
ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్ కోట్లాది మంది అభిమానులు ఉన్న హీరో సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయన సినిమా వస్తుందంటే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా రజినీ సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వస్తుంటాయి. 69 ఏళ్ల వయసులోనూ తన స్టయిల్‌తో మెస్మరైజ్ చేసే రజినీ బొమ్మ ఫస్ట్‌డే, ఫస్ట్ షో చూడాలని లక్షలాది మంది అభిమానులు ఉబలాటపడుతుంటారు. 2010లో వచ్చిన రోబో ఫస్ట్ పార్ట్ తర్వాత ఈ పదేళ్లలో ఆయనకు ఆశించిన సక్సెల్ లేదు. రా వన్, కొచ్చాయిడన్, లింగా, కబాలి, కాలా నిరాశ పరిచాయి. రోబో 2.0 కాస్త ఆడినా పెట్టిన డబ్బు తిరిగి రాలేదు. పేట కూడా అంతే. మురుగదాస్ దర్శకత్వంలో ఈ ఏడాది దర్బార్తో ముందుకొచ్చాడు. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూల్లే సాధించినా… రజినీ రేంజ్ హిట్టు మాత్రం కాలేదు.
పవన్ కొత్త సినిమాల పైన ఎఫెక్ట్ !
ప్రస్తుతం ‘అన్నాత్తే’ మూవీపై సూపర్ స్టార్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. దాంతో, రజినీ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటీ? అని అంతా ఆలోచిస్తున్నారు. పలువురు దర్శకుల పేర్లు వినిపించినా.. కాలా, కబాలి తీసిన పా. రంజిత్‌కే రజినీ మరోసారి ఓకే చెప్పారని తెలుస్తోంది. మంచి కథలే అయినా ఈ రెండు చిత్రాలూ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాడు.
పేదలు, దళితులు, అణగారిన వర్గాలకు జరుగుతున్న అన్యాయాలపై తీసిన ఈ రెండు కమిర్షియల్ సినిమాలు ఆడకపోయినా.. పా. రంజిత్ ఐడియాలని, అతని ప్రతిభకు రజినీ మంత్రముగ్ధుడయ్యాట. తన ఫేవరెట్ దర్శకుల్లో రంజిత్ ఒకడని చెప్పే సూపర్ స్టార్ అతనికి మాటిచ్చినట్టే మూడో సినిమాకు రెడీ అవుతున్నాడని కోలీవుడ్ టాక్. అయితే, గత రెండు చిత్రాలకు భిన్నంగా ఈ సారి పూర్తిగా పొలిటికల్ డ్రామాను తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నారట. పక్కా కథ, కథనంతో మంచి ఎంటర్టైనర్ తీయాలని ఇద్దరూ భావిస్తున్నట్టు సమాచారం. మరి, వీరిద్దరి మూడో ప్రయత్నం అయినా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.