Home Blog Page 84

కెరియర్ స్టార్టింగ్ లో లారెన్స్ మాస్టర్ ను తొక్కేసిన కొరియోగ్రాఫర్ ఎవరో తెలుసా..?

Raghava Lawrence Career
Raghava Lawrence Career

Raghava Lawrence Career: ఒక సినిమా సక్సెస్ అవ్వడానికి కథ ఎంత కీలకమో దర్శకుడు దానిని ప్రజెంట్ చేసిన విధానం అంతకంటే ముఖ్యమైనది. ఇక ఈ క్రమంలోనే 24 క్రాఫ్ట్స్ లో ఉన్న ప్రతి ఒక్కరు సినిమా మీద ప్రాణం పెట్టి వర్క్ చేసినప్పుడు మాత్రమే ఆ సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధిస్తాయి. ఇక ఇలాంటి క్రమంలోనే హీరోలు డాన్సులు ఫైట్లలో కూడా తమ సత్తా చాటుకోవాల్సిన అవసరమైతే ఉంది. కొరియోగ్రాఫర్లు హీరోలకు డిఫరెన్స్ స్టెప్పులను కంపోజ్ చేస్తున్నారు. హీరోలు సైతం వాళ్ళని వాళ్ళు డిఫరెంట్ గా ప్రజెంట్ చేసుకోవడానికి ఎలాంటి కష్టతరమైన స్టెప్పులు అయినా సరే వేసి ప్రేక్షకులను వాళ్ళ అభిమానులను ఎంటర్టైన్ చేయడమే వాళ్ళ లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు విపరీతమైన డ్యాన్సులు వేస్తూ ప్రేక్షకుల్లో ఒక క్రేజ్ ను క్రియేట్ చేశాడు. తనకి కొరియోగ్రఫీ చేయడానికి చాలామంది కొరియోగ్రాఫర్లు ఆసక్తి చూపించేవారు. ముఖ్యంగా రాఘవ లారెన్స్ మాస్టర్ సైతం చిరంజీవి చేత చాలా విభిన్నమైన స్టెప్పులు వేయించాడు.

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సైడ్ డాన్సర్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేశాడు. ఇక లారెన్స్ తను ఏ సినిమా హీరో షూటింగ్ కి వెళ్తే అక్కడ ఆ హీరోలతో మాట్లాడుతూ తనకు ఏదైనా అవకాశం ఉంటే ఇప్పించాలని అడిగేవారట. ఇక ఈ విషయం ప్రభుదేవా వాళ్ల ఫాదర్ అయిన సుందరం మాస్టర్ కి తెలియడంతో తను కంపోజ్ చేసే సాంగ్స్ కి లారెన్స్ ని డాన్సర్ గా పిలిచేవాడు కాదట. ఒక రకంగా లారెన్స్ ను తొక్కెయ్యాలనే ప్రయత్నం చేశాడట.అప్పట్లో వాళ్ళిద్దరి మధ్య కొంతవరకు దూరమైతే పెరిగిందట.

ఇక ఆ తర్వాత లారెన్స్ తన సొంత టాలెంట్ తో టాప్ కొరియోగ్రాఫర్ గా మారిన తర్వాత సుందరం మాస్టర్ కి లారెన్స్ కి మధ్య చాలా మంచి సన్నిహిత సంబంధాలైతే కుదిరాయట.ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో సక్సెస్ ఉన్నవాళ్లకు మాత్రమే వాల్యూ ఉంటుంది. సక్సెస్ లో లేని వారిని ఎవరు పట్టించుకోరు… ప్రస్తుతం లారెన్స్ మాస్టర్ నటుడిగా, కొరియోగ్రాఫర్ గా డైరెక్టర్ గా పలు విభాగాల్లో రాణిస్తూ ముందుకు సాగుతున్నాడు…

రాజమౌళి మహాభారతంలో ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రలేంటో రివీల్ చేసిన విజయేంద్రప్రసాద్...

Vijayendra Prasad
Vijayendra Prasad

Vijayendra Prasad: దర్శక ధీరుడు రాజమౌళి ఏ సినిమా చేసినా కూడా అదో పెను సంచలనంగా మారుతుంది. ఇప్పటివరకు ఆయన చేసిన 12 సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో వారణాసి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక దీంతో పాటుగా ఆయన తన తదుపరి సినిమా విషయంలో కూడా చాలా కీలకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతాన్ని తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా చేయబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి…

అయితే మహాభారతంలో చాలా గొప్ప క్యారెక్టర్లు ఉంటాయి. కాబట్టి వాళ్లందర్నీ పోట్రే చేయడానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి నటులు సరిపోరు. ఇతర భాషల హీరోలను కూడా తీసుకోవాలనే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తుంది. నిజానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లు టాప్ లో ఉన్నారు. అయితే వీళ్ళ నలుగురి కోసం క్యారెక్టర్ లను డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది…

మరి ఈ నలుగురు ఏ పాత్రలో కనిపించబోతున్నారు. మహాభారతంలో వీళ్ళు కనిపించే ఆ నాలుగు పాత్రలేంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజమౌళి వాళ్ళ తండ్రి అయిన విజయేంద్రప్రసాద్ దీని మీద చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. ఆయన చెప్పిన మాటలను బట్టి చూస్తే ఈ నలుగురు హీరోల్లో మహేష్ బాబు కృష్ణుడిగా, ప్రభాస్ కర్ణుడిగా, రామ్ చరణ్ అర్జునుడిగా, ఎన్టీఆర్ దుర్యోధనుడి పాత్రలో కనిపించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలీదు గానీ మొత్తానికైతే ఈ క్యారెక్టర్లలో మన హీరోలు కనిపిస్తే మాత్రం వాళ్ళ అభిమానుల ఆనందానికి అవధులు ఉండవనే చెప్పాలి. ప్రతి ఒక్కరు వారి పాత్రల్లో జీవించడానికి చాలావరకు వాళ్లకు ఆస్కారమైతే దక్కుతుంది…చూడాలి మరి నిజంగానే మన స్టార్ హీరోలు ఈ పాత్రల్లో కనిపించి మెప్పిస్తారా లేదా అనేది…

లైఫ్ ఇచ్చిన చిరంజీవి మాట కూడా పట్టించుకోని లారెన్స్..? మ్యాటరేంటంటే..?

Chiranjeevi Raghava Lawrence Controversy
Chiranjeevi Raghava Lawrence Controversy

Chiranjeevi Raghava Lawrence Controversy: తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత 50 సంవత్సరాల నుంచి ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు దూసుకెళ్తున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి…ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటుంది. ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను రాబడుతుంది. ప్రతి సినిమా విషయంలో ఆయన ఏదో ఒక వైవిధ్యాన్ని చూపిస్తూ ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ఎంతోమందికి ఇండస్ట్రీలో లైఫ్ ని ఇచ్చాడు. రాఘవ లారెన్స్ కి అయితే చిరంజీవి వల్లే చాలా మంచి లైఫ్ దొరికింది. అతను కొరియోగ్రాఫర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత పెద్దగా అవకాశాలు లేనప్పుడు చిరంజీవి తను చేస్తున్న హిట్లర్ సినిమాలోని అభిబి అనే సాంగ్ ను అతని చేత కొరియోగ్రఫీ చేయించాడు. ఆ సాంగ్ పెద్ద హిట్ అవ్వడంతో లారెన్స్ టాప్ కొరియోగ్రాఫర్ గా మారిపోయాడు. ఇక అప్పటినుంచి చిరంజీవి చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక సాంగ్ లారెన్స్ మాస్టర్ చేస్తూ ఉంటాడు.

ఇక ఈ క్రమంలోనే ఇప్పుడు చిరంజీవి బాబీ డైరెక్షన్లో చేస్తున్న సినిమా విషయంలో కూడా కొరియోగ్రఫీ చేసే బాధ్యతని లారెన్స్ మాస్టర్ కి అప్పగించారు. ప్రస్తుతం లారెన్స్ మాస్టర్ తమిళ్ స్టార్ హీరో అయిన విజయ్ తో తిరుగుతున్నాడు. రీసెంట్ గా జరిగిన తమిళనాడు ఎలక్షన్స్ లో విజయ్ గెలిచి సీఎం అయిన తర్వాత నుంచి అతనితోనే ట్రావెల్ అవుతున్నాడు.

కాబట్టి ఇప్పుడు ఆయన తమిళ రాజకీయాల్లో కీలకపాత్ర వహించే అవకాశాలైతే ఉన్నాయి. ఇక బాబీ టీం లారెన్స్ మాస్టర్ ను అడిగిన కూడా చిరంజీవి సాంగ్ కి కొరియోగ్రఫీ చేసే సమయం తన దగ్గర లేదని లారెన్స్ చెప్పినట్టుగా తెలుస్తుంది. చిరంజీవి వల్లే తను ఇండస్ట్రీకి వచ్చి ఇంతటి లైఫ్ ని అనుభవిస్తున్నాడు.

అలాంటి చిరంజీవి సినిమాకి కొరియోగ్రఫీ చేసే సమయం లేదని చెబుతున్నాడా అంటూ కొంతమంది మెగా అభిమానులు సైతం లారెన్స్ మీద సోషల్ మీడియా విపరీతంగా ఫైర్ అవుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా లారెన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా, నటుడిగా, దర్శకుడిగా పలు విభాగాల్లో రాణిస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…

'తల్లికి వందనం' పై ఫుల్ క్లారిటీ!

Talliki Vandanam Scheme
Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme: ‘ఏపీలో తల్లికి వందనం పథకం అమలుపై ఫుల్ క్లారిటీ వచ్చింది. విద్యా సంవత్సరం ప్రారంభం అయిన నేపథ్యంలో పాఠశాలలు తెరుచుకున్నాయి. కానీ తల్లికి వందనం పథకం విషయంలో ప్రభుత్వం నుంచి ప్రకటన లేదు. ఈ క్రమంలో నిన్ననే క్యాబినెట్ సమావేశంలో ఈ పథకం అమలుపై ఒక నిర్ణయం తీసుకున్నారు. జూలై 10న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం నిధులు జమ చేయనున్నారు. వేసవి సెలవుల అనంతరం జూన్ 12న పాఠశాలలు తెరుచుకున్నాయి. కానీ తల్లికి వందనం నిధుల విషయంలో మాత్రం ఎటువంటి క్లారిటీ లేకుండా పోయింది. గత ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం లోనే ఈ నిధులు విడుదలయ్యాయి. ఈ ఏడాది మాత్రం విద్యా సంవత్సరం ప్రారంభంలో అందించలేకపోయింది ప్రభుత్వం. లబ్ధిదారులకు సంబంధించిన హౌస్ ఓల్డ్ సర్వేలో జాప్యం జరగడమే కారణం. విద్యాశాఖ నుంచి వెళ్లిన వివరాలు సచివాలయాల వారీగా మ్యాపింగ్ లో చూశారు. ఈ ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల జాప్యం జరిగింది. ఇప్పుడు జూలై 10న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించి.. అదేరోజు తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం నిధుల జమ చేయనున్నారు.

* ఎంతమంది పిల్లలు ఉన్నా..
వైసీపీ హయాంలో అమ్మ ఒడి పేరుతో ఈ పథకాన్ని అమలు చేశారు. అయితే అప్పట్లో ఇంట్లో ఒక విద్యార్థికి మాత్రమే పరిమితం అయ్యేది సాయం. కానీ చంద్రబాబు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు గత ఏడాది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం కింద 13 వేల రూపాయల చొప్పున సాయం అందించారు. గత ఏడాది 67.27 లక్షల మందికి ఈ పథకం వర్తించింది. ఈ ఏడాది ఆ సంఖ్య 68 లక్షలు గా గుర్తించారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అందించేందుకు సిద్ధపడుతున్నారు.

* సచివాలయాల్లో జాబితా..
ప్రస్తుతం లబ్ధిదారులకు సంబంధించిన సచివాలయాల హౌస్ హోల్డ్ సర్వే పూర్తయింది. ఆ వివరాలను పాఠశాల విద్యాశాఖకు అందిస్తారు. అన్ని అర్హతలు ఉండి తుది జాబితాను తయారుచేసి సచివాలయాల వారిగా ప్రదర్శిస్తారు. మరోవైపు జూలై 10న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తారు. అదేరోజు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తారు. అర్హత ఉండి వివిధ కారణాలతో తల్లికి వందనం నిధులు జమ కాని వారి కోసం గ్రీవెన్స్ సెల్ కు అవకాశం ఇస్తారు. తప్పులు సరిదిద్దుకుంటే మళ్లీ నిధుల జమకు ఛాన్స్ ఉంటుంది. ఒకటో తరగతితో పాటు ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు సైతం నిధులు జమ చేయనున్నారు. మరోవైపు అనాధ పిల్లలకు సైతం తల్లికి వందనం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుండడం విశేషం.

పరీక్షలు, సెలవులు.. ఏపీ అకడమిక్ క్యాలెండర్!

AP Academic Calendar 2026
AP Academic Calendar 2026

AP Academic Calendar 2026: ఏపీ విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేసింది. విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం కావడంతో పని దినాలు, పరీక్షలు, సెలవులకు సంబంధించి షెడ్యూల్ ను ప్రకటించింది. ఇదివరకే ప్రకటించిన ఇప్పుడు కొత్తగా పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ తో పూర్తి వివరాలను వెల్లడించింది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 229 రోజులు పాఠశాలలు పనిచేయనున్నాయి. 87 సెలవులు ఉంటాయని క్యాలెండర్ లో స్పష్టం చేశారు. ప్రతి శనివారం 6 నుంచి తొమ్మిది తరగతులకు నో బ్యాగ్ డే అమలు చేయనున్నారు. ఈ లెక్కన ఈ విద్యా సంవత్సరంలో 28 నో బ్యాగ్ లు ఉంటాయని అక్కడ మీకు క్యాలెండర్లో స్పష్టం చేశారు. అయితే ఈ రోజుల్లో కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇండోర్ గేమ్స్, విలువల విద్య, వృత్తి విద్య, పాఠశాల స్థాయిలో హిందీ దివస్ పోటీలు, గణిత పజిల్స్, క్విజ్ తదితర పోటీలు నిర్వహించనున్నారు.
– ఇక వార్షిక సెలవులకు సంబంధించి మొత్తం 87 దినాలు. అక్టోబర్ 12 నుంచి 21 వరకు దసరా సెలవులు, జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు, మైనారిటీ పాఠశాలలకు క్రిస్మస్ సెలవులు అదనంగా ఇస్తారు.
– పరీక్షలకు సంబంధించి ఆగస్టు 3 నుంచి 7 వరకు ఫార్మేటివ్ అసెస్మెంట్ 1, అక్టోబర్ ఐదు నుంచి 8 వరకు ఎఫ్ఏ 2, నవంబర్ 9 నుంచి 20 వరకు సమ్మేటివ్ అసెస్మెంట్ వన్, జనవరి నాలుగు నుంచి ఏడు వరకు ఎఫ్ఏ 3, ఫిబ్రవరి 8 నుంచి 11 వరకు ఎఫ్ఏ 4, ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు ఉంటాయి. పదో తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు ఫ్రీ ఫైనల్ పరీక్షలు ఉండనున్నాయి. మార్చి 15 నుంచి 31 వరకు పబ్లిక్ పరీక్షలు జరుగుతాయి.
– జూలై 10, డిసెంబర్ 5న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ నిర్వహిస్తారు. గత ఏడాది తరహాలోనే రాజ్యాంగ దినోత్సవం రోజున మాక్ పార్లమెంట్ నిర్వహిస్తారు. తొమ్మిది నుంచి పదో తరగతికి వచ్చిన విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్స్ ఉంటుంది.. వేసవి సెలవులకు ముందు ఈ కోర్సు బోధిస్తారు.
– మార్చి 15 నుంచి పాఠశాలలకు ఒంటిపూట బడులు ఉంటాయి. ఏప్రిల్ 24 నుంచి యధావిధిగా వేసవి సెలవులు కొనసాగనున్నాయి.

సందీప్ రెడ్డి వంగ హిట్టు కొట్టడం కష్టమే అంటున్న బాలీవుడ్ స్టార్ హీరోస్... కారణమేంటంటే..?

Sandeep Reddy Vanga
Sandeep Reddy Vanga

Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ…ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఇక అర్జున్ రెడ్డి సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన ఆయన అనిమల్ సినిమాతో మరోసారి తన దర్శకత్వ ప్రతిభను చూపించాడు. ఈ సినిమాతో రణ్బీర్ కపూర్ ని టాప్ హీరోగా మార్చడమే కాకుండా 900 కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టాడు. ఇక ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగా అంటే ఇప్పుడు ఒక బ్రాండ్ నేమ్ గా మారిపోయింది. అలాంటి సందీప్ నుంచి వచ్చే సినిమా విషయంలో చాలా క్లారిటిని మైంటైన్ చేయాల్సిన అవసరమైతే ఉంది.

ఎందుకంటే ఇంతకుముందు ఆయన చేసిన సినిమాల మీద ఒక రేంజ్ అంచనాలు ఉంటే ఇప్పుడు చేస్తున్న సినిమాల మీద ఆ అంచనాలు మరొక ఎత్తులో ఉండబోతున్నాయి. ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. కానీ అది వర్కౌట్ అవుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…

ఇదంతా చూస్తున్న బాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం సందీప్ మీద విషం కక్కుతున్నారు. అతను బోల్డ్ కంటెంట్ల తోనే సినిమాలు చేస్తుంటాడు. కాబట్టి ఆ సినిమాలు పెద్దగా ఆడే అవకాశమైతే లేదు. మొదటి మూడు సినిమాలు ఏదో ఫ్లూక్ లో ఆడాయి తప్ప వాటి గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని అయితే లేదని ఇప్పుడు స్పిరిట్ సినిమాతో సందీప్ రెడ్డివంగా దొరికిపోతాడు అంటూ వాళ్ళు కామెంట్లైతే చేస్తున్నారు.

దీనిమీద సందీప్ ఎలాంటి స్పందన తెలియజేయడం లేదు. అయినప్పటికి మొత్తానికి స్పిరిట్ సినిమా రిజల్ట్ తోనే ప్రతి ఒక్కరి నోరు మూయించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది… ఇక ప్రస్తుతం స్పిరిట్ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేయడానికి ఆయన తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు…

కొడాలి నానిలో ధైర్యం పోయి భయం!

Kodali Nani
Kodali Nani

Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగిస్తోంది. అయితే ఆయన ఎంతో ధైర్యం ఉన్న నాయకుడిగా చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు తనపై కేసుల విచారణ పై స్టే ఇవ్వాలని ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించడం మాత్రం గుర్తించాల్సిన విషయం. వైసిపి హయాంలో ఆయన నోటికి అడ్డు అదుపూ లేకుండా పోయేది. దమ్ముంటే రండి.. నాపై పోటీ చేయండి.. గెలవండి అంటూ సవాళ్లు చేసేవారు. సినీ రాజకీయ రంగాల ప్రముఖులను సైతం చాలా తేలిగ్గా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి అయినా ఆయనకు లెక్క ఉండేది కాదు. చివరకు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి కూడా చాలా చులకనగా మాట్లాడేశారు. అయితే అధికారం ఉంటేనే తనలో ధైర్యం అన్నట్టు ఆయన మాట్లాడేవారు. వ్యవస్థలు అంటే ఓన్లీ వైసీపీ ప్రభుత్వం అన్నట్టు ఉండేవారు. ఇప్పుడు అధికారంలో లేకపోవడంతో ఆయనకు వ్యవస్థలు గుర్తుకొస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఏకంగా కోర్టును ఆశ్రయించారు. తనపై కేసు విచారణను నిలిపివేయాలని కోరారు. ఎంతటి ధైర్యవంతుడైన నాని ఇలా కోర్టును ఆశ్రయించారు ఏంటి అని సొంత పార్టీ వారే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

* వ్యవస్థలపై విచ్చలవిడి వ్యాఖ్యలు..
జగన్మోహన్ రెడ్డి తన వైసీపీ ప్రభుత్వం మరో 30 సంవత్సరాలు పాటు కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. విచ్చలవిడి సంక్షేమంతో ప్రజల చేతులకు బందీలు వేసామని.. వారంతా తమకు కాకపోతే ఎవరికి మద్దతు ఇస్తారని ఆయన భావించినట్టు ఉన్నారు. అధినేత జగన్ మాట తమకు శిరోధార్యంగా భావించే కొడాలి నాని లాంటివారు దానినే బలంగా నమ్మారు. అందుకే ప్రత్యర్ధులతో పాటు రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై విచ్చలవిడిగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు చట్టపరమైన ఉచ్చు గట్టిగా బిగిస్తుండడంతో.. అదే చట్టాన్ని ఆశ్రయించడం మాత్రం నిజంగా గమనార్హం. ముఖ్యంగా రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో కొడాలి నాని వ్యాఖ్యలను గుర్తు చేస్తే ఎవరికైనా బాధ కలగక మానదు. కానీ ఇప్పుడు అదే కేసు కొడాలి నాని మెడకు చుట్టుకుంది. ప్రభుత్వం ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వడంతో.. వైసిపి హయాంలో వ్యవస్థలపై దాడికి సంబంధించిన అంశంపై కోర్టు కఠినంగా స్పందించే అవకాశం ఉంది. కానీ అదే న్యాయస్థానంలో విచారణ నిలిపివేయాలని కొడాలి నాని కోరడం మాత్రం ఆత్మరక్షణ కోసమే.

* వరుసగా కేసులు..
ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు మాత్రమే కాదు.. కొడాలి నాని పై చాలా కేసులు ఎదురు చూస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో గుడివాడలో సాగిన ల్యాండ్ గ్రాబింగ్ ఆరోపణలు, పేకాట క్లబ్బుల నిర్వహణ, ఇతర బెదిరింపులు.. ఇలా అన్ని తెరపైకి వస్తున్నాయి. ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో విచారణ ప్రారంభం అయితే.. చట్టం ఏ రేంజ్ లో పంజా విసురుతుందో కొడాలి నాని కి తెలుసు. రిమాండ్ ఖైదీగా కొద్ది రోజులు.. అటు తరువాత కేసుల విచారణ పేరుతో కాళ్ళ అరిగేలా తిరగాల్సి ఉంటుంది. అందుకే ముందస్తుగానే విచారణను కొంతవరకు అడ్డుకోవాలని చూస్తున్నారు. అది సాధ్యమయ్యే పని కాదు అని నిపుణులు చెబుతున్నారు.

బైసన్ మూవీ లో ఉన్నది పెద్ది మూవీలో మిస్ అయింది ఇదేనా..?

Peddi vs Bison
Peddi vs Bison

Peddi vs Bison: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం డిఫరెంట్ సబ్జెక్టులతో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసించే కెపాసిటి ఏ ఇండస్ట్రీకి లేదు. ఇక ఇప్పటికే మన స్టార్ హీరోలు చాలా మంచి పేరు ప్రఖ్యాతలనైతే సంపాదించుకున్నారు. ఇక రీసెంట్ గా రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది సినిమా పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్నా కూడా ఈ సినిమాకి కలెక్షన్స్ భారీగా రావడం లేదు. ఇక ఈ సినిమాని రిపీటెడ్ గా చూసే జనాల సంఖ్య కూడా తగ్గిపోయింది. మొత్తానికైతే పెద్ది సినిమా ఒక్క వర్గం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నప్పటికి కొంతమందిని మాత్రం తీవ్రమైన నిరాశకి గురిచేసింది. ఎందుకంటే రామ్ చరణ్ ని చూపించిన విధానం బాగుంది. కానీ అందులో ఎమోషన్స్ చాలా వరకు మిస్ అయ్యాయి అంటూ చాలామంది చాలా రకాల కామెంట్లు చేస్తున్నారు. గత సంవత్సరం తమిళ్ సినిమా ఇండస్ట్రీలో వచ్చిన ‘బైసన్’ సినిమా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కింది.

ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇందులో ఎమోషన్స్ ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో ఇన్నర్ గా ఒక ఫీల్ అయితే ట్రావెల్ అవుతూ ఉంటుంది. ప్రతి ప్రేక్షకుడు సినిమాను చూసినంత సేపు సినిమాకి కనెక్ట్ అవుతూ ఉంటాడు. మారి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించింది… పెద్ది సినిమాలో మాత్రం అ ప్యూర్ ఎమోషన్స్ మిస్ అయ్యాయి.

వాటిని పర్ఫెక్ట్ గా డీల్ చేసి ఉంటే సినిమా నెక్స్ట్ లెవల్ రిజల్ట్ ని ఇచ్చేది. స్టార్ హీరోని పెట్టుకొని ఇలాంటి సాహసాలు చేస్తున్నప్పుడు ఒకటి పది సార్లు చెక్ చేసుకొని మరి సన్నివేశాలను చిత్రీకరించాల్సిన అవసరమైతే ఉంది. ఏమాత్రం ఫీల్ క్యారీ అవ్వకపోయినా కూడా ప్రేక్షకులు సినిమా నుంచి డిస్ కనెక్ట్ అయ్యే అవకాశాలైతే ఉంటాయి.

ఇక పెద్ది సినిమా విషయంలో అదే జరిగింది. బైసన్ సినిమా విషయంలో ఏదైతే ఎమోషన్ వర్క్ అవుట్ అయిందో పెద్ది సినిమా విషయంలో ఆ ఎమోషన్ ఏమాత్రం ప్రేక్షకుడిని ఆకట్టుకోలేకపోయింది. ఈ రెండు సినిమాల మధ్య ఉన్న వ్యత్యాసం ఇదే అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి…

ఏపీలో బంగారం దొరికింది.. రేపటి నుంచి తవ్వి తీయడం.. దేశవ్యాప్తంగా సంచలనం

Andhra Pradesh Gold Mine
Andhra Pradesh Gold Mine

Andhra Pradesh Gold Mine: దేశంలోనే బంగారమైన ఘన చరిత్రను సొంతం చేసుకోనుంది ఏపీ. భారతదేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేసే అరుదైన ఛాన్స్ దక్కించుకోనుంది. రాబోయే రోజుల్లో అతిపెద్ద బంగారు సరఫరాదారుగా ఏపీ అవతరించనుంది. రాయలసీమలో ఉన్న బంగారు గని దీనిని నిజం చేయనుంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి ప్రాంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్. ఈ ప్రాంతంలో ప్రయోగాత్మకంగా బంగారం వెతికితీత విజయవంతం కావడంతో.. ఇప్పుడు ఉత్పత్తి దశకు చేరుకుంది. రాష్ట్ర గనుల చరిత్రలోనే ఒకసారి కొత్త అధ్యాయం మొదలుకానుంది.

* రేపు సీఎం చేతుల మీదుగా..
జొన్నగిరి బంగారు గనుల ప్రాజెక్టును రేపు సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. పూర్తిస్థాయి ఉత్పత్తికి శ్రీకారం చుట్టనున్నారు. జొన్నగిరి పరిసర ప్రాంతాల్లోని మరో 12 ఎకరాలు విస్తీర్ణంలో కొత్త తవ్వకాల కోసం కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే ప్రాంతంలో బంగారు ఖనిజాన్ని శుద్ధి చేసే రెండో యూనిట్ ను కూడా సీఎం భూమి పూజ చేయనున్నారు. దీంతో ఏపీ దేశంలో బంగారం ఉత్పత్తి చేసి ముఖ్య రాష్ట్రాల జాబితాలో చేరనుంది. గతంలో జొన్నగిరి ప్రాంతంలో వజ్రాలు తరచూ లభించేవి. ఈ నేపథ్యంలో జియో లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిపుణులు ఇక్కడ విస్తృత సర్వేలు చేపట్టారు. పరిశోధనలు భారీ స్థాయిలో బంగారం ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. గత మూడు దశాబ్దాలుగా ఇక్కడి ఖనిజాన్ని పూర్తిస్థాయిలో వెలికి తీసేందుకు అవసరమైన అనుమతులు, పరిశోధనలు, సాంకేతిక అధ్యయనాలను విజయవంతంగా పూర్తి చేశారు. అందుకే ఇప్పుడు ఈ ప్లాంట్ ఉత్పత్తి దశకు చేరుకుంది.

* గత రెండు దశాబ్దాలుగా..
జొన్నగిరి, ఎర్రగుడి, పగిడిరాయి గ్రామాల పరిసర ప్రాంతాల్లో బంగారం ఖనిజం ఉన్నట్టు నిర్ధారణ కావడంతో.. జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 2006లో సుమారు 1477 ఎకరాల విస్తీర్ణంలో తవ్వకాలకు అనుమతులు లభించాయి. మొదట చిన్న స్థాయిలో తవ్వకాలు చేపట్టారు. ఖనిజ నాణ్యతను పరీక్షించారు. ఆ పరీక్షల్లో బంగారం ఖనిజం నాణ్యమైనదని తేలడంతో సంస్థ ముందుగా మినీ ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేసింది. అనంతరం 320 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక సాంకేతికత కలిగిన భారీ ప్రాసెసింగ్ ప్లాంట్ ను నిర్మించింది. దాదాపు 800 మంది ఇక్కడ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు.

* కూటమి వచ్చిన తర్వాత..
గత కొంతకాలంగా ఉత్పత్తికి సిద్ధమయ్యింది ఈ ప్లాంట్. కానీ అనుమతుల్లో జాప్యం జరగడంతో ఈ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగాయి. ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్ అంశాలను పరిష్కరించడంతో ప్రాజెక్టు వేగం పుంజుకుంది. దీంతో మిగిలిన పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఉత్పత్తికి రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ఆట వెయ్యి కిలోల వరకు బంగారం ఉత్పత్తి చేయగల స్థాయిలో ఖనిజాన్ని వెలికి తీసినట్లు ఇక్కడ అధికారులు చెబుతున్నారు. జియో మైసూర్ సంస్థ నిర్వహించిన సర్వేలో జొన్నగిరి ప్రాంతంలో సుమారు కోటి టన్నుల వరకు బంగారం ఖనిజం ఉన్నట్లు అంచనా వేశారు. ప్రారంభ దశలో రోజుకు ఒక కిలో బంగారం ఉత్పత్తి చేనుండగా.. తదుపరి దశల్లో వార్షిక ఉత్పత్తిని 600 కిలోల నుంచి 1500 కిలోల వరకు పెంచే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. రాబోయే 15 సంవత్సరాలు పాటు ఈ ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతుందని భావిస్తున్నారు. అయితే ఒక్క జొన్నగిరి మాత్రమే కాదు అనంతపురం జిల్లా రామగిరి ప్రాంతంలో కూడా గణనీయమైన బంగారు నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. అక్కడ కూడా త్వరలో తవ్వకాలు ప్రారంభించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో బంగారు ఖనిజ నిక్షేపాలు గుర్తించబడ్డాయి. ఈ పరిస్థితి చూస్తుంటే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రముఖ గోల్డ్ మైనింగ్ హబ్ గా ఎదిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

పగటిపూట మత్తు.. రాత్రిళ్లు నిద్రలేమి.. ఈ సమస్యకు సంకేతాలా...

Daytime Sleepiness Causes
Daytime Sleepiness Causes

Daytime Sleepiness Causes: ఆరోగ్యకరమైన జీవనశైలిలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. అయితే చాలా మందికి కార్యాలయాల్లో, వ్యాపార ప్రదేశాల్లో మధ్యాహ్నం నిద్ర మత్తు ఎక్కువగా ఉంటుంది. కానీ రాత్రి సమయంలో మాత్రం నిద్ర పట్టడానికి అనేక సమస్యలు ఎదురవుతాయి. ఇవి కేవలం అలసట లక్షణాలు మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నివేదికలు తెలుపుతున్నాయి. అయితే ఇటీవల తేలిన పరిశోధనల ప్రకారం.. పై లక్షణాలతో ఈ ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఆవేంటంటే?

పరిశోధనలో ఏమి తేలింది?
అమెరికాలోని పెన్ స్టేట్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పగటిపూట ఎక్కువగా నిద్రమత్తుతో బాధపడే వ్యక్తులు, అలాగే రాత్రి పడుకున్న తర్వాత వెంటనే నిద్రపట్టని వారిలో అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ రెండు సమస్యలు ఒకేసారి ఉంటే హైబీపీ ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

నిద్రకు, రక్తపోటుకు ఉన్న సంబంధం
మన గుండె, రక్తనాళాల వ్యవస్థ రోజంతా నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. ఈ వ్యవస్థకు విశ్రాంతి లభించే ముఖ్యమైన సమయం నిద్ర. నిద్ర సమయంలో గుండె స్పందన రేటు తగ్గుతుంది. రక్తపోటు కూడా సహజంగా తగ్గి శరీరం కోలుకునే ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే నిద్రకు అంతరాయం కలిగితే లేదా తగినంత సమయం నిద్రపోకపోతే ఈ సహజ ప్రక్రియ దెబ్బతింటుంది. ఫలితంగా రక్తపోటు స్థాయిలు క్రమంగా పెరుగుతాయి.

నిద్రలేమి శరీరంపై చూపే ప్రభావం
సరిగా నిద్ర పట్టకపోతే శరీరానికి పూర్తి విశ్రాంతి లభించదు. దీంతో ఒత్తిడిని నియంత్రించే నాడీ వ్యవస్థ ఎక్కువగా ఉత్తేజిత స్థితిలో ఉంటుంది. ఈ పరిస్థితిలో గుండె వేగంగా కొట్టుకోవడం, రక్తనాళాలు కుదించుకోవడం జరుగుతుంది. ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది. దీర్ఘకాలం పాటు నిద్రలేమి కొనసాగితే శరీరం ఎప్పుడూ అప్రమత్త స్థితిలోనే ఉండిపోతుంది. ఇది హైబీపీతో పాటు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

స్లీప్ అప్నియా కూడా ప్రమాదకరం
కొంతమందిలో నిద్రలో శ్వాస తీసుకోవడంలో ఆటంకం ఏర్పడే ‘స్లీప్ అప్నియా’ సమస్య ఉంటుంది. ఈ పరిస్థితిలో నిద్రిస్తున్న సమయంలో కొన్ని క్షణాల పాటు శ్వాస ఆగిపోతుంది. అనంతరం గట్టిగా గురక పెడుతూ తిరిగి శ్వాస తీసుకుంటారు. ఇలా ప్రతి సారి శ్వాస ఆగినప్పుడు రక్తపోటు తాత్కాలికంగా పెరుగుతుంది. ఈ పరిస్థితి తరచూ జరుగుతుంటే దీర్ఘకాలంలో హైబీపీ సమస్య తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంటుంది.

దీర్ఘకాలిక ఆరోగ్య సవాళ్లు
నిద్ర సమస్యలను నిర్లక్ష్యం చేస్తే కేవలం రక్తపోటే కాదు, గుండెపోటు, స్ట్రోక్, మధుమేహం వంటి అనేక ఆరోగ్య సమస్యల ప్రమాదం కూడా పెరుగుతుంది. అధిక రక్తపోటు రక్తనాళాలపై అదనపు ఒత్తిడిని కలిగించి గుండె పనితీరును దెబ్బతీస్తుంది. అందుకే నిద్ర నాణ్యతను మెరుగుపరచడం గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో అత్యంత కీలకమని వైద్యులు సూచిస్తున్నారు.

జీవనశైలిపై ప్రభావం
నిద్రలేమితో బాధపడేవారిలో అలసట, చిరాకు, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు కనిపిస్తాయి. దీంతో వ్యాయామం చేయాలనే ఆసక్తి తగ్గిపోవచ్చు. అదే సమయంలో అధిక కాఫీ, టీ వినియోగం పెరగడం, అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు ఏర్పడటం వంటి మార్పులు చోటుచేసుకుంటాయి. ఇవన్నీ పరోక్షంగా రక్తపోటును మరింత పెంచే అవకాశముంది.

అయితే ఈ సమస్య రాకుండా ఉండాలంటే కొన్ని అలవాట్లను చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రించడం లేదా ఒకే సమయానికి లేవడం అలవాటు చేసుకోవాలి. పడకగదిలో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. నిద్రకు ముందు కాఫీ, టీ వంటి కెఫిన్ పానీయాలు తీసుకోవడం మానుకోవాలి. అలాగే మొబైల్ ఫోన్, టీవీ, ల్యాప్‌టాప్ వంటి డిజిటల్ పరికరాల వినియోగాన్ని తగ్గించడం మంచిది.

వాట్సప్‌లో కొత్త ఫీచర్లు.. ఇవి ఉంటే మీరు సేఫ్..!

WhatsApp Username Feature
WhatsApp Username Feature

WhatsApp New Features: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్. ఈ యాప్ ను మరింత అభివృద్ధి చేసేందుకు మాతృసంస్థ మెటా సన్నాహాలు చేస్తుంది. ఈ యాప్ నుంచి త్వరలో మరిన్ని అధునాతన ఫీచర్లు వినియోగదారుల ముందుకు రానున్నాయి. యూజర్ల భద్రత, గోప్యత, కమ్యూనికేషన్ అనుభవాన్ని మరింత మెరుగుపర్చేందుకు మెటా సంస్థ పలు కొత్త అప్‌డేట్‌లను పరీక్షిస్తోంది. ఇవి వినియోగదారులకు చాలా రకాలుగా ఉపయోగపడున్నాయి. వీటి గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

Scam Alert:
ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో యూజర్లను రక్షించేందుకు వాట్సాప్ ‘స్కామ్ అలర్ట్స్’ ఫీచర్‌ను తీసుకురానుంది. అనుమానాస్పద లింకులు, తెలియని నంబర్ల నుంచి వచ్చే మోసపూరిత సందేశాలు లేదా ఫిషింగ్ ప్రయత్నాలను గుర్తించి యూజర్లకు హెచ్చరికలు జారీ చేస్తుంది. దీంతో వినియోగదారులు మోసపూరిత మెసేజ్‌లను ముందుగానే గుర్తించి జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది.

One Text Message:
ఇప్పటికే ఫోటోలు, వీడియోలకు ‘వ్యూవన్స్’ ఆప్షన్ అందుబాటులో ఉండగా.. ఇప్పుడు టెక్స్ట్ మెసేజ్‌లకూ అదే తరహా ఫీచర్‌ను తీసుకురావాలని వాట్సప్ ప్రయత్నిస్తోంది. ఈ ఫీచర్ ద్వారా పంపిన సందేశాన్ని గ్రహీత ఒక్కసారి మాత్రమే చదవగలరు. చదివిన వెంటనే ఆ మెసేజ్ ఆటోమేటిక్‌గా మాయమవుతుంది. సున్నితమైన సమాచారం, ఓటీపీలు లేదా వ్యక్తిగత వివరాలను మరింత భద్రంగా పంపేందుకు ఇది ఉపయోగపడుతుంది.

Voice Notes New Updates:
వాయిస్ మెసేజ్‌ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో వాట్సాప్ వాటిలో కూడా పలు మెరుగుదలలను తీసుకురానుంది. రికార్డ్ చేసిన వాయిస్ నోట్స్‌ను పంపేముందు మరింత సులభంగా రివ్యూ చేయడం, ఎడిట్ చేయడం, అలాగే వాయిస్ మెసేజ్‌ల ట్రాన్స్‌క్రిప్షన్ వంటి ఫీచర్లను పరీక్షిస్తోంది. దీంతో వాయిస్ మెసేజ్‌లను వినలేని సందర్భాల్లో కూడా వాటి టెక్స్ట్ రూపాన్ని చదివే అవకాశం లభిస్తుంది.

Shedule Message:
చాలాకాలంగా యూజర్లు ఎదురుచూస్తున్న షెడ్యూల్డ్ మెసేజ్ ఫీచర్‌ను కూడా వాట్సప్ తీసుకురావొచ్చు. ఈ ఫీచర్ ద్వారా ముందుగానే ఒక సందేశాన్ని టైప్ చేసి, అది పంపాల్సిన తేదీ మరియు సమయాన్ని ఎంపిక చేసుకోవచ్చు. నిర్ణీత సమయంలో ఆ మెసేజ్ ఆటోమేటిక్‌గా పంపబడుతుంది. పుట్టినరోజు శుభాకాంక్షలు, కార్యాలయ రిమైండర్లు లేదా ముఖ్యమైన సందేశాలను ముందుగానే ప్లాన్ చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.

వాట్సప్ తాజా అప్‌డేట్‌లలో ఎక్కువగా ప్రైవసీ మరియు సెక్యూరిటీ అంశాలకే ప్రాధాన్యం ఇస్తోంది. యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని రక్షించడంతో పాటు, అనవసర కాల్స్, స్పామ్ మెసేజ్‌లు, మోసపూరిత కార్యకలాపాలను తగ్గించే దిశగా ఈ కొత్త ఫీచర్లు పనిచేయనున్నాయి. దీంతో వాట్సప్ వినియోగం మరింత సురక్షితంగా మారే అవకాశముంది.

మోడీ ధీరత్వాన్ని మెచ్చుకున్న అర్నబ్ గోస్వామి.. ఆ రాత్రి ఏం జరిగిందో బయటపెట్టాడిలా

Arnab Goswami On Modi
Arnab Goswami On Modi

Arnab Goswami On Modi: ఆపరేషన్ సిందూర్ జరిగినప్పుడు పాకిస్తాన్ తీవ్రంగా ఇబ్బంది పడింది. చాలావరకు ఉగ్రవాద స్థావరాలను కోల్పోయింది. ఉగ్రవాదులు కూడా బతుకు జీవుడా అనుకుంటూ, ప్రాణాలు అరచేతులో పెట్టుకొని పారిపోయారు. అంతేకాదు పాకిస్తాన్లో ఉన్న న్యూక్లియర్ వెపన్స్ తయారీ కేంద్రాలకు దగ్గరగా భారత్ దాడులు చేసింది. ఈ దాడుల్లో పాకిస్తాన్ భారీగానే నష్టపోయింది. చివరికి ఎయిర్ బేస్ లపై దాడులు జరగడంతో దాయాది దేశానికి నోరు మెదపని పరిస్థితి ఏర్పడింది.

ఇక్కడితోనే భారత్ ఆగిపోలేదు. ఆపరేషన్ సిందూర్ సమయంలో సరికొత్త మిస్సయిల్స్ భారత్ చేసిన దాడులు ప్రపంచానికి ఆశ్చర్యాన్ని కలిగించాయి. 100% స్ట్రైక్ రేట్ తో ఇండియన్ మిసైల్స్ దాడులు చేయడం అమెరికా వంటి దేశానికి సైతం షాక్ కలిగించింది. చైనా అయితే.. మూర్చ పోయింది… ఇజ్రాయిల్ వంటి దేశాలు కూడా భారత్ చూపించిన పోరాటపటిమను సరికొత్తగా మెచ్చుకున్నాయి. ఇటీవలి యుద్ధంలో కూడా భారత్ అనుసరించిన విధానాన్ని ఇజ్రాయిల్ కొనసాగించింది..

ఆపరేషన్ సిందూర్ జరుగుతున్నప్పుడు భారత్ పాకిస్తాన్ మీదకి ఉపయోగించిన మిసైల్స్ ఖచ్చితమైన లక్ష్యంతో దూసుకుపోయాయి. ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేశాయి. కొంచెం కూడా ప్రాణ నష్టం జరగకుండా.. ఉగ్రవాదుల ఆనుపానులు మాత్రమే ధ్వంసమయ్యాయి. అది కూడా రాత్రిపూట ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల వల్ల ముష్కరులు తమ స్థావరాలను మొత్తం కోల్పోయారు. ఏ మాత్రం లేకుండా భారత్ ఇలా దాడులు చేయడం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది.. అమెరికా కూడా భారత్ దాడులను అంతర్గతంగా మెచ్చుకుంది.

ఈ దాడులు చేసేందుకు భారత్ బ్రహ్మోస్ మిస్సైల్స్ ఉపయోగించింది.. ఇంతవరకు ఈ విషయాన్ని భారత్ బయట పెట్టలేదు. రిపబ్లిక్ టీవీ చైర్మన్, సుప్రసిద్ధ జర్నలిస్ట్ అర్ణబ్ గో స్వామి ఈ విషయాన్ని బయటపెట్టారు. రిపబ్లిక్ టీవీ కాన్ క్లేవ్ లో ఈ విషయాన్ని పంచుకున్నారు.. ఓపీఎస్ జరుగుతున్నప్పుడు భారత్ దాయాది మీదకి 19 బ్రహ్మోస్ మిస్సైల్స్ ప్రయోగించిందని ఆయన పేర్కొన్నారు. బలమైన రాజకీయం వల్లే ఇదంతా సాధ్యమైందని.. నరేంద్ర మోడీ ఇదంతా చేశారని అర్నబ్ వ్యాఖ్యానించారు.

‘రెట్రో వాకింగ్’ అంటే ఏమిటి.. దీని వల్ల ఎటువంటి లాభాలు..

After Meal Walking Benefits
After Meal Walking Benefits

Retro Walking Benefits: ప్రతిరోజూ వాకింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. సాధారణంగా మనం ముందుకు నడుస్తూ వ్యాయామం చేస్తుంటాం. అయితే ఇటీవల ఆరోగ్య నిపుణులు, ఫిజియోథెరపిస్టులు ‘రెట్రో వాకింగ్‌’ లేదా వెనక్కి నడవడం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. కేవలం శరీర ఫిట్‌నెస్‌కే కాకుండా మెదడు పనితీరును మెరుగుపరచడంలో కూడా ఈ విధానం సహాయపడుతుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇంకా వెనక్కి నడవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో చూద్దాం..

రెట్రో వాకింగ్ అంటే ఏమిటి?
ముందుకు నడిచే బదులుగా వెనుక వైపు అడుగులు వేస్తూ నడవడాన్ని రెట్రో వాకింగ్ అంటారు. ఇది సాధారణ వాకింగ్‌తో పోలిస్తే కొంచెం కష్టంగా అనిపించినా, శరీరంలోని కండరాలు, నరాలు, మెదడు ఒకేసారి ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుంది. అందుకే ఇది ప్రత్యేకమైన వ్యాయామంగా గుర్తింపు పొందుతోంది. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాల్లో క్రీడాకారులు, ఫిట్‌నెస్ ప్రేమికులు ఈ పద్ధతిని తమ దైనందిన వ్యాయామంలో భాగం చేసుకుంటున్నారు.

మెదడు పనితీరును మెరుగు:
వెనక్కి నడవడం వల్ల మెదడు మరింత అప్రమత్తంగా పనిచేస్తుంది. ముందుకు నడిచేటప్పుడు అలవాటుగా చేసే కదలికలు, వెనక్కి నడిచేటప్పుడు కొత్త సవాలుగా మారుతాయి. దీంతో మెదడు ఎక్కువ ఏకాగ్రతతో పనిచేయాల్సి వస్తుంది. కొన్ని పరిశోధనల ప్రకారం… రెట్రో వాకింగ్ జ్ఞాపకశక్తిని పెంచడంతో పాటు ప్రతిచర్య సమయాన్ని మెరుగుపరుస్తుంది. సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాలు కూడా మెరుగుపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

కండరాలకు అదనపు బలం:
సాధారణ వాకింగ్‌లో ఉపయోగించే కండరాలతో పోలిస్తే, వెనక్కి నడిచేటప్పుడు కాళ్ల కండరాలు, తొడలు, పిక్కలు, నడుము భాగంలోని కండరాలు భిన్నంగా పనిచేస్తాయి. దీంతో కండరాల బలం పెరగడమే కాకుండా శరీర సమతుల్యత కూడా మెరుగుపడుతుంది. క్రీడాకారులు తమ వేగం, చురుకుదనాన్ని పెంచుకునేందుకు రెట్రో వాకింగ్‌ను ప్రత్యేకంగా అభ్యసిస్తుంటారు.

మోకాళ్లు, నడుముకు ఉపశమనం:
ఫిజియోథెరపీ చికిత్సల్లో కూడా రెట్రో వాకింగ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. మోకాళ్ల నొప్పి, నడుము నొప్పి, కీళ్ల సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వెనక్కి నడవడం వల్ల మోకాళ్లపై పడే ఒత్తిడి కొంత మేర తగ్గి, కీళ్ల కదలికలు మెరుగుపడతాయి. అందుకే పునరావాస కార్యక్రమాల్లో ఈ పద్ధతిని తరచుగా ఉపయోగిస్తున్నారు.

అయితే వెనక్కి నడవడం ప్రారంభించే ముందు సురక్షితమైన, అడ్డంకులు లేని ప్రదేశాన్ని ఎంచుకోవాలి. మొదట నెమ్మదిగా చిన్న దూరం నుంచి ప్రారంభించి క్రమంగా సమయాన్ని పెంచాలి. పార్కులు, ట్రాక్‌లు లేదా ఫిజియోథెరపిస్టు పర్యవేక్షణలో చేయడం మరింత సురక్షితం. రద్దీగా ఉండే రోడ్లపై లేదా ప్రమాదకర ప్రదేశాల్లో ఈ వ్యాయామం చేయకూడదు.

దుర్గంధం.. క్రిమీ భోజనం.. హైదరాబాద్ లో ఈ హోటళ్లలో తింటున్నారా.. ఓసారి ఈ స్టోరీ చదవండి

Hyderabad Food Safety Inspections
Hyderabad Food Safety Inspections

Hyderabad Food Safety Inspections: జొమాటో లేదా స్విగ్గి.. ఉబర్.. ఇలా ఎన్నో ఉన్నాయి. జస్ట్ ఫోన్ ఆన్ చేయడం.. యాప్ ఓపెన్ చేయడం.. ఆఫర్లు చూడడం.. నచ్చిన ఆహారం సెలెక్ట్ చేయడం.. ఆర్డర్ పెట్టడం.. పేమెంట్ ఆన్లైన్లోనే చేసేయడం.. ఉదయం టిఫిన్.. మధ్యాహ్నం భోజనం.. సాయంత్రం డిన్నర్.. మధ్యలో స్నాక్స్.. చివరికి కేకులు.. బర్గర్లు.. పిజ్జాలు.. సూప్ లు కూడా అందులోనే.. ఆర్డర్ పెట్టిన కొత్త సమయానికి కళ్ళ ముందుకు వస్తుంది. కాళ్ల దగ్గరికి వస్తుంది. అలాంటప్పుడు ఇలాంటి తిండిని ఎవరు కాదనుకుంటారు..

కొంతకాలంగా హైదరాబాదులో సగటు నగర జీవి ఇటువంటి రెడీమేడ్ ఫుడ్ కే అలవాటు పడ్డాడు. చివరికి వివాహం జరిగిన వారు సైతం ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకుంటున్నారు. వండే శ్రమ లేకుండా.. చెమటలు చిందించకుండా దర్జాగా తింటున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. తెస్తున్న ఫుడ్ ఎలా ఉంటుంది.. ఎలాంటి పరిస్థితుల్లో తయారుచేస్తున్నారు.. వాటి వల్ల ఎలాంటి రోగాలు వస్తాయి ఎవరూ గుర్తించడం లేదు. చివరికి ఆఫీసర్లు చేసిన దాడుల్లో.. దిగ్బ్రాంతి కరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

హైదరాబాద్ నగరంలో ఈ నెలలో 10 రెస్టారెంట్లను అధికారులు తనిఖీలు చేస్తే.. అందులో తొమ్మిది అత్యంత దారుణంగా ఉన్నాయని తేలింది. చెత్తబుట్టలో వేయాల్సిన ఆహారాన్ని వారు విక్రయిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దారుణమైన ఆహారాన్ని రకరకాల రంగులు.. మసాలాలు దట్టించి ప్లేట్లో పెడుతున్నారు.

అంతేరా.. ఈ రెస్టారెంట్ మదినగూడ లో ఉంది. ఇక్కడ కూరగాయలకు బూజు పట్టి ఉంది. వాడిన నూనె మళ్ళీ మళ్ళీ ఉపయోగించడానికి అధికారులు గుర్తించారు. పైగా ప్యాకెట్ల మీద లేబుల్స్ కూడా లేవు.

లులు హైపర్ మార్కెట్

చెత్తబుట్టలో వేయాల్సిన 150 కిలోల ఆహారాన్ని ఇక్కడ అధికారులు గుర్తించారు. వెంటనే దానిని స్వాధీనం చేసుకున్నారు. డ్రైనేజీలు మొత్తం బ్లాక్ అయ్యాయి. అందులో పురుగులు ఉన్నాయి. గడువు ముగిసిన ఆహార పదార్థాలను గుర్తించిన అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఉడిపి ఉపహార్ మూసాపేట్

డ్రైనేజీలో దారుణంగా సమస్యలు ఉన్నాయి. పురుగులు ఎక్కడికక్కడ కనిపిస్తున్నాయి. చెత్తబుట్టల మీద మూతలు లేవు. వంట చేసేవారు సరైన జాగ్రత్తలు పాటించడం లేదు. లైసెన్స్ కూడా ముగిసిపోయింది.

చౌమన్, మాదాపూర్

ఇక్కడ మాంసాన్ని అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ చేశారు. శాకాహారం.. మాంసాహారం కలిపి నిల్వ చేశారు. కనీసం వాటి మీద మూతలు కూడా పెట్టలేదు.

జిస్మత్ జైల్ మండి, మదినగూడ

ఇక్కడ వంటలు వండే తీరు ఎలా ఉందంటే.. కనీసం వాటిని పందులు కూడా తినవు. ఐటమ్స్కు లేబుల్స్ లేవు. సరైన నిలవలేదు. దీనికి ఎటువంటి గుర్తింపు లేదు. వాతావరణం అత్యంత దారుణంగా ఉంది.

రాయల్ స్పైసి, గచ్చిబౌలి

కీటకాలు తాండవం చేస్తున్నాయి. దుర్వాసన ముక్కులను పగలగొడుతోంది. నీరు దారుణంగా నిలిచిపోయింది. కిచెన్ అత్యంత అపరిశుభ్రంగా ఉంది. వంట కాదు కదా, ఇక్కడ ఐదు నిమిషాలు కూడా ఉండలేని పరిస్థితి.

సబ్ వే, కొండాపూర్

కుళ్ళిపోయిన కూరగాయలు వాడుతున్నారు. లేబుల్ లేని ఐటమ్స్ ఉపయోగిస్తున్నారు. సింక్ నిర్వహణ అత్యంత దారుణంగా ఉంది. ఆహార వృధా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

లాఫినోస్ పిజ్జా, జూబ్లీ ఎంక్లేవ్

బొద్దింకలు స్వైర విహారం చేస్తున్నాయి. ఇతర రెక్కల పురుగులు ఇష్టమొచ్చినట్టు తిరుగుతున్నాయి. గడువు ముగిసిన ఆహార పదార్ధాలు ఉపయోగిస్తున్నారు. అపరిశుభ్రత అత్యంత దారుణంగా ఉంది.

ఎస్బీఐ వెనక్కి తగ్గింది.. రేవంత్ రాజకీయం అట్లుంటది..

SBI Rayadurgam Land Auction
SBI Rayadurgam Land Auction

SBI Rayadurgam Land Auction:  రాయదుర్గం భూముల వేలానికి సంబంధించి ఎస్బిఐ కి అనుకూలంగా నమస్తే తెలంగాణ వరుసగా మూడు రోజులపాటు బ్యానర్ కథనాలను ప్రింట్ చేసింది. గట్టిగా ప్రచారం చేసింది. వాస్తవానికి నమస్తే తెలంగాణ ఈ రేంజ్ లో ప్రయారిటీ ఇవ్వడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ తర్వాత దీని లోతులోకి వెళ్తే అసలు కథ అర్థమైంది.

ఎస్బిఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టి ది ఉమ్మడి పాలమూరు జిల్లా. ఇతడికి.. వనపర్తి లో కీలక నాయకుడికి దగ్గర సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. గతంలో ఆ నాయకుడు అనేకసార్లు ముంబై వెళ్లారు. రాయదుర్గం భూములు వేలం వేసినప్పుడు కూడా వెళ్లారు. ఢిల్లీ స్థాయిలో ఓ నాయకుడు చక్రం తిప్పారు. ఆ తర్వాత ఎస్బిఐ మాట మార్చింది. భూముల వేలం ముందు నిశ్శబ్దంగా ఉన్న ఎస్బిఐ.. ఆ తర్వాత కోర్టుకు వెళ్ళింది. ఈ వ్యవహారం కాస్త వివాదంగా మారింది. వాస్తవానికి 2021 లోనే ఈ భూములకు సంబంధించి భారత రాష్ట్ర సమితి ఎస్బిఐ కి కేటాయించిన భూములను రద్దు చేస్తున్న నిర్ణయం తీసుకుంది. అంత కాదు దీనికి ప్రత్యామ్నాయంగా గండిపేట ప్రాంతంలో భూమి ఇవ్వాలని కూడా భావించింది. అంతేకాదు ప్రత్యామ్నాయ భూమి కి దరఖాస్తు చేసుకోవాలని 2023లో ఎస్బిఐ కి అప్పటి ప్రభుత్వం లేఖ రాసింది.

ఇటీవల రాయదుర్గం భూములను వేలం వేసిన తర్వాత రాజకీయ పార్టీ మాదిరిగా ఎస్బిఐ వ్యవహరించింది. ప్రభుత్వం మీద ఏకంగా హైకోర్టు దాకా వెళ్ళింది. దీనిని నమస్తే తెలంగాణ పిచ్చిపిచ్చిగా రాసింది. గులాబీ పార్టీ నేతలు కూడా వీర లెవల్లో నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టారు. రేవంత్ రెడ్డి రంగంలోకి దిగిన తర్వాత అసలు కథ మొదలైంది. ఎస్బిఐ వెనక రాజకీయ శక్తులు ఉన్నాయని అర్థమైంది. దీంతో ఏకంగా ఎస్బిఐ మీద రేవంత్ రెడ్డి యుద్ధం ప్రకటించారు. లీడ్ బ్యాంకు హోదాను తొలగించాలని.. ప్రభుత్వ డిపాజిట్లు.. ఇతర నగదు నిల్వలు మొత్తం వెనక్కి తీసుకోవాలని నిర్ణయించారు.

ఈనేపథ్యంలో ఎస్బిఐ వెనక్కి తగ్గింది. అంతేకాదు ఢిల్లీ లెవెల్ లో రేవంత్ రాజకీయం నడపడంతో తట్టుకోలేక సైలెంట్ అయిపోయింది. అంతేకాదు సిఎస్ రామకృష్ణారావుతో ఎస్బిఐ సిజిఎం భేటీ అయ్యారు. భూమికి సంబంధించి గడువు కావాలని కోరారు. కోర్టు వాయిదా ఏం నిర్ణయం తీసుకోలేమని స్పష్టం చేశారు. లీడ్ బ్యాంకు హోదాను తొలగించకూడదని విన్నవించారు. ఈ సమావేశం పూర్తికాగానే చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఢిల్లీ వెళ్ళిపోయారు. నివేదికను ముఖ్యమంత్రి సమర్పించారు. దీనిపై రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మరి కొద్ది రోజుల్లో పెళ్లి.. వరుడికి ఫొటోలు.. చివరికి ఈ అమ్మాయి జీవితం ఏమైందంటే..

Rakshita Mysuru Case
Rakshita Mysuru Case

Rakshita Mysuru Case: అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ సమయానికి ఆ ఇంట్లో పెళ్లి భాజాలు మోగేవి. బంధువుల సందడితో ఆ ఇంటి ప్రాంగణం మొత్తం సందడిగా ఉండేది. అవన్నీ జరిగితే ఈ వార్త రాయాల్సిన అవసరం ఉండేది కాదు. ఆ దంపతులు ఒకటి తలిస్తే.. ఆ అమ్మాయి మరొకటి కోరుకుంటే.. జరిగింది ఇంకొకటి. చివరికి ఆ కుటుంబం చేసిన పని సభ్య సమాజాన్ని కన్నీరు పెట్టేలా చేస్తోంది.

అది కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు.. అక్కడ శివన్న, నాగరత్న దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి రక్షిత అనే అమ్మాయి ఉంది. రక్షిత ఉన్నత చదువులు చదివింది. ఇటీవల శివన్న, నాగరత్న దంపతులు ఆమెకు వివాహం చేయాలని నిర్ణయించారు. తెలిసిన యువకుడితో పెళ్లి నిర్ణయించారు. ఎంగేజ్మెంట్ వేడుక కూడా ఘనంగా నిర్వహించారు. మరి కొద్ది రోజుల్లో వివాహం జరపడానికి ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టారు.

ఇదంతా జరుగుతుండగానే వరుడికి కొన్ని ఫోటోలు వెళ్లాయి. ఒక యువకుడు తన వాట్సాప్ ద్వారా వరుడికి ఫోటోలు పంపించాడు. దీంతో రక్షిత ఆందోళన చెందింది. ఆమె తల్లిదండ్రులు కూడా కన్నీటి పర్యంతమయ్యారు. దీనికి ప్రధాన కారణం రక్షిత స్నేహితుడు. అతడి పేరు ఉల్లాస్ గౌడ. రక్షితకు, ఇతడికి స్నేహం ఉంది. అతడిని స్నేహితుడిగా భావించి చనువిచ్చింది. అతడు మరో విధంగా ఆలోచించి.. ఫోటోలు.. వీడియో తీసుకున్నాడు. ఎప్పుడైతే రక్షతకు ఎంగేజ్మెంట్ అయ్యిందో.. అప్పటి నుంచి ఉల్లాస్ గౌడ రక్షితను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. పెళ్లి చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. ఫోటోలు.. వీడియోలు బయట పెడతానని తరచూ వేధించేవాడు.

ఉల్లాస్ గౌడ వేధింపులతో రక్షిత అవమాన భారంతో కృంగిపోయింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పుకొని బాధపడింది. ఉల్లాస్ గౌడ వేధింపులు మరింత పెరిగిపోవడం.. తనని పెళ్లి చేసుకోపోతే కళ్యాణ మండపంలో గొడవ చేస్తానని చెప్పడంతో.. శివన్న.. నాగరత్న.. రక్షిత ఆత్మహత్య చేసుకున్నారు. అంతేకాదు ఒక లేఖ కూడా రాశారు. పోలీసులు ఉల్లాస్ గౌడ మీద కేసు నమోదు చేశారు. రక్షిత అతనితో స్నేహంగానే ఉండేదని.. పుల్లాస్ గౌడ వేరే కోణంలో ఆలోచించి ఫోటోలు.. తీసుకున్నాడని.. నాడు రక్షిత ఈ వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. ఆమె చూసీచూడకుండా పోవడం వల్లే ఇంత జరిగిందని ఆ రోజే అతడికి కట్టడి విధించి ఉంటే ఇక్కడదాకా వచ్చేది కాదని స్థానికులు అంటున్నారు.