బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ హీరోగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో రానున్న లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ విడుదల పై గత కొన్ని రోజులుగా అనేక రూమర్స్ అయితే వస్తున్నాయి కానీ, అసలు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే క్లారిటీ మాత్రం లేదు. అయితే మొదట ఏప్రిల్ 10నే రిలీజ్ చేయాలనుకున్నా.. కరోనా మహమ్మారి రాకతో సినిమా రిలీజ్ ఆపక తప్పలేదు. కాగా తాజాగా ఈ సినిమాని ఓటిటీలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని.. ప్రముఖ ఓటిటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ నుండి ఈ బయోపిక్ కి భారీ ఆఫర్ వచ్చిందని.. కరోనా అనంతరం నేరుగా థియేటర్స్ లో రిలీజ్ చేసినా అప్పుడున్న పరిస్థితులను బట్టి సినిమా టాక్ ను బట్టే రెవిన్యూ ఉంటుంది కాబట్టి..
బాలీవుడ్‌ను వదలని విషాదాలు… ఇద్దరు నటులు మృతి
అదే అమెజాన్ అయితే ఎలాంటి టెన్సన్స్ లేకుండా భారీ మొత్తంలో.. పైగా థియేటర్స్ రెంట్ అనే మరో అనవసరపు ఖర్చు కూడా లేకుండా భారీగా డబ్బులు వస్తున్నపుడు ఎందుకు ఓటిటీలో రిలీజ్ చెయ్యకూడదు అని మేకర్స్ ఆలోచనలో పడినట్లు బాలీవుడ్ మీడియాలో టాక్ నడుస్తోంది. నిజానికి అమెజాన్ ఆఫర్ రాకముందు అక్టోబర్ లాస్ట్ వీక్ లో ఈ బయోపిక్ ను డైరెక్ట్ గా థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సడెన్ గా మంచి ఆఫర్ రావడంతో ఈ బయోపిక్ నిర్మాత విష్ణు ఇందూరి ఓటిటీ పై ఆసక్తి కనబరుస్తునట్లు తెలుస్తోంది.
హాలీవుడ్ ఆఫర్ రిజెక్ట్ చేసిన హాట్ బ్యూటీ
ఇక ఈ బయోపిక్ తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో కింగ్ అక్కినేని నాగార్జున చేతుల మీదుగా తెలుగు ప్రేక్షుకుల ముందుకు రాబోతుండటంతో తెలుగులో కూడా ఈ బయోపిక్ పై మంచి క్రేజ్ ఉంది. కాగా ’83’ అనే టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రంలో 1983లో ఇండియా వరల్డ్ కప్ ను గెలుచుకునే క్రమంలో ఎదురుకున్న ఇబ్బందులు ఏమిటనే కోణంతో పాటు కపిల్ దేవ్ జీవితం గమనం, ఆయన సాధించిన విజయాల వివరాలు తాలూకు సంఘటనలు సినిమాలో ఉండనున్నాయి.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Ranveer singhs 83 to release directly on an ott platform
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com