Home Blog Page 8379

పెళ్లితో రానా హ్యాపీ.. కానీ వాళ్లకే కష్టం !


కరోనా సమయంలోనూ ముదురు పోయిన మన హీరోలు పెళ్లిళ్ల హడావుడిలో పడిపోయారు. ఎలాగూ ఖాళీగా ఉన్నాం కదా అని పెళ్లి పీటలెక్కేస్తున్నారు. దగ్గుబాటి వారసుడుగా నేషనల్ లెవల్లో క్రేజ్ తెచ్చుకున్న రానా నిన్న పెళ్లి చేసుకున్నాడు. మొత్తానికి తాను కోరి ప్రేమించిన మిహీక బజాజ్‌ ను వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లితో రానా హ్యాపీ అయినా రానాతో సినిమా చేస్తోన్న ఓ చిత్రబృందానికి మాత్రం కాస్త ఇబ్బంది కలిగేలా ఉంది. ‘నీది నాది ఒకే కథ’ అనే చిన్న సైజు కథలో కొత్త సంఘర్షణను జోడించి మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ ‘వేణు ఉడుగుల’ దర్శకత్వంలో రానా, సాయిప‌ల్ల‌వి హీరోహరోయిన్లుగా వస్తోన్న సినిమా ‘విరాటపర్వం‘.

Also Read: హాట్‌ బ్యూటీ.. హారర్ వెబ్‌ సిరీస్‌

కరోనా రాకపోయి ఉంటే ఈ పాటికే ఈ సినిమా రిలీజ్ అయిపోయేది. కానీ కరోనా దెబ్బతో సినిమా మధ్యలో ఆగింది. ఇప్పుడు పెళ్లి కారణంగా రానా ఈ ఏడాది మొత్తం షూటింగ్స్ కి గ్యాప్ ఇచ్చేశాడు. ఈ మేరకు ఇప్పటికే డైరెక్టర్ కి కూడా క్లారిటీ ఇచ్చాడు. పైగా వచ్చే ఏడాది స్టార్టింగ్ లో కూడా ఈ సినిమా కోసం రానా డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదట. ఆల్ రెడీ ఒప్పుకున్న ఓ హిందీ సినిమాతో పాటు మరో తెలుగు సినిమాకి డేట్స్ ముందుగా ఇవ్వాలట. ఆ సినిమాల షూటింగ్స్ వ్యవహారం ముగిశాక.. తిరగ్గా విరాటపర్వంకు వస్తాడట రానా. అంటే దాదాపు మరో సంవత్సరం దాకా విరాటపర్వం ఖాళీనే. దానికితోడు విరాటపర్వంను నమ్ముకునోళ్లు కూడా ఖాళీగా కూర్చోవాలి. పాపం ఒకవేళ కరోనా తగ్గినా కూడా విరాటపర్వం టీమ్ కి మాత్రం షూటింగ్ చేసుకునే అవకాశం లేదు.

Also Read: కరోనా జయించిన బిగ్‌బీ కుటుంబం..

ఇక పొలిటికల్‌ పీరియాడిక్ థ్రిల్లర్ గా రానున్న ఈ సినిమాలో కొత్త కోణాలు చాలా ఉన్నాయని మెయిన్ గా రానా పాత్రలో కొంత నెగిటివ్ యాంగిల్ ఉంటుందని, అది సినిమాలో హైలైట్ గా అనిపిస్తోందని తెలుస్తోంది. కాగా తెలంగాణ ప్రాంతంలోని 1980 – 90 నాటి సామాజిక పరిస్థితుల ఆధారం చేసుకుని ఈ కథను రాసుకున్నాడట వేణు ఉడుగుల. సినిమాలో ఆ నాటి దళారుల వ్యవస్థను కళ్లకు కట్టినట్టు చూపించబోతున్నారు. అన్నట్టు డి. సురేష్‌బాబు, సుధాక‌ర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ ఫేమ‌స్ న‌టి నందితా దాస్‌, ఈశ్వ‌రీరావు, జ‌రీనా వ‌హాబ్ తో పాటు ప్రియ‌మ‌ణి కూడా ఒక కీల‌క పాత్ర‌లో నటిస్తోంది.

బన్నీకి డిజార్డర్.. రష్మిక కు బికినీ !


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్పుష్ప‘ సినిమాలో బన్నీ డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాడని.. సినిమాలో బన్నీ బైపోలార్ డిజార్డర్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడని లేటెస్ట్ సమాచారం. అన్నట్టు ఈ బైపోలార్ డిజార్డర్ ఉన్నవారిలో మానసిక అసమతౌల్యతలు విపరీతంగా ఉంటాయి. అంటే సంతోషంగా ఉన్నప్పుడు మరీ ఎక్కువగా ఎగ్జయిట్‌మెంట్‌కి లోను కావడం, అలాగే బాధగా ఉన్నప్పుడు మరీ విపరీతంగా ప్రవర్తించడం వంటి లక్షణాలు ఉంటాయి. అసలు బన్నీ మామూలుగానే ఫుల్ ఎగ్జయిట్‌మెంట్‌ తో ఉంటాడు. అలాంటిది ఎగ్జయిట్‌మెంట్‌ రోల్ అంటేనే ఇక ఎలా ఉంటుందో చూడాలి.

Also Read: నాని హీరోయిన్‌కు బంపరాఫర్!

ఏమైనా క్రియేటివ్ డైరెక్టర్ అని పేరు తెచ్చుకున్నందుకు సుకుమార్ ఏదోకటి కొత్త పాయింట్ ను పట్టుకోవడానికి తెగ తాపత్రయ పడుతుంటాడు. అందులో భాగంగానే ఇలా ఓ డిజార్డర్ క్యారెక్టర్ ను రాసుకున్నాడు. అన్నట్టు ఈ ‘పుష్ప’ షూటింగ్ ను నవంబర్ నుండి స్టార్ట్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ముందుగా సాధ్యమైనంత తక్కువమంది స‌భ్యుల‌తో షూట్ స్టార్ట్ చేసి అంతా ఓకే అనుకుంటేనే షూటింగ్ ను కంటిన్యూ చేస్తారట. పైగా స‌భ్యులంద‌రికీ కరోనా టెస్ట్ చేసి, వారికీ కరోనా సోకే అవకాశం లేకుండా టీమ్ అందర్నీ షూట్ జరుగుతున్న అంత కాలం జన సాంద్రతకు దూరమైన ప్రాంతంలోనే ఉంచి సింగిల్ షెడ్యూల్ లోనే సినిమాని పూర్తి చేయాలనేది సుకుమార్ ప్లాన్. కానీ ఎక్కువ టైం తీసుకునే సుకుమార్ స్పీడ్ గా షూట్ ఎంతవరకు చేస్తాడు అన్నదే ఇక్కడ డౌట్.

Also Read: మరో కొత్త డైరెక్టర్​తో సాయి ధరమ్!

నిజానికి ఈ నెల నుండే బన్నీ – రష్మిక పై సాంగ్ షూట్ చేయాలనుకున్నారు. అలాగే ఈ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ కోసం బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలాను తీసుకున్నారు. ముందుగా ఈ రెండు సాంగ్స్ ను షూట్ చేద్దామనుకున్నప్పటికీ కరోనా ప్రభావం రోజురోజుకు పెరుగుతుండటంతో ఇక షూటింగ్ ని పోస్ట్ ఫోన్ చేసుకున్నారు. ఇక ఈ చిత్రంలో బన్నీకి జోడీగా వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమా కోసం అమ్మడు బికినీ వేయడానికి కూడా ఒప్పుకుందట. ఇక దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఎప్పుడూ బిజీగా ఉండే దేవీ శ్రీ, ఈసారి కూల్‌ గా తీరిగ్గా కూర్చుని మ‌రీ పుష్ప సినిమాకి ట్యూన్స్ కంపోజ్ చేస్తుండంతో సాంగ్స్ పై భారీ అంచనాలు ఉన్నాయి. వాటిని దేవి అందుకోలేకపోతే కెరీర్ పైనే ఎఫెక్ట్ పడుతుంది.

కేసీఆర్ పై కోపం.. కానీ ఏం చేయలేకపోతున్నారు!


తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఆ వర్గంలో పీకలదాకా కోపం ఉంది.. కానీ వారు ఏం చేయలేకపోతున్నారు. సగం జీతం ఇచ్చినా ముక్కు ములిగి తీసుకున్నారు తప్పితే ధైర్యంగా అడగలేని పరిస్థితి. ఇక పక్కరాష్ట్రంలో తమ స్కేలు వారికి తమకంటే డబుల్ జీతం వస్తున్నా.. నిస్సహాయంగా చూస్తున్న పరిస్థితి. తెలంగాణ ఉద్యోగ సంఘాల్లో ఇప్పుడు పీఆర్సీ చిచ్చు పీక్స్ లో నడుస్తోందన్న చర్చ సాగుతోంది. సీఎం కేసీఆర్ ఢీకొట్టలేక.. అలాగని ఊరుకొంటుంటే.. జీతాలు నష్టపోతూ తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయులు గుర్రుగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.

Also Read: రాజకీయాల్లో రేణుక ప్రస్థానం ముగిసినట్లేనా?

తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో ఫైట్ చేశారు ఉద్యోగ, ఉపాధ్యాయులు.. నిరుద్యోగులు. కానీ తెలంగాణ వచ్చాక వీరికి అస్సలు ప్రాధాన్యత లేకుండా పోయింది. నిరుద్యోగులకు ఉద్యోగాల్లేవు.. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీలు, డీఏలు , టీఏలు సరిగా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వకపోవడంతో వారంతా తీవ్రంగా నష్టపోతున్నారు.

పక్కనున్న ఏపీలో గత చంద్రబాబు ప్రభుత్వం పీఆర్సీతోపాటు టీఏ, డీఏలను పెంచగా వారి జీతాలు భారీగా పెరిగాయి. ఏపీలో 70వేల పైచిలుకు తీసుకుంటున్న ఉద్యోగికి.. అదే క్యాడర్ లో తెలంగాణలో 50వేలు మాత్రమే తీసుకుంటున్నారని ఉద్యోగ సంఘాల నేతలు వాపోతున్నారు.

తెలంగాణలో ఇప్పుడు సీఎం కేసీఆరే సుప్రీం. ఆయనను ఎదురించి సమ్మెకెళ్లిన ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితిని కళ్లారా చూశాం. పైగా ఉద్యోగులను సంఘాలుగా విభజించి కేసీఆర్ చాలా మందిని తన చెప్పు చేతుల్లో పెట్టుకున్నాడు. దీంతో ఎవరూ పోరాటానికి రాని పరిస్థితి నెలకొంది.

Also Read: దేవుడి కోసం టీఆర్ఎస్ లో ఫైట్?

అందుకే పక్కరాష్ట్రంలో ఉద్యోగుల జీతాలకు.. తెలంగాణ ఉద్యోగుల జీతాలకు షాన్ దాన్ ఫరఖ్ ఉందని.. కేసీఆర్ చేయబట్టి తాము నష్టపోయామన్న బాధ ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో పెద్ద ఎత్తున ఉంది. కేసీఆర్ ను ఓడగొట్టాలని వారంతా పట్టుదలతో ఉన్నారు. కానీ వీరి సంఖ్యా బలం తక్కువ. తెలంగాణలో అత్యధికంగా ఉన్న రైతులు, గ్రామీణులను గుప్పిట పట్టిన కేసీఆర్.. అసలు ఓటు బ్యాంకు కానీ ఉద్యోగ, ఉపాధ్యాయుల విషయంలో శీతకన్ను వేయడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

Pranavum Movie Posters

అదే జరిగి ఉంటే విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో ఎంతో మంది బ్రతికేవారు..!

ఈ రోజు తెల్లవారుజామున విజయవాడ ఏలూరు రోడ్డు లోని కళా స్వర్ణ ప్యాలస్ లో జరిగిన ఘటన రాష్ట్రాన్ని షాక్ కు గురి చేసింది. రమేష్ ఆస్పత్రి కోవిడ్ సెంటర్ గా స్వర్ణ ప్యాలెస్ ను లీజుకు తీసుకుని వైరస్ బాధితుల కు చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. అలాంటి రోగులకు ఇలా ఫైర్ యాక్సిడెంట్ ద్వారా ప్రాణాలు కోల్పోవడం నిజంగా అందరి హృదయాలను కలచివేసింది. ఇక తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 10 మంది చనిపోయారు. అగ్నిమాపక సిబ్బంది సమయానికి ప్యాలెస్ వద్దకు చేరుకున్నా కూడా… మంటల తీవ్రత ఎక్కువ కావడంతో వారు అందరినీ కాపాడలేకపోయారు.

 

ఇకపోతే ప్రమాద సమయంలో రోగులు, వైద్యం అందిస్తున్న వారు కలుపుకుని మొత్తం 50 మంది వరకూ ఆ భవనం లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రమాద వివరాలను ఏపీ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన మరియు అగ్నిమాపక సేవల విభాగం డైరెక్టర్ నాయక్ మాట్లాడుతూ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించిందని వివరించారు. స్వర్ణ ప్యాలెస్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగానే షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి తర్వాత సగం భాగం వరకు భవనం పూర్తిగా కాలిపోయింది అని చెప్పారు.

ఇక ఇలాంటి అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు మోగాల్సిన ఫైర్ అలారం మోగలేదని…. అలాగే ఎమర్జెన్సీ బ్యాక్ డోర్ తెచ్చుకోవడంతో జాప్యం జరిగిందని దాని వల్లనే ఇంత నష్టం వాటిల్లిందని తెలిపారు. ఆ రెండూ కనుక సరిగ్గా పనిచేసి ఉంటే అందరూ అలెర్ట్ అయి తక్షణమే భవనం ఖాళీ చేసేవారని ఒక్క ప్రాణానికి కూడా అపాయం జరిగేది కాదని చెబుతున్నారు. భారీ స్థాయిలో మంటలు చెలరేగడంతో మొదటి అంతస్తులో ఉన్న వారంతా భవనం నుండి కిందకు దూకేశారు. ఇక మెట్ల మీద నుండి వచ్చే వీలు కూడా లేక పై అంతస్తులో ఉన్న వారు అలాగే మంటల్లో చిక్కుకొని కాలిపోగా మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయి తెలుస్తోంది.

ఇక ఈ విషయమై ప్రధాని మోడీ వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరినట్లు సమాచారం. జగన్ ప్రభుత్వం తక్షణమే 50 లక్షల రూపాయలను బాధితుల కుటుంబాలకు అందిస్తామని ప్రకటించగా అసలు ఇటువంటి ఘటనలు జరగకుండా హోటల్ యాజమాన్యం మీద తీసుకునే చర్యలు గురించి ఏమి ఇంకా ప్రస్తావించకపోవడం గమనార్హం.

కేటీఆర్ బాటలో నేతలు.. కేసీఆర్ గమనిస్తున్నారు.!


తెలంగాణ రాజకీయంలో ఒక మంత్రి, ముఖ్యమంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు.. ఇలా అందరూ తమ తరువాత తమ వారుసులే రాజకీయాల్లోకి రావాలని.. వారే అధికారం చేపట్టాలని కలలుగంటున్నారు. అదే ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారికి.. యువతకు మార్గాలను లేకుండా చేస్తోందన్న ఆవేదన ఉంది.

Also Read: దేవుడి కోసం టీఆర్ఎస్ లో ఫైట్?

టీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని విపక్షాలు విమర్శిస్తూనే ఉంటాయి. కానీ కాంగ్రెస్ కూడా అదే దారిలో నడుస్తోంది. అయితే ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ ఇప్పుడు తెలంగాణలో ఔత్సాహికులైన సొంతగా ఎదిగే నేతలను ఎదగనీయకుండా చేస్తోంది.. ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ కుటుంబ సభ్యులను తెరమీదకు తీసుకొచ్చి పాగా వేయాలని అడుగులు వేస్తున్నారు..

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడీ సంస్కృతి బాగా పెరిగిపోతోంది. కేసీఆర్ తన రాజకీయ వారసుడు కేటీఆర్ ను తెలంగాణలో ఫోకస్ చేస్తున్నారు. అయితే కేటీఆర్ సీఎం అయితే అంతా యువ జట్టును ఎన్నుకుంటాడని.. తమకు పదవులు రావనే భయం టీఆర్ఎస్ సీనియర్లను వెంటాడుతోంది. ఈ క్రమంలోనే కేటీఆర్ పగ్గాలు చేపట్టేనాటికి తమ వారసులను రాజకీయ అరంగేట్రం చేయించాలని పాత సీనియర్ నేతలంతా భావిస్తున్నారు.

ఇప్పుడు టీఆర్ఎస్ లో చాలా మంది సీనియర్లు, వృద్ధ నాయకులు పార్టీలో తమ వారసులను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నారు.ఈ క్రమంలోనే వారంతా కేటీఆర్ ను కలిసే పనిలో బిజీగా ఉన్నారు. వారి కుమార్తెలు, కుమారులు, మేనల్లుళ్లను కేటీఆర్ కు పరిచయం చేస్తున్నారు. వారికి తగిన పార్టీ పదవుల కోసం లాబీయింగ్ మొదలుపెడుతున్నారు. ఇప్పటికే కేటీఆర్ దృష్టిని ఆకర్షించడానికి పలువురు నాయకులు అనేక కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాలకు కేటీఆర్ ను ఆహ్వానిస్తూ మెప్పు పొందడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.

Also Read: రాజకీయాల్లో రేణుక ప్రస్థానం ముగిసినట్లేనా?

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ స్థానాల్లో తమ వారసులకు టికెట్లు లభించేలా నేతలు కేటీఆర్ నుంచి హామీ తీసుకుంటున్నారు. ఇక కేటీఆర్ కూడా రాజకీయ వారసులను ఆహ్వానిస్తూ ఆ కుటుంబాలకు హామీలు ఇస్తున్నాడని తెలిసింది. ప్రస్తుతం ఈ వారసత్వ రాజకీయాలు టీఆర్ఎస్ లో విస్తృతంగా సాగుతున్నాయి. కేసీఆర్ కూడా వీటిని ప్రోత్సహిస్తూ కుమారుడికి లైన్ క్లియర్ చేస్తున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

-నరేశ్ ఎన్నం

దూకుడు భేష్… మరి దూరదృష్టి ఎక్కడ జగన్ ?

కరోనా సంక్షోభ సమయంలో కూడా ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఆపడం లేదు. ఒకదానిని మించి మరొకటి అన్నట్లుగా ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తోంది. అత్యంత లోటు బడ్జెట్ పరిస్థితిలో కూడా పేదల కోసం సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ…. ముందు తీసుకున్న నిర్ణయాలను ఎటువంటి జాప్యం లేకుండా అమలు చేస్తూ శెభాష్ అనిపించుకున్నాడు ఏపీ ముఖ్యమంత్రి జగన్.

 

తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటవుతున్న వైయస్సార్-జగనన్న కాలనీలలో పేదల కోసం ప్రభుత్వం 15 లక్షల ఇళ్లను నిర్మించనుంది. రాష్ట్రంలో అర్హులైన 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడంతో పాటు వారికి ఇళ్లను కూడా మంజూరు చేయనున్నారు. ఇలా ఇప్పటికే 26 వేల ఎకరాలకు పైగా భూముల్లో లేఅవుట్లు వేసి పట్టాలు పంపిణీ కి ప్రభుత్వం సన్నాహాలు చేసింది. ఇలా జగన్ ఇప్పటికే ఖర్చు పెడుతున్న దానికి మించి ఎక్కువ మొత్తం పేదల కోసం ఖర్చు పెట్టడం నిజంగా ప్రశంసనీయం.

అయితే కరోనా సంక్షోభ సమయంలో కూడా మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటూ ఉన్న జగన్ కు దూరదృష్టి లేకపోవడం నిజంగా విచారకరం అన్నది ఇప్పుడు విశ్లేషకుల మాట. ఇప్పటికే ఎంతోమంది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి గురించి ఎన్నోరకాలుగా మాట్లాడుకుంటున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి వారం వారం తెచ్చుకున్న అప్పులు కాకుండా…. అంతర్జాతీయంగా ప్రైవేటు సంస్థల నుండి తీసుకొస్తున్న అప్పులకు పెరుగుతున్న బకాయిలు చూస్తుంటే కొద్దిరోజుల్లో ఏపీ ఆర్థిక వ్యవస్థ ఊహించలేని నష్టాన్ని ఎదుర్కొంటుందని అంచనా వేస్తున్నారు.

దేశంలో మరే రాష్ట్రానికి ఈ రకమైన పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో రాష్ట్రంలోనే కొత్తగా ఇన్వెస్టర్లను పిలవడం, ఇండస్ట్రీలను స్థాపించడం ఐటీ సెక్ట్టర్ ను డెవలప్ చేసి ప్రజలకు ఉపాధి కల్పించి ఆదాయాన్ని రాష్ట్రంలోనే జెనరేట్ చేసి ఆ ఫండ్స్ ను పేదలకు పంచి పెట్టడం లో ఉపయోగం ఉంటుంది కానీ ఇలా అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని నడిపించే ఆలోచన జగన్ త్వరలో మార్చుకోకపోతే…. ఏపీ ప్రజలపై రానున్న రోజుల్లో పెను భారం పడుతుందని పక్కా అనాలసిస్ ఇచ్చేస్తున్నారు ఆర్థికవేత్తలు.

మోడీ ని జగన్ కోరిన మూడు కోరికలు ఇవే…?

తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ కి ఒక లేఖ రాసింది. ఇప్పటికే మూడు రాజధానులు అమలు పై ఉత్సాహంగా ఉన్నా జగన్ సర్కారు వీలైనంత త్వరగా కొత్త రాజధానిని విశాఖ లో ఏర్పాటు చేసేందుకు శంకుస్థాపన కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని భావిస్తోంది. ఇందులో భాగంగా మోదీని ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని వైసిపి భావిస్తున్నట్టు మొదటి నుండి తెలిసిందే. ఇదే విషయాన్ని మంత్రి వర్యులు కూడా చెప్పారు. ఇక దీనికి సంబంధించిన ఆహ్వానం కోసం ఏపీ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఒక లేఖ రాసినట్లు చెబుతున్నారు. జగన్ తరఫు నుండి ప్రధాని కార్యాలయ సంయుక్త కార్యదర్శి శేషాద్రికి ఈ లేఖ వెళ్లినట్లు సమాచారం.

 

అయితే మొదటిగా ప్రధానితో భేటీ కోసం ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందిగా కోరినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆగస్టు 16న నిర్వహించాలని ఆలోచనతో ఉన్న విషయాన్ని పేర్కొన్నట్లు ప్రకటించారు. ఇక మూడో అంశం కింద పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని…. ఇందులో పాల్గొనేందుకు కూడా మోదీ కి ఆహ్వానం అందించాలన్న ఆలోచనలో వారు ఉన్నట్లు ఆ లేఖలో పొందుపరిచినట్లు చెబుతున్నారు.

ఇక 2022 నాటికి అందరికీ సొంతంగా ఇళ్ళు ఉండాలన్న ప్రధాని లక్ష్యాన్ని ఆచరణలో పెట్టేందుకు వీలుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఇలా ప్రధానిని ఏపీ ఇళ్ల స్థలాల సెంటిమెంట్ తో కొట్టి అదే పనిలో పనిగా ఆగస్టు 16న విశాఖ లో రాజధాని శంకుస్థాపన భూమిపూజకు మోదీ ను పిలవాలన్నదే జగన్ సర్కారు లక్ష్యంగా కనిపిస్తుంది.

ఈ విషయాలను ప్రధానితో చర్చించేందుకు వీలుగా వీలైనంత త్వరగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరినట్లు చెబుతున్నారు. ఇక ఆగస్టు 16 ఈ కార్యక్రమాలను నిర్వహించడమే లక్ష్యం అని…. ఆ తర్వాత మంచి రోజులు కూడా లేవన్న విషయాన్ని లేఖలో వెల్లడించారట. మరి దీనికి మోడీ సమాధానం ఎలా ఉంటుందో వేచి చూడాలి.

ప్రైవేటు కోవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం..!


విజయవాడ నగరంలో ఈ తెల్లవారుజామున దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రైవేటు కోవిడ్ ఆసుపత్రిలో మంటలు చెలరేగటంతో కోవిడ్ రోగులు కొందరు మృతి చెందారు. ప్రముఖ హృద్రోగ నిపుణులు రమేష్ కుమార్ కు చెందిన రమేష్ హాస్పటల్, పాత బస్టాండ్ సమీపంలోని స్వర్ణ పాలెస్ హోటల్ ను అద్దెకు తీసుకుని కోవిడ్ ఆసుపత్రిగా మార్చింది. ఈ ఆసుపత్రిలో కొంత కాలంగా కరోనా రోగులకు చికిత్స అందిస్తుంది. అయితే ఈ రోజు తెల్లవారు జామున ఐదు గంటలకు ఆసుప్రతిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో లోపల ఉన్న పర్నీచర్ అగ్నికి ఆహుతయ్యింది. ఫలితంగా పొగ వ్యాప్తి చెందడంతో మొత్తం ఏడుగురు కరోనా రోగులు ఊపిరాడక మృతి చెందినట్లు తెలుస్తోంది.

Also Read: మూడు రాజధానులకు ముహూర్తం ఖరారు..!

ప్రమాద సమచారం అందిన వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అంబులెన్స్ లు ఏర్పాటు చేసి రోగులకు ఇతర ఆసుపత్రులకు తరలించారు. ఆసుపత్రిలో ఎంత మంది కారోనా రోగులు చికిత్స పొందుతున్నారు, ఇతరులు ఎంత మంది ఉన్నారు వివరాలు సేకరించి వారందరి ఆచూకి కోసం చర్యలు చేపట్టారు.

ప్రమాదానికి విద్యుత్ షార్టు సర్య్కూట్ అవడమే కారణంగా పోలీసులు ప్రాధమిక విచారణలో స్పష్టం అవుతుంది. ప్రమాదం జరిగే సమయానికి ఆసుపత్రిలో 30 మంది వరకూ రోగులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం మాత్రం కేవలం ఐదుగురు రోగులే ఉన్నట్లు తెలిసింది. కావాలనే రోగుల సమాచారం ప్రభుత్వానికి అందించలేదని తెలుస్తోంది. ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ప్రధాని ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టినట్లు, దురదృష్టవశాత్తు కొందరు మృతి చెందారని వీరికి రూ.50 లక్షల పరిహారం ప్రకటించినట్లు ప్రధానికి సిఎం వివరించారు. ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు మృతుల కుటుంబాలకు పరిహారం అందించాలని కోరారు. మరోవైపు పలు పార్టీల నాయకులు ఈ ప్రమాదంపై స్పందించారు.

Also Read: వాలంటీర్ల వ్యవస్థపై ఏంపీ రఘురామ ఏమన్నారంటే?

నగరంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న ఈ భవనం చాలా పాతది. చల్లపల్లి రాజులకు సంబంధించిన భవనం కావడంతో ఈ సెంటర్ కు చల్లపల్లి బంగ్లా సెంటర్ అనే పేరొచ్చింది. ఈ బంగ్లాను కాలక్రమంలో ఇతర వ్యాపారులు కొనుగోలు చేసి రీమోడల్ చేసి హోటల్ గా మార్చారు. ఈ హోటల్ ను కొన్నేళ్ల కిందట ప్రముఖ సినీనటుడు కోనుగోలు చేసినట్లు సమాచారం. ఇంత పాత హోటల్ లో ఆసుపత్రి ఏర్పాటు చేయడంపై సరైన చర్య కాదనే విమర్శలు వస్తున్నాయి.

అవార్డు విన్నింగ్‌ డైరెక్టర్​తో రాజశేఖర్ మూవీ?


పీఎస్‌వీ గరుడ వేగ’ మూవీతో వెండితెరపై కొత్త లైఫ్‌ ప్రారంభించాడు సీనియర్ హీరో రాజశేఖర్. ఒకప్పుడు యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా, కుటుంబ ప్రేక్షకులు విపరీతంగా ఆరాధించే హీరోగా పేరు తెచ్చుకున్న అతను చాన్నాళ్లు ఫెయిల్యూర్స్‌లో ఉన్నాడు. రీమేక్‌ మూవీస్‌, ఒకే తరహా చిత్రాలు చేసి చేతులు కాల్చుకున్నాడు. కానీ, కొంత గ్యాప్‌ తీసుకొని, లుక్‌ మార్చుకొని 2017లో గరుడవేగతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆ మూవీ అనూహ్య విజయం సాధించడంతో రాజశేఖర్ లైఫ్‌ టర్న్‌ అయింది. లాస్ట్‌ ఇయర్ ‘కల్కి’తో పలుకరించాడు. బాక్సాఫీస్‌ దగ్గర ఆకట్టుకోలేకపోయిన ఆ మూవీ విమర్శల ప్రశంసలు అందుకుంది. ఈ రెండు మూవీస్‌ను అతను కొత్త దర్శకులతో తీయడం విశేషం. అంతకుముందు ‘గుంటూర్ టాకీస్‌’ వంటి అడల్ట్‌ మూవీ చేసిన ప్రవీణ్‌ సత్తారుకు చాన్స్‌ ఇవ్వగా అతను గరుడ వేగతో రాజశేఖర్ కు హిట్‌ ఇచ్చాడు. ఇక, ‘అ’తో మెప్పించిన యంగ్‌ డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ కూడా ‘కల్కి’లో రాజశేఖర్ ను డిఫరెంట్‌ లుక్‌లో చూపించాడు.

Also Read: నాని హీరోయిన్‌కు బంపరాఫర్!

లాక్‌డౌన్‌ బ్రేక్‌లో పలు ఇంట్రస్టింగ్‌ కథలు విన్న రాజశేఖర్ తన తదుపరి చిత్రాన్ని ఓ సీనియర్ దర్శకుడితో చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఆ డైరెక్టర్ మరెవరో కాదు నీలకంఠ. షో, మిస్సమ్మ , విరోధి మూవీస్‌తో ఐదు నంది అవార్డులు సాధించిన నీలకంఠకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. వాటి తర్వాత ఆయన చేసిన చిత్రాలు ఆడలేదు. 2013లో వచ్చిన చమ్మక్‌ చల్లో, ఆ తర్వాత ఏడాదికి రిలీజైన మాయ బోల్తా కొట్టాయి. ఆపై, హిందీ సూపర్ హిట్‌ మూవీ క్వీన్‌ను మలయాళంలో ‘జామ్‌ జామ్’ పేరుతో రీమేక్‌ చేశాడు. షూటింగ్‌ కంప్లీట్‌ అయినప్పటికీ ఇంకా రిలీజ్‌ కాలేదు. అయితే, దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత ఆయన టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇవ్వాలని డిసైటయ్యాడు. ఈ క్రమంలో రాజశేఖర్ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే కథ రెడీ చేసి అతనికి నెరేట్‌ చేశాడని సమాచారం. కథ నచ్చడంతో సీనియర్ హీరో కూడా ఓకే చెప్పాడని తెలుస్తోంది. నీలకంఠ- రాజశేఖర్ ఫిల్మ్‌ గురించి తొందర్లోనే అనౌన్స్‌మెంట్‌ రానుంది.

కరోనాకు.. కోవిడ్ జాకెట్ తో చెక్..!


కరోనా పేరు చెబితేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. చైనాలోని వూహాన్లో సోకిన కరోనా ప్రపంచ దేశాలన్నింటికి పాకింది. పేద, ధనిక, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరిపై కరోనా మహమ్మరి ప్రభావం చూపుతోంది. అగ్రరాజ్యాలు సైతం కరోనా ధాటికి విలవిలాడిపోతున్నాయి. రోజురోజుకు పాజిటివ్ కేసులు లక్షల్లో నమోదవుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు.

Also Read: కమలంలో ఆధిపత్య పోరు మొదలైందా?

ప్రజలంతా కరోనాపై అవగాహన పెంచుకుంటూ తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. ముఖానికి మాస్కులు ధరించడం.. చేతులను శానిటైజ్ చేసుకోవడం.. భౌతిక దూరం పాటించడం.. పౌష్టిహారం తీసుకుంటూ ఇమ్యూనిటీ పెంచుకోవడం లాంటివి చేస్తున్నారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా.. వస్తుందా? రాదా అనే భయాందోళన చాలామందిలో నెలకొని ఉంది. వీరందరి భయాన్ని దూరం చేసేలా ఓ ప్రొఫెసర్ ఏకంగా కోవిడ్ జాకెట్ రూపొందించారు. ఈ జాకెట్ ధరిస్తే కరోనా వైరస్.. బ్యాక్టిరియా వంటి ఇన్ఫెక్షన్లు దరిచేరవని ఆయన చెబుతున్నారు.

అహ్మ‌దాబాద్‌లోని ఎన్ఐడీ మాజీ ప్రొఫెస‌ర్‌, అప్పారెల్ మేనేజ్‌మెంట్ ఇనిస్టిట్యూట్ డైరెక్ట‌ర్ సోమేష్ సింగ్ కోవెస్ట్ పేరిట ఓ జాకెట్‌ను రూపొందించారు. దీనిని తయారు చేయడానికి ఆయన రెండునెలల సమయం పట్టిందట. ఇది నాలుగు పొర‌ల‌తో ఉండి జాకెట్ ధరించిన వారికి వైరస్, బ్యాక్టిరియా నుంచి ప్రొటెక్షన్ ఇస్తుందట. సిమెంట్ ఫ్యాబ్రిక్‌, సింథటిక్ ప‌దార్థాలు క‌లిపి లెద‌ర్ జాకెట్ లుక్ వ‌చ్చేలా ఈ జాకెట్ ను రూపొందించారు. అనంత‌రం జాకెట్‌పై వైరోబ్యాన్‌-ఎన్‌9 ఎస్సీ100 కోటింగ్ వేశారు. అలాగే ఈ జాకెట్లో సోష‌ల్ డిస్ట‌న్సింగ్ సెన్సార్‌ను ఏర్పాటు చేయడం వల్ల దూరం పాటించేలా అల‌ర్ట్ చేస్తుంది.

Also Read: మోదీ క్యాబినెట్లో కొత్తగా ఎంతమంది ఎంట్రీ ఇవ్వనున్నారు?

ఈ జాకెట్ తోపాటే మాస్కును కూడా అందిస్తున్నారు. ఈ జాకెట్ జేబుల‌కు లోప‌లి వైపు యూవీ లైట్‌ను ఏర్పాటు చేశారు. ఈ జేబుల్లో వాహ‌నాల తాళం చెవులు, స్మార్ట్‌ఫోన్లు, ప‌ర్సులు, ఇతర వస్తువులు వేస్తే 30సెక‌న్ల‌లో అవి శానిటైజ్ అవుతాయి. ఈ జాకెట్‌కు ఓ థ‌ర్మామీట‌ర్‌ను కూడా అమ‌ర్చారు. అందువ‌ల్ల శ‌రీర ఉష్ణోగ్ర‌త‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. సోమేష్ సింగ్ ఈ జాకెట్‌కు సెప్టెంబ‌ర్ నుంచి మార్కెట్లోకి తీసుకొస్తానని చెబుతున్నాడు.

దీని ధర రూ.4,999 నుంచి అందుబాటులో ఉంటుంద‌ని అన్ని సైజుల్లో లభిస్తుందని చెబుతున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి వినూత్న జాకెట్లు మార్కెట్లోకి వస్తే హాట్ కేకుల్లా అమ్ముడుపోవడం ఖాయమనే కామెంట్లు విన్పిస్తున్నాయి.

మూడు రాజధానులకు ముహూర్తం ఖరారు..!


పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం లభించడంతో మూడు రాజధానుల ఏర్పాటు పనులు ప్రారంభించేందుకు వైసీపీ ప్రభుత్వం తొందర పడుతుంది. ఈ విషయంలో జాప్యం చేస్తే ఏదో రకంగా అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉండటంతో వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని నిర్ణయించుకుంది. అయితే ఇంతలో హై కోర్టులో రాజధాని తరలింపుపై పిటీషన్ ల ఈ నెల 4వ తేదీన విచారణ జరిపింది. ధర్మాసనం తదుపరి విచారణ (ఈ నెల 14వ తేదీ) వరకూ రాజధాని తరలింపు, పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లు గెజిట్ విడుదల వంటి విషయాలపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్సెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసింది.

Also Read: ‘కరోనా’ని మించిన డేంజర్ ఏపీలో.. ప్రభుత్వ వైఫల్యమే(నా)..?

మరోవైపు విశాఖలో మూడు రాజధానుల పనులకు శంఖుస్థాపనకు ముహూర్తాన్ని ఖరారు చేసింది. ఈ నెల 16వ తేదీన స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరిగిన మరుసటి రోజే శంఖుస్థాపన జరనుంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా శంఖుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన వివరాలను అధికారులు గోప్యంగా ఉంచారు. కోర్టు కేసులు, ప్రతిపక్షాలు, రాజధాని ప్రాంతవాసుల నిరసనలే ఇందుకు కారణం. మూడు రాజధానుల శంఖుస్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించింది. దీంతో పిఎంఓ నుంచి ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 16వ తేదీ మంచి ముహూర్తం ఉందని, అనంతరం రెండు నెలల వరకూ ముహూర్తాలు లేకపోవడంతో ఈ ముహూర్తాన్నే ఖాయం చేసినట్లుగా సమాచారం.

Also Read: వైసీపీ సవాల్ కు బాబు స్పందిస్తారా?

మూడు రాజధానుల శంఖస్థాపనకు న్యాయస్థానం నుంచి ఎటువంటి అడ్డంకులు లేవని అధికారులు చెబుతున్నారు. రాజధాని తరలింపు విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని, కోర్టులో ఈ వ్యవహారం తేలిన అనంతరంమే తరలింపు జరిగే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం కార్యనిర్వహక రాజధానిగా విశాఖలో ఏర్పాటు చేయాల్సిన భవన నిర్మాణాలకు మాత్రమే శంఖుస్థాపన జరుగుతుందని అంటున్నారు. సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ పిటీషన్ పై సుప్రీం కోర్టు ఆదేశాలు ఎలా ఉన్నా ఈ నెల 16న మూడు రాజధానులకు శంఖుస్థాపన జరిగే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి.

వాలంటీర్ల వ్యవస్థపై ఏంపీ రఘురామ ఏమన్నారంటే?


నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ, కరోనా ను ఎదర్కోవడంలో ప్రభుత్వ వైఫల్యం, సీఎం రిలీఫ్ పండ్ కు ఎమ్మెల్యేల చందాలు, మధ్యం విక్రయాలు తదితర అంశాలపై ఆయన విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన తొలి రోజుల్లో ఏపీలో కేసులు ఇతర రాష్ట్రాల కంటే తక్కువగా ఉండేవని, ఆ ఘనత వాలంటీర్ల వ్యవస్థ వల్లే సాధ్యమైందని, వీరు వ్యాది భారిన పడిన వారిని వెంటనే గుర్తిచగలుగుతున్నారని ప్రభుత్వం వెల్లడించిందని, మరి ఇప్పుడు ఇన్ని వేల సంఖ్యలో కేసులు పెరిగి పోవడానికి కారణం ఏంటి, వాలంటీర్ల వ్యవస్థ సక్రమంగా పని చేయడం లేదా? ఈ విషయాన్ని ప్రభుత్వం గమనించాలని కోరారు.

Also Read: ‘కరోనా’ని మించిన డేంజర్ ఏపీలో.. ప్రభుత్వ వైఫల్యమే(నా)..?

అదే విధంగా సిఎం రిలీఫ్ ఫండ్ కు ఏ ఎమ్మెల్యే తన సొంత నిధులు ఇవ్వలేదని, ప్రజలు, వ్యాపారుల నుంచి విరాళాలు బలవంతంగా వసూలు చేసి సిఎంకు విరాళాల చెక్కు ఇస్తూ ఫోటోలకు పోజులు ఇచ్చారని చెప్పారు. ఈ విషయాన్ని సిఎం గమనించాలని కోరారు. ఈ అంశంపై విపక్షాలు ఇప్పటికే అనేక ఆరోపణలు చేశాయి. మధ్యం విషయంలో ఊరు పేరు లేని బ్రాండ్లతో ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. శానిటైజర్ లు తాగి పదుల సంఖ్యలో ప్రజలు మృతి చెందడంపై ప్రభుత్వం స్పందించాలన్నారు. క్వారంటైన్ కేంద్రాల్లో ప్రజలు ఆకలితో కేకలు పెడుతున్నారని చెప్పారు. మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తప్పదని చెప్పారు. హై కోర్టు ఇచ్చిన మధ్యంత ఉత్తర్వులపై సుప్రీం పీటీషన్ వేసిన ప్రభుత్వానికి చుక్కెదురవుతుందని జోస్యం చెప్పారు.

Also Read: వైసీపీ సవాల్ కు బాబు స్పందిస్తారా?

వైసీపీలో ఉంటూ ఆ ప్రభుత్వ నిర్ణయాలపై, కార్యక్రమాలపై విమర్శలు చేస్తున్న ఎంపీ రఘరామ కృష్ణంరాజు విషయంలో ప్రభుత్వం స్పందించకపోవడంతో ఎంపీ రోజు రోజుకు విమర్శల తీవ్రతను పెంచుతున్నారు. ఇప్పటి వరకూ ఒకటి రెండు అంశాలపైనే విమర్శించే ఎంపీ ఈ రోజు అనేక అంశాల్లో ప్రభుత్వాన్ని ఏకి పారేశారు. ప్రజాధరణ కలిగిన సిఎంలలో జగన్ కి మూడవ స్థానం రావడాన్ని తేలిగ్గా కోట్టి పారేశారు. సంక్షేమ పథకాల అమలు వల్లే ఈ గుర్తింపు వచ్చిందన్నారు. కరోనా విషయంలో భారత్ లోని బ్రిటన్ డిప్యూటీ కమిషనర్ ఫ్లెమ్మింగ్ కితాబు ఇవ్వడంపైనా స్పందించారు. ఈ విషయంలో ఆమెకు పూర్తి స్థాయి వివరాలు తెలియకపోవడంతో కితాబు ఇచ్చి ఉంటారని చెప్పుకొచ్చారు.

‘కరోనా’ని మించిన డేంజర్ ఏపీలో.. ప్రభుత్వ వైఫల్యమే(నా)..?

రాష్ట్రంలో దశలవారీ మద్యనిషేధం అమలు కు జగన్ మోహన్ రెడ్డి సర్కారు తీసుకుంటున్న చర్యలు ఇప్పుడు మందుబాబులు పాలిట శాపంగా మారుతున్నాయి. అసలే కరోనా సమయం. ఏ రోజు ఎక్కడ లాక్ డౌన్ పడుతుందో తెలియదు. మద్యం షాపులు కూడా తగ్గించేశారు. ఇక దొరికే కొద్దిపాటి మద్యం కూడా పేదలకు అందుబాటులో ఉండే ధరలలో లభ్యం కావడం లేదు. మద్యం తాగే వారి సంఖ్య తగ్గుతోంది. కానీ మద్యానికి బానిస అవుతున్న వారు మాత్రం ప్రాణాలు కోల్పోతున్నారు. జగన్ ఆలోచన మంచిదే అయినా దాని అమలులో మాత్రం ఎన్నో లోపాలు ఉన్నాయి.

రాష్ట్రంలో గత నెల రోజుల్లో ఏకంగా 20 మందికిపైగా శానిటైజర్ తాగి మరణించడం విశేషం. ముందుగా ప్రకాశం జిల్లాలో రెండు వేర్వేరు మండలాల్లో ఒకే సమయంలో 12 మంది చనిపోయారు. అప్పుడే ప్రభుత్వం ఈ విషయంపై స్పందించాల్సింది. కానీ దానిని సాధారణ మరణాల లెక్కన తీసివేసింది. ఆ తర్వాత కడప జిల్లాలో ముగ్గురుతో సహా మరో ఎనిమిది మంది ఇలాగే శానిటైజర్ ప్రాణాలు వదిలారు. వాళ్ళు ఏమన్నా శానిటైజర్ రుచి మరిగి తాగారా అంటే… అదీ లేదు. కేవలం మద్యానికి బానిస అయిన వారు…. మద్యం దొరకక… తక్కువ ధరలకు లభించక శానిటైజర్ లో కూడా ఆల్కహాల్ ఉంటుందని వారు తాగడం గమనార్హం.

ఇలా కరోనా నేపథ్యంలో శానిటైజర్ వినియోగం పెరగడంతో ఇబ్బడిముబ్బడిగా నకిలీ శానిటైజర్ లు కూడా మార్కెట్లో తక్కువ ధరలకే దొరుకుతున్నాయి. ఇక దీనిలో ఇథైల్ ఆల్కహాల్ కలిసి ఉండటంతో మందుబాబుల మత్తు కోసం తక్కువ ధరకు కొనుగోలు చేసి తాగుతున్నారు. ఇలాంటి సమయంలో మొదటిసారి మరణాలు జరిగినప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి సంఘటనులు ఇకపై జరగకుండా మద్యం బానిసలకు అవగాహన కల్పిస్తూ ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. తాగేవారికి మరియు మానసిక స్థితి బాగలేని వారిని ఉద్దేశించి అవగాహన కార్యక్రమం కాదు కదా కనీస సమాచారం కూడా లేకుండా పోయింది. ఇక దీనికి మద్యం ధరలు అందుబాటులోకి తీసుకుని రావడం మాత్రమే ఏకైక మార్గమని పలువురు చెబుతుండగా… ఏపీ ప్రభుత్వం కూడా అందుకు తగిన కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం.

మరో కొత్త డైరెక్టర్​తో సాయి ధరమ్!

Sai Dharam Tej

Sai Dharam Tej
స్టార్టింగ్‌లోనే విజయాలు అందుకొని ఆ తర్వాత వరుస ఫ్లాప్స్‌తో సతమతమయ్యాడు మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్‌. దాదాపు మూడేళ్లు ఫెయిల్యూర్లో ఉన్నాడతను. అయితే, వరుసగా రెండు హిట్స్‌తో దానికి పుల్‌స్టాప్‌ పెట్టాడు. ‘చిత్రలహరి’, ‘ప్రతి రోజు పండగే’ విజయాలతో అతను మళ్లీ సక్సెస్‌ ట్రాక్‌ లోకి వచ్చేశాడు. ఆ జోష్‌లో హ్యాట్రిక్‌ కొట్టడమే లక్ష్యంగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీతో ముందుకు రాబోతున్నాడు. ఈ రొమాంటిక్‌ కామెడీ మూవీ చిత్రీకరణ చివరి దశలో ఉంది. సమ్మర్లోనే రిలీజ్‌ చేద్దామనుకున్నా కరోనా కారణంగా లాస్ట్‌ షెడ్యూల్‌ వాయిదా పడడంతో అది సాధ్యం కాలేదు.

Also Read: నాని హీరోయిన్‌కు బంపరాఫర్!

బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాణంలో సుబ్బు దర్శకత్వం వహిస్తున్నాడు. తేజు సరసన నభా నటేశ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు దేవ కట్టా దర్శకత్వం వహించే పొలిటికల్ డ్రామా మూవీకి కూడా సాయి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ఈ మూవీలో అతను యువ ఐఏఎస్‌ ఆఫీసర్గా కనిపించబోతున్నాడు. ఈ పాత్ర కోసం పలువురు ప్రభుత్వ అధికారులను దగ్గరి నుంచి గమనిస్తున్న సాయి.. కొంచెం బరువు కూడా తగ్గి స్లిమ్‌గా మారే పని లో ఉన్నాడు. కరోనా ప్రభావం తగ్గి ‘సోలో బ్రతుకే’లో మిగతా పార్ట్‌ పూర్తయిన వెంటనే ఈ మూవీని పట్టాలెక్కించాలని ప్లాన్‌ చేస్తున్నాడు.

Also Read: హాట్‌ బ్యూటీ.. హారర్ వెబ్‌ సిరీస్‌

తాజా సమాచారం మేరకు మెగా మేనల్లుడు మరో మూవీకి కూడా ఓకే చెప్పాడు. మరో కొత్త దర్శకుడితో అతను సినిమా తీయబోతున్నాడని సమాచారం. దీనికి కూడా బీవీఎస్‌ఎన్‌ ప్రసాదే నిర్మాతగా వ్యవహరిస్తాడట. అంతే కాదు బడా ప్రొడ్యూసర్ దిల్‌ రాజు కూడా ఇందులో భాగం అవుతాడని తెలుస్తోంది. దాంతో, బీవీఎస్‌ఎన్‌, దిల్‌ రాజు ఫస్ట్‌ టైమ్‌ ఓ జాయింట్‌ ప్రాజెక్టును చేపట్టనున్నారు. లాక్‌డౌన్‌ బ్రేక్‌లో పలు కథలు విన్న సాయితేజ్‌ను.. ఓ యువ దర్శకుడు ఇంప్రెస్‌ చేశాడట. అయితే, ఆ కొత్త దర్శకుడు ఎవరనే విషయంతో ప్రాజెక్ట్‌ గురించి తొందర్లోనే అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చే అవకాశం ఉంది.

నాని హీరోయిన్‌కు బంపరాఫర్!

Vani Kapoor

Vani Kapoor
వాణీ కపూర్. ప్రస్తుతం బాలీవుడ్‌కు పరిమితమైన ఈ హీరోయిన్‌ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. నాని సరసన ‘ఆహా కళ్యాణం’లో హీరోయిన్‌గా నటించిందామె. నేచురల్‌ స్టార్తో రొమాన్స్‌ పండించింది. వెండితెరపై నాని లిప్‌ లాక్ సీన్‌ చేసింది ఆమెతోనే కావడం విశేషం. 2014లో రిలీజైన ఈ మూవీలో నాని, వాణీ మధ్య పెదవి ముద్దు సన్నివేశాలపై అప్పట్లో తెగ చర్చ నడిచింది. మసాలా ఉన్నప్పటికీ ఆ మూవీ బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టింది. తెలుగులో అవకాశాలు రాకపోవడంతో వాణీ కపూర్ బాలీవుడ్‌కు చెక్కేసింది. అక్కడ గ్లామర్ ఒలికిస్తూ..

Also Read: అడిగినంత ఇవ్వలేదని.. చేయనంటుంది !

రొమాంటిక్‌, బోల్డ్‌ మూవీస్‌లో నటించి పేరు తెచ్చుకుంది. టాప్‌ హీరోల సరసన నటించే చాన్స్‌లు కొట్టేసింది. ‘ఆహా కళ్యాణం’కు ముందే హిందీలో ‘శుద్ధ్‌ దేశీ రొమాన్స్‌’ల నటించిన ఈ ఢిల్లీ బ్యూటీ తర్వాత బేఫికర్లో ప్రేక్షకులకు గ్లామర్ డోస్‌ ఇచ్చింది. లాస్ట్‌ ఇయర్ హృతిక్‌ రోషన్‌, టైగర్ ష్రాఫ్‌ ‘వార్’ మూవీలో హీరోయిన్‌గా చేసి సక్సెస్‌ అందుకుంది. ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్, సంజయ్‌ దత్‌ నటిస్తున్న ‘షంషేరా’, అక్షయ్‌ కుమార్ సరసన ‘బెల్‌ బాటమ్‌‌’లో హీరోయిన్‌గ నటిస్తోంది. ఇవి సెట్స్‌పై ఉండగానే వాణీకి మరో లక్కీ చాన్స్‌ వచ్చింది.

బాలీవుడ్‌లో వైవిధ్య చిత్రాల నటుడిగా ఫుల్‌ సక్సెస్‌లో దూసుకెళ్తున్న ఆయుష్మాన్‌ ఖురానా సినిమాలో నటించే బంపరాఫర్ వాణీని వరించింది. అభిషేక్‌ కపూర్ దర్శకత్వం వహించే ఈ మూవీలో ఆయుష్మాన్‌ స్పోర్ట్స్‌ పర్సన్‌గా కనిపించనున్నాడు. అతనికి జోడీగా వాణీని ఎంపికచేసినట్టు డైరెక్టర్ అభిషేక్‌ ఇటీవల ప్రకటించాడు. ఆయుష్మాన్‌ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ట్వీట్‌ చేశాడు వాణిపై పొగడ్తల వర్షం కురిపించాడు.

Also Read: హాట్‌ బ్యూటీ.. హారర్ వెబ్‌ సిరీస్‌

వాణీ కమిటెడ్‌ యాక్ట్రెస్‌ అని, ఆమెతో నటించడం కోసం ఎదురు చూస్తున్నా అని పేర్కొన్నాడు. మంచి డైరెక్టర్, సక్సెస్‌కు చిరునామా లాంటి హీరోతో అవకాశం రావడంతో వాణీ కపూర్ ఫుల్‌ ఖుషీగా ఉంది. అభిషేక్‌ కపూర్ డైరెక్షన్‌లో పని చేసే చాన్స్‌ ఇంత త్వరగా రావడం తన అదృష్టం అని, టాలెంటెడ్‌ హీరో ఆయుష్మాన్‌తో నటించడం చాలా థ్రిల్లింగ్‌ ఉంటుందని చెప్పింది. ఆల్రెడీ రణ్‌బీర్, అక్షయ్‌తో పని చేస్తోంది. ఇప్పుడు ఆయుష్మాన్‌తో సినిమాకు కూడా ఓకే చెప్పడంతో వాణీ కెరీర్ టర్న్‌ అవడం ఖాయమని బీటౌన్‌ వర్గాలు అంటున్నాయి.

వైసీపీ సవాల్ కు బాబు స్పందిస్తారా?

Chandrababu Naidu

Chandrababu Naidu
అమరావతి నుంచి రాజధానిని విశాఖకు తరలించే విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి సవాల్ విసిరారు. అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని, మీరు గెలిస్తే రాజధాని తరలింపునకు తాము అడ్డుకోబోమని చెప్పారు. ఈ సవాలుపై స్పందించేందుకు వైసీపీ ప్రభుత్వానికి 48 గంటలు సమయం ఇచ్చారు. చంద్రబాబు సవాల్ ను అధికార పక్షం స్వీకరించలేదు. మీడియా ద్వారా చంద్రబాబుకు తమ సమాధానం చెప్పారు. దీంతో పిరికి పందలు పారిపోయారని వైసీపీ నేతలపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

Also Read: బాబు ప్రెస్ మీటా..? టీడీపీ నేతల పరుగో పరుగు?

ఇదిలా ఉంటే చంద్రబాబు తాజాగా మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి అవంతి శ్రీనివాసరావు స్పందించారు. విశాఖను ఎంతో అభివృద్ధి చేశానని, విశాఖ ప్రజలు అంటే తనకెంతో ఇష్టమని చంద్రబాబు ఈ సమావేశంలో చెప్పుకొచ్చారు. విశాఖను ఆర్ధిక రాజధానిగా మార్చాలని అనుకున్నానని బాబు చెప్పారు. ఈ వ్యాఖ్యలను మంత్రి అవంతి శ్రీనివాసరావు తప్పుబట్టారు. మూడు పర్యాయాలు అధికారంలో ఉన్న చంద్రబాబు విశాఖకు ఏమీ చేయలేదని విమర్శించారు. ఆర్ధిక రాజధానిగా మార్చేందుకు విశాఖకు ఎంత ఖర్చు చేశారో లెక్కలు చెప్పాలని అవంతి కోరారు.

అంతటితో ఆగకుండా విశాఖకు రాజధాని అవసరమో… కాదో తేల్చేందుకు మేము సిద్ధంగా ఉన్నామని, టీడీపీ కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని అవంతి సవాల్ విసిరారు. ఈ సవాల్ పై ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పందిస్తారో లేదో వేచి చూడాలి. తన సవాల్ కు స్పందించలేదని వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు ఈ సవాల్ ను స్సందించకపోతే అంతే స్థాయిలో విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తుంది.

Also Read: హై కోర్టు స్టే పై సుప్రీంను ఆశ్రయించిన ప్రభుత్వం..!

విశాఖ ప్రజలు ఎంతో మంచి వారని, అమరావతి రైతుల పొట్టగొట్టి తమకు రాజధాని ఇమ్మని విశాఖ జనం ఎప్పటికీ అదగరని వారి తరుపున వకాల్తా పుచ్చుకుని చంద్రబాబే చెప్పడం ఉత్తరాంధ్ర వాసులను ఆశ్చర్యానికి గురి చేసింది. రాజధాని ఏర్పాటు చేస్తామంటే వద్దని ఎవరంటారు? విశాఖనే రాజధానిగా ప్రకటించాలని విభజన సమయంలో ఉద్యమాలు చేశారు. ఆ మాట కొస్తే అన్ని జిల్లాలు ఆ సమయంలో రాజధాని తమ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ వచ్చింది.