ఏపీలో మందుబాబుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ప్రజలకు ఇచ్చిన మాట కోసం సీఎం వైఎస్ జగన్ మందుబాబులపై పగబట్టాడు. ఏపీలో మద్యనిషేధం దిశగా మద్యం ధరలను భారీగా పెంచారు. ఈ క్రమంలోనే పక్కరాష్ట్రంలో మద్యం సగం ధరకు చీప్ గా దొరుతుండగా.. ఏపీలో మాత్రం డబుల్ రేట్లు పెట్టి పేదలు, మధ్యతరగతి ప్రజలు ఒళ్లుగుల్ల చేసుకుంటున్నారు. ఏపీలో మద్యం ధరలపై మందుబాబుల్లో తీవ్రమైన వ్యతిరేకత కూడా ఉంది.
ఇక ఈ క్రమంలోనే ఏపీకి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి పొరుగురాష్ట్రాల నుంచి చీప్ మద్యం పోటెత్తుతోంది. దీన్ని స్వయంగా కొందరు నేతలే సరఫరా చేస్తూ దొరికారు. దీంతో ఏపీ పోలీసులు ఇప్పుడు పక్క రాష్ట్రాలనుంచి ఒక్క మద్యం బాటిల్ తెచ్చినా అరెస్ట్ చేసి కేసులు పెడుతున్నారు. దీనిపై బాధితులు హైకోర్టుకు ఎక్కగా మందుబాబులకు గొప్ప ఊరటల లభించింది.
జీవోనెంబర్ 411 ప్రకారం ఏపీలో మద్యాన్ని తీసుకొని వచ్చే వెసులు బాటు ఉంది. అయినప్పటికీ ఏపీ పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఈ క్రమంలోనే బాధితులు ఏపీ హైకోర్టు వ్యాజ్యం వేశారు.దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది.
ఏపీలోని మందుబాబులకు హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. మద్యానికి సంబంధించి దాఖలైన పిటీషన్ లో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం బాటిళ్లు తీసుకొచ్చుకోవడంపై కీలక తీర్పును ఏపీ హైకోర్టు ఇచ్చింది. జీవో నంబర్ 411 ప్రకారం మూడు మద్యం బాటిళ్లు తీసుకొని రావచ్చని స్పష్టం చేసింది. ఈ జీవోను ఏపీ పోలీసులు అమలు చేయాలని సూచించింది.
హైకోర్టు తీర్పు మందుబాబులకు ఊరటనిచ్చింది. దీనిపై తీర్పును రిజర్వు చేసింది. ఇప్పటివరకు దాఖలైన అనేక కేసుల్లో కొన్ని న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు.