ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎన్నో సారూప్యతలు ఉన్నాయి. వీరిద్దరికీ ఉన్న కామన్ క్వాలిటీ దూకుడు. ఎలాంటి పరిస్థితినైనా లెక్కచేయని తత్వం. తాము అనుకున్నది సాధించే వరకు మడమ తిప్పని గుణం. ఆ పట్టుదలే వీరిద్దరినీ ‘జల వివాదం’ లో ఒకరిపై ఒకరు మిత్రత్వం మరిచి మరీ తీవ్ర ఆరోపణలు చేసుకునేలా చేసింది.
అయితే ఇప్పుడు జగన్ మరియు కేసీఆర్ ఇద్దరూ… ఒకేసారి తమ కలలను నెరవేర్చుకుంటున్నారు. ఆ దిశగా ఈ ఇద్దరు ఒకే సమయంలో కీలక అడుగు లను కూడా వేశారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆర్నెల్లు అయినా కూడా అత్యాధునిక హంగులతో సరికొత్త సచివాలయం నిర్మించడమనే అతని కలను సాకారం చేసుకునేందుకు ఇన్నేళ్లు పట్టింది. ఇక ఈ నెలలోనే కొత్త సచివాలయం కి సంబంధించిన భూమి పూజ కూడా జరగనుందని సమాచారం. అందుకు తగిన ఏర్పాట్లు అధికారులు చేసేస్తున్నారు కూడా. డిజైన్ విషయంలో కేసీఆర్ కు ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నా కూడా ఈ విషయంలో సీఎం సాబ్ అయితే వెనక్కి తగ్గేది అయితే లేదు.
మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ది కూడా అదే దారి. ఒక ముఖ్య మంత్రికి ఒక రాజధాని నిర్మించడమే పెద్ద కల అయితే జగన్ ఏకంగా మూడు రాజధానుల పై కన్నేశాడు. ఒకేసారి మూడు రాజధానులు అభివృద్ధి చేసే అతని కలలను సాకారం చేసుకునేందుకు గవర్నర్ ఆమోదం తెచ్చుకున్న జగన్.. కేంద్రం నుండి కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకున్నాడు. మొత్తానికి జగన్ మూడు రాజధానుల కలను ఆపడం ఇప్పుడు ప్రతిపక్షాలకు చాలా కష్టంగా ఉంది.
మొత్తానికి వీరిద్దరూ ఒకే సారి తమ కలలను సాకారం చేసుకొనే పనిలో పడగా దారిలో ఎన్ని ఆటుపోట్లు ఎదురవుతాయో లేదా మధ్యలో ఎటువంటి పరిణామాల మధ్య తమ పనులకు ఇబంది వస్తుందోనని ఆ పార్టీ మద్దతుదారులు టెన్షన్ లో ఉన్నారు. అన్నీ అధినేతలు అనుకున్నట్టు జరిగితే ఒకే సమయానికి తెలంగాణ నూతన సచివాలయం పూర్తి కావడం మరియు ఏపీలో స్థిరంగా మూడు రాజధానులు ఏర్పడడం జరగవచ్చు. అడుగు కలిసి ముందుకు వేశారు గమ్యానికి కూడా కలిసి ఒకేసారి చేరుతారా లేదా అన్నది ఇక్కడ ఆసక్తికరం.