Home Blog Page 82

శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి నుంచి గ్రీన్ సిగ్నల్ వెళ్లిందా..?

Srikanth Odela Chiranjeevi Movie
Srikanth Odela Chiranjeevi Movie

Srikanth Odela Chiranjeevi Movie: శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతున్న ‘ప్యారడైజ్’ సినిమా విషయంలో పలు రకాల ఆసక్తికరమైన విషయాలైతే వెలువడుతున్నాయి. శ్రీకాంత్ ఓదుల ఇంతకుముందు చేసిన దసర సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేశాడు. ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా అంతే వైవిధ్యంగా ఉంటుందనే ఉద్దేశ్యంతోనే ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. దసర తర్వాత ఆయన ప్యారడైజ్ సినిమాని ఎంచుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇది చాలా బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కబోతుంది. హీరో సైతం ఇందులో చాలా డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు. నాని ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే టాప్ హీరోగా మారిపోతాడు. టైర్ వన్ హీరోల లిస్టులో కూడా చేరిపోతాడు.

ఇక ఇలాంటి క్రమంలో ఇప్పుడు ఆయన నుంచి రాబోతున్న ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది. తనకు ఎలాంటి క్రేజ్ ను తీసుకువస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. నాని లాంటి హీరో ఈ మధ్యకాలంలో వరుసగా మాస్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నాడు. శ్రీకాంత్ సైతం నాని సినిమాను పూర్తి చేసిన తర్వాత చిరంజీవితో ఒక భారీ బడ్జెట్ సినిమాని తెరకెక్కించే అవకాశాలైతే ఉన్నాయి.

ఇప్పటివరకు శ్రీకాంత్ చేసిన ఈ రెండు సినిమాలకు భిన్నంగా చిరంజీవి సినిమా ఉండబోతుందట. ఇప్పటివరకు ఎవరు చూపించని రేంజ్ లో చిరంజీవిని చూపించడానికి తను సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. చిరంజీవిని ఆయన ఏ రేంజ్ లో చూపిస్తాడు. తద్వారా సినిమాతో భారీ విజయాన్ని సాధించి తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక రీసెంట్ గా చిరంజీవి సైతం శ్రీకాంత్ ఓదెలను కలిసి తన నెక్స్ట్ సినిమా నీతోనే చేస్తున్నానని క్లారిటి ఇచ్చారట.

దానికి తగ్గట్టుగానే ఈ సినిమా స్క్రిప్ట్ కి సంభందించిన పనులు మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది… ఇక అన్ని అనుకున్నట్టుగా జరిగితే శ్రీకాంత్ ఓదెల చిరంజీవిని చాలా వైల్డ్ గా చూపించడానికి సిద్ధమవుతున్నాడు. ఇక చిరంజీవి సైతం శ్రీకాంత్ ఓదెల అనుకున్నది అనుకున్నట్టుగా తీయగలిగితే మాత్రం ఇది ఒక భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ గా మిగులుతుందని ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…

మహేష్ బాబు ఆ ఒక్క విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చిందా..?

Mahesh Babu
Mahesh Babu

Mahesh Babu career: ప్రస్తుతం మహేష్ బాబు వారణాసి మూవీ చేస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఎలాగైనా సరే పెను సంచలనాలను క్రియేట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. మొత్తానికైతే ఈ సినిమాతో మహేష్ బాబు టాప్ హీరోగా మారుతాడు అనేది చాలా క్లారిటిగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పటివరకు మహేష్ బాబు వారణాసి సినిమా కోసం అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ముందుకు సాగుతున్నాడు. తనకు ఇష్టమైనప్పుడు ట్రిప్పులకు వెళ్తున్నాడు. తనకు అనుకూలమైన సమయంలోనే షూటింగ్లో పాల్గొంటున్నారనే వార్తలైతే వస్తున్నాయి.

ఇక ప్రస్తుతం రాజమౌళి వరుసగా కొన్ని షెడ్యూల్స్ ప్లాన్ చేశారట. దాంతో మహేష్ బాబు లాక్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ ఒక్క విషయంలో మాత్రం మహేష్ బాబు కాంప్రమైజ్ అవ్వక తప్పడం లేదు అంటూ అతని అభిమానులు సైతం భావిస్తున్నారు. ఎందుకంటే రిలీజ్ డేట్ ని ఆల్రెడీ అనౌన్స్ చేశారు కాబట్టి ఇప్పుడు వీలైనంత తొందరగా సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలి.

మధ్యలో టూర్స్, ట్రిప్పులు అనుకుంటూ తిరిగితే రోజులు సరిపోవు అనే ఉద్దేశ్యంతోనే రాజమౌళి సినిమా షూటింగ్ అయిపోయేంత వరకు ట్రిప్పులకు వెళ్లే ప్రసక్తి లేదు అన్నట్టుగా వరుసగా మూడు షెడ్యూల్స్ అయితే ప్లాన్ చేశారట. మరి వాటన్నింటిని ఉన్నాడు కాబట్టి వాటిని పూర్తి చేసిన తర్వాతే ఆయన సినిమా నుంచి రిలాక్స్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు లాంటి నటుడు యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచాడు.

అలాంటి నటుడు ఇప్పుడు ప్రపంచ స్థాయి ప్రేక్షకులను సైతం అలరించడానికి సిద్ధమవుతుండటం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి… చూడాలి మరి ఈ సినిమాతో రాజమౌళి ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తాడు అలాగే మహేష్ బాబు కెరియర్ లోనే భారీ విజయాన్ని సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…

ఎన్టీఆర్ - రామ్ చరణ్ ఇద్దరి మార్కెట్ కలిసినా ఆ స్టార్ హీరో రేంజ్ ను అందుకోలేకపోతున్నారా..?

NTR Ram Charan
NTR Ram Charan

NTR Ram Charan: పాన్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నారు. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టైర్ వన్ హీరోలైతే పెను సంచలనాలను క్రియేట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి నటులు ‘త్రిబుల్ ఆర్’ సినిమాలో కలిసి నటించి పెను సంచలనాన్ని క్రియేట్ చేశారు. ఈ సినిమాతో 1300 కోట్ల వరకు కలెక్షన్స్ కొల్లగొట్టారు. అయితే వీళ్ళిద్దరు కలిసిన కూడా ‘బాహుబలి 2’ సినిమా రికార్డు బ్రేక్ కాలేదు.

దాంతో వీళ్ళ ఇద్దరి మార్కెట్ కలిపి కూడా ప్రభాస్ అంత లేదు అంటూ గతంలో కొన్ని కామెంట్లు వ్యక్తం అయ్యాయి. ఇక దానికి తోడుగా ఇప్పుడు వీళ్ళు ఇండివిడ్యూయల్ గా సినిమాలు చేసినా కూడా వీళ్ళిద్దరూ 1000 కోట్ల కలెక్షన్స్ అయితే కొల్లగొట్టలేకపోతున్నారు. మార్కెట్ ను చూసిన ప్రతి ఒక్కరు అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొట్టాడు. కానీ జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో 600 కోట్ల మార్క్ ను మాత్రమే అందుకున్నాడు.

రామ్ చరణ్ గేమ్ చేంజర్, పెద్ది రెండు సినిమాలకు కలిపి 1000 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టాడు. ఒక రకంగా చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లకు అల్లు అర్జున్ అంత మార్కెట్ లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో ప్రభాస్ తో పోల్చిన అభిమానులు ఇప్పుడు అల్లు అర్జున్ తో పోల్చి మరి వాళ్లను తక్కువ చేసి మాట్లాడుతున్నారు.

ఇక రాబోయే సినిమాలతో పెను ప్రభంజనాలను క్రియేట్ చేసి రెండు వేల కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టగలిగితేనే వీళ్ళ మార్కెట్ పదిలంగా ఉంటుంది. లేకపోతే మాత్రం మరింత డౌన్ అయిపోయే అవకాశాలైతే ఉన్నాయి. అలాగైతే మాత్రం నెంబర్ వన్ రేస్ కోసం రామ్ చరణ్, ఎన్టీఆర్ పోటీపడే ప్రసక్తి కూడా లేకుండా పోతుంది…

ఇన్ స్టాగ్రామ్ లో సీఎం విజయ్ ని 'Unfollow' కొట్టిన త్రిష.. అసలు ఏమి జరుగుతోంది..

Trisha
Trisha

Trisha unfollows CM Vijay: గత కొంత కాలం నుండి సోషల్ మీడియా లో నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారిన జంట విజయ్ – త్రిష. తమిళనాడు రాజకీయాల్లో ఈ జంట సృష్టించిన ప్రభంజనం సాధారణమైనది కాదు. త్రిష బలవంతం వల్లే విజయ్ పార్టీ పెట్టాడని , అతని సీఎం అవ్వడానికి త్రిష లక్ కూడా బాగా కలిసొచ్చిందని , త్వరలోనే అధికారికంగా వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అంతే కాదు , ఈ జంట ‘అవును.. నిజమే.. మేమిద్దరం ప్రస్తుతం డేటింగ్ చేసుకుంటున్నాము’ అని పలు సందర్భాల్లో బహిరంగంగా చెప్పకనే చెప్పారు. అయితే గత వారం రోజుల నుండి విజయ్ తన భార్య సంగీత తో కలిసిపోతున్నాడని , కుటుంబ సభ్యులు వీళ్ళ మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను తొలగించారని , ఇలా రకరకాల వార్తలు ప్రచారం అయ్యాయి.

వీటిని అభిమానులు ముందు నమ్మలేదు కానీ, నిన్న విజయ్ పుట్టినరోజు సందర్భంగా త్రిష నుండి శుభాకాంక్షలు ట్వీట్ రాకపోవడంతో , వీళ్లిద్దరి మధ్య నిజంగానే గ్యాప్ ఏర్పడిందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దానికి తోడు విజయ్ ని త్రిష ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ‘Unfollow’ అయ్యిందంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమో కాదో తెలుసుకునేందుకు ఇన్ స్టాగ్రామ్ లో త్రిష ప్రొఫైల్ లోకి వెళ్లి ‘ఫాలోయింగ్’ లిస్ట్ చూస్తే అందులో విజయ్ పేరు లేదు. అంటే నిజంగానే త్రిష ‘Unfollow’ అయ్యిందా?, లేదా మొదటి నుండే విజయ్ ని ఆమె ఫాలో అవ్వడం లేదా?, దీని పై స్పష్టమైన క్లారిటీ లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కానీ వీళ్ళిద్దరిని మొదటి నుండి అనుసరిస్తున్న వాళ్ళు చెప్పేది ఏమిటంటే , అసలు విజయ్ ని త్రిష మొదటి నుండే ఫాలో అవ్వడం లేదు , ఆమె ‘Unfollow’ అయ్యిందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అంటున్నారు.

ఏది ఏమైనా మరోసారి విజయ్ – త్రిష కలిసి ఏదైనా పబ్లిక్ ఈవెంట్ లో కనిపించేంత వరకు వీళ్లిద్దరి మధ్య గ్యాప్ ఏర్పడింది అంటూ వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడే అవకాశం లేదు. ఇకపోతే త్రిష కెరీర్ ప్రస్తుతం పీక్ రేంజ్ లో కొనసాగుతోంది. రీసెంట్ గానే హీరోయిన్ గా నటించిన ‘కరుప్పు’ చిత్రం ఎంత పెద్ద కమర్షియల్ హిట్ గా నిల్చిందో అందరికీ తెలిసిందే.వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న సూర్య ని సక్సెస్ ట్రాక్ లోకి తీసుకొచ్చిన చిత్రమిది. ఇప్పుడు ఆమె హీరోయిన్ గా నటించిన లాంగ్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘విశ్వంభర’ చిత్రం విడుదల సిద్ధం అవ్వబోతుంది.

సమంత ప్రెగ్నన్సీ పై మెగాస్టార్ చిరంజీవి సంచలన ట్వీట్.. లీక్ చేసేశాడుగా!

Chiranjeevi tweet on Samantha
Chiranjeevi tweet on Samantha

Chiranjeevi tweet on Samantha: గత కొంతకాలంగా సోషల్ మీడియా లో సమంత పెగ్నన్సీ విషయం పై ఎలాంటి ప్రచారం జరుగుతూ వస్తుందో చూస్తూనే ఉన్నాం. రీసెంట్ గా ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం విడుదల సందర్భంగా , ప్రమోషన్స్ లో పాల్గొన్నప్పుడు నెటిజెన్స్ బేబీ బంప్ ని గమనించారు. దీనిపై అటు సమంత , ఇటు రాజ్ , ఇద్దరూ కూడా మౌనం గా ఉండడం తో , సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న వార్త నిజమే అని అనుకున్నారు నెటిజెన్స్. అయితే కాసేపటి క్రితమే మెగాస్టార్ చిరంజీవి వేసిన ట్వీట్ తో సమంత గర్భం దాల్చింది అనే విషయం నిర్ధారణ అయ్యింది. ‘చిరు లీక్స్’ అనేది ఇండస్ట్రీ లో ఎంత వైరల్ అయ్యిందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ, ఇలాంటి లీక్స్ గతం లో చిరంజీవి చాలానే ఇచ్చారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గానే చిరంజీవి ‘మా ఇంటి బంగారం’ మూవీ చూసారు. ఆయనకు సినిమా చాలా బాగా నచ్చింది , వెంటనే మూవీ టీం ని తన ఇంటికి రప్పించుకొని , కాసేపు వాళ్ళతో ముచ్చట్లు జరిపి , సన్మానం చేసి పంపించాడు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. నేడు ఈ చిత్రం గురించి చిరంజీవి ట్వీట్ వేస్తూ ‘ఇటీవలే మా ఇంటి బంగారం చిత్రాన్ని చూశాను . ఉమ్మడి కుటుంబ నేపథ్యం లో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో భావోద్వేగాలను అందంగా మేళవిస్తూ, వినోదాత్మకంగా తనదైన శైలిలో అద్భుతంగా తెరకెక్కించారు దర్శకురాలు నందిని రెడ్డి. సమంత నటన , ముఖ్యంగా చీరకట్టులో ఆమె చేసిన యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి. ఇలాంటి వైవిద్యభరితమైన మహిళా ప్రాధాన్యత కలిగిన చిత్రాలు మన సినీ పరిశ్రమకు అత్యంత అవసరం. ఈ సందర్భంగా మూవీ టీం మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు’ అంటూ చెప్పుకొచ్చాడు.

అదే విధంగా చివర్లో ‘వ్యక్తిగత జీవితం లో కొత్త అధ్యాయాన్ని ఆహ్వానిస్తున్న సమంత – రాజ్ దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు’ అంటూ చెప్పుకొచ్చాడు. కొత్త అధ్యాయం అంటే , కచ్చితంగా ఆయన సమంత ప్రెగ్నన్సీ గురించే పరోక్షంగా ప్రస్తావించాడని అంటున్నారు విశ్లేషకులు. ప్రాణాంతక వ్యాధితో పోరాడి , కనీసం నిలబడలేని స్థాయి నుండి , నేడు ఒక జీవానికి ఊపిరి పోసేంతలా ఎదిగిన సమంత ని చూసి ప్రతీ ఒక్కరు గర్వపడాలి , ఆమె జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అంటున్నారు. ఇకపోతే ఆమె నటించిన ‘మా ఇంటి బంగారం చిత్రం ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల గ్రాస్ మార్కుకి చాలా దగ్గరగా ఉంది. సోమవారం రోజున కూడా ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదు అవ్వడం గమనార్హం.

చిరంజీవి రెమ్యూనరేషన్ తగ్గించాడా..? కారణం ఏంటంటే..?

Chiranjeevi remuneration reduced
Chiranjeevi remuneration reduced

Chiranjeevi remuneration reduced: మెగాస్టార్ చిరంజీవి తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యంకానీ రీతిలో వరుస విజయాలను సాధించిన ఆయన ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా పెను సంచలనాలను క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించినప్పటికి చిరంజీవి తన రెమ్యూనరేషన్ ను కొంతవరకు తగ్గించాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. కారణం ఏంటంటే సినిమా బడ్జెట్లు విపరీతంగా పెరిగిపోతున్న క్రమంలో తన రెమ్యూనరేషన్ తగ్గించి ఆ డబ్బులను సినిమా బడ్జెట్ మీద కేటాయించాలని చిరంజీవి కోరుకుంటున్నాడట. సినిమాను గ్రాండియార్ గా తెరకెక్కించడానికి ఆ డబ్బులను వాడాలని ఆయన భావిస్తున్నాడు. నిజానికి చిరంజీవి తీసుకున్న ఈ నిర్ణయం చాలా గొప్పదని ప్రతి ఒక్కరు కీర్తిస్తున్నారు. హీరోలందరూ ఇలా చేస్తే ప్రొడ్యూసర్ల మీద బడ్జెట్ భారం పడే అవకాశాలైతే లేకుండా పోతాయి. మూవీ సక్సెస్ అయిన తర్వాత అందులో నుంచి ఎంతో కొంత వాటానైతే ప్రొడ్యూసర్లకు తిరిగి చెల్లిస్తారు. కాబట్టి హీరోలు మంచి కథల్ని ఎంచుకొని వాటిని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసే విధంగా జాగ్రత్తలు తీసుకుంటే హీరోలు సూపర్ సక్సెస్ లను సాధించిన వరవుతారు. అలాగే రెమ్యునరేషన్ కూడా ఆ తర్వాత భారీగా తీసుకున్నవారు అవుతారు…

ప్రస్తుతం చిరంజీవి బాబీ డైరెక్షన్లో చేస్తున్న సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నాడు. ఆయన జిమ్ లో కష్టపడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. 70 సంవత్సరాల పైబడిన వయసులో కూడా ఆయన అంతలా కష్టపడుతున్నడని అది చూస్తున్న ప్రతి ఒక్కరు అతన్ని ఆదర్శంగా తీసుకోవాలని భావిస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే మెగాస్టార్ ఫ్యాన్స్ మాత్రం తన గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. చిరంజీవి లాంటి నటులు ఈ ఏజ్ లో కూడా చాలా బాగా కష్టపడుతూ తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారంటూ వాళ్ళు కామెంట్స్ చేస్తుండడం విశేషం…

ఇప్పటివరకు చిరంజీవి చేసిన సినిమాలు కమర్షియల్ గా ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల వైపు కూడా తను అడుగులు వేస్తున్నాడు. అందులో భాగంగానే బాబీ సినిమాలో అతను 50 సంవత్సరాల పైబడిన వయసు గల వ్యక్తిగా కనిపించబోతున్నాడు…

టీమిండియా జెర్సీ వైభవ్‌ చేతికి.. ఆ క్షణాలు వైరల్‌.. జెర్సీ నంబర్‌ ఎంతో తెలుసా?

Vaibhav Team India jersey
Vaibhav Team India jersey

Vaibhav Team India jersey: భారత క్రికెట్‌ బోర్డు జూన్‌ 23, 2026న సోషల్‌ మీడియాలో ఒక వీడియోను విడుదల చేసింది. ఇందులో 15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ భారత జట్టు జెర్సీని స్వీకరించిన సన్నివేశాలు ఉన్నాయి. ఆ జెర్సీని ప్రముఖ థ్రోడౌన్‌ స్పెషలిస్ట్‌ రఘు అతని చేతికి అందించాడు. వైభవ్‌ ఆ క్షణంలో రఘు కాళ్లకు నమస్కరించి గౌరవం చూపించారు. బోర్డు ఆ వీడియోకు ‘‘లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌.. దేశం మొత్తం ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. వైభవ్‌ సూర్యవంశీ టీమ్‌ ఇండియా జెర్సీలో.. ఈ అద్భుతమైన క్షణాలను చూడండి’’ అని క్యాప్షన్‌ ఇచ్చింది.

వైభవ్‌ ఆనంద హేల…
వైభవ్‌ బ్యాట్‌ పట్టుకుని మొదటిసారి మైదానంలో అభ్యాసం చేసిన రోజు నుంచే భారత జట్టు జెర్సీ వేసుకోవాలని కలలు కంటున్నానని చెప్పాడు. ఆ కల నేడు నెరవేరిందని, తన క్రికెట్‌ ప్రయాణంలో ఒక ముఖ్యమైన దశ మొదలైందని అన్నాడు. ఆ సంతోషం మాటల్లో వర్ణించలేనంతగా ఉందని, ఇదంతా కలలాగా అనిపిస్తోందని, జెర్సీ చూసిన క్షణంలో సంతోషం పట్టలేకపోయానని, నవ్వు ఆగలేదని తన భావాలను పంచుకున్నాడు. కొన్ని సార్లు ఊహించని అద్భుతాలు జరుగుతాయని, అలాంటి సమయంలో ఎలా స్పందించాలో కూడా అర్థం కాదని అన్నాడు.

వైభవ్‌ సూర్యవంశీ నేపథ్యం
సూర్యవంశీ బీహార్‌కు చెందిన లెఫ్ట్‌హ్యాండ్‌ బ్యాట్స్‌మెన్‌. 2011 మార్చి 27న జన్మించాడు. ఇప్పుడు కేవలం 15 ఏళ్ల వయసులోనే సీనియర్‌ భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గల్లీ క్రికెట్‌ నుంచి ప్రారంభమైన అతని ప్రయాణం వేగంగా ఎదిగింది. 2025 మెగా వేలంలో రాయల్స్‌ అతన్ని రూ.1.1 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో అతి పిన్న వయసు ఆటగాడిగా అరంగేట్రం చేసి, అనేక రికార్డులు సృష్టించాడు.

రికార్డ్‌ బ్రేకింగ్‌ ప్రదర్శనలు ఇవీ..
2026 ఐపీఎల్‌ సీజన్‌లో రాయల్స్‌ తరఫున 16 ఇన్నింగ్స్‌లలో 776 పరుగులు చేసి ఆరెంజ్‌ క్యాప్‌ సాధించాడు. ఒక సెంచరీ, ఐదు అర్ధసెంచరీలు, 72 సిక్సర్లు కొట్టాడు. స్ట్రైక్‌ రేట్‌ 237.30గా నిలిచింది. ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత వేగంగా 1000 పరుగులు (440 బంతుల్లో) చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ప్లేఆఫ్‌లో 29 బంతుల్లో 97, 47 బంతుల్లో 96 పరుగులు చేశాడు. 2026 ప్రారంభంలో భారత అండర్‌–19 వరల్డ్‌ కప్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌గా నిలిచి, ఫైనల్‌లో ఇంగ్లండ్‌పై 80 బంతుల్లో 175 పరుగులు చేశాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన ట్రై–నేషన్‌ సిరీస్‌ ఫైనల్‌లో 29 బంతుల్లో 94 పరుగులు చేసి, లిస్ట్‌ అ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన ఫిఫ్టీ (11 బంతుల్లో) సాధించాడు. ఆ ప్రదర్శనతో భారత ఏ 66 పరుగుల తేడాతో విజయం సాధించింది.

నంబర్‌ 3 జెర్సీ ప్రత్యేకత…
వైభవ్‌కు బీసీసీఐ నంబర్‌ 3 జర్సీ కేటాయించింది. గతంలో హర్భజన్‌ సింగ్, సురేశ్‌ రైనా వంటి ఆటగాళ్లు ఈ నంబర్‌తో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. వారి రిటైర్మెంట్‌ తర్వాత ఇప్పుడు వైభవ్‌కు ఈ నంబర్‌ కేటాయించారు. అండర్‌–19 వరల్డ్‌ కప్‌ సమయంలో కూడా అతను నంబర్‌ 3 జెర్సీనే ధరించాడు.

రాబోయే టూర్‌లో అవకాశాలు..
ఐర్లాండ్, ఇంగ్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లకు వైభవ్‌ను ఎంపీక చేశారు. జూన్‌ 26, 28 తేదీల్లో బెల్‌ఫాస్ట్‌లో ఐర్లాండ్‌తో రెండు టీ20 మ్యాచ్‌లు, జూలై 1 నుంచి 11 వరకు ఇంగ్లాండ్‌తో ఐదు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. అతను ఓపెనింగ్‌లో అభిషేక్‌ శర్మతో కలిసి బ్యాటింగ్‌ చేయనున్నాడు. సీనియర్‌ భారత జట్టుకు ఎంపికైన అతి పిన్న వయసు ఆటగాడిగా(15 సంవత్సరాల 87 రోజులు) సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును బద్దలు కొట్టాడు. తుది జట్టులో చోటు ఖాయమని భావిస్తున్నారు. 2026 ఆసియన్‌ గేమ్స్‌కు కూడా అతని ఎంపిక ఉంది.

ఈ యువ సంచలనం ఇంకా చాలా ఎదగాల్సి ఉంది. అతని ప్రతిభ, ఆటగారి మనస్తత్వం, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి బీసీసీఐ జాగ్రత్తగా నిర్వహిస్తోంది. రాబోయే రోజుల్లో వైభవ్‌ ఎలా ప్రదర్శన ఇస్తాడో క్రికెట్‌ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Team India (@indiancricketteam)

కూలుతున్న మస్క్‌ కలల సౌధం.. స్పేస్‌ఎక్స్‌ షేర్ల పతనం..

SpaceX stock value drop
SpaceX stock value drop

SpaceX stock value drop: ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ సంపదను మూడు ట్రిలియన్‌ డాలర్లకు తీసుకెళ్లిన సంస్థ స్పేస్‌ ఎక్క్‌. ఇటీవల ఐపీవోలో భారీగా ఆదాయం సమకూరింది. దీంతో మస్క్‌ సంపద మూడు ట్రిలియన్‌ డాలర్లు దాటింది. ఇంత సంపద ఉన్న మొదటి వ్యక్తిగా మస్క్‌ చరిత్ర సృష్టించారు. అయితే గత మూడు రోజుల్లో కంపెనీ వాటాలు క్షీణిస్తున్నాయి. దీంతో మొత్తం మార్కెట్‌ విలువలో 600 బిలియన్‌ డాలర్లకు మించిన నష్టం నమోదైంది. ఒక్క సోమవారం రోజునే 16 శాతం వరకు విలువ పడిపోయింది. ప్రస్తుతం సంస్థ మార్కెట్‌ విలువ రెండు ట్రిలియన్‌ డాలర్లకు అధికంగా ఉంది.

బాండ్‌ ఆఫర్‌ ప్రకటనతో పతనం..
భారీగా రుణాలు సేకరించేందుకు ఉన్నత గ్రేడ్‌ బాండ్లను విక్రయించే ప్రణాళికను సంస్థ వెల్లడించిన తర్వాత పెట్టుబడిదారులు అప్రమత్తులయ్యారు. దీంతో వాటాల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఇది ప్రారంభ ఉత్సాహం తగ్గిన తర్వాత సాధారణంగా కనిపించే మార్పును చూపుతుంది.

పబ్లిక్‌ ఇష్యూ అనంతర ర్యాలీ..
రికార్డు స్థాయిలో జరిగిన పబ్లిక్‌ ఇష్యూ పూర్తయిన వెంటనే వాటాలు గణనీయంగా పెరిగాయి. ప్రారంభ ధర 135 డాలర్లుగా ఉండగా కొద్ది రోజుల్లోనే 60 శాతం వృద్ధి కనిపించింది. అయితే 20 బిలియన్‌ డాలర్ల బాండ్‌ ఆఫర్‌కు సంబంధించిన వార్తలు వచ్చిన తర్వాత అమ్మకాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఈ సంస్థ మార్కెట్‌ విలువ ప్రకారం ప్రపంచంలో ఆరో అతిపెద్ద సంస్థగా నిలిచింది.

కొనుగోలు చేయాలనుకున్నవారు తమ వాటాలను సంపాదించుకున్నారు. ప్రస్తుతం అమ్మకందారుల ప్రభావం ఎక్కువగా ఉంది. ఇది పబ్లిక్‌ కంపెనీల్లో తరచు కనిపించే అస్థిరతను సూచిస్తుంది. ఐపీవో తర్వాత వచ్చిన రుణ సేకరణ చర్య కంపెనీ వృద్ధికి అవసరమైనప్పటికీ, ఈక్విటీ పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

త్రివిక్రమ్ ఆ కథను వెంకటేష్ కోసం రాసుకున్నాడా..? మరి ఆ స్టార్ హీరో దగ్గరికి ఎలా వెళ్ళింది..

Trivikram wrote story for Venkatesh
Trivikram wrote story for Venkatesh

Trivikram wrote story for Venkatesh: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మాటల మాంత్రికుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్… కెరియర్ మొదట్లో రైటర్ గా తన మార్క్ ఏంటో చూపించాడు. స్టార్ హీరోలందరికి మంచి విజయాలను అందించిన ఆయన ఆ తర్వాత దర్శకుడిగా మారి తనకంటు ఒక క్రేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు…టాప్ హీరోలతో సినిమాలను చేసి టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు. తను రైటర్ గా ఉన్నప్పుడు వెంకటేష్ తో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి సినిమాలకు కథలను అందించాడు. అవి సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇక మన్మధుడు సినిమా కథని కూడా మొదట వెంకటేష్ కోసమే రాసుకున్నాడట. కానీ అనుకోకుండా నాగార్జునకి ఆ కథ నచ్చడం ఆయన ఆ కథను తీసుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ నాగార్జున కి ఆ కథను ఇచ్చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది దర్శకులు స్టార్ హీరోలకు సూపర్ సక్సెస్ లను అందించారు. కానీ త్రివిక్రమ్ మాత్రం అటు రైటర్ గా, ఇటు దర్శకుడిగా హీరోలకు సూపర్ సక్సెస్ లను కట్టబెడుతూనే ఉన్నాడు.

ఇక ఇప్పుడు వెంకటేష్ కు భారీ సక్సెస్ ని అందించాలనే ఉద్దేశంతో ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమాని చేస్తున్నాడు. మొదటిసారి వెంకటేష్ ను డైరెక్షన్ చేస్తున్నప్పటికి ఈ సినిమా మీద భారీ బజ్ అయితే ఉంది. ఇక ఇంతకుముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు తో గుంటూరు కారం సినిమా చేశాడు. ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయినప్పటికి ఆయన క్రేజ్ తగ్గలేదు.

