
రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు తెలుగు హీరో కాదు, నేషనల్ వైడ్ గా స్టార్ డమ్ ఉన్న నేషనల్ స్టార్ అని ‘రాధేశ్యామ్’ ఫస్ట్ లుక్ చాటి చెప్పింది. సోషల్ మీడియా గత రికార్డ్స్ మొత్తాన్ని షేక్ చేసి.. అసలైన పాన్ ఇండియా స్టార్ గా రెబల్ స్టార్ ప్రభాస్ ను నిలబెట్టింది. ఇక ‘రాధే శ్యామ్’ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరనేది షూట్ ప్రారంభించిన రోజు నుంచీ సస్పెన్స్ ఉన్నా, తమిళానికి చెందిన యువ స్వరకర్త జస్టిన్ ప్రభాకరన్ సినిమాలో ఒక మాస్ ట్రాక్ కు సంగీతం అందించబోతున్నాడని తెలుస్తోంది.
ప్రభాస్ కోసం పూజా హెగ్డే క్లాసికల్ డాన్స్ !
ఇప్పటికే ప్రభాకరన్ ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ కూడా ప్రారంభించాడని.. టీజర్ కోసం అదిరిపోయే మాస్ బిట్ రెడీ చేయబోతున్నాడని టాక్. టీజర్ లో మ్యూజిక్ బిట్ కి ఫ్యాన్స్ నుండి వచ్చే ఆదరణను బట్టి, ప్రభాకరన్ కు ఈ సినిమా నేపథ్య సంగీతం ఇవ్వాలా వద్దా అని నిర్ణయిస్తారట. అన్నట్లు ఈ ప్రభాకరన్ ఎవరో కాదు, విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ కి మ్యూజిక్ అందించిన టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్.
రంగంలోకి కేటీఆర్.. కరోనా విమర్శలకు చెక్
ఇక ఈ సినిమా కరోనా కారణంగా కొంత షూట్ మిగిలి ఉండగానే, జార్జియాలో షూటింగ్ జరుపుతూ మధ్యలోనే ఇండియాకు తిరిగివచ్చేసిన సంగతి తెలిసిందే. మిగిలిన బ్యాలెన్స్ పార్ట్ షూట్ కోసం మళ్లీ జార్జియా వెళ్లాలంటే కష్టం గనుక, రామోజీ ఫిల్మ్ సిటీలోనే జార్జియా నేపథ్యం కనబడేలా భారీ సెట్ ను వేస్తున్నారు. మరో నెల రోజుల్లో ఈ సెట్ పూర్తి కానుంది.
ఈ సినిమాని గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా ‘జిల్’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రాధాకృష్ణ దర్సకత్వంలో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రబాస్ సరసన టాల్ బ్యూటీ పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తోంది.