Homeఅంతర్జాతీయంJD Vance Diplomacy: అమెరికా – ఇరాన్‌ చర్చలు.. వాన్స్‌ను రక్షణ కవచంగా వాడుతూ...

JD Vance Diplomacy: అమెరికా – ఇరాన్‌ చర్చలు.. వాన్స్‌ను రక్షణ కవచంగా వాడుతూ ట్రంప్‌ సేఫ్‌ గేమ్‌!

JD Vance Diplomacy: వంద రోజులకుపైగా జరిగిన అమెరికా – ఇరాన్‌ వార్‌ ముగిసింది. శాంతి చర్చలు జరుగుతున్నాయి. తుది డీల్‌ కుదరాల్సి ఉంది. అయితే ఈ సమయంలో ట్రంప్‌ సేఫ్‌ గేమ్‌ మొదలు పెట్టారు. స్విట్జర్లాండ్‌లో జరిగిన అమెరికా–ఇరాన్‌ చర్చల్లో ఇరాన్‌ ప్రతినిధులు ఆకస్మాత్తుగా సమావేశం నుంచి బయటకు వెళ్లిపోవడం దౌత్యపరమైన వివాదంగా మారింది. ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరఘ్చీ పాకిస్తాన్‌ నాయకులతో మాట్లాడి, అమెరికా బృందం వైపు చూడకుండా వెనుదిరగడం సోషల్‌ మీడియాలో […]

JD Vance Diplomacy: వంద రోజులకుపైగా జరిగిన అమెరికా – ఇరాన్‌ వార్‌ ముగిసింది. శాంతి చర్చలు జరుగుతున్నాయి. తుది డీల్‌ కుదరాల్సి ఉంది. అయితే ఈ సమయంలో ట్రంప్‌ సేఫ్‌ గేమ్‌ మొదలు పెట్టారు. స్విట్జర్లాండ్‌లో జరిగిన అమెరికా–ఇరాన్‌ చర్చల్లో ఇరాన్‌ ప్రతినిధులు ఆకస్మాత్తుగా సమావేశం నుంచి బయటకు వెళ్లిపోవడం దౌత్యపరమైన వివాదంగా మారింది. ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరఘ్చీ పాకిస్తాన్‌ నాయకులతో మాట్లాడి, అమెరికా బృందం వైపు చూడకుండా వెనుదిరగడం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఇది ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు జరిగిన అవమానం. అయితే ఈ ఘటన వెనుక ఉన్న అసలు రాజకీయ ఆటలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి.

స్విట్జర్లాండ్‌లో జరిగిన ఘటనకు కారణాలు..
ఇరాన్‌ మీడియా కథనాల ప్రకారం, అమెరికా ప్రతినిధులతో ఫొటో దిగాలన్న ప్రతిపాదన, అదే సమయంలో ట్రంప్‌ జారీ చేసిన హెజ్‌బొల్లా హెచ్చరికలు ఇరాన్‌ బృందానికి అసంతృప్తిని కలిగించాయి. దీంతో వారు తాత్కాలికంగా సమావేశం నుంచి బయటకు వెళ్లారని తెలుస్తోంది. ఇరానీయులు చర్చల్లో కొన్నిసార్లు అస్పష్టంగా వ్యవహరించడం సాధారణమని వాన్స్‌ స్పష్టం చేశారు. ఆ ఘటన తర్వాత కూడా తాము తొమ్మిది గంటలపాటు చర్చలు కొనసాగించామని ఆయన చెప్పారు. సోషల్‌ మీడియా దృశ్యాల కంటే నిజమైన చర్చల పరిణామాలు ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు.

ఒప్పందంపై రిపబ్లికన్‌ వ్యతిరేకత..
ఇదిలా ఉంటే ఇరాన్‌తో సాధ్యమయ్యే తాత్కాలిక ఒప్పందంలో చమురు ఆంక్షల సడలింపు, స్తంభించిన ఆస్తుల విడుదల, ఇరాన్‌ పునర్నిర్మాణానికి భారీ ఆర్థిక సహాయం వంటి అంశాలు రిపబ్లికన్‌ వర్గాల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్‌ ఒప్పందాన్ని విజయవంతం చేస్తే క్రెడిట్‌ తనదని, విఫలమైతే నింద మాత్రం వేరొకరిపై పడేలా వ్యూహం రచిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. అందుకే ట్రంప్‌ వాన్స్‌ను ముందు పెడుతున్నారని భావిస్తున్నారు. విదేశాంగ మంత్రి మార్కో రుబియో, రక్షణ శాఖ నాయకులు వెనక్కి తగ్గగా, విమర్శలన్నీ వాన్స్‌ భుజాలపై పడుతున్నాయి. ట్రంప్‌ ‘ఒప్పందం విజయవంతమైతే క్రెడిట్‌ నాదే, విఫలమైతే నింద జేడీదే‘ అని చేసిన వ్యాఖ్యలు ఈ వ్యూహాన్ని స్పష్టం చేస్తున్నాయి. రిపబ్లికన్‌ వర్గాలు దీన్ని ఇప్పటికే ‘వాన్స్‌ డీల్‌‘ అని పిలవడం మొదలుపెట్టాయి.

వాన్స్‌కు రాజకీయంగా గర్తింపు..
ఒప్పందం విజయవంతమైతే 2028 అధ్యక్ష ఎన్నికల్లో వాన్స్‌కు గణనీయమైన రాజకీయ లాభం కలిగే అవకాశం ఉంది. అయితే చర్చలు విఫలమైతే లేదా ఇరాన్‌ మళ్లీ సమస్యలు సృష్టిస్తే, ఆ రాజకీయ దెబ్బ ముందుగా వాన్స్‌కే తగిలే ప్రమాదం ఉంది. ట్రంప్‌ తాను సురక్షిత దూరంలో ఉండి, వాన్స్‌ను బాధ్యతలో పెట్టి రాజకీయంగా ఆడుతున్నారని అమెరికా మీడియా విశ్లేషిస్తోంది. ఇది ట్రంప్‌కు సాధారణమైన రక్షణ వ్యూహం అని, వాన్స్‌ను పరీక్షించే అవకాశం కూడా అని నిపుణుల అభిప్రాయం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper