Homeఆంధ్రప్రదేశ్‌YSRCP hawala case: వైసీపీకి హవాలా దెబ్బ!

YSRCP hawala case: వైసీపీకి హవాలా దెబ్బ!

YSRCP hawala case: ఏపీలో మద్యం కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ఒకవైపు పూర్తికాగా.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోవైపు రంగంలోకి దిగింది. హవాలా మూలాలను కనుక్కొని ప్రయత్నంలో ఉంది. అయితే తాజాగా నిందితుల ఇళ్లలో జరిపిన సోదాల్లో ఒక హవాలా నంబర్ కరెన్సీ నోటు ముక్క అధికారులకు దొరికినట్లు తెలుస్తోంది. దీని ఆధారంగా అనేక రహస్య లావాదేవీలపై ఈడి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ మద్యం కుంభకోణంలో […]

YSRCP hawala case: ఏపీలో మద్యం కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ఒకవైపు పూర్తికాగా.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోవైపు రంగంలోకి దిగింది. హవాలా మూలాలను కనుక్కొని ప్రయత్నంలో ఉంది. అయితే తాజాగా నిందితుల ఇళ్లలో జరిపిన సోదాల్లో ఒక హవాలా నంబర్ కరెన్సీ నోటు ముక్క అధికారులకు దొరికినట్లు తెలుస్తోంది. దీని ఆధారంగా అనేక రహస్య లావాదేవీలపై ఈడి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ మద్యం కుంభకోణంలో హవాలా రూపంలో పెద్ద ఎత్తున నగదు మొత్తం చేతులు మారిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈడి ఎంట్రీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం చేపట్టిన విచారణలో కొంత వివరాలను తీసుకుంది ఈడి. ఈ వ్యవహారంలో ఏపీ బేవరేజెస్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి తో పాటు కీలక నిందితుడిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డిలను అరెస్టు చేసింది ఈడి. మరోవైపు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కుమార్ సైతం అరెస్టయ్యారు. అయితే ఆయనను విచారించే భాగంలో సునీల్ కుమార్ ఫోన్ ను పరిశీలించినప్పుడు ఒక కరెన్సీ నోటు ముక్క ఫోటోను ఒక నిర్దిష్ట నెంబర్ కు పంపినట్టు అధికారులు గుర్తించారు.

ఇక మరింత దూకుడుగా..
అయితే ఇప్పటివరకు మద్యం కుంభకోణం దర్యాప్తు ఒక ఎత్తు.. ఇకనుంచి మరో ఎత్తు అన్నట్టు సాగనుంది. ఈ హవాలా నోటు ముక్కతో దర్యాప్తు చేపట్టిన ఈడికి కళ్ళు బైర్లు కమ్యూనిజాలు బయటకు వచ్చాయి. ఈ హవాలా కుంభకోణం దాదాపు 195 కోట్ల రూపాయలు అని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది ఈడి. వైసీపీ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం సరఫరా కాంట్రాక్టును సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్, ప్రసాద్ ట్రాన్స్పోర్ట్ కు కట్టబెట్టారు. సిగ్మా సంస్థ నుంచి ఒళ్ళు సందీప్ కు చెందిన సుదర్శన్ కన్స్ట్రక్షన్ కు సబ్ కాంట్రాక్టు దక్కింది. అక్కడి నుంచి నిధులు సునీల్ కుమార్ కు చేరాయి అని ఈడి గుర్తించింది. ఈ నిధులను సునీల్ కుమార్ హవాలా ద్వారా దారి మళ్లించి ఆస్తులు కూడా పెట్టారని.. గత ఎన్నికల్లో భారీగా ఖర్చు చేశారని ఈడీ అనుమానిస్తోంది.

తిరుగులేని ఆధారం..
కేవలం హవాలా ద్వారా ఈ కేసులో భారీగా నగదు చేతులు మారిందన్న అనుమానంతోనే ఈడి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా దొరికిన ఈ నోటు ముక్క ఫోటో తో తిరుగులేని ఆధారం లభించినట్లు అయింది. ఈ ఫోటోను ఎవరికి పంపారు గుర్తిస్తే మరిన్ని ఆస్తులతో పాటు లావాదేవీల చిక్కుముడులు వీడనున్నాయి. సాధారణంగా హవాలా మార్గంలో బ్లాక్ మనీ బదిలీ చేయడానికి ఇలాంటి సగం కరెన్సీ నోటు ముక్కల ఫోటోలను టోకెన్లుగా ఉపయోగిస్తారు. మద్యం కుంభకోణంలో ఇలా బ్లాక్ మనీని హవాలా రూపంలో పంపించినట్లు ఈడి అనుమానించింది. ఆ అనుమానమే నిజం అయింది. ఈ వ్యవహారంలో మరింత లోతుగా విచారించేందుకు ఈడీ అధికారులు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు నోటీసులు జారీ చేశారు. అందుకు ఆయన ఈరోజు విచారణకు హాజరయ్యారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper