
కరోనాలో కూడా చైతు ‘లవ్ స్టోరీ’ మొదలైంది !
ప్రభాస్.. 100కోట్ల రెమ్యూనరేషన్లో నిజమెంత?

యంగ్ రెబల్ స్టార్.. డార్లింగ్ ప్రభాస్ రెమ్యూనరేషన్ పై గత కొంతకాలంగా ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. కరోనా సమయంలోనూ ప్రభాస్ ఓ సినిమా చేసేందుకు రూ.100కోట్లు తీసుకుంటున్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఇందులో నిజమెంత? అని తెలుసుకునేందుకు ప్రతీఒక్కరూ ఆసక్తిని కనబరుస్తున్నారు.
Also Read : శివసేనను ఫుట్ బాల్ ఆడుతున్న కంగనా
దర్శకుడు రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన ‘బాహుబలి’ సిరీసులు ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లు రాబట్టాయి. టాలీవుడ్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ‘బాహుబలి’ గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సినిమాల తర్వాత ప్రభాస్ రేంజ్ ఆకాన్నంటింది. ఇందుకు తగ్గట్టుగానే ప్రభాస్ సైతం వరుసగా ప్యాన్ ఇండియా మూవీలకే కమిట్ అవుతున్నాడు.
‘బాహుబలి’ తర్వాత వచ్చిన ‘సాహో’ కూడా బాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ‘సాహో’లో ప్రభాస్ యాక్షన్ కు బాలీవుడ్ ప్రేక్షకులకు ఫిదా అయ్యారు. దీంతో ప్రభాస్ సినిమాలకు సౌత్ తోపాటు నార్త్ లోనూ మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం ప్రభాస్ హోం బ్యానర్లో ఫ్రెండ్స్ తో కలిసి ‘రాధే శ్యామ్’ చిత్రాన్ని చేస్తున్నాడు. టాలీవుడ్ తోపాటు బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది.
Also Read : కరోనాలో కూడా చైతు ‘లవ్ స్టోరీ’ మొదలైంది !
ఇక ‘రాధేశ్యామ్’ తర్వాత కూడా రెండు భారీ ప్రాజెక్టులకు ప్రభాస్ కమిట్ అయ్యాడు. ప్రతిష్టాత్మకమైన వైజయంతీ బ్యానర్లో ప్రభాస్ నటిస్తున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సైంటిఫిక్ మూవీలో ప్రభాస్ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ నటిస్తోంది. ఈ మూవీ కోసం ప్రభాస్ ఏకంగా 80కోట్ల రెమ్యూనేషన్ తీసుకుంటున్నాడనే టాక్ విన్పిస్తోంది.
దీంతోపాటు ఇటీవలే ‘ఆదిపురుష్’ మూవీ చేసేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు. ‘తానాజీ’ మూవీని తెరకెక్కించిన బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ ‘ఆదిపురుష్’ మూవీని చేస్తున్నాడు.
కేంద్రం షరతుల్లో జగన్ అమలు చేయాల్సింది రెండే

‘ఒక దేశం.. ఒకే రేషన్ కార్డు’ చంద్రబాబు ప్రభుత్వం 2015లోనే అమలు చేసింది. ప్రతి రేషన్ షాపులో ఈ-పోస్ యంత్రాలు పెట్టి దాని ద్వారానే రేషన్ ఇవ్వాలన్నది తాజాగా కేంద్రం ఆదేశం. ఈ-పోస్ యంత్రాల్లో లబ్ధిదారుడు వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. అవి ఆధార్‌తో అనుసంధానమై ఉంటాయి. దీనివల్ల దేశంలో ఏ ప్రాంతం వారైనా ఎక్కడైనా రేషన్ తీసుకోవడం వీలవుతుంది. కరోనా కాలంలో వలస కార్మికుల కష్టాలు చూసి ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేయడం కోసం కేంద్రం ఈ షరతు విధించింది. ఇక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను కూడా చంద్రబాబు ప్రభుత్వం తొలిరోజు నుంచే అమలు చేసింది. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడానికి ఈ విషయంలో అగ్రస్థానంలో ఉండాలని అప్పటి సీఎం చంద్రబాబు తపించారు. ఈ నేపథ్యంలో 2015లో జాతీయ స్థాయిలో రెండో ర్యాంక్ తెచ్చుకొన్న ఏపీ తర్వాత వరుసగా దేశంలో మొదటి ర్యాంక్‌లో నిలబడింది. కేంద్రం తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లోనూ ఏపీ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది.
అదనపు రుణాల కోసం ఇప్పుడు కొత్తగా వైసీపీ ప్రభుత్వం కేంద్రం విధించిన రెండు షరతులను పాటించాల్సి ఉంది. ఒకటి వ్యవసాయ పంపుసెట్లకు నగదు బదిలీ పథకం, పురపాలక సంఘాల్లో సంస్కరణలు. పురపాలికల్లో సంస్కరణలు చేయాలంటే అది ఇప్పట్లో కాని పని. అందుకు చాలానే కసరత్తు జరగాలి. నగదు బదిలీ పథకం తీసుకురావడం ఈజీ. దీంతో ఇప్పుడు జగన్ సర్కార్ దీనిపై దృష్టి సారించింది. తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ స్కీం ద్వారా వ్యవసాయ పంపు సెట్లకు బిగించి.. ట్రాన్స్‌కోలు వారికి బిల్లులు అందిస్తాయి. ఆ బిల్లులకు సంబంధించిన డబ్బును మాత్రం ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నెలనెలా జమ చేస్తూ ఉంటుంది. అంటే.. ఈ స్కీం ద్వారా రైతులపై పెద్దగా భారం పడే పరిస్థితి లేదు.
Also Read : అగ్రిగోల్డ్ కేసు : కొనుగోలుదారులకు గుడ్ న్యూస్
చారు-రాజీవ్ విడిపోవడం లేదని క్లారిటీ వచ్చినట్టేగా?

కొద్దిరోజులుగా బాలీవుడ్ మీడియాలో ఓ సెలబ్రెటీ జంట విడిపోతున్నట్లు వరుస కథనాలు ప్రచారం అవుతున్నాయి. ఈనేపథ్యంలో సదరు బాలీవుడ్ జంట సోషల్ మీడియా మీడియా వేదిక ఒకరిపై ఒకరు ప్రేమను చాటుకోవడం ఆసక్తిని రేపుతోంది. వీరిద్దరు కూడా తమపై వస్తున్న పుకార్లు చెక్ పెట్టేందుకే ఇలా చేశారా? లేదా నిజంగా కలిసిపోయారా? అనేది బీ టౌన్లో చర్చనీయాంశంగా మారింది.
Also Read : కరోనాలో కూడా చైతు ‘లవ్ స్టోరీ’ మొదలైంది !
ఆ ప్రముఖ బాలీవుడ్ జంట ఎవరో కాదు.. హీరోయిన్ చారు అపోస, ప్రముఖ మోడల్ రాజీవ్ సేన్. వీరిద్దరు గతేడాది క్రితం గోవాలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. రాజీవ్ సేన్ మిస్ వరల్డ్, బాలీవుడ్ నటి సుస్మిత సేన్ సోదరుడు. ఇక చారు అపోస రెండు హిందీ సినిమాల్లో నటించడంతోపాటు బుల్లితెరపై నటిస్తోంది. వీరిద్దరి పెళ్లి కొద్దిమంది సన్నిహితుల సమక్షంగా గతేడాది వైభవంగా జరిగింది.
