Home Blog Page 8362

కెసిఆర్ గారూ, ప్రజల జీవితాలతో చెలగాటమాడకండి

cmkcr

cmkcr

కెసిఆర్ , ఈ పేరంటేనే మీడియా కి భయం. ప్రభుత్వ వైఫల్యాలు ఎన్నున్నా ఎత్తిచూపాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. ఏమిరాస్తే ఏమి వస్తుందో అని భయపడుతూ మీడియా ఓనర్లు బతుకు వెళ్లదీస్తున్నారు. కరోనా వార్తల్లో ఈ భయం మరీ ఎక్కువ. దేశంలోనే అతితక్కువ టెస్టులు చేస్తున్నా తాటికాయంత అక్షరాల్లో హెడ్డింగ్ పెట్టి ఫ్రంట్ పేజి లో రాసే దమ్ము, ధైర్యం లేదు. అంతకన్నా దారుణం కరోనా బాధితులు చనిపోతే రికార్డుల్లో ఎక్కని కేసులు లెక్కలేనన్ని. గణాంకాల ద్వారా ఎలా మభ్యపెట్టొచ్చో కెసిఆర్ ని అడిగితే సరి. ఇందులో పిహెచ్ డి చేసింది కెసిఆర్ ప్రభుత్వం. ప్రైవేటు ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నా కిమ్మనకుండా చోద్యం చూస్తుంది  ప్రభుత్వం.     దీనికి కారణం లేకపోలేదు. ప్రైవేటు ఆసుపత్రులు ప్రభుత్వం ఎలా చెబితే అలా నడుచుకుంటున్నాయి. కరోనా పాజిటివ్ తో ఆసుపత్రిలో చేర్చుకున్నా, కావలసినంత డబ్బులు గుంజినా , చివరకు ప్రభుత్వ రికార్డుల్లో కరోనా తో చనిపోయినట్లు రిపోర్టు చేయకుండా ఉండటానికి పూర్తి సహకారం చేస్తున్నాయి ప్రైవేటు ఆసుపత్రులు. మరి ఇది ఉభయతారకంగా వుంది కదా.

Also Read: దుబ్బాక బరిలో సీఎం కూతురు?

కెసిఆర్ ప్రభుత్వం పై ఓ మహిళ పెట్టిన వీడియో వైరల్ అయ్యింది. ధైర్యంగా ముందుకొచ్చి తెలంగాణా ప్రభుత్వం కెసిఆర్ ఆధ్వర్యం లో ఎలా ప్రజల జీవితాలతో చెలగాట మాడుతుందో వివరంగా చెప్పింది.

ఆ మాత్రం ధైర్యం మన జర్నలిస్టులకు లేపాయే. హైదరాబాద్ అంతా బాగుందని బయట ప్రపంచాన్ని నమ్మబలుకుతున్నాడు కెసిఆర్. మరి నిజం అదికాదని ఎలా చెప్పగలం? మావంతు కృషిగా ఈ వీడియో ను మా సైట్ లో అటాచ్ చేస్తున్నాము. మిగతావారు కూడా అలా చెయ్యాలి. మీరు రాయలేకపోతే కనీసం ఇటువంటి వీడియోలు అటాచ్ చేస్తే చాలు, ప్రజలకు నిజాలు తెలుస్తాయి. నాకు తెలిసిన మిత్రుల తాలూకు కేసులే ఇలా రికార్డ్ కాకుండా వున్నాయని చెబుతున్నా. ఈ నా ఆరోపణలకు కట్టుబడి వున్నాను. ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నా కాదని నిరూపించమని. ఇంత బూటకం, నాటకం ఎందుకు? ఏం ఎక్కువ కేసులు వస్తే, ఎక్కువ మరణాలు వుంటే ఆత్మరక్షణ లో పడతారనా? మీ ప్రయత్నం లో లోపం లేనంతవరకూ ప్రజలు మిమ్మల్ని అర్ధం చేసుకుంటారు కెసిఆర్ గారు. ఉదాహరణకు ఇండియా టుడే ‘మూడ్ అఫ్ ది నేషన్’ పోల్ లో కరోనా ని హేండిల్ చేయటం లో మోడీ ని నూటికి 80 శాతం పైనే ప్రశంసించారు. కెసిఆర్ కూడా పారదర్శకంగా వుంటే కేసులు ఎక్కువైనా , మరణాలు ఎక్కువైనా తనపనిలో లోపం లేనంతవరకు ప్రశంసిస్తారు కదా. అసలు సమస్యని తక్కువచేసి చూపటం లో వచ్చిన ప్రయోజనమేమిటో అర్ధంకావటం లేదు.

కెసిఆర్ కొన్ని విషయాల్లో ధృఢమైన నిర్ణయాలే తీసుకున్నాడు. అంతమాత్రాన తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు వుపేక్షించాల్సిన పనిలేదు. దొర లక్షణాలు కెసిఆర్ లో బాగా వున్నాయి. తను చెప్పిందే వేదం, తన మాటను ఎవరూ జవ దాటకూడదు. ఎవరైనా అలా చేస్తే ఎంతదాకా అయినా వెళ్లి తాట తీస్తాను అంటాడు. ఇటువంటి లక్షణం వున్నవాళ్ళు కొన్ని మంచి పనులూ చేస్తారు. కొన్ని చెడ్డ పనులూ చేస్తారు. అది వాళ్లకు నచ్చాలి. ఒకరిమాట వినరు. ఇది బలమైన నాయకత్వం అనేదానికన్నా నియంతృత్వ లక్షణం అని చెప్పొచ్చు. బలమైన నాయకుడంటే పదిమందికోసం, పదిమంది మెచ్చినవి ధైర్యం తో చేయగలిగేవాడు. నియంత అలాకాదు తనమాటే చెల్లాలి అనే మనస్తత్వం వుంటుంది. కెసిఆర్ రెండో రకం. ఇంతమంది ప్రాణాలు గాలిలో కలిసి పోతుంటే కప్పిపుచ్చాలని ప్రయత్నించటం క్షమించరాని నేరం. వున్నది ఉన్నట్లుగా చూపి నా ప్రయత్నం లో లోపం లేదు నేను చేయగలిగిందంతా చేసాను అని ప్రజలముందు పెడితే ప్రజలు అర్ధం చేసుకునేవాళ్ళు. కానీ ఇలా టెస్టులు చేయకుండా , మరణాలు కప్పిపుచ్చి దొంగ  లెక్కలు చూపిస్తే ప్రజలు తిరగబడతారని మరిచిపోవద్దు.

Also Read: తెలిసిందిగా.. కేటీఆరే వర్కింగ్ సీఎం అన్నట్టు?

దేశం మొత్తం మీద ఇలా విపరీత మనస్తత్వం తో ప్రవర్తించే వాళ్ళలో ఇద్దరు ప్రముఖంగా కనిపిస్తున్నారు. ఒకరు మమతా బెనర్జీ, రెండు కెసిఆర్. వీళ్ళిద్దరూ దాదాపు కరోనా మహమ్మారి ని కట్టడి చేయటం లో ఒకలాగానే ప్రవర్తించారు. ముందుగా మీడియా ని కట్టడి చేసారు. అధికార యంత్రాంగాన్ని గుప్పెట్లో పెట్టుకొని తాము ఆడిందే ఆట పాడిందే పాట లాగా ప్రవర్తిస్తున్నారు. టెస్టులు చేయరు, ఆసుపత్రి సౌకర్యాలు అరకొర, మరణాలు కరెక్టుగా రికార్డు చేయరు. ఎవరైనా ప్రశ్నిస్తే నోరేసుకొని పడిపోతారు. జనం భయంతో గమ్మున కూర్చునేటట్లు చేస్తున్నారు. ఇలానే వుంటే ఆ నిశబ్దం నుంచే నిశబ్ద విప్లవం పుడుతుంది. అది జరిగే రోజు ఎంతో దూరం లో లేదు. కెసిఆర్ గారూ ఇప్పటికైనా బుద్ధితెచ్చుకొని ఎక్కువ టెస్టులు చేయించండి. అసలు మనమెక్కడ ఉన్నామో అర్ధంచేసుకోనివ్వండి. ఆసుపత్రి సౌకర్యాలు మెరుగుపరచండి. మరణాలు వున్నది వున్నట్లు చూపించండి. అప్పుడే సరైన ప్రత్యామ్నాయాలు కనిపెడతారు. అంతేగానీ కప్పిపుచ్చితే నిజం ప్రజలకు తెలియదనుకోవద్దు. ప్రజలను గొర్రెలమందలనుకొనే రోజులు పోయాయి. తప్పు మీద తప్పు చేసి ప్రజలు తిరగబడేటట్లు చేసుకోకండి. మాకు మీరు డిక్టేటర్ అయినా పర్వాలేదు కానీ బెనవలెంట్ డిక్టేటర్ గా వుండండి. ప్రజలు మీకు బ్రహ్మరధం పడతారు లేకపోతే బ్రహాస్త్రం ప్రయోగిస్తారు , తస్మాత్ జాగ్రత్త.

పవన్ బర్త్ డే ట్రీట్ రెడీ అవుతుంది..


మెగా ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు సెలబ్రేషన్ మూడ్లో ఉన్నారు. ఒకవైపు నాగబాబు ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన కుమార్తె నిహారిక నిశ్చితార్థం జరగగా.. పెళ్లి పనులు మొదయ్యాయి. మరోవైపు మెగాస్టార్‌‌ చిరంజీవి పుట్టిన రోజు దగ్గరపడుతోంది. ఈ నెల 22న మెగాస్టార్‌‌ 65వ బర్త్డే. ఈ పుట్టిన రోజును ఓ రేంజ్‌లో నిర్వహించాలని మెగా ఫ్యాన్స్‌ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. సోషల్ మీడియాలో చిరు బర్త్‌డే కామన్ డీపీ హల్చల్ చేస్తోంది. బర్త్ డే స్పెషల్గా మెగా ర్యాంప్ సాంగ్ ‘నమస్తే మాస్టరు’ రెడీ అయింది. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 2వ తేదీన జరిగే పవర్‌‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ 49వ బర్త్ డే వేడుకలను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించేందుకు అభిమానులు ఏర్పాట్లు చేశారు. దీని కోసం పవన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నారు. పవన్ బర్త్డే కామన్ డిస్‌ప్లే పిక్చర్ (సీడీపీ)తో వరల్డ్ రికార్డు సృష్టించారు. పవన్‌ కళ్యాణ్ బర్త్‌డే హ్యాష్ ట్యాగ్‌తో 24 గంటల్లోనే 65 మిలియన్ల ట్వీట్స్ చేసి సరికొత్త వరల్డ్ రికార్డ్ నెలకొల్పారు. తన కోసం ఇంత చేసిన ఫ్యాన్స్ కు బర్త్‌డే ట్రీట్ ఇచ్చేందుకు పవన్ రెడీ అవుతున్నాడు.

Also Read: హ్యాకర్ల బారినపడిన యంగ్ బ్యూటీ..!

దాదాపు రెండేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న పవన్.. ‘వకీల్ సాబ్’తో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హిట్ మూవీ ‘పింక్’కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ తొలిసారి లాయర్ పాత్రలో కనిపించబోతున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని బోనీ కపూర్ తో కలిసి దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. నివేదా థామస్, అంజలి, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కరోనా కారణంగా షూటింగ్కు బ్రేక్ పడడంతో ఈ వేసవిలో రిలీజ్ కావాల్సిన మూవీ ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, రెండేళ్ల విరామం తర్వాత పవన్ చేస్తున్న చిత్రం కాబట్టి ‘వకీల్‌ సాబ్‌’పై అందరి దృష్టి నెలకొంది. ఇప్పటికే రిలీజ్‌ చేసిన పవన్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్, ఫస్ట్‌ సింగిల్.. మగువా మగువా (లిరికల్‌ వీడియో)కు విపరీతమైన స్పందన వచ్చింది. అలాగే, ఈ మూవీలో కోర్టు సీన్ ఫొటో లీక్ కాగా.. అది కూడా వైరల్ గా మారింది. ‘వకీల్ సాబ్’ గురించి చాన్నాళ్లుగా అప్డేట్ లేకపోవడంతో పవన్‌ ఫ్యాన్స్ కొంత నిరాశలో ఉన్నారు. అయితే, వారిని ఉత్సాహపరిచేందుకు చిత్ర బృందం కసరత్తులు చేస్తోంది. పవన్‌ బర్త్డే రోజు అంటే సెప్టెంబర్ 2న ఈ మూవీ టీజర్‌‌ను రిలీజ్‌ చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. పవన్ పుట్టిన రోజున అభిమానులకు గుర్తుండిపోయే రీతిలో టీజర్‌‌ను కట్ చేసే పనిలో ఉందట చిత్ర బృందం. అదే జరిగితే ఫ్యాన్స్ కు పండగే.

జంప్ చేసిన సన్నిలియోన్.. గుండె గుబేల్..!


శృంగార తార సన్నీలియోన్ పేరు చెబితేనే కుర్రకారులో వైబ్రేషన్స్ మొదలవుతుంటాయి. వయస్సుతో సంబంధం లేకుండా సన్నీలియోన్ ను ప్రతీఒక్కరు ఆరాధిస్తుంటారు. ఇక యువతలో సన్నీలియోన్ కు ఉన్న క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సన్నిలియోన్ పేరు చెబితే గుగూల్ సర్వర్లు కొద్ది క్షణాలపాటు ఆగిపోతాయనే టాక్ ఉంది. అంతలా ఈ శృంగారతారకు భారత్ తోపాటు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉంది.

Also Read: బాలీవుడ్‌ హాట్ బ్యూటీ.. టాలీవుడ్‌ ఎంట్రీ!

సన్నీలియోన్ పార్న్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ బాలీవుడ్లో మాత్రం హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకుంది. బాలీవుడ్లో పలు శృంగార, యాక్షన్ చిత్రాల్లో నటించి అభిమానులను ఆకట్టుకుంది. తన గ్లామర్ తోనే కాకుండా నటనతో ఆకట్టుకుంది. గ్లామర్ షోకు ఏమాత్రం వెనుకడుగు వెయ్యకుండా బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు కురిపిస్తుంటోంది. అందుకే బాలీవుడ్ మేకర్స్ ఆమెతో సినిమాలు చేసేందుకు ముందుంటారు. తెలుగులో మంచు మనోజ్ హీరోగా నటించిన ‘కరెంట్ తీగ’లో సినిమాలోనూ ఓ ప్రత్యేక పాత్రలో నటించింది. టాలీవుడ్లోనూ పలు ఐటమ్ సాంగ్స్ లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది.

తాజాగా సన్నీలియోన్ ఇన్ స్ట్రాగ్రాములో పోస్టు చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. దేశంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల సన్నీలియోన్ ఇండియా నుంచి యూఎస్ వెళ్లిపోయిది. ప్రస్తుతం అక్కడే తన తన పిల్లలతో కలిసి ఉంటున్న ఇండియన్ అభిమానులతో టచ్లోనే ఉంటోంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన పిక్స్, వీడియోలు, ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది.

Also Read: పక్కన మగాడు కనిపిస్తే చాలు కథలు అల్లేస్తున్నారు: సీనియర్ నటి

సన్నీలియోన్ తాజాగా తన కూతురితో కలిసి స్విమ్మింగ్ ఫూల్ లో జంప్ చేసిన వీడియోను షేర్ చేసింది. బికినీలో ఉన్న సన్నీలియోన్ స్లో మోషన్లో స్విమ్మింగ్ ఫూల్లో జంప్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. సన్నీ ఈ వీడియోను పోస్టు చేసిన కొద్దిక్షణాల్లోనే లక్షకు చేరువలో లైక్స్ వచ్చాయి. మీరు కూడా ఈ వీడియో చూసి ఓ లైక్ వేసుకొండి..!

https://www.instagram.com/p/CD-v8ITjvEN/

 

పవన్ కళ్యాణ్ ది ‘రాజకీయ’ దీక్షేనా?

pawankalyan


పవన్ కళ్యాణ్ ను చూస్తే ఒక విప్లవ నాయకుడిని చూసినట్టు ఉంటుంది. ఒక నక్సలైట్ వీరావేశంతో అరిచినట్టు ఉంటుంది. క్యూబా కమ్యూనిస్టు విప్లవ యోధుడు చేగువేరా ఆదర్శంగా పవన్ ఉంటాడు. కమ్యూనిస్టులను ఆరాధిస్తాడు. నిజానికి కమ్యూనిజం అంటే నాస్తికవాదం.. ఆధ్యాత్మికతకు వీరంతా దూరంగా ఉంటారు. విగ్రహారాదనను వ్యతిరేకిస్తారు. మొన్నటివరకు పవన్ అలానే ఉండేవాడు. కానీ సడన్ గా మారిపోయాడు.. ఎంతలా అంటే ఎవ్వరూ ఊహించని విధంగా..

Also Read: ఏపీ రాజధానిపై సుప్రీంలో కీలక పరిణామం.. వెనుక కథేంటి?

ఒక రాజకీయ నాయకుడు అంటే పూర్తిగా ప్రజల్లోనే ఉంటాడు. వారి కోసమే తపిస్తాడు. కానీ పవన్ తీరు పూర్తి భిన్నం. ఆయన అమావాస్య, పౌర్ణమికి మాత్రమే రాజకీయాలు చేస్తాడు.. మిగతా టైంలో సైలెంట్ అయిపోతాడు. కానీ ఇప్పుడు తనకు అస్సలు పడని ఆధ్మాత్మికంలో పవన్ కూరుకుపోయాడు.. ఇదే అందరినీ ఆశ్చర్యపరుస్తున్న అంశంగా మారింది.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అత్యంత అరుదుగా సాధువులు.. సన్యాసులు మాత్రమే చేసే ‘చాతుర్మాస్య దీక్ష’ చేస్తున్నాడు. ఇది పూర్తిగా హిందూ కర్మ. కానీ పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కమ్యూనిస్టు భావాలున్న వ్యక్తి. కుల, మతవాదానికి వ్యతిరేకంగా తాను భారతీయుడిని అని ప్రకటించిన మనిషి. అలాంటి పవన్ ఇంతటి కఠినమైన దీక్షను స్వీకరించడం అందరినీ షాక్ కు గురిచేసింది.

నిజానికి ఈ దీక్షతో పవన్ కళ్యాణ్ బీజేపీకి దగ్గరవ్వడానికి చేసిన ప్లాన్ అని కొందరంటున్నారు. వింతగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ చాతుర్మాస్య దీక్షలో ఎక్కడికి వెళ్లకూడదు. కానీ విరామం ఇచ్చి ఇటీవల తన అభిమాని, హీరో నితిన్ వివాహానికి హాజరయ్యాడు. అదే సమయంతో తన అన్న బిడ్డ నిహారిక నిశ్చితార్థానికి మాత్రం డుమ్మా కొట్టాడు.

Also Read: “చంద్రబాబు ని ఎందుకు బిజెపి ఏమీ అనకూడదు…?” ఈ ఏడుపు ఎవరిది?

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 2024 ఎన్నికల కోసమే ఇదంతా చేస్తున్నాడని ఆయన సన్నిహిత వర్గాల నుంచి వార్తలు లీక్ అవుతున్నాయి. జనసేన ఏపీలో బలంగా తయారవడంతోపాటు 2024లో అధికారమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ఈ దీక్ష బూనినట్టు జనసేన నాయకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే హిందుత్వవాదాన్ని బలపరిచే బీజేపీకి అదే ఆయుధంతో కొట్టాలని ఈ దీక్ష చేస్తున్నట్టు రాజకీయవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అరె.. లేడీ సూపర్ స్టార్ కి మళ్ళీ పెళ్లి !


లేడీ సూపర్ స్టార్ గా నయనతారకు ఉన్న క్రేజ్ మిడియమ్ రేంజ్ స్టార్ హీరోలకు కూడా లేదు. పైగా రెమ్యునరేషన్ ల విషయంలో కూడా నయనతారది ఒక మెట్టు ఎక్కువే. ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీలో నయనతార అంటే.. స్టార్ హీరోతో సమానం. నిజంగా నయనతారకు అంత డిమాండ్ ఉందా అని అనుమానం రావొచ్చు గాని, తమిళంలో నయనతార సినిమాలకు ఫుల్ మార్కెట్ ఉంది. మార్కెట్ ఉందనే.. ఆమె అడిగినంత ఇస్తున్నారు, సినిమా ప్రమోషన్స్ కు రాలేను అంటే.. సరే అంటున్నారు. ఇలాగే మరో హీరోయిన్ చేస్తే.. ఈ పాటికే ఆ హీరోయిన్ కెరీర్ సైడ్ అయిపోయేది. కానీ, నయనతారకు మాత్రం డిమాండ్ రోజురోజుకు పెరుగుతూ పోతూ ఉంది.

Also Read: పక్కన మగాడు కనిపిస్తే చాలు కథలు అల్లేస్తున్నారు: సీనియర్ నటి

అందుకే తమిళ్ మీడియా కూడా నయనతార పై పుట్టించే పుకార్ల పరంపరతోనే బండి లాగిస్తోంది. దానికి తోడు నయనతార వ్యక్తిగత జీవితంలో కూడా ప్రేమ కథలు ఎక్కువైపోవడం, అప్పట్లో ఆమె ఎఫైర్స్ గురించి కూడా విపరీతంగా వార్తలు రావడం.. మొత్తానికి నయనతార అనగానే ఒక ప్రేమ పిపాసిలా తమిళ్ మీడియా ఆమెను ముందు నుంచీ ప్రొజెట్ చేస్తూ వచ్చింది. తమకు అవసరమైన ప్రతిసారి ఎప్పటికప్పుడు ఆమె గురించి కథలుకథలుగా తప్పుడు వార్తలను రాసుకుంటూ పబ్బం గడుపుకుంటూ ఉంది తమిళ్ మీడియా.

ఈ క్రమంలోనే నయనతారకు ఇప్పటికే నాలుగు సార్లు పెళ్లి చేశారు. రెండు సార్లు కరోనా వచ్చిందని జనాన్ని నమ్మించారు. ఇప్పుడు తాజాగా నయనతారకు మళ్లీ పెళ్లి చేసారు. విఘ్నేష్ శివన్ తో నయనతార పెళ్లి అయిపోయిందని తమిళ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తూ ఉంది. ఇది పూర్తిగా అవాస్తవం అని నయనతార మేమేజర్ తాజాగా తమిళ మీడియాకి క్లారిటీ ఇచ్చాడు. అయినా, ఆయనగారు ఇప్పుడు కొత్తగా క్లారటీ ఇచ్చేది ఏముంది. తాము రాసింది అబద్ధం అని తమిళ మీడియాకి తెలుసు కదా. ఇక్కడ నయనతారది కూడా తప్పు ఉందిలేండి.

Also Read: ఫ్యాన్స్‌కు పండగే.. రజినీ- కమల్‌ కాంబో ఫిక్స్‌..

ఇప్పటికే రెండు మూడు విఫలమైన ఘాటు ప్రేమ కథలను పెట్టుకుని కూడా.. గత ఐదేళ్లుగా విఘ్నేష్ శివన్ ప్రేమలో మునిగితేలుతూ ఉంది. అసలు నయనతార అతనిని ఎప్పుడో పెళ్లి చేసుకుని ఉండి ఉంటే… ఇలాంటి వార్తలు రావు కదా.. ఎప్పటికపుడూ ప్రేమికుడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ.. పెళ్లి వద్దు అంటే.. ఇక తప్పుడు వార్తలు రాయకుండా మీడియా మాత్రం ఎందుకు ఉంటుంది. ఇప్పటికైనా నయనతారలో మార్పు వస్తే బెటర్.

అలా దొంగతనం చేశాడు.. ఇలా దొరికిపోయాడు!

మారుతున్న కాలంతో పాటే దొంగలు దొంగతనాలు చేసే తీరు కూడా మారుతోంది. పలు కేసుల్లో దొంగతనాలు జరిగినా ఒక్క క్లూ కూడా దొరక్కుండా దొంగలు జాగ్రత్తలు తీసుకోవడంతో పోలీసులకు కేసులు చేధించటం కష్టమవుతోంది. కానీ తాజాగా ఒక దొంగ మాత్రం తన తెలివితక్కువతనంతో సులభంగా దొరికిపోయాడు. అతడు దొంగతనం చేయడానికి ప్రయత్నించిన తీరు నవ్వు తెప్పిస్తోంది.

ఒక దొంగ దొంగతనంచేయడం కోసం ఏకంగా ఆంబులెన్స్ నే ఎంపిక చేసుకున్నాడు. ఆంబులెన్స్ లో డ్రైవర్ లేకపోవడంతో వాహనాన్ని ఎత్తుకెళ్లడానికి అదే సరైన సమయం అని భావించాడు. ఆంబులెన్స్ లోపలికి వెళ్లి వాహనాన్ని స్టార్ట్ చేయగా వెంటనే హెల్త్ వర్కర్లు అతడిని పట్టుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే బ్లాక్ పూల్ అనే ప్రాంతంలో ఒక వృద్ధుడు అనారోగ్యంతో బాధ పడుతుండగా అతన్ని తీసుకెళ్లడం కోసం ఆంబులెన్స్ వచ్చింది.

రోగికి అత్యవసర వైద్యం అందించాల్సి ఉండటంతో హెల్త్ వర్కర్లు ఆంబులెన్స్ ను అక్కడే ఆపి రోగికి వైద్యం చేస్తున్నారు. ఆ సమయంలో డ్రైవర్ సీట్లో డ్రైవర్ లేడు. ఆ సమయంలోనే తెలివి తక్కువ దొంగ దొంగతనానికి పాల్పడటానికి ప్రయత్నించాడు. లోపల ఉన్న హెల్త్ వర్కర్ ఇదంతా గమనించి వెంటనే దొంగను పట్టుకున్నాడు. అనంతరం హెల్త్ వర్కర్లు ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించగా తాగిన మత్తులో అలా చేశానని క్షమించి వదిలేయాలని డ్రైవర్ ఆంబులెన్స్ నిర్వాహకులను వేడుకున్నాడు.

https://youtu.be/0tlbrG_rYQY

మెగా అప్డేట్.. అభిమాలకు ‘ఆచార్య’ కానుక


మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ‘ఆచార్య’ చిత్ర యూనిట్ గుడ్ న్యూస్ చెప్పింది. చిరంజీవి పుట్టిన రోజున ‘ఆచార్య’ మూవీకి సంబంధించిన ఫస్టు లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 22న సాయంత్రం 4గంటలకు ఆచార్య మూవీకి సంబంధించిన ఫస్టు లుక్.. మోస్టర్ పోస్టర్ విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తోంది.

Also Read: ఫ్యాన్స్‌కు పండగే.. రజినీ- కమల్‌ కాంబో ఫిక్స్‌..

చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లాక చాలాకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ‘ఖైదీ-150’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ టాలీవుడ్లో బ్లాక్ బస్టర్ హిట్టు సాధించింది. ఈ మూవీలో చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటించింది. ఈ మూవీ తర్వాత చిరంజీవి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాల నర్సింహారెడ్డి జీవితాధరంగా తెరకెక్కిన ‘సైరా’ మూవీలో నటించారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో ఘన విజయం సాధించినా మిగతా భాషల్లో అనుకున్నంత విజయం సాధించలేదు.

ఈ మూవీ తర్వాత చిరంజీవి-కొరటాల కాంబినేషన్లో చిరంజీవి-152 మూవీ తెరకెక్కుతోంది. కమర్షియల్ హంగులతో మేసేజ్ ఓరియేంటేడ్ మూవీ తీయడంతో కొరటాల శివ దిట్టా. చిరు సినిమాలు కూడా మేసేజ్ ఓరియేంట్ గానే ఉంటాయి. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే మూవీపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో రాంచరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నాడు. ఆచార్యలో చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా రెజీనా ఓ ప్రత్యేక సాంగులో నటిస్తుంది. ఇప్పటికే దాదాపు 40శాతం షూటింగు పూర్తి చేసుకున్న ఈ మూవీ కరోనా కారణంగా వాయిదా పడింది.

Also Read: పక్కన మగాడు కనిపిస్తే చాలు కథలు అల్లేస్తున్నారు: సీనియర్ నటి

ఆచార్య మూవీకి మ్యూజికల్ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్టుగా నిలిచారు. ఇప్పటికే అభిమానులు సోషల్ మీడియాలో #Happy Birthday chiru ట్యాగులతో ట్వీటర్ ను హోరెత్తిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా చిరంజీవి కోసం ఓ ప్రత్యేక గిప్ట్ రెడీ చేస్తున్నాడు. ఇది కూడా చిరంజీవి పుట్టినన రోజున విడుదల కానుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.

దుబ్బాక బరిలో సీఎం కూతురు?

Kavitha


టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షాలన్నీ ఢీలా పడిపోయాయి. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగిన కారు జెడ్ స్పీడుతో దూసుకెళుతుండగా ప్రతిపక్షాలు కనీస పోటీ ఇవ్వలేక చతికిలపడ్డాయి. అయితే కరోనా ఎంట్రీతో రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయి. టీఆర్ఎస్ సర్కార్ కరోనా కట్టడిలో పూర్తిగా విఫలమైందనే విమర్శలు ఎదుర్కొంటుంది. రాష్ట్రంలో కరోనా టెస్టులు తక్కువ చేయడంపై ప్రభుత్వాన్ని హైకోర్టు తప్పుబట్టింది. దీంతో కొంతమేర ప్రభుత్వం టెస్టుల సంఖ్యను పెంచింది. అయితే ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే కరోనా విజృంభిస్తుందనే ప్రచారం జనాల్లోకి వెళ్లడంతో ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేక మొదలైంది.

Also Read: వరదలో వరంగల్.. కారణమెంటీ?

కరోనా విజృంభిస్తున్న సమయంలో దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అకస్మాత్తుగా మృతిచెందారు. దీంతో త్వరలోనే ఉప ఎన్నిక జరుగడం ఖాయంగా కన్పిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుండటంతో ప్రతిపక్ష పార్టీలన్నీ అలర్ట్ అయ్యాయి. దుబ్బాక టీఆర్ఎస్ కు కంచుకోట అయినప్పటికీ ప్రతిపక్ష పార్టీలైనా కాంగ్రెస్, బీజేపీలు పోటీ చేసేందుకు మొగ్గుచూపుతున్నాయి. టీఆర్ఎస్ నుంచి అభ్యర్థి ఎవరు నిలుచున్నప్పటికీ కాంగ్రెస్ పోటీ చేస్తుందని ఇటీవల టీసీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. పోటీ చేయడమే కాదు కాంగ్రెస్ పార్టీ దుబ్బాకలో గెలుస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు. బీజేపీ సైతం దుబ్బాకలో పోటీ చేస్తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఇప్పటికే ప్రకటించారు. త్వరలోనే బీజేపీ అభ్యర్థి ప్రకటిస్తామని బండి సంజయ్ తెలిపారు.

దుబ్బాకలో పోటీ ఖాయమని తేలడంతో ఆయా పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల విషయంలో తలమునకలవుతున్నాయి. 2009 ఎన్నికల్లో దుబ్బాకలో కాంగ్రెస్ నుంచి ముత్యం రెడ్డి గెలుపొందాడు. ఆ తర్వాత జరిగిన 2014, 2018ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రామలింగారెడ్డి వరుసగా విజయం సాధించారు. రెండుసార్లు కూడా పార్టీ అధికారంలోకి రావడంతో టీఆర్ఎస్ దుబ్బాకలో బలమైన శక్తిగా మారింది. టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావడంతో గెలుపు అవకాశాలు కూడా ఎక్కువగా ఉండటంతో ఆశావహులు టిక్కెట్టు కోసం పోటీపడుతున్నారు.

గతంలో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన చెరుకు ముత్యంరెడ్డి కిందటి ఎన్నికల్లో టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఆ తర్వాత ఆయన అకాల మృతిచెందాడు. తాజాగా రామలింగారెడ్డి మృతిచెందాడంతో టీఆర్ఎస్ లో పెద్దదిక్కు లేకుండా పోయాడు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు టీఆర్ఎస్ పార్టీని బలంగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి. టీఆర్ఎస్ పై వ్యతిరేక ప్రజల్లో ఏమేరకు ఉందో ఈ ఎన్నిక ద్వారా తేలనుండటంతో రెండు పార్టీలు కూడా పోటీ సై అంటున్నాయి. తెలంగాణలో ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇప్పటిదాకా ఓడిన దాఖలాలు లేవు. దీంతో ఈ ఎన్నికల్లో గెలిచి ప్రతిపక్షాలను బుద్దిచెప్పాలని ఆ పార్టీ భావిస్తోంది.

Also Read: కీసర ఎమ్మార్వో కేసులో టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల టార్గెట్ రేవంతేనా?

దీంతో టీఆర్ఎస్ నుంచి సీఎం కూతురు, నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత పేరు తెరపైకి వస్తోంది. ఇప్పటికే పలువురు సీనియర్లు ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. గత లోక్ సభ ఎన్నికల్లో అనుహ్యంగా కవిత ఓటమిపాలయ్యారు. కాగా నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కవిత పోటీలో ఉన్నారు. కరోనా కారణంగా ఎమ్మెల్సీ ఎన్నిక వాయిదా పడింది. దీంతో ఆమెను కవితను దుబ్బాక నుంచి పోటీ చేయిస్తే మెదక్ తోపాటు సంగారెడ్డిలోనూ టీఆర్ఎస్ బలోపేతం అవుతుందని అధిష్టానం భావిస్తుంది.

ఎమ్మెల్సీ బరిలో ఉన్న కవితను దుబ్బాక ఉప ఎన్నికల్లో నిలిపేందుకు సీఎం కేసీఆర్ మొగ్గుచూపక పోవచ్చనే టాక్ విన్పిస్తోంది. ఒకవేళ కవిత బరిలో లేకుంటే ఎవరు నిలబడుతారనే చర్చ టీఆర్ఎస్ శ్రేణుల్లో జోరుగా చర్చ నడుస్తోంది. దుబ్బాకలో టీఆర్ఎస్ బలంగా ఉండటం.. సిట్టింగ్ స్థానం కావడంతో ఆ పార్టీ నుంచి ఎవరు నిలిచినా గెలుపు ఖాయమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

బాలీవుడ్‌ హాట్ బ్యూటీ.. టాలీవుడ్‌ ఎంట్రీ!


టాలీవుడ్‌లోకి మరో బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ రంగ ప్రవేశం చేయనుంది. మిస్‌ యూనివర్స్‌ 2015లో పాల్గొని బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన ఊర్విశి రౌతేలా తొందర్లోనే తన హాట్ హాట్‌ అందాలతో తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. హిందీలో పలు సినిమాలు చేసిన ఊర్వశి వాటి కంటే స్పెషల్‌ సాంగ్స్‌,స్టేజ్‌ పెర్ఫామెన్స్‌లతోనే ఎక్కువ పేరు తెచ్చుకుంది. పలువురు హీరోలతో పాటు యువ క్రికెటర్ రిషబ్‌ పంత్‌తో ఎఫైర్ తో ఆమె పేరు బాలీవుడ్‌లో తరచూ వార్తల్లో నానింది. అడగకుండానే అందాలు ఆరబోసే ఊర్వశి పేరు కొన్ని రోజులుగా టాలీవుడ్‌లోనూ వినిపిస్తోంది.

Also Read: పక్కన మగాడు కనిపిస్తే చాలు కథలు అల్లేస్తున్నారు: సీనియర్ నటి

‘పుష్ప’ సినిమాలో ఐటమ్‌ సాంగ్‌ కోసం ఆమెను సంప్రదించారన్న వార్తలు వచ్చాయి. దానిపై ఇంకా క్లారిటీ రాకపోయినా ఈ హాట్‌ బ్యూటీ టాలీవుడ్‌లో అడుగు పెట్టడం ఖాయమైంది. యువ డైరెక్టర్ సంపత్‌ నంది పట్టుబట్టి ఆమెను తెలుగుకు పరిచయం చేయబోతున్నాడు. అయితే, ఆయన దర్శకత్వంలో ఊర్వశి సినిమా చేయడం లేదు. సంపత్‌ కథతో మోహన్‌ భరద్వాజ్‌ తెరకెక్కించనున్న ‘బ్లాక్‌రోజ్‌’ అనే మూవీలో రౌతేలా కథానాయికగా ఎంపికైంది. సంపత్‌…కేవలం ఊర్వశిని దృష్టిలో పెట్టుకొని ఈ కథ రాశాడు. నిర్మాత శ్రీనివాస్‌ చిట్టూరి…ఊర్వశి డేట్స్‌ సంపాదించాడు. దాంతో, రీసెంట్‌గా ఈమూవీకి కొబ్బరికాయ కూడా కొట్టారు. కాగా, సంపత్‌ అందించిన మరో కథతో ఓ సినిమా కూడా మొదలైంది. ఆయన దగ్గర అసోసియేట్‌గా పని చేసిన అశోక్‌ తేజ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి కె.కె. రాధా మోహన్‌ నిర్మాత. సంపత్‌ కథ, కథనం, మాటలు అందిస్తున్నాడు. ఇప్పటికే గోపీచంద్‌తో ‘సీటీమార్’తో బిజీగా ఉండడంతో తన వద్ద ఉన్న రెండు కథలను నంది వేరే వాళ్లకు ఇచ్చేశాడని తెలుస్తోంది.

