
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప‘ సినిమాలో బన్నీ డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాడని.. సినిమాలో బన్నీ బైపోలార్ డిజార్డర్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడని లేటెస్ట్ సమాచారం. అన్నట్టు ఈ బైపోలార్ డిజార్డర్ ఉన్నవారిలో మానసిక అసమతౌల్యతలు విపరీతంగా ఉంటాయి. అంటే సంతోషంగా ఉన్నప్పుడు మరీ ఎక్కువగా ఎగ్జయిట్‌మెంట్‌కి లోను కావడం, అలాగే బాధగా ఉన్నప్పుడు మరీ విపరీతంగా ప్రవర్తించడం వంటి లక్షణాలు ఉంటాయి. అసలు బన్నీ మామూలుగానే ఫుల్ ఎగ్జయిట్‌మెంట్ తో ఉంటాడు. అలాంటిది ఎగ్జయిట్‌మెంట్ రోల్ అంటేనే ఇక ఎలా ఉంటుందో చూడాలి.
Also Read: నాని హీరోయిన్‌కు బంపరాఫర్!
ఏమైనా క్రియేటివ్ డైరెక్టర్ అని పేరు తెచ్చుకున్నందుకు సుకుమార్ ఏదోకటి కొత్త పాయింట్ ను పట్టుకోవడానికి తెగ తాపత్రయ పడుతుంటాడు. అందులో భాగంగానే ఇలా ఓ డిజార్డర్ క్యారెక్టర్ ను రాసుకున్నాడు. అన్నట్టు ఈ ‘పుష్ప’ షూటింగ్ ను నవంబర్ నుండి స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ముందుగా సాధ్యమైనంత తక్కువమంది సభ్యులతో షూట్ స్టార్ట్ చేసి అంతా ఓకే అనుకుంటేనే షూటింగ్ ను కంటిన్యూ చేస్తారట. పైగా సభ్యులందరికీ కరోనా టెస్ట్ చేసి, వారికీ కరోనా సోకే అవకాశం లేకుండా టీమ్ అందర్నీ షూట్ జరుగుతున్న అంత కాలం జన సాంద్రతకు దూరమైన ప్రాంతంలోనే ఉంచి సింగిల్ షెడ్యూల్ లోనే సినిమాని పూర్తి చేయాలనేది సుకుమార్ ప్లాన్. కానీ ఎక్కువ టైం తీసుకునే సుకుమార్ స్పీడ్ గా షూట్ ఎంతవరకు చేస్తాడు అన్నదే ఇక్కడ డౌట్.
Also Read: మరో కొత్త డైరెక్టర్‌తో సాయి ధరమ్!
నిజానికి ఈ నెల నుండే బన్నీ – రష్మిక పై సాంగ్ షూట్ చేయాలనుకున్నారు. అలాగే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలాను తీసుకున్నారు. ముందుగా ఈ రెండు సాంగ్స్ ను షూట్ చేద్దామనుకున్నప్పటికీ కరోనా ప్రభావం రోజురోజుకు పెరుగుతుండటంతో ఇక షూటింగ్ ని పోస్ట్ ఫోన్ చేసుకున్నారు. ఇక ఈ చిత్రంలో బన్నీకి జోడీగా వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమా కోసం అమ్మడు బికినీ వేయడానికి కూడా ఒప్పుకుందట. ఇక దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఎప్పుడూ బిజీగా ఉండే దేవీ శ్రీ, ఈసారి కూల్ గా తీరిగ్గా కూర్చుని మరీ పుష్ప సినిమాకి ట్యూన్స్ కంపోజ్ చేస్తుండంతో సాంగ్స్ పై భారీ అంచనాలు ఉన్నాయి. వాటిని దేవి అందుకోలేకపోతే కెరీర్ పైనే ఎఫెక్ట్ పడుతుంది.