
కరోనా వైరస్ సోకిన రోగుల పట్ల వైసీపీ ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతుంది ప్రతిపక్ష టీడీపీ. ప్రచార ఆర్భాటమే కానీ, క్షేత్రస్థాయిలో అన్నీ లోపాలే అని వీడియోలను ప్రదర్శిస్తూ…సోషల్ మీడియా వేదిక తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఐసొలేషన్ వార్డులలో కరోనా రోగులకు వైద్యం మరియు సౌకర్యాల విషయంలో ప్రభుత్వ పనితీరు సరిగా లేదని వారు ఆరోపిస్తున్నారు. శుభ్రత లేని ఇసోలేషన్ వార్డులు కంపుగొడుతున్నాయట. రోగుల కొరకు ఏర్పాటు చేసిన స్నానపు గదులు, మరుగు దొడ్ల నిర్వహణ సరిగా లేదని, ఒకే స్నానపు గదిని ఎక్కువ మంది కరోనా రోగులు ఉపయోగించాల్సి వస్తుందని ఆరోపిస్తున్నారు. ఆహారం విషయంలో కూడా రోజుకు ప్రభుత్వం నుండి రూ. 500 ప్రభుత్వం చెల్లిస్తుండగా, నాసిరకం ఆహారం అందిస్తున్నారని రోగులు వాపోతున్నారట.
ఆనంతో… రఘురామ్, ఏం జరుగుతుంది జగన్ ?
ప్రభుత్వం అందిస్తున్న ఆహారం తినలేని వారు, బయటనుండి తెప్పించుకోవాల్సి వస్తుందని, దానికి కూడా అక్కడ సిబ్బంది మామూళ్లు వసూలు చేస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. ఐసొలేషన్ వార్డులలో చికిత్స తీసుకుని ఆరోగ్యంగా బయటికి వచ్చిన కరోనా బాధితులు, అలాగే ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న రోగులకు సంబంధించిన ఆరోపణల వీడియోలు పంచుకుంటూ టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగుతున్నారు. ప్రభుత్వం చెవుతున్న దానికి వాస్తవాలకు పొంతన లేదని వారు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు మాజీ మంత్రి లోకేష్ కరోనా రోగుల పట్ల ప్రభుత్వం తీరు అమానుషం అంటున్నారు.
ఇప్పుడు ఆ కాపునేతలు ఏం సమాధానం చెబుతారు..?
వేలల్లోకి చేరుకున్న కరోనా రోగులకు సౌకర్యాలు అందజేయడం ప్రభుత్వాలకు ఇబ్బందిగా మారింది. తెలంగాణాలో సైతం వరంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసొలేషన్ వార్డులో అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలకు సంబంధించిన వీడియో ఒకటి బయటికి వచ్చింది. ఏపీలో కూడా సిబ్బంది, మౌళిక వసతుల కొరత ఇలాంటి పరిస్థితికి కారణం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో జులై 12వరకు 29,168 మంది కరోనా బారిన పడగా…15,412 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. 13,428 మంది రోగులు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ప్రతిపక్షాల విమర్శల సంగతి ఎలా ఉన్నా, క్షేత్రస్థాయిలో వాస్తవిక పరిస్థితులు తెలుసుకొని ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని అందరూ భావిస్తున్నారు.