కరోనా భయం.. సైకిల్‌ మీద శవంతో అంతిమయాత్ర!

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ మనుషుల్లో మానవత్వాన్ని చంపేస్తోంది. మృతి చెందిన వ్యక్తికి జరిగే అంత్యక్రియల విషయంలో సైతం పలు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కర్ణాటకలోని బెలగావి జిల్లాలో మానవత్వానికి మచ్చ తెచ్చే హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన వ్యక్తి శవాన్ని తరలించటానికి స్థానికులు సహాయం చేయకపోవడంతో మృతుడి కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడింది.

చివరకు చేసేదేం లేక మృతుడి కుటుంబ సభ్యులు సైకిల్ పైనే శవాన్ని శ్మశానికి తీసుకెళ్లాల్సి వచ్చింది. బెలగావి జిల్లా కిత్తూరు‌ తాలూకా ఎమ్‌కే హుబ్బలికి చెందిన ఓ వ్యక్తి అకస్మాత్తుగా మృతి చెందాడు. వ్యక్తి మృతికి కారణాలు తెలియకపోవడంతో స్థానికులు ఆ వ్యక్తి కరోనా వల్లే మృతి చెందాడని భావించారు. అందువల్ల అతని అంత్యక్రియలకు ఎటువంటి సహాయం చేయకుండా దూరంగా ఉండిపోయారు.

దీంతో మృతుని కుటుంబం అన్ని ప్రయత్నాలు చేసి చివరకు సైకిల్ పైనే మృతదేహాన్ని శ్మశానానికి చేర్చింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే శివకుమార్‌ నిన్న సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. శివకుమార్ ట్విట్టర్ లో షేర్ చేయడంతో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కర్ణాటక సర్కార్ ఇలాంటి ఘటనలపై దృష్టి పెట్టాల్సి ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ అవుతోంది.

సుశాంత్ అకౌంట్ లో రూ.15 కోట్లు మాయం అయినట్టు మీకు ఎలా తెలుసు?

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా సుశాంత్ తండ్రి కేకే సింగ్ ను కార్యాలయానికి పిలిపించి విచారించింది. ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణ జరిగిన సమయంలో అధికారులు కేకే సింగ్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. సుశాంత్ సింగ్ బ్యాంక్ ఖాతాల నుంచి నగదు మాయమైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయని… ఆ విషయం ఏ విధంగా తెలిసిందో కేకే సింగ్ చెప్పాలని అన్నారు.

కేకే సింగ్ ఈ ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలను అధికారులు రికార్డ్ చేశారు. ఇప్పటికే ఈడీ అధికారులు రేహా చక్రవర్తి, ఆమె సోదరుడు, సుశాంత్ మేనేజర్, సుశాంత్ స్నేహితుడు సిద్దార్థ్ లను విచారించారు. ఈడీ వారి స్టేట్ మెంట్లను ఇప్పటికే రికార్డ్ చేసింది. కేకే సింగ్ కొన్ని రోజుల క్రితం రేయా చక్త్రవర్తి తన కొడుకుతో డేటింగ్ చేసిందని… తమ కొడుకు బ్యాంకు ఖాతాల నుంచి ఆమె కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాలకు నగదు బదిలీ జరిగింది.

ఈ కేసు దర్యాప్తు విషయంలో మహారాష్ట్ర, బీహార్ పోలీసుల మధ్య వివాదం జరుగుతోంది. సుశాంత్ మరణం కేసు దర్యాప్తును బీహార్ ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. అయితే మహారాష్ట్రలో జరిగిన ఘటనకు బీహార్ ప్రభుత్వం సీబీఐకి అప్పగించటంపై మహారాష్ట్ర సర్కార్ నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం సుశాంత్ మరణం వెనుక చాలా కారణాలు ఉన్నాయని చెబుతోంది.

మహేశ్‌కు నమ్రతలా.. చైతూను నడిపించబోతున్న సమంత


వెండితెరపైనే కాకుండా నిజ జీవితంలో కూడా క్యూట్‌ కపుల్‌ అక్కినేని నాగచైతన్య, సమంత. తమ తొలి చిత్రం ‘ఏ మాయ చేసావే’ చేసేప్పుడే ప్రేమలో పడ్డ ఈ యువ జంట మూడేళ్ల కిందట మూడు ముళ్ల బంధంతో ఒక్కటైంది. అప్పటినుంచి చాలా అన్యోన్యంగా తమ దాంతప్య జీవితాన్ని కొనసాగిస్తున్నారు. సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితానికి కూడా అంతే ఇంపార్టెన్స్‌ ఇస్తున్నారు. కరోనా కారణంగా షూటింగ్స్‌ ఆగిపోవడంతో ఒక్కచోట గడిపేందుకు వీళ్లకు సమయం లభించింది. లాక్‌డౌన్‌ విరామంలో వర్కౌట్స్‌, ఇంటి పనులు, వంట పనులు కలిసి చేసుకున్న చై, సామ్‌ ఆ ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఏప్రిల్‌లో తన పుట్టిన రోజును సమంత ఇంట్లోనే సెలబ్రేట్‌ చేసుకుంది. భర్త చైతన్య.. ఆమె కోసం ప్రత్యేకంగా కేక్‌ తయారు చేసి ఆ రోజు మరింత తీపిగా మార్చాడు. ఆ ఫొటోలు, వీడియోలను సైతం సామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నాగచైతన్య పుట్టిన రోజు కోసం సమంత ఏర్పాట్లు చేస్తోంది.

Also Read: టాలెంటెడ్ డైరెక్టర్ కి తీవ్ర అవమానం !

చైతూ పుట్టిన రోజు నవంబర్23. దానికి ఇంకా చాలా టైముంది. మరి, ఇప్పటి నుంచే ఏర్పాట్లు ఎందుకు అనుకుంటున్నారా? దాని వెనుక బలమైన కారణమే ఉంది. ఇద్దరూ ఒకేసారి ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికీ కెరీర్ పరంగా సమంత చాలా ముందుంది. చాలా తక్కువ టైమ్‌లోనే స్టార్హీరోయిన్‌గా మారిందామె. తెలుగు దాదాపు అందరు స్టార్లతో వర్క్‌ చేసి హీరోలకు సమానమైన పేరు తెచ్చుకుంది. మరోవైపు నాగచైతన్య ఖాతాలో కొన్ని హిట్లు ఉన్నప్పటికీ అతని కెరీర్ ఆశించినంత వేగంతో ముందుకెళ్లడం లేదు. ఇంకా లవర్ బాయ్‌, పక్కింటి కుర్రాడి ఇమేజ్‌తోనే బండి నడుస్తోంది. ఇక లాభం లేదు.. తన భర్త స్టార్డమ్‌ ను మరో లెవెల్‌కు తీసుకెళ్లాలని, కెరీర్ స్పీడు పెంచాలని సమంత రంగంలోకి దిగింది.

Also Read: పక్కన మగాడు కనిపిస్తే చాలు కథలు అల్లేస్తున్నారు: సీనియర్ నటి

ఈ విషయంలో సూపర్ స్టార్ మహేశ్‌ బాబు భార్య నమ్రతను ఫాలో అవ్వాలని చూస్తోందట. పెళ్లి తర్వాత నటనకు దూరమైన నమ్రత.. ఇల్లు, భర్త కోసం ఆవిశ్రాంతంగా పని చేస్తోంది. మహేశ్‌ బిజినెస్‌, మార్కెటింగ్‌ మొత్తం ఆమెనే చూస్తుంది. కొత్త దర్శకుల స్టోరీలను కూడా ముందుగా ఆమెనే వింటుంది. సూపర్ స్టార్ సినిమా ప్రమోషన్స్‌ను కూడా పర్యవేక్షిస్తుంది. మహేశ్‌ సోషల్‌ మీడియా టీమ్‌ కు కూడా ఆమెనే మార్గనిర్దేశం చేస్తుందనేది బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో సమంత కూడా నమ్రత మాదిరిగా తన భర్త నాగ చైతన్య ను ప్రమోట్‌ చేయాలని భావిస్తోంది. ముందుగా సోషల్‌ మీడియా ద్వారా చైతూ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెంచాలని చూస్తోంది. ఈ క్రమంలో కొన్ని నెలల ముందే చైతన్య బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ గురించిన ప్రస్తావన తెచ్చింది. తన పీఆర్ టీమ్‌తో కలిసి చైతూను సోషల్‌ మీడియా సెన్సేషన్‌గా మార్చాలని చూస్తోందట. సామ్‌ ప్రయత్నంతో ఇప్పటికే చైతూ ఫ్యాన్స్‌ అలర్ట్‌ అయ్యారు. సోషల్‌ మీడియాలో హైప్‌ మొదలు పెట్టారు. మున్ముందు కథల ఎంపికలో కూడా తన భర్తకు సలహాలు ఇవ్వాలని, అవసరం అయితే ప్రమోషన్స్‌ కూడా హాజరు కావాలని సమంత భావిస్తోందట. భర్త కోసం ఆమె చేసే ప్రయత్నాలు ఎంత సక్సెస్‌ అవుతాయో చూడాలి.

పక్కన మగాడు కనిపిస్తే చాలు కథలు అల్లేస్తున్నారు: సీనియర్ నటి


సురేఖ వాణి. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన పేరు. మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌. అక్కగా, వదినగా, భార్యగా.. ఇలా ఏ పాత్ర చేసినా అద్భుతంగా నటిస్తుందామె. రెడీ, బాద్‌షా, ద్వారకా, శమంతకమణి, పిల్ల నువ్వులేని జీవితం, రారండోయ్‌ వేడుక చూద్దాం ఇలా తెలుగులో చాలా చిత్రాల్లో నటించిన ఆమె ఈ మధ్య వెండితెరపై పెద్దగా కనిపించడం లేదు. భర్త చనిపోయిన తర్వాత సినిమాలకు కాస్త దూరమైందామె. అదే సమయంలో వయసు పెరగడంతో హీరోల తల్లి పాత్రలో నటించాలని ఆఫర్లు వస్తున్నా ఆమె అంగీకరించడం లేదు. దాంతో, ఆమె వెండితెరకు దూరమైంది. కానీ, ఈ సీనియర్ నటి తరచూ వార్తల్లో నానుతోంది.

Also Read: గొప్పతనంలో మెగాస్టార్.. మె..గా..స్టా..రే ?

ముఖ్యంగా సోషల్‌ మీడియాలో ఆమె ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. అందుకు కారణం కూడా ఆమెనే అనొచ్చు. సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో హుందాగా కనిపించే వాణి సోషల్ మీడియాలో మాత్రం చిట్టిపొట్టి బట్టలు వేసుకొని ప్రేక్షకుల ముందుకొస్తుంది. తన కూతురు సుప్రియతో కలిసి తీసుకున్న ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ట్రావెల్‌ వీడియోలు, డ్యాన్స్‌ వీడియోలోనూ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. కూతురును హీరోయిన్‌ చేసేందుకు ఆమెను తెరపైకి తెస్తోందని అంతా అనుకుంటున్నారు. అదే సమయంలో తల్లి పాత్రలు చేసేందుకు తన వయసేం అయిపోలేదని చెప్పే ప్రయత్నం చేస్తోందట. తన కూతురుకు పోటీగా అన్నట్టు పొట్టి దుస్తులు ధరించి గ్లామర్ ఒలకబోస్తోంది. దాంతో, సోషల్‌ మీడియాలో ఆమెకు ఫాలోవర్లు బాగానే పెరిగారు. అదే ఇప్పుడామెకు చిక్కులు తెచ్చిపెడుతోంది.

Also Read: టాలెంటెడ్ డైరెక్టర్ కి తీవ్ర అవమానం !

సోషల్‌మీడియాలో హాట్‌ హాట్‌ ఫొటోలు చూసి పలువురు ఆమెపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడివి సురేఖకు తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. తన పక్కన ఎవరు ఉన్నా తప్పుగా ప్రచారం జరుగుతోందని ఆమె వాపోతోంది. తన గురించి సోషల్‌ మీడియా, ఇతర మాధ్యమల్లో వస్తున్న పుకార్ల గురించి సురేఖ స్పందించింది. తన పక్కన కనిపించిన ప్రతి ఒక్క వ్యక్తితో తనకు లింక్ పెడుతున్నారని బాధ పడుతోంది. ముఖ్యంగా తన భర్త చనిపోయిన తర్వాత ఇది ఎక్కువైందని ఆమె వాపోతోంది. ‘నా పక్కన ఒక పురుషుడు కనిపిస్తే చాలు కథలు అల్లేస్తున్నారు. నాతో ఉన్నది నా కజినా, సోదరుడా? తండ్రా? అని కనీసం క్రాస్‌ చెక్‌ కూడా చేసుకోవడం లేదు’ అని చెప్పింది. తన పక్కన కనిపించిన ప్రతి మగాడితో సంబంధం అంటగట్టారని అంటోంది. అయితే , ఇలాంటి పుకార్లను తాను పట్టించుకోవడం మానేశానని స్పష్టం చేసింది.

‘కరోనా’తో ఐసీయూలో ఉన్న ప్రియుడిని పెళ్లి చేసుకున్న ప్రియురాలు!

ప్రపంచ దేశాల ప్రజలకు కరోనా వైరస్ ఎన్నో చేదు అనుభవాలను మిగులుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ప్రజలు ఈ వైరస్ బారిన పడి మృతి చెందారు. ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి సోకుతుందో తెలియని ఈ వైరస్ కుటుంబాలకు కుటుంబాలనే చిన్నాభిన్నం చేస్తోంది. అయితే వైరస్ వల్ల పరిస్థితి విషమించిన కొందరు వైరస్ ను జయిస్తామని నమ్మకంతో వైరస్ తో పోరాడుతున్నారు. చాలామందిలానే అమెరికాలోని టెక్సాస్ కు చెందిన కార్లోస్ మునిజ్ అనే వ్యక్తి కూడా పోరాడుతున్నాడు.

ఆ వ్యక్తి ఆస్పత్రిలోనే ఆస్పత్రి యాజమాన్యం, సిబ్బంది మధ్య అతను ప్రేమించిన యువతిని వివాహం చేసుకున్నాడు. యువతిలో నిండు నూరేళ్లు తోడుగా ఉంటానని ఆ వ్యక్తి అభయమిచ్చాడు. పూర్తి వివరాల్లోకి వెళితే కార్లెస్ అనే యువతికి గ్రేస్ అనే వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. అయితే పెళ్లికి కొన్ని రోజుల క్రితం కార్లోస్ కరోనా వైరస్ నిర్ధారణ అయింది. మెథడిస్ట్ ఆస్పత్రిలో చేరిన కార్లోస్ కు ఆరోగ్యం అంతకంతకూ క్షీణించింది.

పరిస్థితి విషమించడంతో అతడిని ఐసీయూలో చేర్పించారు. నెల రోజుల తర్వాత అతడికి కరోనా నెగిటివ్ నిర్ధారణ అయినప్పటికీ పరిస్థితి మాత్రం విషమంగానే ఉంది. అయితే అతని భార్య గ్రేస్ పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టటంతో ఐసీయూలోని బెడ్ నే పెళ్లివేడుకగా మార్చి వివాహం జరిపించారు. స్థానిక వారా సంస్థ కెన్స్ 5 వీళ్ల వివాహ వేడుకను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఒకేసారి ముగ్గురు దర్శకులను లైన్లో పెట్టిన మెగా హీరో

Varun Tej


మెగా కుటుంబం నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన నటుడు వరుణ్ తేజ్‌. పెద్ద బ్యాక్ గ్రౌండ్‌ ఉండడంతో ఓ ప్రతిభావంతుడైన దర్శకుడితో మొదటి సినిమా చేశాడు. కానీ, అక్కడి నుంచి తనదైన శైలిలో కెరీర్ను నిర్మించుకుంటూ వెళ్తున్నాడు వరుణ్. తొలి సినిమా ‘ముకుంద’తోనే నటనతో మెప్పించిన అతను రెండో సినిమా ‘కంచె’తో తనకు మంచి భవిష్యత్‌ ఉందని నిరూపించుకున్నాడు. అక్కడి నుంచి ప్రతి సినిమాకు వైవిధ్యం చూపిస్తూ ముందుకెళ్తున్నాడు. ఈ ఆరేళ్లలో అతను తొమ్మిది సినిమాలు చేస్తే కేవలం ఒక్కటి (మిస్టర్) మాత్రమే డిజాస్టర్ అయింది. కంచె, ఫిదా, ఎఫ్2, గద్దలకొండ గణేష్ సూపర్ హిట్లుగా నిలిచాయి. ముఖ్యంగా గద్దలకొండలో అయితే తన నటనను మరో స్థాయికి తీసుకెళ్లాడు వరుణ్. ఈ విజయం ఇచ్చిన ఊపుతో జోరు పెంచాడు. పలువురు దర్శకులకు కమిట్‌మెంట్‌ ఇచ్చాడు.

Also Read: గొప్పతనంలో మెగాస్టార్.. మె..గా..స్టా..రే ?

ప్రస్తుతం ‘బాక్సర్’ అనే స్పోర్ట్స్‌ డ్రామాలో నటిస్తున్న ఈ మెగా హీరో తర్వాత ఎఫ్‌2 సీక్వెల్‌ ఎఫ్‌3 చేయాల్సి ఉంది. కానీ, కరోనా దెబ్బకు అతను వేసుకున్న ప్రణాళికలు తలకిందులయ్యాయి. ఈ నెలలో ‘బాక్సర్’ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలని అనుకున్నా అది కుదరడం లేదు. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం ఈ సినిమాను అల్లు అరవింద్‌ పెద్ద కొడుకు బాబి నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం కోసం అమెరికాలో బాక్సింగ్‌ మెళకువలు నేర్చుకున్నాడు వరుణ్. మరోవైపు ఎఫ్‌3 కి కూడా అనిల్ రావిపుడి కథ, కథనం సిద్ధం చేసి ఉంచాడు. అలాగే, ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఫేమ్‌ సాగర్ చంద్రతో కూడా ఓ చిత్రానికి వరుణ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. వాస్తవానికి కొన్ని నెలల క్రితమే ఈ ప్రాజెక్ట్‌ ఫిక్స్‌ అయింది. కానీ, బాక్సర్ మొదలవడం, ఎఫ్‌3 లైన్‌లో ఉండడంతో దాన్ని పక్కనపెట్టారని అనుకున్నారు. కానీ, సాగర్ చెప్పిన కథ నచ్చడంతో దాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోకూడదని నాగబాబు కొడుకు ఫిక్సయ్యాడు.

Also Read: లెజెండరీ సింగర్ కరోనాని జయిస్తున్నారు !

బాక్సర్, ఎఫ్‌3 తర్వాత సాగర్ చంద్రతో పని చేయాలని నిర్ణయించుకున్నాడని సమాచారం. మరోవైపు ‘ఆహా’ కోసం ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తున్న సాగర్ చంద్ర దాని తర్వాత ఓ రీమేక్‌కు కూడా దర్శకత్వం వహించాలని అనుకుంటున్నాడట. ఆ లోపు బాక్సర్, ఎఫ్‌3 పూర్తయితే వరుణ్‌ను డైరెక్ట్‌ చేయాని ప్లాన్‌ వేసుకున్నాడు. ఇందుకు వరుణ్‌ కూడా రెడీగా ఉన్నాడని సమాచారం. ఒకవేళ ఏదైనా కారణం వల్ల ఎఫ్‌3 ఆలస్యం అయితే, ముందుగా సాగర్ తో సినిమాను పట్టాలెక్కించాలని మెగా హీరో చూస్తున్నాడట. అవసరం అయితే ఒకే టైమ్‌లో రెండు, మూడు ప్రాజెక్టుల్లో నటించడానికి డేట్స్‌ సిద్ధం చేసుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ముగ్గురు దర్శకులను లైన్‌లో పెట్టిన వరుణ్‌ ..కరోనా తగ్గిన వెంటనే బిజీగా మారబోతున్నాడు. ఒకదాని వెంట మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నాడు.

ప్రపంచాన్ని సర్వ నాశనం చేసి.. పార్టీ చేసుకుంటున్న చైనీయులు!

చైనా నుంచి వ్యాప్తి చెందిన కరోనా వైరస్ ప్రపంచ దేశాల ప్రజలను గజగజా వణికిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు ప్రజల్లో తీవ్ర భయాందోళనను పెంచుతున్నాయి. అయితే ఈ వైరస్ వ్యాప్తికి కారణమైన చైనాలో మాత్రం ప్రజలు మాస్కులు లేకుండా సందడి చేశారు. వుహాన్ లోని మాయా వాటర్ పార్క్ దగ్గర తాజాగా మ్యూజిక్ ఫెస్టివల్ జరిగింది.

ఈ మ్యూజిక్ ఫెస్టివల్ కు వేల సంఖ్యలో సందర్శకులు హాజరయ్యారు. ఐతే ఈ మ్యూజిక్ ఫెస్టివల్ కు హాజరైన వాళ్లు ముఖానికి ఎటువంటి మాస్కులు ధరించకుండా సందడి చేయడం గమనార్హం. ఎటువంటి మాస్కులు ధరించకుండా సందడి చేసి వుహాన్ ప్రజలు అక్కడ పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుందనే సందేశాన్ని ఇచ్చారు. 2019 డిసెంబర్ నెలలో వుహాన్ లోని మార్కెట్ నుంచి కరోనా వైరస్ వ్యాప్తి చెందింది.

దీంతో వుహాన్ నగరంలో 76 రోజుల పాటు లాక్ డౌన్ అమలైంది. లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత సైతం అక్కడ కొన్నింటిపై ఆంక్షలు కొనసాగాయి. తాజాగా అక్కడి వాటర్ పార్కుకు అనుమతి ఇవ్వగా సందర్శకులను ఆకర్షించడానికి టికెట్లపై డిస్కౌంట్లు అమలవుతున్నాయి. మహిళా సందర్శకులకు ఆ ప్రాంతంలో ఏకంగా 50 శాతం డిస్కౌంట్ ను ప్రకటించారు. స్థానిక ప్రభుత్వం పర్యాటక రంగానికి ప్రయోజనం చేకూర్చాలని 400 పర్యాటక ప్రాంతాలకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తోంది.