YSRCP hawala case: ఏపీలో మద్యం కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ఒకవైపు పూర్తికాగా.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోవైపు రంగంలోకి దిగింది. హవాలా మూలాలను కనుక్కొని ప్రయత్నంలో ఉంది. అయితే తాజాగా నిందితుల ఇళ్లలో జరిపిన సోదాల్లో ఒక హవాలా నంబర్ కరెన్సీ నోటు ముక్క అధికారులకు దొరికినట్లు తెలుస్తోంది. దీని ఆధారంగా అనేక రహస్య లావాదేవీలపై ఈడి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ మద్యం కుంభకోణంలో హవాలా రూపంలో పెద్ద ఎత్తున నగదు మొత్తం చేతులు మారిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈడి ఎంట్రీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం చేపట్టిన విచారణలో కొంత వివరాలను తీసుకుంది ఈడి. ఈ వ్యవహారంలో ఏపీ బేవరేజెస్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి తో పాటు కీలక నిందితుడిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డిలను అరెస్టు చేసింది ఈడి. మరోవైపు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కుమార్ సైతం అరెస్టయ్యారు. అయితే ఆయనను విచారించే భాగంలో సునీల్ కుమార్ ఫోన్ ను పరిశీలించినప్పుడు ఒక కరెన్సీ నోటు ముక్క ఫోటోను ఒక నిర్దిష్ట నెంబర్ కు పంపినట్టు అధికారులు గుర్తించారు.
ఇక మరింత దూకుడుగా..
అయితే ఇప్పటివరకు మద్యం కుంభకోణం దర్యాప్తు ఒక ఎత్తు.. ఇకనుంచి మరో ఎత్తు అన్నట్టు సాగనుంది. ఈ హవాలా నోటు ముక్కతో దర్యాప్తు చేపట్టిన ఈడికి కళ్ళు బైర్లు కమ్యూనిజాలు బయటకు వచ్చాయి. ఈ హవాలా కుంభకోణం దాదాపు 195 కోట్ల రూపాయలు అని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది ఈడి. వైసీపీ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం సరఫరా కాంట్రాక్టును సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్, ప్రసాద్ ట్రాన్స్పోర్ట్ కు కట్టబెట్టారు. సిగ్మా సంస్థ నుంచి ఒళ్ళు సందీప్ కు చెందిన సుదర్శన్ కన్స్ట్రక్షన్ కు సబ్ కాంట్రాక్టు దక్కింది. అక్కడి నుంచి నిధులు సునీల్ కుమార్ కు చేరాయి అని ఈడి గుర్తించింది. ఈ నిధులను సునీల్ కుమార్ హవాలా ద్వారా దారి మళ్లించి ఆస్తులు కూడా పెట్టారని.. గత ఎన్నికల్లో భారీగా ఖర్చు చేశారని ఈడీ అనుమానిస్తోంది.
తిరుగులేని ఆధారం..
కేవలం హవాలా ద్వారా ఈ కేసులో భారీగా నగదు చేతులు మారిందన్న అనుమానంతోనే ఈడి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా దొరికిన ఈ నోటు ముక్క ఫోటో తో తిరుగులేని ఆధారం లభించినట్లు అయింది. ఈ ఫోటోను ఎవరికి పంపారు గుర్తిస్తే మరిన్ని ఆస్తులతో పాటు లావాదేవీల చిక్కుముడులు వీడనున్నాయి. సాధారణంగా హవాలా మార్గంలో బ్లాక్ మనీ బదిలీ చేయడానికి ఇలాంటి సగం కరెన్సీ నోటు ముక్కల ఫోటోలను టోకెన్లుగా ఉపయోగిస్తారు. మద్యం కుంభకోణంలో ఇలా బ్లాక్ మనీని హవాలా రూపంలో పంపించినట్లు ఈడి అనుమానించింది. ఆ అనుమానమే నిజం అయింది. ఈ వ్యవహారంలో మరింత లోతుగా విచారించేందుకు ఈడీ అధికారులు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు నోటీసులు జారీ చేశారు. అందుకు ఆయన ఈరోజు విచారణకు హాజరయ్యారు.

















దువ్వాడ టీం పెద్దదే!
Duvvada Srinivas: రాజకీయాల్లో ప్రచారం అనేది ఒక కీలక ఘట్టం. ప్రచారం లేకపోతే రాజకీయాల్లో రాణించలేరు కూడా. కేవలం ప్రచారం ద్వారా ఎదిగిన నేతలు చాలామంది ఉన్నారు. ఎదిగిన తర్వాతే ఈ ప్రచారం అంతగా అవసరం ఉండదు. అయితే ప్రచారం విషయంలో ఏ స్థాయిలో ముందుకు వెళ్లాలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురి జంటకు తెలిసినంతగా మరొకరికి తెలియదు. ఎందుకంటే నిన్న శ్రీకాకుళం జిల్లాలో ఆ జంట చేసిన హల్చల్ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఏ ఛానల్లో చూసిన వారే.. ఏ డిజిటల్ మీడియా ప్లాట్ ఫామ్ లో చూసిన వారే. అంతలా కుమ్మేశారు. ఒక పగడ్బందీ ప్రణాళికతో అడుగులు వేశారు.
* రోజంతా హైడ్రామా..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై గతంలో దువ్వాడ శ్రీనివాస్ చేసిన కామెంట్స్ పై పోలీసులు విచారణకు పిలిచారు. అయితే తన సహచరి మాధురి తో కలిసి విచారణకు హాజరయ్యారు దువ్వాడ. దాదాపు 8 గంటల పాటు దువ్వాడ శ్రీనివాస్ కు విచారించారు పోలీసులు. ఆ సమయంలో పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మాధురి ఉన్నారు. కానీ సాధారణ మీడియా జర్నలిస్టులతో పాటు పెద్ద ఎత్తున యూట్యూబర్లు చేరుకున్నారు అక్కడికి. దీనికి తోడు దువ్వాడ అనుచరుగణం వందల సంఖ్యలో అక్కడకు చేరుకోవడం ఆశ్చర్యం వేస్తోంది. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఇప్పుడు ఆయన ఏ పార్టీకి చెందని వ్యక్తి. అటువంటి నేత కోసం వందలాది మంది రావడం పక్కా ప్రణాళికని అర్థం అవుతోంది.
* సామాజిక వర్గ కోణంలో..
శ్రీకాకుళం జిల్లాలో ఒక సామాజిక వర్గం పెత్తనం సాగుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా… తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ సామాజిక వర్గం వారే ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. అయితే మరో ప్రధాన సామాజిక వర్గం ఇందుకు జీర్ణించుకోవడం లేదు. అందుకే ఆధిపత్యం ప్రదర్శిస్తున్న ధర్మాన, కింజరాపు ఫ్యామిలీలను టార్గెట్ చేస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్. దీంతో సొంత సామాజిక వర్గం అండదండలు ఆయనకు లభిస్తున్నాయి. అదే సమయంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు దువ్వాడ జంట. అందుకే యాక్టివిస్టులతో పాటు యూట్యూబర్లు దువ్వాడ జంట విషయంలో చాలా ఆసక్తి చూపుతుంటారు. అందుకే శ్రీకాకుళం జిల్లాలో మారుమూల గ్రామం గా ఉండే కొత్తూరులో సైతం వారు హల్చల్ చేయగలిగారు. 8 గంటల విచారణను రాష్ట్రస్థాయి అంశంగా మార్చగలిగారు.