అయితే ఇటీవల వీరిద్దరు విడిపోతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. వీరిద్దరి వైవాహిక జీవితం సాఫీగా జరగడం లేదని బాలీవుడ్లో వర్గాల్లో విన్పించింది. రాజీవ్ సేన్, చారు అపోసలు వారి సోషల్ మీడియాల అకౌంట్స్ నుంచి తాము కలిసి ఉన్న ఫొటోలు డిలీట్ చేయడం.. ఒకరినొకరు అన్ ఫాల్లో చేసుకోవడంతోనే వీరిద్దరు విడిపోతున్నారనే వార్తలకు బలం చేకూరింది.
ఈనేపథ్యంలోనే వారిద్దరు సోషల్ మీడియా వేదికగానే తమపై వచ్చిన పుకార్లు సమాధానం చెప్పారు. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు ప్రేమను చాటుకున్నారు. రాజీవ్ సేన్ ‘కలిసి ఉండటం ఎంతో ఆనందం కలిగిస్తుంది.. నా భార్యను నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను’ అని పోస్టు పెట్టాడు. దీనిపై స్పందించిన చారు అపోస ‘నిన్ను బాగా మిస్ అవుతున్నాను’ అంటూ ఓ రోమాంటిక్ ఫోటోను పోస్టు చేసింది. ఇలా వీరిద్దరు తమపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టారు. దీంతో ప్రస్తుతానికి వారిద్దరు కలిసే ఉన్నారనే క్లారిటీ మాత్రం వచ్చింది.
Also Read : ప్రభాస్.. 100కోట్ల రెమ్యూనరేషన్లో నిజమెంత?
సంచలనం: జాతీయ రాజకీయాల్లో కేసీఆర్?
తెలంగాణను ఏలేస్తున్న కేసీఆర్ ఇప్పుడు దేశాన్ని దున్నేయడానికి రెడీ అవుతున్నారట.. అవును.. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్న పట్టుదలను ప్రదర్శిస్తున్నాడట.. రాష్ట్రాల హక్కులను మోడీ సర్కార్ పూర్తిగా కాలరాస్తోందన్న విమర్శలు దేశంలో ఉన్నాయి. పన్ను సంస్కరణలతో రాష్ట్రాల చేతికి చిప్పను ఇచ్చాయంటారు. జీఎస్టీతో దోచుకొని ఇప్పుడు అప్పులు చేసుకోమంటున్నారు. అన్నింటిని కేంద్రం పరిధిలోకి తీసుకెళుతూ రాష్ట్రాలను బిచ్చగాళ్లను మాదిరి చేస్తున్నాయన్న అపవాదు ఉంది.
Also Read : ఆపరేషన్ ‘అడెళ్లు’..: అందుకేనా అడవుల్లో డీజీపీ మకాం?
అందుకే కాంగ్రెస్ కథ దేశంలో ముగియబోతున్న తరుణంలో బీజేపీ కబళించే రాజకీయాలను ఎదురించాలని కేసీఆర్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కేసీఆర్ కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం.
ఈ క్రమంలోనే కేసీఆర్ ‘నయా భారత్’ పేరుతో జాతీయ పార్టీ పెట్టే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. పేరు ఇప్పటికే ఖరారైందని.. చురుగ్గా రిజిస్టర్ ప్రయత్నాలు సాగుతున్నాయని తెలుస్తోంది.
జాతీయ కాంగ్రెస్, బీజేపీలకు సమదూరంలో ఉన్న పార్టీలను కలుపుకొని జాతీయ స్థాయిలో పార్టీని పెట్టి ప్రాంతీయ పార్టీలను కలుపుకొని దేశంలో బలమైన పార్టీగా అవతరించాలని కలలుగంటున్నట్టు సమాచారం.
నిజానికి 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలోనే కేసీఆర్ ‘థర్డ్ ఫ్రంట్’ పేరుతో ప్రాంతీయపార్టీలను ఏకం చేశారు. కానీ బీజేపీ క్లియర్ కట్ మెజార్టీ సాధించడంతో కేసీఆర్ ఆశలు అడియాసలయ్యాయి. ఈ క్రమంలోనే 2024 ఎన్నికల్లో ఎలాగైనా సరే దేశంలో బలపడాలని కేసీఆర్ యోచిస్తున్నారు.
Also Read : జగన్ బాటలో టీ.కాంగ్రెస్ భారీ ప్లాన్.?
ఇంకా నాలుగేళ్ల సమయం ఉండడంతో జాతీయ రాజకీయాల్లోకి రావడానికి ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీపై ప్రాంతీయ పార్టీలందరిలోనూ అభిప్రాయభేదాలున్నాయి. జీఎస్టీ పరిహారం సహా అన్నింటిలోనూ అన్యాయం చేస్తున్నా కేంద్రాన్ని ఏమీ అనలేని దుస్థితి. మోడీ సర్కార్ దేశంలో బలంగా ఉండడంతో ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ క్రమంలోనే కేసీఆర్ ధైర్యంగా ముందడుగు వేయడానికి రెడీ అవుతున్నారు.
ఇప్పటికే బీజేపీ దేశంలో అమెరికా తరహాలో ‘అధ్యక్ష రాజకీయాలను’ తీసుకురావడానికి రాజ్యాంగ సంస్కరణలు చేయడానికి రెడీ కాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే దేశంలో జాతీయ పార్టీలే మిగులుతాయి. ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లుతుంది. అందుకే కేసీఆర్ కొత్త రాజకీయ పార్టీ పెట్టినట్టు సమాచారం.
ఇక కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే.. రాష్ట్ర పగ్గాలు.. సీఎం పీఠం కేటీఆర్ కు వెళుతుందని అంటున్నారు. మరి కేసీఆర్ తెలంగాణను ఏలినట్టే.. దేశంలోనూ తనదైన ముద్ర వేస్తారా అన్నది వేచిచూడాలి.
-నరేశ్
Also Read : హరీష్ రావు అసెంబ్లీ గైరుహాజరు పై ఊహాగానాలు?
సుశాంత్ మరణానికి ముందు అసలేం జరిగింది?

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యలో మరో విషయం తెలిసింది. ఇప్పటికే ఈ కేసులో డ్రగ్స్ మాఫియా బయటపడింది. ఇప్పుడు తాజాగా సుశాంత్ పెంపుడు కుక్కల పోషణకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఇంట్లో చాలా వరకు క్కుక్కలను పెంచుకుంటుంటారు. అలాగే సుశాంత్‌కు కూడా తన పెంపుడు కుక్కలంటే చాలా ఇష్టమట.
Also Read : శివసేనను ఫుట్ బాల్ ఆడుతున్న కంగనా
ఖాళీ దొరికినప్పుడల్లా లోనావాలాలోని ఫామ్‌హౌస్‌లో ఉన్న పెంపుడు శునకాలు అమర్, అక్బర్, ఆంటోనీలతో ఆడుకునేవాడు. అందుకే.. తను చనిపోయే ముందు కూడా వాటి గురించే ఆలోచించాడంట. వాటికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా వాటి పోషణ కోసం డబ్బును తన సంరక్షుడు రాయీస్‌కు నగదు బదిలీ చేశాడు. ఈ విషయాన్ని తాజా రాయీసే వెల్లడించాడు.
‘జూన్ 14న సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా వార్త విని షాక్‌కు గురయ్యా. సుశాంత్ చాలా మంచి వ్యక్తి. సూసైడ్‌కు ముందు రోజే తన పెంపుడు కుక్కలకు అవసరమయ్యే డబ్బులను నా ఖాతాలో జమ చేశాడు. సుశాంత్ రెగ్యూలర్ ఫామ్‌హౌస్‌కి వచ్చేవాడు. రియా, ఆమె తండ్రి పుట్టిన రోజు వేడుకలను కూడా ఫామ్‌హౌస్‌లోనే జరిపేవారు. జనవరిలో సుశాంత్ పుట్టిన రోజున రియాతో కలిసి ఫామ్‌హౌస్‌కు వచ్చాడు. అతని వెంట అతని మేనేజర్ శామ్యూల్ మిరాండా, శ్రుతి మోదీతోపాటు పలువురు ఫ్రెండ్స్ వచ్చారని’ చెప్పాడు.
ఇదిలా ఉండగా.. మరో ఆసక్తికర విషయం వెల్లడించాడు రాయీసే. గతేడాది అక్టోబర్‌లో ఐరోపా పర్యటనకు వెళ్లిన సుశాంత్ అప్పటి నుంచి అనారోగ్యానికి గురయ్యాడంట. రెండు నెలలు ఫామ్‌హౌస్‌కు దూరంగా ఉన్నాడని రాయీస్ చెప్పారు. అయితే.. సుశాంత్ వాడుతున్న ఫామ్‌హౌస్ అతనికి కాదట. రెంట్‌కి తీసుకున్నాడని, ఏడాది తర్వాత దానిని కొనుగోలు చేసి శాశ్వతంగా అక్కడికి రావాలని అనుకున్నాడట. అక్కడే సేంద్రియ వ్యవసాయం చేయాలని భావించాడట. ఫిబ్రవరిలో చివరిసారి ఫామ్‌హౌస్‌కు వచ్చాడని, తర్వాత రెండుమూడు నెలలు అక్కడే ఉండాలని ప్లాన్ చేశాడని రాయీస్ వివరించాడు.
Also Read : ‘రాం గోపాల్‌వర్మ`కు యూట్యూబ్‌లో షాక్..!
డేంజర్: కరోనాతోపాటే మరో రెండు భీకర వ్యాధులు
జనవరి వరకు మన దేశవాసులకు కరోనా అంటే తెలియదు. ఎక్కడో వూహాన్‌లో పుట్టి ఆయా దేశాలకు విస్తరించిన కరోనా.. మెల్లమెల్లగా ఇండియాలోనూ అడుగుపెట్టింది. 24 గంటల్లో రికార్డు స్థాయిలో ఏకంగా 90,632 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఆదివారం నాటి బులెటిన్ ప్రకారం మొత్తం సంఖ్య 41,13,811కి చేరుకుంది. 1,065 మంది చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 70,626కి చేరింది. ఇప్పటివరకు 31,80,865 మంది కోలుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. రోజురోజుకూ కేసులు సంఖ్య పెరుగుతుండడంతోపాటు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. అయితే.. కరోనాతో బాధపడుతున్న వారికి, కరోనా నుంచి కోలుకున్న వారికి మరో ముప్పు వస్తోందంటున్నారు వైద్య నిపుణులు.
Also Read : కరోనా కల్లోలం.. ఇప్పట్లో వదిలేలా లేదు కదా..!
ప్రస్తుతం కరోనా వచ్చిన వారిలో బ్రీతింగ్ సమస్య ఉన్నవారికి హాస్పిటల్స్‌లో.. నార్మల్‌గా ఉన్న వారికి హోం ఐసోలేషన్‌లోనే ఉంచి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. 14 రోజుల హోం క్వారంటైన్ పెట్టగా.. చాలా మంది కోలుకొని వారం రోజుల్లోనే నార్మల్ స్థితికి చేరుకుంటున్నారు. అప్పటికే లోపల ఏదైనా వ్యాధులతో బాధపడుతున్న వారు మాత్రం కరోనాతో పోరాడలేక తనువు చాలిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వచ్చిన యాంటీబాడీస్ ఇవ్వడం తప్ప పెద్దగా వేరే ట్రీట్‌మెంట్ ఏమీ లేదు.
కరోనా రాకుండా నిత్యం జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి. లాక్‌డౌన్‌లో పరిస్థితులు పాజిటివ్‌గానే ఉన్నా.. అన్‌లాక్ మొదలైన నాటి నుంచి కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ వచ్చింది. దీంతో ప్రభుత్వాలూ చేతులెత్తేశాయి. ఇప్పట్లో ఈ కరోనా ముప్పు తొలిగేలా కూడా లేదు. అయితే.. ఇప్పుడు కరోనాతో బాధపడుతున్న వారికి, కరోనా నుంచి కోలుకున్న వారిలో కొత్త లక్షణాలు కనిపిస్తున్నయని ఢిల్లీ వైద్యుల పరిశోధనలో వెల్లడైంది. రోగులను మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులు కూడా అటాక్ చేస్తున్నాయని చెబుతున్నారు.
కరోనాతో చేరిన వారిలో చాలా మందిలో సీజనల్ వ్యాధుల లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లకు విస్తు పోయే రిజల్ట్స్ తెలిశాయి. ఇటీవల ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఓ వ్యక్తికి డెంగ్యూ పరీక్ష నిర్వహించగా.. పాజిటివ్ అని నిర్ధారణ అయిందంట. మరో యువకుడికి కరోనాతోపాటు మలేరియా కూడా వచ్చినట్లు చెబుతున్నారు. అంటే ఒకే వ్యక్తికి రెండు వేర్వేలు వ్యాధులు సోకడంతో చికిత్స విషయంలో డాక్టర్లు అయోమయంలో పడుతున్నారు. ఇప్పుడు దేనికి ఏ మందు ఇవ్వాలని తెలియక సతమతం అవుతున్నారు. దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు ఢిల్లీ ఎయిమ్స్ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రగ్యాన్ ఆచార్య తెలిపాడు. అయితే.. కరోనా వచ్చిన అందరికీ డెంగ్యూ, మలేరియా వస్తుందని ఖచ్చితంగా కూడా చెప్పలేమని ఓ సీనియర్ డాక్టర్ అన్నాడు.
Also Read : పిల్లల జ్ఞాపకశక్తికి ఆవుపాలు/గేదె పాలు..? ఏవీ మంచివి.?
హరీష్ రావు అసెంబ్లీ గైరుహాజరు పై ఊహాగానాలు?

తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. తెరాస స్థాపించిన దగ్గర్నుంచి హరీష్ రావు లేకుండా అసెంబ్లీ లో తెరాస గళం వినబడలేదు. మొట్టమొదటసారి కారణం ఏదైనా ఇలా జరగటం అందరికీ కొత్తగా వుంది. తెరాస పై ఈగవాల నివ్వకుండా ఇప్పటివరకూ హరీష్ రావు కాపాడుకుంటూ వస్తున్నాడు. బయటికి ఎన్ని వదంతులు వచ్చినా తెరాస కి బలం హరీష్ రావే. మొట్టమొదటిసారి ఆ గళం అసెంబ్లీ లో వినబడకుండా సమావేశాలు జరుగుతున్నాయి. దీనివెనక రాజకీయ ఊహాగానాలు మస్తుగా వినబడుతున్నాయి.
Also Read : జగన్ బాటలో టీ.కాంగ్రెస్ భారీ ప్లాన్.?
