కరోనాతో దేశ ఆర్థిక వ్యవస్థ నెలనెలా పడిపోతూనే ఉంది. ఇక రాష్ట్రాల పరిస్థితి అయితే చెప్పలేకుండా ఉంది. ఇప్పుడు రాష్ట్రాలన్నీ కేంద్రం మీద ఆధారపడాల్సి వచ్చింది. ఇందుకు ఎఫ్ఆర్‌బీఎం చట్టం ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రాష్ట్రం తెచ్చుకునే అప్పులు 3 శాతం మించి ఉండరాదు. ఇది మించితే కేంద్ర సాయంలో కోత విధిస్తారు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు దెబ్బతినడంతో ఈ పరిమితిన 5 శాతానికి పెంచాలని అన్ని రాష్ట్రాలూ కేంద్రాన్ని కోరుతున్నాయి. ఇందుకు కేంద్రం కూడా […]
కరోనాతో దేశ ఆర్థిక వ్యవస్థ నెలనెలా పడిపోతూనే ఉంది. ఇక రాష్ట్రాల పరిస్థితి అయితే చెప్పలేకుండా ఉంది. ఇప్పుడు రాష్ట్రాలన్నీ కేంద్రం మీద ఆధారపడాల్సి వచ్చింది. ఇందుకు ఎఫ్ఆర్‌బీఎం చట్టం ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రాష్ట్రం తెచ్చుకునే అప్పులు 3 శాతం మించి ఉండరాదు. ఇది మించితే కేంద్ర సాయంలో కోత విధిస్తారు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు దెబ్బతినడంతో ఈ పరిమితిన 5 శాతానికి పెంచాలని అన్ని రాష్ట్రాలూ కేంద్రాన్ని కోరుతున్నాయి. ఇందుకు కేంద్రం కూడా ఒప్పుకుంది. కానీ.. ఇందుకు షరతులు వర్తిస్తాయి అంది. నాలుగు షరతులు పెట్టగా.. ఒక్కో దానికి 0.25% చొప్పున పెంచుతామంది.
వీటిలో ప్రధానంగా ‘ఒక దేశం.. ఒకే రేషన్ కార్డు’ విధానానికి అనుగుణంగా ప్రజా వ్యవస్థను సంస్కరించాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా పారిశ్రామిక అనుకూల సంస్కరణలు తేవాలి. వ్యవసాయ పంపుసెట్లకు నగదు బదిలీ విధానం అమలు చేయాలి. పురపాలక సంస్కరణలు తేవాలంటూ కేంద్రం మెలిక పెట్టింది. అయితే.. అదనపు అప్పులు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి కేంద్రం నిర్ణయంలో సగం వరకు ఊరట కలిగించింది. ఎందుకంటే.. గతంలోని టీడీపీ సర్కార్ తీసుకున్న అప్పటి నిర్ణయాలు ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కలిసొస్తున్నాయి. షరతులు లేని సమయంలోనే వీటిలోని రెండింటిని చంద్రబాబు అమలు చేశారు.
‘ఒక దేశం.. ఒకే రేషన్ కార్డు’ చంద్రబాబు ప్రభుత్వం 2015లోనే అమలు చేసింది. ప్రతి రేషన్ షాపులో ఈ-పోస్ యంత్రాలు పెట్టి దాని ద్వారానే రేషన్ ఇవ్వాలన్నది తాజాగా కేంద్రం ఆదేశం. ఈ-పోస్ యంత్రాల్లో లబ్ధిదారుడు వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. అవి ఆధార్‌తో అనుసంధానమై ఉంటాయి. దీనివల్ల దేశంలో ఏ ప్రాంతం వారైనా ఎక్కడైనా రేషన్ తీసుకోవడం వీలవుతుంది. కరోనా కాలంలో వలస కార్మికుల కష్టాలు చూసి ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేయడం కోసం కేంద్రం ఈ షరతు విధించింది. ఇక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను కూడా చంద్రబాబు ప్రభుత్వం తొలిరోజు నుంచే అమలు చేసింది. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడానికి ఈ విషయంలో అగ్రస్థానంలో ఉండాలని అప్పటి సీఎం చంద్రబాబు తపించారు. ఈ నేపథ్యంలో 2015లో జాతీయ స్థాయిలో రెండో ర్యాంక్ తెచ్చుకొన్న ఏపీ తర్వాత వరుసగా దేశంలో మొదటి ర్యాంక్‌లో నిలబడింది. కేంద్రం తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లోనూ ఏపీ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది.
అదనపు రుణాల కోసం ఇప్పుడు కొత్తగా వైసీపీ ప్రభుత్వం కేంద్రం విధించిన రెండు షరతులను పాటించాల్సి ఉంది. ఒకటి వ్యవసాయ పంపుసెట్లకు నగదు బదిలీ పథకం, పురపాలక సంఘాల్లో సంస్కరణలు. పురపాలికల్లో సంస్కరణలు చేయాలంటే అది ఇప్పట్లో కాని పని. అందుకు చాలానే కసరత్తు జరగాలి. నగదు బదిలీ పథకం తీసుకురావడం ఈజీ. దీంతో ఇప్పుడు జగన్ సర్కార్ దీనిపై దృష్టి సారించింది. తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ స్కీం ద్వారా వ్యవసాయ పంపు సెట్లకు బిగించి.. ట్రాన్స్‌కోలు వారికి బిల్లులు అందిస్తాయి. ఆ బిల్లులకు సంబంధించిన డబ్బును మాత్రం ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నెలనెలా జమ చేస్తూ ఉంటుంది. అంటే.. ఈ స్కీం ద్వారా రైతులపై పెద్దగా భారం పడే పరిస్థితి లేదు.
Also Read : అగ్రిగోల్డ్ కేసు : కొనుగోలుదారులకు గుడ్ న్యూస్