మరి ఆదర్శ కుటుంబం సినిమాతో మరోసారి సంచలనాన్ని క్రియేట్ చేయగలుగుతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో ఒక భారీ బడ్జెట్ సినిమా చేయటానికి కూడా సన్నాహాలు చేసుకుంటున్నాడు… ఇక ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా బడ్జెట్ దాదాపు 1000 కోట్ల వరకు ఉండబోతుందట.

మరి అంత మొత్తంలో త్రివిక్రమ్ మీద బడ్జెట్ పెట్టడం సరైనదేనా అలాగే జూనియర్ ఎన్టీఆర్ అంత మార్కెట్ ఉందా అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలు వ్యకతమవుతున్నాయి… ఇక దీనికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ రావాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

అసెంబ్లీ లో స్టాలిన్ ని ఉతికి ఆరేసిన సీఎం విజయ్.. దెబ్బకు పరార్.. వీడియో వైరల్..

CM Vijay viral assembly video
CM Vijay viral assembly video

CM Vijay viral assembly video: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మొట్టమొదటిసారి అసెంబ్లీ లో తన వైపు నుండి తీవ్ర స్వరం వినిపించాడు. ఎన్నికల ప్రచారం లో కూడా చాలా సాఫ్ట్ తోనే ప్రసంగాలు ఇచ్చిన విజయ్, ఒక్కసారి గా ఇలా అసెంబ్లీ లో ప్రత్యార్థులపై అవ్వడం అందరినీ షాక్ కి గురించి చేసింది. విజయ్ దెబ్బకు DMK పార్టీ నేతలు అసెంబ్లీ నుండి వాకౌట్ అవ్వడం, చివర్లో విజయ్ ఒక కుట్టి స్టోరీ అంటూ స్టాలిన్ ని అనుకరించి మ్యానిరిజం చేయడం హైలైట్ గా నిల్చిన అంశం. సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ వీడియోనే చక్కర్లు కొడుతోంది.ఇంతకీ స్టాలిన్ కి విజయ్ ఇచ్చిన కౌంటర్ ఏంటంటే,’ఒక ఊర్లో పెద్దాయన కళ్ళు కనపడక,కంటి మీద చెయ్యి వేసి చూస్తూ ఉంటాడు. పక్కనే ఉన్న ఒక కుర్రాడు ఏమి వెతుకుతున్నారు అని అడుగుతాడు. ఇక్కడ మీ నాన్న ఉంటాడని చెప్పారు, అందుకే చూస్తున్నాను, ఎక్కడ మీ నాన్న?, అసలు కనపడట్లేదే?’ అంటూ విజయ్ స్టాలిన్ ని ఒక రేంజ్ లో ర్యాగింగ్ చేసాడు.

ఈ సార్వత్రిక ఎన్నికల్లో మాజీ సీఎం స్టాలిన్, తన సొంత స్థానం కొలత్తూరులో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆయన కుమారుడు ఉదయ్ నిధి స్టాలిన్ మాత్రం గెలిచాడు. ప్రస్తుతం ఆయన అసెంబ్లీ లో ప్రతిపక్ష పార్టీ లీడర్ గా కొనసాగుతున్నాడు.విజయ్ ఈ ఎన్నికల్లో స్టాలిన్ కి ఎదురైన పరిస్థితి ని వెక్కిరిస్తూ, ఆయన మ్యానరిజం ని సినిమాటిక్ స్టైల్ లో అనుకరించడం ఆయన అభిమానులకు విజువల్ ఫీస్ట్ లాగ అనిపించింది.గతం లో ఉదయ్ నిధి స్టాలిన్ అసెంబ్లీ లో సీఎం విజయ్ పై పాలు విమర్శలు చేశాడు. కానీ విజయ్ వైపు నుండి ఎలాంటి కౌంటర్ రాలేదు. సీఎం అయ్యాక విజయ్ ఇంత సైలెంట్ అయిపోయాడేంటి అని ఆయన అభిమానులు కూడా నిరాశ చెందారు. అలాంటి సమయం లో విజయ్ ఈ రేంజ్ కౌంటర్ ఇవ్వడం తో సంబరాలు చేసుకుంటున్నారు. ఇక మీదట కూడా ఇదే రేంజ్ కౌంటర్లు విజయ్ నుండి రాబోతున్నాయి.

బాలయ్య - కొరటాల శివ కాంబో లో ఇప్పటికే ఒక మూవీ రావాల్సిందా..? ఎలా ఆగిపోయిందంటే..?

Balakrishna
Balakrishna

Balakrishna Koratala Siva movie: నందమూరి నటసింహం బాలయ్య బాబు నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉంటాయి. ఇక ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఆయన ఆ సినిమాని రూపొందించి సూపర్ సక్సెస్ లను సాధిస్తుంటాడు. ఇక ఈ క్రమంలోనే కమర్షియల్ సినిమాల వైపు అడుగులు వేస్తున్న బాలయ్య వరుస సినిమాలతో సక్సెస్ లను సాధిస్తున్నాడు. ఇంతకుముందు కొరటాల శివ డైరెక్షన్లో చేసిన ‘అఖండ 2’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా ఆ సినిమాతో ఆయన పెను ప్రభానాజన్ని క్రియేట్ చేయగలిగాడు. ఇక ఇదిలా ఉంటే బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా గ్లింప్స్ రీసెంట్ గా బాలయ్య బర్త్ డే రోజున రిలీజ్ చేశారు.

ఆ గ్లింప్స్ చూస్తేనే ఆ సినిమా ఏ లెవెల్లో ఉండబోతుంది అనేది అందరికీ అర్థమైంది. ఇక ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తుంది. కొరటాల శివ కాంబినేషన్ లో రాబోయే సినిమా భారీ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఉండబోతుందట. ఇక ఎమోషనల్ సన్నివేశాలకు కూడా ఈ సినిమాలో పెద్దపీట వేస్తున్నట్టుగా తెలుస్తుంది.

గతంలో బాలయ్య – కొరటాల శివ కాంబినేషన్లో ఒక సినిమా రావాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఇక మొత్తానికైతే ఇప్పుడు బాలయ్య – కొరటాల కాంబినేషన్ అనేది ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ కాంబినేషన్ ఎలాంటి ప్రభంజనాలను క్రియేట్ చేస్తుంది. ప్రేక్షకళకు పూనకలు తెప్పించే విధంగా ఈ మూవీ ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

బోయపాటి – బాలయ్య కాంబినేషన్ కి ఎంత క్రేజ్ ఉందో ఇప్పుడు కొరటాల శివ – బాలకృష్ణ కాంబినేషన్ కి అంతకు మించిన క్రేజ్ దక్కుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఇప్పటికే కొరటాల స్క్రిప్ట్ పనులు మొత్తం పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది…

కల్కి 2 బడ్జెట్ ను భారీగా పెంచేశారా..?ఇలా అయితే కష్టమేనా..?

Kalki 2 budget increased
Kalki 2 budget increased

Kalki 2 budget increased: సినిమా ఇండస్ట్రీలో వారసత్వం ఉన్నంత మాత్రాన సక్సెస్ లు సాధిస్తాం అనుకుంటే మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ టాలెంట్ ఉన్నవాళ్లు మాత్రమే ఎక్కువ కాలం పాటు హీరోలుగా కొనసాగుతారు. వాళ్లకు మాత్రమే మంచి అవకాశాలు దక్కుతాయి. గొప్ప సబ్జెక్టులతో సినిమాలను చేసి సూపర్ సక్సెస్ గా నిలిపిన వాళ్లకు మాత్రమే ఇక్కడ ఎక్కువ అవకాశాలైతే వస్తాయి. ఇక అలాంటి హీరోలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఇక టైర్ వన్ హీరోల లిస్టులో ఉన్న హీరోలందరు ఇప్పుడు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు. కల్కి సినిమాతో ప్రభాస్ భారీ విజయాన్ని సాధించిన విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమాకి సీక్వెల్ గా కల్కి 2 కూడా రాబోతుందంటు అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమాని ఇప్పటివరకు సెట్స్ మీదకి తీసుకెళ్లలేదు. ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ, స్పిరిట్ అనే రెండు సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాలు పూర్తయిన తర్వాత ‘కల్కి 2’ సినిమాను సెట్స్ మీదకి తీసుకొచ్చే ఆలోచనలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఉన్నాడు…

ఇక మొదటి పార్ట్ కోసం 500 కోట్ల వరకు బడ్జెట్ ని కేటాయిస్తే రెండో పార్ట్ కోసం దాదాపు 700 కోట్ల వరకు బడ్జెట్ ను కేటాయించాల్సిన అవసరమైతే ఏర్పడిందట.మొత్తానికైతే ఈ సినిమాకి బడ్జెట్ ను భారీగా బడ్జెట్ ని పెంచేశారు అంటూ ప్రేక్షకులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా కల్కి 2 సినిమా భారీ విజయాన్ని సాధిస్తేనే పెట్టిన బడ్జెట్ తో పాటు ప్రాఫిట్స్ కూడా వస్తాయి.

అంతకుమించిన వసూలను రాబడుతుంది. లేకపోతే మాత్రం చాలావరకు డీలాపడిపోయే ప్రమాదమైతే ఉంది. తను అనుకున్నట్టుగానే ప్రభాస్ ఈ సినిమాతో టాప్ రేంజ్ లోకి వెళ్తాడా? నాగశ్విన్ మరోసారి ఈ సినిమాతో పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేసి 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టగలుగుతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

సాయి కృష్ణ కేసు.. సిఐ నాగరాజు అరెస్ట్!

CI Nagaraju arrest
CI Nagaraju arrest

CI Nagaraju arrest: ఏపీ రాజకీయాల్లో సాయి కృష్ణ అనే యువకుడి అదృశ్యం కేసు పెద్ద దుమారమే రేపింది. దీనిని కాపుల అంశం గా మార్చాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భావించింది. కానీ సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించి బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. సమగ్ర దర్యాప్తు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజు పై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. అయితే తాజాగా సిఐ నాగరాజును ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అరెస్టు చేశారు. తొలుత సిఐ నాగరాజు పై సస్పెన్షన్ వేటు వేశారు. తరువాత కేసులు నమోదు చేశారు. ఇప్పుడు ఏకంగా అరెస్టు చేశారు. అయితే సిఐ నాగరాజుకు మద్దతుగా కృష్ణలంక ప్రజలు భారీ ఆందోళనకు దిగారు. అయినా సరే ఇది రాష్ట్రస్థాయి అంశంగా మారడంతో విచారణలో భాగంగా సిఐ నాగరాజును అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తర్వాత కోర్టులో హాజరు పరిచే అవకాశం కూడా ఉంది.

రాజకీయాంశంగా వైసిపి..
సాయి కృష్ణ అదృశ్యం కేసును వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుగా వెలుగులోకి తెచ్చింది. కాపు యువకుడు ఈ కేసును నీరుగార్చుతున్నారని వైసీపీ ఆరోపించింది. జగన్మోహన్ రెడ్డి సైతం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అయితే సీఎం చంద్రబాబు బాధిత కుటుంబాన్ని సచివాలయానికి పిలిపించి మాట్లాడారు. సాయి కృష్ణ తల్లిని ఓదార్చారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం ఈరోజు సిఐ నాగరాజును అదుపులోకి తీసుకుంది. సాయి కృష్ణ లాకప్ డెత్.. దహనం చేశారంటూ అతడి తల్లి విజయలక్ష్మి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అందుకే కృష్ణలంకలోని స్వర్గపురి స్మశాన వాటికలో సిబ్బంది నుంచి పడమట సీఐ పవన్ కిషోర్ వివరాలను సేకరించారు. మరోవైపు సిఐ నాగరాజుకు మద్దతుగా స్థానికులు పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. చర్యలు వద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సీఐ నాగరాజును అరెస్టు చేసే క్రమంలో అడ్డుకునే ప్రయత్నం చేశారు. అదనపు బలగాల సాయంతో నాగరాజును అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది.

సమగ్ర దర్యాప్తు..
మరోవైపు సాయి కృష్ణ అదృశ్యం మిస్టరీ పై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలించారు. అయితే ఇప్పటికే ఆ ఫుటేజ్ తీసేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు దర్యాప్తులో సీఐ నాగరాజు ఏం చెబుతారు? ఎటువంటి సంచలన విషయాలు వెల్లడిస్తారు? అనేది చర్చనీయాంశం అయ్యింది. తదుపరి పరిణామాలు ఏంటనే దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

వైసీపీకి హవాలా దెబ్బ!

YSRCP hawala case
YSRCP hawala case

YSRCP hawala case: ఏపీలో మద్యం కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ఒకవైపు పూర్తికాగా.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోవైపు రంగంలోకి దిగింది. హవాలా మూలాలను కనుక్కొని ప్రయత్నంలో ఉంది. అయితే తాజాగా నిందితుల ఇళ్లలో జరిపిన సోదాల్లో ఒక హవాలా నంబర్ కరెన్సీ నోటు ముక్క అధికారులకు దొరికినట్లు తెలుస్తోంది. దీని ఆధారంగా అనేక రహస్య లావాదేవీలపై ఈడి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ మద్యం కుంభకోణంలో హవాలా రూపంలో పెద్ద ఎత్తున నగదు మొత్తం చేతులు మారిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈడి ఎంట్రీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం చేపట్టిన విచారణలో కొంత వివరాలను తీసుకుంది ఈడి. ఈ వ్యవహారంలో ఏపీ బేవరేజెస్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి తో పాటు కీలక నిందితుడిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డిలను అరెస్టు చేసింది ఈడి. మరోవైపు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కుమార్ సైతం అరెస్టయ్యారు. అయితే ఆయనను విచారించే భాగంలో సునీల్ కుమార్ ఫోన్ ను పరిశీలించినప్పుడు ఒక కరెన్సీ నోటు ముక్క ఫోటోను ఒక నిర్దిష్ట నెంబర్ కు పంపినట్టు అధికారులు గుర్తించారు.

ఇక మరింత దూకుడుగా..
అయితే ఇప్పటివరకు మద్యం కుంభకోణం దర్యాప్తు ఒక ఎత్తు.. ఇకనుంచి మరో ఎత్తు అన్నట్టు సాగనుంది. ఈ హవాలా నోటు ముక్కతో దర్యాప్తు చేపట్టిన ఈడికి కళ్ళు బైర్లు కమ్యూనిజాలు బయటకు వచ్చాయి. ఈ హవాలా కుంభకోణం దాదాపు 195 కోట్ల రూపాయలు అని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది ఈడి. వైసీపీ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం సరఫరా కాంట్రాక్టును సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్, ప్రసాద్ ట్రాన్స్పోర్ట్ కు కట్టబెట్టారు. సిగ్మా సంస్థ నుంచి ఒళ్ళు సందీప్ కు చెందిన సుదర్శన్ కన్స్ట్రక్షన్ కు సబ్ కాంట్రాక్టు దక్కింది. అక్కడి నుంచి నిధులు సునీల్ కుమార్ కు చేరాయి అని ఈడి గుర్తించింది. ఈ నిధులను సునీల్ కుమార్ హవాలా ద్వారా దారి మళ్లించి ఆస్తులు కూడా పెట్టారని.. గత ఎన్నికల్లో భారీగా ఖర్చు చేశారని ఈడీ అనుమానిస్తోంది.

తిరుగులేని ఆధారం..
కేవలం హవాలా ద్వారా ఈ కేసులో భారీగా నగదు చేతులు మారిందన్న అనుమానంతోనే ఈడి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా దొరికిన ఈ నోటు ముక్క ఫోటో తో తిరుగులేని ఆధారం లభించినట్లు అయింది. ఈ ఫోటోను ఎవరికి పంపారు గుర్తిస్తే మరిన్ని ఆస్తులతో పాటు లావాదేవీల చిక్కుముడులు వీడనున్నాయి. సాధారణంగా హవాలా మార్గంలో బ్లాక్ మనీ బదిలీ చేయడానికి ఇలాంటి సగం కరెన్సీ నోటు ముక్కల ఫోటోలను టోకెన్లుగా ఉపయోగిస్తారు. మద్యం కుంభకోణంలో ఇలా బ్లాక్ మనీని హవాలా రూపంలో పంపించినట్లు ఈడి అనుమానించింది. ఆ అనుమానమే నిజం అయింది. ఈ వ్యవహారంలో మరింత లోతుగా విచారించేందుకు ఈడీ అధికారులు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు నోటీసులు జారీ చేశారు. అందుకు ఆయన ఈరోజు విచారణకు హాజరయ్యారు.

ఇటాలియన్ స్పోర్ట్స్ కార్ల డిజైన్.. అల్యూమినియం ఫ్రేమ్..ఏంటి మామ ఈ ఫోన్ ఇలా ఉంది.. ఎప్పుడొస్తుందంటే..

Infinix smartphone
Infinix smartphone

Infinix smartphone: కొత్తగా మొబైల్ కొనే సమయంలో వినియోగదారులు తమకు అనుగుణంగా ఉండేలా ఫీచర్లు ఉన్న వాటిని ఎంచుకుంటున్నారు. ఇదే సమయంలో డిజైన్ గురించి కూడా ఆరా తీస్తున్నారు. ఇలాంటి వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని ప్రముఖ మొబైల్ కంపెనీ ఇన్‌ఫినిక్స్ (Infinix) బ్రాండ్ నుండి సరికొత్త, ప్రీమియం లుక్ కలిగిన నోట్ 60 ప్రో 5G పినిన్‌ఫారినా లిమిటెడ్ ఎడిషన్ ను భారత మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. ప్రసిద్ధ ఇటాలియన్ లగ్జరీ కార్ డిజైనింగ్ సంస్థ ‘పినిన్‌ఫారినా’ భాగస్వామ్యంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇన్‌ఫినిక్స్ ప్రత్యేకంగా రూపొందించింది. ఈ సరికొత్త సూపర్ కార్ ఇన్‌స్పైర్డ్ మొబైల్ గురించిన పూర్తి వివరాల్లోకి వెళితె..

Infinix నుంచి వచ్చే ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాలAMOLED డిస్‌ప్లేతో ఉంటుంది. ఇది1.5K రిజల్యూషన్ తో పనిచేస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉన్న ఈ మొబైల్ గరిష్టంగా 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. అలాగే స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ని ఉపయోగించారు. ఈ ఫోన్ వెనుక భాగంలో కెమెరా పక్కన ఒక ‘యాక్టివ్ మ్యాట్రిక్స్ సెకండరీ డిస్‌ప్లే’ కూడా ఉంటుంది.

ఈ ఫోన్ యొక్క ప్రధాన ఆకర్షణ దీని డిజైన్. ఇటాలియన్ స్పోర్ట్స్ కార్ల శైలిని ప్రతిబింబించేలా దీని వెనుక ప్యానెల్‌కు ‘కార్బన్ ఫైబర్ ఫినిషింగ్’ (Carbon Fibre Finish) ఇచ్చారు. దీని చుట్టూ 360 డిగ్రీల ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్, కెమెరా మాడ్యూల్ చుట్టూ రెడ్ కలర్ యాక్సెంట్లు ఫోన్‌కు మరింత లగ్జరీ లుక్‌ను ఇస్తాయి.

ఇన్‌ఫినిక్స్ నోట్ 60 ప్రో పినిన్‌ఫారినా ఎడిషన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్‌ను అమర్చారు. గేమింగ్ కోసం ఉపయోగించినప్పుడు ఫోన్ వేడెక్కకుండా ఇందులో ‘3D ఐస్‌కోర్ వీసి కూలింగ్’ చాంబర్ ఉంది. అలాగే 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా వైడ్ లెన్స్ ఉన్నాయి. 13MP సెల్ఫీ కెమెరాను అందించారు. ఈ రెండు కెమెరాల ద్వారా 4K వీడియోలను రికార్డ్ చేయవచ్చు.

బ్యాటరీ పరంగా ఈ ఫోన్ చాలా బలంగా ఉంది. ఇందులో 6500mAh భారీ బ్యాటరీని అందించారు. దీనికి తోడు 90W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 30W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత XOS 16 సాఫ్ట్‌వేర్‌పై నడుస్తుంది. కంపెనీ దీనికి 3 సంవత్సరాల మేజర్ ఓఎస్ అప్‌గ్రేడ్‌లు మరియు 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లను గ్యారెంటీ ఇస్తోంది.

సాధారణ ఇన్‌ఫినిక్స్ నోట్ 60 ప్రో (8GB+256GB) ధర ప్రస్తుతం రూ. 33,999 గా ఉంది. అయితే, ఈ పినిన్‌ఫారినా ఎడిషన్ కేవలం 12GB RAM + 256GB స్టోరేజ్ సింగిల్ వేరియంట్‌లోనే, ప్రీమియం డిజైన్ మరియు లగ్జరీ యాక్సెసరీలతో వస్తుండటంతో దీని ధర సుమారు రూ. 36,999 లేదా అంతకంటే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ ప్రత్యేకమైన పినిన్‌ఫారినా ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ జూన్ 24, 2026 న మధ్యాహ్నం 12 గంటలకు భారతదేశంలో అధికారికంగా విడుదల కానుంది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం Flipkart తో పాటు ఇన్‌ఫినిక్స్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ మొబైల్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

పాకిస్తాన్‌పై గర్జించిన 19 బ్రహ్మోస్‌ మిస్సైళ్లు.. ఆపరేషన్‌ సిందూర్‌ భారత్‌ సత్తా!

19 BrahMos missiles
19 BrahMos missiles

19 BrahMos missiles: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో 2025 ఏప్రిల్‌ 22న ఉగ్రవాదులు పర్యాటకులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. దీనికి ప్రతిగా మే నెలలో భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టింది. ఈ సైనిక చర్య భారతదేశ భద్రతా విధానంలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలిచింది. టెర్రరిజం సవాళ్లకు బలమైన స్పందనగా ఈ ఆపరేషన్‌ చేపట్టబడింది. ఈ ఆపరేషన్‌లో కచ్చితమైన క్షిపణి దాడులు చేసింది భారత్‌.

వివరాలు తెలిపిన అర్నబ్‌ గోస్వామి..
రిపబ్లిక్‌ టీవీ సీఈవో అర్నబ్‌ గోస్వామి ఈ ఆపరేషన్‌లో భారత్‌ 19 బ్రహ్మోస్‌ క్షిపణులను పాకిస్తాన్‌ లక్ష్యాలపైకి ప్రయోగించినట్లు తెలిపారు. ఇది మే 6వ తేదీ అర్ధరాత్రి సమయంలో జరిగినట్లు వివరించారు. రాజకీయ నాయకత్వం దృఢమైన నిర్ణయం వల్లే ఇది సాధ్యమైందని అభిప్రాయపడ్డారు. ఆ సందర్భంలో ఉన్న ప్రేక్షకులు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు చప్పట్లతో అభినందనలు తెలిపారన్నారు.

బ్రహ్మోస్‌ క్షిపణుల ప్రాముఖ్యత..
బ్రహ్మోస్‌ అనేది అత్యంత వేగవంతమైన సూపర్‌సోనిక్‌ క్షిపణి. దీని కచ్చితత్వం, వేగం, శక్తి దాడులను సమర్థవంతంగా చేయడంలో కీలకంగా పనిచేసింది. ఈ ప్రయోగం భారత రక్షణ సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచం ముందు చాటింది. ఇటువంటి ఆధునిక ఆయుధాలు శత్రు రక్షణలను అధిగమించి లక్ష్యాలను చేరుకోగలవని నిరూపించాయి.

రాజకీయ సంకల్పం..
అర్నబ్‌ గోస్వామి వ్యాఖ్యలు ఈ ఆపరేషన్‌ వెనుక ఉన్న రాజకీయ సంకల్పాని హైలైట్‌ చేస్తాయి. టెర్రరిజంపై జీరో టాలరెన్స్‌ విధానం ఈ చర్యలో స్పష్టంగా కనిపించింది. ఇది భారత సైనిక సామర్థ్యం మాత్రమే కాకుండా, నాయకత్వం నిర్ణయాత్మకతను కూడా ప్రతిబింబిస్తుంది. అయితే, ఇటువంటి చర్యలు ద్వైపాక్షిక సంబంధాలను ప్రభావితం చేస్తాయి, ప్రాంతీయ భద్రతా సమతుల్యతను మార్చగలవు. మీడియా వ్యక్తులు ఈ సంఘటనలను వివరించడం ద్వారా జాతీయ గర్వం పెంపొందుతుంది. అదే సమయంలో, ఇటువంటి వివరణలు సమతుల్యమైన చర్చకు దారితీస్తాయి.

మొత్తంగా, ఆపరేషన్‌ సిందూర్‌ భారత రక్షణ సంసిద్ధతను, ఆధునిక ఆయుధ వ్యవస్థల ప్రభావాన్ని ప్రపంచానికి చాటిన మైలురాయిగా నిలుస్తుంది.

మెట్రో చర్చలు సానుకూలం.. మీడియా కథనాలు విరుద్ధం.. పాపం రేవంత్‌!

Hyderabad Metro expansion
Hyderabad Metro expansion

Hyderabad Metro expansion: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకారం కావాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆశిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న నేపథ్యంలో కేంద్రం నుంచి రుణాలు, ఆర్థిక సహాయం ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని టార్గెట్‌ చేశారు. అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, రుణాలు ఇవ్వొద్దని చెబుతున్నారని, తాను అడిన వెంటనే అడ్డు పుల్ల వేస్తున్నాడని విమర్శలు చేస్తూ వస్తున్నారు. తనతో కేంద్రం వద్దకు రావడం లేదని ఆరోపించారు. హైదరాబాద్‌ మెట్రో రైలు ఫేజ్‌–1ను ఏప్రిల్‌ 2026లో రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌అండ్‌డీకంపెనీ నుంచి స్వాధీనం చేసుకున్న తర్వాత, దాని రీఫైనాన్సింగ్‌ కోసం ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌ఎఫ్‌సీ) నుంచి రూ.13,600 కోట్ల రుణం విడుదల కావాల్సి ఉంది.

కేంద్రానికి వినతులు..
ఈ రుణం ఆలస్యంతో అదనపు వడ్డీ భారం రాష్ట్రం, ఐఆర్‌ఎఫ్‌సీపై పడుతోందని రేవంత్‌ రెడ్డి ఇటీవల కేంద్ర బీజేపీ నాయకులను సంప్రదించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌ రెడ్డిని రాష్ట్ర సమస్యల్లో ఇన్వాల్వ్‌ చేయడానికి రేవంత్‌ రెడ్డి లేఖలు రాశారు. కిషన్‌ రెడ్డి ఈ అభ్యర్థనను సానుకూలంగా స్వీకరించి, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ ఏర్పాటు చేశారు.

భేటీలో ఏం జరిగింది…?
సోమవారం న్యూఢిల్లీలోని రైల్‌ భవన్‌లో రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డి కలిసి అశ్విని వైష్ణవ్‌ను సుమారు రెండు గంటల పాటు కలిశారు. ఈ సమావేశంలో హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌–1 రుణ విడుదల, ఫేజ్‌–2 విస్తరణ (సుమారు 123 కిలోమీటర్లు, విమానాశ్రయం, బయటి ప్రాంతాలను అనుసంధానించే ప్రణాళిక, అంచనా వ్యయం రూ38,595 కోట్లు వరకు), సంబంధిత అనుమతులపై వివరంగా చర్చ జరిగింది. రేవంత్‌ రెడ్డి ప్రకారం, అన్ని అధికారిక ప్రక్రియలు పూర్తి చేసినట్లు వివరించారు. ఐఆర్‌ఎఫ్‌సీ రుణం ఆలస్యం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చర్చించారు. రేవంత్‌ రెడ్డి భేటీ తర్వాత మీడియాకు మాట్లాడుతూ, ‘‘అశ్విని వైష్ణవ్‌తో చర్చలు సానుకూలంగా జరిగాయి. రేపు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌తో కూడా భేటీ ఉంది’’ అని తెలిపారు. కిషన్‌ రెడ్డి ఈ విషయంపై వ్యాఖ్యానించలేదు.

మీడియాలో వ్యతిరేక కథనాలు..
ఈ భేటీని అధికారికంగా సానుకూలంగా చూసిన మీడియా సంస్థలు ఎక్కువగా ఉన్నాయి. అవి రాష్ట్ర–కేంద్ర సహకారం, మెట్రో విస్తరణ ద్వారా ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారం, అభివృద్ధి ప్రాధాన్యతను హైలైట్‌ చేశాయి. అయితే బీఆర్‌ఎస్‌కు మద్దతుతో నడిచే ఒక మీడియా వాయిస్‌ మాత్రం ఈ సమావేశాన్ని పూర్తిగా భిన్నంగా చిత్రీకరించింది. ఆ నివేదికలో కేంద్ర మంత్రి రేవంత్‌రెడ్డిని తీవ్రంగా విమర్శించారని, కిషన్‌రెడ్డి ముందస్తు ప్రణాళికతో ఆయనను అక్కడికి తీసుకెళ్లి తిట్టించాడని పేర్కొన్నారు. ఇతర మీడియా సంస్థలన్నీ సానుకూలంగా కవర్‌ చేసినప్పటికీ, ఈ ఒక్కటి అసహనం, విద్వేషంతో నిండిన వివరణ ఇచ్చింది. ఇలాంటి వ్యత్యాసం రాజకీయ పక్షపాతం కారణంగా ఏర్పడిందని విమర్శలు వస్తున్నాయి.

చర్చల్లో చొచ్చి చూసినట్లే..
బీఆర్‌ఎస్‌ మీడియా కథనం పరిశీలిస్తే.. చర్చలు జరిగిన సమావేశ మందిరంలో తానూ ఉన్నట్లుగా కథనం వండి వాచ్చింది. అంతర్గత సమాచారం ఎలా లభించిందనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. భేటీలో పాల్గొన్న ముగ్గురు నాయకులు మాత్రమే తెలుసుకోగలిగే విషయాలను ఇతరులు ఎలా తెలుసుకున్నారు? కేవలం సంచలనం కోసమే ఈ కథనం రాశారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రాజకీయ అవసరాల కోసం రాసినట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ భేటీ ద్వారా రాష్ట్ర–కేంద్ర సమన్వయం మెరుగుపడి, హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ సమస్యలు తగ్గి, పౌరులకు మెరుగైన రవాణా సౌకర్యాలు లభించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఈ వివరాలు ఇటీవలి అధికారిక ప్రకటనలు, మీడియా నివేదికల ఆధారంగా తెలుస్తోంది.