నిన్న చిత్తూరు జిల్లా కుప్పంలో ముగ్గురు జనసేన అభిమానులు మృతిచెందడంపై హీరో రాంచరణ్ దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతిచెందిన కుటుంబాలకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈమేరకు తన ట్వీటర్లో ఎమోషనల్ ట్వీట్ పోస్టు చేశారు. ‘నిన్న కుప్పంలో జరిగిన దుర్ఘటనలో ముగ్గురు అభిమానులు కాలం చేశారు అనే వార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది.. మీ ఆరోగ్యం, మీ ప్రాణం కంటే ఏది విలువైనది కాదు.. మీరంతా ఇది ఎప్పుడూ గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని నా మవని’ అంటూ ట్వీట్ చేశారు. అభిమానుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
పవన్ జన్మదినాన్ని పురస్కరించుకొని నిన్న కుప్పంలో అభిమానులు ఫెక్సీలు కడుతుండగా విద్యుదాఘాతంతో ముగ్గురు జనసేన అభిమానులు మృతిచెందాడు. ఈ ఘటనలో రాజేంద్ర, సోమశేఖర్, అరుణాచలం అనే యువకులు మృతిచెందడంతో విషాదాచాయలు నెలకొన్నాయి. వీరి ఆదుకునేందుకు ‘వకీల్ సాబ్’ చిత్ర యూనిట్ ఒక్కో కుటుంబానికి రూ.2లక్షల ఆర్థికసాయం ప్రకటించింది.
అదేవిధంగా ఈ సంఘటనలో గాయపడిన వారంతా త్వరగా కోలుకువాలని చిత్రయూనిట్ ఆకాంక్ష వ్యక్తం చేసింది. అభిమానులు వారి జీవితాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా పవన్ పుట్టినరోజును పురస్కరించుకొని ‘వకీల్ సాబ్’ నుంచి ఓ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. అదిరిపోయే రెస్పాన్స్ తో ‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్ ట్రెండింగులోకి దూసుకెళుతోంది.