Home Blog Page 8408

వ్యాక్సిన్ వచ్చేవరకు ఆ ట్రీట్మెంటే దిక్కా?

Plasma therapy
దేశంలో రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. అదే స్థాయిలో చాలా రాష్ట్రాల ఆస్పత్రుల్లో కోవిడ్-19 చికిత్సలో భాగంగా ప్లాస్మా థెరపీవైపు మొగ్గు చూపుతున్నారు. మహరాష్ట్ర, ఢిల్లీలాంటి రాష్ట్రాల్లో ప్లాస్మా థెరపీకి మద్దతు ఇవ్వడమే కాకుండా ప్లాస్మా దానం చేసేందుకు వీలుగా సేకరణ కేంద్రాలను నెలకొల్పారు.

కోవిడ్-19 కేసులలో సాధారణ చికిత్సకు కోలుకోని రోగులకు ప్లాస్మా థెరపీ వాడొచ్చని డాక్టర్లకు సూచిస్తున్నారు. కరోనావైరస్‌ కు ప్లాస్మా థెరపీ పనిచేస్తుందా లేదా అనే అంశంపై ప్రపంచంవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరిగాయి. అయితే ఈ అధ్యయనాలనుబట్టీ కచ్చితంగా ఒక నిర్థరణకు రావడం కష్టమే. కోవిడ్-19 కేసులకు ఈ చికిత్స కచ్చితంగా పనిచేయదు అని చెప్పలేము, అలాగని ఈ చికిత్సను కొట్టిపారేయలేము అని డాక్టర్లు అంటున్నారు.

“ఇటువంటి అధ్యయనాలకు దీర్ఘకాలికంగా క్లినికల్ ట్రయిల్స్ జరగాలి. ఎక్కువ వైవిధ్యం ఉన్న పెద్ద పెద్ద సమూహాల మీద ట్రయల్స్ జరపాలి. తద్వారా వచ్చిన ఫలితాలను విశ్లేషించుకుని ఒక నిర్థరణకు రావాల్సి ఉంటుందని డాక్టర్లు అంటున్నారు.. చైనాలో ప్లాస్మా థెరపీ ట్రయల్స్ సత్ఫలితాలనిచ్చాయి. అయితే ఈ ట్రయల్స్‌ లో రోగులకు ప్లాస్మా చికిత్సతోపాటూ వేరే చికిత్సలు కూడా అందించారు.

అయితే ఇండియాలో మాత్రం ప్లాస్మా థెరపీ కచ్చితంగా పనిచేస్తుందని బలంగా నమ్ముతున్నారు. దీని గురించి రాజకీయ నాయకులు కూడా చురుకుగా ప్రచారం చేస్తుండడంతో డాక్టర్లపై ఒత్తిడి పెరుగుతోంది. దీని గురించి విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ప్లాస్మా చికిత్స కచ్చితంగా పనిచేస్తుందనే నమ్మకం ప్రజల్లో బలపడిపోతోంది. కానీ ఈ చికిత్స ఎవరికి అందించాలి అనేది వ్యాధి తీవ్రతను బట్టి డాక్టర్లు నిర్ణయిస్తారు.

జగన్ కు మరో లేఖాస్త్రం సంధించిన ఎంపీ..

Rama Krishnam Raju


నర్సాపరం ఎంపీ, వైసీపీ నాయకులు రఘురామకృష్ణంరాజు ముఖ్యమంత్రిపై లేఖల యుద్ధం కొనసాగిస్తున్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నారు. పార్టీ పేరు విషయంలో వివాదం రాజేసి పార్టీకి కోర్టు నోటీసులు వెళ్లేవరకూ తీసుకొచ్ఛారు. అటు ఎన్నికల సంఘానికి, ఇటు జగన్ నేతృత్వంలోని వైసీపీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. తనకు రక్షణ కల్పించే విషయంలో ఎపీ పోలీసులపై నమ్మకం లేదని మరో వివాదాన్ని గతంలోనే లేవనెత్తారు. కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిని కలిసి తనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు.

ఇప్పుడు తాజాగా మరో అంశంపై ముఖ్యమంత్రికి లేఖాస్త్రం సంధించారు. రాష్ట్రంలో 20.64 లక్షల భవన నిర్మాణ కార్మికులు తమ పేర్లు నమోదు చేసుకున్నారని, వారిలో 10.66 లక్షల మంది కార్మికుల పేర్లను మాత్రమే ఆధార్‌తో లింక్ చేశారని తెలిపారు. మిగిలిన వారి పేర్లు వెంటనే లింక్ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 2019 మధ్య కాలంలో పన్నుల రూపంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి రూ. 1,364 కోట్లు వసూలు చేసి సంక్షేమ నిధిలో జమ చేసిందన్నారు. ఈ మొత్తంలో ఇప్పటి వరకూ రూ. 330 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. మిగిలిన వెయ్యి కోట్ల నిధుల నుంచి ఒక్కో భవన నిర్మాణ కార్మికుడికి రూ.5 వేలు చొప్పున ఆర్ధిక సహాయం అందించాలని కోరారు.

వైసీపీ ఎంపీ రఘురామ అసమ్మతి వెనుక అంతపెద్ద కథా?

కొద్ధి రోజుల కిందట ఆయన సామాజిక ఫించన్ల విషయంలో లబ్ధిదారుల ఎంపికకు కనీస వయస్సును కుదిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం వల్ల రాష్ట్రంలో అవ్వా, తాతలు ఇప్పటి వరకూ రూ.15 వేలకు పైగా నష్టపోయారని లేఖలో రాశారు. షోకాజ్ నోటీసు అందిన అనంరతం నుంచి ఎంపీ రాఘురామకృష్ణంరాజు లేఖల సిఎం జగన్మోహన్ రెడ్డికి లేఖాస్త్రాలను సంధిస్తున్నారు. ఈ లేఖలపై ముఖ్యమంత్రి మాత్రం ఇప్పటి వరకూ స్పందించలేదు. అయినప్పటికీ ఎంపీ మాత్రం లేఖలు రాస్తూనే ఉన్నారు.

మరోవైపు ఆనం రామనారాయణరెడ్డితో కలిసి ఎంపి రఘురామ కృష్ణంరాజు దిగిన సెల్పీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇద్ధరు నేతలు ప్రభుత్వంపై ధిక్కార స్వరం వినిపించినవారే కావడం, వీరిద్ధరు కలిసి సెల్పీ దిగడం పార్టీ ఫాలోవర్స్ మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ తనపై లోక్ సభ స్పీకర్ కు ఇచ్చిన అనర్హత పిటీషన్ వల్ల తనకు ఎటువంటి నష్టం ఉండదనే ధైర్యంతో ఎంపీ ఉన్నారు. తనపై అనర్హత వేటుకు ఏ మాత్రం ఛాన్స్ లేదని స్పష్టం చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలు కూడా అలా చేస్తేనే బాగుంటదేమో..?

AP telangana

భారత్‌ లో కరోనా విలయ తాండవం చేస్తోంది. పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే బీహార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరు వరకు మళ్లీ లాక్‌ డౌన్ విధిస్తున్నట్లు బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలలో కూడా కరోనా మహమ్మారి రోజు రోజుకి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో కూడా లాక్ డౌన్ విధిస్తే.. బావుంటదని ఆ విధంగా కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

గతంలో సంపూర్ణ లాక్‌ డౌన్‌ కు కేసీఆర్ సర్కార్ మొగ్గు చూపినప్పటికి చివరి నిమిషంలో విరమించుకున్నారు. ఆంధ్రాలో కూడా జగన్ సర్కార్ లాక్ డౌన్ నిర్ణయంపై స్పష్టత లేదు. కానీ బీహార్ లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు ఈ నెలాఖరు వరకు మూసివేయాలిని, ప్రార్థనా మందిరాలకు భక్తులను అనుమతించకూడదని, వ్యవసాయ, నిర్మాణ రంగ పనులకు అనుమతి ఉంటుందని నితీష్ కుమార్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇక కేవలం నిత్యావసర దుకాణాలు మాత్రమే తెరిచి ఉంటాయని సుశీల్ మోడీ వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ తరహా లాక్ డౌన్ విధించినట్లయితే.. కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టవచ్చని పలువురు సూచిస్తున్నారు.

మరోవైపు మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ, త‌మిళనాడు గుజ‌రాత్ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న‌ది. ఈ నేప‌థ్యంలో దేశంలో నమోదవుతున్న మొత్తం పాజిటివ్ కేసుల్లో 86 శాతం కేసులు పది రాష్ట్రాల నుంచే ఉన్న‌ట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్ల‌డించింది. దాదాపు 50 శాతం పాజిటివ్ కేసులు మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లోనే బయటపడుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రత్యేకాధికారి రాజేష్‌ భూషణ్ చెప్పారు. మిగ‌తా ఎనిమిది రాష్ట్రాల్లో 36 శాతం కేసులు నమోదవుతున్నట్లు ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది.

ఇప్పటికే దేశంలో కరోనా కేసుల సంఖ్య 9లక్షలు దాటింది.  గడచిన 24 గంటల్లో 28,498 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 553 మంది మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా  బాధితుల సంఖ్య  9,06,752కు పెరిగింది.  ప్రస్తుతం  3,11,565  మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ  5,71,460 మంది  కోలుకున్నారు.

విశాఖ ప్రమాదంపై రాజకీయాలు చేయడం భావ్యమా?


విశాఖ రాంకీ ఫార్మాసిటీలోని కెమికల్ పరిశ్రమలో జరిగిన ప్రమాదాన్ని అధికార ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాలకు ఉఫయోగించుకోవాలని చూస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు ఆరోఫణలు చేసుకుంటున్న వైనం విమర్శలకు తావిస్తుంది. ప్రస్తుతం ప్రమాదం జరిగిన పరిశ్రమ అధికార పార్టీకి చెందిన నాయకుడికి సంబంధించినదిగా సమాచారం. దీంతో ఇది టిడిపి కుట్ర అని వైసీపీ నాయకులు, అభిమానులు సోషల్ మీదియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. టిడిపి మాత్రం ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శలు చేస్తున్నారు. పనిలో పనిగా చంద్రబాబు, లోకేష్ పేర్లతో ట్విట్టర్ ఖాతాలతో ఫేక్ ట్వీట్ లు సిద్ధమైపోయాయి. విశాఖ సేఫ్ ప్లేస్ కాదని లోకేష్, కార్యనిర్వాహక రాజధానికి పరికిరాదని చంద్రబాబు ట్విట్ చేసినట్లు ఫేక్ పోస్టులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రచారాన్ని టిడిపి యువనేత నారా లోకేష్ ఖండించారు. ప్రాంతీయ విధ్వేషాలు రెచ్చగొట్టే విధంగా వైసిపి సోషల్ మీడియా బ్యాచ్ ఈ విధంగా ప్రచారం చేస్తుందని అధికారక ట్వట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.

అధికార పక్ష నేతలు మాత్రం ప్రమాదాన్ని తెలిగ్గా తీసుకుంటూ ప్రభుత్వ చర్యలను సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖను ప్రభుత్వం కార్యనిర్వహక రాజధానిగా నిర్ణయించడంతో కుట్ర పూరితంగానే ప్రమాదాలు జరుగుతున్నాయనే వాధనలు వినిపిస్తున్నారు. అదేవిధంగా పరిశ్రమలు ఉన్నప్పుడు ప్రమాదాలు జరుగుతాయని, హైదరాబాదులోను గతంలో అనేక పారిశ్రామిక సంస్థల్లో ప్రమాదాలు చోటు చేసుకున్నాయని సోషల్ మీడియా వేదికగా, బయట సమాధానాలు ఇస్తున్నారు. ఇది బాధ్యతా రాహిత్యంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వం తొలి ప్రమాదం నుంచి గుణపాఠం నేర్చుకోకపోవడంతో రాష్ట్రంలో అతి తక్కువ కాలంగా నాలుగు భారీ ప్రమాదాలు చోటు చేసుకున్నాయని చెబుతున్నారు.

ముద్రగడ.. కాపులు.. ఓ కుట్రకోణం!

మరోవైపు ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగినప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలోని అన్ని పరిశ్రమల్లో నిర్వహణా లోపాలు, భద్రతా ప్రమాణాలపై ఆడిట్ నిర్వహించాలని కోరారు. ప్రభుత్వం మాత్రం ఆపని చేయకపోగా పవన్ పై రాజకీయంగా ఎదురుదాడికి దిగింది. ఈ నిర్లక్ష్యానికి ప్రభుత్వంతోపాటు ప్రజలు, ఆయా సంస్థల్లో పని చేస్తున్న కార్మికులు బలికావాల్సి రావడం దురదృష్టకరం. ముందు జాగ్రత్తతో ఉంటే కర్నూలు, విశాఖల్లో జరిగిన ప్రమాదాలు నివారించేందుకు అవకాశం ఉందనేది జనసేన నేతల వాదన.

కేంద్రం విధించిన లాక్ డౌన్ తొలగించిన అనంరతం విశాఖ నగరంలో జరిగిన పారిశ్రామిక ప్రమాదాల్లో ఇది మూడవది. తొలి ప్రమాదం ఎల్జీ పాలిమార్స్, రెండవది సాయినార్ సంస్థలో జరిగాయి. ఈ ప్రమాదాలు అన్ని పరిశ్రమ నిర్వహణలో యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే జరుగుతున్నాయనేది ప్రభుత్వం గుర్తించాల్సిన వస్తవం. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో హైపవర్ కమిటీ విచారణలో ఇదే విషయం తెటతెల్లమయ్యింది. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం అనంతరం అన్ని పరిశ్రమల నిర్వహణలో తీసుకుంటున్న చర్యలను పరిశ్రమల శాఖ పూర్తి స్థాయిలో పర్యవేక్షించకపోవడంతో వరుస ప్రమాదాలకు కారణంగా చెప్పొచ్చు.

సచిన్ పైలెట్ పై కాంగ్రెస్ వేటు.. తర్వాత ఏంటీ?


రాజస్థాన్ రాజకీయాల్లో కుదుపు మొదలైంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం శ్రమించిన నేతల మధ్య తీవ్రస్థాయిలో విబేధాలు నెలకొన్నాయి. పీసీసీ చీఫ్ సచిన్ పైలట్ ప్రచారంతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందనే టాక్ స్థానిక నేతల్లో ఉంది. మద్దతుదారులు చెబుతుంటారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే సమయంలో సీఎం రేసులో అశోక్ గెహ్లట్, సచిన్ పైలట్ పేర్లు చివరి వరకు విన్పించాయి. సీనియర్ అయిన అశోక్ గెహ్లట్ వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గుచూపడంతో సచిన్ పైలట్ కి సీఎం పదవీ దూరమైంది.

కాంగ్రెస్ అధిష్టానం సచిన్ పైలట్ కు డిప్యూటీ సీఎం పదవీ కట్టబెట్టి నచ్చజెప్పింది. సీఎం గెహ్లట్ క్యాబినెట్లో సచిన్ పైలట్ కొనసాగుతూ వస్తున్నారు. అయినప్పటికీ వీరిమధ్య తరుచూ విబేధాలు చోటుచేసుకున్నాయి. ఒకరిపై ఒకరు పైచేయి సాధించే క్రమంలో బహిరంగంగానే ఆరోపణలు చేసుకునే వరకు వెళ్లింది. ఈక్రమంలోనే వీరిమధ్య విబేధాలు తారస్థాయిలోకి చేరడంతో సచిన్ పైలట్ తన మద్దతుదారులకు ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారని సీఎం గెహ్లాన్ వర్గం ఆరోపణలు చేసింది.

సచిన్ పైలట్ తన మద్దతు దారులతో బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతుండటంతో కాంగ్రెస్ అధిష్టానం ఆయనను పిలిచి మాట్లాడేందుకు ప్రయత్నించింది. తాజాగా జైపూర్లో జరిగిన సీఎల్పీ బేటికి సచిన్ పైలట్ రెండోరోజు కూడా గైర్హాజరయ్యారు. దీంతో పార్టీ ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. సచిన్ పైలట్ ను పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం పదవీ నుంచి తప్పించింది. ఆయన స్థానంలో పీసీసీ చీఫ్ గా గోవింద్ సింగ్ దోత్సారాను నియమించినట్లు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడం ఆసక్తిని రేపుతోంది.

దేశంలో పార్టీలు, వాటి స్థితిగతులు

కాంగ్రెస్ అధిష్టానం సచిన్ పైలట్ తో ఆరుసార్లు సంప్రదింపులు చేసినట్లు తెలుస్తోంది. ఆయన నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సచిన్ పైలట్ బీజేపీతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో భాగమయ్యాడని అధిష్టానం భావించడంతో పైలట్‌తోపాటు ఆయన మద్దతుదారులను పార్టీ పదవుల నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. దీంతో రాజస్థాన్ రాజకీయాలు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

జైపూర్లో నిర్వహించిన సమావేశంలో 102మంది ఎమ్మెల్యేలు పాల్గొని సచిన్ పైలట్ ఉద్వాసనకు మద్దతు ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం సీఎం గెహ్లట్ గవర్నర్‌ను కలిసి ప్రస్తుత పరిణామాలు, కేబినెట్ పునర్ఃవ్యవస్థీకరణపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సచిన్ పైలట్‌కు ఆయన మద్దతుదారులతో బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతుంది. అయితే ఆయన మద్దతుదారులు మాత్రం బీజేపీలో చేరడాన్ని వ్యతిరేకిస్తున్నారట.

దీంతో సచిన్ పైలట్ సొంత పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సచిన్ పైలట్ బీజేపీలో చేరతారా? లేదా సొంత పార్టీ పెడుతారా? అనేది త్వరలోనే తేలడం ఖాయంగా కన్పిస్తుంది. అంతవరకు వేచి చూడాల్సిందే..!

ప్రశాంత నగరం… ప్రమాదాల సుడిగుండం?

Vizag

Vizag

విశాఖపట్నం ప్రశాంత నగరంగా పేరుతెచ్చుకుంది. ఆసియాలో శరవేగంగా అభివ్రుధ్ధి చెందుతున్న పట్టణాలలో విశాఖపట్నం ఒకటి. అటువంటి విశాఖ ఈ మధ్య వరుస ప్రమాదాలతోప్రజలను బ్రాంతులకు గురిచేస్తోంది.

విశాఖ నగరం చుట్టూ ఉన్న పరిశ్రమలలో ఇపుడు వరస ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏదో కూడబలుక్కున్నట్లుగా కష్టాలు ఒక్కసారిగా వచ్చిపడుతున్నాయి. కేవలం రెండు నెలల తేడాలో మూడు భారీ ప్రమాదాలు వివిధ కర్మాగారాలలో చోటు చేసుకున్నాయి. మే 7న ఎల్జీ పాలిమర్స్ లో స్టెరీన్ గ్యాల్ లీక్ అయి ఏకంగా 15 మందిని పొట్టన పెట్టుకుంది. అది ఒక గుణపాఠం కావాలి. కానీ ఆ తరువాత ప్రభుత్వ సంస్థ హెచ్ పీ సీ ఎల్ లో కూడా మరో ప్రమాదం జరిగింది. ఇక్కడ ప్రాణ నష్టం లేదు కానీ జనం బెంబెలెత్తారు. ఆ తరువాత ఫార్మా సిటీలో ఓ మందుల కంపెనీలో జరిగిన ప్రమాదంలో ఒకరు చనిపోయారు. ఇపుడు పరవాడలో సాల్వెంట్స్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇది మళ్ళీ జనాలంతా ఉలిక్కిపడేలా చేసింది.

ఓ వైపు విశాఖకు శరవేగంగా రాజధానిని తీసుకురావాలని వైసీపీ సర్కార్ పెద్దలు ఆలోచన చేస్తున్నారు. అదే సమయంలో ఇలాంటి ప్రమాదాలు జరగడం పట్ల చర్చ సాగుతోంది. విశాఖకు రాజధాని హోదా అవసరమా కాదా అన్నది ఒక చర్చ అయితే విశాఖలో భద్రత లేదా అన్నది మరో చర్చ. నిజానికి ఈ రెండింటికీ ఇంటర్ లింక్ ఉందా అన్నది మరో చర్చ. రాజధాని రాక ఆలస్యం అవవచ్చు కానీ తప్పనిసరిగా వస్తుందని వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓ వైపు గట్టిగా చెబుతూంటే సగటున ప్రతి పదిహేను రోజులకు ఒక ప్రమాదం చోటు చేసుకోవడంతో అసలు విశాఖకు ఏం జరుగుతోంది అన్న ఆలోచనలు మేధావులకు కూడా వస్తున్నాయి.

ప్రమాదాలు చెప్పిరావు అంటారు. కానీ విశాఖ లో వరసగా కర్మాగారాల్లో ఒకే తీరున చోటు చేసుకుంటున్న ప్రమాదాలు మాత్రం చెప్పే వస్తున్నాయా అన్న భయాన్నే కలిగిస్తున్నాయి. ఇంతకు ముందు లేని విధంగా ఇలా జరగడం పట్ల కూడా నగర ప్రజలలో ఆందోళన వ్యక్తం అవుతోంది. దీనికి కర్మాగారాల యాజమాన్యాల నిర్లక్ష్యం ఒకటి అయితే పర్యవేక్షించాల్సిన అధికారుల ఉదాశీనత కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ప్రమాదాలు అన్నింటిల్లో అలెర్ట్ చేసే అలారాలు మోగకపోవడం కామన్ పాయింట్. అంతటి నిప్పుల కుంపటిని దగ్గర పెట్టుకుని కనీసం అలారం కూడా మోగకపోతే సమీపంలో ఉండే ప్రజలు ఏమవుతారు అన్నది ఆలోచించాల్సిన విషయమే. ఇప్పటికైనా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని యాజమాన్యాలు, అధికారుల వైపు నుంచి ఉన్న నిర్లక్ష్యం మీద గట్టిగా చర్యలు తీసుకుంటేనే తప్ప ఈ ప్రమాదాలు ఆగేట్టు లేవని అంటున్నారు. విశాఖకు రాజధాని పక్కన పెడితే సిటీ బ్రాండ్ ఇమేజ్ కి కూడా దీని వల్ల దెబ్బ పడుతోందని అంతా అభిప్రాయపడుతున్నారు.

వంగవీటి రాధా పయనం ఎటు?


అదృష్టవంతుణ్ణి ఎవరూ చెడగొట్టలేరు..దురదృష్టవంతుణ్ణి ఎవరూ బాగు చేయలేరు. ఈ సామెత టీడీపీ కాపు నేత వంగవీటి రాధాకు బాగా వర్తిస్తుంది.రాజకీయ దురదృష్టవంతులలో ఈయన మొదటివరసలో ఉంటారు. చూసినంత సేపు చూసి… వడ్డించే ముందు పక్క బంతిలోకి వెళ్లి అక్కడ ఎదురు చూసే రకం. కాపు సామాజిక వర్గం ఆరాధించే వంగవీటి రంగా కొడుకుగా విజయవాడలో ఆయన దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తున్నారు. తన తండ్రి చావుకు కారణం టీడీపీ నేతలే అని గట్టిగా నమ్మే వంగవీటి రాధా, ఎప్పటి నుండో టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఇతర పార్టీలలో కొనసాగారు.

ముద్రగడ.. కాపులు.. ఓ కుట్రకోణం!

2004 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరుపున విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. రాజకీయంగా కెరీర్ గాడినపడుతున్న క్రమంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో జెస్ట్ స్పీడ్ తో దూసుకెళుతున్న కాంగ్రెస్ పార్టీ వీడి, అప్పుడే పురుడుపోసుకున్న పీఆర్పీలో చేరారు. 2009 ఎన్నికలలో విజయవాడ సెంట్రల్ నియోజక వర్గం నుండి పీఆర్పీ తరుపున పోటీచేసి అపజయం పొందారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్లాది విష్ణు, రాధా పై విజయం సాధించడం జరిగింది. పీఆర్పీ పార్టీ నుండి వైసీపీ పార్టీలో చేరిన వంగవీటి రాధా, 2014ఎన్నికలలో అదే నియోజక వర్గంలో పోటీచేసి ఓటమిపాలయ్యారు.

ఇక ఐదేళ్లు మాజీ ఎమ్మెల్యేగా వైసీపీ పార్టీలో ఉన్న రాధా, సరిగ్గా 2019ఎన్నికలకు ముందు జగన్ పై వ్యతిరేక జెండా ఎగరవేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సీటు వైసీపీ తరుపున మల్లాది విష్ణుకు కేటాయిస్తున్నారని తెలుసుకొని, ఆ సీటు తనకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన అనుచరుతో నిరసన కార్యక్రమాలు కూడా చేయించారు. దానికి బదులుగా మచిలీపట్టణం ఎంపీ సీటు ఇస్తానని చెప్పినా, ఆయన విజయవాడ సెంట్రల్ సీటు కోసం పట్టుబట్టుకు కూర్చున్నారు. జగన్ ససేమిరా అనడంతో వైసీపీని వీడి, టీడీపీలో చేరారు. పచ్చ కండువా కప్పున వెంటనే… జగన్ అహంకారి అని, ఎవరి మాటా వినడని, తనకు పార్టీలో కనీస గౌరవం ఇవ్వలేదని ఆరోపణలు చేశారు. ధారుణంగా బాబుకి మరియు టీడీపీకి రంగా చావుతో సంబంధం లేదని చెప్పి ఆశ్చర్య పరిచారు.

జగన్ ముందు బాలయ్య డిమాండ్ల చిట్టా..!

