Infinix smartphone: కొత్తగా మొబైల్ కొనే సమయంలో వినియోగదారులు తమకు అనుగుణంగా ఉండేలా ఫీచర్లు ఉన్న వాటిని ఎంచుకుంటున్నారు. ఇదే సమయంలో డిజైన్ గురించి కూడా ఆరా తీస్తున్నారు. ఇలాంటి వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని ప్రముఖ మొబైల్ కంపెనీ ఇన్‌ఫినిక్స్ (Infinix) బ్రాండ్ నుండి సరికొత్త, ప్రీమియం లుక్ కలిగిన నోట్ 60 ప్రో 5G పినిన్‌ఫారినా లిమిటెడ్ ఎడిషన్ ను భారత మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. ప్రసిద్ధ ఇటాలియన్ లగ్జరీ కార్ డిజైనింగ్ సంస్థ ‘పినిన్‌ఫారినా’ భాగస్వామ్యంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇన్‌ఫినిక్స్ ప్రత్యేకంగా రూపొందించింది. ఈ సరికొత్త సూపర్ కార్ ఇన్‌స్పైర్డ్ మొబైల్ గురించిన పూర్తి వివరాల్లోకి వెళితె..
Infinix నుంచి వచ్చే ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాలAMOLED డిస్‌ప్లేతో ఉంటుంది. ఇది1.5K రిజల్యూషన్ తో పనిచేస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉన్న ఈ మొబైల్ గరిష్టంగా 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. అలాగే స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ని ఉపయోగించారు. ఈ ఫోన్ వెనుక భాగంలో కెమెరా పక్కన ఒక ‘యాక్టివ్ మ్యాట్రిక్స్ సెకండరీ డిస్‌ప్లే’ కూడా ఉంటుంది.
ఈ ఫోన్ యొక్క ప్రధాన ఆకర్షణ దీని డిజైన్. ఇటాలియన్ స్పోర్ట్స్ కార్ల శైలిని ప్రతిబింబించేలా దీని వెనుక ప్యానెల్‌కు ‘కార్బన్ ఫైబర్ ఫినిషింగ్’ (Carbon Fibre Finish) ఇచ్చారు. దీని చుట్టూ 360 డిగ్రీల ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్, కెమెరా మాడ్యూల్ చుట్టూ రెడ్ కలర్ యాక్సెంట్లు ఫోన్‌కు మరింత లగ్జరీ లుక్‌ను ఇస్తాయి.
ఇన్‌ఫినిక్స్ నోట్ 60 ప్రో పినిన్‌ఫారినా ఎడిషన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్‌ను అమర్చారు. గేమింగ్ కోసం ఉపయోగించినప్పుడు ఫోన్ వేడెక్కకుండా ఇందులో ‘3D ఐస్‌కోర్ వీసి కూలింగ్’ చాంబర్ ఉంది. అలాగే 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా వైడ్ లెన్స్ ఉన్నాయి. 13MP సెల్ఫీ కెమెరాను అందించారు. ఈ రెండు కెమెరాల ద్వారా 4K వీడియోలను రికార్డ్ చేయవచ్చు.
బ్యాటరీ పరంగా ఈ ఫోన్ చాలా బలంగా ఉంది. ఇందులో 6500mAh భారీ బ్యాటరీని అందించారు. దీనికి తోడు 90W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 30W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత XOS 16 సాఫ్ట్‌వేర్‌పై నడుస్తుంది. కంపెనీ దీనికి 3 సంవత్సరాల మేజర్ ఓఎస్ అప్‌గ్రేడ్‌లు మరియు 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లను గ్యారెంటీ ఇస్తోంది.
సాధారణ ఇన్‌ఫినిక్స్ నోట్ 60 ప్రో (8GB+256GB) ధర ప్రస్తుతం రూ. 33,999 గా ఉంది. అయితే, ఈ పినిన్‌ఫారినా ఎడిషన్ కేవలం 12GB RAM + 256GB స్టోరేజ్ సింగిల్ వేరియంట్‌లోనే, ప్రీమియం డిజైన్ మరియు లగ్జరీ యాక్సెసరీలతో వస్తుండటంతో దీని ధర సుమారు రూ. 36,999 లేదా అంతకంటే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ ప్రత్యేకమైన పినిన్‌ఫారినా ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ జూన్ 24, 2026 న మధ్యాహ్నం 12 గంటలకు భారతదేశంలో అధికారికంగా విడుదల కానుంది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం Flipkart తో పాటు ఇన్‌ఫినిక్స్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ మొబైల్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.