తెలంగాణాలో హరీష్ రావు ది ప్రత్యేక స్థానం. తనపేరు తెలియనివారు లేరంటే ఆశ్చర్యపోనక్కరలేదు. వ్యక్తిగతంగా తన నియోజక వర్గం లో ఏ సమస్య వచ్చినా అన్నీ తానై చూసుకుంటాడు. ప్రజలకి అంతగా కనెక్ట్ అయ్యే నాయకులు బహు అరుదు. పత్రికా సమావేశాల్లో గానీ, బహిరంగ సభల్లో గానీ , అసెంబ్లీ లో గానీ ముక్కుసూటిగా అవతలి వాళ్ళకు సూటిగా తగిలేలా మాట్లాడటం లో తనకు తానే సాటి. ప్రత్యేక తెలంగాణా ఉద్యమం లో తన పాత్ర స్పూర్తిదాయకం. కేటిఆర్ రాజకీయాల్లోకి రాకముందు కెసిఆర్ కి కుడి భుజం హరీష్ రావే. కేటిఅర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా చానాళ్ళు తనే నెంబర్ టు. కానీ రాను రానూ పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. ప్రస్తుతం తన పొజిషన్ ఏమిటో తనకే తెలియదు. కేటిఆర్ నంబర్ టు అయిన తర్వాత కెసిఆర్ దగ్గర తన ప్రభ తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం పైకి గుంభనంగా వున్నా లోపల ఏదో జరుగుతుందనే అనుమానం ప్రజల్లో వుంది.
నిజంగా హరీష్ రావు ఆరోగ్య కారణాలతో అసెంబ్లీ కి రాలేకపోయినా జరుగుతున్న పరిణామాల్ని బట్టి రక రకాల ఊహాగానాలు రాజకీయ కారిడార్ల లో షికార్లు చేస్తున్నాయి. హరీష్ రావు తన దారి తను చూసుకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయని , అందుకే అసెంబ్లీకి వచ్చి తెరాస ని కాపాడే పని చేయటానికి ఇష్టపడటం లేదని చెబుతున్నారు. అలాగే బిజెపితో రహస్య మంతనాలు కొలిక్కి వచ్చాయని అందుకే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యి ముందు జరగబోయే పరిణామాలకి ఇబ్బందులు కొని తెచ్చుకోకుండా జాగ్రత్త పడుతున్నాడని కూడా వదంతులు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో నిజమెంతో తెలియదు. ఇటువంటి పుకార్లు అదివరకు కూడా చాలాసార్లు వచ్చినా అవి నిజం కాలేదు. హరీష్ రావు ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చాడు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు దూరంకావటం తో ఈ పుకార్లు మరింత గాలిలో త్వరగా వ్యాపిస్తున్నాయి. ఈ పుకార్లలో నిజమో అబద్దమో చెప్పాల్సింది కాలమే.
Also Read : సంచలనం: జాతీయ రాజకీయాల్లో కేసీఆర్?
బిజెపి-జనసేన మూడో ప్రత్యామ్నాయం కావాలంటే?

ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు మంచి రసకందాయంలో పడ్డాయి. రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకుంటున్న రాజకీయాలు మూడో వర్గం ప్రవేశంతో రంగులు మారుతున్నాయి. ఇంతవరకు వై ఎస్ ఆర్ పి, తెలుగుదేశం మధ్య నే వున్న కొట్లాటలు బిజెపి కి కొత్త అధ్యక్షుడు నియామకం తో మార్పులు చక చకా జరిగిపోతున్నాయి. ఇంతవరకు ఈ కొట్లాటలు రెండు అగ్ర కులాల సంకుల సమరంగానే అనుకున్నారు. సోము వీర్రాజు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడయిన తర్వాత ఇది మూడు కులాల సంకుల సమరంగా మారబోతుంది. ( ఇది ఒక్కటే కారణం కాకపోయినా ఇదికూడా ఓ ప్రధాన కారణంగా ఆంధ్ర రాజకీయాల్లో ఉండబోతుంది). మిగతా కులాలు ఈ మూడు కూటముల్లో ఏ వైపు మొగ్గు చూపుతాయనే దాన్నిబట్టి రాజకీయ మొగ్గు ఆ వైపు ఆధారపడి వుంటుంది. ఇప్పటివరకయితే ఈ సామాజిక సమీకరణలు వైఎస్ ఆర్ పి కే అనుకూలంగా వున్నాయి. అయితే ముందు ముందు ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పలేము. బిజెపి కి ఆర్ ఎస్ ఎస్ అండదండలు అన్నిరకాల సాధన సంపత్తి గల బిజెపి జాతీయ నాయకత్వం అండగా వుండటాన్ని తక్కువగా అంచనా వేయలేము. ఈ విషయాన్ని ముందుగా పసిగట్టింది వామపక్ష మేధావి వర్గం.
Also Read : అగ్రిగోల్డ్ కేసు : కొనుగోలుదారులకు గుడ్ న్యూస్
తెలుగు రాష్ట్రాల్లో వామపక్ష మేధావుల పట్టు
రాజకీయంగా సిపిఎం బలహీనపడినా తెలుగు రాష్ట్రాల్లో మీడియాలో, మేధావి వర్గంలో వాళ్ళ పట్టు ఇప్పటికీ బలంగానే వుంది. సిపిఐ కి అంత కాకపోయినా కొంతమేరకు ఈ వర్గాల్లో పట్టుంది. మీడియాలో ఈ మేధావులు నిరంతరం పార్టీ లైనును ప్రజల్లోకి చొప్పించటానికి ప్రయత్నం చేస్తూనే వుంటారు. ఇందులో అగ్రగణ్యులు ప్రొఫెసర్ నాగేశ్వర్( పూర్వ ఎస్ ఎఫ్ ఐ ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షులు), వీరయ్య ( ప్రస్తుత రాష్ట్ర సిపిఎం కార్యదర్శివర్గ సభ్యులు), తెలకపల్లి రవి ( పూర్వ ప్రజాశక్తి సంపాదకులు), పాపారావు ( ఆర్ధిక విశ్లేషకులు) ఇంకా అనేకమంది వివిధ రంగాల్లో పనిచేస్తున్న నాయకులు ( మీడియాలో ఆయా రంగాల నిపుణులుగా గుర్తించబడినా వాస్తవానికి సిపిఐ, సిపిఎం సభ్యులు). వీరితోపాటు సిపిఐ, సిపిఎం లు రాజకీయంగా రాష్ట్రంలో ఉనికిని కోల్పోయినా ఆ నాయకులకు మీడియా లో విపరీతమైన అవకాశం ఇస్తారు. అంటే తెలుగు రాష్ట్రాల్లో వామపక్ష మేధావుల పట్టు మీడియా లో చాలా బలంగా వేళ్ళూనుకొని వుంది.
ఇది ప్రస్తుతం వాళ్ళు తిరిగి రాష్ట్రంలో పుంజుకోవటానికి వీలు కల్పించకపోయినా తెలుగు రాష్ట్రాల రాజకీయ ఆలోచనల్ని ప్రభావితం చేయటానికి ఉపయోగపడుతుంది. ఇటీవలికాలంలో వాళ్లకు సరైన అంశం లేకపోయింది. తెలంగాణాలో కెసిఆర్ , కాంగ్రెస్ ; ఆంధ్రలో జగన్, చంద్రబాబు నాయుడు కొట్లాటల మధ్యలో వాళ్ళకంటూ ప్రత్యేకంగా కొట్టొచ్చినట్టు ప్రచారం చేసే అంశం లేదు. వాళ్ళ దృష్టిలో ఇవి గ్రూపు రాజకీయాలు, ప్రాంతీయ రాజకీయాలు. అయినా గుర్తింపు పోకుండా ఉండటానికి ఏదో విధంగా మీడియా విశ్లేషణల్లో వుంటూవున్నారు. ఈ సంధికాలంలో కూడా తమ పట్టు పోకుండా కాపాడుకోగల్గుతున్నారు. అందుకు వీరిని అభినందించాలి.
Also Read : కాంగ్రెస్ స్వయంకృతం: జగన్‌ని పిలిస్తే వస్తాడా..?
పార్టీ విధానమే వీళ్ళకు ముఖ్యం
ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఒక్కోసారి వాళ్ళ క్రెడిబిలిటీ దెబ్బతిన్నా పరవాలేదుగానీ వాళ్ళ పార్టీ విధానాలే ముఖ్యంగా పనిచేస్తూ వుంటారు. ఉదాహరణకు ప్రఖ్యాత హిందూ పత్రిక పూర్వ సంపాదకుడు, ప్రస్తుత చైర్మన్ అయిన ఎన్ రామ్ నే తీసుకుందాం. ఆయన సంపాదకుడుగా వున్నప్పుడు యూపీఏ ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది. అది భారత-అమెరికాల మధ్య అణు ఒప్పందం. ఆ ఒప్పందాన్ని స్వాగతిస్తూ ఎన్ రామ్ ఓ పెద్ద సంపాదకీయం రాసాడు. ఆ తర్వాత సిపిఎం ఆ అణు ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి మద్దత్తు వుపసంహరించుకోవటం అందరికీ తెలిసిందే. దానితో ఏ మనసు తో అణు ఒప్పందాన్ని సమర్ధిస్తూ సంపాదకీయం రాసాడో అదే మనసుతో అణు ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఇంకో సంపాదకీయం రాసాడు. అంటే మనసుకి కూడా రెండు పార్శ్వాలు ఉంటాయని అప్పుడే అర్ధమయ్యింది. మనసులో మాట ఎలా వున్నా పార్టీ చెప్పింది కాబట్టి మనసుని చంపుకొని కూడా మాట్లాడవచ్చని అప్పుడే అర్ధమయ్యింది. ఈ తమాషా మొత్తం మేధావి వర్గంలో అప్పటిదాకా ఎన్ రామ్ పై వున్న గౌరవాన్ని ఒక మెట్టు కిందకి దించింది.
ఇదే విధానం మన తెలుగు రాష్ట్రాల మేధావులకు కూడా వర్తిస్తుంది. నిన్నటిదాకా పొగిడిన నోటితోనే అదే వ్యక్తుల్ని తెగడటం కూడా జరగొచ్చు. ఉదాహరణకు ఈ మేధావులందరూ ఇంతకుముందు పవన్ కళ్యాణ్ ని ఆకాశాని కెత్తినవాళ్ళే. ముఖ్యంగా తెలకపల్లి రవి, ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటివాళ్ళు. మరి ఈ రోజో . బిజెపి తో పొత్తుపెట్టుకోవటంతో పవన్ కళ్యాణ్ పై దాడులకు రంగం సిద్దమయ్యింది. ఇప్పటివరకు ఈ మేధావులకు పవన్ కళ్యాణ్ ఓ ఆశా కిరణంగా కనిపించాడు ( వామ పక్షాలతో పొత్తు పెట్టుకున్నప్పుడు). మరి ఇప్పుడో బిజెపి తో పొత్తు కదా. ఈ మేధావులకు ఇప్పటివరకూ సరైన అంశం మీడియా లో చొచ్చుకుపోవటానికి దొరకలేదు. ఇప్పుడు బిజెపి-జనసేన పొత్తుతో ఈ సంఘటన పై రోజుకో ప్రచారం చేయటానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. నిన్ననే తెలకపల్లి రవి మోడీ పై విరుచుకుపడుతూ ఓ పెద్ద పోస్టు సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. ఇప్పటిదాకా మోడీ ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురుచూసేవాళ్ళకు మొన్నటి ‘మన్ కి బాత్’ కి డిజ్ లైక్ లు రావటం, కరోనా కేసులు పెరగటం, జిడిపి ఫలితాలు అనుకున్నదానికన్నా దారుణంగా పడిపోవటం తో పండగగానే వుంది. అర్ధసత్యాలు, అసత్యాలు, కొన్ని సత్యాలు కలగలిపి వండి వార్చటం మొదలుపెట్టారు. దానిలో తప్పేముంది. వాళ్ళ పార్టీ విధానమది. తూచా తప్పకుండా పాటిస్తున్నందుకు అభినందించాలి మరి!
Also Read : నూతన్ నాయుడుపై నాలుగో కేసు.. దిమ్మదిరిగే వాస్తవాలు
బిజెపి-జనసేన పరిస్థితి ఏంటి?
జగన్ పార్టీకి స్వంత చానలు, పత్రిక వున్నాయి. అధికారం లో వున్నాడు కాబట్టి మరికొన్ని మీడియా సంస్థలూ ఎంతో కొంత సానుకూలంగా వుంటారు. అలాగే తెలుగుదేశానికి కావలసినన్ని మీడియా సంస్థల మద్దతుంది. మరి బిజెపి-జనసేన కో? ఆ పరిస్థితి లేదు. అందునా బలంగా మీడియా లో నాటుకుపోయిన వామపక్ష మేధావులకు ప్రధమ శత్రువు బిజెపి కూటమి కాబట్టి మరింత దూకుడుగా ఈ కూటమి పై విమర్శలు ఎక్కుపెట్టటం సహజం. దానిని తట్టుకునే ప్రత్యామ్నాయ ప్రచారం ఈ కూటమికి ఉందా? ఓకే, ఆ కూటమికి ఉందా లేదా అనేదానికన్నా ప్రజలకు మూడు వైపులా వాదనలు తెలిసినప్పుడే ఏది ఉన్నవాటిల్లో బెటరో ( ఉత్తమం ఎటూ వుండదు కాబట్టి) ఎంచుకొనే అవకాశం వుంటుంది. లేకపోతే చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు మీడియా చేసిన నష్టం అంతా ఇంతా కాదు. అదే పునరావృతం కాకుండా ఉండాలంటే ఇప్పటినుంచే మూడో కూటమి మీడియా, మేధావి వర్గం పై దృష్టి సారించాల్సిన అవసరం వుంది. అప్పుడే ప్రజలకు మీడియా సమాచారం సమతుల్యంగా అందుతుంది. ప్రజాస్వామ్యం లో ఇది చాలా అవసరం. దురదృష్టవశాత్తూ ఏ ఒక్కరూ నిష్పక్షపాతంగా వార్తలు, విశ్లేషణలు ఇచ్చే రోజులు కావివి. ఎవరికి వారు తమ అనుకూలవాదనలనే నిజమని భ్రమింపచేసే కాలమిది. అందుకే ప్రజలు మూడు రాజకీయ పక్షాల వాదనలు విని అందులో నిజాన్ని వెలికి తీసుకోవాల్సి వుంది. ప్రజలకు ఆ అవకాశం కల్పించటం కోసం బిజెపి-జనసేన కూటమి ఆంధ్రలో తమ ప్రచార వ్యవస్థ ని తయారుచేసుకుంటుందని ఆశిద్దాం.
Also Read : హైకోర్టు మీ ఇష్టం అనేసినా… జగన్ మాకొద్దు అన్నాడు
పిల్లల జ్ఞాపకశక్తికి ఆవుపాలు/గేదె పాలు..? ఏవీ మంచివి.?

శివసేనను ఫుట్ బాల్ ఆడుతున్న కంగనా

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తాజాగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవల కాలంలో కంగనా రనౌత్ పలు సంచలన విషయాల్లో స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. గతంలో మహారాష్ట్రలో హిందూ సాధువులను దారుణంగా కొట్టి చంపిన విషయంలో, ఇటీవల సుశాంత్ ఆత్మహత్య కేసు విషయంలోనూ కంగనా రనౌత్ తనదైన శైలిలో స్పందించింది. బాలీవుడ్ ఇండస్ట్రీపై, మహారాష్ట్ర సర్కారుపై, ముంబై పోలీసుల తీరును తప్పుబడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
Also Read: సంచలన విషయాలు : సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడా..?
దీంతో శివసేన నేతలు కంగనాను టార్గెట్ చేస్తూ మాటలయుద్ధానికి దిగారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కంగనాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కంగనా ఒక ‘హరంఖోడ్ లడ్కీ’ అని సంబోధించాడు. దీనిపై తాజాగా కంగనా ట్వీటర్లో ఒక వీడియోను విడుదల చేసింది. ఇందులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పై తీవ్రస్థాయిలో మండిపడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తనను ‘హరంఖోర్’ అనడం సంజయ్ రౌత్ మనస్తత్వానికి నిదర్శమని చెప్పింది. సంజయ్ రౌత్ లాంటి చెడు మనస్తత్వం ఉన్నవారి వల్లేయ దేశంలో నిత్యం అమ్మాయిలు అత్యాచారానికి గురవుతున్నారన్నారు. ఇలాంటి వ్యక్తుల వల్ల సమాజంలో ఆడవారికి గౌరవం లేకుండా పోతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. తనపై అసభ్యంగా మాట్లాడిని సంజయ్ రౌత్‌ను దేశంలోని ఆడబిడ్డలు క్షమించారని చెప్పుకొచ్చింది. గతంలో అమీర్ ఖాన్.. నసీరుద్దిన్ షాలు ఈ దేశంలో ఉండాలంటే భయం వేస్తుందని చెప్పినపుడు సంజయ్ వారికి హరంఖోర్ అని ఎందుకు అనలేదని ప్రశ్నించింది.
Also Read: ‘బిగ్ బాస్ సీజన్ 4’ కంటెస్టెంట్స్ వీళ్ళే !
ఇక తానెప్పుడూ కూడా మహారాష్ట్రపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదని చెప్పింది. హిందూ సాధువులను దారుణంగా కొట్టి చంపుతున్నా ముంబై పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడాన్నే తప్పుబట్టినట్లు చెప్పారు. అదేవిధంగా బాలీవుడ్ నటుడు సుశాంత్ కేసు విషయంలో ముంబై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించినందు వల్లే వారికి మార్యద ఇవ్వలేదని స్పష్టం చేశారు.
ఇక తాను ముంబై వస్తే కొట్టి చంపుతామంటూ కొందరు బెదిరిస్తున్నారని.. ముంబై ఏమీ సంజయ్ రౌత్ కాదని తేల్చిచెప్పింది. తాను ఈనెల 9న ముంబైకి వస్తున్నానని.. ఎవరూ తనను ఆపుతారో తేల్చుకుందామంటూ సవాల్ విసిరింది. దీంతో ఆరోజు ఏం జరుగుతుందోననే టెన్షన్ నెలకొంది. ప్రస్తుతం కంగనా రనౌత్ ట్వీటర్లో పోస్టు చేసిన వీడియో వైరల్ అవుతోంది.
అగ్రిగోల్డ్ కేసు : కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

ఒకటి కాదు రెండు.. జనాల్ని నమ్మించి మోసం చేసి వేలకోట్లు తన్నుకుపోయిన గద్దలు అగ్రిగోల్డ్ యజమానులు.. అప్పనంగా వేలకోట్లు సేకరించి, వాటిని తిరిగి చెల్లించకుండా ఎగవేశారు. దీనిపై బాధితులు రోడ్డెక్కడం వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం స్పందించి అగ్రిగోల్డ్ యజమానులను అరెస్ట్ చేసి జైలు పాలు చేసింది. అయినా కూడా ఈ వ్యవహారం రెండు రాష్ట్రాలు ఉదాసీనంగా వ్యవహరించాయి.. బాధితుల డబ్బుల రికవరీలో నిర్లప్తతగా వ్యవహరించడం చూస్తుంటే ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఈ కుంభకోణంలో ఉన్నట్టే కనిపిస్తోంది..
Also Read: కాంగ్రెస్ స్వయంకృతం: జగన్‌ని పిలిస్తే వస్తాడా..?
తాజాగా అగ్రిగోల్డ్ కుంభకోణంకి ముందు కొనుగోలు చేసిన ప్లాట్లకు అద్దెను జమచేయాలని కోరుతూ సీఐడీ నోటీసులు ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ఫార్చూన్ హేలాపురి అపార్ట్ మెంట్ ఓనర్స్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. సీఐడీ నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఈ పిటీషన్ వేశారు. ఈ వ్యాజ్యాలను విచారించిన ధర్మాసనం ఈ ఏడాది జూన్ లో జారీ చేసిన నోటీసులను రద్దు చేసింది.
ఏపీలో అగ్రిగోల్డ్ చాలా మంది ప్రజల వద్ద డిపాజిట్లు సేకించి ఉడాయించింది. అగ్రిగోల్డ్ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో విచారణ సాగుతోంది.
Also Read: నూతన్ నాయుడుపై నాలుగో కేసు.. దిమ్మదిరిగే వాస్తవాలు
అగ్రిగోల్డ్ ఆస్తుల వ్యవహారంతో ముడిపెడుతూ ఆ కంపెనీ నుంచి గతంలో ఆస్తులు కొనుగోలు చేసిన పలువురికి అద్దె చెల్లించాలంటూ సీఐడీ ఇచ్చిన నోటీసులను ఉన్న హైకోర్టు రద్దు చేసింది. ఈ తరహా తాఖీదుల జారీ చట్ట విరుద్ధమని పేర్కొంది.
ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆస్తిని జప్తు చేయడమంటే దానిని ఇతరులకు విక్రయించకుండా తాకట్టుపెట్టకుండా నిలువరించడానికే గానీ వాటిపై అద్దె వసూలు చేయడానికి కాదని పేర్కొంది.
కాంగ్రెస్ స్వయంకృతం: జగన్‌ని పిలిస్తే వస్తాడా..?

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి జై కొట్టిన కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు ‘రెంటికి చెడ్డ రేవడిలా’ తయారైంది. తెలంగాణలో పార్టీ రోజురోజుకూ దిగజారిపోతుండగా.. ఏపీలో మాత్రం ఎప్పుడో పాడె కట్టిన పరిస్థితి ఉంది. అటు కేంద్రంలోనూ బీజేపీకి ఏ మాత్రం పోటీ ఇవ్వలేక డీలా పడింది. రెండుసార్లు అధికారాన్ని కోల్పోయి ఇప్పుడు అయోమయంలో పడింది. ఇంకా చెప్పాలంటే అంతటి జాతీయ పార్టీలో ఇప్పుడు కుమ్ములాటలు మొదలయ్యాయి. అధ్యక్షుడి విషయంలో అంతర్గతపోరు నడుస్తూనే ఉంది. ఇటీవల పలువురు సీనియర్లు సోనియా మీద అసంతృప్తి అస్త్రం సంధించారు. తెలంగాణ రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌లో వర్గపోరు అంతాఇంతా కాదు. ఇక ఇవన్నీ ఇలా ఉంటే.. ఇప్పుడు జాతీయ కాంగ్రెస్ దృష్టి ప్రాంతీయ పార్టీల మీద పడిందంట. సోనియాగాంధీకి కొత్త మిత్రుడు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఈ మంచి సలహా ఇచ్చాడంట. జగన్, మమతా బెనర్జీ వంటి వారిని కాంగ్రెస్ వైపుగా ఆకర్షించాలన్నది ఈ విలువైన సూచన. ఆ సలహా వినడానికి బాగానే ఉన్నా ఆచరణలో అసలు సాధ్యమయ్యేలా లేదు. దేశంలో కాంగ్రెస్ నుంచి విడిపోయి ప్రాంతీయ పార్టీలు పెట్టుకున్న నేతలను కాంగ్రెస్ మళ్లీ దగ్గరకు తీయాలంటే ఎవరు ముందుకు వస్తారు.
Also Read: నూతన్ నాయుడుపై నాలుగో కేసు.. దిమ్మదిరిగే వాస్తవాలు
కాంగ్రెస్ జాతీయ పార్టీ.. అందులోనూ ఏపీ సీఎం జగన్‌కి తల్లిలాంటి పార్టీ అనడంలో అతిశయోక్తి లేదు. ఏపీలోని కీలకనాయకులందరికీ దాదాపు ఇంకా కాంగ్రెస్‌తో సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. కేసీఆర్, చంద్రబాబు, జగన్ రాజకీయ మొదలైంది కూడా కాంగ్రెస్ నుంచే. కేసీఆర్, చంద్రబాబుకు ఏమో కానీ.. జగన్‌కు కాంగ్రెస్‌కు ఉన్న అటాచ్‌మెంట్ గురించి చెప్పనక్కర్లేదు. ఆయన తండ్రి వైఎస్సార్ మూడున్నర దశాబ్దాలపాటు కాంగ్రెస్‌లోనే ఉన్నారు. రెండు సార్లు పీసీసీ చీఫ్‌గా.. రెండు సార్లు సీఎంగా గెలుపొందారు.
వైఎస్సార్ మరణానంతరం జాతీయ కాంగ్రెస్… జగన్‌ని ఎంతటి స్థాయిలో ముప్పుతిప్పలు పెట్టిందో తెలిసిందే. ఏడాదికి పైగా జైల్లోనూ పెట్టి ప్రజలకు, ఫ్యామిలీకి దూరం చేసింది. సీబీఐ ఎంక్వైరీ చేసినా ఇంతవరకు అందులో పెద్దగా తప్పులు దొరకలేదు. సోనియా గాంధీ చెప్పుడు మాటలు వినే యువనేత జగన్‌ని దూరం చేసుకున్నాడు. జైలు నుంచి బయటికి వచ్చాక కాంగ్రెస్‌లో ఉండలేక జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు. అప్పటి నుంచి ఆ పార్టీతో అంటిముట్టనట్లుగానే ఉంటున్నాడు. పైగా ఇప్పుడు బీజేపీ దోస్తానా చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ట్రెండ్ అవుతున్న విషయం. ఇదంతా చూస్తే కాంగ్రెస్ చేజేతులా చేసుకున్న పాపమే జగన్ దూరం చేసుకోవడం అని అనుకోవాలి.
ఫస్ట్ టైం అధికారం రాకున్నా.. నిత్యం ప్రజల్లోనే ఉండి అధికారం కోసం పోరాడారు వైఎస్ జగన్. ఎట్టకేలకు 2019 ఎన్నికల్లో తాను కోరుకున్న సీఎం కుర్చీ సంపాదించారు. ఇక ఇప్పుడు జగన్ ఎదురులేని స్థితిలో ఉన్నారు. కానీ కాంగ్రెస్ పరిస్థితిలో మాత్రం అప్పటికి ఇప్పటికీ ఏ మాత్రం మార్పులేదు. తండ్రి అంత స్థాయిలో ఉండి ప్రజలకు సేవ చేయబట్టే జగన్‌కు కూడా జనంలో ఆ పేరు వచ్చింది. ఆ పెట్టుబడే జగన్ రాజకీయ జీవితానికి ఇంధనం అయింది.
Also Read: హైకోర్టు మీ ఇష్టం అనేసినా… జగన్ మాకొద్దు అన్నాడు
ఇప్పుడున్న రాజకీయాల్లో కాంగ్రెస్‌కు జగన్ అవసరం ఉండొచ్చు కానీ.. జగన్‌కు కాంగ్రెస్ అవసరం ఇసుమంతైనా లేదు. నిజం చెప్పాలంటే నాలుగున్నరేళ్లపాటు యూపీఏ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడే జగన్ రాజీపడలేదు, ఇక ఫ్యూచర్‌లో ఎప్పుడు అధికారంలోకి వస్తుందో.. అసలు వస్తుందో రాదో కూడా తెలియని కాంగ్రెస్‌తో ఇప్పుడు ఎలా జతకడుతాడు..? తన అవమానాలు భరించి మరీ సోనియమ్మ, రాహుల్ గాంధీ భజన ఎందుకు చేస్తాడు..? ఇప్పుడు కాంగ్రెస్‌లో సోనియా, రాహుల్ శకం దాదాపుగా ముగిసేలా ఉంది. రేపటి రోజున దేశంలో బీజేపీకి పోటీగా ప్రాంతీయ పార్టీలు సమాఖ్యగా ముందుకు వస్తే జగన్ మరింత ఎత్తున జాతీయ రాజకీయాల్లో నిలుస్తారు. అందువల్ల జగన్ కాంగ్రెస్ పిలిచినా అ వైపుగా వెళ్లరు, చూడరు అనేది కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాల్సిందే.
సుశాంత్ ను ప్రేమించడమే రియా నేరమా? అరెస్ట్ కు సిద్ధం?
అటు తిరిగి.. ఇటు తిరిగి చివరకు బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి మెడకే చుట్టుకునేలా ఉంది. ఎప్పుడైతే సుశాంత్ కేసులో డ్రగ్స్ మూలాలు బయటపడ్డాయో అప్పుడే రియా మూలాలు కూడా కదిలిపోయేలా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రియా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసినట్టు ఆమె తరుఫు లాయర్ తెలిపారు.
Also Read: సంచలన విషయాలు : సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడా..?
‘సుశాంత్ ను ప్రేమించడం నేరమైతే.. ఆ ప్రేమ కోసం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి రియా సిద్ధంగా ఉన్నానని తెలిపిందని ఆమె లాయర్ తెలిపారు. అందుకే అరెస్ట్ అయ్యే చాన్స్ ఉన్నా ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించలేదని భావోద్వేగానికి గురైంది. రియా నిర్ధోషి కావడం వల్లే బీహార్ పోలీసులు , సీబీఐ, ఈడీ,ఎన్.సీ.బీ కేసుల్లో ఒక్కదానికి కూడా ముందస్తు బెయిల్ తీసుకోలేదని లాయర్ వివరించారు.
తాజాగా ముంబైలోని రియా ఇంటికి చేరుకొని పోలీసులు విచారణ జరిపారు. అనంతరం ఎన్.సీ.బీ కార్యాలయానికి రావాల్సిందిగా ఆదేశించారు..ముంబై పోలీసుల రక్షణ నడుమ రియా బయలు దేరారు. ఏ క్షణమైనా రియా అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
కాగా ఇప్పటికే రియా సోదరుడు షోవిక్ అరెస్ట్ అయ్యారు. రియానే తనను డ్రగ్స్ తీసుకురమ్మన్నట్లుగా అతడు పోలీసుల ముందు నిజం ఒప్పుకున్నాడు. దీంతో రియా అరెస్ట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read: ‘బిగ్ బాస్ సీజన్ 4’ కంటెస్టెంట్స్ వీళ్ళే !
బాలీవుడ్ నటుడు సుశాంత్ మృతి కేసు ఇప్పుడు కీలక మలుపు తీసుకుంటోంది. ఈ కేసులో అందరూ అనుమానిస్తున్నట్టే అతడి ప్రియురాలు రియా చుట్టే ఉచ్చు బిగుసుకుంటుంది. డ్రగ్స్ వ్యవహారమే సుశాంత్ మృతికి కారణంగా తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు రియాను ఆదివారం విచారించి అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది.
బాగా నిద్రపోవడమే కరోనాకు మందు

దేశాన్ని కరోనా ఆవహించింది. ఏకంగా ప్రపంచంలోనే కరోనా కేసుల్లో ఆదివారంతో భారతదేశంలో రెండో స్థానంలో నిలిచింది. బ్రెజిల్ దేశాన్ని వెనక్కి నెట్టి ముందుకు దూసుకుపోయింది. ఆదివారం ఒక్కరోజే ఏకంగా దేశంలో 90వేలకు పైగా కేసులు నమోదు కావడం కలకలం రేపింది. ఈ క్రమంలోనే ఈ కేసులకు అంతలేదా? ఏం జరగబోతోందనే ఆందోళన అందరిలోనూ పట్టిపీడిస్తోంది. ప్రస్తుతానికి కరోనాకు మందు కనిపెట్టలేదు.. వ్యాక్సిన్ ఇప్పట్లో వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.. దాని నుంచి తప్పించుకోవడం ఎలానో తెలియక అందరూ నానా యాతన పడుతున్నారు. ప్రస్తుతం రోగనిరోధక శక్తిని పెంచుకోవడమే మన ముందున్న కర్తవ్యం.
Also Read : పిల్లల జ్ఞాపకశక్తికి ఆవుపాలు/గేదె పాలు..? ఏవీ మంచివి.?
కరోనాను స్వీయ నియంత్రణ చేసుకోవడమే ఇప్పుడు మనముందున్న ప్రథమ కర్తవ్యం. మూతికి మాస్క్, చేతులకు శానిటైజర్ లేదా గ్లోవ్స్ తో పాటు హ్యాండ్ వాష్ లు, సబ్బులతో చేతులు కడుక్కోవడమే ఇప్పుడు మనముందున్న మార్గం. ఇక వ్యాక్సిన్, మందులు లేకపోవడంతో రోగనిరోధక శక్తిని పెంచుకోవడమే ఇప్పుడు సరైన మార్గంగా ఉంది.
ఇక ఇమ్యూనిటీని పెంచుకునేందుకు నిద్ర కూడా ఒక సరైన ఆయుధమని శాస్త్రవేత్తలు, వైద్యులు చెబుతున్నారు. సరిగ్గా నిద్రపోకపోతే శరీరంలో తెల్లరక్తకణాల ఉత్పత్తి తగ్గిపోతుందట.. శరీరంలో వైరస్ బారిన పడిన కణాల్ని చంపేవి ఈ కణాలే. కాబట్టి నిద్ర తక్కువ అయ్యే కొద్దీ ఒంట్లో ఒంట్లో వైరస్ రిస్క్ పెరిగే చాన్స్ ఉందని అంటున్నారు వైద్యులు. కాబట్టి కరోనా సోకిన కూడా నిద్ర పోవడం అనేది ఇందులో కీలకమైన సాధనంగా తెలుస్తోంది. అందుకే రోజుకు 8 గంటలు నిద్రపోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఎంత ఎక్కువగా నిద్రపోతే అంత మంచిదని చెబుతున్నారు.ఇక నిద్రపట్టడం లేదంటే ఉదయాన్నే కాసేపు ఎండలో ఉండాలని సూచిస్తున్నారు. అలా అయితే రోజంతా చలాకీగా ఉంటారు. రాత్రిపూట బాగా నిద్ర పడుతుంది. మధ్యాహ్నం అస్సలు నిద్రపోకూడదు. ఎందుకంటే రాత్రి నిద్రపట్టదు. రాత్రి నిద్రే మనిషి ఆరోగ్యానికి మంచిది. కాఫీ, టీలు తాగడం తగ్గించాలి. రాత్రి భోజనంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. నిద్రపోయే ముందు పాలు, మజ్జిగ తాగితే నిద్ర పడుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీంతో కరోనా దరిచేరవద్దంటే ఎంత ఎక్కువ సేపు పడుకుంటే అంత మేలన్నమాట..
Also Read : డేంజర్: కరోనాతోపాటే మరో రెండు భీకర వ్యాధులు
జగన్ బాటలో టీ.కాంగ్రెస్ భారీ ప్లాన్.?

వరుసగా రెండు సార్లు టీఆర్ఎస్ చేతిలో చావుదెబ్బ తిన్నప్పటికీ తెలంగాణలో ఇప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉంది. టీఆర్ఎస్ కూడా ఆ పార్టీనే గుర్తిస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ లో ఎంతో మంది బలమైన నేతలున్నారు. బీజేపీలో పెద్ద నేతలు ఎవరూ లేరు. దీంతో టీఆర్ఎస్ కు ప్రత్యామ్మాయంగా తెలంగాణలో అందరూ కాంగ్రెస్ ను మాత్రమే చూస్తారు.
Also Read: గుడ్‌న్యూస్..: ప్రజలకు ఇక ఎమ్మార్వో, వీఆర్‌వోల వేధింపులుండవ్..
తెలంగాణలో బీజేపీ తాము బాగా పుంజుకుంటున్నామని చెప్పుకుంటున్నప్పటికీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆ పార్టీకి రెండంకెల అసెంబ్లీ సీట్లు రావడం కష్టమేనంటున్నారు. కరోనా లాక్ డౌన్ లో ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించలేక విఫలమైన నరేంద్రమోడీపై దేశంలో పెరుగుతున్న వ్యతిరేకతతో తెలంగాణలో ఆ పార్టీకి కష్టమేనన్న వాదన వినిపిస్తోంది. హిందుత్వ, ముస్లిం వ్యతిరేకత తప్ప బీజేపీకి మరో ఆప్షన్ లేదు. అది తెలంగాణలో పనిచేసే చాన్స్ లేదు. తెలంగాణలో అభివృద్ధి ఎజెండానే పనిచేస్తుంది.
తెలంగాణలో ఇప్పటికీ కాంగ్రెస్ కు గణనీయమైన ఓటుబ్యాంకు, నేతలు, కార్యకర్తల బలం ఉంది. ఏపీలో వైఎస్ఆర్ ఉన్నప్పటి మూలాలు ఇప్పటికీ ఉన్నాయి. కానీ వైఎస్ఆర్ లాంటి నేత తెలంగాణలో లేకపోవడం కాంగ్రెస్ కు మైనస్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సీఎం క్యాండిడేట్ ను చూపించాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ పై పోరాడే నేతకు పగ్గాలు అప్పగించాలి.
ఈ క్రమంలోనే వచ్చేసారికి ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి రావాలని యోచిస్తున్న కాంగ్రెస్ పార్టీ జగన్ బాటలో నడవబోతోందట.. జగన్ గెలుపునకు కృషి చేసిన ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తను నియమించుకోవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది.
Also Read: అదే ‘వి’ సినిమా కొంప ముంచిందా?
ఎన్నికలకు ముందు టికెట్ల జారీ, లాబీయింగ్, నేతలను లాగడం.. వివిధ విభాగాల పర్యవేక్షణ కోసం.. సోషల్ మీడియా ప్రచారం సహా.. ఎన్నికల్లో సరైన అభ్యర్థులను గుర్తించే పనిని కాంగ్రెస్ ఈ వ్యూహకర్తకు అప్పగించాలని యోచిస్తోంది. ప్రశాంత్ కిషోర్ ను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహకర్త కోసం వెతుకుతున్నట్టు తెలుస్తోంది.


