Home Blog Page 8378

2000 నోట్లు రద్దు?

2000 notes

2000 notes

నాలుగేళ్ల క్రితం రూ.1,000, పాత 500 నోట్లను రద్దు చేసి దాని స్థానంలో రూ.2,000 నోటును ప్రవేశపెట్టిన ప్రభుత్వం క్రమంగా దాని ముద్రణను తగ్గిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా 2016–17లో ఏకంగా రూ. 354.29 కోట్ల రూ. 2 వేల నోట్లను ప్రింటింగ్‌ చేసిన భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌.. గతేడాది నుంచి ఈ నోట్ల ముద్రణను పూర్తిగా నిలిపివేసింది. 2016 నుంచి ఇప్పటివరకు ముద్రించిన కరెన్సీ నోట్ల సంఖ్య వివరాలపై ఆర్టీఐ కార్యకర్త జలగం సుధీర్‌ చేసిన దరఖాస్తుకు సమాధానంగా ఆర్‌బీఐ ఈ మేరకు సమాధానమిచ్చింది.

నాలుగేళ్లు.. 7,071 కోట్ల నోట్లు…

బ్లాక్‌ మనీకి ముకుతాడు వేయాలని భావిస్తూ.. నగదురహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం… పెద్దనోటు ముద్రణకు ఫుల్‌స్టాప్‌ పెట్టింది. కేంద్ర సర్కారు.. ఇప్పటికే డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలోనే రూ.2 వేల నోట్ల ముద్రణను తగ్గించి రూ. 500 నోట్లను మాత్రం భారీగా ముద్రిస్తోంది. 2016–17తో పోలిస్తే గత ఏడాది ఏకంగా రెట్టింపు స్థాయిలో రూ. 500 నోట్లను ప్రింటింగ్‌ చేసింది. నాలుగేళ్ల క్రితం 429.22 కోట్ల నోట్లను ముద్రించగా.. గడచిన ఆర్థిక సంవత్సరం 822.77 కోట్ల నోట్లను అందుబాటులోకి తెచ్చింది. గత నాలుగేళ్లలో 7071.63 కోట్ల కొత్త నోట్లను ఆర్‌బీఐ ముద్రించింది. ఇందులో రూ. 500 నోట్లు 2458 కోట్లు ఉండగా.. రూ. 2 వేల నోట్లు 370 కోట్లు ఉన్నాయి. గతంతో పోలిస్తే రూ. 10, రూ. 50, రూ. 100, రూ. 200 నోట్ల ప్రింటింగ్‌ ను కూడా రిజర్వ్‌ బ్యాంక్‌ తక్కువ చేసింది. డిజిటల్‌ పేమేంట్లకు ప్రోత్సాహాకాలు ఇస్తున్నందున చిన్ననోట్ల వినియోగాన్ని గణనీయంగా తగ్గించాలని భావిస్తున్న ఆర్‌బీఐ… వ్యయం తగ్గింపులో భాగంగా ఈ నోట్ల ముద్రణను కూడా క్రమేణా తగ్గిస్తోంది. నాణేలను అందుబాటులోకి తెచ్చినందున గత నాలుగేళ్ల నుంచి రూ. 1, 2, 5 నోట్లను ముద్రణను ఆపేసింది.

కరెన్సీ ముద్రణలో రూ. 200 నోటుకే ఎక్కువ ఖర్చవుతోంది. గడచిన ఆర్థిక సంవత్సరంలో ఈ నోటుకే అధికంగా వ్యయం చేసినట్లు ఆర్‌బీఐ తెలిపింది. రూ. 200 నోటు ప్రింటింగ్‌ కు రూ. 2.15 చొప్పున వెచ్చించగా రూ. 500 నోటుకు రూ. 2.13, రూ. 100 నోటు ముద్రణకు రూ. 1.34 ఖర్చు చేసింది. అలాగే రూ. 50 నోటుకు 82 పైసలు ఖర్చుకాగా, రూ. 20 నోటుకు దీనికంటే మూడు పైసలు అధికంగా (85 పైసలు) ముద్రణకు వెచ్చించింది. అతితక్కువగా రూ. 10 నోటు ప్రింటింగ్‌ కు 75 పైసలు ఖర్చు చేసినట్లు తెలిపింది. గతేడాది రూ. 2 వేల నోటు ముద్రించినందున.. ఈ సమాచారాన్ని ఆర్బీఐ ముద్రణ సంస్థ వెల్లడించలేదు.

జగన్, నమ్మకం.. ఓ పోసాని కథ!