తీరా 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అయన గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. ఎదో కాపు ఓటు బ్యాంకు కోసం బాబు, రాధాను చేరదీసినా పార్టీలో ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వలేదు. కనీసం 2019ఎన్నికలలో అతనికి ఎమ్మెల్యే కానీ ఎంపీ సీటు కానీ ఇవ్వలేదు. రాధాను చేరదీయడం వలన టీడీపీకి ఒరిగింది ఏమీ లేదని ఎన్నికల తరువాత కాపు ఓట్ల సమీకరణాలు చూసి అర్థం చేసుకున్నారు. దీనితో టీడీపీలో ఆయనకు కనీస ప్రాధాన్యత ఇవ్వడం లేదు. రాధా అసలు టీడీపీలో ఉన్నాడో లేడో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఎటువంటి ప్రాధాన్యం లేకుండా టీడీపీలో ఉండడం అనవసరం అనుకుంటున్న రాధా, వేరే పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నారట. టీడీపీ భవిష్యత్తు కూడా అగమ్య గోచరంగా ఉండగా, ఆయన జనసేన లేదా వైసీపీ పార్టీలో చేరేందుకు ప్రణాళికలు రచిస్తున్నారట. ఎక్కువ శాతం ఆయన చూపు వైసీపీ వైపు ఉన్నట్లు సమాచారం.

రానా, అల్లరి నరేష్‌ మల్టీస్టారర్ వెబ్‌ సిరీస్‌?

Allari Naresh and Rana
దగ్గుబాటి రానా, అల్లరి నరేశ్. ఇద్దరూ సినీ వారసులుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నటులు. దిగ్గజ నిర్మాత, దివంగత రామానాయుడు మనవడిగా తెరంగేట్రం చేసిన రానా తొలుత హీరోగా చేసినా తర్వాత ఇమేజ్‌ను పక్కనపెట్టి సపోర్ట్‌ యాక్టర్ గా, విలన్‌గా కూడా వరుస చిత్రాలు చేశాడు. తెలుగులోనే కాకుండా తమిళ్‌, హిందీలో నటిస్తూ దేశ వ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘బాహుబలి’లో భల్లాలదేవగా అతని విలనిజానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఒక్కసారిగా నేషనల్‌ స్టార్గా మారిపోయాడు. మరోవైపు దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కుమారుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టి తన తొలి సినిమా ‘అల్లరి’నే ఇంటి పేరుగా మార్చుకున్నాడు నరేశ్‌. పూర్తి స్థాయి కామెడీ హీరోగా వరుస సినిమాలు చేసిన అతను హిట్టుకంటే ఫ్లాపులో ఎక్కువ ఖాతాలో వేసుకున్నాడు. ‘గమ్యం’తో కామెడీ ఉన్న కీలక క్యారెక్టర్తో రూటు మార్చే ప్రయత్నం చేశాడు. కానీ, తిరిగి పాత తరహా మూవీలే చేసి ఫేడ్‌ ఔట్‌ అయ్యాడు. ఇలాంటి టైమ్‌లో ‘మహర్షి’లో సీరియస్‌ క్యారెక్టర్తో సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్చేశాడు. ఇప్పుడతను ‘నాంది’ మరో డిఫరెంట్‌ మూవీతో ముందుకొస్తున్నాడు. ఇందులో అన్యాయంగా ఖైదు చేయబడ్డ యువకుడి పాత్రలో నరేష్‌ నటిస్తున్నాడు. పోలీస్‌ స్టేషన్‌లో నగ్నంగా చిత్రహింసలు పెడుతున్న సన్నివేశాలతో కూడిన ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. అలాగే, ‘బంగారు బుల్లోడు’ సినిమా కూడా చేస్తున్నాడు.

వెబ్‌ బాటలోకి మరో స్టార్ డైరెక్టర్?

మరోవైపు రానా.. నక్సలైట్‌ బ్యాక్‌డ్రాప్‌లో ‘విరాట పర్వం’ అనే మూవీ చేస్తున్నాడు. నరేష్‌, రానా ఇద్దరూ ఇదివరకు చాలా మల్టీస్టారర్స్‌ మూవీలు చేశారు. ఇప్పుడు ఇద్దరూ కలిసి ఓ మల్టీ స్టారర్ చేయబోతున్నారట. అందులో స్పెషాలిటీ ఏంటంటే ఇది ఓ వెబ్‌ సిరీస్‌ అని సమాచారం. ఓ ప్రముఖ సంస్థ దీన్ని రూపొందిస్తుందని.. ఇప్పటికే కథ పూర్తవగా, నటీ నటుల ఎంపిక కూడా పూర్తయిందని సమాచారం. ప్రస్తుతం తమ చేతుల్లో ఉన్న ప్రాజెక్టులు ముగిసిన వెంటనే రానా, నరేశ్‌ ఈ వెబ్‌ సిరీస్‌లో నటించే అవకాశం ఉంది.

ఓహో ఛాన్స్ కోసం.. లావణ్య బికినీ !

Lavanya Tripathi in Bikini
హీరోయిన్ లావణ్య త్రిపాఠికి మంచి టాలెంట్, గుడ్ గ్లామర్ ఉన్నా.. స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. మొదట్లో ఎక్స్ పోజింగ్ కి నో చెప్పడం, కాస్త కూడా లౌక్యం లేకపోవడంతో అమ్మడు మొహానికి రంగు వేసుకోవడం మొదలుపెట్టి పదేళ్లు అయినా, పెద్దగా సంపాధించింది ఏమి లేదు. తనకంటే ఆరేళ్ళు తరువాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వాళ్ళు అడ్డుఅదువు లేకుండా గ్లామర్ ను కురిపించేసి.. బాగానే వెనకేసుకున్నారు. పైగా వ్యాపారులు కూడా మొదలెట్టి లాభాల లెక్కల్లో హడావుడిగా ఉన్నారు. కానీ లావణ్య పరిస్థితి మాత్రం ఎక్కడ మొదలైందో అక్కడే అన్నట్టు ఉంది పరిస్థితి.

ఇలాంటి పరిస్థితుల్లో అర్జున్ సురవరం సినిమా రూపంలో లావణ్య త్రిపాఠికి మంచి హిట్ వచ్చిందని ఆనంద పడినా.. ఆ తరువాత లావణ్య కెరీర్ మాత్రం ఆశించిన స్థాయిలో కొనసాలేదు. తనకు లేకలేక వచ్చిన సక్సెస్ తోనైనా కెరీర్ ను మరో స్థాయికి తీసుకెళ్లదామని అమ్మడు ఫుల్ గా ప్రయత్నాలు మొదలుపెట్టి అలసిపోయింది గాని, స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు మాత్రం అందుకోలేకపోయింది. ఈ మొత్తం వ్యవహారంలో లావణ్య అర్ధం చేసుకున్న పాయింట్ ఏమిటంటే .. ఎక్స్ పోజింగ్ విషయంలో ఇక తానూ రెచ్చిపోవాలని. దాంతో బికినీకి కూడా సై అని స్టార్ హీరోలకు డైరెక్టర్ లకు మెసేజ్ పాస్ చేస్తోందట.

ఇకపై వాటికి దూరం.. అంటున్న బ్యూటీ

కాగా రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా రానున్న సినిమాలో ఓ బోల్డ్ క్యారెక్టర్ ఉందట, బికినీ సూట్ లతో పాటు కాస్త ఘాటు సీన్స్ లో కూడా విచ్చలవిడిగా రెచ్చిపోయి నటించాలట. ఈ రోల్ కోసం మొదట ‘నిధి అగర్వాల్’ని అనుకున్నారు. రవితేజ కూడా నిధి వైపే మొగ్గు చూపాడు. నిధి అయితేనే ఆ ఘాటు సీన్స్ కు పూర్తి న్యాయం చేస్తోందని అనుకున్నారు. అయితే ఆ రోల్ నేను చేస్తానని, బికినీ కూడా వేస్తానని నాకు ఛాన్స్ ఇవ్వండని లావణ్య త్రిపాఠి హీరోని అప్రోచ్ అయిందట. ఇంతకు ముందెప్పుడూ లావణ్య త్రిపాఠి ఈ రేంజ్ లో బోల్డ్ క్యారెక్టర్స్ చేయలేదు కాబట్టి, నిధి కంటే కూడా లావణ్యనే బెటర్ అప్షన్ అని రవితేజ టీం ఫీల్ అవుతున్నారట.

ఆ హీరో, డైరెక్టర్ ల కెరీర్ లు పోయినట్టేనా ?

Raj Tarun
ఒకప్పుడు సక్సెస్ కొట్టిన హీరోకి కనీసం పదేళ్ల కెరీర్ ఉంటుంది. కానీ కాలం మారింది. హిట్స్ ఉన్నా.. వరుసగా రెండు మూడు ప్లాప్ లు వస్తే.. ఇక ఆ హీరో, జీరోగా మిగిలిపోతున్నాడు. ప్రస్తుతం యంగ్ హీరో రాజ్‌ తరుణ్‌ ది అలాంటి పరిస్థితే. మొదట్లో బాగానే హిట్లు వచ్చినా, ఆ తరువాత వరుస ప్లాప్ లతో బాక్సాఫీస్ వద్ద పూర్తిగా డీలా పడిపోయి.. దిల్ రాజు లాంటి వారి వైపు దీనంగా చూస్తున్నాడు. కానీ దిల్ రాజు సైతం బాబుకు హిట్ ఇవ్వలేక ఇప్పటికే ఓ భారీ ప్లాప్ సినిమా తీశాడు. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ‘ఇద్దరి లోకం ఒకటే’ ఈ కుర్ర హీరోని నిండా ముచ్చేసిందనే చెప్పాలి.

ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్ లేకుండా చాల స్పీడ్ గా హీరోగా ఎదిగిన రాజ్ తరుణ్.. ఒక్కసారిగా స్పీడ్ పోయి మార్కెట్ లేని హీరోగా పడిపోయాడనేది.. ప్రస్తుతం అతని సినిమాల రేట్స్ ను చూస్తే అర్ధమవుతుంది. ఇక ప్రస్తుతం కె.కె. రాధామోహన్‌ నిర్మాణంలో కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో ‘ఒరేయ్ …బుజ్జిగా’ అనే సినిమా చేస్తున్నాడు ఈ కుర్ర హీరో. కరోనా ప్రవాహంలో చిక్కుకున్న సినిమాల్లో ఈ సినిమా ఒక్కటి.

ఒరేయ్‌ బుజ్జిగా.. టీజ‌ర్

అయితే ఈ సినిమా పై రాజ్ తరుణ్ చాలా ఆశలే పెట్టుకున్నాడు, ఎందుకంటే ఈ సినిమా కూడా బకెట్ తన్నేస్తే.. రాజ్ తరుణ్ అనే హీరో ఉండేవాడు అని ఆడియన్స్ చెప్పుకోవాల్సి వస్తోంది. అందుకే ఈ సినిమా కోసం రాజ్ తరుణ్ తెగ టెన్షన్ పడుతున్నాడు. కానీ, ఈ సినిమా అవుట్ ఫుట్ కూడా బాగా రాలేదని తాజాగా సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కథలో మ్యాటర్ లేకపోవడం.. పైగా మిస్ అండర్ స్టాడింగ్ కామెడీతో రొటీన్ తంతు వ్యవహారాలతో సినిమా ఉంటుందని ఓ ఓటీటీ ప్లాట్ ఫామ్ తేల్చేసిందట. సినిమాని కొనలేమని ఆ ప్లాట్ ఫామ్ తప్పుకుందట.

పాపం ‘గుండె జారి గ‌ల్లంత‌య్యిందే’ సినిమాతో హిట్ డైరెక్టర్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తరువాత సినిమాల కోసం నానా అగచాట్లు పడిన కొండా విజయ్ కుమార్ కెరీర్ కి కూడా ఈ సినిమా చాల కీలకం.. మరీ ఈ సినిమా బాగలేకపోతే రాజ్ తరుణ్ తో పాటు కొండా కూడా ఇక సర్దుకోవడమే. మొత్తానికి సినిమాలో కంటెంట్ లేదని, స్క్రీన్ ప్లే కూడా బాగా బోర్ గా సాగుంతుందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది కాబట్టి, బాగోలేని సీన్స్ ను రీషూట్ చేసి.. ప్లాప్ శాతాన్ని తగ్గించుకుంటే బెటరేమో.

ఉత్తరాంధ్రలో వైసీపీ ఆపరేషన్ షూరు?

YSRCP
టీడీపీకి తొలినుంచి ఉత్తరాంధ్ర కంచుకోటగా ఉండేది. కిందటి ఎన్నికల్లో ఉత్తరాంధ్రులు వైసీపీకి జై కొట్టారు. ఉత్తరాంధ్రలో ఫ్యాన్ గాలి జోరుగా వీయడంతో మొత్తానికి మొత్తం సీట్లన్నీ కూడా వైసీపీ ఖాతాలోకి వచ్చిచేరాయి. వైసీపీ బలంగా నిలిచిన ఉత్తరాంధ్రకు సీఎం జగన్ ధన్యావాదాలు చెబుతున్నట్లుగా విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించారు. ఈ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అమరావతి రాజధానిని విశాఖకు తరలిస్తున్నారని ఆ ప్రాంతవాసులు పెద్దఎత్తున నిరసన చేపడుతున్నా ప్రభుత్వం మాత్రం విశాఖను రాజధానిగా మార్చేందుకే మొగ్గుచూపుతుంది.

విశాఖను రాజధానిగా ప్రకటించడం వల్ల వైసీపీకి ఈ ప్రాంతంలో మరింత బలం చేకూరడం ఖాయమని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అంతేకాకుండా అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న టీడీపీకి ఈప్రాంతంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ బలంగా నిలిచిన ఉత్తరాంధ్రను ఆదుకోవడంతోపాటు టీడీపీని కోలుకుండా చేసేందుకు సీఎం జగన్ పావులు కదుపుతున్నారు.

మూడు ప్రాంతాలను ముగ్గురికి పంచిన జగన్?

ఇందులో భాగంగానే రేపోమాపో విశాఖ పరిపాలన రాజధాని మారడం ఖాయంగా కన్పిస్తుంది. దీంతోపాటు ఈ ప్రాంతంలో టీడీపీ బలంగా ఉన్న నేతలను వైసీపీలోకి ఆకర్షించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. విశాఖ రాజధానిని టీడీపీ నేతలు వ్యతిరేకిస్తుండటం స్థానికంగా ఆ పార్టీకి ఎదురుదెబ్బలు తగిలే అవకాశం ఉంది. దీంతో టీడీపీ చెందిన పలువురు ముఖ్యనేతలు వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగానే వైసీపీ ఆకర్ష్ మంత్రానికి తెరతీసింది.

టీడీపీకి తొలి నుంచి బలంగా ఉన్న నేతలను వైసీపీలో చేర్చుకొనేందుకు ప్లాన్ చేస్తోంది. మాజీ మంత్రులు, బలమైన నేతలపై వైసీపీ దృష్టిసారించినట్లు తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉండటంతో కొందరు టీడీపీ నేతలు వారి స్వప్రయోజనాలు, వ్యాపార, ఆర్ధిక లావాదేవీలకు ఆటంకం రాకుండా వైసీపీ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో టీడీపీ ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉత్తరాంధ్రలోని విజయనగరంలో టీడీపీ తుడిచి పెట్టుకుపోయిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఉత్తరాంధ్రలోని మిగతా జిల్లాల్లోనూ వైసీపీ ఆకర్ష్ మంత్రం పనిచేస్తుండటంతో టీడీపీకి గడ్డు పరిస్థితులు ఎదురయ్యేలా కన్పిస్తున్నాయి.

తెలంగాణపై బీజేపీకి విశ్వాసం ఎందుకు పెరుగుతోంది?

BJP in Telangana
తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయాల్లో గండరగండరుడు లాంటి వాడు. అపర చాణక్య తెలివితేటలు గలవారు. ఆయనను ఎదుర్కొనే నిలిచే ప్రతిపక్షం ప్రస్తుతం తెలంగాణలో కనిపించడం లేదు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయిన టీడీపీ అధినేత చంద్రబాబే.. కేసీఆర్ ను ఎదుర్కోలేక అప్పట్లో అమరావతికి మకాం మార్చేశాడు. ఇక తెలంగాణలో ప్రతిపక్ష కాంగ్రెస్ ను బలహీనం చేయడంలో కేసీఆర్ కీరోల్ పోషించారు. ఇప్పుడు తనకు ఎదురే లేదనుకుంటున్న సమయంలో తెరపైకి వచ్చిన యువ ఎంపీలతో బీజేపీ బలోపేతమైంది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రాష్ట్ర బీజేపీ పగ్గాలు చేపట్టడంతో టీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కొంటోంది.

టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పార్టీని నిలబెట్టడంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ కొత్త పోరాటాలు.. తెలంగాణ అంతటా నిరసనలు పాలక టీఆర్ఎస్ ను సైతం ఆశ్చర్య పరుస్తున్నాయి. తిరుపతిలో అప్పట్లో పార్టీ అధ్యక్షుడు అమిత్ షాపై టీడీపీ అనుచరులు దాడి చేసినప్పుడు తెలంగాణలో బీజేపీ పెద్దగా నిరసనలే వ్యక్తం చేయలేదు. కానీ నేడు వరంగల్ లో ఒక సాధారణ ఎంపీపై దాడి చేసినందుకు తీవ్రమైన ప్రతిస్పందనను బీజేపీ నాయకులు వ్యక్తం చేశారు. బీజేపీ నుంచి ఈ స్థాయిలో ప్రతీకారం వస్తుందని టీఆర్ఎస్ అస్సలు ఊహించలేదు. దీనంతటికి కారణంగా నాయకత్వ మార్పునే అని అంటున్నారు.

తెలంగాణలో బీజేపీ వ్యూహం ఫలిస్తుందా?

వరంగల్ లో బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై దాడికి బీజేపీ సీరియస్ అయ్యింది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తీవ్రంగా జరుగుతున్నాయి. ఇది టీఆర్ఎస్ పై ఒక యుద్ధం లాగానే బీజేపీ కార్యకర్తలు చేస్తున్నారు. దీన్ని తెలంగాణలో బీజేపీ మారుతున్నట్టు అర్థమవుతోంది.

తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చింది. యువ కార్యకర్తలంతా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. కరోనా కారణంగా బండి సంజయ్ అన్ని జిల్లాల్లోని పార్టీ నేతలు, కార్యకర్తలతో వర్చువల్ సమావేశాలను నిర్వహిస్తూ పార్టీని సమాయత్తపరుస్తున్నారు. వర్చువల్ మీటింగ్ లో సగటు బీజేపీ కార్యకర్తల హాజరు లక్షగా ఉంటోంది. ఈ అనూహ్య స్పందన అధికార టీఆర్ఎస్ ను ఢీకొట్టడానికి బీజేపీకి ధైర్యం ఇస్తోంది.

వర్చువల్ సమావేశాలతో బీజేపీ కార్యకర్తలు.. నేతల్లో ఉత్సాహం నింపుతున్న బండి సంజయ్ ఈ వేగాన్ని ఎన్నికల వరకు కొనసాగించగలడా అన్నది వేచిచూడాలి.. గతంలో కూడా ఇదే వేగాన్ని బీజేపీ అందుకుంది.. కానీ కొనసాగించలేకపోయింది.. గతంలో పనిచేసిన కిషన్ రెడ్డి, లక్ష్మన్ లు దూకుడుగా వెళ్లి సైలెంట్ అయ్యారు. సంజయ్ మరి ఈ వేగాన్ని కొనసాగించి బీజేపీని విజయతీరాలకు చేరుస్తారా? లేదా మురిపించి ముగిస్తారా అన్నది వేచి చూడాలి..

చిరు ‘ఆచార్య’ ఆఫర్కు సాయి పల్లవి నో!

Sai Pallavi Latest Pics
తెలుగు సూపర్ హిట్‌ డ్యాన్స్‌ షో ‘ఢీ’లో డ్యాన్సర్ గా పార్టిసిపేట్‌ చేసి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది సాయి పల్లవి. దక్షిణాదిలో ఇప్పుడామెకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. అందం లేకపోయినా.. అభినయంతో వరుస ఆఫర్లు సొంతం చేసుకుంటుందామె. బోల్డ్‌ క్యారెక్టర్లకు, స్కిన్ షోకు ఎప్పుడూ దూరంగా ఉండే పల్లవి తన ఫస్ట్‌ సినిమా మలయాళ ‘ప్రేమమ్‌’తో యువత హృదయాలు కొల్లగొట్టింది. అక్కడి నుంచి ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. తమిళ్‌, కన్నడ, తెలుగు చిత్రాలతో బిజీగా మారిందామె. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వరుణ్ తేజ్‌ సరసన ‘ఫిదా’తో తెలుగు ఆడియన్స్‌కు దగ్గరైందామె. ‘భానుమతి సింగిల్‌ పీస్‌’ అంటూ తెలంగాణ పల్లెటూరి యువతిగా చేసిన ఆ పాత్ర ఆమె కెరీర్లో ఓ మైలురాయి.

సాయిపల్లవికి మరో సర్ ప్రైజ్..

అయితే, ఎప్పుడూ భిన్నమైన పాత్రల కోసం ఆరాటపడే సాయి పల్లవికి ఫిదా తర్వాత తెలంగాణ అమ్మాయి పాత్రలు చాలా వచ్చినా ఆమె సున్నితంగా తిరస్కరించింది. కానీ, శేఖర్ కమ్ముల ‘లవ్‌స్టోరీ’లో మాత్రం ఆమె మరోసారి తెలంగాణ యువతిగా కనిపించబోతోంది. ఇది ‘ఫిదా’కు భిన్నమైన పాత్రనట. అదే సమయంలో రానా హీరోగా తెరకెక్కుతున్న ‘విరాట పర్వం’లో నక్సలైట్‌గా నటిస్తోందామె. మాజీ నక్సలైట్‌ బెల్లి లలిత జీవితం ఆధారంగా ఆమె పాత్రను డిజైన్‌ చేశారన్న ప్రచారం జరిగినా చిత్ర బృందం దాన్ని ఖండించింది. కాగా, విరాట పర్వంలో నక్సలైట్‌ పాత్రలో పల్లవి ఫస్ట్‌ లుక్‌ చూసి ఇంప్రెస్‌ అయిన మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ చిత్ర బృందం నుంచి ఆమెకు ఆఫర్ వచ్చిందట. ‘ఆచార్య’ కూడా నక్సలైట్‌ ఇతివృత్తింలో నడిచే కథ కావడంతో ఓ కీలక పాత్ర కోసం సాయి పల్లవిని అడిగారట. కానీ, ఒకే సారి ఒకే రకమైన రెండు పాత్రలు పోషించడం ఇష్టం లేని సాయి పల్లవి.. చిరు మూవీ ఆఫర్ను రిజెక్ట్‌ చేసినట్టు సమాచారం. లవ్‌స్టోరీ రిలీజ్‌కు రెడీగా ఉండగా.. నానితో మరోసారి సినిమాకు పల్లవి ఓకే చెప్పింది. తమిళ్‌లో విక్రమ్‌ సరసన కూడా ఆఫర్ వచ్చిందట.

సచివాలయం నిర్మాణం.. తెరపైకి కొత్త డిమాండ్..!

CMKCR
సీఎం కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆధునాతన హంగులతో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని భావించారు. ఇందుకు తగ్గట్టుగానే సచివాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసి రూ.500కోట్ల నిధులు కేటాయించినట్లు ప్రకటించారు. పాత సచివాలయాన్ని పడగొట్టి కొత్తది నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ విపక్షాలు, ప్రజాసంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై సుదీర్ఘంగా విచారించిన హైకోర్టు ఇటీవల ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది.

సచివాలయం కూల్చివేతకు.. కేటీఆర్ కు లింకేంటీ?

పాత సచివాలయం కూల్చివేతకు హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ప్రభుత్వం యంత్రాంగం పనులను మొదలుపెట్టారు. సచివాలయ మార్గంలో వెళ్లే వాహనాలను దారిమళ్లించి కూల్చివేత పనులను ప్రభుత్వం షూరు చేసింది. ఇప్పటికే దాదాపు 60శాతం కూల్చివేత పనులు పూర్తయినట్లు సమాచారం. అయితే సచివాలయంలోని గుడి, మసీదులపై సచివాలయ శిథిలాలు పడిపోవడంతో ఆ నిర్మాణాలు కూలిపోయాయి. ఈ విషయంపై సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త సచివాలయ నిర్మాణంతోపాటు కూలిపోయిన గుడి, మసీదులను కూడా కొత్తగా నిర్మించనున్నట్లు సీఎం ప్రకటించారు.

అయితే తాజాగా మరో డిమాండ్ తెరపైకి వచ్చింది. కొత్త సచివాలయ నిర్మాణంలో గుడి, మసీదుతోపాటు చర్చి కూడా నిర్మించాలని తెలుగు చర్చిల ఫెడరేషన్ ప్రభుత్వాన్ని కోరుతోంది. పాత సచివాలయంలో కే బ్లాకులో ప్రతీ బుధవారం చర్చి సేవలను నిర్వహిస్తున్నారని వారు గుర్తుచేస్తున్నారు. 2007లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ చర్చి హాల్ ను ప్రారంభించారని చెబుతున్నారు. ఈ చర్చి సేవలు ఇటీవల వరకు సాగించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం సచివాలయంలోని అన్ని బ్లాకులు కూల్చివేస్తుండటంతో గుడి, మసీదుతోపాటు చర్చిని కూడా సీఎం కేసీఆర్ నిర్మించాలని కోరుతున్నారు.

మరోసారి సచివాలయం కూల్చివేతకు హైకోర్టు బ్రేక్..!

ఇదిలా ఉంటే సచివాలయం కూల్చివేతకు హైకోర్టు మరోసారి బ్రేక్ వేసింది. ఈనెల 15వరకు సచివాలయాన్ని కూల్చివేయద్దంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సామాజికవేత్త పీఎల్ విశ్వేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ పై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. ప్రస్తుతానికి సచివాలయ కూల్చివేతకు బ్రేకులు పడినప్పటికీ త్వరలోనే సీఎం అనుకున్నట్లుగా కొత్త సచివాలయం నిర్మాణం జరుగడం ఖాయంగా కన్పిస్తోంది. తాజాగా చర్చిని కూడా నిర్మించాలని డిమాండ్ వస్తున్న తరుణంలో సీఎం కేసీఆర్ దీనికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కన్పిస్తుంది. దీనిపై త్వరలోనే ప్రభుత్వం క్లారిటీ ఇవ్వనుంది.

వరుస ప్రమాదాలతో విశాఖ ఉక్కిరి బిక్కిరి!

CETP fire accident

CETP fire accident

ఇటీవల విశాఖలోని ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీలో జరిగిన గ్యాస్ లీకేజీ ఘటన మరువకముందే.. మరో ఘటనతో విశాఖ న‌గ‌ర‌వాసుల‌తోపాటు ప‌రిస‌ర‌ప్రాంతాల్లో ఉన్న వారికి కంటిపై కునుకు లేకుండా పోయింది. తాజాగా పరవాడలో రాంకీ సీఈటీపీ సాల్వెంట్స్‌ లో భారీ పేలుడు సంభవించింది. ఒక వైపు క‌రోనా మ‌రో వైపు త‌రుచుగా జ‌రుగుతున్న ప్రమాదాలతో విశాఖ వాసులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. గ‌త కొద్ది కాలంగా విశాఖ‌ప‌ట్నంలో ఇలాంటి భ‌యాన‌క ప్రమాదాలు ఎందుకు సంభ‌విస్తున్నాయనే చర్చ మొదలైంది. ఎల్జీ పాలిమర్స్‌ ప్రమాదంతో మొదలైన ఈ ప్రమాదాల పరంపరపై నిపుణులు విశ్లేషణ మొదలైంది. అసలు ఈ ప్రమాదాలకు కారణమేంటి ? మాన‌వ త‌ప్పిదాలే కార‌ణ‌మా? విశాఖ జిల్లా వ్యాప్తంగా దాదాపు 9 అత్యంత ప్రమాదరకమైన ర‌సాయ‌న పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమల వల్ల ప్రమాదం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొండపల్లి, జి.కొండూరు,ఇబ్రహీంపట్నం మండలాలలోని గ్రామాల్లో దాదాపు 1500 ఎకరాల్లో బీపీసీఎల్‌ ఆయిల్‌, ఐవోసీఎల్‌ ఆయిల్‌, హెచ్‌పీసీఎల్‌ ఆయిల్‌, హెచ్‌పీసీఎల్‌ బాట్లింగు ప్లాంటు, బీపీసీఎల్‌ బాట్లింగు ప్లాంటు, ల్యాంకో పవర్‌, ఎన్‌టీటీపీఎస్‌, గెయిల్‌ ఇండియా ఇలా పదుల సంఖ్యలో అత్యంత ప్రమాదకరమైన కంపెనీలు ఉన్నాయి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్న ఘోరమైన ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి.

అతిగా శానిటైజర్ వాడితే అనర్థమేనంటా..!

ఇంత‌టి ప్రమాదకరమైన పరిశ్రమలు ఉన్నా.. వాటి భద్రత పర్యవేక్షణపై ప్రభుత్వం ఇప్పటివరకు ఒక క‌మిటిని కూడా వేయ‌లేదు. గ‌తంలో ఉన్న ప్రభుత్వం కూడా వీటిలో భద్రత ప్రమాణాలు ఎంత వ‌ర‌కు ఉన్నాయ‌నే విష‌యాల‌పై పెద్దగా దృష్టి పెట్టలేదు. వైఎస్ జగన్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం త‌రువాత ఒక్కసారిగా ప్రభుత్వం ఉలిక్కిపడింది. ఏ కంపెనీల వ‌ల‌న అయితే ఎక్కువ ప్రమాదాలు జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయో ఆ కంపెనీలను ఆన్ సైట్ యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సూచించాయి. ఆ ఆన్ సైట్ యాక్షన్ ప్లాన్ అమ‌లు చేసే బాధ్యతను కూడా ఆ కంపెనీల‌కే అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్పటివరకు అది అమల్లోకి రాలేదు.

ఏపీ, తెలంగాణ కి అప్పుల తిప్పలు!

దీంతోపాటు కంపెనీల యాజ‌మాన్యాల నిర్లక్ష్యం కూడా త‌రుచుగా ప్రమాదాలు సంభవించడానికి కార‌ణంగా తెలుస్తోంది. దాదాపు రెండు నెల‌ల లాక్ డౌన్ స‌మ‌యంలో అన్ని కంపెనీలు కూడా మూత‌ప‌డ్డాయి. ఆ సమ‌యంలో కంపెనీల్లో పర్యవేక్షణ కరువవడం కూడా ఈ వ‌ర‌స ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం విష‌యంలో ఇదే మ‌న‌కు స్పష్టమైంది. ప్రభుత్వం లాక్ డౌన్ స‌మ‌యంలో కంపెనీ పర్యవేక్షణ కోసం ఉద్యోగుల‌కు ప్రత్యేక అనుమతులు ఇచ్చినా కంపెనీ యాజ‌మాన్యం నిర్లక్ష్య దోర‌ణితో దాదాపు 12 మందిని పొట్టనబెట్టుకుంది. లాక్ డౌన్ విధించిన‌ప్పుడు ఎటువంటి ప్లానింగ్ లేదో లాక్ డౌన్‌ ను స‌డ‌లించిన‌ప్పుడు కూడా ప్రభుత్వాలు అటువంటి జాగ్రత్తలు తీసుకోవక‌పోవ‌డమే కార‌ణంగా కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే ఫ్రభుత్వాలు కూడా ఏదైనా సంఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు హ‌డావిడి చేయ‌డం… త‌రువాత క్రమేపి వాటిని ప‌ట్టించుకోక‌పోవ‌డం వ‌ల‌న ఇలాంటి ప్రమాదాలకు కార‌ణ‌మ‌వుతుంది. వాస్తవానికి భోపాల్ ఘ‌ట‌న త‌రువాత ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చినా… వాటిని క్షేత్రస్థాయిలో అమ‌లు మాత్రం అంతంత మాత్రంగా ఉంటుంది.

ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల దోపిడీకి అంతేలేదా?


విద్యా వ్యాపారమైంది.. లక్షల ఫీజులు కడితేనే పిల్లలను చదివించే దుస్థితి దాపురించింది. ప్రభుత్వ విద్య మిథ్య అయిన వేళ ప్రైవేటు విద్య పెను భారమైంది. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల దోపిడీని అరికట్టే నాథుడే లేకుండాపోయారు. ప్రభుత్వం పట్టించుకోదు.. అసోసియేషన్లు దృష్టిసారించవు.. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు ఇంతటి కరోనా టైంలోనూ దోపిడీని మూడు పువ్వులు.. ఆరు కాయలుగా కొనసాగిస్తున్నాయి..

కరోనా లాక్ డౌన్ తో విద్యావ్యవస్థ మార్చి చివరి వరకే నిలిచిపోయింది. అప్పటికే అన్ని ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఒక సంవత్సరం ఫీజును లాగేశాయి. అది పరీక్షల టైం కావడంతో అందరూ కట్టేశారు. కానీ ఎప్పుడైతే కరోనా లాక్ డౌన్ విధించారో.. అప్పటి నుంచి పాపం ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లకు జీతాలు కట్ చేశాయి ప్రైవేట్ యాజమాన్యాలు.. ఇదెక్కడి దుర్మార్గం అని వారంతా బయటపడలేక నిస్సహాయంగా రోదిస్తున్నారు.

అసలు ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లకు జరుగుతున్న ఈ దోపిడీని అటు అసోసియేషన్లు, ఇటు ప్రభుత్వమూ పట్టించుకోవడం లేదు. వారేమో ఉద్యోగం పోతుందని అభద్రతతో అడగడం లేదు. దీంతో మార్చి నుంచి ఇప్పటిదాకా అసలు జీతాలే లేకుండా కుటుంబం గడవక వారంతా అష్టకష్టాలు పడుతున్నారు.

కరోనా వేళ కూడా ఇలా పీక్కుతింటారా?

ప్రస్తుతం కరోనాతో స్కూళ్లు, కాలేజీలన్నీ మూతపడ్డాయి. ఇప్పట్లో తెరిచే ఆలోచన లేదు. దీంతో ఈ జూన్ లో ఈ ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు కొత్త ఎత్తుగడ వేశాయి. ఆన్ లైన్ క్లాసులంటూ పాఠాలను జూమ్ యాప్ లో వినిపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఎక్స్ ట్రా ఫీజులు ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నాయి. అయితే వసూలు చేస్తున్న ఈ ఫీజుల నుంచి టీచర్లకు, లెక్చరర్లకు మాత్రం ఇవ్వడం లేదు.

కర్ణాటక రాష్ట్రంలోనూ ఇలానే ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్ల బాధలు తీర్చేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులంతా కలిసి వాలంటీర్ గా నడుం బిగించారు. వారంతా రూ.32 కోట్లను చందాలుగా వసూలు చేశారు. ఈ టైంలో జీతాలు లేకుండా ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ టీచర్స్ దరఖాస్తు చేసుకుంటే వారికి ఆర్థిక సాయం చేస్తున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో అలాంటి చొరవ మచ్చుకైనా లేదు.

తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు టీచర్స్ ను, లెక్చరర్ల పరిస్థితి దుర్భరం అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందరికీ 5వేలు, 10వేల రూపాయలు ఇస్తూ వారిని ఆర్థికంగా దోచుకుంటున్నాయి ప్రైవేట్ యాజమాన్యాలు. కనీస వేతనాలు అస్సలు ఇవ్వడం లేదు. పైగా ఫ్లోర్ లకు ఫ్లోర్ లు ఉన్న పెద్ద పెద్ద బిల్డింగులు ఎక్కిస్తూ.. క్యాంపస్ లు తిప్పుతూ వారిని పీల్చి పిప్పి చేస్తూ ఉదయం నుంచి రాత్రి దాకా పాఠాలు చెప్పిస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సంవత్సరం మొత్తం ఫీజును ఇప్పటికే ప్రైవేట్ యాజమాన్యాలు వసూలు చేశాయి. 20 నుంచి 30 ఏళ్లుగా వారితో వెట్టి చాకిరీ చేయించుకున్న ప్రైవేట్ యాజమాన్యాలు ఇలాంటి కరోనా టైంలో టీచర్లు, లెక్చరర్లను అర్థాంతరంగా రోడ్డున పడేయడం ఎంతవరకు సమంజసమని వారంతా ప్రశ్నిస్తున్నారు. వాళ్ల సంక్షేమం ప్రైవేట్ యాజమాన్యాలకు ఎందుకు పట్టదన్నది ప్రశ్న. వీరి విషయంలో ప్రైవేట్ టీచర్ల సంఘాలు.. లేబర్ కమీషన్లు, మానవ హక్కుల సంఘాలు ఎందుకు ఏం చేయడం లేదు.?

ఇప్పటికే తెలుగురాష్ట్రాల్లో నాలుగు నెలలుగా జీతాలు లేక యాజమాన్యాలు తీసేసిన లెకర్చర్లు, టీచర్లు చాలా మంది పొట్టకూటి కోసం గ్రామాలకు వెళ్లి వ్యవసాయమో.. లేక చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. చదివిన చదువుకు.. చేస్తున్న వృత్తికి సంబంధం లేకుండా అష్టకష్టాలు పడుతున్నారు. ఈ మొత్తం ప్రైవేట్ దందాలో ఫీజుల పేరిట దోచుకుంటున్న యాజమాన్యాలు.. టీచర్లకు, లెక్చరర్లకు మాత్రం పైసా విదిల్చకపోవడం దారుణమని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వాలు, సంఘాలు స్పందించాల్సిన అవసరం ఉంది.

-ఎన్నం

రాష్ట్రానికి భారీ మొత్తంలో అప్పు ఆఫర్ ఇచ్చిన ట్రస్ట్..

Andhrapradesh Map
లెక్కకు మించిన సంక్షేమ పథకాలు, కరోనా నేపథ్యంలో అదాయం పడిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధికంగా కుదేలయ్యింది. అయినప్పటీకీ జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ ప్రజల ఖాతాల్లో రూ. వేల కోట్లను జమ చేస్తుంది. ఫలితంగా ఉద్యోగుల జీతాలు చెల్లించలేని దుస్థితికి ప్రభుత్వం చేరుకుంది. గడచిన మూడు నెలల్లో రూ.15 వేల కోట్లు అప్పులను రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. గత ఏడాదిలో రూ.77 వేల కోట్లు అప్పటు చేసింది. దీంతో జగన్ అధికారంలోకి వచ్చిన అనంతరం రూ.92 వేల కోట్ల మేర అప్పులు చేసినట్లు ఆర్ధిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. చంద్రబాబు అధికారంలో ఉండగా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ప్రస్తుత అర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అసెంబ్లీలో ఆరోపించారు. ఇప్పడు ఇంత పెద్దమొత్తంలో అప్పులు చేయడంపై ప్రతిపక్షాలు దుమ్మెతిపోస్తున్నాయి.

ఏపీ, తెలంగాణ కి అప్పుల తిప్పలు!

కేంద్రం నుంచి అరకొరగా మాత్రమే నిధులు అందుతుండటంతో అప్పుల వేటలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి అమెరికాలోని ఓ ట్రస్ట్ శుభవార్త చెప్పింది. భారీ మొత్తంలో అప్పు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈ ట్రస్టు రూ.లక్ష కోట్ల వరకూ అప్పు మంజూరు చేసేందుకు నిర్వాహకులు సిద్ధంగా ఉండటంతో… ప్రభుత్వం ఆపద కాలంలో ట్రస్ట్ నుంచి ఏలాగైనా అప్పు తీసుకోవాలని చర్యలు చేపట్టింది. విదేశీ సంస్థ కావడంతో అప్పు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఇటీవల కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన కలిసి వేడుకున్న అంశం ఈ అప్పునకు సంబంధించిందేననే విషయం బయటకు వచ్చింది. నిర్మల మాత్రం పరిశీలిస్తామని మాత్రమే చెప్పారట, అనుమతి ఇస్తామని స్పష్టమైన హామీ ఇవ్వలేదని సమాచారం. బుగ్గన ఢిల్లీ వెళ్లిన రహస్యం బయట పడటంతో ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇంత పెద్దమొత్తంలో అప్పు తీసుకోవడం రాష్ట్రానికి మంచిది కాదని భవిష్యత్తులో ముప్పు పొంచి ఉందని వాదనలు వినిపిస్తున్నాయి.

అమెరికా ట్రస్ట్ ఇచ్చే రూ.లక్ష కోట్ల అప్పులో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి భారీ మొత్తంలో కేటాయింపులు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.67 వేల కోట్లు ఇందుకు కేటాయించాలని, మరో 14 వేల కోట్లు పట్టణ ప్రాంతాల అభివృద్ధి, మరో 14 వేల కోట్లు వైద్య సదుపాయాల అభివృద్ధికి కేటాయించనున్నారనే వాధనలు వినిపిస్తున్నాయి. 4 శాతం వడ్డీతో 40 ఏళ్ల వ్యవధిలోగా అప్పు తీర్చేందుకు అవకాశాన్ని ట్రస్టు రాష్ట్ర ప్రభుత్వానికి కల్పించింది. మరోవైపు రాష్ట్రానికి అప్పులు ఇచ్చేందుకు దేశీయ భ్యాంకులు, సంస్థలు పెద్దగా ఆశక్తి చూపడం లేదు. ఇంధుకు కారణం కొన్నేళ్లుగా రాష్ట్ర బడ్డెట్ లో మూలధన వ్యయానికి కేటాయింపులు భారీగా తగ్గిపోవడం, సంక్షేమ పథకాలకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడంలో ఈ పరిస్థితి నెలకొంది.

జగన్ పట్టుదల.. టెక్ దిగ్గజం ఏపీకి..

ఇంత పెద్దమొత్తంగా రాష్ట్రానికి అప్పు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన అమెరికా ట్రస్ట్ ఇందుకు ఓ మెలిక పెట్టింది. కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తేనే అప్పు ఇస్తామని చెప్పడంతో రాష్ట్ర ఆర్దిక శాఖ మంత్రి బుగ్గన ఈ విషయాన్ని ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రిని విన్నవించి సాయం చేయాలని కోరారు. హామీ ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుందా అనేది ఇప్పుడు సందేహంగా మారింది. ఇందుకు జాతీయ స్థాయిలో ఉన్న చట్టాలు, రిజర్వు బ్యాంక్ నిభందనలకు అనుకూలంగా ఉంటేనే అప్పు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. కరొనా కాలంలో ఇంత పెద్ద మొత్తంలో రాష్ట్రానికి అప్పు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన సంస్థ వివరాలు ఇంకా బయటకు వెళ్లడి కాలేదు. ఈ అంశం మాత్రం జాతీయ స్థాయిలోనే చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక పూర్వాపరాలు, ప్రవేటు ట్రస్ట్ గురించి కేంద్రం ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది.