెలిపాడు. తనకు ‘పుష్ప’లో నటించాలని చాలా ఆసక్తిగా ఉన్నప్పటికీ…దానివల్ల తమిళ్‌లో ఇప్పటికే ఒప్పుకున్న చిత్రాలకు డేట్ల సమస్య రాకూడదని భావించానని చెప్పాడు. అందుకే తెలుగు మూవీని వదులుకోవాల్సి వచ్చిందని వివరించాడు. విజయ్‌ హీరోగా నటించిన ‘మాస్టర్’ సినిమా రిలీజ్‌ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నానని సేతుపతి అన్నాడు. ఇందులో అతను విలన్‌ పాత్ర పోషించాడు. కాగా, సేతుపతి వైదొలగడంతో అతని స్థానంలో కన్నడ నటుడు ధనంజయను విలన్‌గా సుకుమార్ ఫైనల్‌ చేసినట్టు సమాచారం.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘పేరు’ వివాదంలో నోటీసులు


వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆ పార్టీకి కొత్త సమస్యలను తెచ్చి పెట్టారు. దీంతో జగన్ నేతృత్వంలోని వైసీపీ పార్టీకి కోర్టు నోటీసులు అందాయి. తమ పార్టీ పేరు వాడుకొంటున్నారని అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. దీంతో ఢిల్లీ హైకోర్టు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి నోటీసులు జారీ చేసింది. ఈ తేనెతుట్టును కదిపింది మాత్రం వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజే. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు పార్టీ వ్యతిరేక కర్యకలాపాలకు పాల్పడుతున్నందుకు, సిఎం, ఎమ్మెల్యేల విషయంలో చేసిన వ్యాఖ్యలపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీంతో ఆ షోకాజ్ నోటీసును ఎన్నికల సంఘానికి తీసుకువెళ్లి యుజవన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో షోకాజ్ నోటీసు జారీ చేసిందని ఫిర్యాదు చేశారు. ఆ విషయం మీడియాలో రావడంతో అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు బాషా స్పందించారు. తమ పార్టీ పేరును వాడుకోవడాన్ని పత్రికాముఖంగా ఖండించారు.

తాజాగా అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరైనా ’వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ పేరును యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వాడుకొంటుందని పిటీషన్ ను కోర్టులో బాషా దాఖలు చేశారు. దీంతో జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరు వినియోగించడంపై అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయగా ఎన్నికల కమిషన్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి నోటీసులు జారీ చేసింది. అయినప్పటీకీ ఆ పేరును జగన్ నేతృత్వంలోని పార్టీ విరివిగా వినియోగించుకుంటుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటేనే జగన్ పార్టీగా ప్రజల్లో గుర్తింపు వచ్చింది.

జగన్ పట్టుదల.. టెక్ దిగ్గజం ఏపీకి..

అయితే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంతగా స్థాపించలేదు. 2011లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరు కోసం రిజిస్ట్రేషన్ కు జగన్ ప్రయత్నించగా అప్పటికే ఆ పేరుతో శివకుమార్ అనే వ్యక్తి పార్టీ ఏర్పాటు చేసి ఉండటంతో అది సాధ్యం కాలేదు. దీంతో జగన్ ఆ పార్టీని శివకుమార్ వద్ద నుంచి తీసుకుని 2011 మార్చి 12న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని అధికారికంగా ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. పార్టీలో శివకుమార్ చిన్న పదవిని ఇచ్చారు. అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మాత్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్నేహితుడైన బాషా ఏర్పాటు చేశారు.

కోర్టు నోటీసుల విషయంలో తమ పార్టీకి వచ్చిన ముప్పేమీ లేదని వైసీపీ నాయకులు అంటున్నారు. ఇది కేవలం ప్రచారం కోసం ఇటువంటి పిటీషన్ లను కొందరు దాఖలు చేస్తుంటారని దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని, పార్టీ న్యాయపరంగానే దీనిని ఎదుర్కొంటుందని వారు చెబుతున్నారు.

ముద్రగడ.. కాపులు.. ఓ కుట్రకోణం!

Mudragada-padmanabham-retirement-letter

రెడ్డి సామాజికవర్గానికి సీఎం జగన్ ఉన్నారు.. కమ్మలకు బలమైన చంద్రబాబున్నారు. కానీ కాపులకు ఎవరున్నారు..? బలంగా ఎవరు నిలబడుతున్నారు అంటే చెప్పడం కొంచెం కష్టమే.. జగన్, చంద్రబాబులాగా బలమైన నేతలు కాపు సామాజిక వర్గానికి లేరన్నది ఆ సమాజం అంగీకరించాల్సిన వాస్తవం.. పవన్ కళ్యాణ్ తెరమీదకు వచ్చినా ఆయన కాపులకు నాయకుడిని అని ఎక్కడా చెప్పుకోడు. పార్ట్ టైం పాలిటిక్స్ తో పవన్ కాపుల కోసం చేసింది ఇప్పటివరకు చాలా తక్కువంటారు. ఇక కాపుల రిజర్వేషన్ల కోసం చాలా ఏళ్లుగా ఉద్యమిస్తున్నారు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. ఆయన ఏ పార్టీలోనూ లేరు. అలాంటి నేత అప్పుడో ఇప్పుడో కాపుల కోసం ఈ వయసు మీద పడ్డ తరుణంలోనూ ఉద్యమిస్తున్నారు. కానీ కాపుల్లో అనైక్యత.. కాపు నేతలకు టీడీపీ, వైసీపీ పదవుల పందేరంతో ఆయనకు మద్దతు కరువవుతోంది.ఈ క్రమంలోనే కాపులకు రిజర్వేషన్లపై ఇటీవలే జగన్ కు బహిరంగ లేఖ రాశారు ముద్రగడ.. కాపుల రిజర్వేషన్లపై ప్రధాని మోడీతో చర్చించాలని జగన్ ను కోరారు.అయితే టీడీపీతో ఫైట్ చేసినట్టు ఆయన జగన్ తో ఫైట్ చేయడం లేదని కొందరు టీడీపీలో వున్న  కాపు నేతలే ఆరోపించడం గమనార్హం.

కాపుల్లోనే అనైక్యత సృష్టిస్తూ ఉద్యమాన్ని నీరుగారుస్తున్న వైనంపై ముద్రగడ మనస్థాపం చెందారు. తాజాగా కాపు ఉద్యమం నుంచి తప్పుకోబోతున్నానని ప్రకటించి సంచలనం సృష్టించారు. ఈ మేరకు బహిరంగ ప్రకటనను ముద్రగడ ఈరోజు విడుదల చేశారు.ముద్రగడ ఆ లేఖలో కాపుల్లోని నేతలే తనను టార్గెట్ చేయడంపై మనస్థాపం చెందారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తనపై కొందరు పెద్దలు దుష్ర్పచారం చేయిస్తున్నారని.. తనను కాపు ద్రోహిగా గజ దొంగగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ముద్రగడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనపై మీడియా, సోషల్ మీడియాలో ఎందుకు మానసికదాడులు చేస్తున్నారో అర్థం కావడం లేదని వాపోయారు. ఉద్యమం చేసిన కాలంలో ఆర్థికంగా రాజకీయంగా నష్టపోయానని.. ఏనాడు చింతించలేదని.. కాపు ద్రోహిగా చిత్రీకరించడం కలిచివేసిందన్నారు. కాపు రిజర్వేషన్లు సాధించడమే తన అంతిమ ఆశయమని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు.ముద్రగడ లేఖ ఏపీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.

ఇప్పుడు ఆ కాపునేతలు ఏం సమాధానం చెబుతారు..?

కాపుల్లోని అనైక్యతను, కాపు ఉద్యమాన్ని నీరుగార్చే కుట్రగా కాపు నేతలు అభివర్ణిస్తున్నారు. ముద్రగడపై విష ప్రచారం వెనుక జనసేన పార్టీలోని ఒక ఆడిటర్ ఉన్నాడని సదురు నేతలు ఆరోపిస్తున్నారు. జనసేన పార్టీలో ఈయన కీరోల్ పోషిస్తుంటారని.. అతడి ద్వారా టీడీపీ డైరెక్షన్ లోనే ముద్రగడను నీరుగార్చాలని.. ఆయనను కాపు ఉద్యమం నుంచి పక్కకు తప్పించాలనే కుట్ర జరిగిందని ఆరోపిస్తున్నారు.

సదురు ఆడిటర్ తన చేతికి మట్టి అంటకుండా  తెరవెనుక ఈ కుట్ర చేసినట్టు కాపు నేతలు అనుమానిస్తున్నారు. తన చుట్టమైన ఒక కీలక వ్యక్తిని టీవీ డిబేట్లలో కూర్చుండబెట్టి.. ‘పద్మనాభం అసలు కాపు ఉద్యమ నాయకుడే కాదని.. ఆయన రాజకీయ నాయకుడని.. చంద్రబాబుపై వ్యక్తిగత వైరాల వల్ల ఉద్యమం చేశాడని’ ముద్రగడపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. కాపులను చీల్చే కుట్ర ఇందులో స్పష్టంగా కనిపిస్తోందని ముద్రగడ మద్దతుదారులు అనుమానిస్తున్నారు.

Source: Whatsapp Note: ఈ వీడియో మీద ఏమైనా అభ్యంతరాలు వుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు.

ఇక ఇదే జనసేన పార్టీకి చెందిక కీలకనేతకు చెందిన న్యూస్ చానెల్ లో జనసేనాని రాసిన లెటర్ ని హైలైట్ చేస్తూ సొంత కుల నాయకుడైన ముద్రగడను తక్కువ చేసి చూపిస్తు ముద్రగడ ఈ మాత్రమైన స్పందించారు అంటే అది పవన్ కళ్యాణ్ చలువే అంటూ మాట్లాడటం, ముద్రగడ కలసిరావడం లేదంటూ  మరియు రాజశేఖర్ రెడ్డి పూజ్యులు ఎలా అయ్యారు, జగన్ దానకర్ణుడు ఎలా అయ్యదంటు ప్రశ్నించడం చాలా మంది కాపులకు రుచించలేదు.

సోర్స్: https://youtu.be/4hbOccagv8E

తర్వాత చాలామంది జనసైనికులు ముద్రగడను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఇదే విషయాన్ని పద్మనాభంతో చాలా మంది షేర్ చేసుకున్నారు. దీంతో ఈ పరిణామాలతో మనస్థాపం చెందిన ముద్రగడ ఎన్నో ఏళ్ల నుంచి పోరాడుతున్న కాపు ఉద్యమకాడిని వదిలేశారు. దీనంతటికి కారణం జనసేనలోని కొద్దరు వ్యక్తులే అంటున్నారు. ఒక కాపుల పార్టీ అయిన జనసేన ముద్రగడ విషయంలో ఇలా ప్రవర్తించడం మంచిది కాదనే ఆవేదన కాపు నేతల్లో వ్యక్తమవుతోంది.

దీనికి ప్రధాన కారణం ఏంటంటే.. బీజేపీ కేంద్ర, రాష్ట్ర నేతలు ఎవరు వచ్చినా కాపు ఉద్యమ సేనాని అయిన ముద్రగడ చుట్టే తిరుగుతున్నారు కాని ప్రజల మద్యలేకుండా, కార్యకర్తలను పట్టించుకోవటం లేదు అనే విమర్శలను ఎదుర్కుంటున్న, హైదరాబాద్ లో ఉంటున్న పవన్ కళ్యాణ్ కోసం చూడడం లేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నారు. అయినా కూడా బీజేపీలోని కొంత  క్యాడర్ పవన్ పై కొంత అపనమ్మకంతో టిడిపి కి ఇంకా దగ్గరగా వున్నారేమో అనే అనుమానం బలంగా ఉండటంతో జనసేనతో కలవడానికి ఇష్టపడడం లేదు. పవన్ కళ్యాణ్ ఎంతసేపు టీడీపీ ఫేవర్ గా రాజకీయాలు చేస్తున్నారనే అపవాదును మూటగట్టుకున్నారు. అందుకే బీజేపీలో ఉన్న  ఒక వర్గం మొత్తం కూడా పవన్ ను కాపుల నేతగా గుర్తించడం లేదు. ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అందువల్ల కాపులంతా ముద్రగడ చుట్టు తిరుగుతున్నారనే అక్కసుతోనే జనసేన నేతలు ఆయనను టార్గెట్ చేశారని కొంతమంది ఆరోపిస్తున్నారు. ముద్రగడను కాపుల నుంచి దూరం చేస్తే వారి క్రెడిట్ మొత్తం జనసేన పవన్ కళ్యాణ్ కు షిఫ్ట్ అవుతుందనే ఈ కుట్ర చేశారని అంటున్నారు.

‘విభజన’తో టీడీపీకీ జగన్ స్కెచ్..!

ఇలా ముద్రగడ పద్మనాభం కాపుల ఉద్యమంలో ఉంటే ఎప్పటికీ తమకు క్రెడిట్.. ఆధిపత్యం రాదనే కుట్రతోనే .. వారి అనుకూల మీడియా, సోషల్ మీడియాలో ముద్రగడను టార్గెట్ చేశారని అంటున్నారు. ఆయనను కించపరిచేలా అవమానించడం ప్రారంభించాయి. ఇవన్ని ఆయనను కాపు ఉద్యమం నుంచి వైదొలిగేలా చేస్తున్నాయి. ఈ మొత్తం కుట్రలో కొందరు జనసేన నేతలు కీలక పాత్రధారులని.. కాపుల ఉద్యమాన్ని కాపు నేతలే స్వార్థం కోసం నీరుగారుస్తున్నారనే అనుమానాలు ఆ వర్గం నేతల్లో వ్యక్తమవుతున్నాయి.

జనసేన నేతలు, కొద్దిమంది కాపు నాయకులు  కాపులకు మంచి చేయకపోగా.. ఉద్యమించేవారిని సైతం విరమించుకునేలా ద్రోహం చేయడంపై కాపులు రగిలిపోతున్నారు. కాపుల కోసం ముద్రగడ ఎంతో చేశారు. దెబ్బలు తిన్నారు. జైలుకెళ్లారు. కాపు రిజర్వేషన్ల కోసం దశాబ్ధాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. అలాంటి ఆయనను ఈ కాపు ఉద్యమం నుంచి పక్కకు తప్పించే కుట్ర తాజాగా జరుగుతోంది. స్వార్థం కోసం కాపు ఉద్యమాన్ని నీరుగారుస్తూ హైజాక్ చేసి కాపులను బానిసలుగా మార్చే కుట్ర తెరవెనుక నడిపిస్తున్నారు. సొంత అస్తిత్వం కోసం కాపులు పోరాడకుండా పార్టీల కింద నలిగిపోయేలా చేసే ఆ  కుట్రదారుల వలలో ఎవరూ చిక్కుకోవద్దని కాపు నేతలు కోరుతున్నారు. ముద్రగడను కాపు ఉద్యమం నుంచి పక్కకు పోవద్దని విన్నవిస్తున్నారు.

ఎన్నం

పితాని కుమారుడి అరెస్టు తప్పదా?


ఇఎస్ఐ కుంభకోణంలో పశ్చిమ గోదవరి జిల్లాకు చెందిన టిడిపి నాయకులు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు పితాని వెంకట సురేష్ అరెస్టు తప్పేలా కనిపించడం లేదు. అరెస్టుకు అవకాశం ఉందని ముందే గ్రహించిన పితాని వెంకట సురేష్, పితాని సత్యనారాయణ మాజీ పిఎస్ మురళీమోహన్ లు ముందే హైకోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటీషన్ విచారణలో ఉండగానే కొద్ది రొజుల కిందట ఏసీబీ అధికారులు మురళీ మోహన్ ను అరెస్ట్ చేశారు. అదే సమయంలో పితాని వెంకట సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో ఆయన కోసం వెళ్లిన ఏసీబీ అధికారులు ఉత్తి చేతులతో వెనక్కి రాకతప్పలేదు.

నెక్స్ట్ మాజీ మంత్రి పితాని జైలుకెళ్లడం ఖాయమట..

మరోవైపు బెయిల్ పిటీషన్ పై హైకోర్టు ఈ రోజు విచారణ నిర్వహించింది. ఈ విచారణలో పితాని సురేష్ కు చుక్కెదురయ్యింది. ముందస్తు బెయిల్ కోసం సురేష్, మురళీమోహన్ లు పెట్టుకున్న పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. పిటిషనర్ల తరపున న్యాయవాధి చల్లా అజయ్ కుమార్ వాదనలు వినిపించారు. ఏసీబీ కేసుకు మూలకారణం రాజకీయ కక్ష సాధింపేనని వాధించారు. సురేష్, మురళీ మోహన్ లను కేసులో కావాలని ఇరికించారని అన్నారు. తన తండ్రి పదవిని వెంకట సురేష్ ఏనాడూ దుర్వినియోగం చేయలేదన్నారు. ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని న్యాయవాధి కోరారు. ఈ అభ్యర్థనతో ఏసీబీ తరపు న్యాయవాది విభేదించారు. ఈ కేసులో సురేష్ హస్తం ఉందనడానికి ఏసీబీ వద్ద ఆధారాలు ఉన్నాయని న్యాయమూర్తికి వివరించి ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని వాధనలు వినిపించారు. ఇరు వైపుల వాదనలను విన్న న్యాయమూర్తి ముందస్తు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించారు.

ఏసీబీ అరెస్టు నుంచి తప్పించుకునేందుకు బెయిల్ పిటీషన్ పై ఆశలు పెట్టకున్న పితాని సురేష్ హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తుందనే ఆశతో బెయిల్ వచ్చే వరకూ ఏసీబీకి చిక్కకుండా అజ్ఞాతంలో ఉంచడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బెయిల్ పిటీషన్ ను హైకోర్టు తిరస్కరించడంతో ఇప్పుడు పితాని సురేష్ అరెస్టు తప్పదా అనే విషయంపై టిడిపి నాయకుల్లో చర్చ జరుగుతుంది. న్యాయస్థానంలో మరో పిటీషన్ దాఖలు చేసే అంశంపై మాజీ మంత్రి పితాని ప్రముఖ న్యాయవాధులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

జగన్ పై తగ్గిన పవన్ విమర్శలు జోరు…కారణం?

ఇఎస్ఐ కేసులో ఇటీవల మాజీ మంత్రి పితాని సత్యనారాయణ చేసిన వాఖ్యలు కుంభకోణం జరిగిందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ‘రాజకీయాల్లో లాబీయింగ్ కామన్’ అంటూ ఆయన వాఖ్యానించారు. ఉన్నవిషయాన్ని నిర్మోహమాటంగా చెప్పే స్పభావం ఉన్న మాజీ మంత్రి పితాని స్వయంగా మీడియా ముందు ఈ వ్యాఖ్యలు చేయడంతో ఏసీబీ వాధనల్లో నిజం ఉందనే భావించవచ్చనే వాధనలు వినిపిస్తున్నాయి. 2017 ఏప్రిల్ 2న పితాని కార్మిక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి వరకూ కార్మికశాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు పని చేశారు. ఈ కేసులో అరెస్టయిన అచ్చెన్నాయుడు అనారోగ్య కారణాలతో గుంటూరులోని ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

జగన్ ముందు బాలయ్య డిమాండ్ల చిట్టా..!

Balakrishna Corona Mantra
Balakrishna Corona Mantra


ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి పదవీ చేపట్టి ఏడాదికాలం పూర్తయింది. కిందటి శాసనసభ ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించి వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఏడాదిలోనే జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల్లోకి దూసుకెళుతున్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుగానీ ఆయన వియ్యంకుడైన బాలకృష్ణగానీ ఏనాడూ జగన్ చేసిన మంచిపనులను ప్రశంసించిన మచ్చుకైనా కన్పించిన సందర్భాలేవనే చెప్పొచ్చు. దీనికితోడు బాలకృష్ణ ఇటీవల ఓ ఇంటర్య్యూలో సీఎం జగన్మోహన్ పాలనపై స్పందిస్తూ వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తుందని.. త్వరలోనే జగన్ ప్రభుత్వం పడిపోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వానికి సమస్యలు..

తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డికి బాలకృష్ణ లేఖరాయడం చర్చనీయాంశంగా మారింది. బాలకృష్ణ ఫ్యాక్స్ ద్వారా సీఎం కార్యాలయానికి లేఖను పంపించారు. జగన్ ముందు రెండు డిమాండ్లను పెట్టారు. ముఖ్యంగా జిల్లాల పునర్విభజన అంశంపై బాలయ్య లేఖను రాసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నియోజకవర్గాల ప్రతిపాదికన కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరారు. అలాగే హిందుపూర్ పార్లమెంట్ నియోజకవర్గానికి మంజూరైన మెడికల్ కళాశాలను హిందుపూర్ సమీపంలోని మలుగూరు వద్ద ఏర్పాటు చేయాలని బాలయ్య ఆ లేఖలో కోరారు.

ఎన్నికల మెనిఫోస్టోలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ప్రతీ నియోజకవర్గాన్ని జిల్లా చేస్తానంటూ గతంలో హామీ ఇచ్చారు. ఈమేరకు ఏపీలో ఉన్న 13జిల్లాలను 25జిల్లాలుగా మార్చేందుకు జగన్ సర్కార్ ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. ప్రభుత్వం నిర్ణయంపై ఇప్పటికే పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు కొత్త జిల్లాల ప్రతిపాదనను స్వాగతిస్తుందని మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాలను విభజించొద్దని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ప్రభుత్వానికి వచ్చిన ప్రతిపాదనలకు అనుగుణంగా సీఎం జగన్ ఈనెల 15న జరిగే క్యాబినెట్లో మీటింగులో నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.

జగన్ పట్టుదల.. టెక్ దిగ్గజం ఏపీకి..

జిల్లాల ఏర్పాటుకే ప్రభుత్వం మొగ్గుచూపుతుండగా ప్రభుత్వం యంత్రాంగం ఈమేరకు తగిన ప్రణాళికలను సీఎం ముందు ఉంచినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పాటుచేసే జిల్లాలకు తోడు మరో 12జిల్లాల పేర్లు తెరపైకి రావడంతో సాధ్యసాధ్యాలు, అదనపు భారంపై ఇప్పటికే అధికారులు పలుసార్లు సమీక్షించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కొత్త జిల్లాల లిస్టులో హిందూపురాన్ని చేర్చాలంటూ డిమాండ్ చేస్తూ లేఖరాశారు. రాజకీయ వ్యూహంలో భాగంగానే బాలకృష్ణ సీఎం జగన్ కు లేఖరాసినట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం కూలిపోతుందని వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ డిమాండ్లను సీఎం జగన్ ఏమేరకు నెరవేరుస్తారో వేచి చూడాల్సిందే..!

లెజెండరీ క్రికెటర్ బయోపిక్ కు భారీ ఆఫర్ !


బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ హీరోగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో రానున్న లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ విడుదల పై గత కొన్ని రోజులుగా అనేక రూమర్స్ అయితే వస్తున్నాయి కానీ, అసలు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే క్లారిటీ మాత్రం లేదు. అయితే మొదట ఏప్రిల్ 10నే రిలీజ్ చేయాలనుకున్నా.. కరోనా మహమ్మారి రాకతో సినిమా రిలీజ్ ఆపక తప్పలేదు. కాగా తాజాగా ఈ సినిమాని ఓటిటీలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని.. ప్రముఖ ఓటిటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ నుండి ఈ బయోపిక్ కి భారీ ఆఫర్ వచ్చిందని.. కరోనా అనంతరం నేరుగా థియేటర్స్ లో రిలీజ్ చేసినా అప్పుడున్న పరిస్థితులను బట్టి సినిమా టాక్ ను బట్టే రెవిన్యూ ఉంటుంది కాబట్టి..

బాలీవుడ్‌ను వదలని విషాదాలు… ఇద్దరు నటులు మృతి

అదే అమెజాన్ అయితే ఎలాంటి టెన్సన్స్ లేకుండా భారీ మొత్తంలో.. పైగా థియేటర్స్ రెంట్ అనే మరో అనవసరపు ఖర్చు కూడా లేకుండా భారీగా డబ్బులు వస్తున్నపుడు ఎందుకు ఓటిటీలో రిలీజ్ చెయ్యకూడదు అని మేకర్స్ ఆలోచనలో పడినట్లు బాలీవుడ్ మీడియాలో టాక్ నడుస్తోంది. నిజానికి అమెజాన్ ఆఫర్ రాకముందు అక్టోబర్ లాస్ట్ వీక్ లో ఈ బయోపిక్ ను డైరెక్ట్ గా థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సడెన్ గా మంచి ఆఫర్ రావడంతో ఈ బయోపిక్ నిర్మాత విష్ణు ఇందూరి ఓటిటీ పై ఆసక్తి కనబరుస్తునట్లు తెలుస్తోంది.

హాలీవుడ్‌ ఆఫర్ రిజెక్ట్‌ చేసిన హాట్‌ బ్యూటీ

ఇక ఈ బయోపిక్ తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో కింగ్ అక్కినేని నాగార్జున చేతుల మీదుగా తెలుగు ప్రేక్షుకుల ముందుకు రాబోతుండటంతో తెలుగులో కూడా ఈ బయోపిక్ పై మంచి క్రేజ్ ఉంది. కాగా ’83’ అనే టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రంలో 1983లో ఇండియా వరల్డ్ కప్ ను గెలుచుకునే క్రమంలో ఎదురుకున్న ఇబ్బందులు ఏమిటనే కోణంతో పాటు కపిల్ దేవ్ జీవితం గమనం, ఆయన సాధించిన విజయాల వివరాలు తాలూకు సంఘటనలు సినిమాలో ఉండనున్నాయి.

ప్రభాస్ కోసం మాస్ బిట్.. నచ్చితే ఛాన్స్ !


రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు తెలుగు హీరో కాదు, నేషనల్ వైడ్ గా స్టార్ డమ్ ఉన్న నేషనల్ స్టార్ అని ‘రాధేశ్యామ్’ ఫస్ట్ లుక్ చాటి చెప్పింది. సోషల్ మీడియా గత రికార్డ్స్ మొత్తాన్ని షేక్ చేసి.. అసలైన పాన్ ఇండియా స్టార్ గా రెబల్ స్టార్ ప్రభాస్ ను నిలబెట్టింది. ఇక ‘రాధే శ్యామ్’ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరనేది షూట్ ప్రారంభించిన రోజు నుంచీ సస్పెన్స్ ఉన్నా, తమిళానికి చెందిన యువ స్వరకర్త జస్టిన్‌ ప్రభాకరన్‌ సినిమాలో ఒక మాస్ ట్రాక్ కు సంగీతం అందించబోతున్నాడని తెలుస్తోంది.

ప్రభాస్ కోసం పూజా హెగ్డే క్లాసికల్ డాన్స్ !

ఇప్పటికే ప్రభాకరన్‌ ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ కూడా ప్రారంభించాడని.. టీజర్ కోసం అదిరిపోయే మాస్ బిట్ రెడీ చేయబోతున్నాడని టాక్. టీజర్ లో మ్యూజిక్ బిట్ కి ఫ్యాన్స్ నుండి వచ్చే ఆదరణను బట్టి, ప్రభాకరన్‌ కు ఈ సినిమా నేపథ్య సంగీతం ఇవ్వాలా వద్దా అని నిర్ణయిస్తారట. అన్నట్లు ఈ ప్రభాకరన్‌ ఎవరో కాదు, విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ కి మ్యూజిక్ అందించిన టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్.

రంగంలోకి కేటీఆర్.. కరోనా విమర్శలకు చెక్

ఇక ఈ సినిమా కరోనా కారణంగా కొంత షూట్ మిగిలి ఉండగానే, జార్జియాలో షూటింగ్ జరుపుతూ మధ్యలోనే ఇండియాకు తిరిగివచ్చేసిన సంగతి తెలిసిందే. మిగిలిన బ్యాలెన్స్ పార్ట్ షూట్ కోసం మళ్లీ జార్జియా వెళ్లాలంటే కష్టం గనుక, రామోజీ ఫిల్మ్ సిటీలోనే జార్జియా నేపథ్యం కనబడేలా భారీ సెట్ ను వేస్తున్నారు. మరో నెల రోజుల్లో ఈ సెట్ పూర్తి కానుంది.

ఈ సినిమాని గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా ‘జిల్’ చిత్రాన్ని తెరకెక్కించిన ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ‌ దర్సకత్వంలో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రబాస్ సరసన టాల్ బ్యూటీ పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తోంది.

ప్రచార అర్భాటమే కానీ పరిస్థితులు ఘోరం అట..


కరోనా వైరస్ సోకిన రోగుల పట్ల వైసీపీ ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతుంది ప్రతిపక్ష టీడీపీ. ప్రచార ఆర్భాటమే కానీ, క్షేత్రస్థాయిలో అన్నీ లోపాలే అని వీడియోలను ప్రదర్శిస్తూ…సోషల్ మీడియా వేదిక తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఐసొలేషన్ వార్డులలో కరోనా రోగులకు వైద్యం మరియు సౌకర్యాల విషయంలో ప్రభుత్వ పనితీరు సరిగా లేదని వారు ఆరోపిస్తున్నారు. శుభ్రత లేని ఇసోలేషన్ వార్డులు కంపుగొడుతున్నాయట. రోగుల కొరకు ఏర్పాటు చేసిన స్నానపు గదులు, మరుగు దొడ్ల నిర్వహణ సరిగా లేదని, ఒకే స్నానపు గదిని ఎక్కువ మంది కరోనా రోగులు ఉపయోగించాల్సి వస్తుందని ఆరోపిస్తున్నారు. ఆహారం విషయంలో కూడా రోజుకు ప్రభుత్వం నుండి రూ. 500 ప్రభుత్వం చెల్లిస్తుండగా, నాసిరకం ఆహారం అందిస్తున్నారని రోగులు వాపోతున్నారట.

ఆనంతో… రఘురామ్, ఏం జరుగుతుంది జగన్ ?

ప్రభుత్వం అందిస్తున్న ఆహారం తినలేని వారు, బయటనుండి తెప్పించుకోవాల్సి వస్తుందని, దానికి కూడా అక్కడ సిబ్బంది మామూళ్లు వసూలు చేస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. ఐసొలేషన్ వార్డులలో చికిత్స తీసుకుని ఆరోగ్యంగా బయటికి వచ్చిన కరోనా బాధితులు, అలాగే ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న రోగులకు సంబంధించిన ఆరోపణల వీడియోలు పంచుకుంటూ టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగుతున్నారు. ప్రభుత్వం చెవుతున్న దానికి వాస్తవాలకు పొంతన లేదని వారు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు మాజీ మంత్రి లోకేష్ కరోనా రోగుల పట్ల ప్రభుత్వం తీరు అమానుషం అంటున్నారు.

ఇప్పుడు ఆ కాపునేతలు ఏం సమాధానం చెబుతారు..?

వేలల్లోకి చేరుకున్న కరోనా రోగులకు సౌకర్యాలు అందజేయడం ప్రభుత్వాలకు ఇబ్బందిగా మారింది. తెలంగాణాలో సైతం వరంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసొలేషన్ వార్డులో అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలకు సంబంధించిన వీడియో ఒకటి బయటికి వచ్చింది. ఏపీలో కూడా సిబ్బంది, మౌళిక వసతుల కొరత ఇలాంటి పరిస్థితికి కారణం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో జులై 12వరకు 29,168 మంది కరోనా బారిన పడగా…15,412 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. 13,428 మంది రోగులు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ప్రతిపక్షాల విమర్శల సంగతి ఎలా ఉన్నా, క్షేత్రస్థాయిలో వాస్తవిక పరిస్థితులు తెలుసుకొని ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని అందరూ భావిస్తున్నారు.