రాజకీయాల్లో ‘యూజ్ అండ్ త్రో’ పాలసీ బాగా ఉంటుంది. ఏ పార్టీ నుంచి గెలిచినా అధికార పార్టీలోకి ఎమ్మెల్యేలు ఎలాంటి సిగ్గూ ఎగ్గూ లేకుండా చేరిపోతుంటారు. ఇక చంద్రబాబు, కేసీఆర్ లాంటి రాజకీయ పార్టీల అధినేతలు ఇతర పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలను కూడా లాగేసి మంత్రి పదవులు ఇస్తుంటారు. చంద్రబాబు అయితే సమకాలీన రాజకీయాల్లో నేతలను వాడుకొని వదిలేసినట్టు వేరే ఎవ్వరూ అలా చేయరని మోత్కుపల్లి నర్సింహులు, భూమా అఖిలప్రియ లాంటి వారు ఎందరో ఆడిపోసుకున్నారు..

Also Read: విజయవాడ అగ్ని ప్రమాదంలో చనిపోయింది ఆ మూడు జిల్లాల వారే…

అయితే ఈ రాజకీయాల్లోనూ జగన్ శైలి విభిన్నం. ఆయన తనతోపాటు ఆది నుంచి ఉన్న వారికి అందలం ఇచ్చాడు. పార్టీ అధికారంలోకి రాగానే వారికే మొదట పదవులు ఇచ్చారు. వైసీపీ కోసం పాటుపడ్డ కమెడియన్ పృథ్వీకి తిరుమల తిరుపతి దేవస్థానం టీవీ (ఎస్వీబీసీ) చానెల్ చైర్మన్ పదవిని ఇచ్చారు. ఫిలిం కార్పొరేషన్ చైర్మన్ గా పార్టీ పెట్టినప్పటి నుంచి తనతో పాటు ఉన్న విజయ్ చందర్ కు ఇచ్చారు.ఇక తన బాబాయ్, వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్ చేశారు. విజయసాయిరెడ్డికి ఢిల్లీ వ్యవహారాలు అప్పగించారు. ఇక సలహాదారులుగా నమ్మిన వారిని నియమించారు. ఎన్నికల్లో ఓడిపోయినా తనకు నమ్మినబంట్లుగా ఉన్నందుకు మోపిదేవి, పిల్లి సుభాష్ లను మంత్రులను చేశారు. ఇప్పుడు రాజ్యసభకు పంపారు.

ఇక ఎన్నికలకు ముందర వైసీపీ తరుఫున బలంగా వాయిస్ వినిపించిన పోసాని కృష్ణ మురళిని జగన్ ఎందుకు పక్కనపెట్టాడు? ఆయనకు పదవి ఎందుకు ఇవ్వలేదు.? అందుకే ఇప్పుడు పోసాని మౌనంగా ఉన్నారా అన్న ప్రశ్నకు తాజాగా ఆయన సమాధానమిచ్చారు.

Also Read: శంకుస్థాపనకు ప్రధాని హాజరవుతారా?

జగన్ ప్రభుత్వంలో ఎలాంటి పదవులు తీసుకోనని పోసాని స్పష్టం చేశారు. తాజాగా ఓ టాప్ చానెల్ తో మాట్లాడిన పోసాని జగన్ సీఎం అయ్యాక నా ఇంటికి సజ్జల సహా వైసీపీ కీలక నేతలను పంపించారని.. ఏ పదవి కావాలో తెలుసుకోవాలని అడిగారని.. కానీ తనకు ఏ పదవి వద్దని.. జగన్ ను సీఎంగా చూడాలని అనిపించిందని.. నెరవేరిందని చెప్పానని పోసాని కృష్ణ మురళి చెప్పుకొచ్చారు.

ఇలా బయటకు తెలియని ఈ వ్యవహారాన్ని తాజాగా పోసాని బయటపెట్టాడు. జగన్ తన పార్టీ కోసం తనకోసం పాటుపడిన వారికి నమ్మకంగా చూసుకుంటాడనే దానికి ఈ ఉదాహరణ అని అర్థం చేసుకోవచ్చు. పోసానికి పదవిని ఆఫర్ చేసినా ఆయనే తిరస్కరించారని తాజాగా పోసాని మాటలను బట్టి తెలుస్తోంది.

Manchu Vishnu Daughter Ayraa Birthday Celebrations

Tamannaah Looking Gorgeous

Rakul Preet Singh Throwback Pics

Pragya Jaiswal Amazing Pics

Parvati Nair Naughty Pictures

Nandini Rai Awesome Poses

Samantha Akkineni Stunning Pics

బీజేపీలో కొనసాగుతున్న సస్పెన్షన్లు..!

BJP in the media? Negotiations with those two channels!


రాష్ట్ర రాజధాని విషయంలో బీజేపీకి ఎదురవుతున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు (బీజేపీ మినహా) అన్ని అమరావతికి మద్దతు ఇస్తూ ఒకే సిద్ధాంతంతో ముందుకు వెళుతుంటే బీజేపీ మాత్రం అమరావతి విషయంలో ఒక వైఖరి లేకుండా, అటు కేంద్రం నుంచి స్పష్టత లేక నానా తిప్పలు పడుతుంది. చివరికి చేసేదేమీ లేక అమరావతి విషయంలో మీడియా చర్చలకు వెళ్లవద్దని పార్టీ నాయకులకు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ కొందరు అధిష్టానం ఆదేశాలను సైతం లెక్క చేయడకుండా మీడియా ముఖంగానే పార్టీ, కేంద్ర ప్రభుత్వ వైఖరిని విరుద్ధంగా ప్రకటనలు చేయడం పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఇబ్బంది తప్పడం లేదు. అది వారి వ్యక్తిగత అభిప్రాయంగా పార్టీ ముఖ్య నేతలు చెప్పుకొస్తున్నారు.

Also Read: శంకుస్థాపనకు ప్రధాని హాజరవుతారా?

రాజధాని విషయంలో మీడియా చర్చలకు హాజరు కావద్దని పార్టీ ఆదేశాలను లెక్క చేయకుండా చర్చలో పాల్గొన్న రమణ ను రాష్ట్ర నాయకత్వం కొద్ది రోజుల కిందట సస్పెండ్ చేసింది. అదేవిధంగా లంకా దినకర్ కు నోటీసులు జారీ చేసింది. అమరావతి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా చెప్పుతో కొట్టుకుంటూ మీడియాలో పతాక శీర్షికకు చిక్కిన వెలగపూడి గోపాలకృష్ణను తాజాగా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయ కార్యదర్శి పి.శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. గతంలో కన్నా అధ్యక్షుడుగా ఉండగా లక్ష్మీపతి రాజా తదితరులను ఇదే విధంగా సస్పెండ్ చేశారు.

Also Read: విశాఖకు రాజధాని: జగన్ కు షాకిచ్చిన సొంత పత్రిక సర్వే?

అమరావతి విషయంలో పార్టీ స్పష్టమైన వైఖరి తీసుకోకుండా పార్టీ నాయకులపై చర్యలు తీసుకుంటూ పోవడం ఎంత వరకూ సబబు అని సస్పెండ్ అయిన నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇతర పార్టీలతో పోలిస్తే బీజేపీకి రాష్ట్రంలో ఉన్న నాయకుల సంఖ్య తక్కువ. వివిధ కారణాలతో ఉన్న వారిని సస్పెండ్ చేసుకుంటూ పోతే ఎలా అనేది వారి వాదన. బీజేపీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం టిడిపి, వైసిపి నుంచి అధిక సంఖ్యలో వలసలు త్వరలో ఉంటాయని మీడియాకు చెప్పుకొచ్చారు. ఈ ధైర్యంతోనే ఉన్నవారిని సస్పెండ్ చేసుకుంటూ పోతున్నారేమోననే విమర్శలు వినిపిస్తున్నాయి.

స్టార్ హీరో కుమారుడితో సోషల్ మీడియా బ్యూటీ!


తమిళ స్టార్ హీరో వారసుల్లో ఇప్పటివరకూ ఫుల్ క్రేజ్ ను క్రియేట్ చేసుకోగలిగిన వాళ్లలో ఎవరైనా ఉన్నారా అంటే.. అది కచ్చితంగా చియాన్ విక్రమ్ కుమారుడు ‘ధృవ్’నే. తెలుగులో సంచలన విజయం సాధించిన ‘అర్జున్ రెడ్డి‘ రీమేక్ తో తమిళంలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్రాడు, మొదటి సినిమాతోనే యాంగ్రీ యంగ్ మ్యాన్ గా బాగానే క్లిక్ అయ్యాడు. ఇక ఇప్పటికే రెండు స్క్రిప్ట్స్ ను లైన్ లో పెట్టిన ఈ యంగ్ హీరో, తన తరువాత సినిమాని మురగదాస్ అసిస్టెంట్ రవికాంత్ అనే కొత్త డైరెక్టర్ తో ప్లాన్ చేసుకున్నాడు. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ గా సెన్సేషన్ బ్యూటీ ‘ప్రియా ప్రకాష్ వారియర్’ను తీసుకుంటున్నారట.

Also Read: ముదురు హీరోయిన్ తో రవితేజ రొమాన్స్ !

సోషల్ మీడియా పుణ్యమా అని ఓవర్ నైట్ లోనే ఫుల్ క్రేజ్ సంపాదించిన ఈ యంగ్ బ్యూటీకి, ప్రస్తుతం పెద్దగా ఆఫర్లు లేవు, నిజానికి మొదట్లో బాగానే ఆఫర్లు వచ్చినా, ఆశ ఎక్కువై భారీగా రెమ్యునరేషన్ ను డిమాండ్ చేసింది. దాంతో ఆమెకు ఆఫర్లు దూరమైపోయాయి. అయితే తొందరగానే జ్ఞానోదయం తెచ్చుకున్న ఈ యంగ్ బ్యూటీ, ఆ తరువాత మీ సినిమాలో ఛాన్స్ ఇవ్వండి అని అందర్నీ పోన్ చేసి మరి అడగడం మొదలుపెట్టిందట. మరి ఈ క్రమంలో విక్రమ్ కుమారుడికి కూడా ఫోన్ వెళ్లడం.. కుర్రాడు అమ్మాయి అడిగేసరికి కాదనలేకపోవడం.. మొత్తానికి సోషల్ మీడియా బ్యూటీకి ఛాన్స్ వచ్చేసింది. ఏదైతే ధృవ్ ను పట్టుకుని ఛాన్స్ కొట్టింది.

Also Read: ఎన్టీఆర్ ప్రేమ కోసం చనిపోతుందట !

అన్నట్లు ప్రియా ప్రకాష్ వారియర్ కి నితిన్ – యేలేటి చేయబోయే కొత్త సినిమాలో రెండో కథానాయకిగా ఛాన్స్ వచ్చింది. అలాగే నాగశౌర్య హీరోగా రాబోయే ఓ సినిమాలో కూడా ఈ భామకు హీరోయిన్ ఛాన్స్ ఉంది. మరి ఈ అమ్మడు తన నుండి రాబోయే భవిష్యత్తు చిత్రాల్లోనైనా తన నటనతో మెప్పించగలిగితే.. అవకాశాలు పెరుగుతాయి. ఇక ధృవ్ ప్రస్తుతం కొత్త హెయిర్ స్టైల్ తో పాటు షార్ప్ లుక్ కోసం తన ఫామ్ హౌస్ లో ఏకాంతంగా గత కొన్ని రోజులు నుండి తన ట్రైనర్ సాయంతో కఠినతరమైన కసరత్తులు చేస్తుకుంటున్నాడు.

విజయవాడ అగ్ని ప్రమాదంలో చనిపోయింది ఆ మూడు జిల్లాల వారే…

ఈరోజు తెల్లవారుజామున ఎవరికీ అర్థం కాని రీతిలో బెజవాడ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం తో ఒక్కసారిగా ఏపీ ప్రజలు కంగారుపడ్డారు. కోవిడ్ సెంటర్ గా మారిన స్వర్ణ ప్యాలెస్ లో షార్ట్ సర్క్యూట్ అయి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో క్షణాల్లో మంటలు వ్యాపించడంతో అంతా దట్టమైన పొగ పాకిపోవడంతో ఎవ్వరికీ ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. అప్పటికే అనారోగ్యంగా ఉన్న వారు జరిగింది అర్థం చేసుకుని ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నించే లోపలే మృత్యువు వారిని కాటేసింది.

 

ఇక అగ్నిమాపక సిబ్బంది కూడా ఎన్నో విఫలయత్నాలు చేసి కొంత మందిని కాపాడగలిగింది కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ భవనంలో ఉన్న 50 మందిలో పది మంది మరణించారు. మిగిలిన బాధితులను దగ్గరలోని కోవిడ్ సెంటర్లకు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఇదిలా ఉండగా మరణించిన వారంతా మూడు జిల్లాలకు చెందిన వారే కావడం ఇక్కడ గమనార్హం. మరణించిన పదిమందిలో ఒకరు గుంటూరు జిల్లాకు చెందిన వారు కాగా…. అత్యధికులు కృష్ణా జిల్లాకు చెందిన వారు. ఇక ప్రకాశం జిల్లాకు చెందిన వారు కూడా ఒకరు ఉన్నారు.

మరణించిన వారి పేర్లు, వివరాలను ఆరాతీయగా వారిలో ముగ్గురు తప్పించి మిగతా వాళ్ళందరూ బయటకి వచ్చారు. ఇక పదిమందికి పోస్టుమార్టం చేసేందుకు ఏర్పాట్లు మొదలు పెట్టారు. అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు. అలాగే కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేసిన రమేష్ ఆసుపత్రి యాజమాన్యం పై, స్వర్ణ ప్యాలెస్ యాజమాన్యం పై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇక అసలు విషయానికి వస్తే వారిలో 8 మంది కృష్ణా జిల్లాకు చెందిన వారు కాగా…. ముగ్గురు ప్రకాశం జిల్లాకు చెందిన వారు, ఒకరు మాత్రం గుంటూరు జిల్లా పొన్నూరు కు చెందిన వారు.

మరణించిన వారి వివరాలు

01. డోక్కు శివ బ్రహ్మయ్య (58) – మచిలీపట్నం
02. పూర్ణ చంద్ర రావు మొవ్వ
03. సుంకర బాబు రావు (రిటైర్డ్ ఎస్సై) – సింగ్ నగర్
04. మజ్జి గోపి (మచిలీపట్నం)
05. సువర్ణ లత పొన్నూరు – నిడుబ్రోలు
06. వెంకట లక్ష్మి సువర్చలా దేవి -(జయ లక్ష్మి) కందుకూరు
07. వెంకట లక్ష్మి సువర్చలా దేవీ (కందుకూరు)
08. ఎం. రమేష్ (విజయవాడ)
09. పవన్ కిషన్ (కందుకూరు)
10. చర్చి ఫాదర్ అబ్రహం(జగ్గయ్యపేట)

అడ్డంగా బుక్కయిన కేటీఆర్…! అలా మాట్లాడి ఉండకూడదు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రివర్యులు అయిన కేటీఆర్…. రాష్ట్ర ప్రజలతో, తన ఫ్యాన్స్ తో తరచుగా ముచ్చటిస్తూ ఉంటారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు సకాలంలో స్పందించడం…. ఇక పాలనాపరంగా ప్రజల నుండి వస్తున్న ప్రశ్నలకు ప్రభుత్వం తరఫున వివరణ ఇవ్వడం కేటీఆర్ కు అలవాటు. అయితే ఇప్పుడు కరోనా నివారణ చర్యల్లో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేటీఆర్ ట్విట్టర్ లో కొద్ది సేపటి క్రితమే లైవ్ సెషన్ ను నిర్వహించారు. అయితే అందులో కేటీఆర్ కు ఊహించని ప్రశ్నలను రాష్ట్ర ప్రజలకు సంధించడం ఆయనకు బాగా ఇబ్బందికరంగా మారింది.

 

ముందుగా ఒక ట్విట్టర్ యూజర్ ఎంతో వివాదాస్పదంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి అందరు ఏమి అనుకుంటున్నారు అంటే కృష్ణ నీటి జిల్లాల్లో తమకు రావాల్సిన వాటా ఉందని…. ఎటువంటి మిత్రత్వాన్ని ఇందులో లెక్కచేయమని…. ఇప్పటికే ఈ విషయమై సుప్రీం కోర్టు వరకు వెళ్ళామని…. తమకు రావాల్సిన నీటిని ఎలాంటి పరిస్థితుల్లో వదులుకోమమని కేటీఆర్ అన్నారు. అయితే ఈ మాటలతో జగన్ తో ఉన్న మిత్రుత్వం ఇంతటితో చెడిపోయిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. వైసిపి కార్యకర్తలకు కూడా ఈ మాటలు పెద్దగా రుచించలేదు. అలాగే కరోనా నివారణ చర్యల విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చూపిస్తున్న జాప్యాన్ని కేటీఆర్ సమర్థిస్తున్నట్లు కనిపించింది.

కరోనా వ్యాధి నివారణ చర్యల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం వహిస్తున్న అలసత్వం గురించి హెల్త్ బులిటెన్ వివరాలు సరిగ్గా అప్డేట్ చేయట్లేదు అని కొంతమంది ప్రశ్నించగా కేటీఆర్ తడబడ్డాడు. ఒక్కో రాష్ట్రానికి నివారణ చర్యల్లో ఒక్కో శైలి ఉంటుందని…. డబ్ల్యూహెచ్ఓ, ఐసీఎంఆర్ మార్గనిర్దేశకాలనే తాము అనుసరిస్తున్నామని చెప్పిన కేటీఆర్ ను…. అతి తక్కువ టెస్టులు జరపమని ఐసీఎంఆర్, డబ్ల్యూహెచ్ఓ నిబంధనల్లో అంటూ కొంతమంది ప్రశ్నించారు.

వాటికి కేటీఆర్ నుండి ఎటువంటి సమాధానం లేకపోవడం గమనార్హం. అలాగే గాంధీ ఆసుపత్రి నుండి ఎన్నో వేలమంది పేషెంట్లు కోలుకుని తిరిగి వెళ్ళారు అని చెప్పిన కేసీఆర్…. అలాగే ఆయన ఎమ్మెల్యేలు, మంత్రులు గాంధీ ఆస్పత్రిలో, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాకుండా ప్రైవేటు ఆస్పత్రిలో ఎందుకు చికిత్స చేయించుకుంటున్నారు అని తెలంగాణ ప్రజలు అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇవ్వలేకపోయాడు. గతంలో ఎంతో నిక్కచ్చిగా, స్పష్టంగా…. నిజాయితీగా మాట్లాడే కేటీఆర్ ఈసారి మాత్రం ప్రభుత్వ వైఫల్యాన్ని వెనకేసుకొస్తూ బాగా ఇబ్బంది పడ్డాడు.

శంకుస్థాపనకు ప్రధాని హాజరవుతారా?


రాష్ట్రంలో మూడు రాజధానుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు సిద్ధమైన వైసీపీ ప్రభుత్వం ఈ నెల 16వ తేదీ ఇందుకు ముహూర్తంగా నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వనించేందుకు అపాయింట్మెంట్ కోసం సిఎంఓ కార్యలయం ప్రయత్నం చేస్తుంది. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించినంత మాత్రాన ప్రధాని ఈ కార్యక్రమానికి హాజరవుతారా అనే సందేహం ఇప్పడు అందరికీ కలుగుతుంది. రాజధాని విషయంలో చట్ట పరంగా, న్యాయస్థానాల్లోను వివాదాలు కోనసాగుతుండటం, అమరావతి రైతులు, ప్రజలు రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా 235 రోజులుగా నిరసనలు తెలియజేస్తున్నారు. దీంతో ఇది ఒక వివాదాస్పద అంశంగా మారింది.

Also Read: అదే జరిగి ఉంటే విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో ఎంతో మంది బ్రతికేవారు..!

ఇటువంటి వివాదాస్పద కార్యక్రమానికి ఆహ్వానం ఉన్నంత మాత్రాన ప్రధాని నరేంద్ర మోడీ ఎలా హాజరవుతారనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. మరోవైపు టిడిపి ప్రభుత్వ హయాంలో 2015 అక్టోబరు 22వ తేదీన ప్రధాని మోడీ, సిఎం చంద్రబాబు రాజధాని అమరావతికి శంకుస్థాపన చేశారు. ఇప్పడు మరో రాజధానికి శంకుస్థాపన చేసేందుకు మోడీ ఏ ముఖం పెట్టుకుని వస్తారని రాజధాని వాసులు విమర్శిస్తున్నారు. మూడు రాజధానుల నిర్మాణానికి ప్రభుత్వ పెద్దలు ఎన్ని కారణాలు చెప్పినా దీని వెనుక ఉన్నది రాజకీయ అంశం అనేది అందరకీ తెలిసిన విషయమే.

మరోవైపు పునర్విభజన చట్టంలో రాష్ట్రానికి ఒక రాజధానినే పేర్కోన్నారని, మూడు రాజధానులు నిర్మాణం ఈ చట్టానికి వ్యతిరేకం అని న్యాయ నిపుణులు కొందరు చెబుతున్నారు. మరి చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న మూడు రాజధానుల శంకుస్థాపనకు ప్రధాని హాజరైతే చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్లే అవుతుంది. అటువంటి పని ప్రధాని మోడీ చేస్తారా అనే సందేహం కలుగుతుంది.

ఇప్పటికే అమరావతి విషయంలో రెండు నాల్కల దోరణితో వ్యవహరిస్తుందని బీజేపీ విమర్శలు ఎదుర్కొంటుంది. మొన్నటి వరకూ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ రాజధాని విషయంలో అమరావతికే తమ పూర్తి మద్దతు ప్రకటించారు. తాజాగా నియమితులైన బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇందుకు విరుద్ధంగా అమరావతి రైతులకు న్యాయం జరిగేలా పోరాటం చేస్తామంటున్నారు. మూడు రాజధానుల విషయంలో అన్ని పార్టీలు ఆలోచన చేయాలని ప్రకటించారు. దీంతో అమరావతి విషయంలో పూర్తిగా రాజకీయ వైఫల్యం చెందిన పార్టీగా రాష్ట్రంలో బీజేపీ మిగిలిపోయింది.

Also Read: దూకుడు భేష్… మరి దూరదృష్టి ఎక్కడ జగన్ ?

ఇటువంటి పరిస్థితుల్లో మూడు రాజధానుల శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరైతే తీవ్ర స్థాయిలో విమర్శలు మూట గట్టుకోక తప్పదు. 2015లో ప్రత్యేక హోదా డిమాండ్ ముమ్మరంగా ఉన్న సమయంలో అమరావతి శంకుస్థాపనకు వచ్చిన మోడీ ఢిల్లీలోని పార్లమెంట్ నుంచి మట్టి, యమునా నది నుంచి నీళ్లు తెచ్చి చంద్రబాబుకు ఇచ్చారు. హోదా విషయంలో మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు. దీంతో అప్పట్టో ప్రధాని తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ఇప్పడు మరోమారు రాజధాని శంకుస్థాపనకు వస్తే మునుపటికంటే ఎక్కువ విమర్శలు మూటగట్టుకోక తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ముదురు హీరోయిన్ తో రవితేజ రొమాన్స్ !


మాస్ మహా రాజా రవితేజక్రాక్‘ సినిమా తరువాత ఏ సినిమా చేయాలి ? ఏ డైరెక్టర్ తో చేయాలి అనే మీమాంసలో ఉన్నాడు. ఇప్పటికే రవితేజ డేట్స్ కోసం త్రినాధ్ రావ్, రమేష్ వర్మ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రమేష్ వర్మ సినిమా అయితే రెండు మూడు నెల్లల్లో పూర్తి అవుతుంది. ఎలాగూ రవితేజకు కావాల్సింది కూడా అదేనయ్యే. అందుకే దాదాపు రమేష్ వర్మకే ఫిక్స్ అయ్యాడు. అయితే ఈ సినిమాలో రవితేజ డబల్ యాక్షన్ అని.. సినిమాలో రవితేజ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఒక హీరోయిన్ గా లావణ్య త్రిపాఠిను ఫైనల్ చేసిన చిత్రబృందం, మరో హీరోయిన్ గా నిధి అగర్వాల్ ను తీసుకోవాలనుకున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.

Also Read: హాట్‌ బ్యూటీ.. హారర్ వెబ్‌ సిరీస్‌

కాగా చిత్రబృందం నిధినే ఆల్ మోస్ట్ ఫిక్స్ చేసేలా ఉంది. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా.. దాదాపు ఈ సినిమాలో క్యాస్టింగ్ ఫైనల్ అయింది. కాకపోతే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉంది. ఈ సాంగ్ లోని కంటెంట్ ప్రకారం ఒక సీనియర్ హీరోయిన్ కావలి. అంటే సీనియర్ హీరోయిన్ తో రొమాంటిక్ సాంగ్ అన్నమాట. మొదట ఈ సాంగ్ కోసం శ్రీయాను అనుకున్నారు. కానీ శ్రీయా అనగానే వెరీ రొటీన్ గా ఉంటుంది. అందుకే కొత్తగా చేద్దామనే సెన్స్ లో అమీషా పటేల్ ను అప్రోచ్ అయ్యారట. ఎలాగూ ఎవరు ఛాన్స్ ఇస్తారా అని ఎదురు చూస్తోన్న అమీషాకి ఈ ఆఫర్ మంచిందే. అందుకే అడిగిన వెంటనే ఎలాంటి సాంగ్ లోనైనా చేస్తానని చెప్పేసిందట.

Also Read: కరోనా జయించిన బిగ్‌బీ కుటుంబం..

ఇక ఈ చిత్రాన్ని కోనేరు సత్యనారాయణ దాదాపు ముప్పై కోట్లు పెట్టి నిర్మించనున్నారు. ప్రస్తుతం రవితేజ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తోన్న ‘క్రాక్’ సినిమా రవితేజకు పూర్వవైభవాన్ని తీసుకురాకపోతే గనుక.. ఇక రవితేజ కూడా జగపతి బాబు, శ్రీకాంత్ లా సైడ్ క్యారెక్టర్స్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ‘డిస్కో రాజా’ రవితేజ మార్కెట్ పై బాగానే దెబ్బ వేసింది. మరి క్రాక్ సినిమాతోనైనా రవితేజ హిట్ అందుకోని, మరో నాలుగేళ్లు హీరోగా కొనసాగాలని కోరుకుందాం.

విశాఖకు రాజధాని: జగన్ కు షాకిచ్చిన సొంత పత్రిక సర్వే?


విశాఖపట్నం పరిపాలన రాజధానిగా చేయాలన్నది సీఎం జగన్ చిరకాల స్వప్నం. దాని కోసం ఆయన పంతం పట్టారు. ఎన్ని విభేదాలు వచ్చినా.. ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యతిరేకించినా.. ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా.. హైకోర్టులు అడ్డుకుంటున్నా మొక్కవోని దీక్షతో ముందుకెళ్తున్నారు.

Also Read: అదే జరిగి ఉంటే విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో ఎంతో మంది బ్రతికేవారు..!

మూడు రాజధానుల బిల్లును గవర్నర్ ఆమోదించడంతో ఇప్పుడు జగన్ వడివడిగా విశాఖ రాజధానిగా అడుగులు వేస్తున్నారు. ఆగస్టు 16న ప్రధాని నరేంద్రమోడీతో విశాఖ రాజధాని శంకుస్థాపన కార్యక్రమం చేయాలని జగన్ ఆలోచిస్తున్నారు.

అయితే ఈ క్రమంలోనే సీఎం జగన్ కు చెందిన సొంత పత్రిక విశాఖ రాజధానిపై ప్రజాభిప్రాయం సేకరించిందట.. ఒక ప్రైవేట్ ఏజెన్సీతో కలిసి సర్వే చేస్తే అందులో ఆశ్చర్యకర ఫలితాలు వచ్చాయని మీడియా సర్కిల్స్ లో చర్చించుకుంటున్నారు.

విశాఖలో రాజధాని ఏర్పాటుపై జగన్ సొంత పత్రిక సర్వే చేస్తే అందులో ఏకంగా 62శాతం ప్రజలు వ్యతిరేకించారని సమాచారం. ఇదే విషయాన్ని మాజీ ఎంపీ సబ్బం హరి కూడా వెల్లడించడం విశేషం.

Also Read: మోడీ ని జగన్ కోరిన మూడు కోరికలు ఇవే…?

ఈ సర్వేలో సచివాలయం మినహా విశాఖకు వచ్చేది ఏమీ లేదన్న భావన ప్రజల్లో ఉందని తేటతెల్లమైందట.. దీంతో విశాఖ రాజధానిపై అక్కడ ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తే ఫలితం జగన్ కు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలున్నాయంటున్నారు.

జగన్ సొంత పత్రిక సర్వే ఫలితం చూస్తే నిజంగానే వైసీపీ ప్రభుత్వం ఇరుకునపడ్డట్టు అవుతుంది. అందుకే దీన్ని పెద్దగా బయటకు ప్రొజెక్ట్ చేయడం లేదని సమాచారం. సర్వేను బట్టి చూస్తే జగన్ ఆశపడినా విశాఖ రాజధాని ఆ ప్రాంతవాసులకే ఇష్టం లేదని అర్థమవుతోంది. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రతిపక్ష టీడీపీ అనుకూలంగా మలుచుకొని జగన్ ను ఇరుకునపెడుతోంది.

ఎన్టీఆర్ ప్రేమ కోసం చనిపోతుందట !


ఆర్ఆర్ఆర్‘లో ఎన్టీఆర్ కి జోడీగా హాలీవుడ్ బ్యూటీ ఓలివియా మోరిస్ నటిస్తోందంటేనే ఆమె రోల్ ఎంత కీలకమైనదో అర్ధం చేసుకోవచ్చు. అయితే తాజాగా ఎన్టీఆర్ – ఓలివియా లవ్ ట్రాక్ కు సంబంధించిన సీన్స్ గురించి ఒక ఆసక్తికరమైన మ్యాటర్ తెలిసింది. ఈ లాక్ డౌన్ గ్యాప్ లో ఎడిటర్ తమ్మిరాజు ఈ సీన్స్ ఎడిటింగ్ కూడా పూర్తి చేశారు. కాగా ఆయన ఎడిటింగ్ చేస్తోన్న క్రమంలో ఆ నోటా ఈ నోటా పాకి మొత్తానికి ఈ సీన్స్ తాలూకు కంటెంట్ ఫిల్మ్ సర్కిల్స్ లో తెగ హల్ చల్ చేస్తోంది. ఎన్టీఆర్ – ఒలివియా లవ్ ట్రాక్ లో ఎక్కడా ఇద్దరి మధ్య సింగిల్ డైలాగ్ కూడా ఉండదట.. అంటే వారి మధ్య చోటు చేసుకున్న సంఘటనలతోనే ఓలివియా, ఎన్టీఆర్ పై ఘాడమైన ప్రేమను పెంచుకుంటుందని.. ఎన్టీఆర్ పాత్రకు మాత్రం ఆమె పై ఎలాంటి ఫీలింగ్స్ ఉండవని తెలుస్తోంది.

Also Read: హాట్‌ బ్యూటీ.. హారర్ వెబ్‌ సిరీస్‌

అన్నట్టు చివరికీ ఓలివియా, ఎన్టీఆర్ మీద ప్రేమతోనే భారత దేశం కోసం ప్రాణాలు కూడా ఇస్తుందట. మొత్తానికి ఎన్టీఆర్ – ఓలివియా ట్రాక్ మొత్తంలోనే టాకీ పార్ట్ లేకుండా, రాజమౌళి లవ్ స్టోరీని చాల కొత్తగా ఎమోషనల్ గా ప్లాన్ చేశాడు అన్నమాట. ఇక ఈ సినిమాలో తెలంగాణ యాసలో తారక్ పలికే డైలాగ్ లు కూడా అద్భుతంగా వచ్చాయట. డైలాగ్ చెప్పడంలో ఎన్టీఆర్ కి ఉన్న వాయిస్ కమాండ్ కి తోడు తెలంగాణలోని యాస కూడా డైలాగ్ లకు మరింత అందాన్ని తీసుకొచ్చిందట. ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజుకు మిస్ అయిన తారక్ ఫస్ట్ లుక్ వీడియో కోసం తారక్ ఫాన్స్ తో పాటు యావత్తు ప్రేక్షక లోకం ఎంతగానో ఎదురు చూస్తోంది.

Also Read: అవార్డు విన్నింగ్‌ డైరెక్టర్​తో రాజశేఖర్ మూవీ?

కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజులా, తారక్ కొమరంభీంలా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 80% షూట్ పూర్తి చేసుకున్నా… మిగిలిన షూటింగ్ పూర్తి చేయడానికి మరో రెండు నెలలు టైం పడుతుంది. ప్రస్తుతం రాజమౌళి కరోనా నుండి కోలుకుంటున్నారు. ఏమైనా ‘బాహుబలి’ సిరీస్ తర్వాత జక్కన్న నుండి వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకులు ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రీయా నటిస్తుండగా.. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు.