Home Blog Page 8324

మందులతో మగపిల్లలు పుడుతారా..?

0
Baby born boysభారతదేశంలో ఆడపిల్లల సంఖ్య తగ్గుతూ.. మగపిల్లల సంఖ్య పెరిగిపోతోందని తాజాగా కేంద్రం చేసిన సర్వేలో తేలింది. 2030 వరకు దేశంలో ఆడపిల్లల జనాభా భారీగా పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఖచ్చితంగా ఆడపిల్లలకు డిమాండ్ పెరిగి కన్యాశుల్యం వస్తుందని.. మగవారికి పెళ్లికాని ఉపద్రవం ముంచుకొస్తుందని తాజాగా చేసిన సర్వేలో తేలింది.

సైన్స్ ఆవిష్కరణలు పెరిగే  కడుపులో ఉన్నది ఏ బిడ్డ ఇట్టే తెలిసిపోతోంది.  కానీ  ఇప్పుడున్న శాస్త్ర సాంకేతిక ఎంత పెరిగినా కేవలం గర్భంలో మగబిడ్డనే పుట్టించాలనే పరిశోధన మాత్రం ముందుకు సాగడం లేదు..

అయితే తాజాగా మగబిడ్డ పుట్టాలంటే కొన్ని మందులు వాడాలంటూ కొందరు ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఈ మందులు వాడితే మగపిల్లలు పుడుతారని నమ్మిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆ మందుల కోసం ఇప్పుడు మగ సంతానం లేని వారు లక్షలు ఖర్చు చేస్తున్నారట..

తాజాగా ఈ విషయంపై వైద్యులు, నిపుణులు స్పందించారు. మందులతో ఆడ, మగ బిడ్డను డిసైడ్ చేయలేమని స్పష్టం చేస్తున్నారు. గర్భం దాల్చడం వరకే మన చేతుల్లో ఉంటుందని.. ఆడబిడ్డ, మగబిడ్డ అనేది తేల్చడం ఎవరి చేతుల్లో ఉండదని స్పష్టం చేస్తున్నారు..

సైన్స్ ప్రకారం.. గర్భం దాల్చగానే మహిళల అండంలో ఉండే ‘ఎక్స్’, ‘ఎక్స్’ క్రోమోజోములు, పురుషుల వీర్యంలో ఉండే ‘ఎక్స్’, ‘వై’ క్రోమోజోముల కలయిక జరుగుతుంది. మహిళ ఎక్స్, పురుషుడి వై కలిస్తే మగ బిడ్డ, మహిళ ఎక్స్, పురుషుడి ఎక్స్ కలిస్తే ఆడబిడ్డ పుడుతుంది. దీన్ని ప్రభావితం చేయడం మన వైద్యశాస్త్రం చేతుల్లో కూడా లేదు. అదృష్టంపైనే ఆధారపడుతుంది.

అయితే పురుషులకు వై క్రోమోజోములు పెంచే మందులు ఉన్నాయని కొంత మంది ప్రచారం మొదలు పెట్టారు. దీనికోసం ఇప్పుడు భారీగా ఖర్చు చేస్తున్నారు. మనిషిలోని క్రోమోజోములను పెంచే మందులు ఏవీ లేవని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతీ మనిషి కణంలోనూ ఎక్స్, వై క్రోమో జోములు ఉంటాయని చెబుతున్నారు.వాటిని పెంచడం సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు.

కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా జాగ్రత్తలివీ..

0

kidney stones
మన శరీరంలో గుండె తర్వాత అత్యంత ప్రధానమైనవి కిడ్నీలు. కిడ్నీ(మూత్ర పిండాలు) తమ విధులను సక్రమంగా నిర్వహించక పోతే, ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొ నాల్సి వస్తుంది. శరీరంలో అధికంగా ఉన్న నీటిని, లవణాలను, ఇతర రసాయనాలను మూత్ర పిండాలు మూత్రం రూపంలో వెలుపలికి తీసుకువెళతాయి. శరీరానికి అవసరమైన నీరు, లవణాలు, ఇతర పదార్థాలు మూత్రం ద్వారా శరీరం కోల్పోకుండా ఇవి కాపాడుతాయి. శరీరానికి సంబంధించినంత వరకూ మూత్ర పిండాలను మాస్టర్‌ కెమిస్టులని పేర్కొనవచ్చు. మూత్రపిండాలు నిర్వహించే బాధ్యతలు ఈ కింది విధంగా ఉన్నాయి.

శరీరంలో ద్రవాలను సరైన స్థాయిలో ఉంచడం, శరీరంలోని రసాయనాల సమ తుల్యతను కాపాడటం, వ్యర్థ పదార్థాలను శరీరం నుంచి తొలగించడం, వివిధ రకాల హార్మోన్లను విడుదల చేయడం. శరీరంలోని ద్రవాలు శరీరంలోని ద్రవాలను తొలగించడం లేదా నిలువరించడం మూత్రపిండాలు చేసే విధులలో ప్రధానమైనవి. ఒక వ్యక్తి ఆహారంలో అధిక మొత్తంలో ఉప్పు తీసుకుంటే, ఎక్కువగా దాహం వేసి నీరు ఎక్కువగా తాగుతాడు. అటువంటి సమయాలలో మూత్రపిండాలు అధికంగా ఉన్న ఉప్పును, నీటిని శరీరంనుంచి మూత్రం రూపంలో తొలగిస్తాయి. ఒకవేళ మూత్రపిండాలు సక్రమంగా పని చేయని పక్షంలో ఉప్పు, నీరు శరీరంలో నిలువ ఉండిపోయి, కాళ్లు, చేతులు, ముఖం ఉబ్బుతాయి.

ఎక్కువ మందిలో కనిపించే సమస్య కిడ్నీలో స్టోన్స్‌. తీసుకునే ఆహారం, శరీరతత్వం వంటివి స్టోన్స్‌ ఏర్పడటానికి కారణమ వుతున్నాయి. మూత్రపిండాల్లో రాళ్ళు గట్టిగా క్రిస్టల్‌ రూపంలో ఉంటాయి. ఇవి మూత్రపిండాల్లో గానీ, మూత్రనాళాల్లో గానీ ఏర్పడ తాయి. కిడ్నీలో రాళ్ళు ఏర్పడినట్లయితే నెఫ్రోలిథియాసిస్‌ అని, మూత్రనాళాల్లో ఉంటే యూరోలిథియాసిస్‌ అని అంటారు. కిడ్నీలో రాళ్ళు ఎవరిలోనైనా ఏర్పడవచ్చు. అయితే స్ర్తీలలో కంటే పురుషుల్లో ఎక్కువగా ఏర్పడతాయి. 20 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సున్న వారి లో ఈ సమస్య కనిపిస్తుంది. 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సున్నప్పుడు కిడ్నీ స్టోన్స్‌ ఏర్పడితే భవిష్యత్తులో మళ్లీ మళ్లీ రావ డానికి అవకాశాలుంటాయి. ఒకటి కంటే ఎక్కువ స్టోన్స్‌ ఏర్పడినప్పు డు కూడా సమస్య పునరావృతమయ్యే అవకాశం ఉంటుంది.

* కాబట్టి కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. అవి…
1.మంచి నీళ్ళను ధారాళంగా తాగాలి. దీనివల్ల మూత్రం పల్చబడుతుంది. ఎక్కువ నీరు తాగడం వల్ల సాల్ట్స్, ఖనిజ లవణాలు కాన్సెంట్రేట్ కాకుండా ఉండి కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా ఉంటాయి. రోజూ సుమారున రెండు మూడు లీటర్లు నీరు తాగడం మంచిది. వేసవి కాలంలో ఇంకా ఎక్కువ తాగాలి.
2.కిడ్నీలో ఏర్పడే రాళ్ళలో 92 శాతం కాల్షియం మూలంగానూ, కాల్షియం ఉత్పత్తుల మూలంగానూ ఏర్పడుతుంటాయి. కాబట్టి కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి అవకాశం ఉన్న వాళ్ళు కాల్షీయం ఉత్పత్తుల్ని పూర్తిగా మానేయకూడదు. గాని తగు మోతాదులో మితంగా మాత్రమే తీసుకోవాలి. ఈ విషయంలో డాక్టర్ సలహాను తీసుకోవడం మంచిది కాల్షియం అధికంగా ఉండే పధార్థాలు – పాలు, వెన్నలాంటి డైరీ ఫుడ్స్ తీసుకోవాలి.
3. కొన్ని రకాల యాంటాసిడ్స్ కాల్షియం అధికంగా ఉంటుంది. మీరు కిడ్నీలో కాల్షియం స్టోన్స్ ఉండి, మీరు యాంటాసిడ్ టాబ్లెట్లను వాడుతుంటే ఆ టాబ్లెట్ లు కాకుండా చూసుకోండి. డాక్టరు సలహా మేర మరో బ్రాండ్ యాంటాసిడ్స్ని వాడండి.
4. కిడ్నీ స్టోన్స్ ఏ రకమైనవి ఉన్నాగాని విటమిన్ ‘‘ ఎ ” అధికంగా కల ఆహారాన్ని తీసుకొంటే అది యూరినరీ ట్రాక్ లైనింగ్ లో కలుగచేసే మార్పులవల్ల మరిన్ని రాళ్ళు ఏర్పడకుండా ఉపకరిస్తుంది. అయితే విటమిన్ ఎ కల మందులను మాత్రం తీసుకోవద్దు.
5. శారీరకంగా పనీ చేయకుండా ఉండే వాళ్ళ రక్త ప్రవాహంలో కాల్షియం పేరుకునే ప్రమాదం వుంది. అదే ఏదో ఒక పనిలో పాల్గొంటూ శారీరకంగా చురుకుగా వుంటే రక్తంలోని కాల్షియం ఎముకలలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి రోజూ వ్యాయామంలో పాల్గొనడం మంచిది.
6.మనం ఆహారంలో తీసుకునే మాంసకృత్తుల (ప్రోటీన్స్) పరిమాణానికి కిడ్నీ స్టోన్ ఏర్పడటానికి దగ్గర సంబంధం ఉంది. ప్రొటీన్లు మూత్రంలో యూరిక్ యాసిడ్నీ, కాల్షియంనీ, ఫాస్పరస్నీ పెంచుతుంది. దానివల్ల కొందరిలో కిడ్నీ రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంది.
7. విటమిన్ సి కాల్షియం స్టోన్స్ – ముఖ్యంగా యూరిక్ యాసిడ్, ఉంటే మాంసాహారం ద్వారా మీరు తీసుకునే ప్రొటీన్ పరిమాణాన్ని తగ్గించండి.
8. విటమిన్ సి కాల్షియం ఆక్సాలేట్ స్టోన్ ని పెంకుతుంది. విటమిన్ ‘డి’ శరీర భాగాలన్నింటిలోనూ కాల్సియంని పెంచుతుంది. కాబట్టి కిడ్నీ పేషేంట్లు ఈ రెండు మిటమిన్లనూ డాక్టరు సలహా మేర పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.
9. మూత్రం పోస్తున్నప్పుడు దానినుంచి రాయి పడితే ఆ రాయిని సేకరించి భద్రంగా దాన్ని డాక్టర్లకు చూపించితే వారు దానిని లాబొరేటరికి పంపించి విశ్లేషింపచేసి అలాంటివి ముందు ముందు ఇంకా ఏర్పడకుండా తగు వైద్యాన్ని సూచించుతారు.
10. ఈ ప్రొటీన్లు తక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవడం ద్వారా యూరిక్ యాసిడ్ రాళ్లు ఏర్పడకుండా నియంత్రించవచ్చు. రాళ్లను నిర్లక్ష్యం చేస్తే, వాటి పరిమాణం పెద్దదై మూత్ర విసర్జన పెద్ద సమస్యగా మారుతుంది. మూత్ర నాళం సన్నగా మారడం, ఇన్‌ఫెక్షన్లు రావడం, ఒక్కోసారి క్యాన్సర్ వ్యాధికి కూడా ఇది దారితీయవచ్చు.

‘బిగ్ బాస్ 4’  కంటెస్టెంట్ల కన్నీటి గాథలు ! 

Tearful tales of 'Bigg Boss 4' contestants!
‘బిగ్ బాస్ 4’  బుల్లి స్క్రీన్ ను ఉరూతలు ఊగించడానికి నిన్న మొదలైపోయింది.  అయితే కంటెస్టెంట్ ల్లో కొంతమంది కష్టాలు వుంటుంటే షాకింగ్ గా అనిపిస్తోంది.  చలాకీ యాంకర్‌గా కనిపించే లాస్య  కొన్ని అసక్తికరమైన విషయాలు చెప్పింది. లక్ష్మీ ప్రసన్న ప్రియాంక లాస్య రెడ్డి అనే తానూ ఇంజనీరింగ్ అయిన తర్వాత ఏదో సాధించాలనే కోరికతో ఇండస్ట్రీకి వచ్చి చాల కష్టాలు పడి అనుకున్నది సాధించిందట. ఇక తన ప్రేమ పెళ్లి గురించి చెబుతూ తమది వింత లవ్ స్టోరీ అని మొదటగా తామిద్దరం రిజిష్టర్డ్ మ్యారేజ్ చేసుకున్నామని.. ఆ సమయంలో తన భర్తకు జాబ్ లేదని.. ఒక్క షో చేస్తే రోజుకు మూడు వందలు వచ్చేవని.. అవి రెంటుకు కూడా సరిపోయేవి కాదనిఆ సమయంలో  తానూ పదిరోజులు పస్తులు  కూడా ఉన్నానని  తన కన్నీటి గాధ చెప్పింది లాస్య.  అన్నట్టు ఈ బ్యూటీ  తన జీవితంలో మళ్లీ రెండో పెళ్లి చేసుకుంది.. అది ఎవర్నో కాదు, వాళ్ళ  ఆయన్నే.   అందరి సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకోడం ఎంతో సంతోషంగా ఉందని  అంటూ లాస్య  బిగ్ బాస్ హౌస్‌ లోకి ఎంట్రీ ఇచ్చింది.
 
ఇక తెలంగాణ యాస, భాషతో ఫేమస్ అయిపోయిన గంగవ్వ  కూడా బిగ్‌ బాస్ హౌస్ లోకి వచ్చింది.  గయ్యాలిదానిలో, చాదస్తపు అవ్వగానో ఫేమస్ అయిన  గంగవ్వ జీవితంలోని కన్నీటి గాథ  గురించి  బిగ్‌బాస్ వేదికగా పంచుకుంది గంగవ్వ.  తనకు ఐదేండ్లప్పుడు పెళ్లైందని.. ఆ తరువాత తన భర్త  చనిపోయాడని.. అప్పుడు తనను ఎవ్వరూ దగ్గరకు తీసుకోలేదని.. ఆ రోజుల్లో తనకు  తినడానికి తిండి కూడా ఉండేది కాదని అందర్నీ ఏడిపించేసింది.  అలాగే తనకు రూ.8 లక్షల అప్పు ఉండేదని.. మూడేళ్లు కష్టపడి తీర్చానని తన బాధ అంతా చెప్పి  తెలుగు ప్రేక్షకులను  కూడా ఏడిపించేసింది గంగవ్వ.
 
ఇక మరో కంటెస్టెంట్  దేత్తడి హారిక.  ఫ్రస్టేటెడ్ స్టూడెంట్, మదర్, ఇంటి ఓనర్ ఇలా రకరకాల క్యారెక్టర్లు చేసి  గుక్క తిప్పుకోకుండా తెలంగాణ యాసలో మాట్లాడేసి ఫేమస్ అయిపొయింది ఈ చిన్నది. అన్నట్టు ఈ బ్యూటీకి పెద్దగా కష్టాలు లేవుగాని.. తనకు చిన్నప్పటి నుంచి బిగ్‌బాస్ షో అంటే ఫాంటసీ అట. ఒక్కసారైనా బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లాలనే కోరిక ఉండేదట. లక్కీగా తనకు ఈ సారి ఛాన్స్  వచ్చిందని పాప బాగా ఎగ్జైట్ అవుతుంది.  ఒకవేళ ఎవరైనా హౌస్‌ లో నీకు ప్రపోజ్ చేస్తే ఏం చేస్తావ్? అని హారికను  నాగ్ అడగడంతో అర్ధం అవుతుంది.  ఈ సారి లవ్ ట్రాక్  ఈ పాప ఎకౌంట్ లోనే ఉండబోతున్నాయి అని.

ఎంఎస్ ధోని మరో సంచలన నిర్ణయం

0

dhoneకరోనా కల్లోలం ఈసారి ఐపీఎల్ కు ఏదీ కలిసిరావడం లేదు. దేశం దాటి యూఏఈలో ఈసారి ఐపీఎల్ నిర్వహిస్తున్నారు. అయితే అందరికంటే ఎక్కువగా చెన్నై టీంలో 13మంది కరోనా బారినపడడంతో ఆ జట్టు కుదేలైంది.

కరోనా కారణంగా చెన్నై టీం ఆటగాళ్లు ఎక్కువ రోజులు క్వారంటైన్ లో ఉన్నారు. సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా పోయింది. కీలక ఆటగాళ్లు రైనా, హర్భజన్ వైదొలిగారు. దీంతో తొలి మ్యాచ్ సెప్టెంబర్ 19న ముంబై, చెన్నై మధ్య జరగాల్సి ఉంది. కానీ చెన్నై టీంకు సరైన విశ్రాంతి , ప్రాక్టీస్ కోసం సెప్టెంబర్ 23కు వారి తొలి మ్యాచ్ మార్చాలని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ నిర్ణయించారట.. వీటి స్థానంలో కోల్ కతా, బెంగళూరును ఆడించాలని ప్లాన్ చేశారట..

కానీ చెన్నై కెప్టెన్ ధోని మాత్రం అనూహ్య నిర్ణయం తీసుకున్నారట.. మొదటి మ్యాచ్ లో డిఫెడింగ్ చాంపియన్ చెన్నై ఆడుతుందని స్పష్టం చేశాట.. ధోని తమ మ్యాచ్ వాయిదాకే ఒప్పుకోలేదని తెలిపింది.

కరోనా వచ్చినా సరే రిస్క్ తీసుకునేందుకే ఎంఎస్ ధోని డిసైడ్ అవ్వడం.. అతడి పట్టుదలకు నిదర్శనమని అంటున్నారు. రైనా, భజ్జీ లేకున్నా ధోని పట్టుదల అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

బిగ్ బాస్-4లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వనున్న కమెడీయన్లు?

Biggboss wildcard entryబుల్లితెర ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ షో ఆదివారం ప్రారంభిమైంది. తెలుగు రియల్టీ షోలలో ఇప్పటివరకు బిగ్ బాస్ నెంబర్ వన్ కొనసాగుతుంది. ఇప్పటికే బిగ్ బాస్-1.. బిగ్ బాస్-2.. బిగ్ బాస్-3 సీజన్లు మంచి ప్రేక్షకాదరణ పొందాయి. టీఆర్పీ రేటులో దూసుకుపోయి అటూ నిర్వహాకులను.. ఇటూ ప్రేక్షకులను అలరించింది.

వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఒకేచోట చేర్చి ప్రేక్షకులకు బిగ్ బాస్ వినోదం పంచుతోంది. బిగ్ బాస్ ఇచ్చే టాస్కులతో ఇకపై షోలో నవ్వులు, ఏడుపులు, వినోదం వంటి ఎన్నో ఎమోషన్స్ ప్రారంభం కాబోతున్నాయి. త్వరలోనే బిగ్ బాస్ టాస్కులు మొదలు కానుండటంతో ప్రస్తుతం ఉన్న 16మంది కంటెస్టుల్లో ఎవరు ఎలిమేనేట్ అవుతారు? ఎవరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారనే చర్చ ఆసక్తికరంగా సాగుతోంది.

ప్రస్తుత బిగ్ బాస్-4లోని కంటెస్టులంతా ఎవరికీవారు తమ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నవారే. ఇక కింగ్ నాగార్జున హోస్టింగ్ ప్రత్యేకంగా కన్పిస్తోంది. గతంలో కంటే భిన్నంగా నాగార్జున డబుల్ యాక్షన్లో అదరగొడుతున్నారు. బిగ్ బాస్ కంటెస్టులను ఆటపట్టిస్తూ సరదాగా షోను కొనసాగిస్తున్నాయి. ఈ వినోదాన్ని మరింత పెంచేలా బిగ్ బాస్-4లో టాలీవుడ్ కు చెందిన పలువురు కామెడీయన్లు షోలోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తారనే టాక్ విన్పిస్తోంది.

వీరిలో ప్రధానంగా జబరస్త్ కామెడీయన్ ముక్కు అవినాష్ పేరు విన్పిస్తుంది. మెయిన్ ఎంట్రీలోనే అవినాష్ పేరు విన్పించినా చివరివరకు నిలువలేకపోయింది. దీంతో అవినాష్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తాడనే టాక్ విన్పిస్తోంది. అదేవిధంగా ఈరోజుల్లో ఫేమ్ కామెడియన్ సాయికుమార్ పేరు కూడా విన్పిస్తుంది. సాయికుమార్ ఈరోజుల్లో, బస్ స్టాఫ్ సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. వీరిద్దరు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు బిగ్ బాస్-4లో తొలి ఎలిమినేషన్ ను ఎవరు ఎదుర్కొంటారనేది ఉత్కంఠగా మారింది.

బ్రేకింగ్ : తెలంగాణలో  రేపటి నుంచి రిజిస్ట్రేషన్లు బంద్

Land Rigistrationతెలంగాణలో రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని చూస్తున్న కేసీఆర్ సర్కార్ ఈ రోజు ఉదయమే వీఆర్వో వ్యవస్థను ఎత్తేసింది. వారిని అన్ని కలెక్టర్లకు తమ దగ్గరున్న రికార్డులు అప్పగించాలని ఆదేశించింది. అదో పెద్ద సంచలనంగా మారింది. ఇది మరువక ముందే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Also Read : కేసీఆర్ సంచలనం.. వీఆర్వో వ్యవస్థ రద్దు

కొత్త రెవెన్యూ చట్టం రానున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే మరో సంచలన నిర్ణయం తీసుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి అన్ని రకాల రిజిస్ట్రేషన్లు బంద్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కాసేపటి క్రితమే ఉత్తర్వులు ఇచ్చింది.

రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసి రిజిస్ట్రేషన్ల శాఖలో భారీ మార్పులు చేయడానికి కేసీఆర్ నడుం బిగించినట్టు సమాచారం. తెలంగాణలో రెవెన్యూశాఖలో అంతులేని అవినీతి బయటపడుతున్న సంగతి తెలిసిందే. వీఆర్వోలు, ఎమ్మార్వోల నుంచి కలెక్టర్ల దాకా లింకులు బయటపడుతున్నాయి. దీంతో కొత్త రెవెన్యూ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.

రిజిస్ట్రేషన్లలో ఎమ్మార్వో అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించనుంది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను ఎమ్మార్వోలకు అప్పగించే ఆలోచనలో కేసీఆర్ సర్కార్ ఉంది. గృహ, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లను సబ్ రిజిస్ట్రార్ లకు అప్పగిస్తారని తెలుస్తోంది. తెలంగాణలో 141 సబ్ రిజిస్టార్ ఆఫీసులున్నాయి. కొన్ని చోట్ల పెంచుకొని.. గ్రామీణ ప్రాంతాల్లో 20  వరకు ఆఫీసులను తగ్గించే ఆలోచనలో ఉంది.

Also Read : దుబ్బాక టీఆర్‌‌ఎస్‌ అభ్యర్థి అతడేనా?

డ్రగ్స్: టాలీవుడ్ మూలాలు వెలుగులోకి..

Drugs in tollywoodసుశాంత్‌ సింగ్‌ కేసులో ‘అనుబంధంగా’ వెలుగులోకి వచ్చిన డ్రగ్స్‌ కేసు ఇప్పుడు టాలీవుడ్ చిత్ర పరిశ్రమను షేక్ చేస్తున్నట్టు సమాచారం.  నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు ఓ నైజీరియన్‌ను  అరెస్టు చేశారు. సినీరంగానికి చెందిన వారితో ఇతడు శని, ఆదివారాల్లో రాత్రి 9 నుంచి తెల్లవారుజాము 3 వరకు మంచి బిజినెస్‌ చేస్తుంటారని అధికారులు చెప్తున్నారు. వాట్సాప్‌ కాల్స్‌పై వచ్చే ఆర్డర్స్‌ ఆధారంగా పరిచయస్తులకు మాత్రమే విక్రయిస్తుంటారు. నగరంలోని పబ్స్‌తో పాటు శివార్లలోని ఫామ్‌హౌస్‌లు, రిసార్టుల్లో జరిగే రేవ్‌ పార్టీల్లో వీటి వినియోగం ఎక్కువ.

ఈ డ్రగ్స్‌ వినియోగ, విక్రయ జాడ్యం ఇప్పుడు టాలీవుడ్‌నూ పట్టిపీడిస్తోంది. హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేసిన ఉగాండా జాతీయులు ప్రాట్రిక్, ఐబేర్‌లు… టాస్క్‌ఫోర్స్‌కు చిక్కిన నైజీరియా జాతీయుడు ఒకాచోలు కొకైన్‌ స్మగ్లింగ్‌లో ఆరితేరారు. వీరి కస్టమర్లలో 80 శాతం సినీ రంగానికి చెందిన వారేనని సమాచారం. డ్రగ్స్‌ వినియోగం టాలీవుడ్‌కు బాలీవుడ్‌ నుంచే పాకింది. బాలీవుడ్‌లో 1970ల్లోనే ఈ డ్రగ్స్‌ వాడకం వెలుగు చూసింది. అప్పటి నటీమణులు పర్వీన్‌ బాబీ, ప్రోతిమా బేడీ ఈ విషయాన్ని అంగీకరించారు కూడా. సంజయ్‌దత్‌ సైతం ఈ వ్యవహారంలో వివాదాస్పదుడిగా ఉన్నాడు. ఫర్దీన్‌ ఖాన్‌ కొకైన్‌ను కలిగి ఉండి 2001లో ముంబై నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరోకు చిక్కాడు. అప్పుడు పట్టుబడిన డ్రగ్‌ డీలర్‌‌ కరీమ్‌షేక్‌ అనేక మంది స్టార్ల పేర్లు బయటపెట్టాడు. నటుడు విజయ్‌రాజ్‌ డ్రగ్స్‌ తరలిస్తూ అబుధాబి పోలీసులకు చిక్కాడు.

ప్రముఖ నటుడు రవితేజ సోదరులైన బి.రఘుబాబు, భరత్‌రాజ్‌ను వెస్ట్‌జోన్‌ స్పెషల్‌ పార్టీ పోలీసులు గతంలో ఓసారి పట్టుకున్నారు. వారిని విచారించగా చాలా మంది సినీ తారల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఆ సమయంలో టాలీవుడ్‌కు చెందిన డైరెక్టర్లు, లేడీ యాక్టర్స్‌, క్యారెక్టర్‌‌ ఆర్టిస్టులను విచారించారు. కొద్ది రోజులు హడావిడి చేసిన పోలీసులు తర్వాత కేసును పక్కన పడేశారు.

ఈ డ్రగ్స్ ఉత్పత్తులు కొన్ని చెట్ల నుంచి ఉత్పత్తి అవుతాయి. కొన్ని  ఉత్పత్తులు ప్రధానంగా హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి సరఫరా అవుతున్నాయి. అక్కడ పండే గంజాయితో పాటు చెరస్, హషీష్‌ ఆయిల్‌కు సినీ రంగంలో మంచి డిమాండ్‌ ఉందని పోలీసులు చెప్తున్నారు. ఇక ఓపియం సహా దాని ఉత్పత్తులైన బ్రౌన్‌ షుగర్, హెరాయిన్‌ల చలామణి తక్కువ. ముంబై, బెంగళూరు, గోవా, ఢిల్లీ, చండీగడ్‌ల్లో డ్రగ్స్‌ సరఫరాకు సంబంధించి ప్రధాన డీలర్లు ఉంటున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న వీరి నెట్‌వర్క్‌లో నైజీరియన్లదే కీలకపాత్ర.

చైనా గ్రేట్‌.. : పునర్వియోగ వ్యోమ నౌక సక్సెస్‌

chinaచైనా యాప్స్‌ని బ్యాన్‌ చేసిన మనం.. చైనా వస్తువులను ఇంకా బ్యాన్‌ చేయలేకపోతున్నాం. ఎలక్ర్టానిక్స్‌ విషయంలో చైనాకు తిరుగులేదనే చెప్పాలి. కంప్యూటర్స్‌.. మొబైల్స్‌.. ఏ రంగంలోనైనా కాపీ చేస్తూ సక్సెస్‌ అయిన చైనా.. ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల్లో కీలక విజయం సాధించింది. రెండురోజుల క్రితం చైనా ప్రయోగించిన పునర్వినియోగ అంతరిక్ష నౌక సక్సెస్‌గా ల్యాండ్‌ అయింది. ఆగ్నేయ చైనాలోని జిక్వాన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి శుక్రవారం లాంగ్‌ మార్చ్‌-2ఎఫ్‌ రాకెట్‌తో ఈ వ్యోమ నౌకను ప్రయోగించగా.. రెండు రోజుల పాటు నిర్దేశిత కక్ష్యలో పరిభ్రమించిన ఈ నౌక తిరిగి భూమిపైకి చేరింది.

తక్కువ ఖర్చుతో శాంతియుత ప్రయోజనాల కోసం ఈ వ్యోమనౌక ప్రయోగం ముఖ్య ఉద్దేశమట. అయితే, దీనికి సంబంధించిన ఎలాంటి ఫొటో కానీ.. వివరాలను కానీ చైనా బహిర్గతం చేయలేదు. అమెరికా గతంలో ప్రయోగించిన మానవరహిత పునర్వినియోగ వ్యోమనౌక ఎక్స్‌-37బీ తరహాలోనే ఇదీ ఉంటుందని అధికారులు చెప్పినట్లు కేవలం మీడియా తెలిపింది. ఇప్పటివరకూ ఎక్స్‌-37బీ నాలుగు మిషన్లలో పాలుపంచుకుంది. ప్రపంచ దేశాలు ఆధారపడుతున్న అమెరికా దిక్సూచి వ్యవస్థ గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టం(జీపీఎస్‌)కు పోటీగా తయారు చేస్తున్న బీడో నావిగేషన్‌ సిస్టం ప్రాజెక్టును చైనా ఇప్పటికే పూర్తి చేసింది. ప్రాజెక్టు పూర్తి వినియోగంలోకి రావడానికి అవసరమైన 35 ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరాయి.

మూడేళ్ల కిందట చైనా అధికారికి మీడియా జున్హూ ఓ కథనం ప్రచురిస్తూ.. ఈ ఏడాది పునర్వినియోగ వ్యోమనౌకను చైనా ప్రయోగించనుందని తెలిపింది. అంతేకాదు, ఇది సంప్రదాయ వ్యోమనౌకలకు భిన్నంగా ఉంటుందని, యుద్ధ విమానం మాదిరిగా అంతరిక్షంలోకి దూసుకెళ్తుందని వివరించింది. ఎక్స్-37బీ ఆరో మిషన్ ప్రారంభించిన తరువాత మే చివరి నుంచి కక్ష్యలో ఉందని ఎయిర్ ఫోర్స్ ఫ్యాక్ట్‌షీట్ తెలిపింది. మానవరహిత వ్యోమనౌకను భూకక్ష్యకు తక్కువ ఎత్తులో ప్రయోగించేలా రూపొందించారు. ఇది దీర్ఘకాలిక అంతరిక్ష సాంకేతిక ప్రయోగం, పరీక్షలకు ఉపయోగపడుతుందని.. రన్‌వే ల్యాండ్ అవుతుంది’ అని వైమానిక దళం పేర్కొంది.

సరిగా అది చెప్పినట్లే ఇప్పుడు తాజాగా సేఫ్‌గా ల్యాండ్‌ అయింది. ఇన్నాళ్లు డమ్మీ వస్తువులను తయారీ చేస్తూ తక్కువ ధరలకు విక్రయించిన చైనా.. ఇప్పుడు అంతరిక్షంలోనూ విజయం సాధించడంతో సంబరంలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై వివరాలు అధికారికంగా వెల్లడించకపోవడంపై అనుమానాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. 

కంగానాకు ‘వై’ కేటగిరీ సెక్యూరిటీ? సడన్ గా ఏమైంది?

నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. టార్గెట్‌ చేస్తూ మాట్లాడడం.. ముక్కుసూటితనంగా వ్యవహరిస్తూ కాంట్రవర్సీ నటిగా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్‌కు కేంద్రం హోం మంత్రిత్వ శాఖ వై ప్లస్‌ కేటగిరి భద్రతను కల్పించినట్లు సమాచారం. ఫస్ట్‌ నుంచి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడమే కాకుండా ఇటీవల సుశాంత్‌ సూసైడ్‌పైనా కామెంట్లు చేసింది. ఇష్టం వచ్చినట్లు ట్వీట్లు చేస్తూ మరోసారి చర్చకు తెరలేపింది.

బాలీవుడ్‌లో నెపోటిజంపై ఆమె చేసిన వ్యాఖ్యలపై అక్కడి సెలబ్రెటీలు చాలామంది అభ్యంతరం తెలిపారు. దీపికా పదుకొణెపై చేసిన ట్వీట్స్ వివాదానికి తెరలేపాయి. బాలీవుడ్ అంతా ఒకవైపు వెళ్తుంటే.. కంగనా మాత్రం మరోవైపు వెళ్తోందనే వాదనా ఉంది. ఇటీవల.. ముంబై నగరంపై కంగనా సంచలన వ్యాఖ్యలు చేసింది.

ముంబై నగరం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌‌ను తలపిస్తోందంటూ సంచలనమైన కామెంట్‌ చేసింది. దీనిపై అధికార శివసేన సీరియస్‌ అయింది. మహారాష్ట్ర, ముంబై, మరాఠాల గురించి మితిమీరి మాట్లాడితే ఖబడ్దార్‌‌ అని, కంగనా చేసిన వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆ పార్టీ ఎంపీ సంజయ్‌ రౌత్‌ డిమాండ్‌ కూడా చేశారు. దీనికితోడు ముంబై పోలీసులపై తనకు నమ్మకం లేదని కూడా చెప్పడంతో ఆయన మరోసారి కౌంటర్‌‌ ఇచ్చారు. ముంబై పోలీసులపై నమ్మకం లేనప్పుడు ఎందుకు ఇక్కడ తిరుగుతున్నావ్‌. ఇక్కడ అడుగు పెట్టవద్దని సూచించారు.

