
ఇటీవలే భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెల్సిందే. క్రికెట్ అభిమానులకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను ధోని అందించాడు. 1983లో కపిల్ దేవ్ నాయకత్వంలో తొలిసారి ఇండియా జట్టు ప్రపంచ కప్ ను ముద్దాడింది. ఆ తర్వాత 28ఏళ్లకు ధోని నాయకత్వంలో మరోసారి భారత్ ప్రపంచకప్ అందుకుంది. ఇక నాయకత్వంలో భారత టీం మూడు ఐసీసీ ట్రోఫీలు (వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ) దక్కుంచుకుంది. మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా ధోని రికార్డు నెలకొల్పాడు.
Also Read: సురేష్ రైనా రిటైర్మెంట్లో ‘లాజిక్’ ఇదేనా?
అనుహ్యంగా స్వాతంత్ర్య దినోత్సవం రోజు సాయంత్రం నుంచి ధోని తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయినట్లు భావించండి అంటూ తన ఇన్ స్ట్రాలో పోస్టు చేసిన సంగతి తెల్సిందే. నాటి నుంచి ధోని రిటైర్మెంట్ పలురకాల గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ధోని రిటైర్మెంట్ వెనుక బలమైన కారణం ఉందని అభిమానులు చర్చించుకుంటున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కారణంగానే ధోని సడెన్ గా రిటైర్మెంట్ ప్రకటించాడనే ప్రచారం జరిగింది. అయితే ఇందులో వాస్తవమెంతో తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ధోని తొలి మ్యాచ్.. చివరి మ్యాచ్ ఒకేలా ముగియడంపై అభిమానులు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.
రాంచికి చెందిన ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎలాంటి అంచనాలు లేకుండానే అడుగు పెట్టాడు. 2004 డిసెంబర్ 23న బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ద్వారా ధోని ఎంట్రీ ఇచ్చాడు. చిట్టగాంగ్‌లో జరిగిన ఈ మ్యాచులో ధోని మొదటి బంతికి రనౌట్ అయి డకౌట్ గా వెనుదిరిగాడు. అయితే ఆ తర్వాతి కాలంలో భారత్ కు అనేక విజయాలు అందించడంలో కీరోల్ పోషించాడు. వికెట్ కీపర్ గా.. బాట్స్ మెన్ గా.. కెప్టెన్ గా ఎన్నో విజయాలను అందించారు. ఇక ధోని చివరగా 2019లో వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌తో ఆడాడు. ఈ మ్యాచులో ధోని రనౌట్ గా వెనుదిరిగాడు. డీప్‌లో ఉన్న మార్టిన్ గఫ్టిల్ విసిరిన థ్రో నేరుగా వికెట్లను తాకడంతో ధోని ఇంచుదూరంలో రనౌట్ అయ్యాడు. దీంతో భారత్ వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.
Also Read: ప్రపంచాన్ని సర్వ నాశనం చేసి.. పార్టీ చేసుకుంటున్న చైనీయులు!
ఈ మ్యాచు తర్వాత ధోని అంతర్జాతీయ క్రికెట్లో ఆడలేదు. తాజాగా ధోని తన రిటైర్మెంట్ ప్రకటించడం వరల్డ్ కప్పులో న్యూజిల్యాండ్ తో ఆడిన మ్యాచే ధోని చివరి మ్యాచ్ గా నిలిచింది. దీంతో ధోని తొలి మ్యాచ్.. చివరి మ్యాచ్ రనౌట్ తో ముగియడం కాకతాళీయమే అయినా క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి ధోని రిటైర్మెంట్ అయినప్పటికీ ఐపీఎల్ ల్లో ఆడే అవకాశం ఉంది. దీంతో ఐపీఎల్ మ్యాచుల కోసం ధోని ఫ్యాన్స్ అత్రుతుగా ఎదురుచూస్తున్నారు.