సోనియాకు పోటు: కాంగ్రెస్‌ పై మరో పిడుగు

‘సీడబ్ల్యూసీని పునర్వ్యవస్థీకరించాలి. పీసీసీలకు మరిన్ని అధికారాలను అప్పగించాలి. పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేద్దాం. 6 నెలల్లో ఏఐసీసీ సమావేశాన్ని ఏర్పాటు చేయండి. పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోండి. 2014, 2019 సాధారణ ఎన్నికల్లో పార్టీ ఓటమికి చాలా కారణాలున్నాయి. 2019 ఎన్నికలు జరిగి 14 నెలలు పూర్తయినా.. ఇప్పటికీ ఆ ఓటమిపై నిష్పక్షపాత సమీక్ష జరగలేదు. ఎన్‌ఎస్‌యూఐ, యూత్‌ కాంగ్రెస్‌ల్లో ఎన్నికలు నిర్వహించాలి. ప్రజాస్వామ్య, లౌకిక శక్తులతో కూడిన దేశవ్యాప్త కూటమిని రూపొందించేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నించాలి. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న నేతలందరినీ కూడా ఈ వేదికలో భాగస్వామ్యులను చేయాలి’  అంటూ ఇటీవల కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్‌‌ నేతలు కాంగ్రెస్‌ చీఫ్ సోనియా గాంధీకి లేఖ రాశారు. కాంగ్రెస్‌లో సంచలనం సృష్టించిన ఈ లేఖలో పలువురు కేంద్ర మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఇతర సీనియర్‌ నేతలు సంతకాలు చేశారు. దీనిపైనే సోనియా, రాహుల్‌ ఫైర్‌‌ అయినట్లు వార్తలు రాగా.. ఇప్పుడు మరోసారి బహిష్కృత నేతలు మరో లేఖ రాసి కాక పుట్టించారు. ‘కుటుంబ అనుబంధాలను దాటి ఆలోచించండి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

‘నెహ్రూ, ఇందిర, రాజీవ్ కాంగ్రెస్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ నిర్మితమైంది. దేశంలో ప్రజాస్వామ్య పునాదులు కూడా వేశారు. కొంత కాలంగా పార్టీని నడుపుతున్న విధానాన్ని చూస్తుంటే సాధారణ కార్యకర్తల్లో తీవ్ర గందరగోళాన్ని, నిరాశను కలిగిస్తోంది.’ అంటూ బహిష్కృత నేతలైన సంతోశ్ సింగ్, సత్యేదేవ్ త్రిపాఠి లేఖలో పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలు, సామాజిక విలువలు తగ్గిపోతున్న ఇలాంటి సమయంలో దేశానికి కాంగ్రెస్ అవసరం ఎంతో ఉందని, కాంగ్రెస్ సజీవంగా, ధృఢంగా ఉండాలని వారు ఆ లేఖలో పేర్కొన్నారు.

బహిరంగ వేదికలలో పార్టీని తప్పుపట్టడం, పార్టీపై విమర్శలు చేయడం, పార్టీ ఇమేజ్‌ను దెబ్బ తీయడం లాంటి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ యూపీకి చెందిన పది మంది నేతలను అధిష్ఠానం బహిష్కరించింది. ఆ పది మందిలో సంతోశ్ సింగ్, సత్యేదేవ్ త్రిపాఠి నేతలు కూడా ఉన్నారు. వీరే తాజాగా ‘దయచేసి కుటుంబ అనుబంధాలకు అతీతంగా ఆలోచించండి. పార్టీ సంప్రదాయాలు, ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ విలువలను పునరుద్ధరించండి. పరస్పర విశ్వాసాలను పార్టీలో పెంచండి’ అంటూ పేర్కొన్నారు.

ఇప్పటికే మొదటి లేఖతో గుస్సా మీదున్న కాంగ్రెస్‌ అధిష్టానం.. మరి ఈ లేఖతో మున్ముందు పరిణామాలు ఎలా ఉంటాయో తెలియకుండా ఉంది. బహిష్కృత నేతలే కదా అని లైట్‌ తీసుకుంటారా..? ఈ లేఖతో అయినా తేరుకుంటారా..? ఇప్పటికైనా పార్టీని బలోపేతం చేయడం మీద దృష్టి సారిస్తారా..? ఇవన్నీ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తున్నాయి.

దుబ్బాక టీఆర్‌‌ఎస్‌ అభ్యర్థి అతడేనా?

‘నాక్కెంచెం తిక్కుంది.. దానికో లేక్కుంది..’ అని అంటాడు గబ్బర్‌‌సింగ్‌ సినిమాలో పవన్‌ కల్యాణ్‌. ‘ఏ పనిచేసినా దానికో లెక్కుంది..’ అని అంటున్నారు సీఎం కేసీఆర్. రాజకీయంలో ఆయనకు ఆయనే సాటి. ప్రతిపక్షాల నోళ్లకు ఎలా లాక్ వేయాలో తెలిసిన ఘనాపాటి. ఏ పనిని ఎలా అమలు చేయాలో బాగా తెలుసు. తాజాగా దుబ్బాక ఉప ఎన్నిక టీఆర్‌‌ఎస్‌ అభ్యర్థిని అసెంబ్లీ సాక్షిగా ప్రకటిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఒకవేళా అదే జరిగితే ఇది సంథింగ్‌ స్పెషల్‌ అనే చెప్పాలి.

అక్టోబర్‌‌లో బీహార్‌‌ రాష్ట్రంతో జరిగే ఎలక్షన్స్‌తోపాటు దుబ్బాక అసెంబ్లీకి కూడా ఉప ఎన్నిక జరుగుతుందనే ప్రచారం నడుస్తోంది. ఇక్కడి నుంచి ప్రతిపక్షాల క్యాండిడెట్లు ఇప్పటికే ప్రచారంలోకి దిగగా.. ఇంకా అధికార పార్టీ అనౌన్స్‌ చేయలేదు. ఇక్కడ నుంచి పోటీ చేయడానికి చాలా మంది ఉబలాటపడుతున్నా.. టికెట్‌ రేసులో మాత్రం ఇద్దరే ఉన్నట్లు కనిపిస్తోంది. వారిలో ఒకరు రామలింగరెడ్డి కుటుబసభ్యుడు అయితే.. మరొకరు మాజీ మంత్రి ముత్యంరెడ్డి కొడుకు. ఇప్పటివరకు తెలుస్తున్న సమాచారం మేరకైతే అభ్యర్థిగా రామలింగారెడ్డి సతీమణి సుజాత లేదా కొడుకు సతీష్‌రెడ్డిలలో ఎవరో ఒకరు కన్‌ఫాం అయ్యేలా కనిపిస్తోంది.

అయితే.. ఫ్యూచర్‌‌ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని భార్య సుజాతకు కాకుండా కొడుకు సతీష్‌రెడ్డికి ప్రకటించాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. అభ్యర్థి ప్రకటనను సీఎం కేసీఆర్ సరికొత్త తీరులో ప్రకటిస్తారని చెబుతున్నారు. ఈ రోజు షురూ అయ్యే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సోలిపేట సంతాప తీర్మానం సందర్భంగా చేసే ప్రసంగంలోనే అభ్యర్థి ఎవరన్న విషయాన్ని తెలియజేసేలా కేసీఆర్ ప్రసంగం ఉన్నట్లు తెలుస్తోంది. తన మాటతో దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరన్న విషయంపై క్లారిటీ ఇచ్చేస్తారని సమాచారం.

టీవీ9ను టార్గెట్ చేసిన జనసేన.. ఏమైంది?

Janasena

సోషల్ మీడియాలో పులులు.. బయట మాత్రం పిల్లులు అన్న ముద్రను పవన్ ఫ్యాన్స్ తెచ్చుకున్నారు. ట్విట్టర్  తోపాటు సోషల్ మీడియాలో పవన్ పై ఈగ వాలనీయని పవన్ ఫ్యాన్స్.. ఎన్నికల్లో మాత్రం ఆయనను గెలిపించుకోలేకపోయారు. పవన్ దారుణ ఓటమిని ఎన్నికల్లో చవిచూశారు. అయితే సామాజిక మాధ్యమాల్లో మాత్రం పవన్ ఫ్యాన్స్ ను కొట్టే మొగాడు ఇంకా పుట్టలేదు. లక్షల ట్వీట్లతో ట్రెండింగ్ చేయడంలో పవన్ ఫ్యాన్స్ తర్వాతే ఎవరైనా.. అంతటి భీకర ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ సొంతం.

తాజాగా జనసేన పార్టీ తరుఫున ఒక ప్రకటన విడుదలైంది. టీవీ9 కథనాల వల్ల జనసేన కార్యకర్తలు బాధపడుతున్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.  వారందరూ సంయమనం పాటించాలని కోరారు. ఇక ఎప్పుడైతే ఆ లేఖ విడుదల అయ్యిందో ఇక పవన్ ఫ్యాన్స్ ఆ చానెల్ మీద ట్విట్టర్ వేదికగా విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు #Shamelesstv9ను జనసేన ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు.

అసలు విషయానికి వస్తే.. హీరోయిన్ మాధవీలత ఇటీవల పవన్ కళ్యాణ్ కు రాసిన ఒక బహిరంగ లేఖ సంచలనం సృష్టించింది. పవన్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో తనను విష్ చేసిన అందరినీ పేరుపేరునా థ్యాంక్స్ చెబుతున్నారు. అయితే అలా చెప్పడం తనకు నచ్చలేదని చెబుతూ హీరోయిన్ మాధవీలత తన సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ పెట్టింది.

అయితే ఈ చిన్న విషయాన్ని వదిలేయకుండా షరామామూలుగానే టీవీ9 రచ్చ రంభోలా చేసింది. ఈ విషయాన్ని అందరూ లైట్ తీసుకున్నా ప్రముఖ చానల్ టీవీ9 సీరియస్ గా తీసుకొని వరుస కథనాలు ప్రసారం చేసింది. ఈ విషయం మీద పవన్ ఏమీ స్పందించ లేదు.  తెలుగులోనే టాప్ న్యూస్ చానెల్ టీవీ9 ఇలా చేయడంపై జనసేన నేతలు, ఫ్యాన్స్ మాత్రం భగ్గుమన్నారు.. టీవీ9ను టార్గెట్ చేశారు.. ట్విట్టర్ లో ఇప్పుడు #Shamelesstv9ను జనసేన ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. స్వయంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శివశంకర్ సైతం ఈ ట్రెండింగ్ ను మొదలుపెట్టడం చర్చనీయాంశమైంది. ఇంతకీ టీవీ9పై జనసేన ఫ్యాన్స్ కు ఎందుకు కోపం వచ్చిందనేది ఆసక్తిగా మారింది.

Janasena letter to tv9
Janasena letter to tv9

ఫేం లేని వారు బిగ్ బాస్ లోకి.. కళతప్పిందా?

bigboss 4 participants
బిగ్‌బాస్‌ ఇప్పటివరకు మూడు సీజన్లు పూర్తి‌ చేసుకుంది. ఇప్పుడు నాలుగో సీజన్‌ ప్రారంభమైంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు షో మొదలైంది. నాగార్జున ఎప్పటిలానే అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. ఆయన సినిమాల్లోని పాటలకు స్టెప్పులేశారు. అయితే, ఈ షోలో హోస్ట్ నాగార్జున డ్యుయల్ రోల్‌తో దర్శనమివ్వడం విశేషం. ముందు హోస్ట్ నాగార్జున అడుగుపెట్టగా.. ఆయన తండ్రి పాత్రలో అతిథిగా ముసలి నాగార్జున వచ్చారు. ఆయన బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లి కలియతిరిగారు. తన స్టైల్లోనే పంచ్‌లు, చమత్కారాలతో అలరించారు.ఈ సీజన్‌లో 16 మంది కంటెస్టెంట్స్‌ ఎంటర్‌‌ అయ్యారు. ముందుగా వీరందరినీ క్వారంటైన్‌లో ఉంచి ఆ తరువాత కొవిడ్ టెస్టులు చేసి హౌజ్‌లోకి పంపినట్టు నాగార్జున చెప్పారు. తాను కూడా కరోనా వైరస్ పరీక్ష చేయించుకున్నానని, నెగిటివ్ అని తేలిన తరవాతే బిగ్ బాస్ వేదికపైకి వచ్చానని నాగార్జున స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే, యూట్యూబ్ ద్వారా పాపులర్ అయిన గంగవ్వ ఈ షోలో 16వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు. ఆమె చాలా ప్రత్యేకమని, ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని, అలా చేయకపోతే పనిష్‌మెంట్లు ఉంటాయని మిగిలిన కంటెస్టెంట్లకు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇదిలా ఉండగా.. ఫస్ట్‌ మూడు సీజన్లపై కొంత ఉత్సాహంగానే కనిపించిన నెటిజన్లు ఈ సీజన్‌పై కొంత పెదవి విరుస్తున్నారు. పెద్దగా ఫేం ఉన్న కంటెస్టెంట్స్‌ ఎవరూ లేకపోవడంతో నిరుత్సాహంగా ఉన్నారు. గత మూడు సీజన్లలో.. ఈ సీజన్లలో ఒకసారి కంటెస్టెంట్లను పరిశీలిస్తే..

ఫస్ట్‌ సీజన్‌: కంటెస్టెంట్లుగా సినీ నటులు అర్చన, సమీర్‌‌ హసన్‌, ముమైత్‌ ఖాన్‌, ప్రిన్స్‌, జ్యోతి, శివబాలాజీ, సంపూర్ణేశ్‌ బాబు, ఆదర్శ్‌, హరి తేజతో పాటు హాస్యనటుడు ధన్‌రాజ్‌, గాయకులు మధు ప్రియ, కల్పన, టీవీ యాంకర్‌‌ కత్తి కార్తీక, సినీ విమర్శకుడు మహేశ్ కత్తి వచ్చారు.  దీక్ష పంత్‌, మరో నటుడు నవదీప్‌ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్‌ సీజన్‌కు హోస్ట్‌గా యంగ్‌ టైగర్‌‌ జూనియర్‌‌ ఎన్టీఆర్‌‌ వచ్చారు.

సెకండ్‌ సీజన్‌: సింగర్‌‌ గీతా మాధురి, నటులు అమిత్‌ తివారి, తనీష్‌ అల్లాడి, భను శ్రీ, కిరీటి దామరాజు, కౌషల్‌, తేజస్వి మాడివాడ, సామ్రాట్‌, టీవీ9 యాంకర్‌‌ దీప్తి నల్లమోతు, హ్యూమన్‌ రైట్స్‌ యాక్టివిస్ట్‌ బాబు గోగినేని, ర్యాపర్‌‌ రోల్‌ రైడా, యాంకర్‌‌ శ్యామల, సోషల్‌ మీడియా స్టార్‌‌ దీప్తి సునైనా, రేడియో జాకీ గణేశ్‌, మోడల్‌ సంజనా అన్నె, సోషల్‌ యాక్టివిస్ట్‌ నూతన్‌ నాయుడు కంటెస్టులుగా వచ్చారు. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా మోడల్‌ నందిని రాయ్‌, మోడల్‌ పూజా రామచంద్రన్‌ ఎంటర్‌‌ అయ్యారు. ఈ సెకండ్‌ సీజన్‌కు హోస్ట్‌గా నటుడు నాని వ్యవహరించారు.

సీజన్‌ త్రీ: గాయకుడు రాహుల్‌ సింప్లిగంజ్‌, నటి/యాంకర్‌‌ శ్రీముఖి, కొరియోగ్రాఫర్‌‌ బాబా భాస్కర్‌‌, సినీ నటులు వరుణ్‌ సందేశ్‌, మహేశ్‌ విట్టా, పునర్నవి భూపాలం, వితికా షేరు, హిమజ, హేమ, అలీరెజా, అషు రెడ్డి, సీరియల్స్‌ నటులు రవికృష్ణ, రోహిణి, యాంకర్స్‌ శివజ్యోతి, శిల్పా చక్రవర్తి, టీవీ9 జర్నలిస్ట్‌ జాఫర్‌‌ బాబు, మోడల్‌ తమన్నా సింహాద్రి కంటెస్టెంట్స్‌. ఈ సీజన్‌కు ప్రముఖ సినీ నటుడు, నవ మన్మథుడు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించారు.

ఎట్‌ నౌ ప్రెజెంట్‌ ఫోర్త్‌ సీజన్‌ : నటులు మోనాల్‌ గజ్జర్‌‌, కరాటే కల్యాణి, నోయల్‌, అభిజిత్‌, అఖిల్‌ సార్థక్‌, దర్శకుడు సూర్య కిరణ్‌, యాంకర్స్‌‌ లాస్య, జోర్దార్‌‌ సుజాత, అరియానా గ్లోరీ, సోషల్‌ మీడియా సెన్సేషన్‌ మెహబూబ్‌ దిల్‌సే, న్యూస్‌ ప్రెజెంటర్‌‌ దేవి నాగవల్లి, యూట్యూబ్‌ స్టార్స్‌ దేత్తడి హారిక, గంగవ్వ, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌‌ సయ్యద్ సోహైల్‌, కొరియోగ్రాఫర్‌‌ అమ్మ రాజశేఖర్‌‌, వెబ్‌ సిరీస్‌ నటి దివి కంటెస్టెంట్లుగా ఉన్నారు. ఈ సీజన్‌కు హోస్ట్‌గా మన్మథుడు నాగర్జుననే వ్యవహరిస్తున్నారు.

ఫస్ట్‌ మూడు సీజన్లలోనూ ఇంతోఅంతో చెప్పుకోదగ్గ కంటెస్టెంట్లు ఉన్నారు. ఈ సీజన్‌ వరకు వచ్చేసరికి.. యూట్యూబ్‌ స్టార్స్‌ గంగవ్వ, దేత్తడి హారిక తెలుసు. వీరితోపాటు కరాటే కల్యాణి, అమ్మరాజశేఖర్‌‌, సూర్య కిరణ్‌ నాటి తరం వాళ్లే. వీళ్లు ఔట్‌ డేటెడ్‌ అనే చెప్పాలి. ఈ తరం వారికి పెద్దగా తెలియదు. యాంకర్స్‌ లాస్య, నటుడు నోయల్‌ కొద్దోగొప్పో తెలుసు. ఇంతకుమించి పెద్దగా తెలిసిన ఫేం అయిన వారు ఎవరూ లేరు.

వి’ ప్లాపును దిల్ రాజు ముందే ఊహించరా?

నిర్మాత దిల్ రాజు ‘వి’ మూవీని సేఫ్ గా డీల్ చేయడంపై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. సినిమాలపై దిల్ రాజు తీసుకునే జడ్జిమెంట్ కరెక్టేనని ‘వి’తో మరోసారి రుజువు చేశాడు. నాని-సుధీర్ బాబులతో భారీ బడ్జెట్లో ‘వి’ సినిమాను దిల్ రాజు నిర్మించాడు. థియేటర్లలో రిలీజు కావాల్సిన ఈ సినిమాను దిల్ రాజు ఓటీటీలో రిలీజు చేయడంపై పలువురు పెదవి విరిచారు. అయితే ఆయన తీసుకున్న డెసిషన్ కరెక్టేనని ఆ తర్వాత తేలిపోయింది.

‘వి’ మూవీని దిల్ రాజు ఓటీటీలో విడుదల చేస్తున్నారనే ప్రకటనే రాగానే టాలీవుడ్లోని ప్రముఖులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భారీ బడ్జెట్లో తెరకెక్కిన ఈ మూవీని ఓటీటీలో దిల్ రాజు రిలీజు చేయడం ఏంటనే ప్రశ్నలు తలెత్తాయి. సినిమాపై ఆయనకు ఉన్న జడ్జిమెంట్ ఆయనను నేడు నష్టపోకుండా కాపాడిందనే టాక్ విన్పిస్తుంది. ‘వి’ విషయంలో దిల్ రాజు ఆచితుచి వ్యవహరించారు. అమెజాన్ ప్రైమ్లో మంచి ధరకు రాగానే ‘వి’ ఓటీటీలో రిలీజ్ చేశాడు.

‘వి’ మూవీని తొలి నుంచి థియేటర్లలో రిలీజు చేసేందుకే చిత్రయూనిట్ మొగ్గుచూపింది. ‘వి’కి నిర్మాత అయిన దిల్ రాజుకు డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగంలోని వారితో మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమా థియేటర్లలోనే రిలీజ్ అవుతుందని అందరూ భావించారు. థియేటర్లు ఓపెన్ కాగానే తొలి సినిమాగా ఈ సినిమా వస్తుందనే ప్రచారం జరిగింది. అయితే అనుహ్యంగా దిల్ రాజు ఓటీటీ వైపు మొగ్గుచూపడం ఆయన తెలివితేటలకు నిదర్శంగా కన్పిస్తున్నాయి.

‘వి’ సినిమా థియేటర్లలో విడుదలైతే ఖచ్చితంగా ప్లాప్ టాక్ తెచ్చుకునేది. దీనిని ముందుగానే గుర్తించిన దిల్ రాజు అమెజాన్ ప్రైమ్ నుంచి తనకు నష్టంలేని డీల్ వచ్చిన వెంటనే ఓటీటీ వైపే మొగ్గుచూపారు. హీరోలు, దర్శకులతో మాట్లాడి సినిమాను ఓటీటీ రిలీజ్ చేసేందుకు ఒప్పించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో సినిమా ప్లాప్ టాక్ వస్తే నష్టాలు భారీగా వచ్చే ప్రమాదం ఉంది. దీనిని ముందుగానే ఊహించిన దిల్ రాజు సేఫ్ గా ఓటీటీలో రిలీజ్ చేశాడు. ‘వి’ మూవీని ఎలాంటి నష్టం లేకుండా దిల్ రాజు తెలివిగా వదిలించుకున్నాడనే టాక్ విన్పిస్తోంది. 

కొత్తదనం లేని ‘బిగ్ బాస్’ షో.. తొలిరోజే మిక్స్ డ్ టాక్..!

Nagarjuna

బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘బిగ్ బాస్’ రియల్టీ షో ఆదివారం ప్రారంభమైంది. బిగ్ బాస్ మూడో సీజన్ కు హోస్టుగా చేసిన కింగ్ నాగార్జునే ‘బిగ్ బాస్-4’కు కూడా చేస్తున్నాడు. ఈ నాలుగో సీజన్ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకోగా తొలి షో చూసిన వారికి కొంత నిరాశ ఎదురైనట్లు కన్పిస్తోంది. బిగ్ బాస్ నిర్వహకులు పాతఫార్మూలానే కొత్తగా చూపించే యత్నం చేస్తున్నారని.. కొత్తదనం లేకుండాపోయిందనే టాక్ ప్రేక్షకుల నుంచి విన్పిస్తోంది.

కొద్దిరోజులుగా బిగ్ కంటెస్టులు, హోస్టు గురించి వస్తున్న వార్తలే నిజమమయ్యాయి. ఒకరిద్దరు మినహా అందరూ కంటెస్టుల గురించి ప్రేక్షకులకు తెల్సిపోవడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి లేకుండా పోయింది. కిందటి సీజన్లో ఏవిధంగానైతే వివిధ రంగాలకు చెందిన వారికి కంటెస్టులుగా పరిచయం చేశారో అదేతరహాలోనే చూపించారు. నాగర్జున హోస్టింగ్ సైతం పాత తరహాలోనే ఉండటంతో ‘బిగ్ బాస్-4’పై ప్రేక్షకుల్లో మిక్స్ డ్ టాక్ వ్యక్తమైంది.

‘బిగ్ బాస్-4’లో కంటెస్టులందరు కూడా సేమ్ టూ సేమ్ ‘బిగ్ బాస్-3’ని పోలిన వారిని తీసుకొచ్చారు. గత సీజన్లో తెలంగాణ యాసలో తీన్మార్ యాంకర్ శివజ్యోతి రాగా ప్రస్తుతం ఆ కేటగిరి నుంచి జోర్దార్ సుజాత వచ్చింది. గతంలో టీవీ 9 నుంచి జాఫర్, దీప్తి సునైనా రాగా ప్రస్తుతం దీప్తి నాగవెల్లి ఎంట్రీ ఇచ్చింది. సోషల్ మీడియా నుంచి గతంలో మహేష్ విట్టా, ఆశురెడ్డిలు రాగా ప్రస్తుతం దేత్తడి హరీక వచ్చింది. గతంలో డ్యాన్స్ మాస్టర్ గా బాబా భాస్కర్ రాగా ఈసారి అమ్మ రాజశేఖర్ వచ్చారు. దాదాపు ఈ సీజన్లోని కంటెస్టులంతా బిగ్ బాస్-3ని తలపించేలా కన్పించారు.

హీరోయిన్ మోనాల్ గజ్జర్ ‘బిగ్ బాస్-4’లో తొలి కంటెస్టుగా ఎంట్రీ ఇచ్చి షోపై అంచనాలు పెంచింది. ఇక వరుసగా దర్శకుడు సూర్యకిరణ్, యాంకర్ లాస్య, నటుడు అభిజిత్, జోర్దార్ సుజాత, మెహబూబ్, దేవి, దేత్తడి హారిక, ఇస్మార్ట్ సోహెల్, అరియానా గ్లోరీ, అమ్మ రాజశేఖర్, కరాటే కళ్యాణి, సింగర్ నోయల్, మోడల్ దివి, అఖిల్ సర్తక్, గంగవ్వలు ఎంట్రీ ఇచ్చారు.

 
వయస్సు రీత్య పెద్దదైన గంగవ్వ ఈ షోకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అయితే బిగ్ బాస్ విధించే టాస్కుల్లో ఆమె ఏమేరకు ఆకట్టుకుంటుందనే సందేహాలు కలుగుతున్నాయి. బిగ్ బాస్-4 షో తొలిరోజే మిక్స్ డ్ టాక్ తో తెచ్చుకున్నప్పటికీ రానున్న రోజుల్లో ఆకట్టుకోవడం ఖాయమనే టాక్ విన్పిస్తుంది. దీంతో బిగ్ బాస్ రానున్న రోజుల్లో ప్రేక్షకులను ఎలా అలరిస్తాడో వేచిచూడాల్సిందే..!

కేసీఆర్ సంచలనం.. వీఆర్వో వ్యవస్థ రద్దు

Vro cancelledఅనుకున్నట్టే అయ్యింది. తెలంగాణలో అవినీతితో పంకిలమైన రెవెన్యూ వ్యవస్థపై తెలంగాణ సర్కార్ కొరఢా ఝలింపించింది. మొన్న కీసర తహసీల్దార్  ఏకంగా 1.10 కోట్లు లంచం తీసుకొని దొరకడంతో కేసీఆర్ సర్కార్ దీనిపై సీరియస్ గా దృష్టిసారించింది.

తాజాగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో వీఆర్వోల వ్యవస్థను రద్దు చేసింది. రికార్డులన్నీ స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్ లకు ఇప్పటికే సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్నం 3 గంటలకల్లా రికార్డులు స్వాధీనం చేసుకోవాలన్నారు. మధ్యాహ్నం 12 గంటలలోగా రికార్డులను కలెక్టరేట్ లో అప్పగించాలని వీఆర్వోలకు స్పష్టం చేశారు. కలెక్టర్ల నుంచి సాయంత్రంలోగా సమగ్ర నివేదిక రావాలని ఆదేశించారు.

ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే కొత్త రెవెన్యూ చట్టం దిశగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ముసాయిదా బిల్లును ఇవాళ్లి నుంచే జరిగే సమావేశాల్లో పెడుతారని అంటున్నారు.

ప్రస్తుతం తెలంగాణలో రెవెన్యూశాఖలో భారీగా అవినీతి పెరిగిపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. ఏసీబీ దాడుల్లో వీఆర్వోలే పెద్ద ఎత్తున లక్షల్లో డబ్బు తీసుకుంటూ దొరికిపోతున్నారు. ఈ క్రమంలోనే అవినీతితో పంకిలమైన వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా 7172 మంది వీఆర్వోలున్నారు. అందులో 5వేల మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. మిగతా పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు వీరిని ఏ శాఖలో విలీనం చేస్తారు? ఎక్కడ సర్దుబాటు చేస్తారన్నది ఆసక్తిగా మారింది. ఇక నుంచి పంచాయితీ కార్యదర్శులకే ఈ బాధ్యతలు అప్పగిస్తారని.. సర్వం ఆన్ లైన్ చేస్తారని తెలుస్తోంది.

భారత్‌ సైన్యాన్ని చూసి తోకముడిచిన చైనా..

china india war
‘చైనా ఒక అడుగు ముందుకేస్తే మేము పదడుగులు ముందుకేస్తాం.. అంతే తప్ప ఒక్క అడుగు జాగను కూడా వదులుకోం’ అంటూ ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. చైనా కూడా ఒక అడుగు ముందుకేసి.. రెండడుగులు వెనక్కి వేస్తున్నట్లు కపట బుద్ధి ప్రదర్శిస్తోంది. ఎప్పటికప్పుడు ఎల్‌ఏసీ వద్ద వివాదాలను చర్చలతో పరిష్కరించుకుందామంటూనే.. వాటిని సాగదీస్తూ.. మరిన్ని ప్రాంతాలను ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. చైనా ఆగడాలను పసిగడుతున్న భారత్‌ తనకు దీటైన జవాబు ఇస్తూనే ఉంది. తాజాగా చైనాకు తగిలిన మరో గాయం బయటపడింది.

ఆగస్టు 29 అర్ధరాత్రి పాంగాంగ్‌ ఉత్తర తీరంలోని ఫింగర్‌‌ 2 వరకూ ఆక్రమిద్దామని చైనా పన్నాగం పన్నింది. కరోనాతో పోరాడుతున్న భారత్‌ తమను ఎలా పసిగడుతుంది..? అటు వైపు ఆలోచన కూడా చేయదు.. అని అనుకుంది. ఎప్పుడూ క్రిమినల్‌ మైండ్‌ గేమ్‌ ఆడే డ్రాగన్‌ దేశాన్ని భారత్‌ కూడా సరైన రీతిలో ఉచ్చులో పడేసింది. చైనా చేరుకోవడానికి ముందే భారత్‌ అక్కడ యుద్ధ ట్యాంకులు, రాకెట్‌ లాంఛర్లను సిద్ధంగా పెట్టింది. వీటిని చూసిన చైనాకు దిమ్మదిరిగినట్లైంది. కీలక శిఖరాలపై మన సైతం ముందుగానే పాగా వేయడాన్ని జీర్ణించుకోలేకపోయింది. భారత సైతం రెండే రెండు గంటల్లో కీలకమైన బ్లాక్‌టాప్‌, హెల్మెట్‌, మగర్‌‌, గురుంగ్‌ శిఖరాలను తమ అధీనంలోకి తీసుకున్నారంటే.. మన దేశ సైన్యం సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు చైనా తన భూభాగమంటూ చెప్పుకుంటున్న రెజాంగ్‌ లా ప్రాంతంలోనూ ఇండియా ఫోర్స్‌ మోహరించింది.

ఆగస్టు 29, 31 తేదీల్లో చైనా ఏకపక్షంగా నియంత్రణ రేఖ హద్దులను మార్చాలని వ్యూహం పన్నింది. దీంతో అధికారులు స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌ (ఎస్‌ఎఫ్‌ఎఫ్‌)ను రంగంలోకి దింపారు. వీలైనంత తొందరలో ఆపరేషన్‌ను ముగించాలనే ఉద్దేశంతో ఎస్‌ఎఫ్‌ఎఫ్‌ 120 నిమిషాల టార్గెట్‌ పెట్టుకుంది. ఆ రెండు గంటల్లోనే బ్లాక్‌టాప్‌, హెల్మెట్‌, మగర్‌, గురుంగ్‌ శిఖరాలను స్వాధీనం చేసుకుంది. అక్కడ చైనా ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలను ధ్వంసం చేసింది. ఆ వెంటనే 2 వేలకు పైగా భారత బలగాలు యుద్ధ ట్యాంకులు, విమాన విధ్వంస క్షిపణులు, రాకెట్‌ లాంఛర్లతో ఆయా శిఖరాలపై పాగా వేశాయి. దీంతో డ్రాగన్‌ సైన్యం వ్యూహం దెబ్బతింది. మన సైన్యం గాల్లోకి కాల్పులు జరపడంతో తోక ముడిచింది. ఆ వెంటనే భారత సైన్యం రెజాంగ్‌-లా పాస్‌ను కూడా కైవసం చేసుకుంది. ఇంత జరిగినా మళ్లీ రెండు రోజులకే మరో కుట్రకు తెరతీసింది.

Also Read : ట్రంప్‌ సంస్కరణలు ఇండో అమెరికన్ల ఓట్లు రాల్చేనా

ఆగస్టు 31న కూడా డ్రాగన్‌ రాగా.. మన యుద్ధ ట్యాంకుల శ్రేణిని చూసి, వెనక్కి తగ్గింది. ఎన్నడూ లేని విధంగా చైనా నోట రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, యోగా, దంగల్‌ సినిమా పేర్లు వినబడ్డాయి. చైనా రక్షణ మంత్రి స్వయంగా తాను భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌తో చర్చలకు సిద్ధం అని పదేపదే చెప్పే పరిస్థితులు వచ్చాయి. మొదటి సారి చైనా నోట ‘ఇతర దేశాలకు చెందిన ఒక అంగుళం భూమిని కూడా మేము ఆశించడం లేదు’ అని ప్రకటించాల్సి వచ్చింది. కాగా, చుషుల్‌లో ఇరు దేశాలకు చెందిన కమాండర్లు ఆదివారం జరిపిన చర్చలు.. ఎలాంటి ఫలితం లేకుండా ముగిశాయి.

1962లో జరిగిన యుద్ధానికి ముందు నుంచీ ఎల్‌ఏసీ వద్ద భారత్‌ డిఫెన్స్‌ ధోరణిని అవలంబిస్తూనే ఉంది. కానీ.. చైనా మాత్రం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇప్పటికే వందల చదరపు కిలోమీటర్లను ఆక్రమించింది. ఇన్నాళ్లు ఓపికతో ఉన్న భారత్‌ ఇప్పుడు సత్తాచాటాల్సి వస్తోంది. చైనా కుట్రలను తిప్పికొడుతోంది. 2017 డోక్లాం ఉదంతం నుంచి తన వైఖరి మార్చుకుంది. చైనాకు బుద్ధి చెప్పకుంటే తమ భూభాగాన్ని పూర్తిగా కోల్పోవాల్సి వస్తుందని ఇప్పుడు దీటుగా నడుచుకుంటోంది. పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది.

Also Read : చైనా భయపడిందా..చర్చలకు దిగొస్తోందా.. కారణమదే?